శృంగారపంచకము/సరసచాటువులు

నాగపాశబంధము

చ.

అమరగ భోగినీముదిత వై తనుచు న్జడ జూడ దోచు, మా
న్యముగ భుజంగుడన్, మది గనంగ దశం దగినారమే చుమీ!
శ్రమ విడ, నింక నోము నను జానుగఁ జెల్వగునాగపాశబం
ధమున రతుండ నో మహిళ, తాళనె చుమ్మిక నీ భువిం జెలీ.

49

చక్రబంధము

శా.

కన్యా! శృంగిసమానబంధురకుచా! కల్యాణసుశ్రీరమా!
ధన్యా! గానకళాధురంధర! కళాతంత్రాసమానాచరా!
జన్యేరమ్మదజైత్రసుందరకటాక్షా, యిద్దియే ధర్మమా?
మాన్యాత్మా! కడు బాధ గల్గె, నను లే మాటన్నరా జూడుమా.

50

రసికాభిలాషము

సమాప్తము



సెట్టి లక్ష్మీనరసింహ్వ కృత

సరసచాటువులు

తే.

పూర్ణశశిసమమై మోము పొలిచెనేమొ?
కురులపేరి మబ్బులు దగుల్కొనియె నడ్డ;
నాతిమిన్న నాతోడ నిన్న మగలాగు
కుతుకమున సల్ప దాని పైకొన్నయపుడు.

తే.

కను, ప్రియా, తులువయళి యీ యీకలువపూకు
ఱంగటం గని, యిందు మరంద మొడ్డ
గిల్లఁ నెం తొప్పె నం చుల్లసిల్లుచు, నది
గ్రోలి నిదుర పొందెం గులుకుచు నచటనె.


ఉ.

"ఇంతలు చన్ను లుండ మఱి యెవ్వరి గూడెదు భాసురాంగ? యే
కాంతమునందు నున్న జవరాల; ద్రనం బడి వెన్కతీయులా
గింతయ గాక, నీ వెఱుగవే మరు డిచ్చిన దారి చొప్పు? నీ
వింతభయంబు మై నుడుగ వెల్లిద మౌదువు; మాట లేటికిన్.


ఉ.

"నిక్కదు, దోప నేల? తరుణీకులరత్నమ, యింక నీపయిం
జిక్కె ఘనంబు నీకు; విను, చిత్తజుదండము జప్పరించెదో?
చొక్క బరాందిమద్యముల చూఱల బాటిలు వేడిచేత బెం
పెక్కదజేసి, దాని మరునింటను దూఱిచి యాదరించెదో?"


సమస్య.

చన్నులవంక జూపె జలజాస్య విటుండు తొలంగిపోవగన్.


ఉ.

"క్రొన్ననవిల్తుగేళి గవ గూడగ నియ్యెలతోటలోనికిన్
ని న్నిపు డేగుదె మ్మనుచు నే గబు రంపితి నింతి, నా చెలుల్
తిన్నగ నివ్వనంబున కదే! చనుదెంచుచు నున్నావా,” రటం
చన్నులవంక జూపె జలజాస్య విటుండు తొలంగి పోవగన్.


సమస్య.

యో నిరతంబు జేయు నరు డొందడు పాపము బొందు
బుణ్యమున్


ఉ.

॥ మానక 'రామ, రామ,' యని మానసమందు శివుండు నిత్యమున్
ధ్యానము జేయుచుండు; నల తారకనామము జిత్తమందు శ్ర
ద్ధానియమంబు లొప్పగను దాను బునశ్చరణంబు వందొ, వేయో
నిరతంబు జేయునరు డొందడు పాపము, బొందు పుణ్యమున్.


సమస్య.

'భగమును నీవు పెట్టగను - బానము చేసినవాడనే' యనెన్


చ.

