వృక్షశాస్త్రము/రేవల్చిన్ని కుటుంబము

358

మునందు పెరుగుటచే గాజుచేయుటకు బనికి వచ్చు పదార్థము దీని యందు మెండుగా కలుగుచున్నచి.


రేవల్చిన్ని కుటుంబము.


ఈ కుటుంబమున గుల్మములు మాత్రముగలవు. ఆకులు సాధారణముగ ఒంటరి చేరికగా నుండును. కణుపు పుచ్చములున్నవి. అవి కొమ్మల నంటి పెట్టుకొని యుండును. ఉప వృంతమునకును పుష్పమునకును మధ్య సతుకు గలదు. పువ్వులు మిధునములే కాని కొన్నిటిలో ఏక లింగ పుష్పములును పుట్టు చున్నవి. పుష్పనిచోళమునందు మూడు మొదలు ఆరు వరకు దళములున్నవి. అవి విడివిడిగానైనను గలసియైనను నుండును. కింజల్కములు వీని కెదురుగా నుండుట చే ఇవి రక్షక పత్రములని యూహించ వచ్చును. ఇవి రాలి పోకుండ స్థిరముగ నుండును. కింజల్కములు అయిదు మొదలేనిమిది వరకు గలవు. అండాశయములో గదులు మూడు లోపు గింజలు నాలుగు లోపుగ నుండును. కాయ ఎండును గాని పగలదు.

రేవల్చిన్ని మొక్క హిమాలయా పర్వతముల ప్రాంతముల పదునొకొండువేల అడుగుల ఎత్తుమీద పెరుగుచున్నది. ఈ మొక్క వేరును, మూలవహమును కోసి పై చర్మ


బొమ్మ
రేవల్చిన్ని : 369

ము వలచివైచి ఎండబెట్టి అంగళ్ళయందు అమ్ముచున్నారు. దీనినే రేవల్చిన్ని యందుము. దీనిని ఔషదములలో వాడుదురు. రేవల్చిన్ని మనకు చీనా, టిబెట్టు, దేశముల నుండియు లండను పట్టణము నుండియు కూడ వచ్చు చున్నది. మన దేపు పదార్థము కంటె బొరుగూరి పదార్థము మంచిదను చున్నారు. అట్లే యైనను మన మొక్కలను శ్రద్ధతో బెంచు నెడల అన్య దేశపు పదార్థమున కంటే తక్కువ రకముగాదని యూహించుటకవకాశమున్నది.


మిరియపు కుటుంబము.


మిరియపుతీగె మలబారు దేఅమునందెక్కువగా పైరగు చున్నది. ఇది అగంతుక వేరుల మూలమున ప్రాకును.

ఆకులు
- ఒంటరి చేరిక తీగెకు రెండు వైపులనే యుండును. హృదయాకారము, కొంచెము వంకరగా నుండును. అయిదారు ఈనెలుండును. కొనవాలముగలదు. రెండు వైపుల నున్నగ నుండును.
పుష్పమంజరి
- కంకి, ఏకలింగపుష్పములు; కొన్ని అడకంకులో కొన్ని పుష్పములును గలవు ఆడుతీగెలు పోతుతీగెలు వేరువేరుగా కూడ కలవు.
పుష్ప కోశము
- లేదు
దళ వలయము
- లేదు