వావిలాల సోమయాజులు సాహిత్యం-2/పీయూషలహరి

భూమిక

తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృతుల సర్వతోముఖ విలసనానికీ, వికసనానికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ప్రకారం 1985 డిసెంబరు 2వ తేదీన రూపుదాల్చిన విశిష్ట విద్యా సంస్థ తెలుగు విశ్వ విద్యాలయం. శోధన, పరిశోధన, ప్రచురణలతోపాటు విస్తరణసేవ, రాష్ట్రేతరాంధ్రులకూ, విదేశాంధ్రులకూ సహాయ సహకారాల కల్పన వంటి బహుముఖీన కార్యక్రమాలను కూడా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. పూర్వంపున సాహిత్య, సంగీత, నృత్య, నాటక, లలితకళా అకాడమీలు, తెలుగు భాషా సమితి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం విలీనం కావడంతో విశ్వవిద్యాలయం వివిధ పీఠాల, విభాగాల సమాహారంగా వ్యవహరిస్తోంది.

తెలుగుజాతి వైభవోన్నతులకు అద్దంపట్టే గ్రంథాల ప్రచురణ విశ్వవిద్యాలయ ప్రధానాశయా లలో ఒకటి. విశ్వవిద్యాలయంలో విలీనమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవిశ్రాంత కృషి ద్వారా దేశ సాహిత్య రంగంలో విశిష్టస్థానం సంతరించుకుంది. 1957 ఆగస్టు 7వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఈ అకాడమి దేశం మొత్తం మీద ప్రప్రథమ రాష్ట్రస్థాయి అకాడమి కావడం విశేషం. ఈ అకాడమి ప్రామాణికమైన నిఘంటువులు, పదకోశాలు, కావ్యాలు, ప్రబంధాలు, వ్యాసాలు, విమర్శలు, కల్పనా సాహిత్యం, పరిశోధనాత్మక గ్రంథాలు, జీవితచరిత్రలు, అనువాదాలు మొదలైనవి అనేకం ప్రచురించింది.

సంగీత, నృత్య, నాటక లలితకళా అకాడమీలు తమ ఆశయాలకూ, లక్ష్యాలకూ అనుగుణమైన గ్రంథాలను ప్రకటించాయి. అంతర్జాతీయ తెలుగు సంస్థ ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారికి పెక్కు గ్రంథాలను అందించింది. తెలుగు భాషాసమితి విజ్ఞానసర్వస్వ సంపుటాలను ప్రచురించింది.

తెలుగు విశ్వవిద్యాలయం ఈ ప్రచురణ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఇంతవరకు 103 గ్రంథాలు వెలువరించింది. ప్రస్తుత ప్రచురణ 'పీయూషలహరి' అపురూపమైన కృతి. అత్యంత ప్రజాదరణ పొందిన గీతగోవింద కావ్యకర్త జయదేవకవి రచించిన 'గోష్ఠీ రూపకం' ఇది. గీత గోవిందానికి పీయూష లహరి పూర్వరంగం వంటిదనవచ్చు. రెండింటిలోనూ శ్రీకృష్ణుని రాసలీలలు ఇతి వృత్తాలు. ఈ గోష్ఠీరూపకాన్ని ప్రసిద్ధ సాహితవేత్తలు శ్రీ వావిలాల సోమయాజులుగారు సేకరించి అనువదించి ప్రచురణకోసం తెలుగు విశ్వవిద్యాలయానికి అందించారు. వారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు అందచేస్తున్నాను.

'పీయూషలహరి'పై పండిత కె.కార్ సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. ఈ వ్యాఖ్యానం, ఇంగ్లీషులో పీఠికతోపాటు నాగరలిపిలో సంస్కృత మూలపాఠాన్ని ప్రత్యేక ప్రచురణగా విశ్వ విద్యాలయం పాఠకలోకానికి అందిస్తోంది.

ఉత్తమ గ్రంథాలను అందించాలనే తెలుగు విశ్వవిద్యాలయం సంకల్పానికి ఈ గ్రంథం ఒక నిదర్శనం. ఇది తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.


హైదరాబాదు -4

ఆచార్య సి. నారాయణరెడ్డి

తేది : 22-2-1990

ఉపాధ్యక్షులు

తెలుగు విశ్వవిద్యాలయం

శ్రీ జయదేవ కవి విరచిత

పీయూషలహరి

పీఠిక

శ్రీ వావిలాల సోమయాజులు

గీతగోవిందం

ఆంధ్రులకు అష్టపదులంటే అపరిమితమైన అభిమానం. బహుకాలం నుంచీ సంగీత విద్వాంసులు గాన విద్యాప్రావీణ్యానికి 'గీతగోవింద' గాన సామర్థ్యాన్ని ఒక ఒరపిడి రాయిగా నిర్ణయించి ఉండటం గమనించ దగ్గ విషయం.

అష్టపదులకు ఏతత్కృతికర్త ఉంచిన నామం గీతగోవిందం. గోవిందుని గురించిన గీతాలుగల ప్రబంధం కాబట్టి దానికీ పేరు ఉచితమని భావించి ఉండవచ్చును. అష్టపదులంటే అంత ఆదరాభిమానాలను ప్రకటిస్తున్నా ఆంధ్రులు తద్రచయిత జయదేవుని గురించి విశేషంగా తెలుసుకున్నట్లు కనిపించదు.

జయదేవుడు

మహాకవి జయదేవుడు అద్వితీయ మహాభక్తుడుగా పరిగణితుడైనాడు. భక్త చరిత్రల వల్ల ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నవి. క్రీ.శ. 15వ శతాబ్దంలో చంద్రదత్తుడు కూర్చిన 'భక్తమాల'లో జయదేవుని జీవితం కొన్ని సర్గలలో (36-47) వర్ణితమైనది. ఆయనను గురించిన కొన్ని జనశ్రుతులు కూడా దేశంలో ప్రచారంలో ఉన్నవి.

జయదేవుని బాల్యదశను గురించిన విశేషా లేమీ తెలియటంలేదు. విద్యార్థిదశలో గురువుల యొద్ద పక్షం మార్చి మరొక పక్షం విద్యాభాసం[1] చేయటం వల్ల జయదేవుడికి వక్షధరమిశ్రుడనే పేరువచ్చిందని కొందరంటారు. కాని యీ బిరుదం గీతగోవిందకారునిది కాదనీ, ప్రసన్న రాఘవకర్త అయిన మరొక జయదేవుడిదనీ తెలుస్తున్నది. గీతగోవిందంలో జయదేవుడు "పద్మావతీ చరణచారణ చక్రవర్తి" నని చెప్పుకున్నాడు. పద్మావతీదేవి ఆయన భార్య అనీ, దేవదాసి అనీ భిన్నాభిప్రాయాలున్నవి. ఇందులో ప్రథమాభిప్రాయాన్నే పండిత లోకం అంగీకరించింది. బహుకాలం సంతానం లేక ఒక బ్రాహ్మణుడు జగన్నాథస్వామి నారాధించి ఒక పుత్రికారత్నాన్ని పొంది ఆమెకు పద్మావతి అని నామకరణం చేసి మహా విష్ణువుకు తప్ప నన్యుల కామె నీయనని నిశ్చయం చేసుకున్నాడట. ఆమెకు యుక్తవయసు వచ్చిన తరువాత పుత్రికను వెంటతీసుకుని ఆమెను దేవదాసిగా స్వామిపేర విడిచిపెట్టటానికి పురుషోత్తమ క్షేత్రానికి వెడుతుండగా జగన్నాథస్వామి సాక్షాత్కారించి 'ఓ భక్తశ్రేష్టుడా! నా కర్పింపదలచిన యీకన్యకను నా అంతరంగ భక్తుడైన జయదేవుడి కర్పించు. అదే నా కమితానంద మని పలికినాడట! అప్పుడు పరివ్రాజక శ్రేష్ఠుడుగా ఉన్న జయదేవుడామెను స్వీకరింప నిరాకరింపగా తండ్రి 'ఇది భగవదాజ్ఞ' యని పుత్రిక నట నుంచి పోగా జయదేవు డామె శుశ్రూషను స్వీకరించి క్రమముగ స్నేహ భావము పెంపొందిన పిమ్మట వివాహమాడి నటుల 'భక్తమాల' వల్ల తెలుస్తున్నది.

జయదేవుడు ఉపాస్యదేవత అయిన నారాయణమూర్తి కైంకర్యం కోసం ధనార్జన చేయటానికి బృందావనం, జయపురం మొదలయిన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చోరులు ఆయన ధనాన్ని అపహరించి కాళ్ళూచేతులు విరుగగొట్టి పోయినారట! ఒక ప్రభువు వేటకు వచ్చి ఆయన దుర్దశను జూచి రాజధానికి తీసుకొనిపోయి చికిత్స చేయించి స్వాస్థ్యం చేకూర్చిన తరువాత పద్మావతితో ఆ కవి అక్కడనే కాపురం చేస్తూ ఉన్నాడు. యతి వేషాలు వేసుకొని వెనుకటి చోరులు ఆ రాజధానికి వచ్చినా తెలుసుకొని కూడా వారికి జయదేవుడు శిక్షచెప్పింపలేదట! [2]

జయదేవస్వామిగా వేదవ్యాసులే నిజాంశతో తిందుబిల్వ గ్రామమున జనించినారని యొక ప్రతీతి యున్నది. జయదేవుడు పదునెనిమిది క్రోసుల దూరంలో ఉన్న గంగానదికి నిత్యమూ స్నానానికి వెళ్ళి వచ్చేటవాడట. గంగాదేవి ఆయన కష్టాన్ని జూచి ఓర్చలేక ప్రసన్నరాలై “ఒకమాట, నీవు నిత్యమూ నా దగ్గరకు రాలేవు. నేనే నీ దగ్గరకు వస్తాను" అని కెందులిప్రాంతానికి వెళ్ళిందని మరొక కింవదంతి. తన కపకార మొనర్చిన చోరులు సాధు వేషముల ధరించి తిరుగుచుండగా రాజభటులు వారిని పట్టుకొనినపుడు జయదేవస్వామి వారికి రాజుసన్నిధిని సన్మానమును కల్పించి పంపుచుండగా వారిని మార్గమధ్యమున పృథ్వి తన గర్భమున జేర్చుకొన, రాజభటులు వచ్చి విన్నవించినారట! అపుడు జయదేవస్వామి యా ప్రాంతమున కేగి గరుడ వాహనుని ప్రార్థింప నాతడు ప్రత్యక్షమై ద్రోహుల్ని మరల పుడమినుండి రప్పించి పంపినట్లు మరియొక కథనము వినిపించు చున్నది.

పద్మావతీదేవి పాతివ్రత్యమును బరీక్షింప నొకమారు సాత్యకిరాజు స్వామి ఇంటలేని సమయమునందు విచ్చేసి 'మీ భర్త దుర్జనులచే హతమైనా' డని ఒక యశీకవార్త వినిపింప నామె యాత్మహత్య చేసుకొనగా జయదేవస్వామి తిరిగివచ్చి కృష్ణ సంకీర్తన మొనర్చగా నామె 'సుప్తిబోధిత' వలె మేల్కొనినట్లు మరియొక జనశ్రుతి వినవచ్చుచున్నది.

ఇట్టివి అభూత కల్పనలని త్రోసివేసినను స్వామి అసామాన్య శక్తి సంపన్నుడని అంగీకరించుట కెట్టి విప్రతిపత్తియును లేదు.

జయదేవుని జన్మస్థానం

జయదేవ మహాకవి జన్మదేశాన్ని గురించి పండిత లోకంలో భిన్నాభిప్రాయా లున్నవి. పండిత పరంపరలో అతడు ఉత్కల దేశస్థుడని ఒక అభిప్రాయం ఉంది. ఆయన వంగ దేశంలో జన్మించాడని కొందరు విద్వాంసులు నిర్ణయించారు. జయదేవ కవి తన జన్మస్థలాన్ని గురించి ఏడవ అష్టపది ముద్రికలో "తిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన" అని సూచించినాడు. కలకత్తా సర్వకళాశాలలో ఓడ్ర పండితులు, శ్రీ వినాయక మిత్రో మహాశయులు ఒకమారు శ్రీ శివశంకరులకు ఒక లేఖ వ్రాస్తూ[3] జయదేవ మహాకవి జన్మస్థానాన్ని గురించి ఇలా వ్రాసినట్లు తెలుస్తుంది.

“జయదేవుడు ఉత్కలదేశంలోనే పుట్టినట్లు నిస్సందేహంగా చెప్పటానికి తగినంత ఆధారం లేదన వలసి వస్తుంది. అయితే ప్రతాపరుద్ర మహారాజు పదహారో శతాబ్దిలో రాజ్యం చేశారు. ఆయన జగన్నాథ దేవాలయంలో దేవదాసీలు 'గీత గోవిందం' తప్ప మరేదీ పాడకూడ దన్నట్లు ఒక శాసనంలో కనపడుతోంది. మహారాష్ట్ర దేశంలో ఒకానొక వైష్ణవశాఖ వారి సంప్రదాయంలో జయదేవుడు ఉత్కలదేశంలో జన్మించాడనే ఉంది. ఇప్పటికీ ప్రతీ సంవత్సరమూ జయదేవ గౌరవార్థం వేదువి గ్రామంలో 'మేలా' జరుగుతున్నది. కాబట్టి వంగ దేశ విద్వాంసులు ఆ గ్రామమే కేందు బిల్వ మని అంటున్నారు.

ఈ లేఖనుబట్టి జయదేవుని జన్మస్థాన మిదమిత్థమని నిర్ధారితం కాలేదు. కానీ ఉత్కల దేశ గ్రంథకర్తలు జయదేవుడు 'తమవా'డని ఉద్ఘోషించినారు. గీతగోవింద ప్రతుల్లోనే కేందు బిల్వానికి తిందుబిల్వమూ బిందుబిల్వమూ అనే రూపాంతరాలు కనిపిస్తున్నవి.

