సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశపు ఖనిజసంపద II
ఆంధ్రదేశపు ఖనిజసంపద II : తెలంగాణము : కృష్ణా గోదావరీ తీరములు తప్ప తెలంగాణ మంతయు స్ఫటమయ విభాజీయ శిలలతో నిండియున్నది. గోదావరీ వర్ధానదుల పొడుగునను గోండ్వన శిలలు, వీటి ప్రక్కన, కృష్ణాతీరమున, కడప, కర్నూలు శిలలును కలవు. గోండ్వన శిలలనుండి బొగ్గు, ఇనుప గంధకిదము, కట్టడవురాళ్ళు. కొలిమిసుద్ధ- కర్నూలు శిలలనుండి సీమెంటుకు సున్నపురాళ్ళు, షాహాబాదు బండలు, కట్టడపురాళ్లు, తెల్లసుద్ద, పలక – స్ఫటమయ విభాజీయ శిలలనుండి కట్టడపురాళ్ళు, ఇనుపరాళ్ళు, పలుగురాయి, ఫెల్స్ఫార్, రాచిప్పరాయి, సర్పేన్ టీన్, క్రోమైట్, గ్రాఫైట్, అభ్రకము, మెరుగుడు ఖనిజములు, సీసము, రాగి - లేట రైట్లనుండి ఖనిజపు రంగులు లభించుచున్నవి. 1954 లో తెలంగాణమునందు ఉత్పత్తియైన ఖనిజముల విలువ సుమారు 3.34 కోట్ల రూపాయలు. దీనిలో బొగ్గు విలువయే రు. 3.16 కోట్లు. ఇచ్చటి ఖనిజసంపద దిగువన సూచింపబడినది.
బొగ్గు (Coal) : వర్ధ గోదావరీనదుల వెంబడి తెలంగాణములో 3,600 చదరపు మైళ్ళు వ్యాపించిన గోండ్వన శిలలయందు బొగ్గుపొర లనేక ప్రదేశములందు కనుగొనబడినవి. కాని ఈ రాళ్ళలో బొగ్గు ఎంతయున్నది సంపూర్ణముగ పరీక్షింపబడలేదు. ఖమ్మము మెట్టుజిల్లా పాలవంచ తాలూకాలో కొత్తగూడెం, ఇల్లిందలు తాలూకాలో సింగరేణి, ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాదు తాలూకాలో తాండూరు గనులనుండి బొగ్గు విరివిగా (14½ లక్షల టన్నులు) ఉత్పత్తి యగుచున్నది. ఈగనులయందు 15 వేలమంది కార్మికులు పనిచేయుచున్నారు. ఈ ప్రాంతమున సుమారు 100 కోట్ల టన్నులు బొగ్గు గలదని లెక్క వేసిరి. ఈ బొగ్గు ఉక్కు పరిశ్రమలో ప్రస్తుతము వాడబడు 'కొకింగ్' (coking) రకము కాదు. ఇది ముఖ్యముగ రైలు ఇంజన్లలోను, విద్యుత్ నీమెంటు, జాడీ, పింగాణీ, బట్టల పరిశ్రమలు మున్నగువాటిలోను దక్షిణ భారత దేశమునం దెల్ల వాడబడుచున్నది. హైదరాబాదు లోని కేంద్ర పరిశోధనాలయ కృషివలన, దీనినుండి పొగ లేకుండా ఎక్కువ వేడితోనుండు “కోలైసైట్(coalsite) తదితర పదార్థములు తయారగుచున్నవి. ఈ బొగ్గు యొక్క ఇతర ఉపయోగములుకూడ పరిశోధింపబడు చున్నవి.
