సకలనీతికథానిధానము/తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
| శ్రీనిత్య కుంటముక్కుల | 1 |
వ. | అవధరింపుము నారదుండు బలీంద్రున కిట్లనియె నివ్విధంబున కేయూరబాహుండును మృగాంకవతిని వివాహంబై రాజ్యంబు సేయుచుండ భాగురాయణుం డొక్కనాఁడు కథాప్రసంగవశంబున నిట్లనియె. | 2 |
క. | ములు ముంటఁ బుచ్చుగతిఁ దా | 3 |
వ. | అది యెట్లనిన. | 4 |
సీ. | శార్దూల మొకటి మాంసము భుక్తిగొనుచోట | |
ఆ. | పులియు నొప్పి బాసి పులుఁగుతోఁ జెలికార | 5 |
వ. | తినక, నిన్ను వెళ్ళవిడుచుట ప్రత్యుపకారంబుగా దలంచుకొను మనిన నట్లకాక యని, యప్పులిఁ గాచుకొనియుండ నొక్కనాఁడు. | 6 |
క. | పలలము దిని మత్తా[1]గొని | 7 |
క. | పులి జూచి పలికె నాకుం | 8 |
వ. | అని యపహసించి యథేచ్చ నరిగెనని నారదుండు బలీంద్రుని నింక నొక్కకథ వినుమని యిట్లనియె. | 9 |
క. | శరలిఖతంబులు చదువను | 10 |
వ. | అవి యెట్లనిన. | 11 |
సీ. | అసమాస్త్రపురి మనోహారిణి యనులేమ | |
తే. | దెత్తునని పోవ యొంటి నత్తెరవ యుండ | 12 |
వ. | తమలో నిట్లనిరి. | 13 |
చ. | ధనికుఁడొ చెప్పఁజూపగ వదాన్యుఁడొ శూరుఁడొ! రూపవంతుఁడో! | 14 |
వ. | అనిన మఱియొక్కరుం డిట్టులనియె. | 15 |
ఉ. | అంగన జాతిహీను వికలాంగుఁ గురూపుని నైన నెప్పుడున్ | 16 |
క. | అనుమాటలు విని యంగన | 17 |
వ. | ఇంక శూద్రకుని చరిత్రంబు వినుమని యిట్లనియె. | 18 |
ఉ. | అంగజమూర్తి శూద్రకధరాధిపుఁ జూడగఁగోరి యొక్కమా | 19 |
క. | చదువంగ నేర్చుఁ గావ్యము | 20 |
క. | అని విన్నవించి శూద్రక | 21 |
వ. | అక్కీరం బాశీర్వాదంబు జేసి యిట్లనియె. | 22 |
సీ. | వింధ్యాద్రి దక్షిణోర్వీతలంబు(నఁ బంప | |
| యందు మాతలిదండ్రు లభివసింపగ నొక్క | |
తే. | నుపచరించుచు జాబాలియొద్ద నిడిన | 23 |
క. | తారాపీడుండను ధా | 24 |
| అంత: | |
ఆ. | (మంత్రివరుఁడు) తనదుమగువకు నతనాభిఁ | 25 |
వ. | ఉండి రంత నయ్యిరువురిభార్యలు పుత్రునిం గాంచిన......... (కొన్ని పత్రములు జారిపోయినవి) | 26 |
క. | ఆపుండరీకుఁ డంతట | 27 |
వ. | ప్రియమిత్రుండైన కపిలుండు దుఃఖింపుచున్న నేనును నతిదుఁఖితనై యున్నసమయంబున. | 28 |
తే. | ఇందుబింబమ్ము వెడలొక సుందరుండు | 29 |
సీ. | అని వినిపించి నాయనుఁగు నెచ్చెలి మది | |
తే. | జనకునకు మ్రొక్కి తగినదీవెనల బొంది | 30 |
క. | భూతావేశంబున శుక | 31 |
వ. | అని బలాహకుండు వినిపించిన దారాపీడుండు కుమారునిఁ జూచి నీ వేమి చేసితివో (యని) కోపించిన నేఁ బోయి తోడ్కొని వచ్చెద నని బలాహకసహితుండై పురంబు వెలువడి యమ్మహా.....యాశ్రమంబున కరిగి యప్పుడు. | 32 |
సీ. | వినమితుండగుచు దీవెన బొంది మత్సఖు | |
తే. | అవనిపతి పుత్రుఁడును కవితాసుఁడైన | 33 |
వ. | వాగె పట్టుకొని శోకావేశంబున మరణంబు బొందెదనని యక్కొలన మునిఁగిన నయ్యశ్వంబు కపింజులుండను ముని యయ్యె నంతట శ్వేతకేతుం డచ్చటికిం జనుదెంచి దుఃఖంపుచున్న కాదంబరీ మహాశ్వేతా పత్రరేఖల నూరార్చె నప్పు డది విని తారాపీడశుకనాసులు నచ్చోటి కేతెంచి రంత. | 34 |
క. | చిలుకై వైశంపాయనుఁ | 35 |
వ. | అని జాబాలి మునీంద్రుండు ఋషులకు వినిపించుట విని యే నచ్చోటు వాసి యొక్కశ్యపచనివాసంబుపై త్రోవగా నరుగుదేర నొకమాతంగకన్యక నన్ను బట్టికొని తోలుఁబంజరంబున నిడియె నంత. | 36 |
