సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్‌టికా

అంటార్క్‌టికా- అంటార్క్టికా దక్షిణధ్రువము మీద నున్న ఆరవఖండము. దీనిని మూడవ ప్రపంచము అని పేర్కొనుచున్నారు. అంటార్క్టికు మండలమును మొట్టమొదట తరించినవాడు ఆంగ్ల నావికుడు జేమ్సుకుక్ (1778). అమెరికా సంయుక్త రాష్ట్ర వాసి పామరు అను వాడును, రష్యా నావికుడు బెర్లింగ్ ఫానెన్ అనువాడును (1820) అంటార్కిటికాను కనిపెట్టిరి. క్రీ.శ. 1840 ప్రాంతమున అమెరికా దేశీయు డగు విల్క్సు అను నాతడు ఈ ఖండమును పరిశోధించెను. 1933-1935 లో జరిగిన బిర్ట్ సంచారము ముఖ్యమయినది. ఈనాటివరకు పెక్కుమంది దానిని


పూర్తిగా కనుగొని విషయ సేకరణకు తయారగు చున్నారు. కాని 1,500 మైళ్ళ మేర మంచుకట్టిన ప్రదేశముమీద ప్రయాణము చేసి విషయాలు తెలిసికొనవలసియున్నది. ఈ ఖండము 60° దక్షిణ అక్షాంశము లో నుండుట వలన దీని ప్రాముఖ్యము ఇనుమడించినది. మిక్కిలి విలువగల అడవులు 60° అక్షాంశము దాటిన భూమిలో ఉన్నవి. ఇందు 10,00,000 మంది మానవులు కూడ ఉన్నారు. ఇక్కడ చెట్లు లేవు. చేపల పరిశ్రమకు అవకాశ మున్నది.తిమింగిలములు అను పెద్దరకపు జల జంతువుల పరిశ్రమకు ఈ ప్రదేశము చాల అనుకూలముగా ఉండగలదు. అంటార్కటికా యొక్క ప్రత్యేకత అది భూభాగాలన్నిటికీ దూరముగాను, సంబంధము లేనిదిగాను ఉండుటయే. 55°——65° ల మధ్య భూమి లేదు. లోతులేని సముద్రము గుండ ప్రయాణముచేసి ఈ ఖండమును చేరవచ్చును. ఈ ఖండములోకూడ కొన్ని ప్రదేశములు మంచులేకుండ నుండును. దక్షిణధ్రువము 10 వేల అడుగుల ఎత్తున నున్నది. ఇక్కడ మనుష్యులకు కాని, జంతువులకు కాని, తగిన ఆకర్షణకాని, అవకాశముకాని లేదు. రాస్ అను పరిశోధకుడు నీళ్ళలో తేలుచున్న మంచుగడ్డల గుండ వెళ్ళవలసి వచ్చినది. దీనిని "రాస్ ప్రతిబంధకము” అని అందురు.దీనిమందము 500 అ. మొదలు 15,000 అడుగుల వరకు ఉండును. ఇంకను ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో సముద్ర గర్భములో ఉండి తీరునని భావింబడుచున్నది. ఒక్కొక్కచోట 4 ప్రతిబంధకములు 3 మైళ్ళ వరకు ఉండ వచ్చును. కాబట్టి ఈ విధమైన సముద్రము అడుగు పర్వతమయమై భూఖండము ఉండుట వలననే దానిని అంటార్క్ టికా ఖండము అనెడి పేరుతో పిలువవలసి వచ్చినది. 86° దక్షినపు అక్షాంశములొ ఉన్న విక్టోరియా ప్రదేశమునుగురించి అనేక వివరాలు సేకరించినారు. ఇందులో పరత శ్రేణులున్నట్లు తెలియుచున్నది. 8,000; 10,000; 15,000 అడుగ ఎత్తుగల శిఖరాలు మంచుచే కప్పబడి ఉన్నవి. ఎరిబ్ర శిఖరము చాల పెద్దది. ఈ శిఖరాలు న్యూజీలాండ్ పర్వతాలను పోలియున్నవి. శీతోష్ణస్థితి చాల విపరీతముగా నుండును. 77° ఫా. ఉండవచ్చును. గాలి ఒత్తిడిలో కూడా మార్పులు ఉండి తదనుగుణముగా ఈ ప్రదేశములో పెను గాలి వీచుచుండును. భూమిమీద పచ్చని ప్రదేశము తక్కువ సముద్రములో జంతు, వృక్ష జీవనము అధికముగా ఉన్నది. ఇక్కడ సీళ్ళు, అనేకరకాల పక్షులు ఎక్కువగా నున్నవి. 30,00,000 పౌండ్ల విలువగల తిమింగిము లను, చేపలను, సీళ్ళను ఏపేట పట్టుకొనుచున్నారు. రా ప్రదేశము, ఫాక్ లాండ్ దీవుల ప్రదేశము ఇందులోనున్న ముఖ్య భాగాలు.

డి. వి. కె.