సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేంద్రకిరణ శాస్త్రము : (Radio Activity)

కేంద్రకిరణ శాస్త్రము : (Radio Activity)

1896 వ సంవత్సరములో అనగా 'ఎక్స్ రే’లను కనుగొన్న కొలది మాసముల అనంతరము భౌతిక శాస్త్రమునందలి మరియొక బ్రహ్మాండమయిన నూతన విషయము కనుగొనబడెను. హెన్రీ బెక్వెరెల్ అను ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త ఈ క్రొత్త విషయమును కనుగొనుట కేవలము కాకతాళీయము. 'ఎక్స్' కిర ణములకు సంబంధించిన ఒక నూతనాంశమును అతడు ౨ ఒక నాడు శ్రద్ధాసక్తులతో పరిశోధించుచుండెను. ఈ పరి శోధనలో అతడు కొలది మాత్రముగ యు రేనియమ్ ఉపయోగించుచుండెను. ఆదినమున గంధకితమును ఈ పదార్థము సూర్యరశ్మి సోకుట లేదు. అందువలన కాగితముతో పొట్లముగా కట్టబడి డ్రాయరులో ఉంచ ఆ డ్రాయరునందే కొన్ని ఫొటోగ్రాఫిక్ ప్లేట్లు ఒక నల్లని కాగితములో భద్రముగా చుట్టి పెట్టబడెను. కొన్ని దినములయిన తరువాత ఫొటోగ్రాఫిక్ ప్లేట్ల యందు కలిగిన మార్పును గమనించి బెక్వెరెల్ ఆశ్చర్య చకితుడా యెను. దానినిబట్టి యురేనియమ్ లవణము నల్లని కాగితముగుండా దూసుకొని పోగలిగి, ఫొటో గ్రాఫిక్ ప్లేట్లయందు మార్పును తేగలిగిన కొన్ని నూతన కిరణములను ప్రసరింపజేసి యుండవచ్చునని బెక్వెరెల్ సరిగ నే ఊహించెను. తనఊహ శాస్త్రీయమైనదో కాదో అని పరీక్షించుటకై ఆతడు వెనువెంటనే ప్రయోగములు జరిపెను. పైన ఉదహరింపబడిన లక్షణములుగల శక్తి మంతమయిన కిరణములను యు రేనియమ్ ప్రసరింప జేయగలదని ఈ ప్రయోగముల వలన రుజువయ్యెను. యురేనియమ్ నుండియేగాక తరువాత కనుగొనబడిన థోరియమ్, పొలోనియమ్, రేడియమ్ వంటి పదార్థముల నుండి కూడ బయలు వెడలు అట్టి కిరణములను ప్రసరింప జేయు ధర్మమును ' రేడియో యాక్టివిటీ' (కేంద్రకణకిరణ ప్రసరణము) అనబడును. మరికొన్ని రేడియోధార్మిక పదార్థములను కనుగొను టకై 'పియరీ', 'మేడమ్క్యూరీ' అను ఫ్రెంచి దంపతులు చేసిన ప్రయత్నము ఫలించి, 1898వ సంవత్సరము డిసెంబరు మాసములో యురేనియమ్కన్న వేయి రెట్లు ఎక్కువ ధార్మికశక్తిగల రేడియమ్ అను పదార్థము కను గొనబడినది. 'పిచ్ బ్లైండ్' అనబడు 30 టన్నుల ముడి యురేనియమ్ నుండి దీర్ఘ కాలముగా విశేష మైన శ్రమను ఓర్చి చేసిన ప్రక్రియా ఫలితముగా 2 మిల్లి గ్రాముల