క. | రవి యస్తమించె బడమట | 37 |
వ. | ఏనునుఁ బథశ్రమంబున నిద్రించి ప్రభాతరం బగుటయు మేలుకొని కనుగొనునప్పుడు. | 38 |
ఆ. | పంజరంబు మంచిపసిఁడియైయుండిన | 39 |
శా. | మాతంగాంగనఁ బిల్వబంచి తగుసన్మానంబునం బల్కెనో | 40 |
ఆ. | అట్టిశూద్రకుఁడు ప్రాణంబుతో బాసి | 41 |
సీ. | ప్రాణంబు లీగతి బడసి చంద్రాపీడ | |
తే. | యిట్టిభవము మెఱయ మహీశసుతుఁడు | 42 |
వ. | ఇంక నొక్కకథ చెప్పెద వినుమనిన. | |
సీ. | ఇలనిలా వర్షంబు నేలువజ్రుండును | |
| మంత్రివరునకు నిచ్చి యమ్మగువ వజ్ర | 43 |
| (ననిన నమ్మంత్రివరుఁడును నట్ల సేయ) | |
తే. | దాదియనుచరగాఁగ నత్తంత్రికన్య | 44 |
వ. | కుంజరపురంబున నొక్కసార్ధవాహుండు బేరమువోవుచున్న నతనియెద్దు నడవిలో జిక్కిన విడిచిపోయిన నెద్దు లావుకొని ఱంకె వేసిన. | 45 |
ఉత్సాహ: | బండియెద్దు ఱంకె చెవులఁ బడిన నుగ్రకోపియై | 46 |
వ. | ఆసృగాలంబు మృగరాజున కిట్లనియె. | 47 |
క. | బోయలతో నొకభూపతి | 48 |
వ. | ప్రవేశించి మాంసంబు గానక కడమదిక్కును వ్రచ్చి వెడలెఁ గావున రవంబుకుందలంక నేటి కనిన నక్కంఠీరవంబు తాఁబోయి యరిసి వచ్చెదనని చని యానందకునిఁ గాంచి యిట్లనియె. | 49 |
ఉ. | ఎందులనుండి వచ్చితి మృగేశ్వర! యన్నను దేవనైచికే | 50 |
వ. | అది యెఱింగి సంహృతనామజంబుకం బాత్మకులంబు గూర్చుకొని యిట్లనియె. | 51 |
క. | సహవాసదోషముననే | 52 |
వ. | అది యెట్లనిన. | 53 |
సీ. | వేఁట వో యొకభూమివిభుఁడు బోయలపల్లెఁ | |
తే. | జెప్పుటయు భూమిపతికి నచ్చిలుక పలికె | 54 |
వ. | అట్లు గావున. | 55 |
క. | నందకసంగతి మనలను | 56 |
వ. | అట్లు గావున నేఁజెప్పినబుద్ధిక్రమంబున నడచుట లెస్స నడవకయున్న నపాయంబు వుట్టు నది యెట్లనిన. | 57 |
క. | సత్పురుషు లేవి చెప్పినఁ | 58 |
వ. | అది యెట్లనిన. | |
ఆ. | కచ్ఛపంబుతోఁడఁ గలహంస లొకరెండు | 60 |
వ. | మానససరోవరంబున కరిగెదము నీవు వచ్చెదేని యీకాష్ఠంబుఁ గఱచిపట్టుకొని మాటాడకయుండు మనిన నది యట్ల చేసిన. | 61 |
తే. | రెండుహంసలు నక్కఱ్ఱ రెండుగడలు | 62 |
క. | కటకట! యీకమఠము మీ | 63 |
క. | కొక్కెరలు వాసిపోయిన | 64 |
ఆ. | తినఁగ నలవిగాక త్రిమ్మలుఁ గుడువంగ | 65 |
క. | ఇది యవునని కమఠంబును | 66 |
వ. | అక్కచ్ఛపంబుఁ బిలిచి నానితివోటని యడిగినం గొంతకొంత నానుచున్నదాన క్షణమ్ము నిలువుమనిన నదియును నట్ల చేసి కొంతప్రొద్దునను నెప్పటియట్ల పిలిచి యడిగిన. | 67 |
క. | పేరవనాయకఁ దేహము | 68 |
క. | నీపద మించుక నివియుము | 69 |
క. | అది గావున వచనస్థితి | 70 |
తే. | నందకుం డున్నయడకు నానక్క యరిగి | 71 |
క. | క్రూరుల సహవాసంబును | 72 |
వ. | అని నందకుఁ జూచి మఱియు నిట్లనియె. | 73 |
ఆ. | యొక్కరాజుశయ్య నొందిన యంశుక | 74 |
వ. | అనుసమయంబున వారిద్దఱు వాదడువ నమ్మహీపతి శయనించిన నల్లి గుట్టి చనిన వెదకి చీరపేల నెల్లఁ జంపి రట్లు గావున మఱియును నొకథ వినుమని జంబుకంబు నందకున కిట్లనియె. | 75 |
క. | శాంతుఁడని నమ్మి దుర్జను | 76 |
వ. | అది యెట్లనిన. | 77 |
క. | ఒక్కయగాధపుమడువున | 78 |
సీ. | కొక్కెర యీరీతి గోలుగోలున నేడ్వ | |
| నీమడు గింకు మిమ్మిందఱి డించిపో | |
తే. | వత్త మనవుండు మేమెట్లు వత్తు మనిన | 79 |
