వాసిష్ఠరామాయణము/ద్వితీయాశ్వాసము
వాసిష్ఠరామాయణము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీమదహోబలపట్టణ | 1 |
ఉత్పత్తిప్రకరణము
వ. | దేవా సకలతత్త్వార్థవివేకి యగు వాల్మీకి భరద్వాజున కి ట్లనియె. | 2 |
సీ. | పరఁగ నుత్పత్తిప్రకరణం బెఱింగింతు; | |
గీ. | పిదప విస్పష్ట మొనరింతు నదియుఁ దెలియ | |
| దనరు నపరోక్షచైతన్య మనఁగ నివియు | 3 |
వ. | సంవిత్స్వరూపం బగు జీవుండు పదార్థజ్ఞానోదయంబున నహంకార | 4 |
గీ. | కానఁబడుచున్నయట్టిజగంబు లెల్ల | 5 |
సీ. | తత్కాలమున మహాతమము తేజంబును | |
గీ. | నన్యుఁడును బోలె జీవాత్ముఁ డై వెలుంగు; | 6 |
వ. | ఆ సంకల్పంబున నింద్రజాలంబునంబోలె జగత్తు జనియించు. అంబుధి | |
| వలనం దరంగంబులును గాంచనంబువలనం గటకమకుటాది భూషణం | 7 |
ఆకశజోపాఖ్యానము
క. | విను రాఘవ యాకాశజుఁ | 8 |
గీ. | అతని తేజంబు దుస్సహమై వెలుంగ, | 9 |
గీ. | కాలపాశంబు గయికొని క్రమముతోడ | 10 |
వ. | అని వితర్కించి. | 11 |
క. | ఆవిప్రుదివ్యతేజము | 12 |
వ. | ఇట్లు చనుదెంచి సమవర్తిం గనుంగొని మృత్యువు కృతాంజలి యై యిట్లనియె. | 13 |
శా. | దేవా దేవరయాజ్ఞ మోచుకొని ధాత్రిం బొల్చు భూతావళిన్ | |
| దైవానీకము నేచి మ్రింగుదు; నసాధ్యం బెద్దియున్ లేదు నా; | 14 |
చ. | అన విని కాలుఁ డిట్లనియె; నక్కట మృత్యువ కేవలంబు స | 15 |
వ. | అదియునుం గాక. | 16 |
క. | ఏకర్మంబును బొరయక | 17 |
వ. | అని సమవర్తి మృత్యువునకుం జెప్పె ననిన విని సాశ్చర్యహృద | 18 |
గీ. | మునివరేణ్య మీరు మున్ను సెప్పినపుణ్యుఁ | 19 |
వ. | అనిన వసిష్ఠు డిట్లనియె. మృత్యువునకు వివాదం బొనరించు నతండు | 20 |
గీ. | అతఁడు చిన్మాత్రరూపుఁ డనాదివంద్యుఁ | |
| దేహిక్రియఁ దోఁచుఁ; బరమాత్మ దేహి గాఁడు. | 21 |
వ. | అన విని రామచంద్రుం డఖలభూతంబులకు నాధ్యాత్మికంబును నాది | 22 |
గీ. | భూతజాలంబు కారణోద్భూత మగుట | 23 |
వ. | అట్లు గావున నద్దేవుండు సంకల్పపురుషుండును చిన్మాత్రస్వరూపుం | 24 |
గీ. | పొరి మనోరూపమును స్వయంభువును నగుచు | 25 |
వ. | అనిన విని రామచంద్రుం ‘డమ్మనోరూపం బెట్టిది? యమ్మనంబుచేత | 26 |
క. | విను మాత్మునిసంకల్పమె | 27 |
వ. | అట్లు గావున మనస్సంకల్పంబులకు నెన్నఁడును దేనిచేతను భేదంబు | |
| వీని చేత జగంబులు విస్తరింపఁబడు; నట్లగుటం జేసి. | 28 |
గీ. | కణఁగి సంకల్పకాలంబు గళిత మైన, | 29 |
వ. | సకలజగద్ద్రష్ట యగువిమలాత్మునకు నీవు నేను జగంబులును దృశ్య | 30 |
క. | విను మన మాకాశం బగు; | 31 |
సీ. | అఖిలప్రపంచంబు నణఁగినలయవేళ | |
గీ. | నిగమగోచరుఁడును గాఁగ నిగుడు నెవ్వ | 32 |
వ. | అది యెట్లంటేని. | 33 |
