సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రహణములు

గ్రహణములు :

సూర్యగోశీయ వ్యాసార్ధము 4,32,000 మైళ్ళు; భూమి సూర్యునికి 9,30,00,000 మైళ్ళదూరములోనుండి సూర్యుని చుట్టు పరిభ్రమించుచున్నది. భూగోళీయ వ్యాసార్ధము 4000 మైళ్లు. భూచ్ఛాయ సూచ్యగ్ర రూపముతో (Shadow cone) భూమితోపాటు ఆకాశమున పరిభ్రమించుచుండును. ఈ భూచ్ఛాయను మన ప్రాచీన సిద్ధాంతములందు భూ ఛా అని వ్యవహరించిరి. భూ ఛా యొక్క పొడుగు రమారమి 8,70,000 మైళ్ళుండును. చంద్రుడు భూమిచుట్టు 2,40,000 మైళ్ళలో పరిభ్రమించుటచేత ఒకప్పుడు ఈ భూ ఛా ప్రవిష్టుడగును. అప్పుడు. చంద్రగ్రహణము పట్టినదందుము. చీకటియందున్నవస్తువు దృగ్గోచరముకానట్లు, చంద్రుడు దృగ్గోరము కాడన్న మాట. చీకటియందు దృగ్గోచరము కాని వస్తువు ఎటునుండి చూచినను దృగ్గోచరము కాదు. కావున చంద్ర గ్రహణము ఒక దేశమందే పట్టి మరియొక దేశమునందు పట్టకపోదు. అనగా చంద్రగ్రహణము పట్టినప్పుడు ఏ భూగోళార్ధమున కప్పుడు రాత్రికాలమో ఆ భూగోళార్ధ మందంతట చంద్ర గ్రహణము పట్టునన్నమాట. “తమస్తు రాహుః" అను అమరోక్తి ననుసరించి రాహు వనగా చీకటియనియు, చంద్రుడు చీకటిలో ప్రవేశించెననియు, మన ప్రాచీనులకు గ్రహణోపపత్తి బాగుగా తెలియును. తెలియుటయేకాక వారు గ్రహణకాల గణితమును బాగుగా తెలిసికొనిరి. రాహు కేతువులు. సర్పరూపమున నున్న రాక్షసులనియు, వారు చంద్రసూర్యులను గ్రసింతు రనియు పౌరాణిక గాథలు చెప్పుచున్నవి. కాని అది శాస్త్రపద్ధతి గాదు. గణితశాస్త్ర పద్ధతినే భారతీయ సిద్ధాంతులు పాటించియున్నారు.

సూర్యగ్రహణమనిన సూర్యుడు చీకటిలో ప్రవేశించుట కాదు. తేజోరూపుడయిన సూర్యునికి తమఃప్రవేశము అసంభవము. చంద్రమండలము సూర్యునికిని భూమికిని మధ్యగా ప్రవేశింపగా సూర్యునకును, భూమికిని కన్పడకుండ ఆచ్ఛాదించును. అప్పుడు సూర్యగ్రహణము పట్టిన దందుము. చంద్రుడు మనకు దగ్గరగానున్న ఒక చిన్న గోళము. చిన్న గోళమైనను దగ్గరగా నుండుటచేత పెద్ద గోళమగు సూర్యుని కప్పివేయ గలుగును. దాని కుదాహరణ మేమన, ఒక చిన్న మేఘము సూర్యుని ఆచ్ఛాదించినట్లే. కాని సూర్యగ్రహణమునం దున్న విశేష మేమనగా, ఏ ప్రకారముగా ఒక ప్రదేశమునందు సూర్యుడు మేఘచ్ఛన్నుడై కన్పట్టకపోయినను, మరియొక ప్రదేశమునందు కన్పట్టునో, అట్లే ఒక ప్రదేశమందు సూర్యుడు చంద్రబింబచ్ఛన్నుడై కన్పట్టకపోయినను, మరియొక ప్రదేశమునందు కన్పట్టును. అందుచేతనే సూర్యగ్రహణము అన్ని ప్రదేశము లందును పట్టదు. ముందు చూపబోవు గణితము ప్రకారము ఒక సంవత్సరమందు పట్టు చంద్రగ్రహణముల సంఖ్యకంటె, సూర్యగ్రహణముల

