సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశపు ఖనిజసంపద 1

ఆంధ్రదేశపు ఖనిజసంపద 1: భారత దేశములో ఖనిజసంపద ఎక్కువగా గల రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ మొకటి. ఇచ్చట ముఖ్యముగ మాంగనీసు(Manganese-ore), అభ్రకము (Mica), కట్టడపురాళ్లు; సీమెంటుకు సున్నపురాళ్ళు (Lime-stones), రాతినార(Asbestos), ముగ్గురాయి (Barytes), లభించును. వీటి తరువాత ఖనిజరంగులు, తెల్ల సుద్ద (White-clay), రాచ్చిప్పరాయి (Steatite), క్రోమైట్ (Chromite), పలక రాళ్ళు (Slates), పలుగురాయి (Vein Quartz), ఫెల్ స్పార్ (Felspar), గ్రాఫైట్ (Graphite), చెప్పదగినవి. ఇవికాక, ఇనుము, కయనైట్ (Ryanite), సిల్లిమ నైట్ (Sillimanite), మోనజైట్ (Monajite), ఇల్ మ నైట్ (Ilmanite), గంధకము మున్నగునవి స్వల్పముగ దొరకును. 18వ శతాబ్దమువరకు ఆంధ్రప్రదేశము నుండియే, ప్రపంచపు మార్కెటులలోకి వజ్రములు ఎక్కువగ వచ్చుచుండెడివి. జగత్ప్రసిద్ధమగు కోహినూర్, హోప్, పిట్ లేక రీజంట్ వజ్రములు ఇక్కడ దొరకి నవే. అనంతపురము, చిత్తూరు జిల్లాలలోని బంగారు గనులనుండి ఈ శతాబ్దములో సుమారు 1,85,300 ఔన్సుల బంగారు లభించినది. ఈ రాష్ట్రములో 1954 వరకు రూ.17,00,00,000 ల విలువగల ఖనిజములు త్రవ్వబడినను, వీటి నిధులు ఇంకను అధికముగ తరుగ లేదు. 1946 నుండి 54 వరకు ఏటా సగటు రూ. 1,08,00,000 విలువగల ఖనిజములు ఇక్కడ ఉత్పత్తియైనవి. తగు పరిశోధనవలన ఆంధ్రలో ముఖ్యముగ బొగ్గు, బంగారు, వజ్రములు, కురువిందము (Corundom), గ్లాసు ఇసుక, రాగినిధులు కనుగొనబడి, ఖనిజోత్పత్తి పెరుగు సావకాశమున్నది. ఈ ఖనిజము లన్నియు, ఇంతవరకు ఎక్కువగ పరదేశములకును, కొంత వరకు ఇతర రాష్ట్రములకును ఎగుమతి యగుచున్నవి. వీటిని ఆధారము చేసికొని, ఆంధ్రలో అనేక పరిశ్రమలు నెలకొల్పవచ్చును.

ఖనిజములనుండియే మనము వాడుకొను లోహములు, అనేక ఇతరవస్తువులు, పారిశ్రామిక చరిత్రలో క్రొత్తయుగమునకు దారితీయు అణుశక్తియు (Atomic Power) ఉత్పత్తి అగుచున్నది. ఈ ఖనిజములు, ఖనిజ మిశ్రమములగు రాళ్ళలో కొన్ని చోట్ల నిధులుగ నేర్పడినవి. మరికొన్ని చోట్ల రాళ్ళలో తక్కువపాలున్నను, వీటిని భౌతిక పద్ధతిచే సం కేంద్రీకరించి, లాభకరముగా విడదీయ వచ్చును. ఆంధ్రలో మాంగనీసు, అభ్రకము, క్రోమైటు, గ్రాఫైట్ నిధులు స్ఫటమయ విభాజీయ శిలలలోను (Crystalline Rocks and Schists), రాతినార, ముగ్గురాయి, సున్నపురాళ్ళు, రాచిప్పరాళ్ళ నిధులు, కడప కర్నూలు, యుగములలో సముద్రమునందేర్పడిన రాళ్ళలోను గలవు. మొదటివి సముద్రతీరపు జిల్లాలలోను, పశ్చిమ దక్షిణ సరిహద్దులలోను, రెండవరాళ్ళు పశ్చిమ జిల్లాలలో పెక్కు భాగములలోను, వ్యాపించి యున్నవి.

ఈ దిగువ ఆంధ్రలోని ఖనిజసంపద స్థూలముగ వివరింపబడినది. వీటి నిధుల పరిమితి తెలిసినంతవరకు తెలువ బడినది.

మాంగనీసు  : భారత దేశములో 1900 కు పూర్వము మాంగనీసును శ్రీకాకుళం జిల్లాలోనే త్రవ్విరి. ఇక్కడ పెద్ద నిధులు చీపురుపల్లె తాలూకాలో కోడూరు, గర్భ, మున్నగుచోట్ల నున్నవి. ఒక్క కోడూరు నిధులలోనే 2½ లక్షల టన్నుల ధాతువు (ore) కలదు. వీటిలో మాంగనీసు నూటికి 47 పొళ్ళు, గర్భ నిధులలో 45 పాళ్ళు, అన్నిటిలో సగటున 42 పాళ్ళు కలదు. ఈ నిధులు, మాంగనీసు ఖనిజములు అధికముగాగల కోడూ రైట్ (Kodurite). రాళ్ళ శైథిల్యమువల్ల నేర్పడినవి. వీటిలోని ఖనిజమును భౌతిక పద్ధతులచే సం కేంద్రీకరించి దీనితో కూడిన భాస్వరమును (Phosphorus) పరిమితిలో నుంచ గలిగినచో త్రవ్వదగిన నిధులు అధికమగుటేగాక, దీని ధరకూడ పెరుగగలదు. భారతదేశములో ఉత్పత్తియగు మాంగనీసు చాలభాగము పరదేశములకు ఎగుమతి యగు చున్నది. కొంత ఉక్కు పరిశ్రమలలో ఫెర్రో మాంగనీసు (Ferro - Manganese) అను లోహమిశ్రమముకును, మరికొంత గ్లాసు పరిశ్రమలోను, డ్రైబాటరీలలోను వాడు డయాక్సైడ్ (Dioxide) ను చేయుటకును, వినియోగించు చున్నారు.

