సకలనీతికథానిధానము/చతుర్థాశ్వాసము
చతుర్థాశ్వాసము
| శ్రీకుంటముక్ల రమణ | 1 |
వ. | అవధరింపు బలీంద్రునకు నారదుం డిట్లనియె. | 2 |
చ. | వసుధకు నంచితాభరణవైభవమై బహుభోగసంపదన్ | 3 |
ఆ. | అక్కుమారవరులయందు నొక్కఁడు తీర్థ | 4 |
వ. | అప్పుడు. | 5 |
క. | మాళవభీరకరశ | 6 |
ఆ. | అట్లు రాజహంసు నాహనముఖమున | 7 |
క. | తనపతి రణమున బడెనని | 8 |
వ. | ఒక్కలతాపాశంబు సంధించి యున్నతవృక్షశాఖ నురివెట్టుకో నచ్చటికిం జేరు సమయంబున. | 9 |
క. | అరిచేత మూర్ఛితుండై | 10 |
ఆ. | మాళవేశ్వరుండు మరలి సేనయుఁ దాను | |
సీ. | అట ప్రధానులు నల్వురాత్మజన్ములఁ దెచ్చి | |
తే. | నట్టి పుత్రకు లీరెను నవని బెరిగి | 12 |
క. | హితవుగలవాఁడె చుట్టము | 13 |
క. | పతిభక్తి లేని భార్యయు | 14 |
తే. | చెడకయుండంగ ధనము రక్షింపవలయు | 15 |
ఆ. | కులము చెఱుచువానిఁ గొనసాగనీవల | 16 |
క. | ధనలోభి కర్థ మిచ్చియు | 17 |
క. | ధననష్టియును విచారము | 18 |
క. | విభున కనుకూలభార్యయు | 19 |
క. | ఆపద వచ్చిన కరవున | 20 |
క. | బహువిధభోజనశక్తియు | 21 |
క. | వేదంబుఁ జదివి జపహో | 22 |
క. | ఏదేశంబున నిజవి | 23 |
క. | ధనమునకు ఫలము దానము | 24 |
క. | ఖలునందు మంచివిద్యయు | 25 |
క. | అరులిరువురు గలిగిననం | 26 |
క. | వ్యవహారక్రయవిక్రయ | 27 |
క. | లోకాపవాదభయమును | 28 |
క. | నరపతి భృత్యునిభావము | 29 |
క. | మతి గలిగి ధైర్యవిద్యా | 30 |
క. | ఒకపరిఁ జెప్పినకార్యము | 31 |
క. | బలయుతుఁడై యింగితచే | 32 |
క. | కులశీలసత్యధర్మము | 33 |
క. | ఆయుర్వేదచికిత్సో | 34 |
క. | దుష్టవ్యసనుని మూర్ఖుని | 35 |
క. | కొంచెపువాఁ డాడినక్రియ | 36 |
క. | దుర్గుణులు మూర్ఖజను లప | 37 |
క. | ఒరునర్థము దా నెఱుఁగుచు | 38 |
క. | హీనజనుఁడైన నధికపు | 39 |
వ. | మఱియు రాజహంసుం డిట్లనియె. | 40 |
క. | అబ్బినదాఁకా(?)జ్ఞానము | 41 |
క. | కాలమున మేలుకొనుటయు | 42 |
క. | రతిగూఢత్వము దూరే | 43 |
క. | వైళంబ మేలుకొనుట య | 44 |
క. | అలసియును మోపుమోయుట | 45 |
క. | ముందటఁ బ్రియమును పిదపన్ | 46 |
క. | కులవిద్య మిగులనుత్తమ | 47 |
క. | కొఱగాని బాంధవంబును | 48 |
క. | చదువని విద్య విషం బగు | 49 |
క. | ఉరగంబు మహాకీడ(?) | 50 |
క. | మునులకును రూపు తాలిమి | 51 |
క. | తొడవులకుఁ జీరముఖ్యము | 52 |
క. | బలరహితు బలము నరపతి | 53 |
క. | కరటికిని వేయిచేతులు | 54 |
క. | ఉపకారి కాఁగవలవదు | 55 |
క. | హితుఁడైనవాఁడె చుట్టము | 56 |
క. | గిరిగిరిని మణులు గలుగవు | 57 |
క. | గుడికి నిరవైనచోటును | 58 |
క. | కులమును రూపము వయసునుఁ | 59 |
క. | ఉపకృతి ఖలునకుఁ చేసిన | 60 |
క. | జలరుహనాళంబున జల | 61 |
క. | తురగములచేత, నావులు | 62 |
క. | ధనికునకు నిచ్చుదానము | 63 |
క. | కులహీనునకును విద్యయు | 64 |
క. | భేరీశబ్దం బామట | 65 |
క. | తనయింట మూర్ఖు పూజ్యుఁడు | 66 |
క. | పులకండపు బాదునఁ దగ | 67 |
క. | నిత్యంబుగాదు విభవ, మ | 68 |
