శశికళ/పువ్వటే
< శశికళ
పువ్వటే
పువ్వటే నీసొగసు
వేలుపుల
బువ్వటే నీనవ్వు
ఈ వెలుగు లేమంట
ఏను తడబడుటలే !
ఎటు చూచినా వెలుగు
ఎదురుకొన్నది నన్ను
కలవళము పడుతూనె
కనులు మూసితి నేను
పువ్వటే నీసొగసు
వేలుపల
బువ్వటే నీ నవ్వు
కనులు మూసితె నేమి
కాంతులావుట ఎట్లు
నాలోన నాపైన
నానార్థముల కాంతి
పువ్వటే నీ సొగసు
వేలుపుల
బువ్వటే నీ నవ్వు. !