సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంగోలా

అంగోలా— అఫ్రికాదేశమందు వైరృతి భాగ )జ కు 5. 3; 5. . ఉన్న పోర్చుగీసు వారి వలసదేశము అంగోలా, దీనికి 4 మున, బెల్జియః కాంగో యును, తూర్పున ఉ త్తర ౬ యాయును, దక్షిణమున నైరృతి ఆఫ్రికా భాగవ ), పశ్చిమమున అట్లాంటిక్ మహాసముద్రమును ఎల్ల బెల్జియన్ కాంగో దక్షిణ ఆఫ్రికా F యొక్క క్షేత్ర వ్యాషన ఉదా : ప్రతీ సంఖ్యా క్షేత్రమును, వికరణ్యంక క్షేత్రముయొక్క క్షేత్ర వ్యావన మే. అంగోలా 100 50 .. 100 రొడిసియా దీని సముద్ర పొడవు 020 మైళ్ళ ని ము 3 శాల 9,50,000 చద పు ద మైళ్ళు. ఈ తీరము ఎక్కువ నుగా నున్నది. అచ్చటచ్చట ఎఱ్ఱ : రాజతో కూడిన గుట్టలును, ఎత్తైన కొండలును ఉన్నవి. -సముద్రతీరపు 1 నము దేశములోని 13.12 క na 0 B మైళ్ల మొదలుకొని 'మైళ్ళవరకు చొచ్చు. ర యున్నది. మధ్య భూమి హెచ్చుతగ్గులుగల.. ఉపరితలములతో ని 5,100 అడుగుల ఎత్తు ఉండును. తూర్పున, ఉత్త నుండి దక్షిణము వైపునకు వ్యాపించిన పర్వత శ్రే కనిపించును. ఈ రాష్ట్రమునందలి అత్యున్నత మైన రము పేరు "లోవిటి".దీని ఎత్తు 7,790 అడుగులు. మధ్యగతమైన పర్వతపంక్తి పుష్కలముగా పెరిగిన తరు గుల్మములతో నిండియుండును. తూర్పున ఈ పీఠభూమి కాంగో, జాంబెజీల నిమ్న భాగముల వైపు ఒరిగియున్నది. దక్షిణమున ఇది చెట్లు చేమలు లేని ఇసుక ఎడారిలో కలిసిపోవును.

అంగోలా దేశములో పశ్చిమ ముఖముగా సముద్రమునకు పెక్కునదులు ప్రవహించుచున్నవి. అవి అన్నియు చాలవరకు వైపర్వతమండలములో నే జన్మించినవి. అచ్చటి ముఖ్యమైన నదులు కాంగో, క్వాంగో అనునవి. లుంగ్వే, బుంగు అనునవి జాంబేజీనది యొక్క ముఖ్యమైన ఉపనదులు. అమితమైన వేడిమి, అమితమైన తేమ ఇచ్చటగల శీతోష్ణ పరిస్థితులు. ఇచ్చటి సామాన్యమైన శీతోష్ణ పరిమాణము 75° గా నున్నది. సముద్రతీరము నందలి మైదాన ప్రదేశములు యూరోపియనుల నివాసమునకు అనుకూలముగా లేవు. పీఠభూమియందలి శీతోష్ణస్థితి మిక్కిలి ఆరోగ్యకరముగాను, పుష్టికరముగాను ఉండును. అచ్చటి శీతోష్ణస్థితి, అచ్చటి వ్యాపారపవనముల ప్రభావమునకు లోనగుచుండును. ఏప్రిల్ నెలలో అచ్చట వానలు మెండు. ఉగ్రమైన తుపానులుకూడ చెలరేగును. ఈ మండలపు ఉత్తరభాగమందు అంతటను దట్టమైన ఉష్ణ మండల అరణ్యములు కలవు. దక్షిణభాగమున చిట్టడవులు వ్యాపించియున్నవి. అచ్చట టేక్యులా, దేవదారువు, టేకు, నూకమ్రాను మున్నగు కలపకు పనికివచ్చు చెట్లు విరివిగాకలవు. మ్యూసెంఖా యొక్క బెరడును, తోళ్ళను వదను చేయుటకు ఎక్కువగా ఉపయోగింతురు.

అంగోలా యందలి ముఖ్యమైన పంటలు వరి, జొన్న, చోళ్ళు, చెరకు, దుంపలు, కాఫీ, పొగాకు, వేరుసెనగ మొదలగునవి. ఇవిగాక పామ్ అయిలు, కొబ్బరి, కోకో మొదలగునవియు, తీరుతీరులపండ్లును లభించును. అంగోలా ఈశాన్యభాగమునందు వజ్రములు దొరకును. ఇచ్చట మాంగనము, బొగ్గు, రాగి, ఇనుము మొదలగు ఖనిజములు కూడ దొరకును. ఇచ్చట చక్కెర కర్మాగారములు కలవు. వీటియందు రమ్ (rum) అను సారాయి, తదితర అనుబంధ వస్తువులు కూడ తయారగును. ఈ రాష్ట్రము యొక్క అభ్యుదయము అంతయు అడవులకు, తోటలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి పై ఆధారపడియుండును. 1950 సంవత్సరములో ఇచ్చటిజనాభా 41,25, 266. ఇచ్చట నివసించు వారిలో పెక్కుమంది బంటూ, నీగ్రో జాతులవారు. దక్షిణమున అనేక రకముల జాతుల ఆటవికులు (బుష్ మెన్) కలరు. ఉన్నత ప్రదేశములందును, సముద్రతీరపు మైదాన ప్రదేశములందును పోర్చుగీసువారు నివసించుదురు.

అంగోలా యొక్క ముఖ్యపట్టణము సెయింటుపాల్' డిలొయాండా అనునది. దీనిని సాధారణముగలొయాండా అందురు. లొయాండా నుండి అంబకా, మలాంజే వరికు వేయబడిన రై లుమార్గమును రాయల్ ట్రాన్సు ఆఫ్రికను రైలుమార్గ మందురు. ఇదిగాక, సముద్రతీరపు దేవులను, అందలి ఎగుమతులకు వలసిన వస్తువుల నుత్పిత్తిచేయు పరగణాలతో, అనేక చిన్న రైలుమార్గములు కలుపుచున్నవి. రైలుమార్గము యొక్క మొత్తము పొడవు 1,442 మై. 22,708 మైళ్ళ పొడవుకల రహదారులును, దేశీ దేశాంతర విమానమార్గములును కలవు.

ఈ దేశమందు యంత్రములును, నేత వస్త్రములును ముఖ్యమైన దిగుమతులు. ఎగుమతులలో ముఖ్యమైనవి కాఫీ, జొన్న, వజ్రములు, రాగి, చక్కెర, ప్రత్తి, రమ్ అను సారాయి, వేరుసెనగ, కొబ్బరి, కోకో, పొగాకు మొదలగునవి. బెంగో అఖాతమునందు బెంగ్వేలా అనునది గొప్ప రేవు. వర్తకము విశేషముగా పోర్చుగీసు దేశముతోనే జరుగుచుండును.

కె. వి. రె