క. | నీచునెడ నీచతయును స | 69 |
క. | అలసునకు విద్య వొందదు | 70 |
క. | అనిచిన పరిమళవృక్షము | 71 |
క. | వట్టినమ్రాఁకున ననలము | 72 |
క. | మొదలను సమస్తవిద్యలు | 73 |
క. | అక్షరమొక్కటి యైనను | 74 |
వ. | మఱియు సునీతి వర్మ యిట్లనియె. | 75 |
క. | ఏపాటిమేలు దొరకిన | 76 |
క. | తేలునకు తోఁక విషమగు | 77 |
క. | వ్రణ మాశించును మక్షిక | 78 |
ఆ. | సిగ్గు పడిన లంజ చెడు సిగ్గు లేనట్టి | 79 |
క. | మృగచండాలము గాడిద | 80 |
క. | తల్లియు నిల్లాలును దన | 81 |
క. | హలికునకుఁ గరువు జేరదు | 82 |
తే. | రాష్ట్ర మొనరించు పాపంబు రాజుఁ బొందు | 83 |
ఆ. | హితులు దెలిసిరేని హితులకు హితులయిన | 84 |
క. | బలయుతుఁడు గాగ మంత్రిన్ | 85 |
క. | సుతుకడకు గురువుకడకున్ | 86 |
క. | బలయుతుఁడు వైర మెత్తిన | 87 |
క. | ధనికుఁడు గావలె గాదా | 88 |
క. | వల్లభున కలిగి తాఁ జెడు | 89 |
క. | మహనీయభోగసంపద | 90 |
క. | కలిమిగల దినములందునె | 91 |
ఆ. | అలవిగాని పనికి నాసించుదుర్మతి | 92 |
ఆ. | ఈఁగిలేనివాని నిమ్మనువాఁడును | 93 |
క. | ఆయవ్యయములలోపల | 94 |
క. | పలువురు మెచ్చఁగ సభలో | 95 |
క. | మునియును శకునజ్ఞుఁడు దనుఁ | 96 |
క. | చల్లనిమాటలచేతను | 97 |
ఆ. | స్వామిపగిది పంచసంవత్సరంబులు | 98 |
క. | బాలస్త్రీరతి మాఁపటి | 99 |
క. | బాలార్కుఁడు శవధూమము | 100 |
క. | పురుడునకు నిచ్చుత్యాగము | 101 |
క. | ప్రాణంబు సకలజనులకు | 102 |
క. | తనసిరి లోకములకు సిరి | 103 |
క. | అలుక తనకుతయ మగుటయు | 104 |
చతుర్విధవృత్తము | పనసరసాల పాటలుల పాటిగ నుత్తమ మధ్య మాధముల్ | 105 |
వ. | అంత వివేకసముద్రుం డిట్లనియె. | 106 |
క. | వడ్డికిచ్చుటయును వాదంబుసేఁతయు | 107 |
క. | కలవాఁడె బుద్ధిమంతుఁడు | 108 |
క. | ఉరగము కంటెనుఁ గొండీ | 109 |
క. | కులజుండొక్కఁడు చొరకే | 110 |
క. | దీపనభుక్తియె పథ్యము | 111 |
క. | పగలేనివాఁడె మనుజుఁడు | 112 |
ఆ. | యెదుర గురుల బంధుహితులను బిమ్మట | 118 |
క. | అలజడి చుట్టము మనసును | 114 |
ఆ. | అవగుణంబె వెదకు నల్పుఁ డమేధ్యంబె | 115 |
క. | వెలయాలు జాతిపిల్లియుఁ | 116 |
క. | అనల ఋణవైరి శేషము | 117 |
క. | పరివారంబునుఁ బ్రజయును | 118 |
క. | బాలకుఁడు నాథుఁడైనను | 119 |
క. | అలుకయు రక్షాగుణమును | 120 |
ఆ. | ఆత్మబుద్ధి లెస్స అంతకంటెను పర | 131 |
క. | తనయులకు మంత్రులకు హిత | 122 |
క. | వేళెఱింగి సస్య (మలికెడు) | 123 |
క. | మానంబె కోరు నుత్తమ | 124 |
ఆ. | ఆత్మశక్తిఁ బడయు నర్థ ముత్తమము పి | 125 |
ఆ. | అన్నమునకు నధిక మష్టగుణంబులు | 126 |
క. | తనచేతఁ జాలనొచ్చిన | 127 |
క. | దినకరుఁ డుష్ణము మఱి య | 128 |
క. | చందనము చలువ జగములఁ | 129 |
క. | కులపత్ని యొక్కతియు, మఱి | 130 |
ఆ. | కన్నె రూపు గోరు కనకంబుఁ గోరును | 131 |
ఆ. | గుఱ్ఱమునకు మోపుగుణమును గన్నెకుఁ | 132 |
క. | తమవారి బాసినను, ను | 133 |
వ. | రాజవాహనుమంత్రి శ్రుతకీర్తి మఱియు నిట్లనియె. | 134 |