సీ. | దొరసి వేదాంతవాదులు బ్రహ్మ మన, సాంఖ్య | |
గీ. | అఖిలమున నుండి లేనివాఁ డయ్యె నెవ్వఁ, | 34 |
క. | విదితంబుగ నద్దేవుని | 35 |
వ. | అనంతం బగుజగద్బృందంబు తాను జేయుచు నెన్నడు నెద్దియుం | 36 |
సీ. | అఖిలేతిహాసంబులందు సారం బైన | |
| పరఁగ రాగద్వేషభయముల కనురూప | |
గీ. | దనరునఖిలార్థజాలంబులను జరించి | 37 |
వ. | అట్టిజీవన్ముక్తుండు కాలవశంబునం దనశరీరంబు విడిచి జీవాత్మస్వరూ | 38 |
లీలోపాఖ్యానము
క. | ఇలఁ బద్మకుఁ డనుభూపతి | 39 |
వ. | అద్దేవికిం బ్రణమిల్లి యి ట్లనియె. | 40 |
గీ. | వాణి, నాకంటె మున్ను నావరుఁడు తనువు | 41 |
వ. | మఱియు నేను మత్పతినిమిత్తం బై యెప్పుడు నినుఁ జూడ వేఁడెద | 42 |
ఉ. | నీపతి మేను వాయునెడ నెయ్య మెలర్పఁ బ్రసూనమంటప | 43 |
క. | అని చెప్పి వాణి చనుటయు | 44 |
క. | భారతి చెప్పిన విధమున | 45 |
వ. | సరస్వతిఁ దలంపఁ దత్క్షణంబ చనుదెంచిన నద్దేవిపాదంబులపైఁ గన్నీ | 46 |
శా. | తల్లీ భారతి మద్విభుండు మృతుఁ డై తా నేఁగె నీ చెప్పిన | |
| జెల్లంబో నను జీవితేశుకడకుం జేర్పించి రక్షింపవే. | 47 |
వ. | అని విలపించుచున్న యప్పరమసాధ్వి నూఱించి వాణి యిట్లనియె. | 48 |
క. | రాకాశశిముఖి, విను చి | 49 |
వ. | అట్లు గావున నివి యాకాశబ్దవాచ్యంబు లై యుండు, నందు దక్కి | 50 |
క. | దేశముననుండి వేఱొక | 51 |
క. | అందును సంకల్పాదుల | 52 |
గీ. | అఖిలదృశ్యంబు లెడఁబాసి యందుఁ బొందుఁ | 53 |
సీ. | అని వాణి తనయింటి కరుగుటయును, నంత | |
గీ. | బరఁగ షోడశవత్సరప్రాయ మైన | 54 |
గీ. | వాణి, యద్భుత మయ్యె; నావరున కెట్లు | 55 |
క. | అతివా మృతిఁ బొందిన నీ | 56 |
వ. | అది యెట్లంటేని. | 57 |
సీ. | తనరుచిదాకాశమున నొకానొకచోట | |
| భార్యయుం దాను నిర్భరలీల వసియించి | |
గీ. | క్రింది సౌభాగ్యసంపద లంద మొంద | 58 |
క. | చింతించె విప్రుఁ డీభూ | 59 |
వ. | అని చింతావృతమానసుం డై యమ్మహీసురుండు పంచత్వంబు నొంది | 60 |
క. | ఆవనితయు మును నీగతి | 61 |
వ. | ఇట్లు గావున మీ యిరువుర సర్వసంసారమును నా బ్రాహ్మణి మంట | |
| ద్గృహంబునం దున్నయది. యని చెప్పిన విస్మయం బంది లీల యి | 62 |
క. | అక్కట విప్రునిజీవం | 63 |
సీ. | సర్షపకోటరస్థలి మదాంధం బైన | |
గీ. | మెఱయ నామాట లెందును మిథ్య గావు | 64 |
వ. | అమ్మహారాష్ట్రం బాకాశరూపంబు గావున నాకాశాత్ముం డైన యతం | 65 |
గీ. | తరుణి మాయిద్దఱకుఁ దొంటితలఁపులందు | 66 |
గీ. | అరయ సంకల్పముకురంబునందుఁ బోలెఁ | |
| బొరిఁ జిదాకాశకోశకోటరమునందు | 67 |
వ. | ఎట్లనినం బరమాణురూపం బగుచిదాత్మయందు దద్రూపం బగు | 68 |
క. | జననీ, యావిప్రుడు చని | 69 |
