సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గద్యవాఙ్మయము (సంస్కృతము)
గద్యవాఙ్మయము (సంస్కృతము) :
సంస్కృతభాష విశ్వభాషాప్రపంచమున ప్రాచీనతమ మైనది. అది అఖిలభాషలకు జనని. భాషాంతర విలక్షణములును, విశిష్టములునైన ప్రకృతి ప్రత్యయాది సంస్కార విశేషములచే సంస్కరింపబడినదగుటచే దానికి సంస్కృతమని పేరు. ‘భాష్యతే, భాషణాది వ్యవహారః అనుష్ఠీయతే, యయా సా భాషా'. దేనిచే భాషణాది వ్యవహారము కావింపబడునో అది భాషయగుచున్నది. అట్టి సంస్కృత భాషచే నిర్మింపబడిన కావ్యములు సంస్కృత కావ్యములు. తాదృశకావ్యముల సముదాయమే సంస్కృత వాఙ్మయ మగుచున్నది. 'కవితే చాతుర్యేణేతి కవిః తస్య కర్మ కావ్యం.' పద్యకావ్య మనియు, గద్యకావ్య మనియు కావ్యము ద్వివిధము. ఛందోబద్ధమైనది పద్యకావ్యము. తద్భిన్నమైనది గద్యకావ్యము.
వేదములందలి గద్యభాగములే ప్రాచీన మహర్షి విరచిత గద్యములకును. తదనంతర మహాకవి విరచితము లయిన గద్యములకును మూలభూతములని తెలియుచున్నది. లౌకికభాషగా సంస్కృతము వాడుకలోనున్న ప్రాచీన కాలమున సంభాషణ ప్రతి సంభాషణములకు గద్యమే సాధనమయ్యెను.
వేదములందలి బ్రాహ్మణములు వేదమంత్రార్థ వివరణాత్మకములు. బ్రాహ్మణములలో కొన్ని విధినిషేధములను బోధించుచున్నవి. కొన్ని స్తుతిపరములుగా, నిందాపరములుగా నుండి, విధినిషేధములకు ప్రోద్బలకములై విరాజిల్లుచున్నవి. తైత్తిరీయ యజుర్వేదము నందు తప్ప ఇతర వేదములందలి బ్రాహ్మణములన్నియు ప్రాయశః . గద్యాత్మకములుగానే కనిపించుచున్నవి. తైత్తిరీయ యజుర్వేదమునందు ఏడు కాండములుగా నున్న సంహితాభాగము ముప్పాతిక మూడువంతులు గద్యాత్మకమైయున్నది. బ్రాహ్మణ శేషభూతములయిన ఆరణ్యకములును, ఆరణ్యకోత్తరకాలికము లయిన ఉపనిషత్తులును గద్యమయములుగ నున్నవి.
వేదముల అపౌరుషేయత్వమును విశ్వసించువారు వేదములందలి వివిధభాగములగు బ్రాహ్మణ - ఆరణ్యక ఉపనిషత్తులందుగల భాషాకాఠిన్య లాలిత్యము లేక కాలికములును, స్వతస్సిద్ధములునై యున్నవనుచున్నారు. ఇతరులు వేద వివిధభాగములు గల గద్యమున నొక క్రమ వికాసమును లక్షించుచున్నారు. వేదగద్యము ఛాందస ప్రయోగబహుళము. బ్రాహ్మణారణ్యకము లందలి గద్యము వేదగద్యముకంటె స్వల్పముగ సరళముగ నున్నది. ఆరణ్యకములందలి గద్యముకంటె ఉపనిషద్గ్రంథములందలి గద్యము విశేషముగ సరళముగ కనిపించు చున్నది. క్రమోదాహరణములు :
భాషాకాఠిన్యోపేతమయిన వేదగద్యము:
ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్తస్మిన్ప్రజాపతిర్వాయుర్భూత్వా ౽చరత్స ఇమామపశ్య త్తాం వరాహోభూత్వా౽హరత్తాం విశ్వకర్మాభూత్వా వ్యమార్ట్ థ్సా౽ప్రథత, సాపృథివ్యభవ త్తత్పృథివ్యై పృథివీత్వం తస్యామశ్రామ్య త్ప్రజాపతి స్సదేవానసృజత వసూన్రుద్రానాదిత్యాన్తే దేవాః ప్రజాపతి మబ్రువ న్ప్రజాయామహా ఇతిసో౽బ్రవీద్యథాహం యుష్మాగ్ంస్తపసాజ౽సృక్ష్యేవం తపసి ప్రజనన మిచ్ఛధ్వమితి.
(కృ-యజు- కాం. 7-క్ర-అను వా. 5)
విధిబోధకగద్యము :
'వాయవ్యగ్గ్ం శ్వేతమాల భేత ’
'ఆదితేభ్యో భువద్వద్భ్యశ్చరుం నిర్వ పేత్ '
'ఆగ్నావైష్ణవమేకాదశ కపాలం నిర్వపేత్'
'అగ్నయేకామాయ పురోడాశమష్టాకపాలం
(నిర్వ వేత్.` (కృ. య. )
నిషేధబోధకగద్యము :
తస్యైతద్ర్వతం నా౽నృతంవదేన్న
మాగ్ం సమశ్ఙ్నీయాన్నస్త్రియ
ము పేయాన్నాస్యపల్పూలనేన వాసః
పల్పూలయేయుః । ఏతద్దిదేవా
స్సర్వన్నకుర్వంతి.
(కృ. య. కాం. 2)
స్తుతిపరగద్యము :
భూతికామోవాయుర్వైక్షేపిష్ఠా
దేవతావాయుమేవ స్వేన
భాగధేయేనోపధావతి స
ఏవైనం భూతిం గమయతి.
(కృ. య. కాం 2)
నిందాపర గద్యము :
యదశ్ర్వశీయ తతద్రజతగ్౦
హిరణ్యమభవత్తస్మాద్రజతగ్ ౦
హిరణ్యమదక్షిణ్య మసృజగ్ం
హియోబర్ హిషిదదాతి
పురాస్య సంవత్సరాద్గృహేరుదంతి.
(కృ. య. కాం. 1)
ఈ క్రింది గద్యము సరళమును సుగమమునై యున్నది :
అగ్నిర్వైదేవానామవమో విష్ణుః పరమస్తదంత రేణ
సర్వా అన్యాదేవతాః । ఆగ్నావైష్ణవం పురోడాశం
నిర్వపంతి దీక్షణీయ మేకాదశకపాలం సర్వాభ్య
ఏవైనం తద్దేవతాభ్యో౽నంతరాయం నిర్వపంతి.
(ఐతరేయ. బ్రా. 1-1)
ఆరణ్యకోదాహరణము :
యో౽పాంపుష్పం వేద । పుష్పవా న్ప్రజావా
న్పశుమాన్భవతి । చంద్రమావా అపాం
పుష్పం । పుష్పవాన్ప్రజావాన్పశుమాన్భవతి ।
య ఏవం వేద.
యోపామాయతనం వేద ।
ఆయతనవాన్భవతి । అగ్నిర్వా అపామాయతనం
ఆయతనవాన్భవతి । యో౾గ్నే రాయతనంవేద ।
ఆయతనవాన్భవతి । ఆపోవా అగ్నేరాయతనం ।
ఆయతనవాన్భవతి । య ఏవం వేద ।
....... .......... ........ ......... ....... .........
యోపామాయతనంవేద । ఆయతనవాన్భవతి ।
సంవత్సరోవా అపామాయతనం ।
ఆయతనవాన్భవతి । యస్సంవత్సరస్యాయతనంవేద ।
ఆయతనవాన్భవతి । ఆపోవైసంవత్సరస్యాయతనం।
ఆయతనవాన్భవతి । యఏవంవేద ॥
యో౽ప్సునావం ప్రతిష్ఠితాంవేద ।
ప్రత్యేవతిష్ఠతి । ఇమే వైలోకాఅప్సు ప్రతిష్ఠి తాః ।
తదేషా౽భ్యనుక్తా ।
(కృ. య. ప్రపా. 1. అనువా. 22)
ఈ ఆరణ్యక గద్యము సులభముగ సరళముగ, నున్నది. ఇట్లే క్రింది ఉపనిషద్గద్యము సరసము, సరళము. ఉదా :
యత్రనాన్యత్పశ్యతి నాన్యచ్ఛృణోతి
నాన్యద్విజానాతి తద్భూమా । అథయత్రా
న్యత్పశ్యతి అన్యచ్ఛృణోతి అన్యద్విజానాతి
తదల్పం । యోవైభూమా తదమృత మథ
యదల్పం తన్మర్త్యం.