అభ్రకము (Mica)  : అభ్రకపుగనులు నెల్లూరుజిల్లాలో ముఖ్యముగ రాపూరు, గూడూరు, పొదలకూరు, ఆత్మ కూరు, కావలి, పరిసరాలలో నున్నవి. పెక్కు గనులు 300 అడుగులలోతు మించినవి. పా గనిలో 900 అడుగుల లోతున పనిచేయుచున్నారు. ఇక్కడ మస్కోవైట్ (Mus-covite) రకపు అభ్రకము, అభ్రకహా౯ బ్లెండ్ విభాజీయశిలలను (Mica and Hornblende Schists) చొచ్చిన పెగ్మటైట్లు అను (Pegmatites) వెడల్పగు నాళములలో (Veins) పుస్తకములరీతిని దొరకును. పెగ్మటైట్లు పలుగు రాయి, ఫెల్ స్పార్, అభ్రకముల సమూహము, వీటిలో కొద్దిగ, టూర్మలీన్ (Tourmaline), గార్నెట్ (Garnet) అపటైట్ (Apatite) బెరిల్ (Beryl), జిర్కా౯ (zircon), ఖనిజములుండ వచ్చును. ఈ రాతిలో అభ్రకము నూటికి సుమారు 6 పొళ్ళుండి త్రవ్వినమీద అమ్మదగిన భాగము ఒక్కపాలు తేలుసు. అభ్రకపుస్తకములు కొన్ని అంగుళములనుండి కొన్ని అడుగుల వరకు వెడల్పు గలిగి యుండును. పలుచని రేకులు రంగులేనివై యుండును. నెల్లూరు అభ్రకపుస్తకములు ఆకుపచ్చవన్నె గలిగి "గ్రీ౯ మైకా" అని పేరుపొందినవి. బీహార్ లో దొరకు "బెంగాల్ రూబీ" అను ఎరుపువన్నెగల అభ్రకము ఇచ్చట కొన్నిచోట్ల స్వల్పముగ లభించును. ఈ పెగ్మటైట్లు 60 మైళ్ళ పొడవున 15 మైళ్ళ వెడల్పున గూడూరు, నెల్లూరు, సైదాపురము, ఉదయగిరి మున్నగు పట్టణ ప్రాంతములలో వ్యాపించి యున్నవి. ఇవి సాధారణముగ 1000 అడుగుల పొడవు, నూరు అడుగుల వెడల్పును మించవు. చిన్న మస్కోవైట్ నిధులు కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలోను, ఫ్లాగొపైట్ (Pholgopite) రకము విశాఖపట్టణం జిల్లాలోని కూడియా,మాజీ గూడెం, బొర్రా మున్నగుచోట్ల కలవు.

అభ్రకములో వేడి, విద్యుత్తు ప్రవహింపదు గనుక దీనిని ఎన్నో రీతుల వాడవచ్చును. భారతదేశములో ఉత్పత్తియగు అభ్రకములో 60, 70 హండ్రడ్ వెయిట్లు (3-3½ టన్నులు) తప్ప శేషించిన దంతయు పరదేశములకు ఎగుమతి యగుచున్నది. అంధ్రలో అభ్రకపు రేకుల నుండి మైక నైటును (Micanite) చేయ మొదలిడినచో అభ్రకోతృత్తి తిన్నగ సాగుచుండును. కాని ఇది భారత దేశములోని విద్యుత్పరికర పరిశ్రమలపై నాధారపడి యున్నది.

'కట్టడపురాళ్ళూ (Building stones) : స్ఫటమయ శిలలన్నియు గట్టి కట్టడపురాళ్ళు: వీటిలో స్ఫటికము (Quartz), ఫెల్ స్పార్, సూక్ష్మముగ ఇతర ఖనిజముల కణములతో నిండిన లేతరంగు రాళ్ళగు గ్రానైట్లు (Granites), నైసులు (Gneisses), అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోను, గార్నెట్ (Garnet) ఖనిజమువలన ఎర్ర చుక్కలుగల ఖోండలైట్లు (Khondalites), హైపర స్తీ౯ (Hypersthene) ఖనిజముల వలన కంచువాగుగల చార్నో కైట్లు (Charnokites) శ్రీకాకుళము. విశాఖపట్టణము, గోదావరి, కృష్ణా జిల్లాలలోను కట్టడములకు వాడబడు చున్నవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ భవనములను ఖోండ లైట్లతో కట్టిరి. విశాఖపట్టణముజల్లా, అనంతగిరి, మాడుగుల ప్రాంతమునను, గుంటూరుజిల్లా పల్నాడులోను పలురంగుల చక్కని పాలరాళ్ళు దొరకును.

పశ్చిమజిల్లాలలో కడప-కర్నూలు సహంతులకు (Cuddapah and Kurnool Systems) చెందిన క్వార్టుజైట్లు (Quartzites), ఇసుక రాళ్ళు, లైంస్టోన్లు విరివిగా వాడుదురు. కడపజిల్లాలో అణిమల, గండికోట, కర్నూలు జిల్లాలో రామల్లకోటవద్ద అద్భుత శిల్పకళాచాతుర్యమును చూపించు దేవాలయములను క్వార్టు జైట్లు, ఇసుక రాళ్ళతో కట్టిరి, లైం స్టోన్లలో పొరలులేని పెద్ద బండలను గోడలకు, “నాపరాళ్ళ”ను పలుచని చపటలను నేలపై పరచుటకు, అరుదుగ మిద్దెలకు నుపయోగింతురు. కొన్నిచోట్ల రాతిద్రవము (Magma) నుండి ఘనీభ

వించిన నల్లని స్ఫటమయ శిలలగు ట్రావ్ (Trap) లను కూడ వాడుదురు. రామల్లకోట దేవాలయములోని తులసికోట ట్రాపులో చెక్కబడినది.

సీమెంటుకు సున్నపురాళ్ళు (Lime-stone for cement):- సిమెంటు పరిశ్రమలో టన్నుకు 1-48 టన్నులు సున్నపు రాళ్ళు కావలెను. సీమెంటు కుషయోగపడుటకు, సున్నపు రాళ్ళలో సున్నము (Lime) 43 శాతము; సిలికా (Silica) 14.5 శాతము, లోహామ్ల జనిదములు (Iron Oxides) 1.5 శాతము, అల్యూమినా (Alumina) 3.5 శాతము పాళ్ళు సుమారుగా ఉండి, మెగ్నీషియా (Magnesia) 2.6 కు మించరాదు. కర్నూలు సంహతికి చెందిన సున్నపురాళ్ళు కడపజిల్లా కమలాపురం తాలూకాలో 64 కోట్ల టన్నులు, జమ్మలమడుగులో 300 కోట్లు, కర్నూలుజిల్లా కోయిలకుంట్ల తాలూకాలో 500 కోట్లు, బంగనపల్లెలో 66 కోట్లు, ద్రోణాచలములో 47.5 కోట్లు, కర్నూలులో 125 కోట్లు, నందికొట్కూరులో 77 కోట్లు టన్నులున్నవి. గుంటూరు కృష్ణాజిల్లాలలో కృష్ణ కిరుప్రక్కల యందును, గోదావరి లోయలోను, సిమెంటు కుపయోగపడు సున్నపురాళ్ళు చాల గలవు. గుంటూరు జిల్లాలో మంగళగిరి మున్నగు చోట్ల త్రవ్వు కంకర సిమెంటు పరిశ్రమలో వాడబడు చున్నది. వీటి నాధారము చేసికొని ఆంధ్రలో సిమెంటు పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి కాగలదు. ఈ పరిశ్రమలో టన్నుకు 0.42 టన్నులు కావలసిన బొగ్గు సింగరేణి నుండిగాని, తూర్పు రాష్ట్రముల బొగ్గుగనుల నుండిగాని తెప్పించుకోవలసి వచ్చును.