రేడియము మాత్రమే తయారు కాబడినది. పైన పేర్చొన బడిన పరిశోధనల ఫలితముగా 1903 వ సంవత్సరములో, బెక్వెరెల్, క్యూరీదంపతులు 'నోబెల్' బహుమానముతో సత్కరింపబడుట మిక్కిలి సమంజసమయిన విషయము. పరమాణు కేంద్రకము (nucleus of atom) ను విచ్ఛిన్నము చేయుటవలన ఉత్పన్నమయ్యెడు కేంద్ర కణమునుండి రేడియోధార్మిక కిరణప్రసారము బయలు దేరునని ప్రారంభము నుండియు స్పష్టమగుచు వచ్చెను. కేంద్రకము విచ్ఛిత్తి నొందుట చాల గొప్ప విషయము. దాని ఫలితముగా తక్కువ ద్రవ్యరాశి గల నూతన పర మాణువు రూపొందును. ఈ విచ్ఛిత్తి స్వయంసిద్ధముగా జరుగు సంఘటనమే గాని, అది ఉష్ణము, చల్లదనము, విద్యుచ్ఛక్తి, అయస్కాంత క్షేత్రము-ఇట్టి బాహ్యమగు భౌతిక, లేక రాసాయనికము లయిన ప్రభావములకు— అవి యెంత శక్తికలవై నను లోబడి యుండదు. స్వాభా విక మనదగు ఈ రేడియోధార్మిక ప్రసారము (Radio activity) అంతర్గతమయిన కారణముల వలననే ఉత్పన్న మగుచున్నది. మరియు, 82వ పరమాణు సంఖ్యను (atomic number) దాటిన బరువైన పరమాణువు లందుగల కేంద్రకణముల (nuclei) కు మాత్రమే ఈ స్వాభావిక మైన రేడియోధార్మిక ప్రసారము పరిమితమై యుండును. అదియునుగాక ఇది దీర్ఘకాలిక మును, ఆలస్య మును అగు పరిణామక్రియ. భౌతిక పదార్థము సృష్టి నాటినుండి ఈ పరిణామక్రియ ఎడతెగకుండ కొనసాగుచునే యున్నది. ఈ రేడియో ధార్మిక ప్రసరణ మును గూర్చి కావింపబడిన సూక్ష్మపరిశీలన ఫలితముగా పరమాణువులో ముఖ్యమయిన అంతర్భాగము కేంద్ర కణముయొక్క నిర్మాణమును గూర్చియు, దాని స్థిరత్వ మును గూర్చియు, మిక్కిలి అమూల్యమయిన సమా చారమును గ్రహింపగల్గితిమి. ఈ విధముగా 'కేంద్రకణ భౌతిక శాస్త్రము' (Nuclear Physics) అను భౌతిక శాస్త్రమునకు చెందిన విచిత్రమయిన ఒక శాఖ సృష్టింప బడి అపరిమితముగా వృద్ధి కావింపబడెను. అయిన లార్డు రూథర్ ఫర్డ్, అతని సహచరులు కలిసి ఈ విషయములో తీవ్రమైన, విస్తృతమైన పరిశోధనలు జరిపిరి. ఈ పరిశోధనల ఫలితముగా వికిరణ ప్రసారము (Radiation) మూడు ముఖ్యలక్షణములు కలిగియుండు నని కనుగొనబడెను. (1) పదార్థముగుండ చొచ్చుకొని పోవుట (2) ఫొటో గ్రాఫిక్ ప్లేటునందు మార్పు కలిగి యుండుట, (3) వాయుపదార్థమును అయనీకరించుట (ionize). విస్పష్టమైన మూడు కిరణప్రసారణ భేదములు త్వరలోనే కనుగొనబడినవి. వీటిలో ఒకటి అతి మృదువైనది; పదార్థములో సులభముగా ఇమడ గల్గినది; అయనీకరణమును మిక్కుటముగా ఉత్పత్తి చేయగలిగినది. దీనినే & కిరణమందురు. రెండవవర్గము మరింత చొచ్చుకొనిపోవు లక్షణములు కలదిగాను, తక్కువ అయనీకరణము కలదిగాను ఉండును. దీనిని B (బీటా) కిరణమందురు. మూడవతరగతి మరింతగా దూసుకొని పోవు శక్తికలదై 8 (గామా) కిరణమని పిలువబడు చున్నది. క్యూరీ ఈ మూడు విధములగు వికిరణములను ఒక అయస్కాంత క్షేత్రముగుండా ప్రసరించునట్లు ఒక ప్రయోగమును సలిపెను. క్యూరీ జరిపిన సామాన్యమైన ఆ ప్రయోగమువలన , B కిరణమార్గములు ఒక దానికి మరొకటి వ్యతి రేకదిళలో అతిక్రమణము (deflection) పొందునని స్పష్టముగా రుజువయ్యెను. 