వృక్షశాస్త్రము/మాల్కుంగుని కుటుంబము

మాల్కుంగుని కుటుంబము

ఈ చిన్న కుటుంబములో చెట్లు గుబురు మొక్కలు గలవు. ఆకులు ఒంటరి చేరికగా నైనను, అభిముఖ చేరిక గానైన నుండును. అవి మర్రి ఆకుల వలె బిరుసుగా నున్నవి. పువ్వులలో మిధున పుష్పములు, ఏక లింగ పుష్పములు కూడ గలగు చున్నవి. పుస్ప కోశము చిన్నది. నాలుగైదు తమ్మెలు అల్లుకొని యుండును. కాయ నంటు కొని పుష్పకోశము స్థిరముగా నుండును. ఆకర్ణ పత్రములు నాలుగో అయిదో యుండును. కొన్నిటిలో లేక పోవుటయు గలదు. ఇవియు నల్లు కొనియే యుండును: కొన్నిటిలో బళ్ళెరము నంటియున్నవి. కింజల్కములు 3 మొ. 5 . కాడలు వెడల్పుగా నుండును. అండాశయములో గదులు 3. మె. 5 వరకు గలవు. ఒక్కొక్క దానిలో రెండేసి అండము లుండును. కీలము పొట్టిగా నుండును. గొన్నిటిలో లేనే లేదు. కీలాగ్రము త్రిభుజాకారము.

మాల్కంగుని:- మొక్క దేనినైన ఆనుకొని పొదవలే బెరుగును. ఆకులు అండాకారము. పువ్వులు చిన్నవి. పచ్చగా నుండును. దీని గింజలనుండి తీసిన చమురును ఔషదములలో ఉపయోగించుదురు. ఉబ్బు జబ్బులకది గుణమి
మాల్కాంగుని. (పుష్పములు, ఫలములు)

చ్చును. మరియు గింజలలోను, నూనెలోను కూడ జ్ఞాపక శక్తి నెక్కువ చేసెడు గుణము గలదు.

చిన్న చింటు: పొదవలె బెరుగును. గట్టి ముండ్లు గలవు. పువ్వులు లేత పసుపు రంగు ఇదికంచలుగాను, ఎండిన పిదప బోయిలోనికి దప్ప, మరెందులకును బనికి రాదు. పెద్ద చింటు:- చిన్న చెట్టు. దీనికిని ముండ్లు గలవు. ముండ్లు మీద ఆకులు పువ్వులు గలవు. కావున నవి కొమ్మలు మారుట చే నేర్పడినవి భావింప వలసి యున్నది. దీని పువ్వులు తెల్లగా నుండును.

నీరజ:- చిన్న చెట్లు ముండ్లు లేవు. ఆకులు అభిముఖ చేరిక. పువ్వులు చిన్నవి. పనుపు గలిసిన ఆకు పచ్చ రంగుగా నుండును.


రేగు కుటుంబము.


రేగు కుటుబపు మొక్కలు ప్రపంచము నందంటను గలవు. ఈ కుటుంబములో బెద్ద చెట్లును గురుబురు మొక్కలును నున్నవి. చాల వానికి ముండ్లు గలవు. ఈ ముండ్లు కణుపు పుచ్ఛములు మారుటచే గలిగినవి. కొన్ని మొక్కలీ ముళ్ళ సాయమున బెద్ద చెట్ల పై నెగ బ్రాకును. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొచము దట్టmuగను biరుసుగను నుండును. పువ్వులు చిన్నవి. కణుపు సందుల నుండి మధ్యారంభ మంజరులుగ బుట్టు చున్నవి. అయిదు రక్షక పత్రములును అయిదు కింజల్కములు గలవు. ఈకింజల్కములు ఆకర్షణ పత్రముల కెదురుగా నుండును. కింజల్కముల మధ్య