(ఛాందోగ్య, 7-24)
సూత్రసాహిత్యమున గల గద్యము అత్యంత సంక్షిప్తమును, అత్యంత గభీరమును, విపుల వ్యాఖ్యానము నపేక్షించునదియునై యున్నది. ఉదా :
ఇకోయణచి । అనచిచ । వృద్ధిరేచి । హశిచ ।
రోరి । ఓసిచ । జసః శీ వోతోగుణవచనాత్ ।
క్తస్యచవర్తమానే !
(సిద్ధాంత కౌముది)
అథాతోబ్రహ్మజిజ్ఞాసా । జన్మాద్యస్యయతః
శాస్త్రయోనిత్వాత్ । తత్తుసమన్వయాత్ ।
శ్రుతత్వాచ్చ !
(శాంకర బ్రహ్మసూత్ర భాష్యము, జిజ్ఞాసాధికరణము).
సంస్కృత భారతాదిని పౌష్యపర్వములో-
సౌతిరువాచ - గద్యమ్ :
“జనమేజయః పారిక్షితః సహ భ్రాతృభిః కురుక్షేత్రే
దీర్ఘసత్రముపాస్తే"
ఇత్యాదిగా మూడుపుటల గ్రంథమును, సంభవపర్వమున:
"శంతనుః ఖలు గంగాం భాగీరథీముపయేమే.
తస్యామస్య జజ్ఞే దేవవ్రతోనామ యమాహు
ర్భీష్మమితి."
ఇత్యాదిగా రెండుపుటల కథయు కనబడుచున్నవి. ఇందలి వాక్యములు చిన్నవై, సరళములై, కారకమర్యాదో పేతములై శోభిల్లుచున్నవి.
భరతాచార్యుడు మున్నగువారి నాట్యశాస్త్రాదుల యందలి గద్యభాగము లింతకంటె ఒకించుక ప్రౌఢములుగ నున్నవి. పురాణసాహిత్యమునందలి సంస్కృతగద్యము సుమనోహరమైనది. ఉదా :
"యథైవ వ్యోమ్ని వహ్నిపిండోపమం త్వామహమ పశ్యం, తథైవా౽ద్యాగ్రతో గతమప్యత్ర భగవతా కించిన్న ప్రసాదీకృతం విశేష ముపలక్షయామీత్యు క్తేన భగవతా సూర్యేణ నిజకంఠాదున్ముచ్య స్యమంతకం నామ మణివర మవతార్య ఏకాంతే న్యస్తం.”
(విష్ణుపురాణము 4-13-14)
నిరుక్తమునందు గద్యరూప సూత్రములు కలవు. అందలి యాస్కాచార్యుని నిర్వచన శైలి విలక్షణము, హృదయంగమము. ఉదా :
నరకం – న్యరకం నీచైర్గమనం నాస్మిన్ రమణం స్థాన మల్ప మప్యస్తివా !
నాకం - కమితి సుఖనామ తత్ప్రతిషిద్ధం
సూర్యం - సత్తేర్వా స్వీర్యతేర్వా ఇతి ।
భద్రం – భజనీయం, భూతానామభి ద్రవణీయం భవద్రమయతీతి ।
యాస్కుని వ్యాఖ్యాన ప్రకారము సర్వోత్కృష్టము. ఆతని గద్యశైలి సరసము, సులభము. ఉదా :
హిరణ్య గర్భః సమవర్తతాగ్రే
భూతస్య జాతః పతిరేక ఏవ
(ఋగ్వేదము.)
"హిరణ్యగర్భః హిరణ్మయో గర్భో౽స్యేతి. హిరణ్యం కస్మాత్ ? హ్రియతే ఆయమ్యమానం వా, హ్రియతే జనాజ్జనమితివా, హితరమణం భవతీతివా, హర్యతేర్వాస్యాత్ప్రేప్సా కర్మణః । అగ్రే సమభవత్ । భూతస్యజాత ఏక ఏవ పతిః । సదాధార పృథివీం దివంచ । సూర్య ఏవ ఆకర్షణద్వారాపృథివీం ధారయతి దివంచేతి భావః.”
“మహాభాష్యం వా పఠనీయం,
మహారాజ్యం వా శాసనీయం”
అను సూక్తికి నిదాన భూతమైన భగవత్పతంజలి మహా భాష్యము నందలి గద్యసరణి సుస్పష్టము, ఉదాత్తము, మనోహరము, ఆదిపాఠకులకు షడ్రసోపేత భోజనము.
ఉదా :
"అథ గౌరిత్యత్ర కశ్శబ్దః ? కిం యత్తత్సాస్నా లాంగూల కకుద ఖురవిషాణ్యర్థ రూపం సశబ్దః ? నేత్యాహ | ద్రవ్యం నామతత్। యత్తర్హి తదింగితం చేష్టితం నిమిషిత మితి సశబ్దః ? నేత్యాహ। క్రియానామసా। యత్తర్హి తచ్ఛుక్లో నీలః కపిలః కపోత ఇతి । స శబ్దః ? నేత్యాహ | గుణోనామ సః । యత్తర్హి తద్భిన్నే ష్వభిన్నం ఛిన్నేష్వ చ్ఛిన్నం. సామాన్యభూతం సశబ్దః? నేత్యాహ॥ ఆకృతి ర్నామసా । కస్తర్హి శబ్దః ? యేనోచ్చారితేన సాస్నా లాంగూల కకుద ఖురవిషాణినాం సంప్రత్యయో భవతి సశబ్దః ।"
........ ........ ........... ........... ...........
“ఊహః ఖల్వితి" - న సర్వైర్లింగైర్నచ సర్వాభిర్వి భక్తి భిః వేదే మంత్రా నిగదితాః । తేచావశ్యం యజ్ఞగతేన పురుషేణ యథాయథం విపరిణమయితవ్యాః । తాన్నా వైయాకరణః శక్నోతి యథాయథం విపరిణమయితుం। తస్మాద ధ్యేయం వ్యాకరణం।"
“ఆగమః ఖల్వితి” - బ్రాహ్మణేన నిష్కారణో ధర్మః షడంగో వేదో౽ధ్యేయో జ్ఞేయశ్చేతి। ప్రధానం చ షడంగేషువ్యాకరణం. ప్రధానేకృతో యత్నః ఫలవాన్భవతి."
సంక్షిప్త సూత్రార్థ వివరణాత్మక ములయిన దార్శనిక భాష్యములందలి గద్యగుంఫము అతి ప్రౌఢము. కొన్ని ఉదాహరణములు :
వైశేషికదర్శన ప్రమాణభూత భాష్యకారులగు ప్రశస్తపాదాచార్యుల గద్యగుంఫశైలి ప్రగల్భమై, అద్భుతావహముగ నున్నది.
“ఇహేదానీం చతుర్ణాం మహాభూతానాం సృష్టిసంహార విధిరుచ్యతే. బ్రాహ్మాణేన మానేన వర్షశతాంతేన వర్తమానస్య బ్రహ్మణో౽పవర్గ కాలే సంసార ఖిన్నానాం సర్వప్రాణినాం నిశి విశ్రామార్థం సకలభువనపతేర్మహేశ్వరస్య సంజిహీర్షాసమకాలం శరీరేంద్రియమహాభూతోప నిబంధకానాం సర్వాత్మగతానాం అదృష్టానాం వృత్తి నిరోధే సతి మహేశ్వరేచ్ఛాత్మాణుసంయోగజ కర్మభ్యః శరీరేంద్రియకారణాణువిభాగేభ్యః తత్సంయోగనివృత్తౌ, తేషామాపరమాణ్వంతో వినాశః ; తథా పృథివ్యుదక జ్వలనపవనానామపి మహా భూతానాం అనేనైవ క్రమేణ ఉత్తరస్మిన్సతి పూర్వస్య నాశః, తతః ప్రవిభక్తాః పరమాణవో౽వతిష్ఠం తే."