సీమెంటులో 4 శాతముగల హరణోఠము (Gypsum) నెల్లూరు జిల్లాలో సుళ్ళూరుపేట వద్ద పులికాటు సరస్సు నానుకొని నూరుమైళ్ళ వైశాల్యముగల పల్లపు భూమిలో చాలమేరగలదు. ఇచ్చట దీనికై శోధించబడిన 20 చదరపు మైళ్ళలో ప్రతి అడుగు లోతునకు 10 వేల టన్నులు గలదని లెక్క వేయబడినది.

52 శాతముకన్న ఎక్కువ సున్నము ఉన్న గుల్లరాయి (Calcareous Tufa) అనంతపురం జిల్లాలో కోన రామేశ్వరస్వామి వద్ద 3 లక్షల టన్నులు, మెత్తని పొడి కర్నూలుజిల్లా బంగనపల్లె తాలూకాలో నందవరం, వల్కూరు, రామతీర్థం వద్ద 8.8 లక్షల టన్నులు కలదు. ఇది గ్లాసు, పింగాణి, ఖటికము (Calcium) రసాయన పరిశ్రమలలోను, ఇనుప కొలుములలో ధాతువును కరగించుటకును ఉపయోగపడును.

రాతినార (Asbestos) :- రాతీవారలో కైజొటైల్ (Chrysotile) అను మృదువగు రకము, ట్రిమొలైట్ (Tremolite) అను బిరుసగు రకమును గలవు. వీనిలో విద్యుత్తు, వేడి ప్రసరింపవు గనుకను, దీనిపై ఆమ్లములు పనిచేయవు గనుకను, క్రై జొటైల్ నిప్పు అంటనిబట్టలకు, ట్రిమొలైట్ నిప్పు అంటని రంగులు, సిమెంటు రేకులు, 'స్విచ్ బోర్డులు మున్నగువాటికి వాడబడు చున్నవి. ఆంధ్రలో క్రై జొటైల్ నిధులు మాత్రమే ఇంతవరకు కనుగొన బడినవి. ఇవి కడపజిల్లా పులివెందల తాలూకాలో లింగాలనుంచి బ్రాహ్మణపల్లె వరకున్న 7 మైళ్ళలో, చిన్నకుడాల, బ్రాహ్మణపల్లె పరిసరాలలోనే కనీసము 2,56,000 టన్నులు, కమలాపురం తాలూకాలో రాజుపాలెం వద్దను, కలవు. ఇవి వేంపల్లె సున్నపు రాళ్ళలో ట్రావ్ పొరల నానుకొని 7 అంగుళముల లోపు మందముగల నాళములుగ నేర్పడియున్నవి. నార నాళముల కడ్డముగ 0.3 అంగుళములోపు పొడవుగ నుండును. ఈనారనుండి బట్టలనేత పరిశోధించ దగినది' ఇది ఎక్కువభాగము ప్రాంతీయ సిమెంటు రంగు పరిశ్రమలలో నుపయోగపడగలదు.

ముగ్గురాయి (Barytes) :- మన దేశములో కెల్ల పెద్ద ముగ్గురాతి నిధులు అనంతపురం జిల్లాలో కొండపల్లె, నెరిజాముపల్లె, ముత్సుకోట, కడపజిల్లా పులివెందల తాలూకాలో కొత్తపల్లె, తాళ్ళపల్లె, నందిపల్లె, వేముల, కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకాలో ఎర్రగుంట్ల, గట్టిమానికొండ, బలపాలపల్లె, బుక్కాపురం- బోయన పల్లె, రహిమాన్ పురం, రామాపురం, వలసల, హుస్సేన్ పురంవద్ద వేంపల్లె సున్నపురాళ్ళలోను, వాటిలో చొచ్చిన ట్రావ్ పొరలలోను, అడ్డదిడ్డముగ వ్యాపించిన నాళములుగ, పలుగురాతిలోకూడి పెద్ద నెర్రెలను (Fissures) నింపుచును ఉన్నవి. కొన్ని నిధులు 30 అడుగులు వరకు వెడల్పుండినను, నాళములు 7 అడుగుల మందము మించవు. వీటి వెడల్పు కొద్ది దూరములోనే హెచ్చు తగ్గులగుచు, ఇవి అంతమగుచుండును. ఇక్కడ లభించు ముగ్గురాయి 90 పాళ్లు లేత ఎరుపు వన్నెగలిగి యుండును. తెల్లని ముగ్గురాయి రంగులకును, వన్నె గలది నూనె (Petroleum) బావులలోను విరివిగా వాడ బడుచున్నది. మంచు తెలుపు ముగ్గురాయి బేరియం (Barium) రసాయనముల కుపయోగపడును, ఆంధ్రలో ముగ్గురాయి రంగు, బేరియం రసాయన పరిశ్రమలను పోషించగలదు.

ఖనిజరంగులు (Ochres) :- ఎర్రసుద్ద (Red Ochre) నిధులు తెల్లసుద్ద, పచ్చసుద్ధ (Yellow Ochre) లో గూడి కడపజిల్లాలో నందలూరు, కర్నూలు జిల్లాలో బేతంచర్ల వద్ద సుద్దరాళ్ళలో కలవు. ఎఱ్ఱసుద్ధ విశాఖపట్టణం జిల్లాలో అరకులోయలోను, గోదావరిజిల్లాలో కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రాంతమునకూడదొరకును. మెత్తని ఎర్రలోహా మ్లజనిదము (RedOxide) కడపజిల్లాలో చాబలి వద్ద, కర్నూలు జిల్లాలో రామల్లకోట, వెల్దుర్తి ప్రాంతములోను ఇనుపరాళ్ళతో కూడియున్నది. పచ్చ సుద్ధ నిధులు కర్నూలుజిల్లాలో ఉయ్యాలవాడ వద్ద 3¾ లక్షల టన్నులు తెల్లసుద్దతో కూడి రామల్ల కోటవద్ద 3½ లక్షల టన్నులు, బేతంచర్ల వద్ద 18 లక్షల టన్నులు, అంబాపురం వద్ద 20 లక్షల టన్నులు కలవు. కడపజిల్లాలో మిట్టమీదపల్లె, ఉప్పలపల్లె వద్దకూడా పచ్చ సుద్దనిధు లున్నవి. ఈ ఖనిజ రంగుల నుపయోగించుచు, ఆంధ్రలో రంగు పరిశ్రమ అభివృద్ధి చెందగలదు.