8 (గామా)కిరణ ములువక్రమార్గమున గాక సరియైనమార్గముననే ప్రయా ణముచేయుననిగూడ స్పష్టమయ్యెను. 4 కిరణములు ప్రస రించు మార్గము కన్న నీ కిరణములు ప్రయాణము చేయు మార్గము మిక్కిలి పంపుగలదై ఉండును. దీనివలన a కిరణములు B కిరణములకన్న చాల బరువై నవనియు, ధన విద్యుత్పూరము గల అణువులు గలినవై యున్నవనియు తేలుచున్నది. కాగా B కిరణములు తేలిక యై ఋణవిద్యు త్పూరణము గలవియై యుండును. ౪ (గామా) కిరణము లలో ఎట్టివిద్యుత్పూరణముఉండదు. ఈ ఫలితముల ననుస రించి 4 కిరణముఉదజనికంటే నాలుగు రెట్లు ద్రవ్యరాశిగల హిలియమ్ అను మూలకము యొక్క పరమాణువులోని కేంద్రకము (nucleus) అని ప్రతిపాదింపబడెను. హిలి యమ్ మూలకముయొక్క పరమాణు సంఖ్య 2 (అనగా దీని కేంద్రములోని ధనవిద్యుత్పూరణము 2 పరిమాణ ములు (units) కలదని అర్థము). కణము 1 పరి మాణముగల ఋణ విద్యుత్పూరణమున, ఉదజని పర మాణు ద్రవ్యరాశిలో 1840 వ వంతు ద్రవ్యరాశియుగల

ఒక వేగవంతమగు విద్యుత్కణమనికూడ ప్రతిపాదింప బడెను. 8 (గామా) కిరణములు మిక్కిలి కఠినమగు 'ఎకు కిరణములు'. రేడియో ధార్మిక ప్రసరణ సూత్రములు : ఎట్టి రేడియో ధార్మిక ప్రసరణ పరివర్తనమందైనను కేంద్రకమునుండి ఒక 4 కణముగాని, ఒక 3 కణముగాని ఉద్భిన్నమై వెడలును. కాని రెండు కణములును ఏక కాలమందు బయలు వెడలవు. a కణము ఉద్గమించినపుడు వేరొక నూతన పరమాణువు రూపొందును. మూల పరమాణువు కంటె ఆ నూతన పరమాణువు యొక్క ద్రవ్యభారసంఖ్య (mass number) నాలుగు పరిమాణములు (యూనిట్లు), పరమాణుసంఖ్య (atomic numbers) రెండు పరిమాణ ములు తగ్గుట జరుగును. ఒక B కణము స్పష్టమైనపుడు ఏర్పడు నూతన పరమాణువు యొక్క ద్రవ్యరాశి మూల పరిమాణ ద్రవ్యరాశితో సమానముగనే ఉండును. కాని దాని పరమాణుసంఖ్య 1 పరిమాణము హెచ్చును. పర మాణుసంఖ్య (Atomic number) అనగా, పరమాణు కేంద్రకము (nucleus)లో నుండు మొత్తము ధనవిద్యు త్పూరణమునకు సమానము; లేక ఒక తటస్థ పరమాణువు యొక్క పరిభ్రమణ విద్యుత్కణముల (Planetary ele- ctrons) సంఖ్యకు సమానము; లేక ఆవర్తన పట్టిక (Periodic table)లో నుండు ఆ మూలకము యొక్క క్రమసంఖ్య. 82, అంతకంటే ఎక్కువ పరమాణువుల సంఖ్యగల అన్ని మూలకములు అస్థిరమగు స్థితిని గలిగి 4 లేక P కణములను వెడల గ్రక్కుచు తమకంటే తక్కువ మూల కములకు