శృంగారపంచకము/పూర్వకవుల చాటువులు

పూర్వకవుల

చాటువులు

ఉ.

చేతికివచ్చువస్తు వెడజేసితి, వాప్తులు శత్రులైరి, యే
రీతినినైన గార్య మొనరించెద నన్న నొనర్ప నీవు, నీ
చేతికి సాగి నంత పని జేసితి వింతియె కాని, యింక నా
యా తొక టైన బీక గలవా? గ్రహచారము! దుర్విచారమా?


ఉ.

కూటమి నొక్కనాటికి త్రికోణసహస్రములన్ బెకల్చు నీ
ధాటికి ముజ్జగంబులును దట్టకమబ్బులు మంచుకొండలున్
సాటికి నిల్వగా గలవె, చాలు శ్రమంపుమి జృంభణంబు, నీ
వేటికి లేవ బూనితివి? యీ నడిజామున నో ప్రజాపతీ!


క.

ఆ కాంతామణి యుపరతి
కాకాశము వణకె దార లల్లల నాడెన్
జోశైదగిరులు కదలెను
భీకరముగ దమము చంద్రబింబం బంటెన్.


క.

సుదతీ! నీ కుచగిరు లిటు
కదశి వడిన్ గూలినట్టి కారణ మేమే
చెదరి గిరు లైన గూలవె
కదసి వడిన్ క్రింద ద్రవ్వగా! చెలువుండా!


క.

పట్టితి రెండుకుచంబులు
పెట్టితి మఱి తొడలసందు పెటపెట లాడన్
వట్టలు గంతులు వేయగ
గట్టిగ గొట్టితిని జుల్లి కందగ మిగులన్.

ఊరులు బట్టి రా దిగిచి యున్నతమైన కుచద్వయ౦బుపై
చీరె తొలంగ దీసి సతి జేకొని బిగ్గన గౌగిలించి తా
గోరినకోర్కె దీర్చుకొని, కోమలి పొందక యున్న యట్టి యీ
సౌకును దెల్పుడీ సురతసౌఖ్యము చెందిన జాణ లందఱున్.

6


ఆ కనకాంగి వంగికొని హంసలరీతిని ము గ్గొనర్పగా
వాకిట నున్న యొక్కవిటవర్యుడు గాంచి తదీయయోనిపై
కోక దొలంగదీసి సతి గూడి హుటాహుటి దెంగుచుండగా
తాకె ఫిరంగిగుండు వలె దుడ్డు లతాంగికి బొడ్డుక్రిందికిన్.

7


ఉ.

అంగన లెంద ఱైనగల ఱందఱు పూకులు గల్గువారె నీ
కుంగల నైనగాని సరిగూడిన జాణలు లే రటంచు నిన్
దెంగిననాకు దెల్పి రది తెల్లము శిశ్నము గల్గినందుకున్
దెంగిన నిన్ను దెంగవలెఁ తెం పలరంగను నీలవేణిరో.


తే.

పిన్నవయసుది పై నెక్కి పెదవి నెక్కి
యల్లతావున చెయివేసి మెల్ల దీసి
మదనమందిరమునను దా నదుముకొనియు
వత్తివలె నున్న ముదిమికి మొత్తుకొనియె.


కోరిక లుప్పతిల్ల మది గోరిన యట్టి కళావిశేషముల్
చారుతరంబులన్ రతులు సల్పగ నేర్చిన యట్టిజాణ యీ
వారవధూశిరోమణిని వంతులు వేసుక దెబ్బతీయుడీ
మీరును మీరు మీరె మఱి మీరును మీరును మీరలందఱున్.


తే.

పన్నగం బాడ నక్షత్ర పంక్తి వీడ
గగన మల్లాడ కులగిరు ల్గలసి యాడ
చంద్రమండలమున జలస్రావ మొదవ
నుపరతి యొనర్చె నప్పు డయ్యుత్పలాక్షి.

మాపును రేవు దీని కొకమైథున మెక్కడ దెత్తు దీని యు
ద్ధాపనశక్తి మానదు ప్రతాపము సళ్ళదు ముండమోపులన్
జూపుచుటన్న మాపిటికి జూపెదనన్నను యోర్చి నిల్వ దీ
పాపపు మేఢ్రదండ మొకపట్టున శాంతిని బొంద దీశ్వరా!


క.

ఇంగిత మెఱుగని తొత్తును
దెంగిన నపకీర్తి వచ్చు దేహము నొచ్చున్
పింగుకు పడశము పటును
గంగాధర దానిపూకు గాడ్దెలు దెంగా!


ఉ.

జంగమురాలి బట్టి నొకజంగము వంగగ బెట్టి యోనిలో
లింగము బెట్టి క్రుక్కి యదలించుచు నొక్కక తాకు తాకన్
లింగ నమశ్శివాయ గురులింగ మహేశ్వర జంగమయ్య యో
యంగజభంగ సాంబ గురుడా యను దాకిన తాకుతాకుకున్.


నీతి యొకింతలేక ధరణీస్థలి నెవ్వడు ద్రోహి లేడనే
హేతువు మాని నమ్మి చెడి హీనత నొందిన నాకు నేనె యీ
చేతన ము౦డగా నిపుడె సిగ్గున గుద్దయు నోరు మూయ నీ
చేతులు రెండునాకు దయ చేసిన దేవుని సన్నుతించెదన్.


ఉ.

కాగల కార్యముం జెరుపగా యవనీశులు కొంద ఱెన్నియో
వాగి యబద్దము ల్పలికి భంగమొనర్ప దలంచుచుందు రా
బాగును మాన్పజాలరు స్వభావము వెల్లడి యౌటెగాని సం
భోగపువేళ నడ్డుపడు సోమరిశష్పము లడ్డు పోలికన్.


శృంగారపంచకము – సంపూర్ణము