కొందరు జయదేవుని కేందుబిల్వమును వంగదేశంలోని వీరభూమి జిల్లాలోని కేందులి గ్రామమని భ్రాంతి పడినారు. అది అజయనదికి ఉత్తర తీరాన ఉన్నది. అజయ భాగల్పూరు జిల్లా దక్షిణాంశములో పుట్టి నంటాల్ పరగణా దక్షిణాంశములో ప్రవహించి తరువాత వీరభూమి, వర్ధమాన జిల్లాల మధ్యగా, తూర్పుగా వెళ్ళి కాటోజార్ దగ్గిర భాగీరథిలో పడుతుంది. వీరభూమి జిల్లాకు ప్రధాన పట్టణమైన సురికి ఇది రమారమి తొమ్మిది క్రోసుల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో రాధాదామోదర విగ్రహాలు ఉన్నవి. అందువల్ల ఇది జయదేవుని జన్మ గ్రామమై ఉంటుందన్న అభిప్రాయంతో తరువాత చారిత్రక పరిశోధన జరిపినవారు ఏకీభవించటం లేదు.

వీరి అభిప్రాయంలో కెందులి ప్రాంతము పూరీ జిల్లాలోని రెహంగ్ వద్ద ఉన్న - కెందులి సానసము, కెందులి పట్నము, కెందులి దౌళి- మూడు గ్రామములలో కలసిన దేశము. ఇవి 'ప్రాచీ’నది ఒడ్డున ఉన్నవి. ఈ నది ఒరిస్సా దేశీయుల దృష్టిలో పరమ పవిత్రమైంది. ఈ నదిని ప్రాచీన మాహాత్మ్యమూ, పద్మపురాణమూ సరస్వతీనది అని వ్యవహరించినవి. 'సాక్షాత్సరస్వతీ ప్రాచీ నాన్యధా నృపసత్తమా క్రోశే, క్రోశేచ లింగాని తటే తస్యా మనోరమే' అనే కపిల సంహిత లోని శ్లోకం ఇందుకు ప్రమాణము. కెందులి గ్రామ సీమనుండి రెండు మైళ్ళ దూరంలో కుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసే చోటును జనం 'త్రివేణీసంగమ' మని వ్యవహరిస్తారు. కెందులి గ్రామంలో వాసుదేవ విగ్రహాలు నారాయణ నామంతో అనేకం కనిపిస్తున్నవి. ప్రాచీనది ఒడ్డున నిలిచి ఒకమారు సింహావలోకనం చేసే వారికి చైతన్యస్వామి కాలంలో పంచమహాపురుషుల్లో ఒకడని ప్రసిద్ధి పొందిన అచ్యుతానందుడు శూన్య సంహితలో కెందులిని వర్ణించిన అతిశయమంతా గోచరిస్తుంది. అందువల్ల జయదేవుని జన్మగ్రామం ఒరిస్సాలోని ప్రాచీననది ఒడ్డున ఉన్న కెందులి అని అనటం సమంజసం అని చరిత్రజ్ఞులు నిర్ణయించినారు.[4]

కెందులి వీరభూమి జిల్లాలోని అజయ నది ఒడ్డున ఉన్నదని కొందరు భ్రమపడి వ్రాయటానికి కారణాలు క్రింది ఈ రెండు శ్లోకాలు.


“గోవర్ధనశ్చ శరణో జయదేవ ఉమాపతిః
కవితారాజశ్చ రత్నాని సమితౌ లక్ష్మణశ్చచ”
                                         (వీరభూమి వివరణము పే 196)

"వాచః పల్లవయ త్యుమాపతిధరః సందర్భ శుద్దింగిరామ్
జానీతే జయదేవ ఏవ, శరణశ్లాఘ్యో దురూహ ద్రుతేః
శృఙ్గారోత్తర సత్ప్రమేయ రచనై రాచార్య గోవర్ధనః
స్పర్దీ కోపి న విశ్రుతిధరో ధోయీకవి క్ష్మాపతిః"
                                           (గీతగోవిందం సర్గ 1. శ్లో. 4)


ఇందలి మొదటి శ్లోకమును నవద్వీపములోని సభామంటప భిత్తిక మీద ఉండగా శ్రీవాది సనాతన గోస్వామి చూచినట్లు వంగదేశంలో ఒక ప్రథ ఉన్నది కానీ సనాతన గోస్వామి ఈ విషయాన్ని గురించి ఆయన గ్రంథాలలో ఎక్కడా పేర్కొనలేదు. అందువల్ల ఈ శోక్లాన్ని ఎవరో జయదేవుని వంగవాసిని చేయటానికి కల్పించి ఉంటారు. "వాచః పల్లవ యత్యుమాపతిధర” ఇత్యాది శ్లోకాన్ని జయదేవ మహాకవి వ్రాసి ఉంటాడని అనటానికి వీలులేదు. అది ఎవరివల్లనో 'గీతగోవిందం'లో ప్రవేశించి ఉంటుంది. గీతగోవిందప్రబంధానికి ప్రప్రథమంలో వ్యాఖ్యానం వ్రాసిన కుంభరాణా పలికిన "ఇదానీంకవిః కవి గణనాయాం పరైరపి కవిభి రహం పరిగణిత ఇతి స్వప్రశంసార్థం క్షేపకమపి తత్కృతం శ్లోకం స్వగ్రంథస్వ కుర్వన్నాహ” అన్న వాక్యం నేటి చరిత్రజ్ఞుల పైఊహకు ఉపోద్బలకంగా కనిపిస్తుంది. కుంభరాణా అభిప్రాయం కూడా దీన్ని ఎవరో గీతగోవిందంలో ప్రవేశపెట్టి ఉంటారనే.

కాబట్టి వంగదేశం జయదేవుని జన్మస్థానమని చెప్పటానికి ఎవ్విధమైన ఆధారమూ కనిపించడం లేదు. అతడు ఉత్కల దేశస్థుడనుటమే సమంజసము. దీనికి అనుగుణంగా ప్రాచీనులు వ్రాసిన గ్రంథాలలో ప్రబలాధారాలు కనిపిస్తున్నవి. సంస్కృత భాషలో భక్తమాల గ్రంథాన్ని చెప్పిన చక్రదత్తుడు జయదేవుణ్ణి గురించి వ్రాస్తూ ఆయన వ్యాస భగవానుని అవతార మనీ, జగన్నాథనిలయమైన పూరీకి దగ్గరగా ఉన్న తిందు బిల్వ మతని జన్మగ్రామమనీ చెప్పినాడు. ఇదే అభిప్రాయాన్ని గ్వాలియర్ నవజీ, మహారాష్ట్ర దేశీయుడైన మహాభక్తి విజయ కర్త మహాపతీ పలికినారు. అస్సాంలోనూ, మహారాష్ట్రంలోనూ జయదేవుడు ఉత్కల దేశీయుడేన న్న ప్రతీతి. గదుని సంప్రదాయ కులదీపికలో జయదేవుడు ఉత్కల దేశీయుడని వ్యవహృతము కావటమూ జయదేవుని జన్మదేశం ఉత్కలమనే నిరూపిస్తూ ఉన్నవి.

జయదేవుడు రాఢ దేశస్థుడని శ్రీసునీత కుమార ఛటర్జీ మతము

జయదేవుని కాలం

జయదేవ మహాకవి కాలనిర్ణయమును గురించికూడా భిన్నాభిప్రాయాలున్నవి. మేవాడ ప్రభువు కుంభరాణా గీతగోవిందానికి ప్రథమంలో వ్యాఖ్యానం వ్రాసినాడు. ఆయన క్రీ. శ.1419వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందువల్ల జయదేవ కవికూడా ఆ ప్రాంతం వాడై ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉన్నది. జయదేవుడు రామానందుని శిష్యుడని ఉన్న ఒక ప్రవాదాన్ని ఆధారం చేసుకుని కొందరు ఆయన క్రీ. శ. 14వ శతాబ్దంలో జీవించి ఉన్నాడు గనుక ఇతడు కూడా క్రీ. శ.14వ శతాబ్దివాడనినారు. 'హృది బిసలతాహోరో' అన్న జయదేవ శ్లోకాన్ని విద్యాపతి సంపూర్ణంగా ఒక గీతికలో అనుకరించటం వల్ల అందుకు కొంచెం పూర్వుడై ఉంటాడని కొందరి అభిప్రాయం. వంగ వాఙ్మయ చరిత్రకారుడు విద్యాపతి క్రీ॥శ॥ 1380 ప్రాంతమువాడని నిశ్చయించినారు. పృథ్విరాజు ఆస్థానకవి చాంద్ బర్దాయీ తన పృధ్విరాజరాసోగ్రంథంలో 'జయదేవ అఠంకవీ కబ్బిరాయం, జినైకేవల్ కిత్తగోవింద గాయం' అని చెప్పినాడు. క్రీ. శ. 1193వ సంవత్సరాన టిలైన్ యుద్ధంలో పృథ్విరాజు ఘోరీతో పోరాడి మృతినొందినాడు. కాబట్టి చాంద్ భట్టుకు జయదేవుడు పూర్వుడై ఉండాలి. జయదేవ లక్ష్మణ సేనులు సమకాలికులన్న నిశ్చయంతో రాజేంద్ర లాల్ మైత్రా జయదేవుడు క్రీ. శ.1101-1121 మధ్య కాలములోని వాడనీ, రామకృష్ణ ముఖర్జీ అతడు క్రీ. శ.1205 ప్రాంతంవాడనీ నిర్ణయించినారు. జయదేవ కవి కాలనిర్ణయమును శ్రీకరుణాకరకార్ మహా శయులు మరియొక నూతన మార్గమున ననుసరించి యొనర్చినారు. వారి మార్గము నూతనము. ప్రమాణములును నూతనములు. జయదేవ కవికిని లక్ష్మణసేనునికి నెట్టి సంబంధమును వారి నిర్ణయమున పొడకట్టదు.

క్రీ. శ. 16వ శతాబ్ధంలో ఉన్న కేశవ మిశ్రుడు తన అలంకార శేఖరంలో


"ప్రాక్ ప్రత్యక్ పృథివీభృతో: షరిషది ప్రఖ్యాత సంఖ్యావతాం
మహనీ యాద్భుత తర్క కర్కశతయా విచ్ఛిద్య విద్యామదమ్
యేకేప్యుత్కలు భూపతే తవ సభా సంభావితాః పండితాః
పత్రం శ్రీజయదేవ పండిత కవి స్తన్మూర్థ్ని విన్యస్యతి


అని చెప్పినాడు. మహారాష్ట్ర భాషలో ఉన్న కవి చరిత్రలో క్రీ. శ.14వ శతాబ్దానికి పూర్వము పురుషోత్తమదేవుడు కళింగదేశాన్ని కటకం రాజధానిగా పాలించి, ప్రజా హితాన్ని కోరి, త్రికాండ శేషహారావళి ఏకాక్షర కోశమూ వ్రాసినట్లు ఉన్నది. జగన్నాథస్వామి ఆలయంలోని తాళపత్ర లేఖనాలు (మద్లపంజి) కామార్ణవుడు అనే (క్రీ. శ. 1142-1156) ఉత్కలరాజు నిత్యమూ గీతగోవిందాన్ని వినకుండా భోజనం చేసేవాడు కాడని ఉంది. ఈ కామార్ణవుడు జయదేవుని శిష్యుడూ, సమకాలికుడూ, జయదేవుని గీతగోవిందాన్ని నిత్యమూ జగన్నాథాలయంలో చదవటానికి ఆజ్ఞాపించినవాడు. క్రీ. శ.1180-1190 మధ్యన రాజ్యపాలనం చేసిన రెండవ రాజరాజుకు పురుషోత్తమ దేవుడనే నామం ఉన్నట్లుపై లేఖనాలవల్ల తెలుస్తున్నది. అభినవ గీతగోవింద రచనజేసి ఈరాజు జయదేవ గీతగోవిందానికి బదులుగా తన కావ్యాన్ని జగన్నాథస్వామికి వినిపించవలెనని ఆజ్ఞాపించినాడనీ, అందువల్ల ఆనాటి ఉత్కల వైష్ణవలోకం పట్టుపట్టటంవల్ల తిరిగి రాజు జగన్నాథస్వామి కోరిక కారణంగా సంధికి వచ్చి మరల గీతగోవింద పఠనాన్నే ఆదేశించి, గీతగోవిందంలో ప్రతిసర్గాంతము లోనూ తన అభినవగీతగోవిందంలోని శ్లోకం ఒకటిఉండేటట్లు చేసుకున్నాడనీ రామదాసు దార్ద్యభక్తి రసామృతము వల్ల వ్యక్తమౌత్నుది.[5] ఈ పరిస్థితి నన్నిటినీ సమన్వయించి శ్రీ కరుణాకర కార్ మహాశయులు మహాకవి జయదేవుడు క్రీ. శ. 12వ శతాబ్ది వాడని నిశ్చయించినారు.

జయదేవుని ఇతర రచనలు

జయదేవ మహాకవి ఇతర రచనలను గురించి శ్రీ రాజావెంకటాద్రి అప్పారావు బహద్దురు వారి ఆంధ్రాష్టపది పీఠికలో ఇలా ఉన్నది "ఈ కవి యొక్క చంద్రాలోకము, రతిమంజరి, కారక వాదము, తత్వచింతామణి అను గ్రంథములు వీరి అసమాన పాండిత్యమును తెల్పును. శృంగార మాధవీయ చంపు, కృష్ణదాసబిరుద నామముతో రచించిన వా రీకవియే కావచ్చును” ఇందులో ఉట్టకితమైన విషయాలను చరిత్రజ్ఞు లంగీకరించటంలేదు. చంద్రాలోకంలో సమాప్తి వాక్యం ఇలా కనిపిస్తున్నది. "ఇతి శ్రీపీయూషవర్ష పండిత శ్రీ జయదేవ విరచితే చంద్రాలోకాలం కారే అభిదా స్వరూపాభిధానో నామ దశయో మయూఖః" ఇతడు వంగదేశవాసి. సుమిత్రా మహా దేవుల తనయుడు, ప్రసన్నరాఘవకర్త. చంద్రాలోకకర్త మహాదేవ తనయుడనటానికి -


"పీయూష వర్ష ప్రభవం, చంద్రాలోక మనోహరమ్
సుధా నిధాన మాసాద్య, శ్రయధ్వం విబుధా ముదమ్
జయంతి యాయక శ్రీమాన్మహాదేవాంగ జన్మనః
సూక్తం పీయూష వర్షస్య జయదేవ కవేర్గిరః" -


అన్న వాక్యాలలో ప్రమాణం లభిస్తున్నది. జయదేవ మహాకవి భోజదేవ పుత్రుడు.