సీ. | అన విని దేవి యిట్లనుఁ బ్రతిభాస మౌ | |
గీ. | సహిత మీమను గలయది; జనకునకును | 70 |
వ. | అనిన విని లీల యిట్లనియె. | 71 |
క. | పరమేశ్వరి, నీచేతం | |
| సురమిథున మున్న సర్గకు | 72 |
వ. | అమ్మహాదేవి యి ట్లను నపరంబును భావంబును నగుచైతన్యచిద్రూ | 73 |
క. | ఈయర్థమునందు సుఖా | 74 |
వ. | అనిన విని సరస్వతి లీల కి ట్లనియె. | 75 |
గీ. | తత్త్వచింతనంబుఁ దత్కథనంబు న | 76 |
గీ. | దృశ్యములసంక్షయంబును దెలియఁజేసి | 77 |
సీ. | అని యిట్లు చెప్పి తా నమ్మహానిశయందు | |
| నతులితయోగసమాధినుండి | |
గీ. | గని యదృశ్యాంగు లయి యటఁ గదలి వేగ | 78 |
క. | కని యోగస్థితి నొందియుఁ | 79 |
గీ. | ఇట్లు చనుచేరఁ దత్పతి యెదురు వచ్చి | 80 |
క. | జననాయక నీతొల్లిటి | 81 |
వ. | ఇట్లు మనోగతం బయినమాయ యాక్షణంబ పాసి తన పూర్వజన్మవృ | |
| విభుం డాత్మగతంబున 'నోహో యతివిస్మయం బగుసంసారమా | 82 |
క. | వనజాక్షులార వినుఁ డీ | 83 |
వ. | అనిన విని వాణి యి ట్లనియె. | 84 |
సీ. | ఉహింప మృతిమహామోహమూర్ఛానంత | |
గీ. | బరఁగఁ బదియాఱువర్షాలప్రాయ మగుట | 85 |
మ. | పరమార్థంబునఁ బుట్టుట ల్మడియుటల్ భావింప లే వెన్నఁడున్, | 86 |
క. | వితతపదార్థారూఢుఁడు | |
| నతిజడుఁడు నశుద్ధమతియు నగునాతనికిన్ | 87 |
వ. | మఱియు బాలునకు బేతాళుండు మరణాగతదుఃఖం బొనరించునట్లు | 88 |
సీ. | సర్వగతంబును శాంతంబుఁ బరమార్థ | |
గీ. | నీవు లీలార్థ మిట్లు వర్ణింపబడితి | 89 |
వ. | అని చెప్పి మఱియు వసిష్ఠుం డి ట్లనియె నప్పరమయోగినులు చనిన | 90 |
శా. | ఆరాజన్యు లుదగ్రు లుగ్రగతి నన్యోన్యప్రహారార్థు లై | 91 |
వ. | ఇట్లు పడిన యతనిజీవరేఖ విద్యుల్లేఖయుం బోలె గగనంబున కెగ | 92 |
ఉ. | కోమలి యిప్పు డిట్లు మనకుం బ్రతిపత్తి యొనర్చి భూవర | 93 |
వ. | అని యయ్యిరువురు నత్తేజంబు వెనుచన నదియు ననేకసర్గపరం | 94 |
ఉ. | కొండలు నబ్ధులు న్నదులుఁ గోన లసంఖ్యము దాఁటి చిద్వియ | 95 |
క. | వివిధమణిగోపురంబుల | 96 |
గీ. | అట్లు సొత్తెంచి యప్పురియంతరముల | 97 |
వ. | ఇవ్విధంబునఁ జనిచని యత్యంతరమణీయం బగు రాజమందిరంబు ప్రవే | 98 |
ఉ. | మాడుగుక్రేవ సోమమణిమంటపముం గని దానితిన్నెపై | 99 |
క. | ప్రాణమునఁ గూడుకొని త | 100 |
వ. | ఇట్లు జీవకళ ప్రవేశించిన సర్వాంగంబులు కాంతియుతంబులు రసవం | 101 |
ఉ. | మోము వికాస మందఁ, గరముల్ గదలించుచుఁ, గాళ్లు సాచి, యి | 102 |
వ. | ఇట్లు మేల్కని గంభీరవాక్యంబుల నిది యెక్కడ నని పల్కు నాభూ | 103 |
క. | కిలకిల నవ్వుచుఁ గన్నులు | |
| కలకల నై వచ్చె లీల కాంతునికడకున్. | 104 |
వ. | ఇవ్విధంబునఁ జనుదెంచి తద్వృత్తాంతం బంతయు నెఱింగించిన నతం | 105 |