క. | న్యాయమునఁ బెరుగు ప్రజ, నర | 135 |
క. | ఖలజనుల తోడఁ బుట్టినఁ | 136 |
క. | చులుకనివారలఁ గూడిన | 137 |
క. | విఱుగంగఁ దగదు భటునకు | 138 |
ఆ. | చందురుండు మిగులచల్లనివాఁడన | 139 |
క. | సేయఁదగునట్టి పనికిని | 140 |
క. | పరికింపఁ బురుషునకుునా | 141 |
వ. | ఇట్లు సునీతివర్మయు, వివేకసముద్రుండును శ్రుతకీర్తియును, దండ్రి యగు రాజహంసుండును నానానీతివిశేషంబు లెఱింగించి సుతులను దిగ్విజయార్థం బనిపినం జని, వనంబున నొక్కచో నవధూతఁ గని వానితో సఖత్వంబు చేసి తదుపదిష్టమార్గంబున రాజవాహనుండు పాతాళబిలంబు ప్రవేశించుచు నాత్మామాత్యపుత్రుల నుపహారవర్మ పుప్పోద్భవా అర్ధపాల సోమదత్తులు మొదలయిన తొమ్మండ్రను వెలుపల నునిచి యొక్కరుండును వసుంధరారంధ్రంబు ప్రవేశించి. | 142 |
ఆ. | పావకాదివిఘ్నపటలిని నిర్జించి | 143 |
క. | ధరియింప క్షుత్పిపాసలు | 144 |
క. | మిత్రుఁ డవన్యపుఁజుట్టము | 145 |
ఆ. | అరులుఁ జూచి దుఃఖ మందంగ, మిత్రులు | 145 |
వ. | అట్లు గావున నాత్మమిత్రపరిత్యాగంబును బరదేశభోగంబును నుచితంబు గాదని కాళింది నొడంబరచి, పాతాళంబు వెలువడి మిత్రులం గలసియుండు నప్పుడు పుప్పోద్భవుం డిట్లనియె. | 146 |
ఉత్సాహం: | రాజవాహన మమ్ముఁ బాసి ధరాకరండ్రము నీవు వి | 147 |
ఆ. | వాఁడు చెలిగాఁగ నప్పురవరముఁ జేరి | 148 |
వ. | మత్సఖుండైన చంద్రపాలుని శకునంబునకుఁ బెట్టి నే నబ్బాలచంద్రికం గామించి తదనుమతంబునఁ దత్పూర్వపతిని వధియించి యక్కామినిం గైకొంటి మన మప్పురంబునకుఁ బోదమని రాజవాహనుం దోకొని యవంతికిం జని. | 149 |
క. | కుసుమపుర మేలునీతం | 150 |
ఆ. | రాజవాహనునకు రమణిగాఁ జేయుదు | 151 |
వ. | రాకపోకలు చేయుచుండు నంత నొక్కనాఁడు. | 152 |
క. | హితుఁడైన సోమదత్తుఁడు | 153 |
వ. | అతం డిట్లనియె. | 154 |
సీ. | పురవీథి నొక్కయద్భుతపురత్నము గని | |
తే. | బట్టికొనిపోవ నేను దత్ప్రజల కూడి | 155 |
వ. | అనిన సంతసిల్లి యున్నంత. | 156 |
ఆ. | ఇంద్రజాలి యొక్కఁ డేతెంచి, యీరాజు | 157 |
క. | ఏ నింద్రజాలికుండను, | 158 |
ఆ. | అయ్యవంతిఁ బెండ్లియాడెడు గంధర్వుఁ | 159 |
వ. | రాజవాహనుం బురస్కరించుకొని గంధర్వసమూహంబునఁ బొడచూపునట్లుగ మాయవన్ని యవంతీకన్యకం దెచ్చి రాజవాహనునకు వహ్నిసాక్షిగ బెండ్లి చేసి యనిపిన, నయ్యింద్రజాలిబలంబు లదృశ్యంబైన రాజవాహనుం డవంతీసహితుండై యప్పురంబున రహస్యవృత్తిం జరియింవుచుండునంత. | 160 |
తే. | మాయగంధర్వుఁ గల్పించి మత్తనూజ | 161 |
ఆ. | అంత చండపర్మయను రాజు తనకూఁతు | 162 |
చ. | ప్రియమునఁజూచి సంకిలియఁ బెట్టినరాణువనెల్ల భీమని | 163 |
తే. | గజము చంపక దైవయోగమునఁ బాద | 164 |
వ. | అంత. | 165 |
క. | అపహారవర్మయను పూ | 166 |
వ. | అని యివ్విధంబునఁ దొల్లి రాజవాహనుతోఁగూడ దిగ్విజయార్థంబు వెళ్ళివచ్చిన కుమారనవకంబును నటుక్రితంబు వ్యవహారతీర్థయాత్రాభ్రాంతులై పోయిన మువ్వురును రాజ్యంబులు వడసినవారలు గావున చండవర్మకు సహాయు లౌట రాజవాహనుపైఁ గవిసి తెలిసి యప్పన్నిద్దఱు నతనిం బట్టబద్ధునిం జేసి సేవింపుచు నొక్కనాఁడు. | 167 |