వ. | అంత. | 80 |
క. | ఒక యెండ్రిక, ననుఁ గొనిపో | 81 |
వ. | అవ్విధంబున నరిగి యబ్బిసకంఠిక వ్రాలు శిలాతటంబున గనుపట్టు మత్స్యశల్యంబులు చూచి యిప్పాపాత్ముం డిందఱి భక్షింపంబోలునని తనడెక్కల కంఠంబిఱికి చంపెం గావున. | 82 |
క. | నందక! నీవక్కేసరి | 83 |
తే. | ఉష్ట్రమొక్కటి వనమున నొంటిచిక్కి | 84 |
సీ. | తీతువపిట్ట లబ్ధిప్రదేశంబున | |
తే. | దొల్లి యున్నట్టిప్లవగ మాభిల్లుఁ దిగిచి | 85 |
తే. | ఒక్కవనమున మనము గూడున్న నీవు | 86 |
క. | అడవికి సమిధల కరుగుచు | 87 |
ఆ. | వెడలఁదీయఁదలఁచి నిడుదవల్లులు వైచి | 88 |
వ. | ఈనూతం జిక్కినస్వర్ణకారుండు పాపిష్ఠి వీని వెడలం దివియకుమని బుద్ధి చెప్పి యొకవేళ మమ్ముం జూడ విచ్చేయుఁడని యధేచ్ఛం జనిన నమ్మహీసురుం డప్పుడు. | 89 |
క. | పాపము మర్త్యుం డకటా | 90 |
సీ. | అంతట నొక్కనాఁ డవనీసురేంద్రుండు | |
తే. | దాచినటువంటి సొమ్ము లద్ధరణిసురున | 91 |
క. | భూపాలపుత్రుఁ జంపిన | 92 |
ఆ. | అంత దొంటియురగ మారాజకూఁతును | 93 |
క. | క్ష్మాకాంతుఁడునా విప్రున | 94 |
క. | విపరీతజాతులైనను | 95 |
వ. | అనిన నవ్వానరం బిట్లనియె. | 96 |
క. | హరిచే మృతిఁ బొందివపులి | 97 |
వ. | అని యవ్వానరంబు కిరాతు నుత్సగంబు తలయంపిగా నిద్రించుసమయంబున నప్పులి యాశబరున కిట్లనియె. | 98 |
సీ. | వృక్షాగ్రమునఁ గలవింకము లొకరెండు | |
| గుడిలోననైనను గుడిసె కట్టుకనైన | |
ఆ. | గూడువెట్టియున్నకుజశాఖ ఖండించి | 99 |
వ. | ఇవ్విధంబున వనచరంబు పడి మగుడం జె ట్టెక్కుసమయంబునఁ బులి దానితోఁక పట్టుకొనిన వనచరం బిట్లనియె. | 100 |
క. | కడుమోస పోయి తక్కట | 101 |
వ. | శార్దూలంబును యధేచ్చ నరిగె, వనచరంబును భయపడు కిరాతు వెఱ వుడిపి ఫలంబులు దెచ్చెదనని యరుగుటయును. | 102 |
ఆ. | భిల్లుఁ డగచరంబు పిల్లల భక్షించి | 103 |
వ. | పులియునుం గృతఘ్నుండని కిరాతుని భక్షింపుట దోషం బని విడిచెనని కథ చెప్పిన టిట్టిభం బిట్లనియె. | 104 |
క. | ధరణి కృతఘ్నుండగున | 105 |
వ. | అట్లు గావున పిల్లలఁ దేకుండితినేని నక్కిరాతుండు బోయినగతిం బోదునని శపధంబు పలికి యప్పుడు. | 106 |
ఆ. | కులము నెల్లఁ గూర్చుకొని గరుడికిఁ జెప్ప | 107 |
వ. | అట్లు గావున. | 108 |
క. | ఏజాతి నుద్భవించిన | 109 |
వ. | మఱియును. | 110 |
క. | కీ డాచరించు మనుజులు | 111 |
వ. | అని శివావాయసంబు లొట్టేనుఁగుతోఁ గపటస్నేహంబు చేసి మృగపక్షికులంబు గూర్చుకొని యుష్ట్రసహితంబుగా సింహంబు ముందటికిం జని యిట్లనిరి. | 112 |
క. | ఆకొన్నాఁడవు మృగవర | 113 |
వ. | అని చెప్పి సంహృతజంబుకంబు నందునియొద్దకు వచ్చిన విశేషంబులు గలవే యని యడిగిన నిట్లనియె. | 114 |
తే. | కుంజరశ్రేష్ఠుఁ డొకలతాకుంజమునను | 115 |
వ. | తమసఖులైన నీలమక్షిక మండూక ద్రుమకుట్టన వాయసంబుల కెఱింగించిన నవ్వాయసం బిట్లనియె. | 116 |
సీ. | మును కృష్ణవల్కలుండను చిల్క సేవించి | |
ఆ. | శక్ర చిత్రగుప్త శమన మృత్యువు లిట్లు | 117 |
వ. | అనిన మండూకం బిట్లనియె. | 118 |
క. | ఉద్యోగాన్వితుఁ డగునే | 119 |
వ. | అదియెట్లనిన. | 120 |
సీ. | గరుడుండు[2] తాఁబేళ్ళఁ బొరిగొని భక్షింప | |
ఆ. | కెఱుఁగ జెప్పి వార్ధి నిందఱమును జేరి | 121 |