న్యాయమంజరీ ప్రణేతయు న్యాయదర్శనాచార్యుడు నగు జయంతభట్టు నిర్మించిన గద్యసరణి ప్రౌఢమును, సాలంకారమును, సహృదయ చేతో మోదావహమునై వరలుచున్నది. ఉదా :
“తేన ప్రామాణ్యాధిగమోపాయ విశేషాత్ సమాన యోగక్షేమతయా చత్వారో౽పి వేదాః ప్రమాణం వ్యవ । హారో౽పి సర్వేషాం సారతరవిచార చతురచేతసాం చతుర్భిరపి వేదైశ్చతుర్ణాం వర్ణాశ్రమాణాం చతసృషు దిక్షు చతురబ్ధి మేఖలాయామవనౌ ప్రసిద్ధ ఇతికో౽యమత్రాన్య థాత్వభ్రమః? శ్రుతిస్మృతి మూలశ్చార్యావర్తినాం భవతి వ్యవహారః| తేచశ్రుతి స్మృతీ చతురో౽పి వేదాన్ సమాన కక్షానభివదతః ఋగ్యజుస్సామవేదేష్వపి అథర్వవేదా శంసీని భూయాంసి వచాంసి సంతి."
ప్రౌఢమీమాంసకుడును పూజ్యుడునగు శబరస్వామి గద్యశైలి మధురోదాత్తమైనది. ఉదా :
"ఇచ్ఛయా౽త్మానముపాలభామహే కథమితి । ఉపలబ్ధవూర్వేహ్యభిప్రేతే భవతీచ్ఛా । యథా మేరుముత్తరేణ యాన్యస్మజ్జాతీయైరనుపలబ్ధపూర్వాణి స్వాదూని వృక్షక ఫలాని తానిప్రత్యస్మాకమిచ్ఛా భవతి. "
(1-1-5.)
శ్రీమచ్ఛంకర - శ్రీమద్రామానుజ శ్రీమధ్వాచార్య భగవత్పాదుల ప్రౌఢోదాత్త గద్య రచనా శైలి గంగా ప్రవాహము భంగి గంభీరమై పాఠకులను అత్యంత విస్మయావిష్టమనస్కుల నొనర్చును. ఉదా :
"యుష్మదస్మత్ప్రత్యయగోచర యోర్విషయవిషయిణోసమఃప్రకాశవద్విరుద్ధస్వభావయో రిత రేతర భావా నుప పత్తౌ సిద్ధాయాం, తద్ధర్మాణామపి సుతరామితరేతర భావానుపపత్తిరి త్యతో౽స్మత్ప్రత్యయగోచరే విషయిణి చిదాత్మకే యుష్మత్ప్రత్యయ గోచరస్య విషయన్య తద్ధర్మాణాం చాధ్యాస స్తద్విపర్యయేణ విషయిణ స్తద్ధర్మాణాం విషయే౽ధ్యాసో మిథ్యేతి భవితుం యుక్తం తథాప్యన్యోన్య స్మిన్నన్యోన్యాత్మక తామన్యోన్య ధర్మాం శ్చాధ్య స్యేతరేతరా వివేకేనాత్యన్త వివిక్తయో ర్ధర్మ ధర్మిణోర్మిథ్యాజ్ఞాననిమిత్తస్సత్యానృతేమిథునీకృత్యాహ మిదం మమేదమితి నైసర్గికో౽యం లోకవ్యవహారః। ఆహ కోయమధ్యాసోనామేతి ఉచ్యతే ? స్మృతిరూపః పరత్ర పూర్వదృష్టావభానః. తం కేచి దన్యత్రాన్యధర్మో ధ్యాస ఇతివదంతి: కేచిత్తు యత్ర యదధ్యాసస్ద్వివే కాగ్రహ నిబంధనోభ్రమ ఇతి। అన్యేతు యత్రయదధ్యాస స్తస్యైవ విపరీత ధర్మత్వకల్పనామాచక్షత ఇతి। సర్వథాపి త్వన్యస్యాన్యధర్మావభాసతాం న వ్యభిచరతి | తథాచ లో కే౽నుభవః ‘శుక్తి కాహి రజతవదవభాసతేఏకశ్చంద్ర స్సద్వితీయవదితి (శాంకర బ్రహ్మసూత్ర భాష్యము - జిజ్ఞాసాధిక రణము.)
క్రీ. శ. 14 వ శతాబ్దియందు సాయణాచార్యులవారు వేదార్థప్రకాశమను పేర రచించిన ఋగాది సంహితా బ్రాహ్మణారణ్యకాదుల భాష్యములు కల్పతరువులై, కూలంకషముగ సకలార్థబోధకములై యొప్పారుచున్నవి. ఈ మహాపండితుని వేదభాష్యములకు భట్టభాస్కర మిశ్రాదుల భాష్యములు మార్గదర్శకములైనట్లు విదితమగు చున్నది. సాయణాచార్యుల భాష్యగద్యము సరసము, సుబోధము. ఉదా :
'యోప్సు నావం ప్రతిష్ఠితాం వేదేత్యాది-యఃపుమా నప్సు ప్రతిష్ఠితాం స్థైర్యేణావస్థితాం నావం వేద, స స్వయం లోకే ప్రతిష్ఠాయుక్తో భవతి. కా౽సౌ ప్రతిష్ఠి తా నౌరితి సేయ ముచ్యతే. ఇమే వైదృశ్యమానా ఏవ భూరాదయో లోకా అప్సు స్థైర్యేణావస్థితా నౌస్థా నీయాః అతః సర్వలోకాధార భూతా ఆప ఇతి వేద నేన ప్రతిష్ఠాప్రాప్తిః . నద్యాధిషు పరతీరగమనాయ జనై ర్యానౌః సంపాద్యతే సా జలే ప్రతిష్ఠితా న భవతి గమనాగమ నాభ్యాం చంచలత్వాత్. సర్వలోక సంఘరూపా తు నౌః న కదాచిదపి చలతి, కింత్వప్సు స్థైర్యేణావతిష్ఠ తే. ఆవరణ సహితం బ్రహ్మాండం ఘనోదాఖ్యే మహాజలే౽వతిష్ఠత ఇతి హి పౌరాణిక ప్రసిద్ధిః (శ్రీమత్సాయణాచార్య విరచితము. కృ. య. తై. ఆరణ్యక భాష్యము ప్రపా. 1 అను 22.)
లౌకిక సంస్కృత గద్యావిర్భావము సాక్షాత్తుగాగాని, పారం పర్యముగాగాని, వైదిక సాహిత్యమునుండి ఏర్పడినదని తెలియుచున్నది. భాసకాళిదాసాది మహాకవులు సంపూర్ణముగ గద్యమయములైన కావ్యములను రచించియుండ లేదు. ఐనను వారి రూపకములందు కనిపించు గద్యము సజీవమై, సరసమై, సరళమై, మనోహరమై ఒప్పారుచున్నది. ఉదా:
భాసుని స్వప్న వాసవదత్తమునందు ప్రథమాంకమున గల
“పద్మావతీ - ఆర్యే వందే.
తాపసీ – చిరంజీవ. ప్రవిశ, జాతే! ప్రవిశ!
తపోవనాని నామ అతిథిజనస్య గేహం.
పద్మావతీ - భవతు భవతు ఆర్యే! విశ్వస్తాస్మి.
అనేన బహుమానవచ నేనానుగృహీ తాస్మి.
వాసవదత్తా - (స్వగతం) న హి రూపమేవ, వాగపి
ఖల్వస్యా మధురా!"
అను వాక్యములును, కాళిదాసకవి సార్వభౌముని అభిజ్ఞాన శాకుంతలమునందు పంచమాంకమున గల-
“రాజా - అవహితోస్మి.
ఋషయః - (హస్తముద్యమ్య) విజయస్వ రాజన్ !
రాజా - అఖిలానభివాదయే వః.
ఋషయః - స్వస్తి భవతే. ఇష్టేన యుజ్యస్వ.