తెల్లసుద్ద (White Clay) :- తెల్లసుద్ద కడపజిల్లా రాజంపేట తాలూకాలో అనంతరాజుపేట, హస్తవరం, చిన్న వోరంపాడు, భాకరాపేట, కోడూరు, నందలూరువద్ద 15 లక్షల టన్నులు, కర్నూలు జిల్లాలో ప్రేమ, రామల్ల కోట, బేతంచర్ల పైబగల వద్ద 20 లక్షల టన్నులు కలదు, ఇది 1,200° సెం. నుంచి 1,300° సెం. వేడికి కరుగును. తూర్పు గోదావరి జిల్లాలో పుణ్య క్షేత్రం జగ్గంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, నెల్లూరు జిల్లాలో జానకమ్మపేట, నరసాపురంవద్ద కూడ పెద్ద నిధు లున్నవి. ఇవన్నియు సుద్ద రాళ్లు, శైథిల్యముచెంది ఏర్పడినవి. ఈసుద్దనిధులు ఆంధ్రలో జాడీ, పింగాణి పరిశ్రమలను పోషించగలవు.

1770° సెం. వేడికికూడ కరుగని చైనా సుద్ద (kaolin) నెల్లూరు జిల్లాలో ప్రభగిరి పట్టణము, వడ్లపూడివద్ద పెగ్మటైట్లలోని ఫెల్స్పార్ కాలగతిన రాసాయనిక పరిణామము చెంది, కొంత ఏర్పడినది. విశాఖపట్టణము జిల్లాలో కొన్ని చిన్న నిధులున్నవి. చైనా సుద్ద పింగాణి, బట్టలు, కాగితముల పరిశ్రమలలో వాడబడుచున్నది.

రాచిప్పరాయి (Steatite):- రాచిప్ప రాయి టాల్క్, (Talc) అను ఖనిజముతో చాలభాగము నిండియున్నది. దీని ఉపయోగము దీనిలోని టాల్క్ పరిమితిపై నాధారపడి యున్నది. రాచిప్ప రాయినిధులు ముఖ్యముగ అనంత పురంజిల్లాలో జూలకాలువ, కర్నపూడి, తాబ్దులా, కర్నూలు జిల్లాలో ముద్దవరం, ముసలయ్య చెరువువద్ద నెర్రెలై చెదరిన వేంపల్లె సున్నపురాళ్లలోగాని, వాటిలో ట్రావ్ రాళ్లకు సమీపమునగాని కలవు. రాచిప్పరాయి నెల్లూరు జిల్లాలో ఎడవల్లి, జోగిపల్లె శ్రోత్రియం, గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల, స్ఫటమయ విభాజీయ శిలలలో దొరుకును. దీనిని రాచిప్పలు, బొమ్మలు, పౌడర్లకేకాక, రంగులు, సబ్బులు, విద్యుత్ పింగాణి, రాతి నారపలకలలోను,వినియోగపడును. జూలకాలువ వద్ద లభించు మేలైన "లావా" రకపు రాచిప్పరాయితో రేడియో టెలివిజన్ మున్నగువాటిలో వాడు విద్యున్నిరోధక పరికరములను చేయవచ్చును.

క్రోమైట్ (Chromite) :- ఇండ్లలో వాడుకొను స్టెయిన్ లెస్ స్టీల్ (Stainless Steel) లో నూటికి 18 పాళ్ళున్న క్రోమియం (Chromium) లోహము క్రోమైట్ నుండి లభించును. క్రోమైట్ నిధులు కృష్ణాజిల్లాలోని కొండపల్లె కొండలలో పై రాక్సేన్ (Pyraxene) ఖనిజముతో నిండిన పెరాక్సీనైట్ (Peroxenite) రాళ్ళలో నాళములుగ నున్నవి. అచ్చటచ్చట ఖనిజ రేణువులు రాతిలో వెదజల్లి గూడ నున్నవి. ఈ రాతిలోని ఖనిజము అమ్మదగునట్లు చేయుటకు, దీనిని పొడి చేసి వాలుకట్టడములపై ప్రవహింప జేసిన నీటిలో ఖనిజభాగమును సం కేంద్రీకరించుదురు. క్రోమైట్ తో ఇనుపకొలుములకు లోవై పు పేర్చు ఇటుకలు, తోళ్ళను శుభ్రపరచుటకు రసాయనములు, లోహ మిశ్రమములు చేయుదురు. కృష్ణాజిల్లాలో క్రోమైట్ నిధులు చాల యున్నవని తేలిన, క్రోమైట్ రసాయనములను చేయపూనుకోవచ్చును.

పలకరాళ్ళు (Slate) :- పలకరాళ్ళు కర్నూలు జిల్లా కంభం తాలూకాలో చిన్న వోబనామనిపల్లె నుండి మార్చా పురం తాలూకాలో నాయుడుపల్లె, పెద్దయాచవరం మీదుగా మల్ల పేటవరకు 24 మైళ్ళ పొడవు 2 మైళ్ళ వెడల్పుగల ప్రాంతమున చిన్న చిన్న నిధులుగ నున్నవి. ఇవి సాధారణముగ 10 అడుగుల పొడవు మించవు. పలక రాళ్ళు గుఱ్ఱపుశాల, గణపవరం అడవిలో కూడ కలవు. ఈ గనులను త్రవ్వవలసినరీతి తెలియనందున నూటికి 90 పాళ్ళు, పలకరాయి చిన్న చిన్న ముక్కలయి వృధా యగుచున్నది. ఈ నష్టమును కొత్తపద్ధతులతో తప్పించుట యవసరము, ఇవి బడి పలకలు, బలపములు, రంగులకే కాక, గ్రాఫైట్ లోహామ్లజనిదములు లేని దట్టమగు రాళ్ళు విద్యు న్నిరోదక పరికరములను చేయుట కుపయోగపడును.