చెందిన పరమాణువులుగా విచ్ఛిత్తి నొందు చుండును. ఈ పరివర్తనములు (transformations) క్రమ ముగా జరుగుచు, రేడియో ధార్మిక శ్రేణి (Radio active series) గా రూపొందును. మూడు ముఖ్యమగు అట్టి శ్రేణులు కలవు. అవి 1. యూ రేనియమ్- రేడియమ్ శ్రేణి; 2. ఆనంశ్రేణి; 3. థోరియంశ్రేణి అనునవి. ఈ శ్రేణులు ఆయా మూల మూలకము (Parent elements)లను బట్టి పిలువబడుచు ప్రతిశ్రేణియు సీసముగానో లేక దాని సస్థానికము (isotope) గానో అంతమగును, 21 సగము మనుగడ - సగటు మనుగడ (Half life period and average life): సగము మనుగడ (Half life period) అనగా ఒక రేడియో ధార్మిక శక్తి గల పదార్థము యొక్క మూల ద్రవ్యరాశి యందు సగము భాగము క్షీణించుటకు పట్టు కాలము అని నిర్వచింప బడెను. రూథర్ ఫర్డు యొక్క సిద్ధాంతము ననుసరించి దానిని ఇట్లు చూపవచ్చును : t=0.6931 x T ౨ t= సగము మనుగడ; T = సగటు మనుగడ వివిధములగు రేడియో ధార్మిక - ఉత్పత్తుల (Radio active products) యొక్క స్థిరత్వము విపరీతమగు అవ ధులమధ్య భేదించుచుండునని తెలియుచున్నది. థోరియమ్ యొక్క సగము మనుగడ యొక్క విలువ 1.4× 10 10 సంవత్సరములు. థోరియము c యొక్క అట్టి విలువ 10 సెకండ్లు. వెనుక చెప్పినట్లు ప్రతి రేడియో ధార్మిక శ్రేణి యొక్కయు అంతిమ ఉత్పాదము సీసము అగును. ఒక రేడియో ధార్మిక శక్తి గల నమూనా శిల యందు మాతృకా పదార్థము (parent substance) అత్యల్ప పరిమాణములోను, అంతిమోత్పాదితమగు సీసము అంత కంటె మిక్కిలి అధిక పరిమాణములోను ఉండును. ఈ పరిమాణములను నిర్ణయింపగలిగినచో, రేడియో ధార్మిక సూత్రముల ననుసరించి ఆ శిల యొక్క వయస్సును కను గొనవచ్చును. ఈపద్ధతి ననుసరించి అత్యంత ప్రాచీనమగు శిల యొక్క వయస్సు 2000 మిలియనుల సంవత్సరము లుండుననియు, అది ఇంచుమించుగా భూమి యొక్క వయస్సుతో సమానమనియు కనుగొనబడెను. ఈ విధ ముగా రేడియో ధార్మికశక్తి భూమి వయస్సును నిర్ణ యించుటలో మొట్టమొదటగా ఒక అప్రతిహతమగు విధానమును సమకూర్చెను. రూధర్ పర్డ్ చ్చే a కణములు హిలియం యొక్క 'పరమాణువులు కేంద్రకములని సహేతుకముగా చూప బడెను. వాటియొక్క బహిర్గమన వేగము కాంతి వేగ ములో దాదాపు వ వంతు ఉండును. 1 గ్రాము రేడి యము సెకండు 13.72×101°a కణములను వెడల గ్రక్కును. ఈ కణములకు అయోనై జింగ్్శక్తి విస్తారము గను, చొచ్చుకొనిపోవుశక్తి అల్పముగను ఉండును. a B

