శశికళ/స్మృతులు
< శశికళ
స్మృతులు
ఏనాటివో స్మృతులు
ఈనాడు నాగతులు
ప్రాణాధికను దేవి
ప్రత్యక్షమిడు శ్రుతులు.....ఏనా
లిఖియించు చిత్రాన
లేమ ! వర్ణాలలమి
రేకలను కూర్పుమను
సొకు లెట్టుల మరతు .......ఏనా
నా పాటలో తాను
నన తేనియల గొంతు
కలిసి పాడే తీరు
కలనైన మరతునా ? ......ఏనా
వెన్నెలే తానౌట
కన్ను మరిగిన తున్ను
వెదకలే నన్న నను
ఒదిగించు టెరుగనా ......ఏనా
ఇది నా కమవాస్య
ఈ కటికి చీకట్ల
ఎంత బాధను మనుట
ఏనాటి స్మృతులనుట......ఏనా.