పలుగురాయి (Quartz), ఫెల్ఫ్పార్ (Felspar), చవిటి సోడా (Saline Efflorescence):- పలుగురాయి . ఫెల్స్పార్ నెల్లూరుజిల్లా అభ్రకపు గనులవద్ద వేలటన్నులు వదలి వేయబడుచున్నవి. పలుగు రాతినాళములు అన్ని జిల్లాలలోను గలవు. వీటిని వాడినచో గూడూరు గ్లాసు పింగాణి పరిశ్రమలు పెంపొందగలవు. గ్లాసు కుపయోగించు 10 అడుగుల మందపు తెల్లటి ఇసుక పొర యొకటి గుంటూరుజిల్లాలో చీరాల సమీపమున 3, 8 అడుగుల లోతులో కలదు. ఇది 9 మైళ్ళ పొడవున, 2 ఫర్లాంగుల వెడల్పున వ్యాపించి యున్నది. ఇట్టి పొరలు సముద్ర తీరము పొడవుననున్న ఇసుకలో అనేకచోట్ల బయలుపడు అవకాశము కలదు. గ్లాసు పరిశ్రమలో టన్నుకు పావు టన్ను వాడబడు సోడా, చిత్తూరుజిల్లా కాళహస్తి తాలూకాలోను, కర్నూలుజిల్లాలో ముక్కమళ్ళ, సోమి దేవిపల్లె, కాళినేపల్లె వద్ద, అనంతపురం, గుంటూరు జిల్లాలలో కొన్నిచోట్ల చవుడుగ పొంగుచుండును. కాళహస్తి తాలూకాలో పొంగు సోడాను గాజుల పరిశ్రమలో వినియోగించుచున్నారు. ఈ ప్రాంతాలలో ఏటా ఎంత ఉప్పు లభించునది తెలిసికొనుట యవసరము. పలుగు రాతితో ఉక్కుకొలుములకు లోన పేర్చు ఇటుకలు,ప్రయోగశాలలలో (Laboratories) వాడు పాత్రలను చేయుదురు. దీనిపొడితో మెరుగు కాగితములు చేయుదురు.

గ్రాఫైట్ (Graphite) :- పెన్సిళ్ళ ములికికి, యంత్రములలో కందెనగను వాడెడు గ్రాఫైట్, లేక మెరుగు మట్టి నిధులు శ్రీకాకుళం జిల్లాలో సాలూరు, కేసర, విశాఖపట్టణం జిల్లాలో చర్లోపాలెం, కాశీపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొత్తాడ, మరిన్ పాలెం, వెలగలపల్లె, ఊట్ల, కలత నౌరు, వేటకొండ మున్నగుచోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్డిబోదేరువద్ద, భోండలైట్, గ్రానైట్ నైసులలో నాళములుగ నున్నవి. వీటిలో కొన్ని నిధులను అప్పుడప్పుడు పనిచేయుచువచ్చిరి. వీటి అన్నిటికి సమీపముననుండు స్థలములలో ఖనిజమును సం కేంద్రించు సాధనము లేర్పరచి, గ్రాఫైట్ మూసలు మున్నగునవి చేయ పూనుకోవచ్చును.

బొగ్గు (Coal) :- గోదావరిలోయలో లింగాల, గవిరి దేవిపేట, బెడదనూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతమున బోరింగులవలన గోండ్వన రాళ్ళల్లో పలుచని బొగ్గుపొరలు కొన్నిచోట్ల కని పెట్టబడినవి. కాని ఇచ్చట ఎంతబొగ్గున్నది నిరూపింపబడలేదు.' కృష్ణాజిల్లాలో కోనవద్ద ఒక ఊబ స్థలమునుండియు, గోదావరి డెల్టాలో అమలాపురం, జగ్గన్న పేట, కవితం, ర్యాలి మున్నగుచోట్లను, తాటిపాకవద్ద బావికై వేసిన ఒక 70 అడుగుల బోరింగు నుండియు, మీథేన్ (Methane) అను బొగ్గువాయువు వెడలుచున్నది. గోదావరిలోయలో 2 వేల అడుగుల బోరింగులతో బొగ్గుకై శోధించి, విరివిగా నున్నట్లు నిరూపించగలిగిన, అది పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడును.

బంగారము (Gold) :- బంగారు గనులు అనంతపురం జిల్లాలో రామగిరి, రామాపురం, వెంకటాంపల్లె, చిత్తూరు జిల్లా కంగుండి తాలూకాలో చిన్నపర్తికుంట, బిసనత్తమునొద్ద ధార్వాడ సంహతికి చెందిన క్లోరెట్ (Chlorite) హాన్ బ్లైండ్ విభాజీయ శిలలలో కలవు. బిసనత్తం, చిన్నపకుంటవద్ద కొన్ని రాళ్ళలో బంగారము చిన్నటన్నుకు (2,000 పౌనులు) సుమారు 4 పెన్ని వెయిట్లు (dwt), అనగా 8/15 తులం (16 చిన్నాలు, లేక 21⅛ నాల్లు) కలదు. ఈ ప్రాంతములు శ్రద్ధతో పరీక్షింపదగినవి. రాళ్ళశైథిల్యమువలన బంగారు రేణువులు విడివడి, తుంగభద్రా కృష్ణా నీటి ఉరవడిలో కొట్టుకొని వచ్చి, కొన్నిచోట్ల ఒండ్రులో నిమిడియున్నవి. ఈ ఒండ్రులో మనగజముకు 3 గ్రెయిన్లు అనగా అరచిన్నము లేక ⅔వాల్, బంగారమున్నచో, దీనిని లాభకరముగ తీయవచ్చును.

వజ్రములు (Diamonds):- ఆరవ శతాబ్దమునుండియు ఆంధ్రప్రదేశమునకు రత్నగర్భయని పేరు. ప్రపంచము లోని గొప్ప వజ్రములు ఎక్కువగ ఇచ్చట లభించినవే. కోహినూర్, హోప్ వజ్రములు దొరికిన కొల్లూరుగనుల వద్ద 1652 లో 60 వేలమంది పనిచేయుచుండిరట. పిట్ లేక రీజంటు వజ్రము పరిటాల గనులలో దొరికినది. గ్రానైట్ నైన్ ప్రాంతమగు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా, కర్నూలుజిల్లా పత్తికొండ తాలూకాలో, వజ్రకరూరు, కొంగనపల్లె మున్నగుచోట్లను, కర్నూలు జిల్లాలో ముఖ్యముగ బంగనిపల్లె, రామల్లకోట, రామవరం పల్లెలు, గుంటూరుజిల్లాలో మల్లవరంవద్ద నున్న బంగనపల్లె గుండ్లపొర (conglomerate) లోను, కుందు, పెన్న, హింద్రి, తుంగభద్ర, కృష్ణానదులు గుండ్ల పొరలలో ననేకచోట్లను, వజ్రపుగను లున్నవి. భద్రాచలము నొద్ద గోదావరిలోకూడ రవ్వలు దొరకినవి. బంగనపల్లె గుండ్లపొరనుంచి లభించిన వజ్రములు ఎక్కువభాగము చిన్నవైనను దీనికి దూరముననున్న కృష్ణానది గర్భములోను, గ్రానైట్ నైసులలోను పెద్ద వజ్రములు దొరికేవట. కోల్లూరు, పరిటాల గనులు గుంటూరు, కృష్ణాజిల్లాలలో కృష్ణ ఒడ్డుననే యున్నవి. ఇప్పటికి పాతగను లున్న చాల చోట్ల వర్షము కురిసిన వెంటనే రవ్వలు భూమి పై మెరయును. ఈ నదీశయ్యలలోను, గుత్తి, పత్తికొండ తాలూకాలలోను, బంగనపల్లె గుండ్లపొరలోను, వజ్రములకై వెదుకదగిన ప్రాంతము చాలగలదు.