సీమెంటుకు సున్నపురాళ్లు (Limestones for Cement) : సీమెంటు కుపయోగించు సున్నపురాళ్లు కర్నూలు శిలలలో విరివిగా కలవు. గుల్బర్గా జిల్లాలోని అసోసియేటెడ్ సీమెంటు కంపెనీల వారి షాహబాద్ సీమెంటు వర్క్సులో వాడు సున్నపురాళ్ళు హైదరాబాదు జిల్లా తాండూరు, వికారాబాద్ తాలూకాలనుండియు, మహబూబ్ నగరు జిల్లా కొడంగల్లు తాలూకా నుండియు కూడ లభించు చున్నవి. ఇట్టి రాళ్ళు మహబూబ్ నగరుజిల్లా అలంపూరు, కొల్హాపూరు తాలూకాలలోను, నల్లగొండజిల్లా మిరియాలగూడ, హుజూర్ నగరు తాలూకాల యందును, కరీంనగరు జిల్లాలో సుల్తానాబాదు తాలూకాయందును, ఆదిలాబాదు జిల్లాలో ఆదిలాబాదు, ఆసీఫాబాదు తాలూకాలయందును ఎక్కువగా నున్నవి.
కట్టడపురాళ్ళు (Building stones) : తెలంగాణములో విలువయైన కట్టడపురాళ్ళగు గ్రానైట్లకు కొరతలేదు. హైదరాబాదులోని లింగంపల్లి గనుల గ్రానైట్లతోనే బొంబాయి హార్బరును, ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనములను నిర్మించిరి. కర్నూలు సంహతికిచెందిన చక్కని సున్నపురాళ్ళు, షాహబాదు బండలు (చపటలు) తీయు గనులు పైన పేర్కొనిన ప్రాంతములలో ననేక చోట్ల గలవు. కర్నూలు, గోండ్వన శిలలలో కట్టడములకు ఉపయు క్తమగు క్వార్ట్ జైట్లు, ఇసుక రాళ్ళు చాలయున్నవి. మేలువన్నెలుగల పాలరాళ్ళు ఖమ్మము మెట్టుజిల్లా మధిర, ఖమ్మము మెట్టు, ఇల్లిందల తాలూకాలలో స్ఫటమయ శిలలయం దచ్చటచ్చట లభ్యమగును. గ్రానైట్లలో గోడలవలె (Dykes) ఏర్పడిన నల్లటి స్ఫటమయ శిలలుకూడ వరంగల్లు కోటలోను, నల్ల గొండజిల్లాలో సూర్యాపేట సమీపమున నున్న పిల్లలమర్రిలోను చెక్కడములకు వాడబడినవి.
సున్నపుకంకర ముఖ్యముగ హైదరాబాదు జిల్లాలో తూర్పు పశ్చిమ తాలూకాలు, షహాబాదు, ఖమ్మము మెట్టు తాలూకా లలోను, ఇసుక, నదులనుండి, పెద్ద వాగులనుండి లభించుచున్నవి.
ఇనుపరాళ్ళు (Iron ore) : ధార్వాడ శిలలనుండి విడివడిన ఇనుప రాతిగుండ్లను (float ore) ఇనుము నూటికి 55–65 పాళ్ళు) ఖమ్మముమెట్టు తాలూకాలో అప్పనరసింహపురము, ఇల్లిందల తాలూకాలో బయ్యారం మున్నగు చోట్ల 1954 నుండి త్రవ్వ మొదలిడిరి. ఈ సంహతికి చెందిన తక్కువరకపు ఇనుపరాళ్ళు (ఇనుము 35-40 పాళ్ళు) కరీంనగరుజిల్లా హుజూరాబాదు తాలూకాలో యడవల్లి ప్రాంతమున, జగ్తియాల తాలూకాలో ఛందోలి, ఆదిలాబాదు జిల్లా ఖానా పూర్ తాలూకాలో చిత్యాల, కల్లెడ, దస్తూరబాదు వద్ద సుమారు 4 కోట్ల టన్నులుండును. వీటినుండి ఉక్కు చేయు విధానమును రాష్ట్ర ప్రభుత్వము పరిశీలింప జేయుచున్నది.