'గీతగోవిందం' జయదేవ మహాకవి రచన లన్నిటిలో ఉత్తమోత్తమమైనది. కవి దీనిని ప్రబంధమని వ్యవహరించాడు. ఆద్యంతాలు పరిశీలిస్తే గీతగోవిందంలో ఏకవాక్యత గోచరిస్తుంది. అలంకారిక లక్షణాలను అనుసరించి మహాకావ్యమని



"ఇత్థం కేలితతో విహృత్య యమునా కూ లేసమం రాధయా,

తద్రోమావళిమౌక్తి కావళియుగే వేణీభ్రమం బిభ్రతి
తత్రాహ్లాది కుచప్రయాగ ఫలయో లిప్శావతో హస్తయోః
వ్యాపారాః పురుషోత్తమస్య దదతు స్ఫీతాం ముదం సంపదమ్” ద్వా. సర్గ

అన్న శ్లోకం అందువల్లనే ప్రవేశించి ఉంటుందని పండితాభిప్రాయం.

అనిపించుకోక పోవచ్చును. అయినా ఇది రసవత్తర మహాకావ్యమని అనటానికి

ఎటువంటి సందేహమూ లేదు.


"యద్గాంధర్వ కళాసు కౌశల మనుధ్యాయంచ యద్వైష్ణవం
యచ్ఛృంగార వివేక తత్వరచనా కావ్యేషు లీలాయితమ్
తత్సర్వం జయదేవ పండిత కవేః కృష్ణైకతానాత్మనః
సానందాః పరిశోధయంతు సుధియః శ్రీ గీతగోవిందతః"


అన్న వాక్యాలలో కవి రాధాకృష్ణుల అన్యోన్య ప్రేమను గానం చేసి అందలి పరమ శృంగార భావంలో విలీనులై కేవలులు కావలసిందని రసికలోకాన్ని హెచ్చరించాడు. నవ విధభక్తి మార్గాలలో 1) పితాపుత్ర 2) రక్ష్య రక్షక 3) ఆధారాధేయ 4) శరీరాత్మ 5) జ్ఞాతజ్ఞేయ 6) భోక్తృభోగ్య 7) స్వస్వామి 8) భార్యభర్తృ 9) శేషశేషి అష్టమమైన భార్యా భర్తృ భక్తి మార్గం గీతగోవిందంలో నిరూపిత మౌటంవల్ల దీనికి అష్టపది అనే నామం అబ్బి ఉంటుందా?

నేడు గీతగోవిందం జగద్విఖ్యాతి పొందిన మహాగ్రంథం. ఇది బహుకాలం క్రిందనే పాశ్చాత్య దృష్టి నాకర్షించింది. దీనిని సర్ విలియం జోన్సు, ఎడ్విన్ ఆర్నాల్డు మహాశయులు ఆంగ్లభాషలోనికీ, లాసన్ లాటిన్ భాషలోనికీ, రూకెట్ జర్మన్ భాషలోనికీ అనువదించారు. ఉత్కలరాజు గీత గోవిందాన్ని అనుకరించి అభినవ గీతాగోవిందాన్ని రచించినాడు.[6] 'సంస్కృత భాషలో గీతగోవింద ప్రభావం వల్ల అనేక 'హర-గౌరులు' 'రామ-సీత'లు జన్మించినవి. అటువంటి వానిలో క్రీ. శ. 15.16 శతాబ్దుల నాటి రాయ రామానందుని జగన్నాథ వల్లభ నాటకము, కృష్ణలీలామృతము (కర్త వనమాలి, అముద్రితము – 15వ శతాబ్దము). క్రీ.శ.17వ శతాబ్ది నాటి యతీంద్ర రఘునాథసూరి ముకుంద విలాసము (అముద్రితము) ముఖ్యమైనవి. ఒరియాభాషలో పిండిక శ్రీచందనుని (క్రీ. శ. 17వ శతాబ్దము) సంవత్సరము, దిన కృష్ణ దాసు (క్రీ. శ. 17వ శతాబ్దము) అమృత సాగరబోలి, దేవ దుర్లభదాసు (క్రీ. శ. 16వ శతాబ్దము) రహస్యమంజరి మొదలైనవి. అష్టపది ప్రభావం వల్ల జన్మించిన గ్రంథాలు, గీతగోవిందానికి లభించిన అనన్య సాధారణఖ్యాతి కారణంగా ఒరియా భాషలో దానికి అనేక పద్యకృతులు ప్రభవించినవి. ఈ పద్యానువాదాలల్లో ప్రముఖమైనవి- 1.రసవారిధి - బృందావనదాసు (క్రీ. శ. 15వ శతాబ్దము) 2. గీత గోవిందము - ఉద్దవదాసు (క్రీ. శ. 16వ శతాబ్దము - కమ్మరి) 3. త్రిలోచనాదాసు - గీతగోవిందము (క్రీ. శ. 17వ శతాబ్దము - అంబష్ఠకుడు) (4,5) సదానంద కవిసూర్య, ధనుర్ధర దాసుల గీతగోవిందములు (17వ శతాబ్దము). స్వల్పమైన సంస్కృత వాఖ్యానంతో గద్యానువదితమైన గీతగోవింద ప్రతి ఒకటి కనిపిస్తున్నది.[7]


గీత గోవిందం కావ్య బాహ్య స్వరూపాన్ని తిలకించి కొందరు అందులో నిరూపితమైన భక్తి మార్గాన్ని అవగతం చేసుకోలేక కేవలము శృంగార సంబంధమైన అసత్కావ్యంగా పరిగణిస్తున్నారు. అది పొరపాటు. ఒరియా దేశంలో భాగవత సమాజాలు, గీతగోవింద ప్రతి లేనిదే సంకీర్తనలు ప్రారంభించవు, కృష్ణాష్టమినాడు కళింగంలోనూ కార్తీక శు-11 నాడు పశ్చిమ భారతంలో వల్లభ శిష్యులూ, గీతగోవిందాన్ని భక్తి తన్మయతతో గానం చేస్తారు. జైన రాజు శ్రీహర్షుడు కూడా క్రమసరోవర భ్రమణ సమయంలో గీతగోవిందాన్ని పాడించడం దాని ఆధిక్యానికి మరొక నిదర్శనం. విక్రమ సేన మహారాజు సభలో సంగీత విద్వాంసులు గీత గోవిందాన్ని గానంచేసి నట్టు చరిత్రలు చెప్పుతున్నవి.

గీతగోవిందం మొదట పశ్చిమాపభ్రంశభాషలో గానీ, ప్రాచీన వంగభాషలో గానీ పుట్టి, సంస్కృత భాషలోనికి అనువదితమై ఉంటుందని కొందరు విద్వాంసులు సంశయించినారు[8] దీనికి ముఖ్యమైన కారణం అష్టపదులను బోలిన అవపుట్టములను

మాత్రాఛందస్సులు ప్రాకృత పింగళములో కనిపించటము.


అష్టపదిలోని కవితను గురించి జయదేవ కవిచెప్పుకొనిన

'యది హరిస్మరణే సరసం మనో
యది విలాస కలాసు కుతూహలమ్
మధుర కోమల కాన్తపదావళీమ్
శృణు తదా జయదేవసరస్వతీమ్'. ప్ర. సర్గ, 3వ శ్లో.


అన్న వాక్యములు ఎంతో సమంజసమైనవి. భాగవతానికి ద్వాదశ స్కంధాలు వలెనే దీనికి ద్వాదశ సర్గములు. సర్గనామములు సాభిప్రాయములు-సామోద దామోదరము, ఆక్లేశ కేశవము, ముగ్ధమధుసూదనము ఇత్యాదులు. రసము శృంగారము పది సర్గలవరకు విప్రలంభ శృంగారము, ఏకాదశ ద్వాదశ సర్గలలోని శృంగారము సంభోగము. నాయకుడు గోవిందుడు నాయిక రాధ.

జయదేవ కవి రాధ ఇంద్రాణి యైనట్లు జయదేవ స్వామి చరిత్రలో ఇలా ఉంది. "తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్య రమయైన ఇంద్రాణి వైకుంఠ ధాముని దర్శించటానికి వెళ్ళి అతని నవమన్మథ మన్మథాకృతి దర్శించినంత మాత్రాన మోహబాణ పాతాలకు స్వామిని చూచి "ఓ దీనార్తి హరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే” అని ప్రార్థించింది. భగవంతుడు ఆమెను చూచి "నేను సాధుసంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోరథసిద్ధి పొందుదువు గాక" అని అనుగ్రహించినాడు.[9]

గీత గోవిందానికి అనేక వ్యాఖ్యానాలు జన్మించినవి. వాటి అన్నిటిలో కుంభరాణా కృతమైన 'రసికప్రియ' మేల్తరమైనది. ఈ వ్యాఖ్యానంలో నిరూపితాలైన రాగాలనే కర్నాటక గాయకులు ఆదరిస్తున్నారు.[10] పెనుగొండ సామ్రాజ్యాధిపతి తిరుమల రాయలకాలంలో గీత గోవిందానికి ఆంధ్రులు ఒక వ్యాఖ్యానం వ్రాసినారు. ఇందు అష్టపదులలో భావములకు నాట్య శాస్త్రమును సమన్వయించుట విశేషము. ఆ ఆభావముల కనుగుణములైన అంగన్యాస కరన్యాసాదికములు ఈ వ్యాఖ్యానమున ప్రత్యేకముగా నిరూపితములైనవి. పీయూషలహరి : జయదేవుడు

జయదేవకవి కృతమైన 'పీయూషలహరి' నూతనంగా లభించింది[11] ఇది ఒక గోష్ఠీ ప్రబంధము. సాహిత్య దర్పణంలో చెప్పిఉన్న ఈ గోష్ఠీ లక్షణాలల్లో కొన్ని మాత్రమే పీయూష లహరికి పట్టినవి.


"ప్రాకృతైర్నవభిః పుంభి ర్దశభిర్వాప్యలంకృతా
నోదాత్త వచనా గోష్ఠీ కైశికీ వృత్తి శాలినీ
హీనగర్భ విమర్శాభ్యాం పంచషట్యోషి దన్వితా
కామ శృంగార సంయుక్తా స్యా దేకాంక వినిర్మితా-

సా.ద-షష్ఠ పరిచ్ఛేదం.


'గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు. అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులుండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి, కామశృంగార ప్రధానం, 'పీయూషలహరి' ఇంతకంటే విశిష్టం. గుణోత్తరం.

ప్రాచీనకాలంలో జగన్నాథస్వామి ఆలయంలో అనేకములైన ఏకాంక నాటికలను ప్రదర్శించేవారు. పీయూషలహరిని కూడా అటువంటి నాటక సమాజంతో కలిసి జయదేవుడు ప్రదర్శించినట్లు పీయూషలహరిలోని "గోష్ఠీ శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే సర్తితుమ్” అన్న వాక్యం వల్ల వ్యక్తమౌతున్నది. ఇటువంటి నాటక సమాజాలు నేడు కూడా అచ్యుతానంద సంప్రదాయులైన వైష్ణవుల్లో కనిపిస్తున్నవి. వీరు రాధను ప్రధాన నాయికగా గ్రహించి జగన్నాథ స్వామి ముందు రాసక్రీడలు సలుపుతుంటారు.

పీయూషలహరికి కథావస్తువు గీతగోవింద కథావస్తువే. రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపటము కథాంశము. అందువల్ల పీయూషలహరిని గీతగోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడినాడు.[12] దీనిని బట్టి జయదేవకవి ఈ రెండు రచనలను పురస్కరించుకొని రాసలీలా స్వరూపాన్ని పూర్ణంగా ప్రదర్శించినాడని ఊహింపవచ్చును.

కవి స్వోత్కర్షగా చెప్పుకున్న గీతగోవిందంలో 'సాధ్వీ మాధ్వీక! చింతా నభవతిభవతః' ఇత్యాదులను పోలిన శ్లోకాలు పీయూషలహరిలోనూ కనిపిస్తున్నవి. అందుకొక ఉదాహరణ :


"ఆశ్మద్రవీకర్తు మిమౌ సమర్థౌ, చతుర్దిశా నామపి పిష్టపానామ్
అహం వచోభి ర్జయదేవ నామా, కరచ్ఛటాభిశ్చ తుషారధామా”
“పరుషాశ్మము గరగించుట, కిరువురకే యనువు గలుగు హృద్యవచో వి
స్ఫురణను నే జయదేవుడ, కరముల చలువను దుషారకరు డొక్కరుడున్"[13]


కృష్ణ భక్యైకతాను డైన జయదేవకవి పీయూష లహరీ ప్రారంభంలో నటరాజు నుద్దేశించి క్రింది నాందీ మంగళశ్లోకాన్ని చెప్పటం గమనింప దగ్గ విషయం.


"కింజల్క ద్యుతిపుంజ పింజర దళ త్పంకేరుహ శ్రీవహమ్
శంపా సంపతి తాంశు మాంసల శరత్కాందబినీ డంబరమ్
లాస్యోల్లాసిత చండ తాండవ కళా లీలాయితం సంతతమ్
చక్రప్రక్రమ వృత్త నృత్త హరయో నిర్వ్యాజ మవ్యాత్ జగత్"

"పరితః కేసర పుంజ పింజర దళ త్పంకేరుహాకారమై
దర శంపా రుచిరాంశు మాంసల శరత్కాదంబినీ డంబర
స్ఫురణన్ పర్వత కన్యకా మధు నట త్ఫుల్లాస్య లాస్యాంచితం
బరుదౌ శంకర చండ తాండవము నిర్వ్యాజమ్ము మిమ్మోముతన్ ".[14]


'కోమలకాంత' పదావళులతో, కైశికీ వృత్త్యుపేతమై, లాస్యోచితమై పీయూషలహరి ప్రాచీన గోష్ఠీ ప్రబంధానికి ఒక ప్రముఖ లక్ష్యంగా ఒప్పుతున్నదనటం నిస్సంశయము.

వైష్ణవం

జగన్నాథస్వామి ఆలయంలో పీయూషలహరిని వసంతంలో రూపించినారు. జయదేవుడు గీత గోవిందంలోనూ, పీయూషలహరిలోనూ నిరూపించిన 'రాసలీల' భాగవత పురాణాన్ని అనుసరించింది కాదు. భాగవత రాసలీల శరత్తులో జరుగుతుంది. జయదేవునికి మూలం బ్రహ్మవైవర్తము. అందులో రాసోత్సవాన్ని గురించి కృష్ణ జన్మ ఖండంలో ఇలా ఉంది. “రాసోత్సవం మహద్రమ్యం సర్వేషాం హర్షవర్ధనమ్, పూర్ణచంద్రోదయే సక్తం వసంతే రాసమండలే..... ఏకదా శ్రీహరిర్నక్త వనం బృందావనం యయో, శుభేశుక్ల త్రయోదశ్యాం పూర్ణ చంద్రోదయే మఘౌ.... యూధికా మాధవీ కుంద మాలతీ పుష్పవాయునా, వాసితం కలనాదేన మధుపానం మనోహరమ్". ఈ రాసలీల మూడు దినాలు మాత్రమే. భాగవత రాసలీల వంచశరద్రాత్రులు. జయదేవుని తరువాత జన్మించిన అనేక వైష్ణవ కవులు కూడా ఈ బ్రహ్మవైవర్తరాసమే అనుసరించారు.

