లోకోక్తి ముక్తావళి/సామెతలు-మొ

2826 మేత కరణము

2827 మేలుమేలంటే మడవిరగబడ్డట్టు

మొ


2828 మొండికితగ్గ మిండము

2829 మొండికి సిగ్గూ లేదు మొరడుకు గాలీలేదు

2830 మొండికి బండకీ నూరేండ్లాయుస్సు

2831 మొండికెక్కినదాన్ని మొగుడెమిచేయును రచ్చకక్కిన దాన్ని రాజేమిచేయును

2832 మొండిచేతితోటి మొత్తుకున్నట్లు

2833 మొండి ముక్కున ముక్కెర వున్నట్లు

2834 మొండివాడు రాజుకన్నా బలవంతుడు

2835 మొక్కబోయిన దేవర ఎదురుగా వచ్చినట్లు

2836 మొక్కబోయిన దేవళము విరిగి మీద పడ్డట్లు

2837 మొక్కుబడే లేదంటే ఒక్క దాసరికైనా పెట్టుమన్నట్లు

2838 మొక్కేవారికి వేరవనా మొట్టేవారికి వెరవనా


2839 మొగము మాడ్పులది మగనికి చేటు యీడ్చు కాళ్ళది యింటికిచేటు

2840 మొగుడి తలమీద మిరియాలు నూరినట్లు

2841 మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడికోడలు వెక్కిరించి నందుకు విచారం

2842 మొగుడు కొట్టితే ముక్కు చీమెడే పోతుంది 2843 మొగుడు చచ్చిమొర్రో అంటుంటే మిండ మొగుడు వచ్చి బిడ్డలు పుట్టిస్తాలే అన్నాడట

2844 మొగుడు చచ్చిన వెనుక ముండకు బుద్ధి వచ్చింది

2845 మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది

2846 మొత్తుకోళ్ళోయి ముత్తంశెట్టి

2847 మొగుడు లేని దానికి మంత్ర సానెందుకు

2848 మొదట మానెడు దూడ చస్తేదుత్తెడు

2849 మొదట మోదుగ పూస్తే, కొనసంపంగి పూసును

2850 మొదటికి మోసం, లాభానికి గుద్దులాట

2851 మొదలు దుర్భరం అందులో గర్బిణి

2852 మొదలు మన్ను కరువువస్తె గడ్డలు

2853 మొప్పులేనివాడే మొదటి సుజ్ఞాని

2854 మొప్పుకు మూరెడు నోరు

2855 మొయిలును నమ్మి చెరువు కట్ట తెగకొట్టినట్లు

2856 మొయిలు విడచిన యెండ, మొగుడు విడచినముండ, వట్టివిడచినమండ, ఎత్తి విడచిన కుండ తీక్షము

2857 మొరకునకు శివమెక్కిన మొక్కక తప్పదు

2858 మొరిగేకుక్క కరవదు

2859 మొర్రో వద్దనగా లింగం కట్టేరు గాని మొక్కచేతులు తేగలరా?

2860 మొల మట్టు దు:ఖములో మోకాలు మట్టు సంతోషం

2861 మొసలిబావా కడింవేరాయిగాని కాలయినాయింతేకదా