నువ్వటే


 
నువ్వటే నువ్వటే
పువ్వు విరిసిన వయసు
నవ్వు లలమిన సొగసు

           రువ్వినా ఎదపైన
           చివ్వు నంతర్హితవే
                     నువ్వటే నువ్వటే !

నువ్వటే నువ్వటే
కవ్వించి నాకాంక్ష
త్రవ్వించి నా కలలు

           ఉవ్విళ్లుగొన మనసు
           దవ్వైతి వే దెసల
                    నువ్వటే నువ్వటే !

         నువ్వటే నువ్వటే
         జవ్వనీ ప్రణయినీ
         మువ్వంపు వగలాడి

అవ్వారు ముద్దియా
నవ్వుతూ నను వదలి

           రివ్వు రివ్వున మిన్ను
           పవ్వళింపైతివే
                      నువ్వటే నువ్వటే !