జయదేవుని గీతగోవిందమూ, పీయూషలహరి అర్థం కావటానికి ఒరిస్సా వైష్ణవాన్ని గురించిన విజ్ఞానం కొంత అవసరము. కళింగదేశంలో క్రీ. శ. 8 శతాబ్దములో ప్రవేశించిన మహాయాన బౌద్ధం క్రమంగా వజ్రయాన, సహజయానాలుగా రూపొందింది. క్రీ. శ. 729 నాటి ఒరియారాజు ఇంద్రభూతి, చెల్లెలు లక్ష్మింకర వల్ల సహజయానం ఆదేశంలో ప్రవేశించిదని ప్రతీతి. ఇంద్రభూతి జ్ఞానసిద్ధిలో జగన్నాథుని బుద్ధదేవునిగా స్తుతించాడు. సహజయానాన్ని ప్రచారం చేసినవారు కౌపవాదులు ఓడ్రదేశీయులు. వజ్రయాన సహజయాన వైష్ణవాలు కలిసి ఓడ్రదేశంలో నూతన వైష్ణవానికి దారితీసి ఉంటవి. దానికి ముఖ్యమైన ప్రవక్తలు-జయదేవుడు, రామానంద రాయలు. సహజయాన పంథేయులు జయదేవుణ్ణి ప్రథమ ప్రవక్త గానూ, నవరసికుల్లో ఒకడిని గానూ పరిగణిస్తారు. క్రీ. శ 15, 16, 17 శతాబ్దాలలో ఓడ్ర రచయితలు సరళదాసు, బలరామదాసు, అచ్యుతానందులు, పీతాంబరుడూ మొదలైన కవులు సహజయానాన్ని అనేక గీతాలలో ప్రశంసించారు.

రామానుజ మధ్వాచార్యు లిరువురూ పూరీ జగన్నాథానికి వెళ్ళి వైష్ణవతత్వాన్ని ప్రచారం చేశారు. తరువాతి వాడైన జయదేవుడు వారి ప్రభావం వల్లనూ, అనాదినుంచీ వస్తూ ఇంద్రభూతి చెల్లెలు తెచ్చి పెట్టిన సహజయాన బౌద్ధ ప్రభావం వల్లనూ నూతన రాధాతత్వాన్ని సాధించి ప్రబోధించినాడు. దానిని స్వీకరించి క్రమంగా అద్వైతాచార్య, ఈశ్వర పూరీలకు గురువైన మహేంద్రపురి వంగదేశంలో ప్రవేశపెట్టినాడు. ఆయన శిష్యుడైన ఈశ్వరపూరీకి చైతన్యమహాప్రభువు శిష్యుడు. చైతన్య ప్రభువు జయదేవుని భక్తి జ్యోతిని అందుకొని వంగవైష్ణవ ప్రపంచాన్ని ఉద్యోతితం చేశాడు. అందువల్ల వంగవైష్ణవానికి ప్రథమ ప్రవక్త జయదేవుడే అని నిరూపితమౌతున్నది.[15]

అట్టి వైష్ణవభక్తికి 'పీయూషలహరీ' 'గీతగోవింద'ములు ప్రాణ ప్రవాహికలుగా చెప్పగదినవి.

కృతజ్ఞత

శ్రీ జయదేవకవి విరచిత 'పీయూషలహరి' మూలప్రతి నా కంటబడి నాలుగు దశాబ్దాలు గడిచాయి. కంటబడిందే తడవుగా దీన్ని గూర్చి భారతిలో (వికృతి - మాఘం) ఒక సుదీర్ఘ వ్యాసం వ్రాశాను. అనేక రసజ్ఞుల అభినందన లందాయి.

ఇది మహాకవి జయదేవుని రచన. ఆంధ్రులకు ఇష్టమైన అష్టపదులుగల గీతగోవిందానికి పూర్వరంగమైన గోష్ఠీరూపకం - పీయూషలహరి. తెనుగు చేసిందాకా కునుకు పట్టలేదు తెనుగు చేశాను - ఆనందంలో ఆవేశంలో.

ఆంధ్రులకు ఆవేశమున్నంతగా ఆలోచన ఉండదని ఒక అపప్రథ ఆలోచన వుండివుంటే అప్పుడే ఈ అనువాదాన్ని అచ్చువేసి, అందరి అందు బాటులోకి తెచ్చివుండేవాణ్ణి తేలేదు. అదీ ఒకందుకు మంచిదే అయింది.

నా దగ్గర ఈ అనువాదమూ, దీనికి మూలమూ ఉన్నాయని పసిగట్టిన మిత్రులు - సత్కవి - శ్రీ ఊట్ల కొండయ్యగారు. వారిని వెంటబెట్టుకొని, ఉభయ కవిమిత్రులు డా. వి. వి. యల్ నరసింహారావుగారు 18-6-1989న, నా దగ్గరకు వచ్చి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణగా దీన్ని ముద్రించుకొనేందుకు అనుమతికోరారు. అంతకంటే కావలసిందేముందని 'సరే' నన్నాను. మూలప్రతులూ, అనువాదమూ, భారతిలో ముద్రితమైన పీఠికా రూప వ్యాసమూ అందచేశాను.

కాని డా. నరసింహారావుగారితో ఒక్కమాట అనక తప్పలేదు. 'నేను పీయూషలహరి తెలుగుచేసి దాదాపు నలభైయేళ్ళయింది ఇప్పుడు నాకు డెబ్బై యేళ్ళు దాటాయి. అనువాదంలోని ఔచిత్యాలనూ, పాఠ పరి పరిష్కారాలను సరిచూడవలసిన అవసరం వుంది. ప్రస్తుతం నాకు వాటిని సరిచూచే ఓపిక లేదు. కాని మీరున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం డైరెక్టరుగా చిరకాలం బహుభాషా గ్రంథాల పరిష్కరణ ప్రచురణ బాధ్యత వహించి, పండిన అనుభవంగలవారు. ఈ పీయూషలహరికి కూడా పాఠ పరిష్కారాది సంపాద కత్వ బాధ్యతలు మీరే వహించటం సబబుగా వుంటుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ విభాగం అధికారిగా ఇది మీ విధికూడా కావచ్చునేమో!' అన్నాను.

అవును వారు తమ విధిని యథావిధిగా నిర్వర్తించారు.

దాని ఫలితమే ఈ పీయూషలహరి పరిష్కృతప్రతి.

మూలానువాదాలు రెండింటినీ ప్రచురణకు అనుమతించిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఉదాత్త సంకల్పానికీ, ఉదారాశయానికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.


(సం) శ్రీ వావిలాల సోమయాజులు








శ్రీ జయదేవ కవి విరచిత

పీయూషలహరి

(గోష్ఠీ రూపకము)





అనువాదకుడు

వావిలాల సోమయాజులు

'పీయూష లహరి'లో పాత్రలు


మాధవుడు నాయకుడు
రసాలకుడు సఖుడు
రాధిక నాయిక
నవమాలిక సఖి
ప్రేమకళ సఖి
వకుళమాలిక సఖి

పీయూషలహరి

నాంది


ప్రకట : కేసరపుంజ పింజర దళత్మనక
          పంకేజ విలసనము శంపా మనోజ్ఞాంశు
          మధు శర త్కాదంబినీ డంబరోజ్జ్వలము
          పార్వతీ మృదునటోల్లాస లాస్యాంచితము
          చక్రక్రమోన్నట త్సాంబశివ చండ తాం
          డవము నిర్వ్యాజమ్ము క్షేమ ప్రదమ్మగుచు
          సంపూర్ణ దృష్టితో జగము నేలెడు గాత! 1

          క్రీడగా కంపించు చంపకమ్ములు గాలి
          దేలి చుంబింపగా లీల దూలెడి నల్ల
          కలువపూ సొగసు నొల్కించుచును తేలగా
          రాస లీలా విలాసముల లాలసలతో
          వల్లవీ పల్లవీకృత వల్గిత జ్యోతి
          నిరతమ్ము మా యెదల నెలిమి శోభించుతను. 2


నాంద్యంతము


సూత్రధారుడు : (ప్రవేశించి) ఆలస్య మెందులకు? (పరికించి) అహో! ఈ
                     మధుమాస మెంత మధురముగా నున్నది!

                     పంపాసరస్సులో కంపించు నలలలో
                     పర్వెత్తి చల్లనై సొంపులను జల్లు మ
                     ల్లీ ముకురములపైన చూరాడి వింతగా
                     మధుపములు హల్లీ సకం బాడ అబ్జముల


1. ఈ నాందికి డా. ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్యానువాదము పీఠికలోని 15వ, పేజీలో

కలదు.


          సిగ్గువడ చుంబించుచున్ మారుతుడు లతా
          బృందమున నాడెడిని మందమందమ్ముగా, 3

ఓహో : భాగవతజన శీతమయూఖుడును, నీలాచల మౌళి మండన
         మణియు నయిన గరుడధ్వజుని యనుగ్రహమున నాయన
         ప్రాసాదము నందు ప్రసన్నులై సామాజికు లెల్లరును గోష్ఠి గావించి
         యున్నారుగదా! మఱియు నొక విశేషము.

         మించు మించిన చిత్ర పృథుచంచలత్వమ్ము
         చేతశ్చమత్కార చటుల సంచారమ్ము
         పీయూష రుఙ్మండలీ స్రవత్ స్వచ్ఛమ్ము
         సంచలన్మృగదృశా చలదపాంగమ్ము
         ఆనంద సంధాయినియునైన జయదేవ
         మహనీయ పండితమణిగోష్ఠి వర్తించు
         మనసార నర్తింప మోహనము రూపకము 4


(యవనికవైపు విలోకించి) అహో! నా యీ యల్పకుటుంబ విశేష పేశలత్వము నేమని విన్నవించగలను? ఉదాహృతికి.


         పెన్నెరు లెన్నో ప్రియమున నొక్కతె
         పెన్చుచునున్నది వంకలు వంకలు
         మంజుల మకరీ శోభల నొక్కతె
         కులికెడి కుచముల మలచుచునున్నది
         ఎంతో యందముగా వలయానికి
         ఇంకొకకాంత వహించెడి భుజముల
         కన్నుల బెళ్కులు కన్పించెడి నదె
         కాటుక నీటుల బోటి యొకర్తుక. 5


అందువల్ల నేను సైతము పారిపార్శ్వకుని చేత రంగమంగళమును తరంగింపచేయు దును. ఓరి వత్సా, శృంగారకా! ఇటు రమ్ము.

పారిపార్శ్వకుడు : (ప్రవేశించి) భావుకా, (బావా!) ఏమి విజ్ఞాపించు చున్నావు?


సూత్రధారుడు : విమలౌ జ్ఞానులకు విపులముగ నమలగతి
                     చిత్తఖంజన చర్య, రంజనోజ్జ్వలకర్మ
                     గావింపగా లేనిదౌ నాట్యరంగమ్ము


                     ఆ ప్రేమ సంయోగమైన నెద్దియు గాని
                     గాన గల్గెడు నట్టిదౌ ఫలమ్మది యేమి? 6

పారిపార్శ్వకుడు : అయినచో మన కిప్పుడింత భావబంధురమైన ప్రబంధమెయ్యది?

సూత్రధారుడు : ప్రణయకోపముగొన్న పడతి పల్కెడి రీతి
                     వింత వాక్కుల పగిది విన ముచ్చటలు గొలపు
                     ఉరముపైని పటాంతరమునందు క్రీడించు
                     నురుకుచంబుల రీతి నొప్పు కనుపండువుగ
                     అల గవాక్షమునుండి తిలకింప గనుపించు
                     నమృతాంశు సామ్యమౌ నతివవదన మ్మటుల. 7

పారిపార్శ్వకుడు : (పరీక్షణగా అంతటి కవి యెవరు?

సూత్రధారుడు : “పదునాలుగు భువనమ్ముల
                       పరుషాశ్మము కరిగించుట
                       కిరువురె కడు శక్తియుతులు
                       చతుర వచుడు జయదేవుడు
                       అమృతకరుడు శశిదేవుడు” 8

                       అని యనుటకు సమర్థుడు.

పారిపార్శ్వకుడు : (నేపథ్యమున కభిముఖుడై) అట్లయినచో గోష్ఠీనర్తనాభినయ
                        కోవిదులయిన కుశీలవులు సిద్దపడుడు.

                        (నేపథ్యమున) సఖీ! ఇటు, ఇటు!

సూత్రధారుడు : (వీక్షించి ఓహో! అభినేత్రులయిన యీ భరతులది యెంతటి
                      రసావేశము! రంగమంగళము వీణాశూన్యముగానే
                      ప్రారంభించినదే!

                      చంద్రకళాకాంతి కరణి
                      తా శంకావహ యౌగద
                      ఈ పంకజముఖి వచ్చిన
                      నింకొక సఖి యామె ప్రక్క



8. దీనికి డా.ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్యానువాదము పీఠిక - 14వ పేజీలో కలదు.


                    మోహపునడకల మెలపుల
                    రోహిణి గతి నున్నది గద! 9


ఇక మన ముభయులము మాధవ రసాలకుల భూమికల ననువర్తింతము

(ఉభయులు నిష్క్రమింతురు)

ఇది ప్రస్తావన

(ఇరువురు సఖీమణులు ప్రవేశింతురు)


ఒకతె ఓహో, ఓవామాక్షీ! ఉజ్జ్వలుడౌ మాధవుండు
                  వల్లవీ ప్రపంచమందుపంమమున నాలపించి
                  మోహపరచకుండు నెవరి మానసంబు వంచకుండు? 10

మరియొకతె : అవునే ఓ రాధికాసఖీ! నిన్ను బోలినవారి విషయము వచింప
                  నవసరము లేదు.
 