ఇనుము (Iron) :- ఆంధ్రలో ఉక్షువరిశ్రమకు చాలిన లోహామ్లజనిదము లేక హిమటైట్ (Haematite) నిధులు లేవు. అనంతపురం జిల్లా రాయదుర్గము తాలూకాలోని రాగికొండలలో నూటికి 60 పాళ్ళు ఇనుమున్న హిమటైట్ ధాతువు 5 లక్షల టన్నులు కలదు. ఇది ధార్వార సంహతికి చెందిన హిమటైట్ క్వార్ట్ జెట్లలో ( Haematite Quartzites) నున్నది. కర్నూలుజిల్లాలో రామల్లకోట, వెల్దుర్తి ప్రాంతమున భూకంపములతో బ్రద్దలైన కడపరాళ్ళలో 51 నుంచి 65 పాళ్ళు ఇనుమున్న హిమ టైట్ ధాతువు 37 లక్షల టన్నులు దొరకును, ఇనుము తక్కువపాలుగల చిన్న హిమటైట్ నిధులు కడప జిల్లాలో చాబలివద్ద పులివెండ్ల క్వార్టు జైట్లలోను, మాగ్న టైట్ క్వార్టుజైట్లు విరివిగా గుంటూరు, నెల్లూరు జిల్లాలలోను ఉన్నవి. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట పరిసరాలలో నేలమట్టమునందు కూడిన పలుచని ఇనుపరాళ్ళ పొర యొకటి కలదు. ఇక్కడ 61 పాళ్ళు ఇనుముకల హిమ టైట్ ధాతువు 25 లక్షల టన్నులు దొరకును.

రాగి (Copper), సీసము (Lead): విజయనగర సామ్రాజ్యపు రోజులనాటి పాత రాగిగనులు నెల్లూరు జిల్లాలో గిరి మెన పెంట, కర్నూలుజిల్లాలో గని, గుంటూరు జిల్లాలో అగ్ని గుండాలవద్ద కలవు. ఈ చోట్ల రాగి ఖనిజమగు మాలకైట్ (Malachite) తో కూడిన పలుగురాతి నాళములు వేర్వేరు రాళ్ళను చొచ్చియున్నవి. 1800 తరువాత గరిమెన పెంట గని యొద్ద తిరిగి త్రవ్వెడు ప్రయత్నాలు జరిగి, కొన్ని నిష్పలమై, కొన్ని ఇతర కారణముల వలన ఆగిపోయినవి. ఈ స్థలములలో భూభౌతిక పరిశోధనలు జరుగుచున్నవి. కాని ఇంతవరకు లాభకరముగా త్రవ్వదగ్గ నిధులున్నట్లు నిరూపింప బడలేదు.

వెండితోకూడిన సీస,గంధకిదము, గెలీనా (Galena), కడప, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల సూక్ష్మముగ గలదు. కర్నూలు జిల్లా ద్రోణాచలము తాలూకాలో చిత్యాలవద్ద గ్రానైట్ నెర్రెలలో చెదరి వ్యాపించిన చిన్న నిధులను 30 ఏండ్ల క్రిందట త్రవ్వి, నష్టకరమని మానివేసిరి. *ఈ గనులున్న కొన్ని చోట్ల బోరింగులతో లోతున ధాతువెంతయున్నది తెలిసికోనగును.

కురువిందము (కోరండం), ఎఱ్ఱరాయి (గార్నెటు):- కోరండం, గార్నెట్ మిక్కిలి కఠినమైన ఖనిజములు గనుక, వీనిని మెరుగు పనులకును, కురువిందమును (corundum) సానచక్రములకును, వాడుదురు. కురువింద నిధులు అనంతపురం జిల్లాలో అనంతపురం, కల్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం తాలూకాలలో అతి క్షారశిలలలోను (Ultrabasic Rocks), సయనైట్రలోను (Syenites), కొన్నిచోట్ల కలవని వ్రాసిరి. ఇవి పరీక్షింపదగినవి. ఇదివరకు హిందూపురం తాలూకాలో పరిగినుండి చాల ఖనిజము ఎగుమతి చేయబడినది. గార్నెట్ నెల్లూరు జిల్లాలో గిద్దలూరు, సై దాపురము మున్నగుచోట్ల అభ్రక విభాజీయ శిలలలోను, తూర్పు కనుమలలో భోండలైట్ చార్నొకైట్లలో ప్రవహించు వాగుల ఇసుకలోను విరివిగ లభించును. విద్యుత్తు చౌకగా దొరకినప్పుడు, ఇతర పరిశ్రమలతోపాటు ఈ ఖనిజములనుండి మెరుగు పదార్థములను అధికముగ తయారు చేయవచ్చును.

'ఇతర ఖనిజములూ :- 1,800° సెం. వేడిని, విద్యుత్తును నిరోధించు కయనైట్, సిల్లిమనైట్ ఖనిజములు గ్లాసు కొలుములలోను, విద్యుత్పింగాణి మున్నగువాటిలోను, నుపయోగపడుచున్నవి. కయనైట్ నిధులు నెల్లూరు


  • గుంటూరులో కారెంపూడి సమీపమున గెలీనా ఇతర గంధకిద ఖనిజములతోకూడి, కడపసంహతికి చెందిన డోలోమైట్ లైంస్టోన్లలో (Dolomitic Limestons) కొంతదూరము వ్యాపించి యున్నది. ఈచోట్ల గెలీనా లోతులో అధికముగా నుండు అవకాశములున్నవి.

జిల్లాలో చుండి, ఛత్రం, సైదాపురంవద్ద విభాజీయ శిలలలో కలవు. చుండి, ఛత్రము నిధులలో ప్రతి 10 అడుగులకు 2 వేల టన్నుల కయనైట్ దొరకునని లెక్క వేసిరి. సిల్లిమనైట్, ఖోండలైట్లలో నొక ముఖ్య ఖనిజము గనుక, వాటిలో దాని నిధులను కనుగొను అవకాశము కలదు. సిల్లిమనైట్ రేణువులు సముద్ర తీరపు ఇసుకలలో గూడ నున్నవి.