వ. | అవ్విధం బాచరించి కచ్ఛపంబులు గరుడునిచేతిఘాతలకు బాసి చనియెఁ గావున. | 122 |
క. | పలువు రొకమూఁక గూడిన | 123 |
వ. | అనిన నీలమక్షికం బిట్లనియె. | 124 |
క. | మనుజుఁ డుపాయంబున నే | 125 |
వ. | అది యెట్లనిన. | 126 |
సీ. | తొల్లి యనావృష్టి దోఁచుటయును నొక్క | |
ఆ. | గోవు మూల్య మిచ్చి కొనిపోయి పిదుకంగ | 127 |
వ. | అని చెప్పిన యందఱు గూడుకొని మత్తగజంబుసకు గవిసి. | 128 |
ఆ. | మ్రానుపోటుఁబులుఁగు మర్దించె కన్నులు | 129 |
వ. | ఆరావంబు విని యమ్మత్తేభంబు దప్పికొన్నది గావున నచ్చట నీ రున్నదని వోయి యానూతం బడి మృతంబయ్యెఁ గావున. | 130 |
క. | బలవంతుఁడ నగవలవదు | 131 |
వ. | అని మఱియు నిట్లనియె. | 132 |
సీ. | .......................... | |
తే. | నాతనికిఁ బత్నియై యొక్కయవసరమున | 133 |
క. | ఇదిగో మాగొఱ్ఱియ యని | 134 |
వ. | అట్లు గావున. | 135 |
క. | ఏవలన వచ్చి పొందునొ | 136 |
వ. | అని నందకు వీడ్కొని యజ్జంబుకంబు చండపింగళుండను సింహంబుముందటికిం జని యిట్లనియె. | 137 |
క. | కొమ్ములుగలవానిని నఖ | 138 |
వ. | అట్లు గావున. | 139 |
క. | నమ్మంగవలదు నందకుఁ | 140 |
వ. | అనునంత నొకయకాలవర్షమ్ము గురిసిన నందకు రమ్మని పిలువ బంపుటయును. | 141 |
క. | వానకు తలవంపుచు న | 142 |
క. | సింగంబు పండ్లు నాటిన | 143 |
వ. | అని కథ చెప్పి దాదిం చూచి మఱియు నిట్లనియె. | 144 |
ఆ. | సహజరిపుఁడు తానె జావంగఁ జూడక | 145 |
వ. | ఎట్లనిన. | 146 |
క. | ఒకవేసవికాలంబున | 147 |
వ. | ఆకప్పలఁ బ్రార్థించి క్షుధాపరవశుఁడ నైతి నీరు గ్రోలఁ దిగివచ్చెద నని యిట్లనియె. | 148 |
క. | పరిపంధి శరణు చొచ్చిన | 149 |
వ. | అని కరుణంబుగాఁ బలికినఁ గొన్నికప్పలు సమ్మతించిన కృష్ణుం డనుదర్దురం బక్కప్పల కిట్లనియె. | 150 |
సీ. | ఒక్కవిద్యాధరు నుగ్మలిగర్భిణి | |
తే. | అతివ గర్భంబు దాల్చిన యభ్రచరుఁడు | 151 |
వ. | అనిన నురగం బిట్లనియె. | 152 |
క. | ఆశావశుఁడై మానవుఁ | 153 |
వ. | అది యెట్లనిన. | 154 |
ఆ. | శబరుఁ డొక్కభద్రసామజంబును జంప | 155 |
ఆ. | నక్క యొకటి చేరి నాగంబు నాగంబు | 156 |
ఆ. | భుజగకరటినరుల భుజియింప నేటికి | 157 |
వ. | అట్లు గావున నిక్కూపం బెల్ల మీసొమ్మను నత్యాశ విడువుండని మఱియు నొక్కకథ చెప్పం దొడంగె. | 158 |
క. | లోభంబు నరకహేతువు | 159 |
వ. | ఇది యెట్లనిన. | 160 |
సీ. | వ్యవహారు లిద్ద ఱాయసము నోడనునిచి | |
ఆ. | నతని తనయుఁ డింటి గాడంగ వచ్చిన | 161 |
క. | జనపతికి విన్నవించిన | 162 |
ఆ. | జనవరుండు పసిఁడి సమభాగ మిప్పింప | 163 |
వ. | మఱియు నొక్కకథ వినుమని యిట్లనియె. | 164 |
సీ. | సింధుమతీపుర క్షితిపతి చచ్చిన | |
| రాజ్యలోభంబున రాకొమరుండు సో | |
తే. | నొక్కవడ్లంగి[4] తనప్రియ నుపచరించి | 165 |
వ. | అట్లు గావున లోభంబు విడువ..........బు ప్రవేశించి యుదకంబు గ్రోలి దినదినక్రమంబున నొక్కొక్కమండూక.............గజనామప్లవంబున కిట్లనియె. | 166 |
క. | బుద్ధిగలవారువలె ని | 167 |
వ. | అట్లు గావున నొక్క కథ వినుమని యిట్లనియె. | 168 |
ఆ. | తొల్లి యొక్కచోట దొంగలు మేకల | 169 |
వ. | యొక్కగంటి మీదబడియున్న సమయంబున. | 170 |