రాజా - అపి నిర్విఘ్నతపసో మునయః"
అను వాక్యములును, ప్రకృతమునకు తార్కాణములు. ఒకానొకప్పుడు రసోచితముగ ప్రౌఢగద్య సరణియు రూపకములందు కనవచ్చుచున్నది. ఉదా:
వేణీ సంహారమున, తృతీయాంకమున ఉత్ఖాతఖడ్గుడై కలకల మాకర్ణించుచు ప్రవేశించిన అశ్వత్థామయొక్క క్రోధస్ఫోరకములైన వాక్యములు—
“కథమవధీరితక్షాత్రధర్మణాం, ఉత్సృష్ట వీరపురుషో చిత లజ్జావకుంఠనానాం, విస్మృత స్వామిభ క్తి సత్కార లఘుచేతసాం, అగణితకులబలసదృశప్రభావానాం, ఆత్మధైర్యమజానానాం, తురగరథద్విప పాదచారిణాం సమరభూమే రపక్రమతామయం నాదోబలానాం.”
“ఓజ స్సమాస భూయస్త్వం ఏతద్గద్యస్య జీవితం" సమాస ప్రాచుర్యము ఓజస్సు. ఇది గద్యమునకు జీవితము. ఇట్టి లక్షణముచే లక్షితమయిన గద్యము ప్రాచీన శిలా శాసనములందు కనిపించుచున్నది. ఉదా :
"మహారాజాధిరాజ శ్రీ సముద్రగుప్తస్య కీర్తిమతః
త్రిదశపతి భవన గమనావాప్త లలిత సుఖవిచరణ
మాచక్షాణ ఇవ భువో బాహురయ ముచ్ఛ్రితః
స్తంభః". (ప్రయాగ విజయస్తంభే)
పంచతంత్రాది కథాగ్రంథములందు లభించు గద్యము మిక్కిలి సుబోధము, సరసము, సరళము, సంక్షిప్తవాక్య విరాజితము. ఉదా :
"మేఘవర్ణ ఆహ తాత! కాని తీర్థాని ఉచ్యంతే ?
కతిసంఖ్యానిచ, కీ దృశాః గుప్తచరాః? తత్సర్వం
నివేద్యతాం "
సంస్కృతాఖ్యాయికలు విద్వజ్జనోద్దిష్టములై యున్నట్లు కనిపించును. అవి క్రీస్తుశకారంభమునకు మిక్కిలి పూర్వ కాలముననే పుట్టినట్లు తెలియుచున్నది. మహాభాష్యమున భగవత్పతంజలి" వాసవదత్తా - భై మరథీ - సుమనోత్త రాది - ఆఖ్యాయికలనుచ్చర్చించెను. కాని, గ్రంథకర్తల నామములను తెలిపియుండలేదు. బాణమహాకవి తన హర్ష చరితమున, కొందరు ఆఖ్యాయికా కర్తలను, 'వాసవదత్త' అను నొక ఆఖ్యాయికను ప్రశంసించెను. జయాదిత్యుడు కాశికయందు 'ఉర్వశి' యను కావ్యమును పేర్కొనెను. వరరుచి రచించిన 'చారుమతి', శ్రీపాలితుడు వ్రాసిన 'తరంగవతి' అను రెండు ఆఖ్యాయిక లున్నట్లు విదితమగుచున్నది. శ్రీపాలితుడు హాలుని ఆస్థానమున సుప్రసిద్ధకవియై వరలెను. తరంగవతి యనునది ప్రాకృతమున రచింపబడియుండును. రామిల సోమిలులు శూద్రకకథను రచించిరి. భోజుడు చారుమతి, మనోవతి, 'శాతకర్ణి హరణము' అను గద్యకృతులను పేర్కొ నెను. ఇవి క్రీస్తుశకారంభమునకు చెందియున్నట్లు ఊహింపబడినవి.
భట్టార హరచంద్రుని గద్యబంధము పదబంధోజ్జ్వల మనియు, 'వర్ణక్రమ సుశోభిత' మనియు బాణునిచే ప్రశంసింపబడినది. భోజుడు 'శృంగారమంజరి' అను ఆఖ్యాయికను, కులశేఖరుడు 'ఆశ్చర్యమంజరి' అను గద్య కృతిని రచించినట్లు తెలియుచున్నది. రుద్రటుని 'త్రైలోక్యసుందరి' యందు శ్రీకృష్ణునికథ కీర్తింపబడి నట్లు ఊహింపబడుచున్నది. అపరాజితునిచే రచితమైన 'మృగాంకలేఖ' అను కావ్యమును రాజశేఖరుడు పేర్కొనెను. విశ్వేశ్వరుడు 'మదనమంజరి'ని, జగన్నాథుడు 'ఆసఫీ విలాసము'ను రచించిరని తెలియుచున్నది.
ఆఖ్యాయికా స్వరూపమును సుందరముగ తీర్చిదిద్దిన త్రిమూర్తులు దండి, బాణుడు, సుబంధుడు అను కవి ప్రకాండులు. గద్య కవికుల లలామ భూతుడును, గద్యబంధ ధురంధరుడును, పండిత పురందరుడునైన దండి మహాకవి సంస్కృత సాహిత్యాంబరమున అంబరమణిగా విశ్రుతుడయ్యెను. ఇతడు క్రీ. శ. 635-700 సంవత్సరముల మధ్యకాలమున నున్నవాడని పెద్దల నిర్ణయము. దండిమహాకవి విరచితముగా ఉదహరింపబడిన అవంతి సుందరీ కథనుబట్టి అతడు వీరదత్తుడను దార్శనికునివలన గౌరియను విదుషీమణియందు జనించినవాడు. కంచుకీ పురి (కాంచి) అతని నివాసస్థానము. బాల్యముననే అతని తలిదండ్రులు గతించిరి. పలాశదండధారియు, నైష్ఠిక బ్రహ్మచర్య నిష్ఠితుడు నగు దండి స్వధర్మానుగుణముగ ఒక్కొక వర్షర్తువునందు ఒక్కొక పట్టణములో నివాసముగా నుండుచుండెను. ఒక పట్టణపు రాజాతనిని అంతఃపుర కన్యలకు విద్యగరపుటకై నియోగించెను. పిదప ఆతని రసికతాప్రకర్షమును గూర్చిన వృత్తాంతము రాజు చెవిని బడెను. రాజాతని శీలమును శంకించెను. ఆ విషయము దండికితెలిసెను. దండి అంతట రాజును దారిద్ర్యాష్టకమును రచింపప్రోత్సహించెను. రాజు అష్టకమును వ్రాసి దండి కొసగెను. దండి చిరునవ్వు నవ్వెను. దండి మనోవృత్తిని రాజు వెంటనే గ్రహించెను. రాజిట్లు తలచెను. తాను దారిద్ర్యమనుభవించి యుండలేదు. ఐనను అనుభవించిన వానివలె దారిద్ర్యాష్టక మును రచింపగల్గెను. తన దారిద్ర్యానుభవము కృత్రిమము. అట్లే దండి రసికతయు కృత్రిమము - అని రాజు గ్రహించి యథాపూర్వముగ దండిని గౌరవించెను అని తెలియుచున్నది.