అణుశక్తిని జనింపజేయు ఖనిజమగు మోనజైట్. తెల్లరంగుచేయు ఇల్ మనైట్ 2300° సెం. వేడినిపట్టు జర్కాన్ రేణువులు కూడ శ్రీకాకుళం, విశాఖపట్టణము, గోదావరిజిల్లాల సముద్రతీరపు ఇసుకలలో అచ్చటచ్చట నున్నవి. మోనజైట్ విశాఖపట్టణము, భీమునిపట్టణము మధ్య ఇసుకలలో 3 నుంచి 8 పాళ్ళవరకు కలదు. వీటిని ఇసుకనుండి లాభకరముగ విడదీయ వీలగు పద్ధతులు పరిశోధింపబడుచున్నవి.

అల్యూమినము యొక్క ముడిపదార్థమగు బాక్సైట్ (Bauxite) నిధులు విశాఖపట్టణము, గోదావరి జిల్లాలలో ఖోండలైట్ కొండల పై భాగమున చదునుగనుండు ఇష్టి కాళిల (Laterites) లెచ్చటైనా కనబడు అవకాశమున్నది.

ఎరువుల కుపయోగపడు అపటైట్ (Apatite) అను ఫాస్ఫేట్ (Phosphate) శ్రీకాకుళం జిల్లాలో దేవాడ, గర్భం, రామభద్రపురం మున్నగుచోట్ల మాంగనీసు గనులనుండి లభ్యమగును. ఇది కోడూరైట్ రాళ్ళకు చెందిన ఖనిజము. సీతారామపురపు నిధిలో 30 అడుగుల లోతులోనే 5 వేల టన్నుల ఖనిజము కలదు. అపటైట్ నెల్లూరుజిల్లా పెగ్మటైట్లలో సూక్ష్మముగ నుండుటచే, అభ్రక గనులనుండి కొద్దిగ లభించును.

స్ఫటికములు (Quartz crystals) : అన్నిజిల్లాలలోను శిలలలో చొచ్చిన పలుగురాతి నాళములలో అచ్చటచ్చట దొరకును. శుద్ధమగు పెద్ద స్ఫటికములు రేడియో, టెలిఫోను పరికరములలోను, చిన్నవి ఆభరణములలో రాళ్ళు గను వినియోగపడును.

చవుడు (Saline Efflorescence) : కొన్ని స్థలములలో ఎక్కువ ఉప్పుగను (Sodium chloride), మరికొన్ని చోట్ల ఎక్కువ బట్టల సోడాగను పొంగుచుండును. చవిటి ఉప్పు (Earth salt) అనంతపురము జిల్లాలో అనంతపురము, పెనుకొండ తాలూకాలయందు, కడపజిల్లాలో జమ్మల మడుగు తాలూకాయందు, కర్నూలుజిల్లాలో ముఖ్యముగ కంభం, కోయిలకుంట్ల తాలూకాలయందు, గుంటూరుజిల్లాలో నరసారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి తాలూకాలయందు అచ్చటచ్చట పొంగుచున్నది. దీనిని మాడలలో కరిగించి, వడబోసి, కయ్య (మళ్ళ)లలో నెండనిచ్చి, శుభ్రపరచుదురు. ఈ ప్రాంతాలలో ఏటా ఎంత ఉప్పు లభించునది తెలిసికొనుట అవసరము.

గంధకము (Sulphur) :- ఇది కృష్ణాజిల్లాలో కోనవద్ద కొద్దిగ లభించును. ఇక్కడ 30 ఎకరాల మేర వర్షాకాలములో సముద్రపు నీటితో నిండు పల్లపుభూములలోని ఒండ్రులో, సూక్ష్మజీవులచే నేర్పడు గంధక కణములు 2 అడుగుల లోతువరకు కలవు. గంధక మేర్పడు పరిస్థితులు ఇతరచోట్ల కలుగ జేయగలిగినచో గంధకోత్పత్తి అధికమగును.

మిక్కిలి వేడిని, విద్యుత్తును నిరోధించు మాగ్నెసైట్(Magnesite) ను, కొలుములకు లోవైపు పేర్చు నిటుకలకు, విద్యు న్నిరోధక వస్తువులకు, సీమెంట్లలోను వాడుదురు. ఇది కర్నూలుజిల్లాలో ముద్దవరము, ముసలయ్య చెరువువద్ద రాచిప్ప రాతితో కూడి, వేంపల్లి సున్నపు రాళ్ళలో నాళములుగ దొరకును. కాని ఇది సున్నపు రాళ్ళతో నెక్కువగ కలిసిపోయి, లాభకరముగా విడదీయ వీలుకాకున్నది.

బెరిల్ (Beryl) :- ఇది శ్రీకాకుళం జిల్లాలో జీరికి వలసవద్ద ఒక పెగ్మటైట్ లో కనుగొనబడినది. ఇక్కడ సుమారు 10 టన్నుల బెరిల్ దొరకగలదు. బెరిల్ నుంచి తీయు అతి విలువైన బెరిల్లియం (Beryllium) లోహము అల్యూమినయము కన్న చాల తేలికై, మిక్కిలి వేడి పట్టు శక్తి, దృఢత్వము గలిగి శిథిలము కానందున, దీనిని లోహ మిశ్రమములు, విద్యుత్పింగాణి మున్నగువాటిలో నుపయోగింతురు.