                  వెచ్చదనంబునకు నొచ్చి నిశ్వాసములు
                  చెక్కిళ్ళపై జేరి చందనాకులతమెయి
                  కర్పూర జలధిలో గలుగునట్లుగ పాండి
                  మమున మగ్నంబయ్యె మృదులమౌ తనుశోభ
                  కార్శ్వంబు నేర్పె నిదె కౌనుదీవియకు శుష్య
                  చ్చంద్ర రేఖాచ్ఛవిని చారు తర సుందరీ!
                  నంద నందన రూప సౌందర్య సౌభాగ్య
                  శోభలను గ్రోలినవె, శుభ్రములు నీకనులు? 11

రాధిక  : సఖీ, నవమాలికా! ఈ యాకాశ లేఖినీ వర్ణ మెందు
                 కారంభించుచున్నావు?

నవమాలిక :నిను బోలిన సుముఖుల కెటు
                లనురాగము దాగు నెదల?
                ఇరుల-వల్లరులు డాగివ
                విరుల సౌరభములు వీచు. 12

రాధిక.  : ఇక నా రెండవ ప్రాణమవయిన నీ యొద్ద దాపరిక మెందుకు?
                వినిపింతును.


                 ఏ తరిని కేశవుం డింపుగా వేణువును
                 మంద మృదు ధోరణుల నొంది యూదగ నెంచు
                 నపుడు పద్మాయతాక్షుల యాత్మలందు మద
                 నార్తిహేతువుగాగ నూర్చె వేడిమియూర్పు
                 లధరాళ మ్లానిమను నందముగ రూపించు
                 అంతేకాదు.

                 హర్ష యోగ్యమ్ము కేదారరాగమునందు
                 మధురముగ స్రవియించు మంజుమురళీ స్వనము
                 పద సరోజ స్వర్ణకటక నిర్వాణ మే
                 నియు నింత మోహనమ్ముగ జెలంగగ లేదు. 14

నవమాలిక: (పరీక్షగా జూచి శిరసు నించుక యూపుచు) తెరలో నుండి ఎవరో
                రాధికా లోచనములను మూయుచున్నారు.

రాధిక.  : (సీత్కారముతో)
               ఓ రతి లంపట మానస,
               ఓ మాధవ, ఇది యేమిటి?
               కన్నుల చలియింప జేయు
               కరతలముల దొలిగింపము
               పరమభక్తి షట్పదమై
               పాదపద్మ సేవికగా
               ఓ మురారి! ఇదిగో నీ
               రాధిక, ఇదిగో, యిట నున్నది. 15

సఖి  : (రాధికాచిబుకమును పైకెత్తి) నీ సతీవ్రత మాహాత్మ్య మిదియేనా?

రాధిక.  : (లజ్జచే మోము వంచి) సఖీ! భ్రమచే నిట్లంటిని.

సఖి.  : సఖీ! కాదు, కాదు, విభ్రమముచే నంటి ననుము.

రాధిక.  : పేశలము రమ్యమ్ము నాసికా భూషణమ్ము
              కుండలమనోజ్ఞ మండితము గండస్థలము
              నవనీలకుంతల వికుంచితము పింఛమ్ము
              ముల్లోక మోహన తమాల నీలిమను, కాం


             చీ పటముతో వెలయు మాధవుడు, ప్రణయపతి
             ప్రాణమును మించు మాధుర్యమని యనిపించు 16

సఖి : ఎక్కువయా? అందఱకు నెక్కువయే. అయినను కులాంగనలకు
             నిందాపరుల పిశాచతాండవ జిహ్వను నివారించుట సముచితము
             సుమా!

రాధిక : సఖీ! నవమాలికా! విషమసాయక బాణపాతము వలన గలిగిన
            మర్మవ్యథ నీ వంటిదాని కేమి తెలియును అవసరమైన యెడ
            ప్రేమకళ నడుగుము.

ప్రేమకళ: గురుభీతియు, జననిందయు
            ముమ్మాటికి జేరనటుల
            పతిభక్తికి రక్షసేయ
            ప్రతినసేయవలయు గదా!
            మరచితివే, ఓ సఖియా!
            మానితివే మరి నీ వది!
            విభుని లేత చిబుకమ్ముల
            నూటలూరు మృదు పవనము
            లూదెడు వంశీస్వనములు
            ధీ పాటవ విశ్లధత్వ
            మిడవచ్చును మందముగా 17

రాధిక : (వంశీనాద మాలించి ప్రేమావస్థ నభినయించును)

ప్రేమకళ: పులకలను నెడనెడను పొటమరించిన చెక్కి
            ళుల నిగ్గుతోడి మధుశీత్కృతావళులతో
            ముఖసరోజము కాగ ముగ్ధరుచికోశమ్ము
            కుచకాంచనాద్రులను స్రవియింప ముచ్చెమట
            మదనహేతి విఘాత భీతవై, సకియరో,
            పలుమారు దీనముగ వణకెద విదేలనే? 18

రాధిక : (నీవీ సంయమము నభినయించును)


నవమాలిక : (హాస మొనర్చుచు)
                  ఓహోహో పృథునితంబ, ఓహో ఓ కోమలాంగి!
                  నీవీ బంధన చతురిమ కేల యింత శ్రమపడెదవు?
                  పీతాంబరుడై మురహరి స్మిత మధుర ప్రియవీక్షణ
                  మొనరింపగ నిలువలేక లొంగి బద్ధవైపోవా? (19)

రాధిక : (నవమాలికను విలోకించి యానందముతో)
                  ఓహోహో, హరిమురళీ
                  సుస్వనోహ లూర్జితములు!
                  వరసతులకు గలిగె నవే
                  చికుర పాళి పులకలు చెలి !! (20)

నవమాలిక : (లజ్జతో మోము వంచుకొని స్వగతముగ)
                 కాంచన మృదువసనధారి, శ్యామల తనుకాంతియుతుడు,
                 గోపాలుడు కనుపింపడు ఏ విభు నేత్రాంచలమ్ము
                 లేపుజూపు సమయమ్మున పూర్ణేందుడు మృగనయనల
                 పై జల్లెడు తిందుక పావకము, మృత్యువిహరణములు
                 మలయజగంధములు తాపకందళములు, బ్రతికె వారి
                 శాత్రవు, డిక కంఠమాల యమవార్తావహ యగునా !
                 ఆ మురహరి, మాధవుండు, ఆ సుందరగోపాలుడు
                 ఎయ్యెడ గనుపింపడు, మరి యీ తలిర్చు దశ లేమో! (21)

                 లేక, యొకవేళ

                 విషమాస్త్రు డిడిన యురిత్రాడు మురహరుని వం
                 శీ నినాద మ్మెపుడు తరుణ వనితల కమ్ర
                 కంఠముల నిరికెనో యపుడు పులకల గండ
                 పాళితో జిక్కినది సౌభాగ్య బంధనము. (22)

                 (నేపథ్యమున)
                  దేవతల పైడిమకుటాల వెలుగుల నొరసి
                  యెవ్వాని శ్రీపాదకంజములు కందినవో
                  యాతడే మన్మథ విరాళిగొను వ్రజకాంత
                  లను మనుపు, రాగరసిక శ్రేష్ఠు వ్రజరాజు
                  గని కొలిచెదను నేను పరమ ప్రణయమ్ముతో. (23)


ప్రేమకళ : రసాలకుడు హస్తగత చిత్ర ఫలకముతో నిటె వచ్చుచున్నాడు.

రసాలకుడు: (వర్ణితు డయినట్లు ప్రవేశించి)
                  తారహార సుందరు ఘను
                  నీల నీరదోరు ధాము
                  పాలితువలె లీల గొలుతు,
                  వామనీకృతస్తనాంత
                  వల్లవీ నికామ కామ
                  నీతిరసికు ప్రేమ గొలుతు. (24)

రాధిక : ఈ రసాలకుని హస్తమునందున్న యీ చిత్ర ఫలకమే సర్వానర్ధ
                   కందళ ములకును మూలకందము.

నవమాలిక : సఖీ ! నీవే దీని నంకురింపజేసితివి. “దీనిని వకుశమాలిక చేతి
                   కీయవల" డని నేను ముందే వంచించితిని కదా !

ప్రేమకళ : సఖీ, రాధికా! చపలత్వముచేత నది దాని నెటనో పారవైచి
                   యుండును. దాని నిప్పు డీ వటువు గైకొనినాడు. మరి యిప్పుడు
                   మనము దీనిని గ్రహించు టెట్లు?

రాధిక : నే నిప్పుడీ విషయమునే యోజించుచున్నాను. ఎట్లయినను సరియే
                  కాని యిది మాత్రము గోవిందకరా రవింద మరందముచే
                  నభిషికత్తము కారాదు.

నవమాలిక : అనుమానమేల? అట్లగుట నిశ్చయము.

రాధిక : ఫలితమును బట్టి నిర్ణయ మొనర్తము లెమ్ము.

రసాలకుడు: (ప్రవేశించి) శుభమగుగాక!
                 (చిత్ర ఫలకమును సమర్పించును)

అందఱును: (ఫలకమును జూచి)
                  చిరు చంద్రకళ వెటుల నెడబాటు నోర్చుకొని
                  తప్తచింతామణివిగా నిల్చితివి నీవు
                  మదన దారుణ తాపధాటి కెటొ మేమే చ
                  కోరముల భాతి చిత్తోద్వేగమున చోర


                  గతి జేరి నిను, దారటాడితిమి తన్విరో!
                  నిండుగా గల్పించు నిది యెల్ల నచ్చెరువు. 25

సఖీ : ఈ మురారి రూప శ్లోకనము నిన్ను గూర్చియే. (అందఱు “కాదు,
                  కాదు నిన్ను గూర్చియే” అని కలహింతురు)

ప్రేమకళ: (ఆత్మగతముగ)
                   పాదద్వయమ్ము నూపురపూరితమ్ముగను,
                   కటితటిని పీతాంబరాలంబనమ్ముగను,
                   వక్షమున కుంకుమము, వేణుస్వనమునందు
                   నందనరసస్యంది, అమృతారుణోష్ఠమున
                   ప్రసరించు హసనమ్ము, పింఛచూడమ్ముతో
                   విభ్రమము వెలయు నా నీలమేఘము నొంద
                   నెవ రొనర్చిరొ కదా, యింత ఘనతర తపము? 26

                   (నేపథ్యమున)
                   “రాకా శీత మయూఖుని బోలెడు
                   సుందర వదనుడు, విస్ఫారోన్నత
                   వక్షఃస్థలుడును, ఖేలత్కేసరి
                   మధ్యముడును, మదగజరాడ్గర్వా
                   పహడును మరకత సంపదోర్డం
                   బరుడౌ శ్రీపతి రమ్యాకారుం
                   డెవ్వరి రంజింపం డీ సృష్టిని?” 27

ప్రేమకళ: (దర్శించుట నటించి) నీలోత్పలమును మాటిమాటికి
                   హృదయమునకు హత్తుకొనుచు వకుళ మాలిక సంబరముతో
                   మురిసిపోవుచు నిటే వచ్చుచున్నది.

వకుళమాలిక : (వర్ణితమైనట్లు ప్రవేశించి)
                    ముగ్ధమోహన మంజులమ్మగు
                    మధుర తరళిమ సరణిలో మధు
                    తృప్త చుంబన కళల పోలిక
                    తొగరు పెదవుల నెగయు సుధలో


                   మురళిరవళులు తొలకరించెను
                   చేతనమ్ములు పులకరించెను.
                   అలలు తేరిన కలతదీరిన
                   మురళి తరళిమ సరళిలో చిఱు
                   తొగరు పెదవుల నెగయు సుధలో
                   పులకరించెను రసిక వాహిని. 28


(వీక్షించి) ఓహో, ఈ పొగడ చెట్టు వైపుననే సఖుడు. రసాలకుడు వెంటరాగా రాధిక యనురాగకళికను వికసింప జేసికొనుచున్నది. నేనును సంభావించెదను.


రాధిక: (సమీపించి) ఈ యవతంస నీలోత్పలము నింతగా సంభావింతు
                   వేమి విశేషము?

వకుళమాలిక: (రాధికచెవి దగ్గరకు జేరి)
                   ఉజ్జ్వలోత్పల కోరకమ్మది
                   యుండ నే కాంతముగ నీతో
                   నవ్యతను తా నందనందన
                   నయన నీతి వినిర్జితమ్మై
                   నందసూను శ్రవఃకపోలము
                   విడిచి భృగుపాతమ్ము నొందెనె! 29

రాధిక : సఖీ! ఈ కర్ణావతంసముచేత బ్రతికితిని.

నవమాలిక: సఖీ! అలంకరింపబడిన కృష్ణునిచేతనా?

                  (ఆకాశమున)
                  ఓహో, మురారి మురళి! ఉరునాందీ మధుసరళి!
                  రాసోత్సవ నాటికలో జగముల ప్రస్తావించును
                  మునివర్యుల హృదయములను ముగ్ధభావవశమొనర్చు. 30

అందఱును: (ఆనందముతో) నిజము! నిజము!! (మదనావస్థ నటింతురు)

రసాలకుడు: (పులకించి, అంజలి వహించి)
                   ఒక్క వాక్కుకు, మనసు కొదుగంగ బోనిదియు
                   ఒక్క యాకారమని యొప్పుకొనబోనిదియు


                   వల్లవీ తరళ నేత్రాపాంగముల చేత
                   పల్లవీకృత వస్తు నాశ్రయించెద నేను 31

విలోకించి : గోపీ మనోహారిణీ సూత్రధారియై,
                  కందర్ప బాణముల కాందిశీకునివోలె
                  నవ్య నందనమైన బృందావనమునందు
                  నందసూనుడు వేణు నాదమ్ము లొలికించె. 32

నవమాలిక: ప్రాలేయాంశుని శోభల
                 పరిహసించు ముఖజలజము
                 సతులకు నీవీ విదళన
                 ముల గూర్చెడి మోహవిద్య
                 ప్రణయమ్ములు కడు క్రువ్విన
                 గుల్మము చాటున మసలుచు
                 నిరుపముడౌ నీలకాంతి
                 పరిణత మధు సారణిగా
                 బృందావన కుహరమెల్ల
                 నానందోజ్జ్వలత గ్రమ్ము 33

రసాలకుడు: ఈ లతలలో పొంచియుండి రాసోత్సవమును దర్శింతును.
                 (నిర్దేశించి రీతిని మాధువుని ప్రవేశము)

మాధవుడు: వీరందఱును నా సన్నిధిని జేరుచున్నారుగదా! నేను నిమిష
                 మాత్రము ధైర్య మవలంబించెదను. (అందఱును సామీప్యమును
                 జేరుదురు)

మాధవుడు: (రాధిక నుద్దేశించి)
                 అసితోత్పల కమ్ర కుసుమ కర్ణాలంకరణములను,
                 లలిత నీల వసనాంచిత రమ్య పీవరోరువులను,
                 చేలము ప్రక్కన సగముగ చెలగు బాహుమూలములను
                 నొప్పెడి యీసుముఖి సొగసు కాముమోహవిద్యగదా! 34

                 (అంత ప్రేమకళ నుద్దేశించి)
                 పంకేరుహ హసననేత్ర! స్పందించెడు నీ పరిణత


                    భ్రూవల్ల్యుపదేశమ్మున పుష్పబాణచాపమ్మును
                    ఈ చిత్తజహేళిప్రియ సింధూరపు జేరుచుక్క.
                    యసమాస్త్రుని కదనగుళిక యను శంకను గలిగించెడు 35

                    (వకుళమాల నాశ్రయించి నే నిచ్చటనే డాగి భావముల
                    పరీక్షింతును (అట్టొనర్చును)

రాధిక: ఏమిది? మాధవుడిక్కడనే యెక్కడనో యంతరితుడై (మఱుగుపడి)
                    యున్నాడే!