క. | హరి గనుగొని నీ వెవ్వఁడ | 171 |
వ. | అనిన నిట్లనియె. | 172 |
క. | కరటుల నేబదియునుఁ గే | 173 |
క. | అని పలుక వెఱచి సింహము | 174 |
వ. | అని మఱియు......... నుండి............యెండ్రిక యొక్కచో నెండుచున్నఁ జనుదెంచి జలకలశంబున నిడికొని చనియెడిచోఁ బథశ్రాంతి బొంది వృక్షమూలమున నిద్రింపంగ నొకకాకి ద్విజుని గ్రుడ్లను నాకుఁ దెచ్చిపెట్టుమని పోతుఁగాకితో ననుటయు నీసఖు ఫణి బంపు నిద్రించు పారుఁగఱవ. | 175 |
ఆ. | నని నట్ల చేయ నహివిప్రుఁ గఱచిన | 176 |
క. | విప్రు బ్రతికింపకుండిన | 177 |
క. | కాకి కడుబాపి యంతకు | 178 |
ఆ. | ఇతరజాతులైన హితుఁ బ్రోచు నొక్కొక | 179 |
వ. | ఆబ్రాహ్మణుండు గంగయందు నక్కర్కటకంబు బెట్టి స్నానంబు చేసి చనియెఁ గావున. | 180 |
క. | అని హరులు బుద్ధి చెప్పఁగ | 181 |
వ. | అని తంత్రి దాదిం జూచి యిట్లనియె. | 182 |
క. | పలువురు పగతులలోనికిఁ | 183 |
వ. | అది యెట్లనిన. | 184 |
సీ. | జలనిధిదరిఁ బక్షిసంఘము తమ కొక్క | |
ఆ. | రక్తనేత్రుఁ డనెడు గ్రద్ద పక్షుల కెల్ల | 185 |
వ. | ఖగబలంబునకును గ్రద్దకు నెడసేయఁదలఁచి పక్షికులము దండ కరిగి. | 186 |
చ. | అధిపతినంచు గ్రద్ద మిమునందఱి నీనగ వింధ్యవాసకున్ | 187 |
క. | నృపతులు పరిజనములపైఁ | 188 |
వ. | అనిన సిగ్గుపడి గ్రద్దనాయకునికడకు నరుగుదెంచి యిట్లనిరి. | 189 |
క. | అధిపతికంటెను సేవకు | 190 |
క. | పక్షులు తమపై మిక్కిలి | 191 |
వ. | అట్లు గావున పక్షులం బ్రతిపక్షులంగాఁ దలంచి నీపక్షంబు వదలి వారికపటంబు వీక్షించి శిక్షించుమను నవసరంబున. | 192 |
తే. | కొలువు సేయంగ నాఖగకులము వచ్చి | 193 |
వ. | అట్లు గావున గృధ్రంబు బుద్ధివిహీనంబు ఖగపతిత్వంబునకునర్హంబు గాదనిన వాయసంబు కపింజలంబు బట్టంబు గట్టుదమనిన మయూరం బది యర్హంబుగాదని యిట్లనియె. | 194 |
క. | నిలయమునకు శశము గపిం | 195 |
క. | హీనులు తమలోఁ గలహం | 196 |
వ. | అట్లు గావున కపింజలం బవివేకియని జీవంజీవకంబు బట్టంబుగట్టుదమనిన నదిగాదని శారిక యిట్లనియె. | 197 |
సీ. | వినుడు కేరళదేశమునఁ బ్రసేనుండను | |
తే. | నురిని బడుటయు జూచి వాగురికవరులు | 198 |
క. | ఆవైద్యు లట్టె జీవం | 199 |
వ. | రోగవిముక్తుండై యప్పక్షిని విడిచిపెట్టిన నాకసంబున కెగసి భూవరున కిట్లనియె. | 200 |
ఆ. | మొదల నేను వెఱ్ఱిఁ బిదపఁ గిరాతులు | 201 |
వ. | అట్లు గావున మొదలివెఱ్ఱి నే నైతి నిక్షేపంబుఁ జూపెదననిన నొల్లక నన్నుఁ దెచ్చిన కిరాతులు వెఱ్ఱులు మఱి నీ వెఱ్ఱితనంబుఁ దెలిపెదనిన యిట్లనియె. | 202 |
క. | నను ముట్టినమాత్రన నీ | 203 |
వ. | అనిన కిరాతులం జూచి దీని నేయుండనినఁ బడనేసిరి గావున యీయవివేకి యర్హంబు గాదనినఁ గపోతంబు శుకంబు పతిం చేతమనిన సారసం బది వివేకి యవునని యిట్లనియె. | 204 |
సీ. | జగతీశురాష్ట్రదేశంబున రవిగుప్తుఁ | |
తే. | పూజ చేసిన పత్రిలో బొంచియుండి | 205 |
వ. | అని వివాహంబు చేసిన రవిగుప్తరత్నమాలికలు సుఖం బుండునంత నొక్కనాఁడు. | 206 |
క. | రవిగుప్తుఁడు వేఱొకతెను | 207 |
ఆ. | అనిన నతఁడు నవ్వి యస్మచ్ఛుకము డాఁగి | 208 |
వ. | ఈక లూడ్చి వండింప సమకట్టిన నది దైవికంబున నొక్కచోట డాఁగి యీకలు వచ్చి యెగసి యుపవనంబున వ్రాలి యొక్కరాజు జ్యేష్ఠపుత్రుని చేపడి యతనికి హితుండై యుండె నంత. | 209 |
