వృక్షశాస్త్రము/బచ్చలి కుటుంబము

356

కేమిదగిలిన వాని నన్నిటి నంటుకొని, కంకినుండి విడుచుటకు వీలుగ నున్నది. అవి ఏ గొర్రెనో, ఏ బట్టనో అంటుకొని ఎక్కడ నైనను రాలినయెడల నచ్చట మొలచును. ఇదియే వాని కావలసినది. ఇట్లేఅవి సాధరణముగ వ్యాపకము చెందు చున్నవి.

ఉత్త రేణి వేళ్ళ్తతో దంత ధావనము చేయుట మంచిదందురు.

పొగడ బంతిమొక్కలిసుక నేలలో మెలచును. ఆకులకు తొడిమలేదు. కొన్ని పువ్వుల గుత్తులు ఎర్రగాను, కొన్ని తెల్లగాను వుండును.


బచ్చలి కుటుంబము.


ఈ కుటుంబములో బెద్ద చెట్లు లేవు. ఆకులు లఘుపత్రములు. ఒంటరి చేరిక, వీనికి గణుపు పుచ్చములుండవు. కొన్నిటి పువ్వులు మిధున పుష్పములు. కొన్నిటిలో ఏక లింగ పుష్పములే గలవు. పుష్పకోశము నీచము, మూడు మొదలైదు వరకు తమ్మెలుండును. లేద, రక్షక పత్రములు విడివిడిగానే వుండును. ఇవి మొగ్గలలో అల్లుకొనియుండును. ఆకర్షణ పత్రములు లేవు. కింజల్కములు రక్షక పత్రముల కెదురుగా నుండును. అండాశయము ఉచ్చము. ఒక గది అండ 357

ము ఒకటి ఫలముపేటికాఫలము; సాధారణముగ పుష్ప కోశములోనె మరుగు పడియుండును.

బచ్చల కాడలో నాలౌగైదు రకములు గలవు. వీనిలో ముఖ్యమైనది పెద్ద బచ్చలి. దీనిని తీగె ముక్కలు నాటియే పెంచ వచ్చును. ఆకులు కాడలు కండ కలిగి యుండును.

ఎర్ర బచ్చలి, మట్టు బచ్చలి అంతగా వాడుటలేదు. వీనిని గింజలను పాతి మొలపింతురు. పాదులు పెట్టకనే డొంకల వద్ద మలచు బచ్చలి కాడ ఇంత కంటే సన్నముగానుండును. తినుటకును అంత బాగుండదు.

ఈలకూర కొమ్మమీద ఆకులు దూర దూరముగ నుండును. వీనిని కూర వండుకొని తిందురు. 1871 - 72 వ సంవత్సరములలో క్షామము పట్టినపుడు ధనికులు కూడనీయాకులను దినిరట. ఈ మొక్కలు పెరుగుటకు వర్షము లేకున్నను అంత ఇబ్బందిలేదు. ఈఆకులరసమును పండ్ల జబ్బులకు మంచి దందురు.

రవకాడ సముద్ర తీరముల ఇసుకనేలలో పెరుగును. దీనికొమ్మలు నేలపై బడి వేళ్ళువేయును. ఇది సముద్ర తీర 358

మునందు పెరుగుటచే గాజుచేయుటకు బనికి వచ్చు పదార్థము దీని యందు మెండుగా కలుగుచున్నచి.


రేవల్చిన్ని కుటుంబము.


ఈ కుటుంబమున గుల్మములు మాత్రముగలవు. ఆకులు సాధారణముగ ఒంటరి చేరికగా నుండును. కణుపు పుచ్చములున్నవి. అవి కొమ్మల నంటి పెట్టుకొని యుండును. ఉప వృంతమునకును పుష్పమునకును మధ్య సతుకు గలదు. పువ్వులు మిధునములే కాని కొన్నిటిలో ఏక లింగ పుష్పములును పుట్టు చున్నవి. పుష్పనిచోళమునందు మూడు మొదలు ఆరు వరకు దళములున్నవి. అవి విడివిడిగానైనను గలసియైనను నుండును. కింజల్కములు వీని కెదురుగా నుండుట చే ఇవి రక్షక పత్రములని యూహించ వచ్చును. ఇవి రాలి పోకుండ స్థిరముగ నుండును. కింజల్కములు అయిదు మొదలేనిమిది వరకు గలవు. అండాశయములో గదులు మూడు లోపు గింజలు నాలుగు లోపుగ నుండును. కాయ ఎండును గాని పగలదు.

రేవల్చిన్ని మొక్క హిమాలయా పర్వతముల ప్రాంతముల పదునొకొండువేల అడుగుల ఎత్తుమీద పెరుగుచున్నది. ఈ మొక్క వేరును, మూలవహమును కోసి పై చర్మ