దండి కృతమయిన దశకుమార చరితము సుప్రసిద్ధమైనది. ఇది కవితాకలాలంకృతమై, అత్యంత హృద్యమై అనవద్యమై భాసిల్లుచున్నది. ఇది పూర్వపీఠిక, చరితము, ఉత్తరపీఠిక అను మూడు విభాగములచేతను, ఎనిమిది ఉచ్ఛ్వాసములచేతను అలరారుచున్నది. 'దండినః పదలాలిత్యం' అను సూక్తినిబట్టి సులలిత పదావళిచే సమలం కృతమయిన ఈగద్య కావ్యమునందలి మధ్యభాగము మాత్రమే దండి కృతమని కొందరు తలచిరి. ఈ కావ్యము నందు పదిమంది రాజకుమారుల దేశ విదేశాటనాను భవములును, ఉచ్ఛావచక్రియాకలాపోపక్రమములును, వివిధ పరాక్రమములును, మనోరంజకముగా, మధుర రీతిచే వర్ణింపబడినవి. ప్రసాద మధురములు, లలిత లలితములు, భావగర్భితములునైన పదములను ప్రయోగించుట యందు కృతహస్తుడీ మహాకవి. పదార్థ విస్పష్టత, భవ్యభావనాభివ్యక్తి, కోమల కల్పనాకమనీయత, ఇతడు మెచ్చి స్వాయత్త మొనర్చుకొనిన కావ్యగుణములు. ఇతడు కావించిన చరిత్ర చిత్రణము విలక్షణము. ఇతని పాత్రలు సజీవములు. వ్యంగ్యభంగి హృదయంగమము ; వాక్య విన్యాసము మహోజ్జ్వలము. వార వనితలు, బ్రాహ్మణబ్రువులు, కులటలు, కుట్టినులు, తదానీంతన సామాజిక పరిస్థితులు-కవి, సజీవముగ చిత్రించినాడు. ఉదా :
క్షామవర్ణనము : “నవవర్ష వర్షాణి ద్వాదశ దశశతాక్షః, క్షీణసారం సస్యం, ఓషథ్యోవంధ్యాః, న ఫలవంతో వనస్పతయః, క్లీ బామేఘాః, క్షీణస్రోతసః స్రవంత్యః, పంక శేషాణి పల్వలాని, నినిన్ స్యందాన్యుత్సమండలాని, విరళీ భూతం కంద మూలఫలం అవహీనాః కథాః, గలితాః కల్యాణోత్సవక్రియాః, బహులీ భూతాని తస్కర కులాని, అన్యోన్యమభక్షయ న్ప్రజాః, పర్యలుఠన్నితస్తతో బలాకా పాండురాణి నరశిరః కపాలాని, పర్యహిండంత శుష్కా: కాకమండల్యః, శూన్యభూతాని నగర గ్రామ ఖర్వటపుట భేదనాదీని"
(దశ కు.)
బాణుడు సర్వకవి మూర్థాభిషిక్తుడు; మహా మేధావి, గద్య రచనా విశారదుడు. ఇతని ప్రతిభా వ్యుత్పత్తులు అనితరతుల్యములు. ఇతడు శ్రీ హర్ష చక్రవర్తికాలమున నున్న వాడు. ఇతని హర్షచరితము తొమ్మిది ఉచ్ఛ్వాసములు కల గద్యకావ్యము. కాన్య కుజ్జేశ్వరుడగు హర్షవర్ధనుని చరిత మిందు కీర్తింపబడినది. కవి తొలిమూడు ఉచ్ఛ్వాసములలో స్వీయ వృత్తాంతమును సంగ్రహముగ చెప్పికొనియున్నాడు. దానిని బట్టి ఇతడు కవిసార్వ భౌముడని, వాత్స్యాయన వంశ సంభవుడని తెలియుచున్నది. శేషించిన ఉచ్ఛ్వాసములలో రాజవర్ధన హర్షవర్ధనుల శౌర్యాది గుణములు, మాళ వాధిపతినాశము మొదలగు నంశములు వర్ణితములైనవి. ఈ కవీంద్రుని చారు రచనా చాతురి, లోకోత్తర పదవిన్యాసోల్లాసము, సురుచిర క థా చిత్రణము, కావ్య రసికులకు చేతో మో దావహములు. ఉదా :
"యస్మింశ్చ రాజని నిరంతరై ర్యూపనికరై రంకురిత మివ కృతయుగేన, దిఙ్ముఖ విసర్పిఖి రధ్వరధూమైః పలాయిత మివ కలినా, ససుధైః సురాలయైరి వావతీర్ణ మివ స్వర్గేణ, సురాలయ శిఖరోద్ధూయమానైర్ధవల ధ్వజైః పల్లవిత మివ ధర్మేణ, బహిరుపచరిత వికట సభాసత్రప్రపా ప్రాగ్వంశ మండపైః ప్రసూత మివ గ్రామైః, కాంచన మయ సర్వోపకరణై ర్విభవై ర్విశీర్ణ మివ మేరుణా, ద్విజ దీయమానై రర్థకుశలైః ఫలిత మివ భాగ్య సంపదా. "
(హ. చ.)
కాదంబరి బాణుని ద్వితీయ గద్యరత్న సృష్టి. 'బాణోచ్ఛిష్టం జగత్సర్వం', 'కాదంబరీ రసజ్ఞానా మాహారో౽పి నరోచతే'- ఇత్యాది సూక్తులకు నిదాన భూతమయిన దీ మహా కావ్యము. ఇందలి కథ గుణాఢ్య విరచిత బృహత్కథా గృహీతము. ఇది కవి ప్రతిభా వ్యుత్పత్తులచే సుపరిష్కృతమును, రసగుణాలంకారాది విశిష్టమును, సర్వోత్కృష్టమునై అలరారుచున్నది. ఇందలి ప్రధానేతి వృత్తము కాదంబరీ చంద్రాపీడులకు సంబంధించినది. ఇందు అవాంతర కథలు పెక్కులు కలవు. శృంగార మంగిరసము. తక్కు రసము లంగములుగా ప్రవేశము నొందినవి. శుకనాసోపదేశము, అచ్ఛోద సరో వర్ణనము, తదితర ప్రకృతివర్ణనములు కవియొక్క వర్ణన సామర్థ్యమునకు నిదర్శనములు.
ప్రశస్తశుకనాసోపదేశో దాహరణము :
"యౌవనారంభే చ ప్రాయః శాస్త్రజల ప్రక్షాళన నిర్మలాపి కాలుష్య ముపయాతి బుద్ధిః. అనుజ్ఝితధవళతాపి సరాగైవ భవతి యూనాం దృష్టిః. అపహరతి వాత్యేవ శుష్కపత్రం, సముద్భూతరజోభ్రాంతి రతిదూరమాత్మేచ్ఛ యా యౌవనసమయే పురుషం ప్రకృతిః. ఇంద్రియ హరిణ హారిణీ చ సతత దురంతేయ ముపభోగ మృగతృష్ణి కా'
అచ్ఛోద సరో వర్ణన మత్యంత హృద్యము. ఉదా :
"యౌవన మివోత్కలికా బహులం, షణ్ముఖ చరిత మివ శ్రూయమాణ క్రౌంచ వనితావిలాపం, భారత మివ పాండవ ధార్తరాష్ట్ర కులకృతక్షోభం, కద్రూస్తన యుగల మివ నాగ సహస్రపీతపయో గండూష మచ్ఛోదం నామ సరోదృష్టవాన్ ."
పాంచాలరీతి నాశ్రయించి రచన యొనర్చినవా డీ కవి వర్యుడు. వర్ణ్యవస్తువునకు అనురూపమైన పదములను కూర్చుటయం దితడు ప్రదర్శించిన కౌశల మనన్య సామాన్యము. వికటవింధ్యాటవిని వర్ణించు సందర్భమున ఇతడు వికటశబ్దాటోపములను ప్రయోగించెను. ఉదా :
"క్వచిత్ప్రళయ వేళేవ మహావరాహ దంష్ట్రా సముత్ఖాత ధరణిమండలా, .................. క్వచిదుద్దత మృగపతినాదభీతేవ కంటకితా."
వసంతమును వర్ణించుపట్టున ఇతడుపయోగించిన మృదులపదజాల మెన్నదగినది. ఉదా:
"అశోకతరుతాడనరణిత రమణీమణినూపుర ఝంకార సహస్రముఖరేషు, సకలజీవలోక హృదయానంద దాయకేషు, మధుమాసదివనేషు.”
ధర్మరాజ, త్రిలోచన, గోవర్ధనాచార్య, త్రివిక్రమభట్ట ప్రభృతుల ప్రశంసల నందుకొనిన కవిచతురానను డీ బాణుడు. ఇట్టి మహామహుడు కాదంబరిని పూర్తి చేయ కయే దివంగతు డయ్యెను. ఇతని కొడుకు పులిందభట్టాపరనామకుడగు భూషణభట్టు తండ్రి శైలిని పురస్కరించు కొని ఈ మహాకావ్యమును పూర్తి యొనర్చెను అని తెలియుచున్నది.