దగ గొని దుస్ససేనుని యెదం గల నెత్తురు గ్రోలు భీము డం
తఁ గురుపతిం గనుంగొనుచు 'ద్రావెదనంటిని, ద్రావితిన్ మహో

రగసదృశుండు వీని రుధిరం బనినన్ విషమే; విషంబు దు
ర్భగ! మును నీవు పెట్టగను బానము చేసినవాడనే,' యనె౯


సమస్య.

దెంగన్సత్తువ చాల దంచు రమణిం దేర్చెన్ రతిక్రీడలన్


శా.

అంగంబుల్ విటుబొయ్యనం గ్రమముగా నంటంగ రోచేడె 'నా
భిం గేల్పెట్టెద? వేది యెందొ సరిగా వీక్షింప లేవే?' యనం
గం, గాంతుండు పకాలు మంచు నగుచుం గన్దోయి చత్వార మొం
దెం; గన్సత్తువచాల' దంచు రమణిం దేర్చెన్ రతిక్రీడలన్.


సమస్య.

రంభ త్రికోణమధ్యమున రత్నము భాసిలె నద్భతంబుగన్


ఉ.

జంభవిరోధి కోడిని ని?శాచరు లాతని పంపునన్
దంభము మాని రంభమరుధామమునం దల లుంచి మ్రొక్కుసం
రంభమునందు నూడి, యొకరత్నము లోపట జిక్కె; నందుచే
రంభ త్రికోణమధ్యమున రత్నము భాసిలె నద్భతంబుగన్


క.

ధనకాంక్షమ గల గణికా
కనకాంగులతోడ జిత్తకార్తి దిరుగు స్త్రీ
శునకాలను దక్కెడనో
తునికోలనొ తూచి సరిగ దూగగ వచ్చున్.


చ.

ఖగపతి తెచ్చుచున్నపుడు కాఱి సుధాలవమే పొగాకుగా
జగతిని బుట్ట వొందెనను సంగతి సత్య మటంచు దా మెఱుం
గ గలుగుచుంద్రుగాదె గణికామధురోష్ఠసుధారసంబు ద్రా
గగ గమకించు నట్టి విటకాని, డ్రట బుట్టుడి చుట్టవాసనన్.


ఉ.

విత్తులనుండి చెట్లు ప్రభవించుట యున్నది గాని పండ్లె యు
త్పత్తిని బొందు టబ్రము గదా? వనమాలిసుతుండ స్త్రీలకున్
హృత్తటమందు జిన్నపుడె రెం డిసుమమంతలు విత్తు లుంచగా,
గ్రొత్తవయస్సునాటి కవి రూ పగు గుత్తపుదబ్బపండ్లుగా.


క.

మదను డను స్వర్ణకారుడు
పదకము చెలి తొడలి నడుమ బాగుగ నిడి యే

యదుకుం బెట్టెనొ? పగిలిన
దది సీల బిగింపు లింక నవరర మయ్యెన్.


చ.

మొగములు మాసమందు నొకమూడుదినంబులు దక్క స్త్రీలకున్
మిగిలి యట్టి రోజులను మెచ్చొదవించును వీడ్యపున్జిగిన్;
భగములు మూడు రోజులనె పాపము! తద్విధ మైన వీడ్యపు
న్జిగిని ధరించుచుండు విధి చేసెను దాదృశపక్షపాతమున్.


ఉ.

ఏతఱి మన్మథుండు తనయింటిపయిన్ నునుతేంట్ల కాపుగా
రాతిరియుం బవల్ నిలిపె, రా గమకించు భుజంగతండమున్
'హా!' తను, 'హాతు హా!' తనును 'హా!' తను! నయ్యవిందుచేతన్
యాతులు గాగ మాఱినవి యాదిహకారము లోపమౌ గదా.


తే.

మారు డాత్మదండంబును బూరుషులప
రంబు గావించి, నిజమందిరము రమణుల
వశము చేయంగ, నయ్యది వచ్చి యిందు
జొచ్చు నలవాటు మాన్పుట సులభమగునె?


ఉ.

