వృక్షశాస్త్రము/మిరియపు కుటుంబము

369 ము వలచివైచి ఎండబెట్టి అంగళ్ళయందు అమ్ముచున్నారు. దీనినే రేవల్చిన్ని యందుము. దీనిని ఔషదములలో వాడుదురు. రేవల్చిన్ని మనకు చీనా, టిబెట్టు, దేశముల నుండియు లండను పట్టణము నుండియు కూడ వచ్చు చున్నది. మన దేపు పదార్థము కంటె బొరుగూరి పదార్థము మంచిదను చున్నారు. అట్లే యైనను మన మొక్కలను శ్రద్ధతో బెంచు నెడల అన్య దేశపు పదార్థమున కంటే తక్కువ రకముగాదని యూహించుటకవకాశమున్నది.


మిరియపు కుటుంబము.


మిరియపుతీగె మలబారు దేఅమునందెక్కువగా పైరగు చున్నది. ఇది అగంతుక వేరుల మూలమున ప్రాకును.

ఆకులు
- ఒంటరి చేరిక తీగెకు రెండు వైపులనే యుండును. హృదయాకారము, కొంచెము వంకరగా నుండును. అయిదారు ఈనెలుండును. కొనవాలముగలదు. రెండు వైపుల నున్నగ నుండును.
పుష్పమంజరి
- కంకి, ఏకలింగపుష్పములు; కొన్ని అడకంకులో కొన్ని పుష్పములును గలవు ఆడుతీగెలు పోతుతీగెలు వేరువేరుగా కూడ కలవు.
పుష్ప కోశము
- లేదు
దళ వలయము
- లేదు

361

మిరియపు మొక్క


కంకిపై కొన్ని పొలుసులువంటి చేటికలు మాత్రమున్నవి. వాని మధ్యనే మిగిలిన పుష్పభాగములుండును. స్త్రీపుష్పము వద్దనున్న కమటిచేలన్నియు గలసి గిన్నె వలె ఏర్పడియున్నవి.

మగ కంకి కింజల్కములు
- మూడు కాడలు పొట్టిగను లావుగను నున్నవి.
అండ కోశము
- కొన్ని టి యందు గొడ్డై యుండినట్లు కనబడును. మరి కొన్నిటి యందు నదియులేదు. 362
ఆడుకంకి కింజల్కములు
- కొన్ని పుష్పములందు మాత్రము రెండు కింజల్కములున్నవి. కొన్నిటి యందు పుప్పొడి తిత్తులు లేక గొడ్డులైనవి యున్నవి. కీలము లేదు. కీలాగ్రములు మూడు. కండ కాయ.

ఈ కుటుంబమునందు గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరికగానైనను, అభిముఖ చేరికగానైనను, కిరణ ప్రసరముగ నైననుండును. కొన్నిటికి గణుపు పుచ్చములు గలవు. సమాంచలము పుష్పములు చిన్నవి. మిధున పుష్పములు ఏక లింగ పుష్పములును గలవు. పుష్ప కోశము గాని దళవలయము గాని లేదు. కింజల్కములు రెండు మొదలు ఆరు వరకు నుండును. మూడు గాన్, అంతకు ఎక్కువగాని స్త్రీ పత్రములుండును. కొన్నిటిలో నవి కలసి యున్నవి. కొన్నిటిలో విడివిడిగానఏ యున్నవి.

మిరియములు మలబారు దేశమునందే ఎక్కువగా పండు చున్నవి. కొమ్మలను నాటియే పైరు చేయుదురు. తీగెలు ప్రాకుటకు గురుకుగానుండు బెరడు గల చెట్లను పాతుట మంచిది. తరుచుగా పనస చెట్లను పాతి వానిపై తీగెలు ప్రాకింతురు. ఈ తీగెలకు నీరు విస్థారమక్కర లేదు. మూడేండ్లకు కాయలు కాయ నారంబించును. ఏడేండ్లవరకు బాగుగ కాయును. తరువాత క్రమక్రమముగా తగ్గి పోవును. కా 363

రంభించును గాన నాదీగెలను దీసివేసి క్రొత్త వానిని బ్రాకించెదరు. గెలలోని పై కాయలు రంగు మారుట నారంభింపగనే కాయలను కోసి వేసి ఎండలో బెట్టుదురు. మిరియములలోను రెండు మూడు రకములున్నవి. కొన్ని పెద్దవి. కొన్ని చిన్నవి. కొన్ని ఎక్కువనొక్కులు నొక్కులుగానుండును.

కొందరు మెరపకాయలకు బదులుగా మిరియములనే వాడుకొందురు. మిరియములు చాల లనుపానములలో ఉపయోగించు చున్నారు. మిరియపు పొడియు వంటికి మంచిది. చిర కాలమునుండి మన దేశ్మునుండి మిరియములు చాల ఎగుమతి అగు చున్నవి.

తామలపాకులు చిరకాలమునుండి మనదేశములో పలు భాగములందు పైరు చేయుచున్నారు. తమలపాకుల లోను మూడు నాల్గు రకములు న్నవి. ఒరిస్సా ప్రాంతముల పొగాకుతో వేసికొను తాంబూలములకు ప్రత్యేకముగ నొక విధమగు ఆకు గలదు. అది జీడి గింజ ఆకారముగ నుండును. మిక్కిలి దట్టముగను, ముదురుగు రంగుగను కారముగను నుండును. రెండేండ్ల తీగల ముక్కలను రెండు మూరలో ఎంతో గోసి రెండుమూడు కణుపుల భూమిలో పాతి, మిగిలినతీగ పై 364

ఈతాకులనైనను దేనినైనను గప్పి నీరు బోయుదురు. ఈ తీగెల నతి శ్రద్ధతో జూచు చుండ వలయును. ఇవి ప్రాకుటకు గొన్ని చోట్ల అవిశ ములగ చెట్లను పెంచెదరు. కొన్ని చోట్ల పోక చెట్టుల మీదనే ప్రాకనిచ్చెదరు. తామలపాకుల రసము ఔషదములలో కూడ వాడుదురు. తామలపాకుల పంట వలన ఎకరమునకు రెండు సంవత్సరములలో రూపాయలు 300 మొదలు 560 వరకు రావచ్చును.

పిప్పిలి తీగెలు మనదేశములో పలు భాగములందు పెరుగును. వీని ఆకులు పెద్దవ్. పుష్పములలో స్త్రీ, పురుష భేదము గలదు. ఇవి పెరుగుటకు సార వంతమైనవియు, ఎత్తుగా నున్నట్టియు, మెరక నేలలుగావలయును. వీనికి భూమిలో కొంత దూరము ప్రాకి అచ్చట బైకి వచ్చు కొమ్మలు గలవు. వీనిని దీసి పాది పైరు చేయుదురు. వేరులను ఎండబెట్టిన కాయలను ఔషధములలో వాడుదురు.

చలవమిరియముల తీగెను మనదేశమున కన్య దేశములనుండి తెచ్చిరి. దానినక్కడక్కడ పెంచుచున్నారు. చలవమిరియములను తాంబూలమునందును ఔషధములందును వాడుదురు.