క. | కానఁబడు నీప్రపంచము | 106 |
సీ. | పరమ మధ్యాత్మంబు బ్రహ్మ మనాభాస | |
గీ. | నదియుఁ బరమాత్మ; దేహంబులందుఁ బొంది | 107 |
గీ. | అదియ సంసారవాసన లగ్గలించి | |
| నణువుగతి సూక్ష్మమై పొల్చునగ్నికణము | 108 |
వ. | అయ్యహంకారంబు చేతనంబు మనంబు మాయ ప్రకృతియు నను | 109 |
క. | పారంబు లేనిసంవి | 110 |
గీ. | మనము వికృతియె సంసారమయము గాన, | 111 |
గీ. | అరయఁ బరమాత్మ జీవాత్మ లైక్యమైన | 112 |
వ. | ఈ యర్థంబున నొక్కయితిహాసంబు గలదు. కర్కటి యను రాక్షసి | 113 |
కర్కటికోపాఖ్యానము
క. | ఆరాక్షసి యెక్కడియది? | 114 |
వ. | అనిన వసిష్ఠుం డి ట్లనియె. | 115 |
ఉ. | కాటుకగుబ్బలి న్మలిచి కాలుఁ డొనర్చినకృత్తియో యనన్ | 116 |
సీ. | అమ్మహారాక్షసి యాఁకటి కోర్వక | |
గీ. | జీవహింసయు మది రోసి చిత్స్వరూప | 117 |
వ. | ఇ ట్లత్యంతనిష్ఠురానుష్ఠానంబు లనుష్టించుచున్న కర్కటి కడకుఁ | 118 |
క. | నీతపమున కే | 119 |
క. | ఈ కూ డుడిగినతపములు | |
| నాకూన వత్స కర్కటి | 120 |
వ. | మూఢులను దురారంభులను దుర్వ్యసనులను దుర్దేశవాసులను | 121 |
ఉ. | అచ్చపలాత్మ నొంటిగతి నాఁకటి కోర్వఁగలేక నొంటిమై | 122 |
క. | ఈశర్వరి నిద్దఱును దు | 123 |
వ. | కా దేని నాయడిగిన ప్రశ్నంబుల కుత్తరంబులు సెప్పి ప్రాణంబులు | 124 |
సీ. | ఏకమై యుండి యనేకసంఖ్యలు గల | |
గీ. | డెనయఁ జేతన మంది దా నెవ్వఁ డయ్యె? | 125 |
గీ. | కడలి కడ లొందుగతిఁ పృథగ్భాగ మయ్యు | 126 |
వ. | అని చెప్పి మఱియు నారాక్షసి యి ట్లనియె. | 127 |
క. | బంధురగతి నీ ప్రశ్నలు | 128 |
వ. | అనిన విని వార లిరువురు నొండొరువులమొగంబు సూచికొని యవ్వి | 129 |
క. | కర్కటి యనియెడి రాక్షసి | 130 |
వ. | అనిన విని మంత్రి యి ట్లనియె. | 131 |
గీ. | కణఁగి వడ్లును పెరుగును గలుపుభంగి | 132 |
వ. | అని పలికి యా రాక్షసిం గనుంగొని మంత్రి యిట్లనియె. | 133 |
క. | కమలేక్షణ నీ వడిగిన | 134 |
సీ. | ఆఱింద్రియములకు నందక సౌఖ్య మై | |
గీ. | తత్ప్రకాశతఁ జేసి చేతనము నొంది | 135 |
గీ. | అతని తలఁపున విశ్వంబు నయ్యెఁ గాన | 136 |
వ. | అప్పరమాత్మ దాన సద్రూపం బగుట జేసి కలం డని చెప్పంబడు | 137 |
క. | నీ వఖలతత్త్వవిదుఁడవు | |
| బావనత నొందెనని యా | 138 |
వ. | మద్వాక్యంబులకుం దగినయుత్తరంబులు నీవునుం జెప్పుదు గాక యన | 139 |
సీ. | జగములు లేమి నిశ్చయముగాఁ దెలిసిన | |
గీ. | గోటికోట్యంతరంబులఁ గొమరు మిగిలి | 140 |
గీ. | వెలయ విశ్వాత్మకుఁడు నాఁగ విశ్వములును | 141 |
వ. | అని చెప్పుటయు. | 142 |
క. | వెన్నెలఁ గన్న కుముద్వతి | 143 |
ఉ. | అక్కట యస్తమింపని వియన్మణిభంగిని మీ వివేక మిం | 144 |