క. | అపహారవర్మ యిట్లను | 168 |
ఉ. | 169 |
వ. | అదియునుం గాక. | 170 |
క. | కోమటి కుబేరదత్తుఁడు | 171 |
ఆ. | అనుచు మఱియు నేడ్వ నావైశ్యతనయు నేఁ | 172 |
వ. | అని యూరడం బలికి యప్పురము ప్రవేశించి కపటద్యూతక్రీడ సలుపుధూర్తులయొద్ద నిలిచి వారలకు నాట చెప్పిన వా రలిగి నీ వాడనేర్చిన రమ్మనిన నేనును నట్ల కాకయని కూర్చుండి పాసికలు కైకొని యప్పుడు. | 173 |
క. | పాసికలఁ గపటవిద్యా | 174 |
వ. | అంత. | 175 |
క. | అపహారవర్మ యనియెడు | 176 |
క. | వీటఁగల వీథి వీథుల | 177 |
వ. | అప్పుడు. | 178 |
ఆ. | ద్యూత మాడి తనకు నోడినకితవుండు | 179 |
సీ. | ఈదొంగప్రొద్దు నీ వెచ్చటి కరిగెదు | |
ఆ. | బ్రియముగలదు, వాఁడు పేదైనఁ గానిమ్ము | 180 |
ఉత్సాహం: | పారి దిరుగపురము వీరభటులు దివ్వె లెసఁగ న | 181 |
వ. | యక్కన్యక తలవరులం జూచి యిట్లనియె. | 182 |
క. | పరదేశుల మీరాతిరి | 183 |
క. | పలవింపఁ గొన్నిమందులు | 184 |
వ. | చని యక్కన్యకం దెచ్చితి, మి మ్మిరువుర బాణిగ్రహణంబు వొనరించెద ననిన, నిరువురు సంతోషించుటయు నయ్యుదారుననుమతి నక్కాంత నింటి కనిపి వాఁడునుఁ దానునుం గూడుకొని. | 185 |
చ. | బలపముఁ గావిచీరములబంతి కసీఁసపుగోక, చొక్కుమం | 186 |
వ. | ఆవైశ్యు నింటికిం జని. | 187 |
ఆ. | గోడవ్రాఁత వ్రాసి కూర్చుండి భూమికి | 187 |
చ. | అనుపమవస్తువుల్ గొనుచు నంగడికిన్ గొని తేర నారెకుల్ | 188 |
ఆ. | అంతఁ దెల్లవార నవనీరుహము డిగ్గి | 189 |
వ. | తదీయమహత్వంబు గఱపి భూపాలు సమ్ముఖంబునకుఁ బొమ్మనిన నతండును నది గొని చని. | 190 |
ఆ. | దానధర్మములకు ధనమెల్ల వెచ్చించి | 191 |
తోటకము: | అడవికి నేగి రయంబునఁ దనువున్ | 192 |
క. | వ్రతివై యివి పూజింపుము | 193 |
వ. | ఈచర్మభస్త్రికవలన నిష్టార్థంబులు గురియు రత్నంబును గాంచితి ననిన విని నీయొద్దనే యుండనిమ్మని యాయుదారునింట చర్మభస్త్రి రత్నంబు లున్న వవి యపహరించినవారి దండింతుమని పురంబునఁ జాటించి యింటి కనిపిన, నపహారవర్మం గూడి సుఖం బుండె నంత. | 194 |
క. | ఆరత్నచర్మభస్త్రుల | 195 |
ఆ. | అంతఁ దనకు మిత్రుఁడైన విమర్దు సా | 196 |
సీ. | పురిలోనఁ గామమంజిరి యనుకన్నియ | |
తే. | సెప్పుటయు భూమినాయకుఁ డప్పురమున | 197 |
ఆ. | అంత నర్ధపతికి నావుగాఁ జేసిన | 198 |
సీ. | శంకరుఁ డిచ్చిన చర్మభస్త్రిక పైఁడి | |
తే. | బొంది వచ్చితి నంతట ప్రొద్దువో ను | 199 |
వ. | అయ్యుదారుండును రాజుసముఖంబునకుఁ జని యథదత్తుండు మదీయరత్నచర్మభస్త్రికలు దివియించెనని విన్నవించిన, నతనిఁ బట్టి తెప్పించిన నేఁ దీయించుట లేదనిన, నుదారుం డిట్లనియె. | 200 |
తే. | గతదినంబునఁ దన కూర్చు హితుఁడు నన్నుఁ | 201 |
ఆ. | అనినఁ బిలువఁబంపె నాయొంతగాఁడునుఁ | 202 |
వ. | అంత. | |
క. | తిత్తియు రత్నముఁ గానక | 204 |