సుబంధుడు గద్యకవితా రచనాధురంధరుడుగను గద్యమయ సాహిత్యమునకు ఆద్యప్రవర్తకుడుగను, పదవాక్య ప్రమాణపారావారీణుడుగను, నిరతిశయ రసగర్భిత కవితా విశారదుడుగను కీర్తింపబడినాడు. ఇతడు క్రీ శ. సప్తమ శతాబ్ది మధ్యకాలముననున్న వాడు. సుబంధుని ప్రఖ్యాత గద్యకృతియగు వాసవదత్తమునందు వాసవదత్తా కందర్పకేతుల ప్రణయము వర్ణితము.
సుబంధుడు, బాణభట్టు, కవిరాజు అను మువ్వురును వక్రోక్తిమార్గ నిపుణులు. వీరితో సమానుడగు నాలుగవ కవిలేడు అను సూక్తికలదు. సుబంధుని రచనయందలి విలక్షణమైన స్వరమాధురి, అపూర్వమయిన వర్ణనచాతురి, అననుకరణీయములు. కాని ఇతనికృతిలో దండియొక్క 'వాగ్విలాసహాస్యరసోల్లాసములు, ' బాణుని 'భవ్యభావనా మాధురి,' కానరావు. సుబంధుడు తనఆఖ్యాయిక యందు ప్రదర్శించిన ప్రత్యక్షరశ్లేష -అనుప్రాస-విరోధాభాసాది- అలంకార రచనా కౌశల్యమెన్నదగినది.
శ్లేష సౌందర్యోదాహరణము :
“నందగోప ఇవ యశోదయాన్వితః, జరాసంధ ఇవ
ఘటిత సంధి విగ్రహః, భార్గవ ఇవ సదాన భోగః,
దశరథ ఇవ సుమిత్రో పేతః సుమంత్రాధిష్ఠితశ్చ,
దిలీప ఇవ సుదక్షిణాన్వితః, రక్షితగుశ్చ "
కుతూహలావహమయిన యమ కాలం కారోదాహరణము :
“రాజసేన రహితో రాజసేన రహితో ధ్రువం,
విశారదా విశారదాభ్రవిశదా, విశదాత్మనీనమహిమా
మహిమాన రక్షణక్షమా క్షమాతిలక !".
సుదీర్ఘ సమాసో పేతమును క్లిష్టతరమునైన వాక్య విన్యాసమీ కవిపుంగవుని రచనయందు కనిపించును. ఉదా:
‘కురరఖరనఖరశిఖరఖండిత పృథురోమా
విలం.............. అతితరల తరజలరయ
లులితచటుల శఫరకుల కవలన కృతమతినిభృత
బకశకుని నివహ ధవళిత పరిసరం .......
............విపులం పులిన జలమాససాద."
విరోధాభాస విలాసమునకు ఉదాహరణము :
“విద్యాధరో౽పి సుమనా, ధృతరాష్ట్రోపి గుణప్రియః
క్షమానుగతో౽పి సుధ ర్మాశ్రితః".
కథా వేగ భంగము, ఔచిత్య సీమోల్లంఘనము, రస భంగము మున్నగు దోషము లీతని కావ్యమున గలవు.
క్రీ. శ. 1000-1050 మధ్యకాలముననున్న ధనపాలుడు 'తిలక మంజరి' అను నొక ప్రౌఢ గద్యకావ్యమును రచించెను. ఇది భోజుని ప్రీతికొరకై వ్రాయబడినది. ఇది కాదంబరిని పెక్కు విషయములలో పోలియున్నది. ఇందు విద్యాధర కన్యకయగు తిలక మంజరిని మదిరావతీ మేఘవాహనుల కొడుకు హరివాహనుడు వలచుట మున్నగు విషయములు శృంగార రసభరితముగను, మృదులముగను వర్ణితములు. ఈ కవి సకుటుంబముగ జైనమతమును స్వీకరించెనని విదితమగుచున్నది. 'ద్రౌపదీ చరిత' మను చిన్న గద్యకావ్యము ఒకటి కలదు. ఇందు ద్యూతమాదిగ ద్రౌపది పడిన పాట్లు వర్ణింపబడినవి వాసుదేవ కవి 'రామ కథ ' యను గద్య కావ్యమును వ్రాసెను. ఇది ఆదిత్యవర్మ యొక్క ఆజ్ఞానుసారముగ రచింపబడినది. ఇది సరస వచన రచనా సుశోభితము. ఓడయదేవుడను నామాంతరము కల వాదీభసింహుడను జైనకవి క్రీ శ. 11 వ శతాబ్దిలో వ్రాసిన 'గద్య చింతామణి' యందు పదునొకండు లంబకములు కలవు ఇందు 'సత్యధరుడను రాజునకును, ఆతని కుమారుడు జీవంధరునకును' సంబంధించిన జీవితకథ కీర్తింపబడినది. దీనికి మూలము గుణభద్రుని 'ఉత్తర పురాణము'. ఇందలి శైలి లలితము. సన్ని వేశములు, వర్ణనములు కాదంబరి యందలి సన్ని వేశములను, వర్ణనములను పోలియున్నవి.
విద్యాధర చక్రవర్తి కృతమయిన గద్య కర్ణామృతము నందు హొయసాల వంశ్యుడగు రెండవ నరసింహునకును, పాండ్య మగధ పల్లవరాజుల సంయుక్త సేనలకును మధ్య 90 దినములు ప్రవర్తిల్లిన శ్రీరంగ యుద్ధము మధురమధురముగ వర్ణింపబడినది. అగస్త్య (విద్యానాథ) రచితమైన కృష్ణచరితమున భాగవతానుసారముగ శ్రీకృష్ణుని చరితము ప్రశంసింపబడినది ఇందలి వచనము రసవంతముగను, ప్రౌఢముగను ఉన్నది. అగస్త్యుడు క్రీ. శ. 12941325 సంవత్సరముల మధ్యకాలమున వరంగల్లు నేలిన ప్రతాపరుద్రదేవుని ఆస్థాన పండితుడుగ నున్న వాడు. మాధవానల కామకందలా నామమున నొక గద్యకావ్యమున్నది. ఇందలి కథ కల్పితము. అనంతభట్ట రచితమయిన పంచోపాఖ్యాన సంగ్రహము, విష్ణుశర్మ పంచతంత్రమునకు సంగ్రహరూపమైయున్నది.
15 వ శతాబ్దారంభముననున్న వామనభట్టుచే నిర్మితమును, వీరనారాయణ చరితమను నామాంతరముచే శోభితమును అగు వేమభూపాలీయమను గద్యకృతి గణనార్హము. ఇందు అద్దంకి రాజధానిగా నేలిన ప్రోలయ వేమభూపాలుడు మున్నగు త్రిలింగ దేశాధిపతుల చరితము సంకీర్తిత మయినది. పెదకోమటి వేమభూపాలుడు (వీరనారాయణుడు) కొండవీటి రెడ్డిరాజు. ఇతడు క్రీ. శ. 1403 -1420 సం. రముల నడిమి కాలమున కొండవీటిని పాలించెను. వామనభట్టు అభినవబాణుడను బిరుదము ధరించెను. బాణుని అనంతరము ఆతనివలె సరస గద్య రచన మొనర్చు కవి ఎవ్వడును లేడని లోకమున స్థిరపడి యున్న అపకీర్తిని తొలగింపగల వాడనని ఆత్మప్రశంస నొనర్చుకొనుచు, 'బాణకవీంద్రా దన్యే కాణాః ఖలు సరస గద్యసరణీషు, ఇతిజగతి రూఢమయశోవామన బాణోప మార్ష్టి వత్సకులః' అను శ్లోకమున ఇతడు సగర్వముగ వాక్రుచ్చి యున్నాడు. చరిత్ర గ్రంథములలో ఉత్తమమైన ఈ గద్యకావ్యమున, కవి, వేమభూపాలుని దిగ్విజయ యాత్రావర్ణనములను సమర్థమును, మధురమును, సాలంకృతమునైన గద్యగుంఫముచే నొనర్చి, తన వర్ణన సామర్థ్యమును ఆవిష్కరించి యున్నాడు.