సంఖ్య అధికము. ఐనను సూర్యగ్రహణము ప్రతీ దేశమందును కన్పట్టకపోవుటచే ఒక దేశములోనుండు ప్రజలు చంద్రగ్రహణములే తరచు చూచుచుండుటయు, సూర్యగ్రహణములను అరుదుగ చూచుటయు సంభవించు చుండును. ఒక సంవత్సరకాలములో ఎక్కువపక్షము 5 సూర్య గ్రహణములు, రెండు చంద్రగ్రహణములు కాని, లేక 4 సూర్యగ్రహణములు, మూడు చంద్రగ్రహణములు కాని, తక్కువపక్షము రెండు సూర్యగ్రహణములే పట్టి, చంద్రగ్రహణములు లేకుండుటగాని సంభవింపవచ్చునని గణితము వలనను, క్షేత్రమువలనను నిరూపించ వచ్చును. సూర్యుడు మేఘఛ్ఛన్ను డనగా మేఘచ్ఛాయలో నున్న మానవుడు సూర్యుని చూచుట లేదని యర్థము. అట్లే సూర్యుడుచంద్రచ్ఛన్నుడై సూర్యగ్రహణముపట్టినప్పుడు, ద్రష్టయగు మానవుడు చంద్రగోళచ్ఛాయలో నున్నాడని యర్థము. చంద్రచ్ఛాయ యొక్క పొడుగు దరిదాపు 2,40,000 మైళ్ళే యగుటచే, అనగా మనకు చంద్రునికి మధ్య నుండు దూరముతో ఇంచుమించు సమానమే యగుటచేత చంద్రచ్ఛాయ భూమియందు కొద్ది ప్రదేశమే స్పృశించుచు పోవును. ఆచాయయం దుండు జనులే సూర్యగ్రహణమును చూడకలుగుదురు. ఒకప్పుడు చంద్రబింబ ప్రమాణము సూర్యబింబ ప్రమాణము నంతను కప్పివేయ గలుగును. అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణ మందుము. మరియొకప్పుడు చంద్రబింబము సూర్యబింబము నంతయు కప్పివేయజాలక, సూర్యబింబము యొక్క మధ్య భాగమును మాత్రమే కప్పివేయ గలుగును. అప్పుడు సూర్యబింబముయొక్క చుట్టుభాగము కంకణము వలె మిగిలిపోవును. అప్పుడు కంకణ గ్రహణమందుము.

ఇక చంద్రగ్రహణము పూర్ణిమయందేలపట్టవలయును? ప్రతి పూర్ణిమయందేల పట్టదు ? సూర్యగ్రహణము అమావాస్య యందేల పట్టవలయును? ప్రతి అమావాస్యయందేల పట్టదు ? అను విషయములను గూర్చి తెలిసికొనవలయును. చంద్రగ్రహణ మనగా, చంద్రుడు భూచ్ఛాయలో ప్రవేశించుటయే యని మనము తెలిసికొని యున్నాము. (మొదటి క్షేత్రమును చూడుడు) అనగా సూర్యునికి, చంద్రునికి మధ్యగా భూమి రావలయునన్న మాట. అప్పుడు పూర్ణిమయగును. కావున పూర్ణిమా కాలమందే చంద్రబింబము భూ ఛా ప్రవేశము చేయ కలుగును. ఐనచో ప్రతి పూర్ణిమయందేల చంద్రుడు భూ ఛా ప్రవేశము చేయడు? అన్నప్రశ్నకు సమాధానమేమన, చంద్రుడు ఆ ఛాయకు కొంచెము పై గానో, కొంచెము క్రిందుగానో పయనించి, ఆ భూచ్ఛాయలో పడకుండా దాటిపోవు నన్నమాట. దానికి కారణము చంద్రుడు, భూమియు, సూర్యుడును ఒకే తలము (plane) మీద లేక పోవుటయే. భూమి సూర్యునిచుట్టు తిరుగు తలమునకు 'క్రాంతివృత్త తలము' (Ecliptic plane) అందుము. చంద్రుడు భూమిచుట్టు తిరుగుతలము దానికి భిన్నమై, పై తలమునకు సుమారు 5 భాగలలో నుండును. అందుచే సాధారణముగా పూర్ణిమాకాలమునకు చంద్రుడు క్రాంతి నృత్తతలమునకు పై భాగముననో, క్రింది భాగముననో భూచ్ఛాయను దాటిపోవుచుండును. అట్లే అమావాస్య కాలమందుకూడ సాధారణముగా క్రాంతివృత్త తలమునకు దూరముగానుండి పయనించి పోవుచుండును. అట్లు కాక, పూర్ణిమకాలమందుగాని, అమాకాలమందుగాని చంద్రుడు క్రాంతివృత్త తలమునకు బాగుగా దగ్గర పయనించుచో, తప్పక గ్రహణము సంభవించును.