ఆ. | పిన్నపత్నిమీఁది ప్రేమను భూపతి | 210 |
వ. | ఆశుకం బిట్లనియె. | 211 |
మత్తకోకిల: | ఇంతయేటికి జింత యీపని యేన తీర్చెద నింక నీ | 212 |
క. | ఏమిపని వచ్చినారన | 213 |
తే. | అనిన నట్ల సేతునని కీరముల నంపి[6] | 214 |
వ. | అనిన భవగుప్తు సొమ్మెల్ల పుచ్చుకొని తల గొరిగించి వెళ్ళగొట్టించు మనిన నట్ల చేసె గావున కీరం బుపాయకర్త యనిన భరద్వాజం బిట్లనియె. | 215 |
సీ. | ఒకచెట్టుతొఱ్ఱలో శుకము పిల్లలఁ బెట్ట | |
| నమ్ముదుగాని నేనటు సేయనన నీకు | |
తే. | నెఱుకు చని యాత్మహస్తంబు తొఱనుఁ జొనుప | 216 |
వ. | ఉరి దగిలి తానును మృతం బయ్యె గావున చిలుక నిర్భుద్ధి యర్హంబు గాదనిన జలవాయుసంబు బకంబు గట్టుదమనిన చాతకం బిట్లనియె. | 217 |
సీ. | బక మొక్క డడవిలో పద్మాకరముపొంత | |
తే. | రొంపిబడుటయు నొకనక్క చంపె దానిఁ | 218 |
వ. | అమ్మాటకు గలకంఠం బిట్లనియె. | 219 |
తే. | కుంటిపులిఁ జూచి యొకనక్క కూర్మిఁ బలికె | 220 |
వ. | ఇవ్విధంబున దిరిగి మృగంబుల నెల్ల జంపించి మాంసంబు గానక యిట్లని తలంచు. | 221 |
సీ. | భాగీరథీతీరభాగంబునను నొక్క | |
తే. | వీఁపునం దిడి వోవుచు విపినచరము | 222 |
వ. | అట్లు గావున నన్ను దిరుగగొనిపోయిన నాగుండెలన్నియు నిచ్చెద ననిన నది యట్ల చేసిన. | 223 |
క. | చె ట్టెక్కి కొమ్మ విరి చా | 224 |
వ. | అని నిశ్చయించి జంబుకంబు చాకలివాని చీరెలు మోచుగార్దభంబుతో చెలిమి చేసి యిట్లనియె. | 225 |
క. | పులికిని నాప్తుఁడ నే నా | 226 |
వ. | అట్లు చని పులికి నొప్పించె గావున జంబుకంబు విశ్వాసఘాతకి, కాకి ఖగాధముండు గావున నర్హంబు గా దది యెట్లనిన. | 227 |
సీ. | కాకులు దుర్భిక్షకాలము పండిన | |
తే. | లనియె నీ యెంగిలిలు మాకుఁ దినగఁబెట్టి | 228 |
క. | చుట్టలమని కలకొలదిని | 229 |
వ. | అట్లు గావున కాకం బర్హంబు గాదని పశు లెల్ల విచారించి గరుడనిం బట్టంబు గట్టి సుఖంబున నుండిరని చెప్పి మఱియు నొక్కకథ వినుమని తంత్రియు నిట్లనియె. | 230 |
క. | ప్రమదమునఁ బిశాచంబులు | 231 |
క. | తను భవభీతిపిశాచం | 232 |
సీ. | గంగాఖ్యపురమునఁ గలఁడు దరిద్రుండు | |
తే. | విషముచేఁ జచ్చుటయును నా విప్రవరుఁడు | 233 |
వ. | గృహంబున కనిచి సుఖం బుండు నంత. | 234 |
క. | శృంగారవనమునను నొక | 235 |
క. | పంచాస్యము డగ్గరుతరి | 236 |
తే. | రాజుముందట నిడిన నారాజవరుఁడు | 237 |
దోదకం: | వచ్చి నృపాలుఁడ వారణబలుఁడై | 238 |
వ. | అంత సహస్రపాలుండు దేవదత్తుప్రతాపంబు విన్నవాఁడు గావున రహస్యంబున వానిం బట్టి తెచ్చిన పిదప గంగాధరుబలం బణంతునని తలంచి. | 239 |
ఉ. | క్ష్మాపతి గూఢభావమున గంగపురం బవలీల జొచ్చి య | 240 |
క. | ఈగతి సహస్రపాలుని | 241 |
క. | బలహీనుఁడైనఁ గానీ | 242 |
వ. | అనిన గజవక్త్రుండను బేతాళుం డిట్లనియె. | 243 |
సీ. | నెమ్మి విటాగ్రహారమ్మున గార్దభ | |
తే. | జగతి మ్రోయించి తన కాంత జవ్వనైన | 244 |
క. | శూలము ఱొమ్మున నిడి(వగ) | 245 |
వ. | ఉపదేశించిన నదియ చేయుచుండు నంత నొక్కనాఁడు. | 246 |
క. | పరదేశి విప్రుఁ డొక్కఁడు | 247 |
క. | పరదేశి విప్రు నిజమం | 248 |