వ. | ఈతిత్తికథ బయలుపడకుండంగొనువాఁడనై యుదారునికిం దిత్తియున్ననెల వెఱింగించి రాజున కెఱింగింపుమని పంపిన. | 205 |
సీ. | రాజైన సింహవర్మక్షమాధిపుఁ గాంచి | |
తే. | యడుగ మిముఁ బిలువఁ బంపిన నర్ధదత్తు, | 206 |
క. | అని యేను దలఁగుటయు న | 207 |
వ. | ఆతిత్తియు రత్నంబును దెప్పించి యుదారున కిచ్చి యర్థపతిం దల ద్రెగవేయుమని పంపిన నుదారుండు సింహవర్మ పాదంబులం | |
| బడి వైశ్యుండు వధ కర్హుండుగాఁడని, పురంబు వెడలఁగొట్టించి ప్రాణంబు రక్షించిన నయ్యర్థదత్తుండు సంతోషించి తనకూఁతు నతని కిచ్చి సుఖం బుండె. | 208 |
ఉ. | అంతట రాజమంజరిగృహంబున సీధురసంబుఁ గ్రోలి యే | 207 |
వ. | దానిరాగమంజరి దూతిక సృగాలికగా నెఱింగి డగ్గరంబిల్చి యిట్టంటి. | 210 |
ఆ. | ఆత్మమిత్రుఁడగు నుదారుని సొమ్మును | 211 |
ఆ. | ఇచటఁ గట్టు వడితి నిఁక వీరి కెఱిగింప | 212 |
క. | దూతికతో నేమనునో | 213 |
సీ. | అపరదినంబున నాసృగాలికచ్చి | |
| నంబాలికనియెడు నధిపు పుత్రికమీఁదఁ | |
ఆ. | కాంతకునకు మదనసంతాప ముదయింప | 214 |
వ. | అనిన కఱపిన నదియు నట్ల చేయుచు నంబాలికకు నర్మసఖియై వర్తింపుచుండె నంత నొక్కనాఁడు. | 215 |
క. | ఆరాజవదన సౌధపు | 216 |
గీ. | కాంతతమ్మ యనుచుఁ గాంతకునకు నిచ్చు | 217 |
వ. | అంత నొక్కనాఁ డద్దూతికం జూచి కాంతకుం డిట్లనియె. | 218 |
గీ. | ఇట్టిబాల నాకు నేగతిఁ బ్రాపింప | 219 |
వ. | ఆకన్నంబునం జని నీ వాకన్నియం బొందుమనిన నట్లకాకయని కారాగృహంబున కేతెంచి యచ్చటి కావలివారలం జూచి యిట్లనియె. | 220 |
క. | ధన మడుగు నేనృపాలుఁడు | 221 |
ఉ. | కన్నము త్రోవ నేగ సమకట్టిననుంగ్గని నిండుప్రాణియై | 222 |
వ. | రాగమంజరి గృహంబు ప్రవేశించి విగళితశృంఖలుండనై సృగాలికాసాధకుండనై యస్మత్కృతంబైన కన్నంబునం జని రాచకన్నెను రాత్రియెల్ల ననుభవింపుచుండ నంత నొక్కనాఁడు. | 223 |
సీ. | ఆముద్ర యంగనహస్తశాఖఁ దగిల్చి | |
తే | జారుఁడైన నీదుశత్రుండు చనిపోయె | 224 |
వ. | అంత నపహారవర్మయు సృగాలికతోడ రాగమంజరి గృహమ్మున కరుగునప్పుడు. | 225 |
చ. | తలవరు లేగుదేరఁ గని దగ్గఱ వచ్చుసృగాలిఁ జూచి యో | 226 |
క. | అని చెప్పి యాతలారులు | 227 |
వ. | రాజమంజరి గృహమ్ము ప్రవేశించి విగళితశృంఖలుండనై సృగాలికాసాధకుండనై యస్మత్కృతంబైన కన్నమ్మునఁ జని రాత్రులెల్ల రాజకన్య ననుభవింపుచుండ నంత నొక్కనాఁడు. | 228 |
ఆ. | చండవర్మ యపుడ చండసింహునిఁ బట్టి | 229 |
వ. | అనిన సంతసిల్లి రాజవాహనుం డుపహారవర్మం జూచి నన్నుఁ బాసి నీ వెచటనుండితివనిన నిట్లనియె. | 230 |
గీ. | ఏ విదేహనగరి కేగి తపస్వినీ | 231 |
సీ. | ఆరాజహంసుఁడ రాతిచేనొచ్చిన | |
గీ. | యనుదినంబును వచ్చునన్న రసిపోవ | 232 |
చ. | కొనఁటి మగండు తానగుటకుం దగ, నంగవికారి మూర్ఖు నె | 233 |
క. | ఇతఁడు సుకుమారమూర్తి వీఁ డెవ్వడొక్కొ | 234 |
క. | ఆవేళ కల్పనుందరి | 235 |
వ. | అవ్విధం బెట్టిదనిన నీ విభుతో ననుకూలవై నీ కురూపత్వంబు మానునట్లుగా హోమంబు చేసి యాదేశంబు నీవిచారం బగ్నిదేవునకు విన్నవించిన సురూపవంతుండ వగుదువని యొకతపస్వి నాకుం జెప్పె నేకాంతంబున నియ్యంతఃపురిం జేరు మనుమనినఁ గల్పనుందరి యియ్యకొని విభున కట్ల యెఱింగించుటయును. | 236 |