ఇక పూర్ణిమాకాలమందు చంద్రగ్రహణము సంభవించుటకై చంద్రుడు క్రాంతివృత్త తలమునుండి ఎంత దూరములో నుండవలయును? అట్లే సూర్యగ్రహణము సంభవించుట కెంతదూరములో నుండవలయును? అను ఒక ముఖ్య గణితమును తెలిసికొందము. క్రాంతివృత్త తలమునుండి చంద్రునికి గల దూరమును 'శరము' లేక 'విక్షేపము' అందురు (Celestial latitude). ఈ చంద్ర శరము క్షణక్షణము మారుచుండును. పూర్ణిమాంత మునకు చంద్రగ్రహణము, అమావాస్యాంతమునకు సూర్యగ్రహణము కావున పూర్ణిమాంతమునకు, అమాంతమునకు చంద్రశరమును గణితముచేసి తత్పూర్వాపర కాలములందు శరములో ప్రతి ఘటికావికారమును గణించి గ్రహణమును సాధించెదరు.

స = సూర్యగోళము.

భ = భూగోళము.

అ క ట = భూచ్ఛాయ = Shadow cone.

చ = భూచ్ఛాయా ప్రవేశము చేయు చంద్రగోళము.

చిత్రము - 133

పటము - 1

చిత్రము - 134

పటము - 2

చిత్రము - 135

పటము - 3

చిత్రము - 136

పటము - 4

ప = తభసకోణము = రవిబింబీయ వ్యాసార్ధము = Sun's angular radius.

బ = చభటకోణము = చంద్రకక్ష యందు భూఛా వ్యాసార్ధము = దమరేఖా ఖండము = angular radius of the shadow cone at the moon.

భతకకోణము = రవి లంబనము = ల = Sun's parallax.

భదకకోణము = చంద్రలంబనము = ళ = Moon's parallax.

సటతకోణము = భూఛాకోణార్ధము = డ.

ఫ = చంద్రబింబీయ వ్యాసార్ధము = చద రేఖాఖండము. = Moon's angular radius.

చంద్రబింబము భూ ఛా ప్రవేశమందు చ అను బిందువు వద్దనున్న దనుకొనుము. అప్పుడు చంద్రునిశరము = చభట కోణము + చంద్రబింబీయ వ్యాసార్ధము

సటత కోణము = ప - ల 507

బ = ళ + ల - ప

కావున స్పర్శకాలమందు చంద్రశరము = ళ+ల - ప+ఫ. పూర్ణిమాంతమునకు గ్రహణము పట్టవలయునన్న చంద్రబింబ కేంద్రము చ అను బిందువునకు ఇంకను క్రిందుగా నుండవలయును. అనగా చంద్రశరము శ+ల - ప + ఫ కంటె తక్కువగా నుండవలయును, రెండవక్షేత్రము చూడుడు. దానియందు చంద్రుడు పూర్తిగా భూఛా ప్రవిష్టుడై యున్నాడు. అప్పుడు చ అను బిందువుయొక్క అనగా చంద్రునియొక్క శరము ళ+ల - ప - ఫ యగును. సామాన్యముగా ళ అనగా చంద్రపరమ లంబనము 58 లిప్తలు. ల = రవిపరము లంబనము = 8 విలిప్తలు. ప అనగా రవి బింబీయ వ్యాసార్ధము 16 లిప్తలు. ఫ అనగా చంద్ర బింబీయ వ్యాసార్ధము 16 లిప్తలు. కావున అసంపూర్ణ చంద్రగ్రహణము పట్టవలయునన్న పూర్ణిమాంతమునకు చంద్రశరము.