చిత్తమునందు సంభవము చెందిన మన్మథు డందు నిల్వగా
నొత్తెడు గల్గె గర్కశపయోధరభూధరకరణంబునం;
గ్రొత్తనివాస మేర్పఱుచుకొంటకు నూరుల కేగి యచ్చటన్
బెత్తెడుకొంప నుండియును, బిండు నతండు సమస్తవీర్యమున్!


తే.

ఊరుల నడుమ మన్మథు డుండ నిఁడ్లు
కట్టకొనె; దానిపై దొలుకారు శష్ప
తతి ప్రబలి ద్వారముల గప్ప దండములను
దొలగద్రోయుం డనుచు బురుషులను బంపు.


చ.

ఘనతరకార్యముల్ సలుపగల్గ బ్రయోజకు లైనవారికిన్
వెనుక సహాయు లుందురు కనీస మొకిర్వురెయేని; బ్రహ్మదే
వుని గతి సృష్టి సల్పుటకు బూనిన శిశ్నము వెన్కనండముల్
దనరుట గాదె యా పనిని దా నొనరింపగ నేర్చు జక్కగన్.

నెలకున్ ముప్పది జీతముం గొనుచు నెంతేస్వేచ్ఛగా నున్న వే
శ్యల బియ్యాల, దదర్ధజీవితములం దా క్టింగులం జేసి శు
ష్కిలు బియ్యేల్ గని మ్రొక్కుకాల మరుదెంచెంగాదె? యాకారమే.
విలువం దెచ్చు నటంచు మాఱు డిపుడో బియ్యేలు? బియ్యాలుగా


(బియ్య (ఓఢ్రమున) - భగము, బియ్యే (B. A.); ఆక్టింగు (Acting) ఖాయము కానిది; అకారము - అయన్న యక్షరము, (రూపము)


ఉ.

లోహములం గడాని, యిహలోకపుగింజలలో బటాని, జి
హ్వాహితదాయకాఖిలపదార్ధచయంబున జీనియున్, జగ
న్మోహినులందు సాని, కవిపుంగవు లందు శతావధాని, స్త్రీ
దేహమునందు మోనియు బ్రతిష్ఠను గాంచెను వ్రేష్టతన్ భువిన్.


క.

జాకెట్టున గల వాచీ
పాకెట్టున జేయి పెట్టి, "పడతీ, వాచీ
లేకిట్టులు టిక్టిక్కులు
నీ కిట్టులు కలిగె?" నంచు నెయ్యుం డడిగెన్.


జాకెట్టు (Jacket) స్త్రీలుతొడుగుకొనుజుబ్బా; పాకెట్టు (Pocket) జేబు; వాచీ (Watch) జేబుగడియారము


ఉ.

స్త్రీలచనుల్ మింతబు లయి ప్రీతిని గొల్పును; బట్టరాని బొం
డా లయిన్ విలుల్ నిరసననం బొనరింతురు వానినిన్; టెనిస్
బాలును జేతబట్టుకొని బాలకు లాడుదు; రట్లు గాక ఫుట్
బాలును గాళ్ళదన్నగ గడంగుదు, రెందరు గల్గ నందఱున్.


బాలు (Ball) బంతి: టెనిస్ (Tennis) ఫుట్ (foot) కాలు


ఉ.

కాముడు కుట్టువాండ్ర చెలికాడె యగెన్ మగవారిబ్రేమతో
గోటాలు లారయన్, రవిక కుట్టు పుటు క్కనిపించు; నట్టు లే
భామల వంక బూరుషులు భ్రాంతిమెయింగను లెత్తిచూడ. బెం
డ్లామలకన్న బట్టనులు ట ప్పనిపించును జప్పుచప్పునన్.

(పెంట్లాము- (Pentaloom) షరాయి: బట్టను- (Botton) గుండీ


చ.

దొరలటు నున్నగా సుళువు దోపగ, మీసము గడ్డమున్ మహా
త్వరగను షేవు చేసికొను భర్తల గన్గొని భార్య, “లక్కటా!
హరిదల మంచు; బూడిద యటంచును, మాకిక నేల? విూదురే
జరులను దెండి,” యందరు, హసన్ముఖు లౌ'చును వారు పొండనన్.


