శశికళ/అటు ఇటు
< శశికళ
అటు ఇటు
ఈపక్క ఓనవ్వు ఆపక్క ఓనవ్వు
నవ్వు సుమమాలలో నేనూ
నవ్వు పరిమళమూర్తి నువ్వూ !
ఈవైపునోచూపు ఆవైపునోచూపు
చూపు చూపుల నడుమ నేనూ
చూపులో సౌందర్య మీవూ !
ఈ సాయనో పాట ఆ సాయనో పాట
పాట ఫణతుల నడక నేనూ
పాటలో మధురత్వ మీవూ !
ఈదరిని నా ఎడద ఆదరిని నీ ఎడద
ఎడద ఎడదల కోర్కె నేనూ
ఎడద పడదల ప్రేమ నీవూ !