లోకోక్తి ముక్తావళి/సామెతలు-మో
మో
2862 మోకాట్లో మడనరంపట్టింది
2863 మోకాలు మణిగిందని ముక్కుముంచు కుంటారా
2864 మోచేయాడితే ముంజేయాడు తుంది
2865 మోటుకు కోపం ముక్కుమీద
2866 మోటకు మొదటిచోటకంపు వన్నెగాడికి వళ్ళంతా కంపు
2867 మోటుగాలికి వరవడు
2868 మోసేవానికి తెలుసు వావటిబరువు
2869 మోక్షానికిపోతే మొసలియెత్తుకపోయింది
2870 మొహం లేకపోతే మూదం లేదు
2871 మెత్తనివారిని మొత్తబుద్ది
2872 మాటాడితేమల్లెలు కాటాడితే కందిరీగలు వొలుతవి
2873 ముప్పైతట్టల పేడమోసేపోలికి మూడుపుంజాల దండ బరువా
2874 ముల్లుతీసి కొర్రడచినట్లు
2875 మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కఆకులు
2876 మొండిచేతివానికి నువ్వులు తిననేర్పినట్లు
2877 మంచివానికి వకమాట మూర్ఖునికి వకచేట
2878 ముగ్గురాడవారుకూడితే పట్టపగలు చుక్కలుపొడుచును