57'+8" - 16'+15' అనగా దాదాపు 56' లిప్తలు లోపుగా నుండవలయును. సంపూర్ణ చంద్రగ్రహణము పట్టవలయునన్న పూర్ణిమాంతమునకు చంద్రశరము 57' +8" - 16' - 15' అనగా దరిదాపు 26' లిప్తలుండ వలయును. ఇక సూర్యగ్రహణ విషయము. మూడవ క్షేత్రము చూడుడు. చంద్రబింబము సూర్యబింబము నాచ్ఛాదింపవలయుననిన దాని బింబకేంద్రము చ; అది పటమునందున్న స్థలమునకు క్రిందుగా నుండవలయును. దమ రేఖాఖండము సభద కోణముతో సమానము. = ళడ; కాని డ= ప - ల కావున, దమ = ళ + ప - ల. కాన అసంపూర్ణ సూర్యగ్రహణము పట్టవలయునన్న చంద్రశరము అమావాస్యాంతమునకు ళ+ప - ల + ఫ కంటె తక్కువగా నుండవలయును. అనగా 58' + 16' - 8" + 15' = 58. లిప్తలకు తక్కువగా నుండవలయును.

ఈ పై గణితమునుబట్టి ఒక ముఖ్యవిషయము మనకు గోచరించును. చంద్రుడు క్రాంతివృత్త తలమునుండి దాదాపు 300 లిప్తల వరకును సంచరించుచుండగా పూర్ణిమాంతమునకు చంద్రశరము 26 లిప్తలలోపుగా నుండిన, అసంపూర్ణ చంద్రగ్రహణ మనియు, అమావాస్యాంతమున 88 లిప్తలు లోపుగా నుండిన, అసంపూర్ణ సూర్యగ్రహణ మనియు, 58 లిప్తలుగా నుండిన సంపూర్ణ సూర్యగ్రహణ మనియు తేలినది. దీనినిబట్టి సూర్యగ్రహణము పట్టుట తేలిక యనియు, చంద్రగ్రహణము పట్టుట అంతకంటె అరుదనియు తేలినది. కాని సాధారణముగా ఒక ద్రష్ట తరచు చంద్రగ్రహణములనే చూచును. సూర్యగ్రహణములను అంతగా చూడడు. దీనికి కారణ మేమన, చంద్రగ్రహణము భూగోళార్ధమునకు పట్టుట; సూర్యగ్రహణము భూగోళములో ఎక్కడో ఒక్కచోట పట్టి మిగిలిన ప్రదేశములకు కన్పట్టకపోవుటయే యనియు తెలియనగును.

సపాతసూర్యుడు: పూర్ణిమాంతమునకు చంద్రగ్రహణము, అమాంతమునకు రవిగ్రహణము పట్టవలయునన్న తత్కాలమందు చంద్రశరము ఒక హద్దు లోపుగా నుండవలయునని తెలిసికొంటిమి. ఈ క్రింది క్షేత్రములో రామ వృత్తము క్రాంతివృత్త మనుకొనుము.