వ. | అట్లిల్లు వెడలి బమ్మరించుచు నెదురుపడిన యవ్విఫ్రునకుఁ జెప్పిన నందఱికిం జెప్పకున్న ప్రమాదం బనిన నచ్ల చెప్పిన నెవ్వరు నాపైఁదలి జూడ భయపడుచుండి రంత. | 249 |
ఆ. | క్షిప్రకోపుఁ డాత్మగృహమున కేతెంచి | 250 |
వ. | అనియెం గావున. | 251 |
క. | దైవముకంటెను మానుష | 252 |
వ. | అనిన లంబోష్ఠుండను పిశాచంబు మానుషంబుకంటె దైవికం బెక్కుడని యొక్కకథ చెప్పందొణంగె. | 253 |
సీ. | మాహిష్మతీపురి మహిపతి జలశాయి | |
తే. | జననమొందిన కమలలోచనను మాఱుఁ | 254 |
క. | అరిగి, ఫణి, భుక్తి కొఱకై | 255 |
తే. | అతఁడు పద్మాంకుఁ డనుపేర నతిశయిల్లె | 256 |
వ. | కమలలోచనకు నోముమీఁద నభిలాష పుట్టించి కుసుమావతిం బద్మాంకునొద్ద నిలిపి యక్కమలలోచనం గొని యర్థరాత్రంబున గంగమడువునం ద్రోచుటయును. | 257 |
క. | దైవవశంబునఁ గామిని | 258 |
తరల: | కమలలోచన యంతఁ బుత్రకు గాంచె నుజ్జ్వలమూర్తి శ్రీ | 259 |
వ. | అంత నప్పద్మాంకుండు దిగ్విజయార్ధం బరిగి గౌతమాశ్రమంబునం గుమారునిం జూచి వీఁ డెవ్వనిపుత్రుండని యమ్మునీశ్వరు నడిగిన నతం డిట్లనియె. | 260 |
స్వాగతము: | సారసలోచన క్ష్మావర నీకున్ | 261 |
వ. | అని వినిపించి తదీయాగమనక్రమం బెల్ల నెఱింగించినఁ గమలలోచనా సుతసహితుండై మునియనుజ్ఞ నాత్మపురంబున కేతెంచి యందుఁ గుసుమావతి వర్జించెనని తంత్రి దాదికి మఱియొక్కకథ వినుమని యిట్లనియె. | 262 |
క. | సాహసునకు దైవంబును | 263 |
వ. | అది యెట్లనిన. | 264 |
సీ. | రత్నావతీపురీరమణుండు నరదత్తుఁ | |
తే. | మాన్పఁగా నేర్తుననుచుఁ గుమారి దెచ్చి | 265 |
క. | అక్కామిని కిట్లనియెన్ | 266 |
ఆ. | దానితల్లి వచ్చి తరుణి మాయింటికి | 267 |
ఆ. | ఎఱ్ఱరాజనంబు లిరువదిపుట్లును | 268 |
వ. | ప్రతిరాత్రియు నటువలెఁ బెట్టుచు నట్లు గూడి సుఖియింపుచు నొక్కనాఁడు. | 269 |
క. | ఎయ్యెడ నెఱ రాజనపున్ | 270 |
ఉ. | పట్టినఁ నంధ్రభూమి జనపాలుఁడు సాగుళిగొంచుబోవు(?)నా | 271 |
క. | ఇది మొదలు గాఁగ మనుజుల | 272 |
వ. | సాగుళికయు నభ్భూపాలునిచేత నధికధనంబులు వడసి సుఖం బుండెనని చెప్పిన నాజానుబాహుండను పిశాచం బిట్లనియె. | 273 |
క. | మాటాడనేర్పు కలిగినఁ | 274 |
వ. | అది యెట్లనిన. | 275 |
సీ. | పిప్పలుండను సెట్టి పృధివిపై సైంధవ | |
| చనుడు వేలాఖ్య రాక్షసుఁ డిందునున్నవాఁ | |
తే. | హరులలో దాగి బులియును నంతలోనఁ | 276 |
క. | తిరుగుచునుండగ దొంగలు | 277 |
ఆ. | మనుజుఁ దినక యేల మరు లెట్లు గొంటివి | 278 |
వ. | అంత నక్కయుఁ దలుపులు వుత్తునని కుంచెకోల వరవుతొలిని తోఁక జొనిపి నా. | 279 |
క. | చోరుం డాశివవాలము | 280 |
క. | మానవుఁ డుపాయబలమునఁ | 281 |
వ. | అది యెట్లనిన. | 282 |
సీ. | ద్వైతాటవిని సముద్ధతుఁడను సింహంబు | |
తే. | శశము పొడగని సింహంబు జంపి వత్తు | 283 |
క. | కేసరిమ యొక్కటి మముఁ | 284 |
ఉ. | కోపితచిత్తుఁడై యెచటఁ గుత్సితజంతువు నుండునన్న నే | 285 |
క. | బుద్దిగలవాఁడె బలియుఁడు | 286 |
వ. | అనిన ప్రబలుండను పిశాచం బింద్రశర్మ పిశాచంబుఁ బట్టంబు గట్టుదమనిన దూషకపిశాచం బిట్లనియె. | |
క. | భూసురుఁడు కుక్క బెంచుచు | 287 |
వ. | అని మఱియు నిట్లనియె. | 288 |
క. | వాదడచు చోట నిలువం | 288 |
చ. | జగతివరుండు వాజియుతశాలకు గావలిగాఁ బొందిలిన్ | 289 |