(షేవు (Shave) క్షనరము; రేజరు (Razcr) మంగలికత్తి)


చ.

క్షవరము కాంచెడున్ సివిలుసర్విసులోన బ్రవేశమైన వా
రి వదనముల్: భువిన్ మిలటరీ పని వారికి మీస లెప్పుడుం
దువిలియె యుండు సూనశరదారుణసంగర మందు నుండు న
ట్టివి గనుకన్ భంగములకు ఠీకుగ మీసము లుండు చెంపలన్.


(సివిలు సర్వసు) (Civil Service) యుద్ధసంబంధము కాని కొలువు: మిలటరీ - (Military) యుద్ధసంబంధమైన కొలువు,


శా.

చెల్వున్ షాపున బట్టకై చెలియ వాంఛింపన్, “సతి, పూర్వపున్
వల్వా కావులె?” నంచు భర్త తను సంప్రశ్నించె; నింగ్లీషునం
దెల్విం గల్గిన భార్య, “పూర్వపుది కాదేన్ గ్రొత్తదిన్ వచ్చునా?
మొల్వం బోలును మీకు పీనిసులు ఱేపున్ మాపు నందున్.


(షాపు (Shop) దుకాణము: వల్వా (Vulvca) యోని; పీనిసు (Penis) శిశ్నము: పూర్వపున్ వల్వకావలెన్ వెనుకటిరకపు బట్టయా కావలయునని భర్త యడిగెను; పూర్వపుయోని కావలయునని భక్తి యడిగినట్లు; ఇంగ్లీషు చదువుకొన్న భార్య యొకయర్ధముతీసి, యెకసక్కెము చేసినది.)


చ.

తవితను నేర్చుకొన్న గణికం గనుచున్ రసికుండు, “చెప్పు మొ
క్క విషయమున్ మొగంబును భగంబున గల్గిన దెద్ది? యన్న న
య్యువతి యెఱుంగదయ్యె; నత డుత్పలపద్యముఖాక్షరాళి నా
ల్గవదియు జేర్చినన్ భగము గాదె గణం?' బని పల్కె నవ్వుచున్.

ఉ.

ఆడగ బొంగరాలు గలవంచుచు బిల్చులు లోనికి బదా
ఱేడుల మేనయల్లు గొని యేగి, యటం జనుబొంగరా లెదం
గాడెడునట్లు మోపి, గసి కన్ మఱిదింప గదోయి" యంచునుం
గూడెను వానితోడ నొకగుబ్బిత నేర్పుల నెల్ల నేర్చుచున్.


ఉ.

ముప్పదియేండ్లు నాకు; బదుమూడవ యేడుది మాదుచెల్లి మే
మిప్పుడు బూటకూళ్ళ నుతికెక్కినవారము; దబ్బకాయయో,
చెప్పుడు, నిమ్మకాయొ, తమచిత్తము వచ్చిననుండు; రాత్రికిం
దప్పక రం" డనున్ నవవితంతు వొకర్తుక బాటసారులన్.


ఉ.

వంటల బాపనక్క కడు వంగుచు వడ్డన చేయ విస్తటం
జంటిమొనల్ పందె; బడిన “జాలును; మాడిన యూవడెంబులన్
రెంటిని రెండుప్రక్కల నరే! యిటు వేసితిరే." యటం చనెం
గొంటెతనంబుగాగ నొకకుఱ్ఱడు, ప్రక్కకు గన్ను గీటుచున్.


ఉ.

“ఱొమ్మున నాటి వీపునకురో సతిచన్నులు దూసెనో యనె౦
దిమ్మకవీంద్రు; డోమదవతీ, పరమాద్భుత మొప్ప నీ యురో
జమ్ములు ఱొమ్ముచుట్టునకు సాగుచు, వీపున నిట్టటున్ సమా
నమ్ముగ బ్రాకుచుం, జనుమొనల్ వెనుపూసను ఢీకొనంగదే.