కణములుగాని, రేడియో ధార్మికశక్తిగల పదార్థముల ఉనికిగాని, అవి ఎంత స్వల్ప పరిమాణములో నున్నప్పటి కిని వాటిని శోధించి తెలుపుటకై గీజర్ ముల్లర్ కౌంటర్ (Geiger Muller Counter) అను పరికరము ఉపయో గింపబడును. a కిరణములు జింకు సల్ఫైడ్ (యశదగం ధకిదము) వంటి కొన్ని పదార్థములమీద పడినపుడు ప్రకా శమును ఇచ్చును. ఆ పదార్థము సింటిలేషనులు (Scinti llations) అనబడు సూక్ష్మమైన వెలుగుమచ్చలను కన బరచును. ఒక సూక్ష్మదర్శిని ఒక సూక్ష్మదర్శిని సహాయమున ఈ మచ్చలను పరిశీలించి 4 కణముల యొక్క సరియగు సంఖ్యను లెక్కింప వచ్చును, ఆకణములు విద్యుత్ క్షేత్రముచేతను, అయ స్కాంత క్షేత్రముచేతను అతిక్రమణము (deflection) నొందును. సామాన్యమగు పీడనము, ఊష్ణోగ్రతలలో నుండు గాలిలో ఆ కణములు కొలది సెంటి మీటర్లు పోవును. అటుపిమ్మట అది వాటి ధర్మముల నన్నింటిని కోల్పోవును. ఈ దూరము గాలిలోని పరిమితి (Range in air) అనబడును. ఈ పరిమితిలో పల 4 కణము వేలకొలది అయాన్ జంటల (ion pairs) ను ఉత్పత్తి చేయును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ అయానుల చుట్టు నీటిఆవిరికూడు కొను (condensed) నట్లు చేయ వచ్చును. ఇట్లొక నీటిబిందువులు మేఘము ఏర్పడును. ఆ మేఘమును సరియగు విధానములో ప్రకాశవంతముగా చేసి ఫొటోగ్రాఫు తీయవచ్చును. ఈ మేఘములచే ఆవరింపబడు కాశీలయొక్క ఫొటోగ్రాఫులు తిన్నని. బాటలను చూపుచు, గాలిలోగాని, మరేదైన వాయు వులోగాని, వాటి అవధియొక్క పరిమితిని చక్కగా తెలుపును. రూధర్ ఫర్డ్ కొన్ని ఫొటో గ్రాఫులలో రెండుగా చీలిన (forked) చివరలను పరిశీలించెను. దానినిబట్టి a కణము ఒక వాయుకణము గుండా పోవునవుడు ఒక పెద్ద కోణ ములో అతిక్రమణము నొందునని తెలియుచున్నది. ఈ పెద్దకోణముతో కూడిన అతిక్రమణములను వివరించుట కొరకు రూధర్ పర్డ్ నిజస్వరూపమునకు మిక్కిలి సన్ని హితమని అప్పటివరకు రుజువుచేయబడిన ఒక పరమాణువు యొక్క మాదిరిని భావించెను. ఈ మాదిరినిబట్టి ఒక పర మాణువు కేంద్రక (necleus) మనబడు అంతర్భాగమును కలిగియుండును. అది వేరు వేరు వలయములందు (orbits) చలించుచుండు విద్యుదణువుల (electrons) చే పరివేష్టి తమై ఉండును. దానియందు పరమాణు భారమంతయు కేంద్రీకరింపబడి యుండును. కేంద్రకము (nucleus) యొక్క వ్యాసార్థము సుమారు 10-13 సెంటిమీటర్లు ఉండును. పరమాణువు యొక్క వ్యాసార్థము 10-8 నెం. మీ. ఉండును. ఇట్లు పరమాణువు సౌర విధానము (solar system) ను పోలియుండును. కణము ఒక పరమాణువుగుండా పోవునపుడు సాధారణముగా అతి క్రమణము (deviation) చెందిగాని చెందక గాని, ఒక విద్యుదణు మేఘము (electronic) గుండా పోవును. కాని సకృత్తుగా (Occasionally) ఒక (హిలియం కేంద్రకము) పరమాణు కేంద్రకము (nucleus) యొక్క దిశలో దూసుకొని పోవచ్చును. కేంద్రకముల మధ్యనుండు వికర్షణము వలన ఆ కణము తక్కువ ద్రవ్యరాశి కలదగుటచే పెద్ద కోణము గుండా అతిక్రమణము నొందును. ఈవిధముగా పెద్దకోణము యొక్క ప్రసారమునుబట్టి కేంద్రకము యొక్క పరి మాణమును గూర్చిన అంచనా మొట్టమొదటగా చేయ a కణము బడును. (b) B కిరణములు : ఇవి అతివేగముగా చలించు చుండు ఋణ విద్యుత్పూరితములగు కణములు. వీటి వేగము కాంతి వేగములో 3వ వంతునుండి దానితో సమముగ నుండువరకు మారుచుండును. ఇవి 4 కణముల a కంటే 100 రెట్లు అధికముగా చొచ్చుకొనిపోవు స్వభా వము కలవి. కాని వాటి అయోనైజింగు శక్తి కణ ములయొక్క ఆశక్తిలో 100 వ వంతు ఉండును. ఒక 3కణముయొక్క అధిక వేగమునుబట్టి దాని ద్రవ్యరాశి ఒక ఋణ విద్యుదణువు (electron) కంటే అధికమని కనుగొనబడెను. ఆ ద్రవ్యరాశి యందలి ఆధిక్యము కచ్చిత ముగా ఐన్స్టీన్ల్చే చెప్పబడిన సూత్రమునకు అనుగుణ ముగా సరిపోవును. (c) 8 (గామా) కిరణములు: ఇవి సుమారు 10-10 నెం.మీ. తరంగ దైర్ఘ్యముగల మిక్కిలి కఠినమగు 'ఎక్సు' కిరణములు ఇవి తాము పడిన (ప్రసరించిన పదార్థము నుండి 3 కిరణములను బహిర్గత మొనర్చును. సాధారణ

ముగా ఒకే విచ్ఛిన్న ప్రక్రియయందు (disintegration) B (బీటా) కిరణములు, 8 (గామా) కిరణములు వెడల గ్రక్కబడుచుండును. ఆ కిరణములు P కిరణముల కంటె 100 రెట్లు అధికముగా చొచ్చుకొని పోగలిగియుండును. కాని అయోనై జింగు శక్తి యందు ఇవి B కిరణములతో పోల్చిన, 100 వ వంతు ఉండును, 8 కిరణములు అయ స్కాంత క్షేత్రముచే గాని, విద్యుత్ క్షేత్రముచే గాని, అతిక్రమణము (deviation) చెందవు. ఇవి 'ఎక్సు’ కిరణ ముల మాదిరిగ నే ఎక్కువగా విశ్లేషణము (diffraction) నొందును. ప్రేరిత లేక కృత్రిమ రేడియోధార్మికశక్తి (Indu- ced or Artificial Radio Activity) : 1934 వ సంవత్సరములో ఐరెని (క్యూరీసతియొక్క కుమార్తె), ఆమెభర్తయగు జోలియట్ అను నాతడు - బోరాన్, మెగ్నేషియము, అల్యూమినియము అనునవి a కణములచే ఆఘాతము నొందినమీదట రేడియో ధార్మిక శక్తి కలవి అయ్యెనని కనుగొనిరి. దీనినిబట్టి విచ్ఛిన్న ప్రక్రియ (disintegration) యందు ఉత్పత్తి యగునది రేడియోధార్మికశక్తిని కలిగియుండుననియు, కేంద్రక పరివర్తనములను (nuclear transformation) సామాన్య పద్ధతిలో నే చెందుననియు రుజువయ్యెను. అట్టి ఉత్పత్తుల యొక్క సగము మనుగడ (Half_Value period అత్యల్పముగా నుండును. అయినప్పటికిని పై జెప్పిన ధర్మములు రుజువయ్యెను. ఈదృగ్విలాసమును కృత్రిమ రేడియో ధార్మిక ప్రసరణమనెదరు. అల్యూ మినియం యొక్క సందర్భమున జరుగు ప్రతిక్రియ ఇట్లుండును. 