చిత్రము - 137

పటము - 5

క్రాంతివృత్తమనగా, సూర్యుడు సంచరించు వృత్తము. చ బిందువు చంద్రబింబ కేంద్ర మనుకొనుము రాచ వృత్తము చంద్రుడు సంచరించు విక్షేపవృత్త మనుకొనుము. చమ రేఖాఖండము చంద్రశరము. ఈ చంద్రశరము తక్కువగా నుండవలయునన్న చంద్రుడు రా బిందు సమీపములో నుండవలయును. రా బిందువును 'పాత' యందురు. పాత లనగా రవి సంచరించు క్రాంతిమండలమును చంద్రుడు మొదలగు ఇతర గ్రహములయొక్క విక్షేపవృత్తములు ఖండించు బిందువులు. ప్రతి గ్రహ విక్షేపవృత్తము క్రాంతివృత్తమును రెండు రెండు బిందువులలో ఖండించును. చంద్రవిక్షేపవృత్తము ఖండించు పాతలకే రాహు కేతువు లని పేరు. కావున చంద్రుడు పూర్ణిమాంత సమయములందు రాహుకేతువుల సమీపమం దున్నచో గ్రహణము పట్టునన్నమాట. అందుచేతనే పురాణములందు అలంకారికముగా రాహు కేతువులు చంద్ర సూర్యులను గ్రసించుచుందురని కథ పుట్టెను. గ్రహణము పట్టవలయు నన్నను, చంద్రశర. మింత కావలయునన్నను దానినిబట్టి చంద్ర రాహువులమధ్య దూరమింత కావలయునని సిద్ధించును. రాహు కేతువులు పరస్పరము షడ్రాశ్యంతరితులగుటచేతను, పూర్ణిమాంతమున రవి చంద్రులుకూడ షడ్భాంతరితులగుటచేతను, పూర్ణిమాంతమున చంద్రుడొక పాతనుండి ఎంత దూరములో నుండునో, రవి రెండవ పాతనుండి అంతే దూరములో నుండును. అమాంతమున రవి చంద్రు లొకచోటనే యుండుటచేత, చంద్రపాతలమధ్య దూరమెంతయగునో, రవి పాతలమధ్య దూరముకూడ అంతేయగును. చంద్రశరము 88 లిప్తలగుచో, చంద్రపాతలకుమధ్య దూరము 16 భాగల 30 లిప్తలుండును. చంద్రశరము 58 లిప్తలగుచో చంద్రపాతల దూరము 10 భాగల 45 విప్తలుండును. చంద్రశరము 56 లిప్తలగుచో, చంద్రపాతల మధ్య దూరము రమారమి 10 భాగల 30 లిప్తలుండ వలయును. చంద్రశరము 26 లిప్తలగుచో చంద్ర పాతలమధ్య దూరము రమారమి 5 భాగ లుండవలయును. చంద్రపాతలమధ్య దూరమే రవిపాతలమధ్య దూరము గావున రవిపాతలమధ్య దూరము అమావాస్యాంతమున 16 భాగల 30 లిప్తలకు లోపుగా నుండిన అసంపూర్ణ సూర్యగ్రహణమనియు, 10 భాగల 45 లిప్తల లోపుగా నుండిన సంపూర్ణ సూర్యగ్రహణ మనియు, పూర్ణిమాంతమున రవిపాతలమధ్య దూరము 10 భాగల 30 లిప్తల లోపుగానుండిన అసంపూర్ణ చంద్రగ్రహణ మనియు, 5 భాగల లోపున నుండిన సంపూర్ణ చంద్రగ్రహణము పట్టుననియు తేలినది. రవిపాతలమధ్య దూరమునకే సపాత సూర్యుడని ప్రాచీన సిద్ధాంతులు వ్యవహరించిరి.

షాల్టియనుల సారోస్ : షాల్టియా దేశస్థులగు ప్రాచీన ఖగోళశాస్త్రజ్ఞు లొక విషయమును చెప్పిరి. అది ఏదనగా, 6585 దినములలో 223 చాంద్రమాసము లున్నవి. అదే కాలములో రవి రాహువునుండి తిరిగి రాహువునకు 19 పర్యాయములు పరిభ్రమించును. కావున యీరోజున గ్రహణము పట్టినచో తిరిగి 6585 దినములకు పూర్ణిమ గాని అమావాస్యగాని సంభవించుటయేగాక, పైన జెప్పిన సపాతసూర్యుడు తిరిగి అంతేయుండును. కావున తిరిగి అదే గ్రహణము సంభవించును. ఈ కాలమునకు వారు సారోస్ అని పేరుపెట్టిరి. ఒక సారోస్ కాలమందు ఏ యే గ్రహణములు పట్టునో తిరిగిమరియొక సారోస్ కాలమందు అవే గ్రహణములు అదేవరుసలో పట్టును.