అందఱు: (పరికింతురు)

రాధిక: (బాగుగా పరికించి)
                     వినమితేంద్రమౌళి మకుట శేఖరత్వమును గొన్నది.
                     వ్రజకన్యా కుచకుంభ నిగూఢ మృగీమద పంకై
                     శ్వర్యముచే శ్యామలమ్ము, వార్నిధిపుత్రీ విలసిత
                     వర దీధితి గైకొన్నది, నీప వృక్ష మూలమ్మున
                     లభియించిన నాదు పురామణి కాన్పించియె, అయొయో,
                     మహితముగా జారిపోయె మోసగించి పారిపోయె. 36

వకుళ మాల : (ఆత్మగతముగ
                     ప్రాణములు వీడగా బ్రతుకలేరే నరులు
                     ప్రాణాధికము విడువ బ్రతికియుంటిని వింత!
                     (అందరు వియోగావస్థ నభినయింతురు)
                     అంగుళీ వదనముల నా చెక్కిళుల నూని
                     శృంగారమున నర్ధచుంబనము గావించు
                     వ్రజనాథులీల నాస్మృతి దవిలినంతనే
                     ప్రతి నిమేషమునందు ప్రాణముల్ చుంబించు 38

నవమాలిక: (చంద్రుని విలోకించి)
                    నిరహిణులను వేచు స్మరుడు,
                    వ్రజయువతీ తతి జ్వలింప
                    అరుణ నవ్యకిరణములా
                    యగ్ని జ్వాలల పోలిక


                   ఘన ధూళీ లక్ష్మవల్లి
                   భూమమౌచు నెసగెడు నా
                   హోమకుండమును బోలిన
                   చంద్రమండలమున కొసగి 39

ప్రేమకళ: దీని నవధరించుచున్నాను.
                   భర్గు ఫాలనేత్రాగ్నికి నర్ధముగా దగ్ధమైన
                   కుసుమాయుధు దేహ మిప్పు డీ మార్గము తిలకించుచు
                   కృష్ణసార బిందువు మాటున చల్లందనము నొంది
                   శీతకిరణుడౌ శశియను నమృతతటాకపు జలతతి
                   పూర్ణశరీరముగా నై ప్రసవాస్త్రమ్ముల నిటు మన
                   పై దూసిన రీతి దోచు పరమ కళానిపుణతతో 40

రాధిక: (సవితర్కముగ)
                  శశిబింబము కా దయ్యది
                  స్వర్గాధిపు మదగజమౌ
                  ధృతదంతము మదమత్తము
                  ఆ నీలకళంకవల్లి
                  మదధారల చారికలే! 41

ప్రేమకళ: అంతరిక్ష మార్జించును గాసారపు కమ్రశోభ
                  నక్షత్రము లొలయు నిదే నళినీ సుమసౌందర్యము
                  కిరణ మృణాళీ వల్లరి శశిబింబమ్మగు మూలము
                  నీలబిందు వేషమ్మున లీల ఖనన మొనరించెడి
                  ఇది చంద్రుని మచ్చకాదు ఎచ వచ్చినదో పోత్రి? 42

నవమాలిక: గాఢమదాలస విలాసినీ రద కాంతిచ్చట యన
                 వైహాసిక దరహాస క్షరకిరణచ్చవి యనగా
                 చలిత తరళమౌ రోహిణి మండలమ్ము పండినదన
                 రసవికాసమను మధువును రజనీపతి స్రవియించెడి. 43

రాధిక: (పవనస్పర్శ నభినయించి)
                 చింద బడెడి పెనుమంటల నాందోళన తరళన్నవ
                 చందనదళ వసనాంచల మదనానిలు డుమిసెడి, నొహొ


                   భర్గుని కోపాగ్ని శిఖిల భగ్గురనిన బంచశరుడె
                   మందానిలుడై యివ్విధి జిందెడునే పెనుమంటలు| 44

అందఱు: ఓ తమాలకృత మాలా హింతాల రసాలసాల
                  వకుళార్జున ప్రముఖలే తరుణముగ్ద తరుచయమా!
                  ఎరిగినచో నవనంద కిశోరుమార్గ మెఱిగింపుడు
                  నేత్రాంచల కువలయముల నిష్ఠమెయిని బూజింతుము. 45

ప్రేమకళ: (వంశి నుద్దేశించి సానుక్రోశముగా)
                  ఏకాకినివై యెపుడును మురరిపు బింబాధరముల
                  ముద్దుగొనెడి యొద్దిక నీ వశమైనది యో మురళీ!
                  ఫలియించెను నీ తపమ్ము పరులకెపుడు దుర్లభ మిది. 46

వకుళమాల: (ఆకాశము వంకకు నిబద్ధము గావింపబడినయంజలితో)
                 ఆలోల సుమకుంతలమును, పింఛ
                 ప్రాంచ త్పింజర సౌభాగ్యమ్ము
                 మల్లీయుత సీమంత కళాన్విత
                 ఘర్మిలసుస్తోమము, శోభితమౌ
                 నీ హసితాననమును నొకపరి
                 చూపించిన చాలును త్రిదశాధీశా!
                 ఇంచుక చూపుము నీకారుణ్యము
                 ఇచ్చెద సర్వము నీకే స్వామీ! 47

ప్రేమకళ: అధిక సంతప్తలౌ హరిణాక్షు లహహ! మా
                నేత్రాంతములను ప్రాణమ్ములను గనలేరె?
                అలముకొను కార్పణ్యమందైన నో ప్రభూ!
                నిబిడ మౌగాదె యెంతయు నీ దయారసము? 48

నవమాలిక: నిలుపవేని నాపై నీ నిర్మల కరుణా వీక్షణ
                ఓసమస్త జగదీశా! ఓ దయాంబు ఘనరాశీ!
                యోగనిద్ర వీడదు నీ నేత్ర ముగ్ధ జలజమ్ముల
                నిపుడైనను నా పాపము లెంతగానో హేతువుగా! 49

అందరు: (అంజలి బంధముతో)
                మురళీరవ తరళీకృత


                    విలసిత నీరజ వదనుడు,
                    నీలదేహ నిరుపముడును
                    గోపాలీ నందనుండు
                    మహిళా మానస హారియు,
                    మందహాస ముగ్ధముఖుడు
                    నైనయతని కన్నమేము
                    కన నెరుంగ మన్యు నెవని. 50

కొందరు: నిరుపమ మగు నా కులతను నీ దాసీగణము పొంద
                   నీక్షింపవె నాథ నీవు? ఎందుకు నీయెద క్రోధము?
                   హింసింతువు స్త్రీల నిటుల నేమి ఫల మ్మార్జింతువు? 51

                   నేపథ్యమున
                   మధుర యానమ్ముతో మధుజగత్పతి వచ్చె
                   అరవిందలోచనా మకరంద నవబిందు
                   లోచనాంచల చకోరానంద చంద్రముడు
                   మదమత్త దరహాస సారమంజుల ముఖుడు
                   పరివీత పీతాంబరము ధరించినవాడు
                   మధు జగత్పతి వచ్చె మధురయానమ్ముతో 52

అందరు : (స్వాగతముగ)
                   మందయానముతోడ గోవిందు డేతేర
                   ఫాలలోచనువహ్ని భగ్ను డైనట్టి యా
                   పంచబాణుడు నేడు పంచత్వమును వీడి
                   లోకోపకారియై తులకించి పులకింప
                   నభిరూప రూపియై యరుదెంచి స్వనియించె 53

                   వచ్చుచున్నాము. రండు, పోవుదము (మాధవ సామీప్యమును
                   జేరుదురు)

రసాలకుడు: ఇక నేనును గనుపించెదను (సమీపించును)

మాధవుడు: మీ కేమి ప్రియ మొనర్తును?


అందరు: ఇంతకన్న ప్రియ మేమున్నది?
            ఇంతకంటె తృప్తికరము లే మున్నవి గోవిందా!
            మందపవన ఖేలాందోళన పులకిత రసికములగు
            నళినపత్ర సమములు నీ నవతాయుత నయనమ్ములు,
            అమృత సరళ సారాంచిత రాగఝరిని పోలెడు నీ
            నిభృత మధుర నిస్వనములు, నిత్యముగ్ధ సుస్వరములు.
            క్రీడాత్మక గతి నటించు నటనాఘటనములియ్యవి
            కడు ఘనముగ పెంపొందించెడు నౌజ్జ్వల్యములియ్యవి. 54

            అయిన నిదియును జరుగుగాక!
            హరిణమ్ము లేని పీయేషకిరణుని యంద
            మును జిందు కాంతిని తిరస్కరణ గావించు
            వాక్ప్రౌఢి మన కవులు కడు గాంచెదరు గాక!
            సజ్జన సమూహమ్ము నిత్య రసపానసం
            జనితతన్మయతతో చిన్మయతతో సత్వ
            ఘర్మవా స్సరణితో నంతు లెరుగగ రాని
            యానందజలనిధుల కడు నొందెదరుగాక! 55

            సకల జగమ్ముల నిరతము
            శుభములు ప్రాప్తించుగాక!
            రిపులకైన నపకారము
            లెపుడు కలుగకుండుగాక!!
            సర్వేశుడు జగదీశుడు
            కపటదారు విగ్రహ వే
            షమ్మున కరుణాకటాక్ష
            వీక్షణలహరీ తరంగ
            ప్రసరణలను, బహుగతులను
             ప్రణయముతో పంపుగాక 56

             శ్రీ జయదేవ విరచిత పీయూషలహరీ నామ
                            గోష్ఠీ రూపకము
                              సమాప్తము







శ్రీ జయదేవ కవి విరచిత

పీయూషలహరి

(సంస్కృత మూలము)




అనువాదకుడు

వావిలాల సోమయాజులు

శ్రీ జయదేవ కవి విరచితా

పీయూషలహరి

నాంది


                  కింజల్క ద్యుతి పుంజ పింజరదళత్ పంకేరుహ శ్రివహమ్
                  శంపా సంపతితాంశు మాంసల శరత్కాదంబినీ, డంబరమ్
                  లాస్యో[16]ల్లాసిత చండ తాండవకళా లీలాయితం సంతతమ్
                  చక్రప్రక్రమ వృత్త[17]నృత్త[18] హరయోర్నివ్యాజ మన్యాం జగత్ 1

                  కంపమాన నవ చంపకావళీ చుంబితోత్పల[19] సహోదరోదయం
                  రాస[20]లాలస నవీనపల్లవీ పల్లవీకృత ముపాస్మహే మహః 2

సూత్రధార : అలమతి విస్తరేణ (విలోక్య) అర్య మతిమధురో మధుమాసః
                  యత్రహి[21]
                  మరుత్పంపా కంపాకుల లహరి సంపాత శిశిరః
                  స్ఫురన్మల్లీవల్లీ[22] కుసుమపుట హల్లీసక నటః
                  నమన్నాళీర్మధుర మధుపాళీః కవలయ
                  న్నయం మందం మందం తరళతరుబృదం ప్రసరతి 3


అహూ భగవతో భాగవతజన శీతమయూఖస్య[23] నీలాచలమౌళి మండన మణే[24]గరుడ ధ్వజస్య ప్రసాదే ప్రసాదమిళితాః[25] సామాజికాః

(కించ) -


                  చిత్రం చంచల చంచలేవ చటులా చేతశ్చమత్కారిణీ
                  పీయూషద్యుతి మండలీవ మధురస్వచ్ఛ ప్రవాహచ్ఛటా,


                      దృగ్బంగీవ కురంగ భంగుర దృశా మానంద సందాయినీ
                      గోష్ఠీ శ్రీజయదేవ పండితమణేః[26] స్తావర్తతే నర్తితుమ్ 4

                      (నేపథ్యాభిముఖ మవలోక్య)
                      అహో! విశేష[27] పేశలత్వ మస్కత్కుటుంబస్య
                      తథాహి -
                      కాచి న్నఖైః కుటిలయ త్యలకా మకాండే
                      కాచి త్కరోతి కుచయో ర్మకరీ విలాసమ్,
                      కాచి త్క రోతి కలయా వలయాన్ భుజాన్తే
                      కాచి ద్దృగంజన మతీవ కరోతి సూక్ష్మమ్ 5

                      తత్పారిపార్శ్వి కేన తరంగయామి రంగమండల [28]మితి.
                      వత్సశృంగారక! ఇత ఇతః (ప్రవిశ్య)

పారిపార్శ్వికః : భావ కిం విజ్ఞాపయసి[29]?

సూత్రధార : కిం తేన నాట్యరంగేణ ప్రేమసంగేన[30] వా పున,
                    నకృతం యేన విజ్ఞస్య చిత్తఖంజన గంజనమ్[31] 6

పారిపార్శ్వికః : కఃపునరేతాదృశో భావబంధురః ప్రబంధః?

సూత్రధార : కుప్యత్కాంతముఖీవచోలవయివ ప్రత్యర్ణకర్ణోత్సవః
                    ఖేలచ్చేల దరోదితస్తన ఇవ ప్రేమాస్పదం నేత్రయోః
                    లీలా వేశ్మ గవాక్ష లక్షిత వధూ వక్త్రేందువన్మాదకో
                    గోష్ఠీరూపక రూపనర్తన కళారంగాయ మున్మీలతి. 7

పారిపార్శ్వికః : (సానుబంధం)[32] కః పునరపి కవిః?

