ఇంద్రజాలిక

చూపులోనే ఇంద్రజాలము చూపుటేలా మాయలాడీ !
రూపమెరుగని మంత్రలోకము ప్రాపణమ్మయె ధూర్తురాలా !

నేల బరువులు దాటిపోతిని నీల గగనము తేలిపోతిని
కాలమావల గడచిపోతిని వేలలన్నీ మీరిపోతిని

           మూలమే ఆ భాసితమ్మగు లీలలోనే చేరిపోతిని

                      చాలునే నీ ఇంద్రజాలము
                      చాలునిక నా అవధి మించిన
                      సాద్భు తానందమ్ము దేవీ !

                      నెమలి పింఛెము తిప్పవేమే
                      నేలపైనా కాలు నిలుపుము

                              వాలనీయవె చూపులను
                              ఈ లోక సామాన్యాలపైనన్.