క. | సుకుమారత్వము గలుగును | 237 |
సీ. | విప్రవర్గము హోమవిధి సేయ నంతిపు | |
| నాప్రహారవర్మ నణఁగించు తెఱఁగును | 238 |
క. | కరవాలు పట్టుకొని నే | 239 |
వ. | అవ్విధం బాచరించి హోమకుండంబుగప్పి కల్పసుందరికి భయంబు | 240 |
చ. | జనపతి హోమమార్గమునఁ జక్కనిరూపము దాల్చెనంచు భూ | 241 |
క. | అనుటయు వికటుం డీతం | 242 |
వ. | ఏనును మజ్జనకుండైన ప్రపహారవర్మం బట్టంబుగట్టి యువరాజునై రాజ్యం బనుభవించుచుండి సఖుండైన చండసింహునికి సహాయుండనై చండవర్మం జంపి నిన్నుఁ బొడగంటిననిన సంతోషించి యర్థపాలునిం జూచి యిట్లనియె. | 248 |
క. | ననుఁ బాసి యెందుఁబోయితి | 244 |
గీ. | నామ(మునఁ బూర్ణచంద్రుఁ డనంగ[6]) నుర్విఁ | 245 |
గీ. | ఏను రాజహంసు హితముంత్రి యగుధర్మ | 246 |
వ. | కామించి దూతిముఖంబునఁ దదీయవృత్తం బెఱింగి చోరమార్గంబున నక్కన్యం బొందుచుందునని చెప్పె నంత. | 247 |
క. | నిర్భరముగాఁగఁ గన్యక | 248 |
గీ. | పోయి యక్షకన్య పుత్రునిగాఁ బెంచి | 249 |
క. | ఆకామపాలుఁ డిటువలె | 250 |
వ. | భేదింపుండని పంపిన శస్రపాణులు డగ్గఱునంతలోనఁ గాంతిమతి పుత్రుం డక్కామపాలుని తనయుండు గావున నొక్కనాగంబు గొనివచ్చి కామపాలు దగ్గఱ విడిచి కఱచెనని విష మెక్క మంత్రించి యప్పుడు. | 251 |
గీ. | రాజు పుణ్యుఁ డగుట ప్రాశాన కలుఁగక | 252 |
క. | అని కామపాలుపత్నికి | 253 |
సీ. | ఆరాత్రి పూర్ణచంద్రుఁడాఖ్యుఁడు నేనును | |
| యనిన సంతసించి యారాజవాహనుం | 254 |
క. | నే నట వింధ్యాచల భయ | 255 |
గీ. | అరుగుదేర హస్తి యను పురంబున కేగి | 256 |
గీ. | ఎవ్వరును లేరు నాకు నియ్యిందువదన | 257 |
వ. | నేఁ దిరిగివచ్చునంతకు దీని బోషింపుఁడనుచు నప్పగించి చనిన నభ్భూపాలుండును నన్ను నంతఃపురంబున కనిచి దేవికి సమర్పించుటయును. | 258 |
క. | దేవియుఁ దనయాత్మజకు మ | 259 |
సీ. | అంతట సుతకు స్వయంవరోత్సవము భూ | |
| నృపతి తనరాజ్య మిచ్చి నన్ను పచరింప | 260 |
వ. | దైవబలంబునకును సంతసించినవాఁడై, మంత్రగుప్తునిం జూచి నన్నుఁ బాసి నీ వెచ్చట నేమి చేసితనిన నతం డిట్లనియె. | 261 |
గీ. | దామలిప్త(ముగలపురిఁ)పురంబునఁ[7] | 262 |
క. | అక్కన్యక యవ్వని నే | 263 |
తరల: | కలము వట్టుక యేను దైవముకతనఁ బ్రాణము గల్గి య | 264 |
వ. | అద్దానవి యిట్లనియె. | 265 |
క. | ఈలాగున నేటికి నీ | 266 |
క. | కామినులు పాపములకున్ | 267 |
సీ. | పుడమి నింద్రిక్తతాఖ్యపురమున విప్రులు | |
| నంబువర్ధిఁ ద్రావ నధిపతి నందులో | 268 |
క. | పాపము గట్టకు తల్లివి | 269 |
గీ. | మొఱ్ఱవెట్టి పతిని మొండిగాఁ జేసిన | 270 |
వ. | అమ్మొండివానిచేత నావృత్తాంతం బెఱిఁగి రాజానుమతంబున నాజంత కర్ణనాసిచ్చేదనంబు చేసి వెళ్ళగొట్టిరని మఱియును. | 271 |
సీ. | రమణీయమగు మధురాపురంబునఁ గాల | |
| యనిన నక్కాంతచెలి పోయి యంగనకునుఁ | 272 |