చ. | అనుడు నృపాలుఁ డి ట్లనియె; నంగన నీ వతిపుణ్యశీల, వీ | 145 |
వ. | అట్లేని చోరులను బాపకర్ములను రాజుద్రోహులను నీకు భక్ష్యంబుగా | 146 |
క. | ఈసూచితవృత్తాంతము | 147 |
క. | రాగాదిదోషదూషిత | 148 |
వ. | మఱియు నీ యర్థంబున సకలశ్రుతిభూషణంబును ననిందితంబును | |
| జన నిశ్చయం బగుట ముం జిత్తం బను బాలుండు ప్రపంచపిశాచం | 149 |
క. | ఇంద్రుఁడు నాఁ నొకవిప్రుఁడు | 150 |
గీ | అట్లు తపము సేసి యద్దేవువరమునఁ | 151 |
వ. | చింతాక్రాంతు లై యొండొరులం గూడుకొని యందఱు నగ్రజుకడ | 152 |
| ఏమి సేయుద మింక? నేది కార్యము మన? | |
గీ. | నెంతపని యన్న; వారు సామంతపదవి | |
| యనిన ననుజన్ము లందఱు నన్న కనిరి. | 153 |
వ. | అ ట్లేని మాకు నఖిలరాజలోకశాసనుం డగురాజు సామ్రాజ్యపదంబు | 154 |
గీ | తగఁ బ్రజాపతికిని ముహూర్తంబు సనిన | 155 |
వ. | వారికి నగ్రజుం డి ట్లనియె. | 156 |
క. | ఆకల్పాంతమునందును | 157 |
వ. | తండ్రీ మీవాక్యంబు లత్యంతయుక్తంబు లయి యున్నయవి; యప్ప | 158 |
గీ. | అభిలజగములు సృజియించునట్టి బ్రహ్మ | 159 |
వ. | అనిన వార లగ్రజువాక్యంబు లంగీకరించి యతండునుం దారును న | 160 |
సీ. | పద్మాసనస్థు లై బాహ్యకర్మంబులు | |
| చింతలనెడఁబాసి యంతరంగంబులఁ | |
గీ. | దపము సేయంగఁ దొల్లింటితనువు లెల్ల | 161 |
చ. | పదురు కుమారులుం బదురు బ్రహ్మలరూపులు దాల్చి యెల్లెడన్ | 162 |
వ. | అని మఱియు నిట్లనియె. | 163 |
క. | చిత్తంబ కర్త సృష్టికి | 164 |
వ. | అది యె ట్లనిన, బ్రాహ్మణమాతృకు లగునైందవు లందఱు మనోభావన | 165 |
గీ. | దేహవాసన సేసినదేహి దాన | 166 |
క. | అనిన విని రఘుపుంగవుండు మునిపుంగవున కిట్లనియె. | 167 |
క. | దేహము జీవుఁడు వే ఱగు | |
| టూహింప నతథ్య మైన, నొక్కటి వినుఁడీ; | 168 |
కృత్రిమేంద్రోపాఖ్యానము
వ. | అనిన వసిష్ఠమునీంద్రుం డీ యర్థంబున నొక్కయితిహాసంబు గల | 169 |
క. | ఇంద్రద్యుమ్నుం డనురా | 170 |
ఉ. | ఆ సుదతీలలామ దనహర్మ్యతలంబున నిల్చి మానసో | 171 |
క. | కని వానిపట్టుఁ బేరును | 172 |
వ. | అంతట నొక్కనాఁడు. | 173 |
ఉ. | ఆరమణీశుమ్రోల నితిహాసకుఁ డొ'క్కఁడు గోష్ఠి సేయుచున్ | 174 |
గీ. | ఆతఁ డింద్రు డే నహల్య నిద్దఱకును | |
| పుణ్యకథలయందుఁ బొందుట సెప్పడి | 175 |
వ. | అని నిశ్చయించి. | 176 |
ఉ. | ఆ తరలాక్షి యొక్కతెయ యానడురాతిరి పెక్కుమోసలల్ | 177 |
వ. | అంత నొక్కనాఁడు. | 178 |
క. | ఆ పట్టణపుఁ దలవరు | 179 |
వ. | మఱియు ననేకవిధంబుల బాధింప వారల శరీరంబుల జర్జరితంబు | 180 |
ఉ. | ఈసునఁ జేయు కార్యముల నే మగు? నిద్దఱ నావలంతగా | 181 |
క. | ఇత్తరలాక్షికి నాకును | 182 |