ఆ. | దానఁ జేసి హరుల తనుదాహమగుటయు | 290 |
వ. | మఱియును. | 291 |
క. | ఏవిధము నరుఁడు దలఁచిన | 292 |
వ. | అదియెట్లనిన. | 293 |
క. | సన్యాసి రాజునకు గడుఁ | 293 |
క. | నక్షత్రగ్రహరాసులు | 294 |
ఆ. | అట్లుగాన నీవరాత్మజ లక్షణ | 296 |
వ. | ఏటిగాలివశంబునం జనుదేర నొక్కభూమీశుండు పెట్టి పుచ్చికొని పెట్టిలోనికన్యం గైకొని యందు నెలుంగు బెట్టి విడిచిన. | 297 |
ఉ. | పెట్టియ పట్టుకో ననుచు భిషకు డేటికీ వచ్చి యందుఁ జూ | 298 |
వ. | అని మఱియు నిట్లనియె. | 299 |
క. | నరుఁ డొకటిఁ దలఁప దైవము | 300 |
క. | వారాంగనయునుఁ బురుషుఁడు | 301 |
వ. | అది యెట్లనిన. | 302 |
నందన: | నందనవిటునకు ననిచి ప్రియమునన్ | 303 |
వ. | ఒక్కనాఁడు కాంతాసమేతుండై నిద్రించునల్లుని యాననంబున విషచూర్ణయుక్తంబైన కోలు జొనిపి యీవలికడ వదనంబున ధరియించి యూఁదుసమయంబున. | 304 |
తే. | అల్లుఁ డుత్సర్గ విడువం దదాస్యపవన | 305 |
వ. | మఱియు నిట్లనియె. | 306 |
క. | ఒరుసొమ్మున కాసించిన | 307 |
వ. | అది యెట్లనిన. | 308 |
క. | సామరుని కోడలొక్కతె | 309 |
ఆ. | ఇంటివారు వోరయేనందు బడలేక | 310 |
వ. | ఈమద్దెలమీఁ దెక్కి (?) యురి దగిల్చుకొమ్మనిన వెరవు నీవే చూపుమనిన యమ్మద్దెల యెక్కి వురి దగిల్చుకొని మృతు డయ్యెనని మఱియు నిట్లనియె. | 311 |
క. | హీనాశ్రమంబు కంటెను | 312 |
వ. | అది యెట్లనిన. | 313 |
సీ. | మేకపిల్లలు రెండు మేతకై యెవ్వని | |
తే. | బెట్టికొనియుండె సింహంబు భీతి కుడుచు | 314 |
వ. | తోక భక్షించి యందునుఁ దనివోవక చెవులును గళస్తనంబులును భక్షించి యమ్మేకను భక్షించనున్న సమయంబున. | 315 |
క. | ఏనుఁగుకుంభస్థలమునఁ | 316 |
క. | హీనుల సేవించిన య | 317 |
క. | ఘనులం గొలిచిన మనుజులు | 318 |
క. | చెడుగునకు హితవు చేసిన | 319 |
వ. | అది యెట్లనిన. | 320 |
సీ. | ఒకపరదారకు నువిద యొక్కతె దూత | |
తే. | కట్ల నున్నది యాత్మీయకాంత యనుచు | 321 |
ఆ. | అంత నక్కాంత యది దీర్చి యరుగుదెంచి | 322 |
వ. | అనిన వాఁడు దీపికాహస్తుండై నాసిక గనుంగొని పరమపతివ్రతవు తప్పులో గొనుమని దండంబు వెట్టి కలసియుండి రంత నక్కడ. | 323 |
క. | హితవరియై నిజనాసా | 324 |
వ. | అంత. | 325 |
ఆ. | దొంగయొకడు చేరి యంగనాదూతలు | 326 |
వ. | అని తంత్రిదాదికి మఱియు నిట్లనియె. | 327 |
క. | గురువుల ధనమైనను చే | 328 |
వ. | అది యెట్లనిన. | 329 |
ఆ. | విబుధయోగి యొకఁడు వేణుదండములోన | 330 |
క. | అమ్మాడ లెత్తుకొని పో | 331 |
క. | కడుజివికి నొకకసవుం | 332 |
వ. | అది యెయ్యది యనిన మనకు భిక్ష చేసిన వారింటి పూరిపుడక నాతలఁ దగిలి వచ్చెను నాపుడుక. | 333 |
(గ్రంధ పాతము)
| .............................. | 334 |
క. | వెనుకకు నిటువలె జొరవె | 335 |
క. | అని తంత్రి కథలు చెప్పగ | 336 |
వ. | నారదుండు కథావిశేషంబులు వినుపించిన బలిచక్రవర్తి యుత్తరకథావినోదంబులు వినుపించుమనిన. | 337 |
మ. | కరుణాపూర్ణకటాక్ష భక్తజనహృత్కామప్రదానక్రియా | 338 |
క. | మిత్రశశినయన భైరవ | 339 |
దోదకము: | కంధరపటలనికాశశరీరా! | 340 |
గద్య: | ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు తృతీయాశ్వాసము. | |