వ. | లోనికిఁ జని తెరయవ్వలం గామిని నునిచి పాదంబు చాఁపుమనిన నది యట్లచేసిన. | 273 |
గీ. | చేతి చిఱుగత్తి నూరువు చించి కాలి | 274 |
వ. | అదలించి శూలంబునం బొడిచి కాలియందియ వుచ్చికొంటిని యిదెయందియ తదూరుదేశంబు ఘాతయుం జూడుఁడనిన నక్కాలకంటకుం డది వీక్షించి దానినడవికిం గొని చని గళంబునఁ బాశంబు దగిలించి పోవుటయును. | 275 |
గీ. | సిద్ధుఁ డచ్చటికినిఁ జేరి రజ్జువు ద్రెంచి | 276 |
వ. | అని చెప్పిన కందుకావలిం బొందు మాయోపదేశంబు చేసి రాక్షసి చనియె నేనును నక్కందుకావతిని భోగించి దానితండ్రిం జంపి యతనిరాజ్యమున కభిషిక్తుండనై సింహవర్మకుఁ దోడు వచ్చి నిన్ను బొడగంటిననియె నంత. | 277 |
సీ. | మాతృగుప్తుండను మంత్రివుత్రునిఁజూచి | |
| నచ్చటనె పెట్టి నిన్ను రమ్మనియె సిద్ధు | 278 |
వ. | ఆభూపాలుం డాత్మకాంతకు భూతప్రవేశం బైనదని రక్షావిభూతు లరయుచో నేనొక యతినై రక్షోఘ్నమంత్రం బుపదేశించెదనని రాజునకు విన్నపంబు సేయించి యూరివెలుపలి పద్మాకరంబున మధ్యరాత్రి స్నానంబు సేయ వినియోగించి యప్పు డభ్భూపాలునిం జూచి యిట్లంటిని. | 279 |
క. | నీమంత్రుల కెఱింగించి మ | 280 |
గీ. | నీరు చొరని పెద్దనీరాటిలోఁ జొచ్చి | 281 |
క. | ఆరాజుపత్నిఁ బొంది య | 282 |
వ. | రాజవాహనుండు విశ్రతుం డనువానిం జూచి నీ వెందు వోయితనిన నతం డిట్లనియె. | 283 |
క. | చూపట్టెడు వింధ్యాటవిఁ | 284 |
గీ. | ఆధరామరేంద్రు నంధువు వెడలించి | 285 |
వ. | వసంతభానుండను రాజు అనంతవర్మయను రాజుం గెల్వ నిశ్చయించు సమయంబున వసంతభాను ననుంగుమంత్రి చంద్రపాలుండు కపటోపాయంబునఁ దండ్రితో నలిఁగివచ్చినవాఁడై యనంతవర్మ ప్రధానుండైన విహారభద్రుండు కార్యసహాయుండుగా ననంతవర్మం గొలిచియుండినంత. | 286 |
చ. | వఱలు ననంతవర్మనృపు వశ్యునిఁగా నొనరించి దుష్టతల్ | 287 |
గీ. | అన వసంతభానుఁ డాజికి నరుదేరఁ | 288 |
వ. | ఇవ్విధంబున ననంతవర్మం జంపి వసంతభానుండు రాజ్యంబు గైకొని పాలింపుచున్న చంద్రపాలుం డప్పుడు. | 289 |
ఉ. | ఆజి ననంతవర్మ తెగటారిన నీపరివార మెల్ల న | 290 |
క. | పరివారము వాఁడై తా | 291 |
గీ. | ఇట్లు మాహిష్మతిపురి కేగి యందు | 292 |
వ. | తత్పుత్రు వధియింపందలచిన నయ్యనంతవర్మదేవి తనపుత్రుండైన వీని నా కప్పగించి రక్షింపుమనిన వీనిం గొనివచ్చి యీనూఁతికడ జలపానార్థంబు డిగ్గి యీనూఁతం బడి నీచేత నుద్ధరింపంబడితినని యిట్లనియె. | 293 |
క. | నీ వామాహిష్మతిపురి | 294 |
సీ. | మారణమంత్ర సమర్శకంబగు నొక్క | |
| నంత వసురక్షితుఁడు (కాంత) ననుభవింప | 295 |
వ. | అద్దివసంబుననే నాడీజంఘుండను విప్రుండు కుమారునిం గొనితెచ్చె; పరివారంబును నద్దేవి మహాపతివ్రతయని సంతోషించిరి; నేనును నారాజపత్ని మేనత్తయగుట తదీయపుత్రునిం బట్టంబు గట్టి రాజ్యంబు సేయుచుండునంత. | 296 |
గీ. | ఆవసంతభానుఁ డామిత్రవర్ముని | 297 |
