శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 46
శ్రీ
సుందరకాండ
సర్గ 46
1
మంత్రిసుతులు హనుమంతునిచే తెగ
టాఱిన వార్తల నాలకించి, వెత
కప్పిపుచ్చి, దశకంఠుడు వెంటనె
ఉత్తరకార్యము నూహించెను మది.
2
యూపాక్షుండు, విరూపాక్షుడు, ప్రఘ
సుడును, భాసకర్ణుడు, దుర్ధరుడను,
సేనాపతులను చేరబిలిచి, యిటు
లా దేశించెను హనుమద్గ్రహణము.
3
మీరందఱును మహారథులు, నయవి
శారదులు, రణకుశల ధురంధరులు,
హనుమద్గ్రహణ వ్యగ్రకౌతుకులు,
వాయువేగ దుర్వారులు పోరుల.
4
అగ్రనాయకులు అందఱు మీరలు,
రథగజాశ్వ చతురంగబలంబుల
తోడనేగి, బలధూర్వహు వానరు
తిగిచిపట్టి బంధింపుడు వేగమె.
5
యత్నంబున రవ్వంత యేమరక,
అడవి వానరుని అడచిపట్టదగు,
దేశకాలములతీరు లరసి, అవి
రోధముగా పని సాధింపం దగు
6
స్థితిగతులు వివేచించిన నా కిది
సామాన్యపు కపిగా మది తోచదు,
సర్వజగద్బల శక్తి భూతమని
భావింతును అనుభవపూర్వంబుగ.
7
సృజియింపందగు ఇంద్రుడు మనకై
తన తపమంతయు ధారబోసి, కా
దేని సురాసుర ఋషిపన్నగ య
క్షగణము లొకటై కల్పింపందగు.
8
నాతో మీరందఱు కలసి సహక
రింప, వారి నెదిరించి జయించితి
మపు, డందు కవశ్య ప్రతికారము
నిపు డీగతి ఘటియింప నోపుదురు.
9
సందేహము లేదిందుకు, మీరలు
చులకనచేయక చుట్టుముట్టి, బలి
మిని మెలకువతో మెలగి పట్టు డీ
ఘాతుక వానర భూతము నెట్టన.
10-12
అతివిక్రమ విశ్రుతుల వాలిసు
గ్రీవుల, బలవరిష్ఠు జాంబవం
తుని, సేనాధిపతిని నీలుని, ద్వివి
దాదుల బీరము నరసితిని మునుపు.
?
వారలలో నెవ్వరియందును పొడ
కట్టవయ్యె నీ కపి శార్ధూలుని
బాహుపరాక్రమ బలదీమసములు,
తీక్షణ భీమగతి ప్రహారములు.
?
ఈతని నిశిత మనీషాధారయు,
రూపుమార్చు నేరుపును వారిలో
లే, విది పరిశీలించిన, వానరు
డొక దురంతపు ప్రయోగము కాదగు.
13
మీకు చాలరు త్రిలోకముల సురా
సురనరు లింద్రుడు జోడుకూడినను,
ఈ కపివృషభము నాకట్టుడు, ఎం
తటి మహాప్రయత్నముతోనైనను.
14
జయముకోరు రణనయకోవిదులకు,
ఆద్యవిధాయక మాత్మరక్షణము,
నిశ్చితంబు కానిది చంచలమగు
యుద్ధఫలిత, మది యోధు లెఱుగుదురు.
15
స్వామి పలుకు శాసనముగ గైకొని,
అగ్నులబోలిన అగ్రనాయకులు,
అతివేగంబున అరిగి ముట్టడిం
చిరి హనుమంతుని సింహసంహనుని.
16
మదము జిడ్డుగొను మాతంగంబులు,
కాలూదని మదకంఖాణంబులు,
భార రథంబులు, బహువిధ శస్త్రా
స్త్రంబుల రణసంరంభం బెగసెను.
సుందరకాండ
17
తన తేజోమయ ధామమాలికల
పొడుచుచున్న రవి పోలికను ప్రకా
శించుచున్న కపిశేఖరు, వీరా
కారము చూచిరి గండురక్కసులు.
18
దీర్ఘ బాహువులు, దీప్తోత్సావాము,
అతికాయంబు, మహాబలవేగము,
ఒడలు తాల్చినట్లుండెను మారుతి,
తోరణంబుపయి ధీరస్ఫూర్తిని.
19
హనుమను చూచినయంతనె తడయక
వా రందఱు నలువైపుల వలగొని,
ఒక్కుమ్మడి ఆయుధములతో, పై
బడి ప్రహరించిరి వానరవీరుని.
20
దుర్ధరుడను దైత్యుడొకడు పచ్చని
వా దరతేఱిన వాడి నా రసము
లయిదింటిని చయ్యన చాలుగ కపి
నడినెత్తినబడ నాటెను సూటిగ.
