వృక్షశాస్త్రము/రేగు కుటుంబము
పెద్ద చింటు:- చిన్న చెట్టు. దీనికిని ముండ్లు గలవు. ముండ్లు మీద ఆకులు పువ్వులు గలవు. కావున నవి కొమ్మలు మారుట చే నేర్పడినవి భావింప వలసి యున్నది. దీని పువ్వులు తెల్లగా నుండును.
నీరజ:- చిన్న చెట్లు ముండ్లు లేవు. ఆకులు అభిముఖ చేరిక. పువ్వులు చిన్నవి. పనుపు గలిసిన ఆకు పచ్చ రంగుగా నుండును.
రేగు కుటుంబము.
రేగు కుటుబపు మొక్కలు ప్రపంచము నందంటను గలవు. ఈ కుటుంబములో బెద్ద చెట్లును గురుబురు మొక్కలును నున్నవి. చాల వానికి ముండ్లు గలవు. ఈ ముండ్లు కణుపు పుచ్ఛములు మారుటచే గలిగినవి. కొన్ని మొక్కలీ ముళ్ళ సాయమున బెద్ద చెట్ల పై నెగ బ్రాకును. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొచము దట్టmuగను biరుసుగను నుండును. పువ్వులు చిన్నవి. కణుపు సందుల నుండి మధ్యారంభ మంజరులుగ బుట్టు చున్నవి. అయిదు రక్షక పత్రములును అయిదు కింజల్కములు గలవు. ఈకింజల్కములు ఆకర్షణ పత్రముల కెదురుగా నుండును. కింజల్కముల మధ్య బళ్ళెరము గలదు. సాధారణముగ నండాశయము నందు మూడు గదులుండును. కొన్నిటి కాయలు ఎండు కాయలు, కొన్ని కండ కాయలు.
రేగుచెట్టు:- మన దేశము నందంతటను బెరుగు చున్నది. దీని యాకులకు మూడు పెద్ద ఈనెలు గలవు. అండాశయమున రెండు గదులు మాత్రమున్నవి. ఈ చెట్లలో రెండు మూడు రకములు గలవు. కొన్నిటి పండ్లు పెద్దవిగను, కొన్నిటివి చిన్నవిగను కొన్నింటివి కోలగను నుండును. కోలగ నున్నవే ఎక్కువ రుచిగా నుండు నందురు. ఈ చెట్టు బెరుడును చర్మములు బాగు చేయుటలోను నీలి మందు చేయుటలోను వాడుదురు. పండ్లును ఔషధములలో నుపయోగింతురు. పెద్ద చెట్ల కలపయు బెట్టెలు మొదలగు పని చేయుటకు బాగుండును.
రక్తవల్లి:- (సురలతీగె) చెట్లపై నెగ బ్రాకెడు పెద్ద తీగె. ఆకులు తీగెకు రెండు వైపులనే యుండును. అంచున రంపపు పండ్లు గలవు. పువ్వులు చిన్నవి. ఘాటుగ వాసన గలదు. దీని వేరు బెరడు ఔషధములలో వాడుదురు. కొన్ని జ్వరములకు చర్మ వ్యాధులకు, నీరసమునకు బని చేయును. పారకి:- పెద్ద తీగె. ఆకులపై నెత్తుగ మెత్తని రోమములు గలవు. పువ్వులకు తొడిమలు లేవు. కాయ నల్లగ నుండును. దీనిని తినవచ్చును.
గోటి:- చిన్న చెట్టు. ఆకులు కొంచము గుండ్రముగ నుండును. అంచున సన్నవి రంపపు పండ్లు గలవు. వానిపై మెత్తని రోమములు గలవు. దీని కలప నారింజ రంగుగను గట్టిగా నుండును.
ద్రాక్ష కుటుంబము
ఇది యొక చిన్నకుటుంబము. ఇందులోని మొక్కలు చాల భాగము నులి తీగెలమూలమున బ్రాకునవియె. ఈ నులితీగె లాకుల కెదురుగనున్నవి. ఇవి ప్రకాండము యొక్క మారు రూపములు గాని యాకుల యొక్క మారు రూపములు గావు. ప్రకాండము పలకలుగా నుండును. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. వృంతము మీదను కొన్నిటిలో నులి తీగెలు గలవు. అది పూర్తిగ నట్లు మారుటయు గలదు. పుష్పములు మిధునములే కాని, కొన్నిటిలో మాత్ర మేక లింగ పుష్పములున్నవి. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో యున్నవి. అవి మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును. కింజల్కములు ఆకర్షణ పత్రము లెన్ని గలవో, అన్నియే యున్న వి. ఇవి వాని కెదురుగా నుండును. వీని మధ్య నొక పళ్ళెరము కూడ గలదు. అండాశయము నందు గదులు ఆరు వరకు గలుగు చుండును. కొన్నిటిలో కీలము పొట్టిగా నున్నది. కొన్నిటిలో నది లేదు. ఫలము కండకాయ.
ద్రాక్షతీగెలు:- విరివిగా శీతల దేశములలో బెరుగును. వానికి తేమగాలి కూడదు. చెన్న రాజ్యమునందు వాని పంట మిక్కిలి తక్కువ. మన దేశము యొక్క యితర భాగములలో నచ్చటచ్చట బెంచు చున్నారు. ద్రాక్షపండ్లలో చాల రకములు గలవు. తీగెలను విత్తుల మూలమున గాక, కొమ్మలను గోసి, వానిని పాతియే పైరు చేసెదరు. ఒక యడుగు పొడుగుగా నున కొమ్మ మీద సుమారు నాలుగైదు మొగ్గలుండ వచ్చును. కొమ్మలను అడ్డముగా బాతిన తరువాత అమొగ్గలే మొక్కలుగా వచ్చును. అవి సుమారు తొమ్మిది అంగుళములు ఎత్తుగా నున్నప్పుడు వానిని దీసి, జనుముతో దమ్ముచేసి, ఎరువు వేసిన తోటలలో బాతుదురు. వానికి నాలుగైదు దినముల కొక మారు నీళ్ళు పోయుదురు. ఎదిగెడుతీగెలు ప్రాకుటకు దగ్గరనేమైన పాతవలెను. తరుచుగా బాడిద కొ