ఈ ఖనిజసంపదను బట్టి, ఆంధ్రలో సీమెంట్లు, రంగులు,డిస్టెంపర్లు. 'మైకనైట్, గ్లాసు, జాడీ, పింగాణి, విద్యున్నిరోధక పరికరములు, బేరియం, కాల్షియం, సోడియం రసాయనములు, మెరుగు సామానులు తప్పక చేయ వీలగును. బొగ్గు, బంగారు, వజ్రములు, రాగి, సీసము, కురువిందము నిధులకై పరిశోధించవలయును. ఖనిజము త్రవ్విన సంవత్సరాలు 1954 వరకు మొత్తం ఉత్పత్తి మొత్తం విలువ (టన్నులు) (రూపాయలు) సుమారు సుమారు ఆంధ్రదేశపు ఖనిజసంపద - I ఈ పరిశ్రమల అభివృద్ధికి చౌక గలభించు విద్యుత్తు ఎంతయో తోడ్పడగలదు. (ఇ) (1,08,881 1.55,91,884 హం. వై) ఇతర రాష్ట్రాలలో ఉత్పత్తి చేయు జిల్లాలు బిహార్ – హజారిబాగ్, గయ - రాజస్థాన్ - మేవాడ్ 18545 ఉత్పత్తి విలువ జిల్లాలు (ట) 1. అభ్రకము 6,70876 4,45,26,670 11,496 28,01,406 1892-1954 హండ్రడు హం. వై. ముఖ్యముగ నెల్లూరు వెయిట్లు* స్వల్పముగ కృష్ణా, విశాఖపట్టణము. సుమారు సుమారు (42,78,226 (85,15,48,488) హం. వై.) a 8,41,529 21,71,595 2,48,672 14,67,884 - బిహార్ సింగ్ భ్భూం. 2. ఇనుము 1952-54 కృష్ణా, కర్నూలు, చిత్తూరు, కడప. 3. కయనైట్ 1989.48-54 నెల్లూరు 4. కాల్సైట్ (1,20,88,648) (8,88,60,046) (48,08,278) (2,89,88,088) 8,875 1,95,479 82 1,625 (2,09,098) (2,89,95,002) (42,880) (87,80,862) ఒరిస్సా - మయూర్ భంజ్, కట్టక్ . కి మొకఝాడ్, మైసూర్ - బళ్ళారి, చిక్క మాగళూరు. - హైద్రాబాదు ఖమ్మము మెట్టు. బొంబాయి - రత్నగిరి. బిహార్ –సింగ్ భూం,మభూం మైసూరు హస౯. ఒరిస్సా - మయూర్ భంజ్. 1951-54 అనంతపురము 5,888 (12,578) (1,47,801) 48,579 2,284 27,408 సౌరాష్ట్ర (5,029) (41,728) రాజస్థా౯ - పలి, జైపూర్, 5. క్రోమైట్ 1941-54 కృష్ణా 19,927 7,25,886 - మైసూరు- హస౯, మైసూరు, (8,45,492) (1,20,28,118) (45,507) (18,59,807) ఒరిస్సా - కిమొఝాడ్, కట్టక్ బిహార్ - సింగ్ భూం.

  • 20 హండ్రడు వెయిట్లు = 1 టన్ను = 2240 పౌసులు

511 ఆంధ్రదేశపు ఖనిజసంపద - I ఖనిజము త్రవ్విన సంవత్సరాలు జిల్లాలు 1954 వరకు 18545* (టన్నులు) మొత్తం ఉత్పత్తి మొత్తం విలువ (రూపాయలు) ఉత్పత్తి (b) విలువ (85) ఇతర రాష్ట్రాలలో ఉత్పత్తి చేయు జిల్లాలు 6. ఖనిజ రంగులు 1946 కర్నూలు పూర్వము జిల్లాల వారీ లెక్కలు దొరుకలేదు. 54,367 2,26,898 (75,508) (5,47,189) వింధ్య ప్రదేశ్ సత్నా. మైసూరు - బళ్ళారి. - మధ్యప్రదేశ్ - జబ్బల్ పూర్, సౌరాష్ట్ర - గోహిల్ వాడ్ , 7 గ్రాఫైట్ 1948-52-54 తూర్పు గోదావరి సుమారు 467 43,000 200 20,000 (6,262) (8,48,670 (1,479) (1,86,561) ఒరిస్సా - బొల౯గీర్, కోరా పుట్, థెజుక వాల్, విశాఖపట్టణము 8. జిప్సం 1948 సంబల్ పూర్. బిహార్ - వలామా. నెల్లూరు 198 3,910 (82,267) 9. తెల్లసుద్ద. రాజస్థాన్ –బిక నీర్,జోధ్ పూర్ (2,72,850) (6,12,120) (41,59,888) మద్రాసు - తిరుచిరపల్లి. 1953 పూర్వము జిల్లావారీ 8,246 14,875 లెక్కలుదొరక లేదు. (1,48,144) (25,20,084) 10. పలకరాయి 1921-24,47.49 కర్నూలు 11. బంగారము 1898-1900, 1954 8,512 19,015 సుమారు 105°. 28,780 మైసూరు- కోలారు. చిత్తూరు 1,85,800 1,15,45,098 (2,89,188ఔ.) (5,82,08,814) హైదరాబాదు హట్టి. - 1910-27 ఔన్సులు అనంతపురం (88,72,898 (58,77,57,785) ఔన్సులు) - 12. మాంగనీసు 1882-1854 సుమారు 58,107 81,89,430 O మధ్యప్రదేశ్ బోలాఘాట్, భండారా, నాగపూర్. ముఖ్యముగా శ్రీకాకుళం, 28,54,881 10,35,68,988 (16,18,847) (19,54,17,452) స్వల్పముగా విశాఖపట్ట(8,82,78,486) (సుమారు ణము, కర్నూలు, 196,04,77,988) ఒరిస్సా-కి మొళ ఝాడ్, బోనై బొంబాయి - పంచ్ మహల్, ఉత్తర కెనరా. 512 ఖనిజము త్రవ్విన సంవత్సరాలు జిల్లాలు 1954 వరకు 19545° మొత్తం ఉత్పత్తి మొత్తం విలువ (టన్నులు) (రూపాయలు) ఉత్పత్తి (*) 13. ముగ్గురాయి 1918_54 విలువ (రూ) ఆంధ్రదేశపు ఖనిజసంపద - I ఇతర రాష్ట్రాలలో ఉత్పత్తి చేయు జిల్లాలు కడప, అనంతపురము, కర్నూలు 14. రాగి 1826.27.82.48 నెల్లూరు 15. రాచిప్పరాయి 1910-54 కర్నూలు, నెల్లూరు, 3,80,223 42,31,298 18,288 (8,54,454) (44,51,822) (18,792) 405 7.852 (8,42,750) 2,61.879 రాజస్థాన్ - జై పూర్ 47,684 4,10,519 722 16,788 అనంతపురం, గుంటూరు. (6,00,708) (1,68,51,988) (42,826 (18,28,191) బిహార్ – సింగ్ భూం - 16. రాతినార 1924_54 కడప 17. వజ్రములు 1909.18 1,480-75 18,88,551 121-9 (8,822,55) (24,92,198) (889) శతాబ్దములు పూర్వపు లెక్కలు రాజస్థాన్ - జై పూర్, ఉదయ పూర్, బిల్ వాడా. మధ్యప్రదేశ్ - జబ్బల్ పూర్ , . బిహార్ హజారిబాగ్, సింగ్ భూం. మైసూరు - హాసన్. హైదరాబాదు – కరీంనగరు. - 1,88,011 రాజస్థాన్ - ఉదయపూర్, (2,28,784) బిహార్ సింగ్ భూం, మజాభూం. మైసూర్ స బొంబాయి-బిజాపూర్. (68,885) (1.955 5.) (4,74,826) దొరకలేదు. కర్నూలు 191.79 కారట్లు (421.49 కా.) 1,440 18. సమర్స్కైట్ 1911-14, 17, 18, 20 నెల్లూరు 103.6 4,668 . . వింధ్య ప్రదేశ్ - పన్నా. 65 బ్రాకెట్లలోని సంఖ్యలు ఆ గడువులకు చెందిన భారతదేశపు వివరములు. 513

[[వర్గం:]]