21
అయిదు బాణముల హనుమ మస్తకము
వ్రయ్యలై_ పగుల, వానరుడును బ్ర
హ్మాండ మదర బిట్టఱచుచు రయమున
కుప్పించి యెగసె ఉప్పరంబునకు.
22
అది గని దుర్ధరు డరదమెక్కి, వి
ల్లెక్కుపెట్టి, వడి లెక్కలేని వా
లంపఱ కురియుచు ఆభీలముగా,
హానుమమీది కెగయగ ఉంకించెను.
353 సర్గ 46
23
విడుమరలే కురవడి జడిగొను దు
ర్ధరుని శరాసారము నరికట్టెను,
వానరేంద్రు, డవసాన వర్షముల
కడమ మబ్బులను సుడిగాడుపువలె.
24
అటు లా దుర్దరు డనిలనసుతుని వా
లంపఱతో పీడింపగా, విసిగి, యెగసి,
ముల్లోకములును బొమ్మరపోవగ
బొబ్బలుపెట్టుచు పొంగి పెరిగె దివి.
25
వెంటనె మారుతి మింటను దూరము
మీదు మిక్కిలి క్రమించి, క్రమ్మఱి, ర
యమున దుర్ధరు రథముపై దుమికెను,
కొండమీద పిడుగుల రాశింబలె.
26
గుఱ్ఱము లెనిమిది కూలి క్రిందబడె,
ఇరుసుతునకలుగ విఱిగె రథంబున
కాడి యూడిపడె; కాలము తీరగ
నేలమీద కైవ్రాలె దుర్ధరుడు.
27
దుర్ధరుడాగతి తూలి త్రెళ్ళ, యూ
పాక్షుడును విరూపాక్షుడును కినిసి
అరిమర్దను లిద్దరును మహా రో
షముతో ఆకాశంబున కెగసిరి.
28
నిర్మలంబయిన నింగి నెగడి, త
మ్ముభయుల నెదిరిన యోధవానరు మ
హాభుజుని బలీయముగా మొత్తిరి,
గుండెలమీదను పిండిపిండిగా.
సుందరకాండ
29
జఁటమగల దుస్సహఘాతల మెయి
కుంచి కెరలి కుప్పించి, మహాకపి,
గరుడుని పగది, యెకాయెకివ్రాలెను
భూతలమున విపరీతవేగమున.
30
వ్రాలి, అటసమీపమున నున్న వృ
క్షప్రకాండము పెకల్చి కొట్టె; ఆ
వీరు లిద్దరును పీచమణగి భూ
శయనముగా విశ్రాంతిని పొందిరి.
31
మొదట దుర్ధరుడు, పిదపను యూపా
క్ష విరూపాక్షులు చావగ కనుగొని,
అసహనుండయి, ప్రఘసు డతిరయమున
మారుతాత్మజుని మార్కొనె చలమున.
32
మఱియొకవైపున మసలి క్రుద్దుడై
భాసకర్ణు, డతిభారమమున శూ
లముతో తాకె బలంబుగ, కపికుల
వీరు నటుల, ఊపిరి సలుపనిగతి.
33
ప్రఘసు డొకట యెగపార కురిసె, పద
నయిన కక్కుల ప్రహరణ ధారలను,
భాసకర్ణుడొకవంక శూలమును
త్రిప్పి త్రిప్పి కారించి కొట్టె వడి.
35
రాక్షసు లిద్దరు పక్కల నెదుటను
తెరపి యిడగ బాధించిన, నెత్తురు
కాఱు మేనితో కానవచ్చె హరి,
జ్వాలమాలికల బాలభానువలె.
355 సర్గ 46
35
అంతట, వీరుడు హనుమంతు డలిగి
పాముల మృగముల పాదపములతో
కొండ శిఖరమును కుదిపి, పెరికి, వడి
రాక్షస యుగ మర్దనకు కడంగెను.
36
ఆ దెబ్బలు తిని హతమై నీల్గిరి
ఏవురు సేనాధీశులు; పిమ్మట
బ్రతికియున్న రావణు సైన్యములను
నాశము చేసె ననాయాసంబుగ.
37
సేనాపతులు నశింపగ, వారి గు
ఱాల మీదను గుఱాలనూకి, ఏ
నుగుల మీద ఏనుగుల నెట్టి, ర
థాల మీదను రథాలను త్రోసెను.
38
అమరేంద్రుడు మున్నసురులబోలె, మ
హా కపి రక్కసి మూకల గెడపగ,
కూలిన తేరులు, గుఱ్ఱము, లేన్గులు,
రాసులు పడె మార్గముల కడ్డముగ.
39
ఆయుధ బలవాహనములతో నా
యక సేనల తెగటార్చి మహాకపి,
తోరణంబుపయి కూరుచుండె; క
ల్పాంత వాసరకృతాంతుని వంతున.
356