పలుగురాయి(Quartz) ఫెల్స్ఫార్ (Felspar) : హైదరాబాద్ పశ్చిమ తాలూకా పెగ్మటైట్లనుండి పలుగురాయి, ఫెల్స్పార్ కొంత హైదరాబాదు గ్లాసు పింగాణీ పరిశ్రమలలో వాడబడుచు, కొంత బొంబయి మున్నగు బయటి కేంద్రము లకు పంపబడుచున్నది. ఈ ఖనిజములు మహబూబ్ నగరు జిల్లాలో షాద్ నగరు, మఖ్తల్, నల్లగొండ జిల్లాలో మిరియాలగూడ, దేవరకొండ తాలూకాలలోను. మెదకు జిల్లాలో చాలచోట్ల పెగ్మటైట్లనుండి లభ్యమగును,మహబూబ్ నగరు జిల్లా కొడంగల్లు తాలూకాలో శుద్ధమగు క్వార్ట్ జెట్లు, ఇసుక రాళ్ళుకూడ నున్నవి.
చవిటిసోడా (Saline efflorescence) : మ ఖ్తల్ తాలూకాలో చాలచోట్ల, దేవరకొండ తాలూకాలో పెద్దసర్లపల్లి, గోండ్లపల్లివద్ద చేయుచున్నారు.
తెల్లసుద్ద (Kaolin) కొలిమిసుద్ధ (Fireclay): పింగాణి పరిశ్రమ కుపయోగించు తెల్లసుద్దను మెదకు జిల్లా జహీరా బాదు తాలూకాలో షైఖాపూరు, హైదరాబాదు జిల్లా తాండూరు తాలూకాలో గింగుర్తి. మహబూబునగరు జిల్లా పరిగి తాలూకాలో శ్రీరంగాపురం, కుందుర్గు వద్ద వేర్వేరు రాళ్ళనుండి త్రవ్వుచున్నారు. నల్లగొండజిల్లా హుజూరునగరు తాలూకాలో చింత్రియాలవద్ద కర్నూలు సుద్ద రాళ్ళలో (Shale) 80 వేల టన్నుల తెల్లసుద్దగలదని అంచనా వేసిరి. వరంగల్లు జిల్లా పాకాల (నర్సంపేట) తాలూకాలో మద్దిగూడెం, ఖమ్మము మెట్టుజిల్లా ఇల్లిందల తాలూకాలో మిరియాల పెంటవద్దకూడ తెల్లసుద్ద కొద్దిగా దొరకును.
ఆదిలాబాదు జిల్లా ఆసీఫాబాదు తాలూకాలో పచ్ గాంవ్ ప్రాంతమున గోండ్వన శిలలయందున్న మేలురకపు కొలిమి సుద్ద రాళ్ళ పేటవద్ద త్రవ్వబడుచున్నది. ఈ సుద్ద పచ్ గాంవ్ వద్దనే 50 లక్షల టన్నులు, బుత ర్మల్ వద్ద 2 లక్షల టన్నులు గలవని లెక్క వేసిరి.
రాచిప్పరాయి (Steatite): కరీంనగరు తాలూకాలో మక్దుంపూరు, ఖమ్మముమెట్టు జిల్లా ఇల్లిందల తాలూకాలో రాగబోయినగూడెం మున్నగుచోట్ల స్ఫటమయ విభాజీయ శిలలలో త్రవ్వు రాచిప్పరాయి అధిక భాగము శిర్పూరు పేపరు మిల్లులో తొట్లకు లోవైపు పేర్చుటకు వాడబడుచున్నది. కరీంనగరు జిల్లాలో మెట్టపల్లి, సుల్తానాబాదు తాలూకాలో తురకల మద్దిగుంట, నిజామాబాదు జిల్లా ఆర్మూరు తాలూకాలో ఛోటపల్లి, నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకాలో కొలకపల్లి, ఇల్లిందల తాలూకాలో జస్టయపల్లి వద్ద లభించు రాచిప్ప రాయితో జాడీలు, రాతి పాత్రలు మున్నగునవి చేయుదురు. మహబూబునగరుజిల్లా మఖ్తల్ తాలూకాలో అభంగ పట్టణము హైదరాబాదు జిల్లాలో ఆరేమట్ల, తామూరుల వద్దను మలినమగు రాచిప్పరాయి దొరుకును.