13 A 1' + 2 He' 15 Prº + on' on' అనునది శూన్యపూరణము (Zero Charge)- ఒక పరిమాణపు ద్రవ్యరాశి (unit mass) గల కణము. అది న్యూట్రాను (Nutron) అనబడును. 15 Poo అనునది రేడియో భాస్వరము. దాని సగము మనుగడ (half value period) 15 సెకండ్లు. ఇది సిలికను అను పదార్థ ములోనికి విచ్ఛిన్నము చెందును. ఇదేవిధమగు పద్ధతుల ననుసరించి నేడు పలురకములగు రేడియో ధార్మిక శక్తిగల పదార్థములు తయారు చేయబడుచున్నవి. మన శరీరములో ఇనుము, కాల్షియము, అయోడిన్ మున్నగు అనేక మూలకములు ఉండును. చాల కాలము వరకు శరీరములో ఏ నిర్దిష్ట (particular) భాగము నందు అయోడిను ఉండునో గుర్తించుట కష్టమయ్యెను. నేడు ఒక వ్యక్తికి రేడియో అయోడీనును ప్రయోగించిన యెడల, ఇది తిన్నగా సాధారణపు అయోడీను ఉండు తావునకు సరిగా పోవును. ఎందుచేతనన, ఈ రెండును సస్థానికము (isotopes) లగుటచే రసాయనిక ముగా సర్వవిధముల సదృశములై యుండును. రేడియో అయోడినును, దాని రేడియో ధార్మిక శక్తిని బట్టి G. M. కౌంటరు సహాయమున సులభముగా గుర్తింప వచ్చును. దానిని బట్టి అయోడిను యొక్క స్థానమును కని పెట్టవచ్చును. ఈ విధముగా గళ గ్రంథి (thyroid gland) యొక్క స్వస్థతకు తగుమాత్రపు అయోడీను ఆవశ్యకమని కనుగొనబడెను. అయోడిను, భాస్వరము, గంధకము, కర్బనము, సోడియము అనువాటి యొక్క ఐదు రేడియో సస్థానకములు (isotopes) వైద్యసంబంధ మైనట్టియు, శరీర సంబంధమైనట్టియు, జీవ సంబంధ మైనట్టియు పరీక్షల యందు గుర్తించు సాధనములు (traces) గా విస్తారముగా వాడబడుచున్నవి. శోధక (గుర్తించు) నై పుణ్యము చెట్లలో జరుగు ఈ క్రింది ప్రతి క్రియ లందును, పరిశ్రమలందును విస్తారముగా ఉపయో గింపబడుచున్నది. జాగ్రత్తగా తయారుచేయబడిన జింకు సల్ఫైడుతో గూడిన రేడియో ధోరియము (Lకణము లను బయలు గ్రక్కునది) యొక్క మిశ్రమము శాశ్వత మగు ప్రకాశమును కలిగించును. అది గడియారములో అద్దుటకు ఉపయోగపడుచున్నది.

రేడియం నుండి వెడలు 8 (గామా) కిరణములు, ఆరోగ్యముగా నుండు చర్మమునకు అపాయకరములై నప్పటికిని, కాన్సరు వంటి వ్యాధులను కుదుర్చుటకు ఉప యోగపడుచున్నవి. రేడియో కోబాల్టు (cobalt) ఇదే విధమగు కిరణములను వెడలించును కనుక అది ఇప్పటి గ్రాము ఒకటికి రు. 65,000 ల విలువ గల రేడియం యొక్క స్థానములో అమోఘమును, చౌకయు నగు ప్రత్యామ్నాయముగా వాడబడుచున్నది.

వి. వి. వ.