ఉ.

తగ్గక క్రిందనుండి సరి తాకునుగా నెదురొత్తు లొత్తియున్,
బిగ్గ గవుగలించియు, నభీష్టము తీఱక మిండగాని దా
దిగ్గున ద్రోసి; పైకోని, రతిన్ సివ మెత్తిన బాలరండకున్
వి గ్గెడలంగ గుం డపుడు వెల్వడె నూరు ఫిరంగి గుం డటుల్.


(విగ్గు Wig) ఆడువేషము వేయునప్పుడు వేసికొను తలవెంట్రుకలతోడి టోపీ)


ఉ.

"పూర్వసువాసినీ, భగము పుష్కలరోమమయంబు నీకు; నా
శర్వుని లింగ మట్లుగ నెసంగెను నీదు శిరంబు; సంతకుం
బర్వున నేగి వాడి గల మంగలికత్తిని దెమ్ము; దానితో
సర్వము జక్కనౌ, నిచటి శష్మము లచ్చట బెట్టుటే కదా?"

కనుగవ యంట చెల్ల దలికంబున గన్ గల శంభుజెప్పుచో;
జనుగన యంట యా విధవ చావయెడన్ సరిపోవ; దామె ను
నన్ని శిరమే రతిన్ విటజనంబుల చేతుల నుండు జ న్నటుత్:
స్తనములజాగళ స్తనవిధంబున బొందిన వామె కందుచే.


ఉ.

ముట్టుతతోడ గూడి, యెలప్రొద్దున నింటికి సందుగొందులన్
గుట్టుగ బోవు నట్టి యనుగుంజెలికాని నొకండుగాంచి, 'పున్
జెట్టికి నైనటుల్ రుధిరసిక్తములైనవి నీదువస్త్రముల్;
గట్టిగ మారసంగరము కల్గినదా?' యని నవ్వె బిగ్గరన్.


చ.

వెలదిరొ, రంభ కన్న, విరివిల్తుని పొల్తుకకన్న వన్నెచి
న్నెలు గల యన్నుమిన్న వని నిన్ విషయింతు న టన్న, నీభగ
స్థల మెట పుచ్చియున్నదొగదా యని జంకుదు? నీ మొగమందునం
దొలసెడు నంత నున్నదన మున్నదె చెప్పుమ నీ భగంబునన్.


మ.

శివదీక్షాపరురాలు జంగ మది తా శ్రీవైష్ణవ స్వాముల
గవ గూడంగ దొడంగె వారలకు లింగా లుండుటం జేసి, వై
ష్ణవులున్ దాని స్తనద్వయంబు గనుచుం 'జక్రాంకితం బయ్యె; నిం
క వృధాశంక య దేల?' యంచు గలియంగా సాగి రక్కాంతతో.


ఉ.

అంగజకేళి గోరి యొకయన్యవధూమణి శయ్య జేర, జ
న్నుంగన బట్టుచుం; బెదవి నొక్కుచు మక్కువతో, విటుడు నీ
విం గడకోత్తి; రోమచయవిస్తృతయోనిని గాంచి నంతనే
మంగలిదావాని యంగనయె మంచి దటంచు దలంచె నాత్మలో.


ఉ.

జామిఫలంబు గోయ వెల యొకర్తుక జెట్టు నెక్కగా,
భూమి విటుండు నిల్వబడి, బోటిరో, జామిని రావియాకు నా
కీ మెయి గానిపించె, నన నింతియు గాబర కచ్చపోసి 'పో
నీ మొగ!' మంచు బల్కె దననెచ్చెలు లెల్ల బకాపకన్ నగన్.


ఉ.

కొండలు సంచలించె, నిదిగో! గగనంబు వడంకె నంచునున్
దండి నున్నయట్టి వృషణంబులవాడు రతంబునందు బై
నుండిన భామ చన్కవును లూగుచు నుండుట గాంచి పల్క, 'బ్ర
హ్మాండము లల్లాడు రతి యప్పుడు,' కనె నామె నవ్వుచున్.