సర్పెన్ టీన్ (Serpentine): నల్ల గొండజిల్లా హుజూర్ నగరు తాలూకాలో బత్తులపాలెం, మహబూబ్ నగరుజిల్లా కలవకుర్తి తాలూకాలో జూపల్లివద్ద రాచిప్పలు చేయుటకు వాడబడుచున్నది.
ఖనిజపు రంగులు (Ochres): ఎర్ర సుద్ధ మెదకుజిల్లా జహీరాబాదు తాలూకాలో షైఖాపూరువద్దను, పచ్చ సుద్ధ హైదరాబాదు జిల్లా వికారాబాదు తాలూకాలో నై దాలి పుర వద్దను, దక్కన్ లావాలపై (ఇష్టి కాశిల) (లేటరైట్లలో) త్రవ్వబడు చున్నది.
క్రోమైట్ (Chromite) : మధిర తాలూకాలో ప్రవేశించిన కొండపల్లి కొండలలో క్రోమైట్ అచ్చటచ్చట గలదు. 1954 లో దెందుకూరు వద్ద దీనిని త్రవ్వ నారంభించిరి.
గ్రాఫైట్ (Graphite): గ్రాఫైట్ ఖమ్మంమెట్టు జిల్లా పాలవంచ తాలూకాలో గుండ్లమడుగు, మందులబుడవ మున్నగుచోట్ల గార్నెట్లో తొ కూడిన నైసులలో 2 అడుగులలోపు మందముగల నాళములనుండి లభించుచున్నది. గంధకము (Sulphur) : తాండూరు, కొత్తగూడెం, బొగ్గుగనులనుండి ఉత్పత్తియగు బొగ్గులో పొరలమధ్యన అక్కడక్కడ నుండు ఇనుపగంధకిదమును (pyrite) ఏరి తీయుదురు. తాండూరు గనులవద్ద ఈ రీతిని ఒక్క బొగ్గు పొర (seam) నుండియే ప్రతినెలా 40 టన్నుల గంధకిదము దొరుకుచున్నది.
అభ్రకము (Mica) : కెంపు వన్నెగల మస్కోవైట్ అభ్రకము ఖమ్మముమెట్టుజిల్లా పాలవంచ తాలూకాలో పూజారి మొక్కొడివద్ద, మధిర తాలూకాలో కల్లూరు సమీపమునను, హాన్ బ్లైండ్ అభ్రక నైసులను చొచ్చిన పెగ్మటైట్లలో లభ్యమగును.
పలక (Slate): ఇల్లిందల తాలూకాలో తుమ్మల చిలకవద్దను, నల్లగొండజిల్లా మిరియాలగూడ తాలూకాలో వజీరాబాదువద్దను పలకలు కోయుటకు వీలయిన గట్టి సుద్దరాళ్ళు గలవు.
మెరుగుడు (Abrasives) ఖనిజములు :- ఆభరణముల కుపయోగించు పారదర్శకమగు ఎరుపు గార్నెట్, కయ నైట్ పాలవంచతాలూకాలో గరిక వేట, కాకెర్ల ప్రాంతముల లభించును.
పాలవంచ తాలూకాలో రంగాపూరువద్ద 2500 టన్నుల కురువిందము సయనైట్లలో గలదు. ఇది మిరియాలగూడ తాలూకాలో పెద్దగూడెము ప్రాంతమున, ఖమ్మము మెట్టు తాలూకాలో గుబ్బగుర్తివద్దను, పాలవంచ తాలూకాలో కన్నెగిరి కొండలయందునుకూడ నున్నది.
వజ్రములు (Diamonds): ఆంధ్రదేశములో కొంతభాగ మొకప్పుడు, గోల్కొండ రాజ్యములో చేరి యుండెను. ఇక్కడి వజ్రములు గోల్కొండ మార్కెటు నుండి ప్రపంచమంతయు వ్యాపించుటచే, వీటికి గోల్కొండ వజ్రములని పేరువచ్చెను. పాతవజ్రపుగనులు కృష్ణ కుత్తరపు టొడ్డునను, మహబూబునగరుజిల్లాలోను చాలచోట్ల నున్నవి.