సూత్రధార : ఏసైతదుక్తం
                   అశ్మద్రవీకర్తు మిమౌ సమర్థౌ
                   చతుర్దశానామపి విష్టవానామ్,


                     అహం వచోభి ర్జయదేవనామా
                     కరచ్ఛటాభిశ్చ తుషారధామా[33].

పారిపార్శ్వికః : (నేపథ్యాభిముఖం) తేన సజ్జన్తా గోష్ఠీ నర్తనాభినయ కోవిందాః
                    కుశీలవాః (నేపథ్యే) సఖి ఇత ఇతః

సూత్ర: (విలోక్య)[34] రసావేశో భరతానాం. యత్ర అహోఖలు
                    వినైవ నాళికాం[35] రంగమంగళ మవతరతి. (విభావ్య)
                    ఇయం చంద్రకళా శంకే పంకేరుహముఖీ పురః
                    ఏతస్యాః పార్శ్వగా కాపి రోహిణీవ విరాజతే 9

తదావామపి[36] మాధవ రసాలయో ర్భూమికాం సంపాదయావః (ఇతి నిష్కాంతౌ)

                                         ప్రస్తావనా
                                (తతః ప్రవిశతః సఖ్యా)

ప్రథమా: కస్య వా పశ్య వామాక్షి! మాధవో మధురోదయః[37]
                     ఉదంచ త్పంచమాలపై ర్నమోహయతి మానసమ్ 10

అపరా: సఖి రాధికే! ఏవ మేతత్, కింతు భవాదృశీనామ్?

                    తథాహి ·
                    శ్వాసాస్తాప సమాకులా ఇవ బహిర్నీయాంతి గండాంతికమ్
                    యత్కర్పూరపయోనిధావివ[38] పరం పాండిమ్నిమగ్నా రుచిః
                    చ్చైయేషా తనువల్లరీ విజయతే లేఖైవ శేషైందవీ
                    తత్కిం సుందరి! నందనందన తనుచ్చాయా సమాయాద్దృశోః 11

రాధికా : సఖి నవమాలికే! కిమిద మాకాశ లేఖనీవర్ణన[39] మారభనే!

సమకాలికా : అనురాగః సుముఖీనాం చేతసి గుప్తోపి లక్ష్యసే సకలైః
                    సౌరభ మంజతి పరితోయద్యపి కుసుమం లతావృతం భవతి 12

రాధికా : కింనామ గోపనీయం భవత్యాపి ద్వితీయాత్మనః?
                    యావత్ యావన్మధుర మురళీపూరణార్థం మురారి


                      ర్మందం మందం వదన పవనాసంగ మంగీకరోతి
                      తావత్ తావత్ కువలయ దృశాం మన్మథక్లేశజన్మా
                      నిశ్వాసో యం దశన వసనే[40] మ్లాని మానం తనోతి 13

                      సహ్యాస్వాత్[41] వహళీభవిష్ణు మురళీకేదారతారశ్రుతి
                      ర్నైతాదృగ్ చరణార వింద కటక క్వాణోపి సమ్మోహనః
                      కిన్తుక్లాన్త కపోలకాళి వలయ ప్రస్యంది మందస్మితై
                      ర్గోవిందః శతథా భినత్తి హృదయం ధైర్యస్పృశాం మాదృశామ్ 14

నవమాలికా : (సునిభృతం పశ్యన్తి మూర్ఖమీషద్దోలయతి) తతః
                      అకాపిదీదోషేణ రాధికాయాపలోచనే ముద్రయతి[42]

రాధికా: (ససీత్కారం)[43]
                     ఇయమియం తవమాధవరాధికా
                     చరణపంకజే సేవన [44]షట్పదీ.
                     బహిరుదంచయ కింతవ[45] నేత్రయోః
                     కరతలం రతిలంపటమానస[46] 15

సఖీ: (చిబుక మున్నమయ్య) ఈదృశం తే సతీవ్రత మాహాత్మ్యమ్ ?

రాధికా: (సలజ్జ మధోముఖీభూయ) సఖి! భ్రమాదుక్తమ్

నవమాలికా : నహినహిసఖి! విభ్రమాదిత్యుచ్యతామ్

రాధికా: కింబహునా-
                     పింఛాలాంఛితకుంతల[47] వ్యతికరస్తాపింఛగుచ్ఛచ్ఛవి[48]
                     ర్నాసాభూషణ పేశలీ గతివశా ద్గండోల్ల సత్కుండలః
                     కాంచీమండలకుంచితాంబరధరో లోకత్రయీ మోహనః
                     సర్వస్మాదపి జీవితాదపి మమ ప్రేమాస్పందమాధవః 16

                     ఇత్యధికం కింతు సర్వాసాం
                     తథాపి పిశునరసనాపిశాచీ ధీరతాండవ నివారణ మేవ
                     సమంచితం[49] కులాంగనానామ్.


రాధికా : సఖి! నవమాలికే! నఖలు భవాదృశో జానంతి మర్మ[50] వ్యధాం
                    విషమ సాయక పాతస్య పరం త్వత్ర[51] ప్రేమకళా పృచ్ఛతామ్.

ప్రేమ : గురుజనభయం, పాతీవ్రత్యం జనారవతో[52] భయం
                    సహచరి! శపే[53] వారం వారం త్రయం పరిరక్షితమ్
                    శ్లథయతి పరం మందం మందం విభోరధరస్థలీ
                    విగళదమృతాశంసీ[54] వంశోనినాద లవోదయః 17

రాధికా : (వంశీశ్రవణ మభినీయ ప్రేమావస్థాం నాటయతి)

ప్రేమ : ఇయం పులకమండలీ కవిలితా కపోలస్థలీ
                     తథా సరస శీత్కృతిః స్ఫురిత మానసాంభోరుహమ్.
                     ఆయంచ కుచకాంజనాచలజ నర్మఘర్మోదయో
                     ముహుః సుముఖిః! వేపసే మదనహేతి[55] భీతేవ కిమ్? 18

రాధికా : (నీవా సంయమన[56] మభినయతి)

నవమాలికా : (సహాసం)
                    నీవీం నవీకృత్య నితంబబింబే
                    కియత్పరిశ్రామ్యతి కోమలాంగి
                    పీతాంబరః పశ్యతి సస్మితం చే
                    త్తదా భవిత్రీ స్వయ మేవ బద్దా. 19

రాధికా : (నవమాలికాం విలోక్య సానందం)
                     అహో మురారే ర్మురళీ నినాద
                    లీలాయతానాం పర మూర్జితాని.
                    భవాదృశాం[57] యేన మహాసతీనాం
                    కపోలమూలే పులకావళీయమ్.

నవమాలికా : (సలజ్జ మధోముఖీభూయ స్వగతం)
                   గోపం కంచన కాంచనాంబరమయే పశ్యామిన శ్యామలమ్
                   యస్యాలోకవశాదృశా మృగదృశా మేషా విశేషాదభూత్


                      ఇందుస్తిందుక పావకో మలయజాలేపోపి సంతాపకః
                      ప్రాణాయేవ నిజర్ద్విషా గురుతరో హారోపిమారోపమః 21

                      విషమ విశిఖ సూత్రం కృష్ణవంశీ నినాదో
                      యదవధి తరుణీ నాం కర్ణపీఠే లులోఠ,
                      అవిరళపులకాళీ కోమలా గండపాళీ
                      తదవధి తనుతేసౌ[58] భాగ్యబంధం నివద్యమ్ 22

(నేపథ్యే): దేవతా ముకుటకాంతి మంజరీ పింజరీ కృతపదాంబుజద్వయం
                      మారకాతరిత గోపనాగరీ రాగరీతి రసికం భజేమహః 23

ప్రేమకళా : కథం చిత్రఫలక హస్తే రసాలక ఇత ఏవ ఆయాతి
                      (తతః ప్రవిశతి యథా నిర్దిష్టో రసాలకః)
                      ధామని స్ఫుటితహార దామని నీల నిరద సమానధామని!
                      వామనీకృత కుచాన్త[59] కామినీ కామనీతి రసికే రసామహే. 24
రాధికా : ఇద మనర్థ కందళీ[60] మూలం యత్‌ఖలు రసాలహస్తే చిత్రఫలకం

నవమాలికా : సఖి! త్వమేవ మంకురయసి మయా ప్రాగేవోక్తం. నేదం
                     వకుళమాలికా హస్తే దీయతా మితి.

ప్రేమకళా : సఖిరాధికే! తయాఖలు చంచలతయా కుత్ర[61] పాతితం తత్ఖలు
                     అనేన వటునా సమానీతం తత్ కథయ[62] కథ ముపాయైర్గృహ్యతా
                     మితి

రాధికా : ఇదయేవ తావత్ చింతయామి. న పునః కదాచిత్[63] గోవింద
                     కరారవింద మకరంద రసనిష్యందాభిషిక్తం[64] భవేత్.

నవమాలికా : నిశ్చయార్థే కిమితి శంకసే?

రాధికా : ఫలేనైవ నిశ్చీయతే.

రసాలక : (ప్రవిశ్య) స్వస్తిభవతీభ్యః (ఇతి చిత్రఫలకం సమర్పయతి)

                    (సర్వా విలోక్య పఠంతి)


                  త్వం తావ త్ప్రథమేవ[65] చంద్రకళికా సంతప్త చింతామణి
                  ర్నవ్యాః కేపి వయం నికామతరళా శ్చౌరాశ్చకోరా ఇవ
                  భూయో వీర్యపరీక్షయే వితనుతే సంతాప మంతర్జని
                  ర్నోజానే తవ కోమలాంగి! గళితో యేనైష చిత్తజ్వరః 25

                  (సర్వా అన్యోన్యమ్) సఖి త్వదర్థమేవ మురారే రూప

శ్లోకితం : (ఇతి కలహాయుంతే.)

ప్రేమ : (అపవాయ)
                 పాదౌ నూపురపూరితౌ కటితటీ పీతాంబరాలంబినీ
                 వక్షః కుంకుమపంకిలం కరతలం వంశీ వతంసీకృతం.
                 బింబోష్ఠీ[66] మదవిభ్రమ[67] స్మితపరౌ[68]కేశోపి వేశోచితో
                 నో విద్మో నవనీల నీరదవపుః కస్యాస్తపస్యాఫలమ్. 26

(నేపథ్యే)
                రాకా శీతమయూఖ సుందరముఖో విస్తారిపక్షస్థలః
                ఖేలత్కేసరి మధ్యమో మరకతశ్రీ చుంబి దోర్డంబరః
                కందర్పాదపి సుందరో మదగజశ్రీ గర్వ సర్వంకషః
                శేషాం నైవ మనోవినోదన కృతే రమ్యాకృతిః శ్రీపతిః. 27

ప్రేమ : (విలోక్య) కథ మేషా వకుళమాలికా హృదయే నీలో
                త్పలం ముహుర్దధానా సానంద మిత ఏ వాభివర్తతే.
                (తతః ప్రవిశతి యథా నిర్దిష్టా వకుళమాలికా)
                రమ్యాధరః[69] స్ఫురదధోరసుధా సముద్ర
                మాధుర్య చుంబన కళామివ సూచయంతీ.
                చేతా మదీయ మధునా మధునాశనస్య
                హా హంత హంత మురళీ తరళీకరోతి. 28

(విలోక్య) కథమేషా రాధికా సఖీభ్యాం రసాలకేన చ అను గమ్యమానా వకుళ
వీథికా పరిసర ఏవ నిత్యానురాగ కళికం వికాసయతి. తదహమ పి సఖీం
సంభావయామి.


రాధా : (అపసృత్య) సఖి! కథ మే తదవతంస నీలోత్పల మతీవ
                    సంభావయతి.

వకుళమాలికా : రభసేన రహః పరిచ్యుతం
                     సనీలోత్పల కోరకం మురారేః
                     నయనాంచల నీతినిర్జితం
                     భృగుపాతం వహతీవ భూతలేస్మిన్ 29
                     (ఇతి రాధికాయాః కర్ణే కథయతి)

రాధికా : సఖి! జీవితాస్మి, కర్ణావతంసనైవ.

నవ : సఖి! సఖిః కృష్ణనేతి శేషః

                   (ఆకాశే)

                   ప్రస్తావయంతీ కియద్దభూతాని నాందీవ రాసోత్సవనాటికాయాః
                   మహామునీనామపి మానసాని మురారి వంశీ వివశీకరోతి. 30

                   (సర్వాః సానందం ఇద మిత్థమేవేతి మదనావస్థాం నాట్యంతి)

రసాలః : (సపులకు మంజలిం బద్ధ్వా)

                   పరం బ్రహ్మం నిరాకార మవాఙ్మనసగోచరమ్,
                   వల్లవీ తరళాపాంగ పల్లవీకృత మాశ్రయే. 31

                   (విలోక్య)

                   గోపీ మనోహరణ నాటకసూత్రధారీ
                   ధారాయమాణ[70] మదనాశుగ కాందిశీకః.
                   కందర్ప దర్పహర మూర్తి రసౌ మురారిః
                   బృందావనే మురళికాం తరళీకరోతి. 32

నవమాలికా : పురఃప్రాలేయాంశు ప్రతిభరముఖీ ప్రేమవసతిః
                  సతీనీవీ బంధస్థితి విఘటనైక వ్యసనినీ,
                  సమాయాంతీ బృందావనకుహర మానందరభసా
                  దయే కేయం శ్యామచ్ఛవి రమృతధారా పరిణతిః 33


రసాలక : లతాంతరితో రాసోత్సవం నిభృత మవలోకయామీతి
                   
                    (తథా కుర్వన్ ఇవ స్థితః)

                    (తతః ప్రవిశతి యథానిర్దిష్టో మాధవః)

మాధవ : కథమేతా మందతిక మేవ సమాయాంతి! తన్నిమిష మాత్రమేవ
                    ధైర్య మవలం బిష్యే. సర్వా మాధవాంతిక ముపసర్పంతి)

                   (రాధికాం నిర్వర్ణ్య)

                   నీలాంశుకాలంకృత[71] పీవరోరూ
                   ర్దరస్ఫుర న్కోమలబాహుమూలా
                   వతంసయంతీ సుముఖీ విభాతి
                   సమ్మోహ విద్యేవ మనోభవస్య. 34

                   (తతః ప్రేమకళా నిర్వర్ణ్య)

                   ఏషా ప్రసూనాశుగ[72] చాపయష్టిః స్పష్టీకృతా భ్రూలతికాపదేశాత్
                   సింధూరబిందు ర్గుళికేతి[73] శంకే పంకేరుహస్మేరదళాయ తాక్ష్యా[74] 35