ఉ.

చన్నులు లేని యట్టి వెలచానను మిండడు, “గుండె నీకు నా
కున్నటె యున్నదో నెలత! యోని కడన్ మఱియెట్టులున్నదో?”
యన్నను, “నీదుమూతి యటు లయ్యదిపూరగనుండె, నమ్ముమా
కన్నము కద్దు; మీసమును గ" ద్దని నవ్వెను వేశ్య ఫక్కునన్.


ఉ.

"పా కొకకొమ్ము పెట్టినను భామిని యయ్యది పూయగుంగదా?
పూకును దీర్ఘముం గలుప బోవగ నేనుగు?" నన్న జారుతో
"లోకులు వ్యర్ధమండ్రు రతిలో దెగబారెడు దీర్ఘమైన దే;
నీ కటువంటి దున్నదే? యనెన్ వెలజవ్వని బిగ్గ నవ్వుచున్.


ఉ.

ముద్దులసానిచెల్లి మొగముం గని నవ్వుచు మిండగాడు 'నీ
యుద్దము దెచ్చి చూపగదె' - యన్ని దదగ్రజ 'యద్ది కొద్దిగా
బ్రద్దలు వేసె నోప్రియ! భవన్ముఖమందు గొనంగ, నీ
కిద్దఱ మోము లున్న యటులే కన నౌ' నని నవ్వె గెవ్వునన్.


ఉ.

చందురు నీ మొగంబునకు సాటిగ బల్కెడి వారు దానిలో
గందును గాంచ లేదొ? గణికామణి నీదు భంగము సాటి సే
యం దగ్గు, నంచు జారు డన నచ్చెలి, యందలి సార మెల్ల నీ
కుం దెలియంగనౌ, నగు నగున్ విబుధుండ వనెన్ స్మితంబుతో.


ఉ.

'రాజుల జూచితిన్! రసికరాజుని జూచితి! గాని శెట్టిగా
రూ! జగ మందు విమ్ము నెవరున్ సరిపోలరు మీరలే బృహ
ద్బీజము పేరి బొండ్లమును బెట్టి భంగమునకున్ భయంబునం
బూజ యొనర్తు' రంచు వెలబోటి వచించెను వృద్ధవైశ్యుతో.


ఉ.

బచ్చొక డొక్క రోపడతి బ్రాపకున్ మును చేసి, ప్రేమతో
నిచ్చె నమూల మైన తనయెల్లధనంబు; బడంతి వానికింతి
బచ్చసెగం దగిల్చె, నలబచ్చు, “మొదల్ చెడి మొడ్డ చేతికిన్
వచ్చె న టందు నేడ్చు సెగ బాధకు గచ్చను జేయి దూర్చుచున్.

"నాయది నాకు; ముప్పదియు నాకుము; చెల్లిదియు నాకు”మన్న గ
న్దోయిని నెఱ్ఱచేసె వెలతొయ్యలిపై సరసుండు; “తల్లి ము
న్నీయిలు మాకు మువ్వురకు నిచ్చెను; నాదెయనంగ బోకు మో
నాయక! యంటి," నంచు వెలనాతి నిరుత్తరు జేసె నాతనిన్.


క.

“పనస తొననుండి తొలగిం
చిన దాననె చెలియ, నల్లచీమల నెల్లం?
"జనుదెంచు నేమొ మగుడగ
ననంటిపం డీవు పెట్ట నటవిటకాడా.”


చ.

తలక్రిందై తపమాచరించుచును గాంతారత్నమా, నాకడం
గల డత్యద్భుతరూపు; డాతని వివిక్తంబౌ స్థలిం బెట్టగా
వలయున్; నీకడనున్న కొండగుహ నీవా?”యంచు బుణ్యాంగనన్
దిలకించెన్ విటు; డామె “మౌని నడనెత్తిన్ నోరుదద్దా?యనెన్.

సరసచాటువులు - సంపూర్ణము.