సీసము (Lead) : గెలీనా నల్లగొండజిల్లా దేవరకొండ తాలూకాలో పెద్ద అర్సిల్ల పల్లి, చిన్న అర్సిల్ల పల్లి చింతకుంట, మల్లెపల్లి, కొన్నెరిగూడెం, మిరియాలగూడ తాలూకాలో నందికొండవద్ద కాల్సైట్, పలుగురాతి నాళములలో కొద్దిగగలదు.
రాగి (Copper): పాలవంచ తాలూకాలో యాలం బయలువద్ద, నల్ల గొండజిల్లా హుజూర్ నగరు తాలూకాలో చింత్రియాలవద్ద, మహబూబ్ నగరుజిల్లాలోని గద్వాల, మక్తల్, అచ్చం పేట తాలూకాలలో కొన్ని చోట్ల పాత రాగి గనులున్నవి.
1954 లో తెలంగాణా ఖనిజోత్పత్తి ఉత్పత్తి (ట) విలువ (రు,) ఖనిజము జిల్లా. తాలూ వారి మొత్తము తాలూకావారి మొత్తము ఇనుము : కరీంనగరు.జి. హుజూరాబాద్-తా. 800 8,000 ఖమ్మముమెట్టు.జి. ఇల్లిందల 2,810 28,100 ' ఖమ్మము మెట్టు-తా. 86,099 39,709 8,60,990 8,97,090 క్రోమైట్ ఖమ్మము మెట్టు-జి. మధిర తా. 88 69 2,760 2.760 ఖనిజరంగులు: మెదకు-జి. జహీరాబాద్-తా. 85 1,700 హైద్రాబాదు-జి. వికారాబాదు-కా 100 185 2,000 8,700 516 గ్రాఫైట్ : ఖమ్మముమెట్టు.జి. ఆంధ్రదేశపు ఖనిజసంపద - 11 పాలవంచ-తా, 28 28 2,150 2,150 తెల్లసుద్ద : మహబూబునగరు జి. పరిగి- తా. 2 2 కొలిమిసుద్ధ : ఆదిలాబాదు.జి. ఆసీఫాబాద్-తా, 715 715 7,394 7,894 పలుగురాయి : హైద్రాబాదు.జి. పశ్చిమ-తా. 8,666 3,666 78,820 78,820 పశ్చిమ-తా. 1,280 1,280 16,400 16,400 బొగ్గు: ఆదిలాబాదు.జీ. ఆసీఫాబాదు. తా. 4,72,882 1,08,78,579 ఖమ్మము మెట్టు-జి. ఇల్లిందల- తా. 1,45,440 పాలవంచ-తా. 8,89,785 14.58.187} 2,11,88,899 8,15,57,478 రాచిప్పరాయి : కరీంనగరు-జి. కరీంనగరు-తా. 75 4,787 ఖమ్మము మెట్టు-జి. ఇల్లిందల- తా. 10 85 150 4,887 సున్నపురాళ్లు ఆదిలాబాదు.జి. (సీమెంటుకు ఆదిలాబాదు-తా. 1,898 షాహాబాద్ ఆసీఫాబాదు-తా, 15,011 బండలు) కరీంనగరు.జి. సుల్తానాబాదు-తా. 1,910 మహబూబునగరు-జి. కొడంగల్లు–తా. 422 హైద్రాబాదు-జి. తాండూరు-తా. 87,882 వికారాబాదు-తా. 516 1,07,189 . | | | | 7,616 8,078 877 2,700 | | | 8.84,175 2,200 కట్టడపు రాళ్ళు, సున్నపుకంకర, ఇసుక (సగము వివరములు తెలియవు.) మొత్తం ఖనిజసంపద. 517 18,11,890 1,76,274 16,11.890+ (1,76,274×2) - - 19,68,988 8,80,441 8,29,25,620 2,29,606 8,29,25,820+ (2,28,606×2) (=8,88,84,882) లేక 8.34 కోట్లు ఎన్. వి. వి. యన్. డి.
[[వర్గం:]]