ప్రాచీన భారతీయ సిద్ధాంతుల గ్రహణ గణిత విధానము : ప్రాచీన సిద్ధాంతులలో అగ్రగణ్యుడని పేరువహించిన భాస్కరాచార్యుని గ్రహణ గణిత విధానమును పరిశీలించెదము. ముందుగా నవీనభంగిలో ఏ గణితప్రక్రియ కలదో అదే ప్రక్రియ ప్రాచీన సిద్ధాంతులుకూడ చేసి యున్నారని మనము తెలిసికొనవలయును. భాస్కరాచార్యుడు రచించిన సిద్ధాంత శిరోమణిలో ముందుగా పర్వ సంభవాధికారమని చెప్పబడినది. అనగా గ్రహణము సంభవించునాయని ముందుగా పంచాంగకర్త గణితము వేసి తెలిసికొనవలయును. పూర్ణిమాంతమునకు, అమావాస్యాంతమునకు సపాతసూర్యుని లెక్కింపవలయును. ఆ సపాతసూర్యుడు 14 భాగలలోపుగా నున్నచో చంద్రగ్రహణము సంభవించుటకు వీలున్నది. చంద్రవిక్షేపము మానై క్యార్ధమునకు తక్కువగా నున్నచో గ్రహణము సంభవించును. చంద్రగ్రహణ విషయములో మానై క్యార్ధము 56 లిప్తలు. సూర్యగ్రహణ విషయములో 32 లిప్తలు. 56 లిప్తలు మానై క్యార్దము కలుగవలయుననిన సపాతసూర్యుడు 12 భాగలుండవలయును. 32 లిప్తల మానై క్యార్ధమునకు 7 భాగలుండవలెను. స్థూల గణితములో ముందు సపాతసూర్యుడు మధ్యగ్రహముగా పరిగణింపబడును. కావున మధ్యరవికిని, స్ఫుటరవికిని దూరము దరిదాపు 2 భాగలవరకు ఉండవచ్చును. కావున సపాతసూర్యుడు 14 భాగలలోపుగా నున్నచో చంద్రగ్రహణము సంభవించుటకు వీలున్నది.

చంద్రగ్రహణములో భూచ్ఛాయ గ్రాహకము, చంద్ర బింబము గ్రాహ్యము. సూర్యగ్రహణ విషయములో చంద్రబింబము గ్రాహకము, సూర్యబింబము గ్రాహ్యము. మానై క్యార్ధమనగా గ్రాహ్య గ్రాహక బింబయోగార్ధము. ఇది చంద్రగ్రహణ విషయములో నవీనభంగిలో ఏ| ప్రకారము 56 లిప్తలు అని గణితములో తేలినదో, అట్లే భాస్కరాచార్యోక్తి ననుసరించియు 56 లిప్తలే. కాని సూర్యగ్రహణ విషయములో భాస్కరాచార్య మతమునకు, నవీనమతమునకు కొంత తేడా కలదు. నవీన మతములో భూగోళమం దెచ్చటనైనా సూర్యగ్రహణము సంభవించునా అని తర్కించెదము. కాని ప్రాచీనమతములో స్వదేశములో సూర్యగ్రహణము సంభవించునా అని తర్కించుటచేత మానై క్యార్ధము చంద్రరవిబింబ యోగార్ధముగానే గ్రహించి 32 లిప్తలుగా గ్రహించిరి. ఇదియు గణితోపపన్నమే.

భాస్కరాచార్యుడు చంద్రుని పరమ విక్షేపమును 4 భాగల 30 లిప్తలుగా గ్రహించెను. నవీన మత ప్రకారము ఈ పరమ విక్షేపము 4 భాగల 58 లిప్తలనుండి 5 భాగల 18 లిప్తలవరకు మారుచుండును. అట్లే భాస్కరుడు గ్రహించిన భూఛావ్యాసార్ధముకూడ నవీన మతమునకు సరిపోవును. నవీన మతమునందు గ్రహణ గణితములో ఏయే సూక్ష్మాంశములు గలవో వాటినన్నిటిని భాస్కరుడు చక్కగా ప్రతిపాదించి ప్రాచీన భారతీయుల గణిత నై శిత్యమును ప్రకటించియుండెనని తెలియనగును.

ధూ. అ. సో.


గ్రామ విద్యుదీకరణము :

ఆధునిక యుగమున ప్రతి దేశముయొక్క ఆర్థికాభి వృద్ధియందును విద్యుత్తు సరఫరా అత్యంత ప్రముఖమైన పాత్ర వహించుచున్నది. ప్రతి దేశముయొక్క అభ్యుదయము, ఆ దేశ మందలి ప్రతి వ్యక్తియు సంవత్సరమున కుపయోగించు కిలోవాట్ల విద్యుత్తుపై ఆధారపడియుండు నని సర్వత్ర ఆమోదింపబడిన సిద్ధాంతము. అనగా ప్రజా సంక్షేమమును, వినియోగ మగుచున్న విద్యుత్పరిమాణమును (కిలో వాట్ల సంఖ్యలో) బట్టి లెక్కించెదము. ఇదియే సాంకేతికముగా 'పర్ కాపిటా కన్సంప్షన్' (percapita consumption) అనబడుచున్నది.