రాజవిజయసూరి శిష్యుడైన దేవవిజయగనియను నతడు క్రీ. శ. 1596 వ సంవత్సరమున 'రామచరిత'మను గద్య కావ్యమును శ్రీ మాలపురమువద్ద వ్రాసెను. ఇందు ఈ కవి, హేమచంద్రుని రామాయణము ననుసరించెను. చెంగల్పట్టుజిల్లా చిన్నంపట్టులో, 1809 వ సంవత్సరమున జన్మించినవాడును, తిరుమలాచార్యుడను నామాంతర విలసితుడును అగు శ్రీశైల దీక్షితుడు రచించిన శ్రీకృష్ణాభ్యుదయమను గద్యకావ్యము, రమ్యవచన రచనోప శోభితమై, సంస్కృతవచన వాఙ్మయమున కలంకార మనదగినది. ఇందు రెండుభాగములున్నవి. ఈ కావ్యమున శ్రీకృష్ణుని చరితము భక్త్యావేశముతో సమగ్రముగ వర్ణింపబడినది.
అర్వాచీన గద్యరచనలు పెక్కులున్నవి. బంకించంద్రుని ‘లావణ్యమయి', 'కపాలకుండల' అను నవలలకు అనువాదములును, కళాపూర్ణోదయ సంస్కృతీకరణమును పేర్కొనదగినవి.
'మంజుల భాషిణి', 'ఉద్యానపత్రిక', 'సహృదయ', 'సంస్కృతము' వంటి సంస్కృత పత్రికలందు ప్రచురింప బడిన వ్యాసములు సులభమును, లలితమును, బహుజనోప యోగకరము నగు సంస్కృత గద్యరచనకు మార్గదర్శకము లైనవి. 'సహృదయ' యందు ప్రకాశితము లయిన మదాలసాచరితాది సంస్కృత కథానికలు మంజుల సులభ గద్య సుశోభితములు.
'లాంబ్స్ టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్' అనుదాని పద్ధతి ననుసరించి మహాలింగశాస్త్రి వ్రాసిన భాసనాటక కథా సంగ్రహము, తదితర సంగ్రహములు పేర్కొనదగినవి.
శ్రీమల్లాది సూర్యనారాయణశాస్త్రి విరచిత సంస్కృత కవి జీవితములు, పండిత ద్విజేంద్రనాథశాస్త్రిచే రచితమైన సంస్కృతసాహిత్య విమర్శము - ఇత్యాది సంస్కృత సారస్వత విమర్శాత్మక గ్రంథములు అల్పసంఖ్యాక ములు లభించుచున్నవి.
సంస్కృత గద్యవాఙ్మయ స్వరూపము గద్యమయ కావ్యములందు కంటె, భాష్య- వ్యాఖ్యానగ్రంథములందు మిక్కిలి విపులముగ కనిపించుచున్నది. వేద - శాస్త్ర - స్మృతి - సూత్ర - పురాణాదులకు సరస - సరళ - సంపూర్ణ - సంస్కృత వ్యాఖ్యలను సంతరించి, సంస్కృత గద్యమును సుసంపన్న మొనర్చిన ప్రాచీన పండితప్రకాండు లనేకు లున్నారు. సంస్కృత వ్యాఖ్యానములు వెలయించిన వారిలో ఆంధ్రపండితులు పెక్కురు కలరు. సాయణాచార్యుని వేదభాష్యములు జగద్విదితములు. మహామహోపాధ్యాయ మల్లినాథసూరి (క్రీ. శ. 1400 - 1414) వ్యాఖ్యాతృ చక్రవర్తిగా అజరామరమయిన కీర్తిచే వలయితు డై నాడు. “అన్వయముఖముననే సర్వమును వ్యాఖ్యానించెదను. అమూలములును, అన పేక్షితములు నైన అంశములను వ్రాయను.” (ఇహాన్వయ ముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా । నామూలం లిఖ్యతే కించిన్నానపేక్షిత ముచ్యతే) అనునది ఈ మహాపండితుని ప్రతిజ్ఞ. ఇతడు కాళిదాసత్రయమునకు 'సంజీవినీ' వ్యాఖ్యను, కిరాతార్జునీయమునకు 'ఘంటాపథ' వ్యాఖ్యను, మాఘమునకు సర్వంకష వ్యాఖ్యను, భట్టి కావ్యమునకు సర్వపథీన వ్యాఖ్యను, శ్రీహర్షుని నైషధమునకు జీవాతు సమాఖ్యాన వ్యాఖ్యను, ఏకావళీ వ్యాఖ్యను వ్రాసి వాసిగాంచెను. మల్లి నాథసూరి సరస వ్యాఖ్యాన సరణికి ఉదా :
హేత్వేతి-
తస్మిన్ క్రీడాశైలే కైలాసే 'కైలాసః కనకాద్రిశ్చ మందరో గంధమాదనః, క్రీడార్థం నిర్మితాః శంభోర్దేవైః క్రీడాదయో౽భవన్.' ఇతి శంభురహస్యే. శంభునా శివేన భుజగఏవ వలయః కంకణం, తంహిత్వా గౌర్యా భీరుత్వా త్త్యక్త్వా దత్తహస్తా దత్తహస్తావలంబనాసతీ. గౌరీ, పాదచారేణ, విహరేత్ విచరేత్, యది తర్హి, అగ్రయాయీ పురోగతః, తథాస్తంభితః ఘనీభావం ప్రాపితః, అంతర్జలస్య ఓఘః ప్రవాహో, యస్య స తథాభూతస్సన్, భంగీనాం పర్వణాం భక్త్యా రచనయా, విరచితవపుః కల్పిత శరీరః సన్‌మణీనాం తటం మణితటం తస్యారోహణాయ సోపానత్వం కురు సోపాన భావంభజ'.
(మేఘసం. ప్రథమసర్గము -శ్లో. 64 )
సర్వజ్ఞ సింగభూపాలుడు (క్రీ. శ. 1420) సంగీత సుధాకరమను సంగీత రత్నాకర వ్యాఖ్యను రచించెను. మల్లి నాథుని కుమారుడు కుమారస్వామి సోమపీథి (1439) ప్రతాపరుద్ర యశోభూషణమునకు 'రత్నాపణ' వ్యాఖ్యను, సర్వజ్ఞ చక్రవర్తి పెదకోమటి మేమారెడ్డి (1420) సప్తశతీసార వ్యాఖ్యను, శృంగారామరుక వ్యాఖ్యను, రచించిరి. కాటయవేముడు (1415) కాళిదాస మహాకవి నాటకత్రయమునకు కుమారగిరి రాజీయ వ్యాఖ్యను వ్రాసెను. క్రీ. శ. 16 వ శతాబ్ది మధ్యకాలమున నున్నవాడును గరికపాట్యుపనామకుడునైన అన్నంభట్టు ఉద్దండ పండితుడై వరలెను. తర్కశాస్త్రమున, స్వరచిత తర్క సంగ్రహమునకు దీపికయను మహోజ్జ్వలమయిన వ్యాఖ్యను, జయదేవుని ఆలోకమను తత్త్వ చింతామణికి ఆలోకసిద్ధాంజనమను వ్యాఖ్యను రఘునాథ శిరోమణికృత 'దీధితి'కి సుబుద్ధి మనోహరమను వ్యాఖ్యను; మీమాంసా శాస్త్రమున భట్ట సోమనాథుని రాణకమునకు రాణకోజ్జీవిని అనుటీకను, తంత్రవార్తి కటీకను; వేదాంతశాస్త్రమున, బ్రహ్మసూత్రములపై మితాక్షర అను వృత్తిని; వ్యాకరణశాస్త్రమున, పాణిని అష్టాధ్యాయిపై వ్యాకరణ మితాక్షర అను సులభమయిన వ్యాఖ్యను; కైయటుని ప్రదీపముపై భాష్య ప్రదీపోద్యోతనమను వ్యాఖ్యను; వేదముపై స్వర లక్షణమను గ్రంథమును నిర్మించి, అన్నంభట్టు విఖ్యాతుడయ్యెను. వ్యాఖ్యాతగా అన్నంభట్టునకుగల స్థాన మత్యున్నతము. 'తర్క సంగ్రహదీపిక' అతని ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయి. 'టీకాం శిశుహితాం కుర్వే తర్క సంగ్రహ దీపికాం' అని అన్నంభట్టు గ్రంథాది యందు చెప్పియున్నను, ఆతని తర్క సంగ్రహ దీపికయను టీక అత్యంత ప్రౌఢముగను, పండితైక వేద్యముగను అలరారుచున్నది. ఉదా :
నిధాయేతి-
“నను మంగళస్య సమాప్తి సాధనత్వం నాస్తి మంగళే కృతే౽పి కిరణా వళ్యాదౌ సమాప్త్య దర్శనా న్మంగళా భావే౽పి కాదం బర్యాదౌ సమాప్తి దర్శనా చ్చాన్వయ వ్యతిరేకాభ్యాం వ్యభిచారాది తిచేన్న, కిరణావ ళ్యాదౌ విఘ్న బాహుళ్యా త్సమాప్త్య భావః । కాదంబర్యాదౌ గ్రంథా దృహిరేవ మంగళం కృతమతో నవ్యభిచారః నను, మంగళస్య కర్తవ్యత్వే కిం ప్రమాణ మితిచేన్న. శిష్టాచారానుమిత శ్రుతేరేవ ప్రమాణత్వాత్ । తథాహి । మంగళం వేదబోధిత కర్తవ్యతాకం । అలౌకికా౽విగీత శిష్టాచార విషయత్వాత్ । ధర్మాదివత్ । భోజనాదౌ వ్యభిచార వారణాయా లౌకితేతి । రాత్రిశ్రాద్ధాదౌవ్యభిచార వారణాయా విగీతేతి. శిష్టపదం స్పష్టార్థం । నకుర్యా న్నిష్ఫలం కర్మేతి జలతాడనా దేరపి నిషిద్ధత్వాత్ । తర్క్యంతే ప్రతిపాద్యంత ఇతి తర్కాః ద్రవ్యాది పదార్థా స్తేషాం సంగ్రహ స్సంక్షే పేణ స్వరూప కథనం క్రియత ఇత్యర్థః.