                   (వకుళమాలికా మాశ్రిత్య విలోకయా మ్యాసాం భావం నిభృతమితి)
                   (తథా కరోతి)

రాధికా : కథ మత్రైవాంతరితో[75] మాధవః (సర్వా నిరూపయంతి)
                  (రాధికా నిపుణం నిరూప్య)
                  నమ్రీభూత సురేంద్రమౌళిముకుట ప్రాగ్భార సంభావితమ్,
                  గోపాలీకుచలకుంభపాళి విలసన్ కస్తూరికాశ్యామలమ్
                  దైవాదేవ కదంబమూల మిళితం లక్ష్మీవిలాసాస్పదం
                  సంప్రాప్తం క్వనుహారితం బత మయారత్నం చిరత్నంపునః 36

వకుళ : (ఆత్మానం నిర్వర్ణ్య)
                  ప్రాణమాత్రే [76]విగళితేన జీవంతి క్వచిజ్జనాః,
                  వినా ప్రాణాధిక మహం జీవామీతి కిమద్భుతమ్. 37


                  (సర్వా వియోగావస్థాం నాటయంతి)
                  విభ్రతశ్చిబుక మంగుళిముఖై:[77]
                  కించిదంచిత వికార సీత్కృతే[78]
                  అర్హచుంబనమహో మురద్విషః
                  ప్రాణమేవ నుదతి ప్రతిక్షణమ్. 38

నవ : (చంద్రమసం విలోక్య)
                  నూతనారుణమయూఖ పావకే లక్ష్మవల్లీ ఘనధూమ భూమని,
                  హోమకుండివ చంద్రమండలే సంజుహోతి యువతీజనం స్మరః 39

ప్రేమ : ఇద మవధారయామి
                 తను పూర్తికృతే మృగచ్ఛలాద్ విధుపీఝూష తడాగ పాథసి,
                 శశిశేఖర బాల వహ్నినా దరదగ్దకుసుమేషు రంజతి. 40

రాధికా : (సవితర్కం)
                 పరిణామ ముపైతి సంధివర్జం రజనీనాథ సురాధినాథ దంతీ,
                 అపి తత్రకళంకవల్లీ దంఖాన్మదధారా గళితేతి తస్యశంకే. 41

ప్రేమ : గగన మిద మిదానీం యాతి కాసార శోభాం
                 తదను ముకుట[79] లక్ష్మీం తారకాః సంక్షిపంతి,
                 అపి కిరణ మృణాళీ మూలకందోయ మిందు
                 తదిహ స్వనతి లక్ష్మ చ్ఛద్మనాకోపి కోలః 42

నవ : మదాలస విలాసినీ దశనకాంతి సన్తానకః
                 స్ఫురద్దరహసచ్ఛటాద్యుతి విలాసి వైహాయసికః,
                 చలత్తరళ రోహిణీ రమణ మండలాడంబరః
                 క్షరత్కిరణ మంజరీ పరిచయోయ మున్మీలతి. 43

రాధికా : (భవన స్మర్శ మభినీయ)
                అందోలనోత్తరణ చందన వందనీయో
                మందానిలో భవతి తాపకరః[80]కి మేతత్,
                కింబాళిభర్గ నయనాజ్జ్వల వహ్నిరేఖా
                సందగ్ధ పంచశరభూత వివర్తవాతః. 44


సర్వాః : హంహో తమాల కృతమూల రసాలసాల
                     హింతాల తాల వకుళార్జున ముఖ్యవృక్షాః,
                     ఆవేదయంతు నవనంద కిశోరమార్గం
                     నేత్రాంజలైః కువలయైరివ పూజయామః. 45

ప్రేమ : వంశీ ముద్దిశ్య సానుక్రోశం[81]
                     జానే తవైవ వశ్యా మురళి తపస్యాపరం రచితా
                     ఏకాకినీ మురారే శ్చుంబతి బింబాధరం యస్మాత్,[82] 46

వకుళ : (సకరుణ మాకాంశం లక్ష్య మంజలిం బధ్వా)
                     ఆలోలకుంతల[83] ముదంచిత మందహాసం
                     సీమంతినీ నాలకకులం నవధర్మపూరం,
                     దాస్వామి జీవనమపి త్రిదశాధినాథ
                     యద్యేకవారమపి తే వదనం విలోకే. 47

ప్రేమ : నయనాంతేన[84] జీవన్తి సంతప్తా హరిణీ దృశః,
                    తత్రాపి యది కార్పణ్య మహో తవ దయాళుతా. 48

నవమాలికా : కృపాకటాక్షైః కరుణాంబురాశీ
                   యదీక్షసే మాం జగదీశ! నైవ,
                   విలోచనాశ్చే త్కిము యోగనిద్రా
                   జహాతి నాద్యాపి మదీయ పాపైః. 49

సర్వాః : (సాంజలిబంధం)
                   విద్మో న పరం కించిత్ మురళీ తరళీకృత వదనాత్,
                   కించి దుదంచిత సితా దాసితాకృతి వల్లవీ తనయాత్. 50

(కించ)
                   ఆకులీ కురూషే హంత కిమేవం నిజదాసికాః
                  అథవా నాథ! నిర్బంధః స్త్రీవధే ఫలమస్తికిం 51

(నేపథ్యే)
                 అయమేతి మంద మరవిందలోచనా
                 జనలోచనాంచల చకోరచంద్రమా


                      పరివీత పీతవసనో మదాలసో
                      దరహాస భాసుర ముఖో జగత్పతి. 52

సర్వాః : (స్వాగతమ్)
                      జగతా ముపకారాయ త్రిలోచన విలోచనః
                      యే తైవ పంచబాణో పి రూపవా నభిరూపితః 53
                      అగచ్ఛత. గచ్ఛామః, (మాధవాంతిక ముపసర్పంతి)

రసాలక : అహమ ప్యాత్మానం ప్రకాశయామి. (ఇతి ఉపసర్పతి)

మాధవ : కిం వః ప్రియం కరవాణి?

సర్వాః : కి మతఃపర మస్తి ప్రియమ్ ?
                     మరుత్ఖేలాందోళాయిత[85] నళిన పత్ర ప్రణయినో
                     సుధాధారాసార వ్యతికర సమీచీన స్వనా,
                     జనానా మానందం వహలయతు[86] గోవింద! భవతో
                     దృశో రేషా లోలా నటన ఘటనానాం పరిణతః. 54

                    (తథా పీద మస్తు)
                    కవీనా మస్మాకం గతహరిణ పీయూషకిరణ
                    ప్రభాస్పర్దీ బంధాధిక మధురవాచాం పరిచితం,
                    సతాం భూయో భూయో వహతు బహులానందలహరీ
                    పరీవాహస్వేద ద్రవ జలధి కల్లో కపటాత్. 55

                    శుభమస్తు సర్వజగతాం నిరంతరమ్
                    న రిపోరసి స్ఫురతు వై పదంపదం,
                    జగదీశ్వర కపట దారువిగ్రహః
                    కరుణాకటాక్ష లహరీం విముంచతు. 56

                (ఇతి శ్రీ జయదేవరచితం పీయూషలహరీనామ
                            గోష్ఠీరూపకమ్ సమాప్తమ్)

             [Published in Nagari Script in the Journal of
               The Kalinga Historical Research Society]
                                  [Vol - I, part4]
         [Reprinted with due acknowledgment of courtesy]

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.

 
  1. 1ప్రతిభ-జనవరి 1938- 'జయదేవుడు' - రాయప్రోలు సుబ్రహ్మణ్యము పే. 209.
  2. "శిష్యునిపైగల వాత్సల్యంతో అతని దేశానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ శ్రేష్ఠి శిఖామణి స్వామికి తెలియకుండా పల్లకీలో దాచిఉంచిన ధనాన్ని బోయీలే అపహరించి జయదేవుని కాలుచేతులు విరుగగొట్టి యరణ్య మధ్యమున విడిచి పారిపోయినట్లు మరియొక కథ” గీత గోవిందము - పీఠిక : ఎ.వి. నరసింహ పంతులు పే. 12 (M. Adhi & Co. Madras-Publication 1911)
  3. ప్రతిభలో 'జయదేవుడు' (సం. 2 సంచిక 3) అన్న వ్యాసంలో ప్రకటితము.
  4. Journal of the Kalinga Historical Research Society, March 1947 Introduction to Kavi Jayadeva in Gita Govinda-H.K. Mukharji.
  5. మహాపతి భక్త విజయంలో సాత్యకి పరంగా కల్పించిన కథకు ఆధారం లేక పోదన్న మాట. గీతగోవిందాన్ని తీసి భక్తులను తన గోవిందకావ్యాన్ని చదవమని నిర్బంధించిన పురుషోత్తమదేవుని వల్లనే అటువంటి అంశం భక్తవిజయంలో ప్రవేశించి ఉంటుంది. అభినవ గీత గోవింద శ్లోకం ఒకటి గీతగోవిందంలో ప్రతి సర్గాంతంలోనూ చేర్చి చదివినారనటం కూడా అభూత కల్పన ఐఉండదు. నిర్ణయసాగర ముద్రాక్షర శాలవారి గీతగోవింద కావ్యం చివరన ద్వాదశసర్గంలో కనిపిస్తున్న.
  6. ఈ అభినవ గీతగోవింద ప్రతులు నేటికీ ఉత్కలదేశంలో దొరుకుతూవున్నవి. జగన్నాథ స్వామి ఆలయంలో తిరిగి ఈ గీత గోవిందాన్ని ప్రవేశ పెడతారేమో ననే భయంతో నరసింహ, కపిలేంద్ర ప్రతాపరుద్రదేవులు "కేవలము గీతగోవిందాన్ని మాత్రమే జగన్నాథ స్వామి వినవలె నని శాసించినట్లు శాసన ప్రమాణములు కనిపిస్తున్నవట- Vaishnavism in Orissa పే 43.
  7. ఆంధ్రభాషలో గీతగోవిందానికి సంపూర్ణమైన అనువాదం శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావుగారి ఆంధ్రాష్టపది. ముద్దు పళని కొన్ని అష్టపదులను అనుసరించింది. శ్రీ కోమాండూరి కృష్ణమాచార్యులవారు ఒక అష్టపదికి పద్యానువాదం చేసినారు.
  8. మజుందారు గీతగోవిందము అనువాద భూమిక.
  9. శ్రీ గీతగోవిందం-పీఠిక పే7 (సంపాదకుడు. శ్రీ.ఎ.వి. నరసింహంపతులు సం. 1911)
  10. జయదేవకవి-అష్టపదులు - శ్రీమాన్ వింజమూరి వరాహ నరసింహాచార్యులు. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, డిసెంబరు 1937, జనవరి 1938.
  11. సంస్కృత వ్యాఖ్యానముతోను, ఆంగ్లాను వాదముతోను దీనిని శ్రీ కరుణాకర కార్ మహాశయుడు కళింగ చారిత్రక పరిశోధక మండలివారి పత్రికలో సంపాదించి ప్రకటించినారు. సం1. సంచిక 4 మార్చి 1947)
  12. "The real sportive dance of Krishna (Rasa lila) with Radha at the head of the Gopis is fully shown in Gita-Govinda. This fully confirms that Piyusha Lahari is first and Gita-Govinda is the second part of Rasa lila. Piyusha Lahari is a supplement to Gita-Govinda"
  13. డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు అనువాదము
  14. డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు అనువాదము
  15. ఈ అభిప్రాయాన్నే సుకుమార సేన్ మహాశయుడు తన ప్రజబోలీ సాహిత్య చరిత్రలో ఈ రీతిగా పలికినాడు. This outlook of PREMA which we find systematised already in Bhagavata Purana but which does not seem to have affected popular conception of Krishnaism in Bengal up to the 15th Century A.D. We first come across in Bengal in the life of Mahendra Puri, who was the Guru of Advaitacharaya Isvara Puri and other contemporaries of Chaitany Deva. Isvara Puri was the Guru of Chaitanya Deva, so the Spirit of Mahendri passed unto Chaitanya Deva, to be developed into a wonder of the world" - History of Braja Boli lite rature. P.12
  16. రాసో
  17. వృత్తి
  18. నృత్య
  19. కోమలోత్పల
  20. లాస్య
  21. అత్రహి
  22. స్ఫురన్నా ళీ కాళీ
  23. చకోరశీతమయూఖస్య
  24. మండలమహానీలమణేః
  25. లలితా
  26. పండితకవేః
  27. వేళ
  28. రంగమంగళ
  29. కింకిం జ్ఞాపయసికి మాజ్ఞాపయసి
  30. ప్రేమరంగేణ
  31. చిత్తరంజన నందనమ్, చిత్తఖంజన బంధనమ్
  32. సానుసంధానమ్
  33. తుషారదామాచకరచ్ఛయభిః
  34. విలోక్య ఇతిపారోనాస్తి
  35. నాందికాం-నాయికాం
  36. ఇదానీమపి, తదానీమపి
  37. మధు రాలయం
  38. వపి
  39. లేఖవర్ణన.
  40. రదన వసన
  41. సద్భాషా
  42. రదన వసన
  43. సచీత్కారం
  44. సేవక
  45. చంచల
  46. రతిలంపటమానసమ్
  47. కుండల
  48. ద్యుతి
  49. పాఠోనాస్తి
  50. మమ
  51. తత్ర
  52. జనాసనతో
  53. మతం
  54. శంసత్
  55. భీతి
  56. నీవికా సంయమన
  57. భారోపమః
  58. అసౌ
  59. కుచాత్త
  60. ఆనందకందళీ
  61. కుత్రాపి
  62. కథయ ఇతి పాఠోనాస్తి
  63. కంథంచిత్
  64. ఆనందాభిభూతం
  65. ప్రథమైన
  66. బింబోష్ఠే
  67. మదవిభ్రమ
  68. స్మితపరః
  69. బింబాధర
  70. వ్యాధాయమాన.
  71. చీనాంశుకాలంకృత
  72. ప్రసూనాయుధ
  73. గుళికేవ
  74. దళాయతాక్షయా
  75. అంతర్హితో
  76. అపిగళితే
  77. అంజలి ముఖైః
  78. సీత్కృతః
  79. కుసుమ
  80. దాహకరః
  81. సానురాగం
  82. యేన
  83. కుండల
  84. కటాక్షేపాపి
  85. విలోచనమ్
  86. విరచయతు