వ. | అది యెట్లనిన. | 183 |
ఉ. | చిత్తమ కారణం బఖిలసృష్టికి, మ్రాఁకుల దీఁగెలన్ జలం | |
| బత్తి రసస్వరూప మగునట్టి విధంబునఁ; జిత్త మవ్వలన్ | 184 |
ఉ. | దేహ మణంగిపోయినను, దేహశతంబులు దా మడంగినన్ | 185 |
వ. | అనవుండు. | 186 |
క. | పరమార్థామృత మగునా | 187 |
వ. | ఇట్లు పురంబు వెలుపడి యింద్రాహల్య లిరువురు నన్యోన్యప్రేమాతి | 188 |
క. | మన మతిజడము నమూర్తం | 189 |
వ. | అనిన విని వసిష్ఠుం డనంతంబును సర్వశక్తిమయంబు నగుపరమా | |
| నీయర్థంబునఁ దొల్లి బ్రహ్మోపదిష్టం | 190 |
బ్రహ్మోపదేశము
సీ. | ఏదిక్కు చూచిన నెంచి నూఱామడ | |
గీ. | యుండి, యాతండు తన బాహుమండలముల | 191 |
ఉ. | అచ్చటనుండి దుష్టతర మైనకరంజవనంబు సొచ్చి తా | 192 |
క. | ఈకాంతారములోపల | 193 |
గీ. | వ్రేసికొన నీక పట్టిన వ్రేటు లుడిగి | |
| మాని యొ త్తిలి నవ్వుచుఁ దాన తనదు | 194 |
ఉ. | ఊరక యున్నఁ జూచి వెఱఁ గొందుచు నే నటు వోవ నొక్కచో | 195 |
వ. | ఒక్కమహాంధకూపంబునం దురికె. నతండె కాఁ డట్టిపురుషుల ననే | 196 |
సీ. | అయ్యరణ్యంబు దా నది మహాసంసార, | |
గీ. | తాప మాతండు సేయురోదనము, హాస్య | 197 |
వ. | అని పితామహుఁడు తనకుఁ దొల్లి సెప్పినకథాక్రమం బెఱింగించి | 198 |
గీ. | గోరి యాత్మవివేకంబు కొంత గలిగి | |
| భోగముల మాని తద్గతిఁ బొందఁ దివురు | 199 |
క. | జ్ఞానవివేకప్రాప్తుం | 200 |
క. | చిత్తమ ప్రకృతియుఁ బురుషుఁడుఁ | 201 |
వ. | అని చిత్తోపాఖ్యానంబు రామచంద్రున కెఱింగించి వసిష్ఠుండు మఱి | 202 |
గీ. | సర్వశక్తిమయము శాశ్వత మాపూర్ణ | 203 |
వ. | ఎ ట్లనిన నది యాత్మకు నుల్లాసశక్తియు బ్రహ్మంబునకుఁ జిచ్ఛక్తి | 204 |
గీ. | దేశకాలాదివైచిత్రిఁ జేసి ధరణి | |
| సస్యములు పుట్టుగతి నాత్మశక్తి నొదవుఁ | 205 |
ఉ. | మోక్షము సర్వధర్మముల మున్కొని కన్గొను దృష్టి తాన యై, | 206 |
వ. | ఈయర్థంబున కొక్కయితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. | 207 |
క. | ఒక దేశంబున నొకపురి | 208 |
వ. | అది యెట్లనిన. | 209 |
సీ. | అవనిలో నతిశూన్యమైనమహాపురి | |
గీ. | బూచి కాచి యొప్పు భూరుహచ్ఛాయల | |
క. | ఉపలాలోక్తుల నాయమ | 211 |
క. | సంకల్పమ సంసారము | 212 |
వ. | అని యెఱిఁగించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె. | 213 |
లవణోపాఖ్యానము
క. | తనసంకల్పవశంబున | 214 |
క. | బుద్ధిఁ దలపోసి యంతయు | 215 |
గీ. | ఆత్మతత్త్వం బనంతంబు నవ్వయంబు | |
వ. | అట్లు గావున మనోవిలాసమాత్రంబు బంధంబును, మనశ్శమనంబు | |
| సెప్పెద నాకర్ణింపు మని యిట్లనియె. | 217 |
క. | అవనికిఁ దొడ వగునొకపురి | 218 |
క. | తిలకంబును మసిబొట్టును | 219 |