వ. | మాహిష్మతీ విదర్భాపురంబు లేలింపుచు సింహవర్మకు సహాయుండనై వచ్చి యిట మిమ్ముఁ బొడగంటిననిన సంతోషించి యాత్మీయంబైన కుమారదశకంబునుఁ గూర్చుకొని తదీయరాజ్యసహితంబుగ రాజవాహనుండు స్వకీయంబైన కుసుమవతీపురం బేలుచుండి. | 298 |
క. | అని నారదుండు మఱియును | 299 |
ఉ. | పుణ్యుఁ డశోకదత్తుఁడను భూసురవర్యుఁడు గాంచె భీకరా | 300 |
గీ. | కాంచి యందు నొక్కకనకపంకేరుహ | 301 |
క. | జడనిధి పాథఃపూరము | 302 |
సీ. | అని చెప్పి నిజారాక్షసాకృతి నెడఁబాసి | |
| విధివశంబున నొకవటవృక్ష మబ్ధి | 303 |
జలధరవృత్తము. | వెఱవకయుండుము విప్ర యటంచున్ | 304 |
గీ. | విప్రుఁబొడ గాంచి యచటికి వేఁగ వచ్చి | 305 |
వ. | అంత. | |
క. | సాంద్రతరస్మితనిర్జిత | 306 |
వ. | అప్పుడు. | 307 |
గీ. | జగతిసురునిఁ జూచి చంద్రప్రభయు మది | 308 |
క. | శశిఖండుండు మజ్జనకుఁడు | 309 |
వ. | అట్లు గావున మదీయగృహంబున కరుగుదెమ్మని తోఁకొనిచని పూజితుం జేసి యవ్విప్రున కిట్లనియె. | 310 |
గీ. | శాపముక్తి మనుజసంగతి గల్గు మీ | 311 |
వ. | అందు గర్భంబు దాల్చి చంద్రప్రభ యాశక్తిదేవున కిట్లనియె. | 312 |
సీ. | విప్రదత్తుండను విప్రుండు జాబాలి | |
గీ. | మిప్పు డొనరింపు మనిన నయ్యిందువదన | 313 |
చ. | కరకమలంబు చాఁప నది ఖడ్గగతిన్ నిజముష్టి నొందినన్ | 314 |
క. | విద్యాధరుఁడై నలువురు | 315 |
ప్రగుణవృత్తము: | నృపతిన్ వత్సా | 316 |
వ. | అంత. | 317 |
చ. | హిమగిరి వజ్రనాథశిఖరేశుఁడు వజ్రశిఖాశరీరి వ | 318 |
క. | ఆద్యుఁడు సూర్యప్రభుఁడను | 319 |
వ. | ఆసూర్యప్రభుచరిత్రంబు వినుపించెద వినుమని యిట్లనియె. | 320 |
క. | చంద్రప్రభుఁడను రిపునృప | 321 |
వ. | అక్కాలంబున. | 322 |
గీ. | మయుఁడు చంద్రప్రభుని సభామంటపమున | 323 |
క. | వచ్చి ధరణీవరుచే | 324 |
చ. | అనిన మయుండు పల్కె సుగుణాకర రుద్రమఖంబు చేసి య | 325 |
క. | అని మయుఁడు పలుకు పలుకులు | 326 |
క. | శుభమూర్తంబున సూర్య | 327 |
సీ. | అట్లు సూర్యప్రభు నతలంబునకుఁ గొని | |
| బలియుఁ బ్రహ్లాదుఁడును మయుఁ బలుకుమనినఁ | 328 |
క. | అని దూత వోయి చెప్పిన | 329 |
చ. | మయుఁడు పురారిసత్కృప నమర్త్యవిభీషణమైన సాయకో | 330 |
వ. | అంత. | 331 |
క. | దివసకరుఁ డస్తమించిన | 332 |
గీ. | ఆజిఁ జాలించి యంత సూర్యప్రభుఁడు | 333 |
సీ. | విక్రమసేనభూవిభుఁ డవంతీశుఁ డా | |
| నట్టిసచివుఁడు విభుకృపాప్రాపుఁ డగుచు | 334 |
క. | మఱుపడ పతిముందటఁ గొ | 335 |
ఉ. | ద్రోహి ప్రధాని యంచు తలద్రుంచగ పంచిన వాఁడు మున్నె యా | 336 |
క. | అని చిత్రకథలు హితునకు | 337 |
క. | శౌర్యతరవిమతశిక్షా | 338 |
దోదకవృత్తము: | వాసవుఁ డాశ్రుతవర్మనుఁ గొంచున్ | 339 |
వ. | మఱియును. | 340 |
చ. | హరవరలబ్ధశక్తి నమరాధిపతిన్ శ్రుతవర్మతోడ సం | 341 |
వ. | అని యుపన్యసించి. | 342 |
ఉ. | శ్రీసుదతీకపోలతలచిత్రలతాపరిణద్ధసద్యశో | 343 |
క. | వరవిభవ కుంటముక్కుల | 344 |
మత్తకోకిల: | కంటకప్రతిపక్షదానవఖండనస్ఫుటమండనా | 345 |
గద్య. | ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు చతుర్థాశ్వాసము. | |