(తర్కసంగ్రహ టీక)
గద్య భేదములు :
ముక్తకము, వృత్తగంధి, ఉత్కళికాప్రాయము, చూర్ణిక, స్తవము అనునవి - అప్రధానములయిన గద్య భేదములు, ఛందోమంజరి యందు గద్యము మూడు రీతులుగా విభజింపబడినది. అవి (1) వృత్తకము (2) ఉత్క లికా ప్రాయము (3) వృత్తగంధి అనునవి. అందు కఠోరాక్షరములు లేనిదియు, స్వల్ప సమాసములు కలదియు మనోహరమైనదియు నగు గద్యరచన వృత్తకము. ఉదా :
“స హి త్రయాణామేవ జగతాం గతిః పరమ పురుషోత్తమో దృప్తదానవ భరేణ భంగురాంగీ మవని మవలోక్య కరుణార్ద్రహృదయ స్తస్యా భార మవతార యితుం రామకృష్ణ స్వరూపేణాంశతో యదువంశే౽వత తార, యస్తు ప్రసంగే౽పి స్మృతో౽భ్యర్చితో వా, గృహీతనామా, పుంసాం సంసారసాగరపార మవలోక యతి.”
(2) సమాసాఢ్యమును దృఢాక్షరోపేతమును నైన గద్యరచన ఉత్కలికాప్రాయ మనబడును. ఉదా :
"ప్రణిపాత ప్రవణ సప్రధానాశేష సురాది బృంద సౌందర్య ప్రకట కిరీటకోటి నివిష్ట స్పష్ట మణిమయూఖ చ్ఛటాచ్ఛురిత చరణ నఖచక్ర విక్ర మోద్దామ వామపాదాం గుష్ఠ శిఖరఖండిత బ్రహ్మాండ వివర నిస్సరచ్ఛరదమృత కరప్రకర భాసుర సురవాహినీ ప్రవాహ పవిత్రీకృత విష్టపత్రితయకైటభారే! క్రూరతర సంసారసాగర నానా ప్రకారా వర్తమాన విగ్రహం మా మనుగృహాణ.”
(2) వృత్తైకదేశ సంబంధముగల గద్యము వృత్తగంధి యనబడుచున్నది. ఉదా :
“జయ జయ జనార్దన ! సుకృతి మనస్తడాగ విక స్వర చరణ పద్మ ! పద్మపత్ర నయన! పద్మాపద్మినీ వినోద రాజహంస ! భాస్వర యశఃపటల పరిపూత భువనకుహర! హరకమలాసనాది బృందారకబృంద వందనీయ పాదార వింద ! ద్వంద్వనిర్ముక్తయోగీంద్ర హృదయ మందిరా విష్కృత నిరంజనజ్యోతి స్స్వరూప! నీరదరూప ! విశ్వ రూప ! అనాథనాథ ! జగన్నాథ! మా మనవధి భవదుఃఖ వ్యాకులం రక్ష! రక్ష ! రక్ష !"
అనుగ్రహ చూర్ణికోదాహరణము :
“నిజభక్తజనానుగ్రహకారణ శ్రీదేశిక స్వరూపిణి ! శ్రీమహా త్రిపురసుందరి! పాహిమాం, పాహిమాం, నమస్తే, నమస్తే, నమస్తే, నమః"
స్తవోదాహరణము :
“నమోస్తు పురుషోత్తమాయ పరమరిపు పరపుర హరణ పరాక్రమాయ ............. జాగ్రత్సుప్తతూర్య చతుర్భుజాయ నారాయణాయ, నరసింహ వామనాయ ............ గంధర్వ మధురగీత - సురవిద్యాధర ఋషిప్రభృతి సేవితాయచ ..... పురుషో౽నంత సముద్రాశ్రయః ....... శ్రీప్రియో ధనదప్రియో వైశ్రవణాంగకో౽స్మాన్‌రక్షతు, ఆస్మాన్ గోపయతు స్వాహా".
దండకోదాహరణము :
“జయ జయ జగదంబ ! దాసో౽స్మ్యహంతే రమావాసకాంతే త్వమేవాఖిలస్య ప్రపంచస్య మాతేతి వాణ్యా పురాణ్యా మహత్యాపి సత్యాపితం సో౽హమేవం భవత్యాః కిశోరో౽స్మి భృత్యో౽స్మి దాసో౽స్మి తస్మాత్కృపాంగై రపాంగైః ప్రసన్నం శిశుం మాం కుర్వహం చానవద్యాత్మ భక్తో౽స్మి సంద్యోత సేత్వం పరం జ్యోతి రిత్యంబ! మహ్యందయేథాః సుధారాశికన్యే ! రమే! పద్మహస్తే ! ప్రసీద ! ప్రసీద ! ప్రసీదాంబ! మే.
ఇట్లు సంస్కృతగద్యము నానాశాఖా పరిపుష్టమై, వేదములందు ఛాందస ప్రయోగబహుళమును, బ్రాహ్మణారణ్య కోపనిషత్తులందు ఉత్తరోత్తర క్రమముగ సుపరిష్కృతమును, సుగమమును; మహాభారతాది యందు స్వల్ప సులభ వాక్యయుతమును, కారక మర్యాదోపేతమును; నాట్యశాస్త్రాదులందు ఒకించుక ప్రౌఢమును; పురాణసాహిత్యము నందు మనోహరమును; ఋగాది సంహితా బ్రాహ్మణారణ్యకాది భాష్యము లందు సుగమమును, కూలంకషమును, సకలార్థ బోధకమును; దార్శనిక భాష్యములందు ప్రౌఢోదాత్తమును, అనర్గళమును, విస్మయావహమును; రూపకములందు ప్రాయికముగ సజీవమును, సరళమును, సరసమును; శాసనములందు, ఆఖ్యాయికలందు, చంపువులందు, ఉత్కలికాదులందు, ప్రౌఢమును, ఓజోగుణ భూయిష్ఠమును; కావ్యనాటకాది వ్యాఖ్యానములందు సులలితమును, మనోజ్ఞమును; అర్వాచీన గద్య కావ్యములందును, పత్రికలందును, సులభమును, సుబోధమునునై సంస్కృత గద్యము విరాజిల్లు చున్నది.
గద్యరచనము పద్యరచనమంత సులభసాధ్యమైనది కాదు. నిర్దుష్ట సరస గద్యరచనము. కవికి అత్యంతోత్కర్షా ధాయకము. కావుననే, 'గద్యం కవీనాం నికషం వదంతి' అను నాభాణక మెంతయు అన్వర్థమగు చున్నది.
గ. ల.