వ. | ఇవ్విధంబున శంబరుం డను నైంద్రజాలికుండు చనుదెంచి యారాజును | 220 |
క. | చప్పట్లు వెట్టి చేతులు | 221 |
వ. | ఇట్లు సూచుటయు నతనిమాయాజాలంబునం బడి తత్సభాజనంబు | 222 |
అల్పాక్కర. | మీ రిందు శంబరు మెచ్చి చూడ | 223 |
వ. | అంత రాత్రి యగుటయు మహాంధకారంబున నత్తురంగం బయ్యర | 224 |
క. | ఆలంబితశాఖుఁడ నయి | 225 |
వ. | అట్టియెడ నలుదిక్కులుఁ జూచుచు భయభ్రాంతచిత్తుండ నై యుండ | 226 |
ఉ. | చేతులగాజులున్ జెవులజిట్లును బొట్టును దాటియాకులున్ | 227 |
క. | కని డాయఁ బిలిచి నాన | 228 |
గీ. | కానికులముదానఁ గదియంగ వచ్చునే | 229 |
ఉ. | నన్నును గౌఁగిలించి వదనంబు నురంబునుఁ జేర్చి డింపుచోఁ | 230 |
వ. | దానితో ని ట్లంటి. | 231 |
క. | నిన్నటినుండియు నాఁకట | 232 |
వ. | అనిన నాచండాలి నాయభిప్రాయం బెఱింగి తనతెచ్చిన పర్యుషితా | 233 |
చ. | కడవలు కావటందు నిడి గ్రక్కున మూఁపున మోచి బిడ్డనిన్ | 234 |
వ. | అంతఁ గొన్నిదినంబులకును. | 235 |
క. | కొడుకులు నాలును గడు నల | 236 |
వ. | ఇట్లు వడిఁ దెలివొంది చనుదెంచితి. నింతయును శంబరునికృత్యంబ. | 237 |
చ. | కనుఁగొన నైంద్రజాలికుఁడు గాఁ డితఁ; డట్టిఁడ యయ్యె నేని దా | 238 |
వ. | అట్లు గావున ననంతరూపం బగుపరమాత్మమాయ మనోరూపంబు | 239 |
గీ. | అనఘ యల్పకాలమునన పెక్కేఁడులు | 240 |
వ. | సమయమంబున మనశ్శాంతి యగుఁ; దచ్ఛాంతిని మననవర్జితంబును | 241 |
క. | చిత్తవ్యాధుల కౌషధ | 242 |
క. | ఏ యభిలాషలఁ బొందక | 243 |
గీ. | శాస్త్రశిక్షల నిశిత మై చల్ల నైన | |
| చిత్తమునఁ దోఁచు చింతలు మెత్తనయిన, | 244 |
గీ. | పౌరుషంబున సాధ్య మై పరఁగునీప్సి | 245 |
సీ. | పొలుచు బ్రహ్మంబునఁ బొంది నిరీహశా | |
గీ. | ఏమి సెప్పుదు నొకచిత్ర మినకులేశ, | 246 |
వ. | స్ఫటికోపలరచితంబు లగు విచిత్రప్రతిబింబంబులం బోలె నఖిలకార్యం | 247 |
గీ. | తృణకణాంశంబు వజ్రమై త్రుంచునట్ల | |
| గట్టువడినట్లు విశ్వంబు గట్టువడియె; | 248 |
వ. | అని మఱియు నిట్లనియె. | 249 |
క | అక్కట లవణనృపాలుఁడు | 250 |
క. | అనిన వసిష్ఠుం డి ట్లను; | 251 |
వ. | అది యె ట్లనిన రాజసూయయాగకర్తలు ద్వాదశవర్షదుఃఖంబు | 252 |
ఉ. | అక్కట రాజసూయమఖ మాగలిఁ జేసినయట్టినాకు నేఁ | 253 |
వ. | ఇ ట్లత్యంతదుఃఖంబు నొందినయవ్వనం బంతయుం దనచిత్తంబునం | |
| గూర్చుకొని దిగ్విజయార్థం బరుగుచందంబున దక్షణాభిముఖుం | 254 |
చ. | తురగము చన్నమార్గమును, దూకొను వృక్షము కొమ్మ, మాలవాఁ | 255 |
వ. | ఇట్లు ప్రత్యక్షంబుగాఁ గనుంగొని లవణుం డాశ్చర్యహృదయుం డయి | 256 |
క. | కలలోఁ గాంచినవస్తువు | 257 |
వ. | అనిన వసిష్ఠుం డి ట్లనియె. | 258 |