గ్రామములయందు విద్యుచ్ఛక్తి సరఫరా యగుటచే అందలి ప్రజల ఆర్థికజీవితము అతిత్వరితముగ పరివర్తనము చెందుచున్నది. సహజముగ పేద స్థితియందుండి, జీవన ప్రమాణమును, ఉత్పత్తి పాటవమును అత్యంత హీనస్థితిలో నున్న గ్రామము, విద్యుత్ సరఫరా ఫలితముగా, ఉత్పత్తిశక్తి యందును, జీవన ప్రమాణము నందును ముందంజ వేయుచున్నది. విద్యుత్తువలన పెక్కు కార్యకలాపములలో మానవుడు తన శరీర శ్రమను తగ్గించుకొనుటయో, కాక కొన్ని రంగములలో అట్టి శ్రమతో అవసరమే లేకుండుటయో సంభవించుచున్నది.

ఎలెక్ట్రిక్ మోటారులవలన నీటిపారుదల ఈనాడు సుకర మయినది. అందుచే ప్రాచీనకాలము నుండియు ఎద్దుల సహాయముతో నీటిని తోడు విధానమునకు వ్యవసాయదారుడు స్వస్తి చెప్పగలుగుచున్నాడు. వ్యయశీల మైన అట్టి ప్రాచీన విధానము ఈనాడు క్రమముగా అంతమొందుచున్నది. విద్యుచ్ఛక్తివలన చెఱకును నలగ గొట్టుటకును, ధాన్యమును నూర్పిడిచేసి చెరగుటకును, ఇతర వ్యయసాయ కార్యక్రమములను కొనసాగించుటకును సాధనము లేర్పడినవి. అందుచే మానవుని శ్రమకు అవసరము తగ్గిపోవుచున్నది. వ్యవసాయ కలాపము లన్నియు చౌకగా, త్వరితముగా జరిగిపోవుచున్నవి. తత్ఫలితముగా, వ్యవసాయదారునకు విరామ మేర్పడుచున్నది. ఆ విరామమును వినోదములకును, ఇతర సాంఘిక కార్య క్రమములకును వినియోగించుకొన గల్గుచున్నాడు.

ఆధునికములైన పాడికేంద్రముల (Dairy Farming) యందును, కోళ్ళ పెంపకము (Poultry Farming) నందును, పాలుపితుకుట, గ్రుడ్లను పొదుగుట మున్నగు ప్రక్రియలందును విద్యుత్తు ప్రముఖమైన పాత్ర దాల్చుచున్నది. ఉద్యానకృషి రంగములో పండ్లరసమును శాస్త్రీయ పద్ధతులపై నిలువచేయగలుగుట వలన, తోట యజమాని విపణివీథిలో తన ఉత్పత్తి ఫలితముమ తన ఇష్టము వచ్చినప్పుడు ఎక్కువ లాభకరముగా అమ్ముకొనుటకు అవకాశము గల్గుచున్నది. తన ఫలములు చెడి పోవునను భయము ఆతనికి లేకపోవుచున్నది. అంతేకాక మార్కెటులో వాటిని చవుకపారుగా తెగనమ్ముకొన వలసిన దుస్థితియు తప్పుచున్నది. దీనికంతకును కారణము ఆతనికి విద్యుత్తు లభించుటయే. విద్యుత్తు వలన పండ్లరసమును నిలువచేయ గలుగుటచే తోట యజమానికి న్యాయమైన లాభము ప్రాప్తించుచున్నది. అందువలన ఆతడు క్రమబద్ధముగా తన ఉత్పత్తిని వివణి వీధికి వంప గలుగుచున్నాడు. మొన్న మొన్నటివరకు వండ్లరసమును నిలువచేయు విధానము భారతదేశములో అభివృద్ధి నొంద