ఉ. | ఈ యనుమాన మేల! విను మిట్టిద యల్ల యవిద్యపెం; ప దె | 259 |
వ. | అది యె ట్లనిన నాపల్లెయు వనంబును హయంబును నారాజునకుం | |
| కాని సత్యంబు గా దట్లు గావున. | 260 |
గీ | వస్తువస్తువునడుమఁ గేవలము బయలఁ | 261 |
చ. | మును పరమాత్మతత్త్వమున మున్కొని చిత్తము పుట్టుఁ, జిత్తస | 262 |
క. | జాలిన సంకల్పంబులఁ | 263 |
వ. | అని లవణోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె. | 264 |
అజ్ఞానభూమికోపాఖ్యానము
సీ. | జననాథ యెఱుఁగు, మజ్ఞానభూమిక లేడు | |
గీ. | జాడ్యనిద్ర లుడిగి సంకల్పములఁ బాసి | |
| వస్తువస్తుమధ్యవర్తి యై వెలుఁ గొందు | 265 |
వ. | అందు నారోపితంబులగునజ్ఞానభూము లెవ్వియనిన-బీజజాగ్రత్తును, | 266 |
గీ. | చిత్తునకుఁ దాన మొదలిటిచేతనంబు | 267 |
వ. | అది యెఱుకకు నూతనావస్థ యనంబడు; నింక జాగ్రదవస్థ సెప్పెద. | 268 |
క. | ఇది నాయి ల్లిది నామే | 269 |
గీ. | ఈతఁ డతడు నేను నిది నాది యనఁగ జ | 270 |
క. | ఈరాజు గెల్చి నే నీ | 271 |
గీ. | ఎండమాపు లుదక, మిరువురు చంద్రులు, | |
| పెక్కుగతులభ్రాంతి బెరయుట స్వప్నంబు | 272 |
గీ. | పెద్దకాల మేని తద్దయుఁ దఱుచుగాఁ | 273 |
క. | జడ నొంది యిపుడు సెప్పిన | 274 |
జ్ఞానభూమికోపాఖ్యానము
వ. | ఆ వ్యవస్థలయందు సకలజీవులును దమోలీనం బయి యుండు. నవి | 275 |
గీ. | 'అకట నే నేల మూఢుండ నైతి?' ననుచు | |
| నది సుఖేచ్ఛాఖ్య యండ్రు వేదాంతవిదులు. | 276 |
గీ. | శాస్త్రసత్సంగవైరాగ్యసమితి గలిగి | 277 |
క. | ఈ రెంటిని మనమున నిడి | 278 |
గీ. | అనఘ యీ మూఁడుభూముల నభ్యసించి | 279 |
క. | కూరిన యీనాలుగు మది | 280 |
వ. | ఈ యేనుభూముల నెఱిఁగి స్వాత్మారాముం డయి బాహ్యాభ్యంతరం | 281 |
గీ. | ఆఱుభూములగతులును నాత్మ నెఱిఁగి | 282 |
వ. | తుర్యగావస్థయె జీవన్ముక్తి యనంబడు. మఱి విదేహముక్తివిషయంబు | |
| తుర్యగా తీతం బగు. నని చెప్పి వసిష్ణుండు మఱియు ని ట్లనియె. | 283 |
సీ. | పొలిచెడి సప్తమభూమిక యగుతుర్య, | |
గీ. | తనరు సంసారసుఖముల ననుభవింతు, | 284 |
క. | జ్ఞానాజ్ఞానములకు సో | 285 |
వ. | అని వసిష్ఠమహాముని రామచంద్రున కుత్పత్తిప్రకరణంబును, మనోవి | 286 |
తురగగతివృత్తము. | బ్రకటదితిసుతజఠరగళదురురక్తసిక్తనఖాంకురా | |
| సుకవిజనమృదుమధురనవరసశుక్తిమౌక్తికపూజితా | 287 |
క. | విశ్వాత్మ విశ్వనాయక | 288 |
మాలిని. | నిగమసదనదీపా నిశ్చితానందరూపా | 289 |
గద్య
ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్ర అయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైన వాసిష్ఠరామాయణంబునం
దుత్పత్తిప్రకరణం బన్నది
ద్వితీయాశ్వాసము.