లోకోక్తి ముక్తావళి/సామెతలు-మే
మృ
2809 మృగశిరకు ముంగిళ్లు చల్లబడును
2810 మృగశిర కురిస్తే ముసలియెద్దు రంకె వేయును
2811 మృగశిరలో పైరు మీసకట్టున పుట్టిన కొడుకు
మె
2812 మెచ్చిమేకతో లూ కోరి గొర్రెతోలు కప్పుతారు
2813 మెట్టను మూత పల్లాన భార్య
2814 మెట్టనువున్నా యేనుగే పల్లానవున్నా యేనుగే
2815 మెతుకులు చల్లితే కాకులు తక్కువా
2816 మెడతడవడము పూసలకొరకే
2817 మెత్తనాళ్ళుపోయి చెత్తనాళ్లు వచ్చినవి
2818 మెడకు పడిన పాము కరవక మానదు
2819 మెత్తనివానిని చూస్తే మొత్తబుద్ధి
2820 మెరుగు వెయ్యకగాని మృదువు కాదన్నం
మే
2821 మేక మెడచన్ను
2822 మేకలుతప్పితే తుమ్మలు మాటలతప్పితే యీదులు
2823 మేకవన్నె పులి
2824 మేకుబీకిన కోతి
2825 మేడికాయపై మిసిమి 2826 మేత కరణము
2827 మేలుమేలంటే మడవిరగబడ్డట్టు
మొ
2828 మొండికితగ్గ మిండము
2829 మొండికి సిగ్గూ లేదు మొరడుకు గాలీలేదు
2830 మొండికి బండకీ నూరేండ్లాయుస్సు
2831 మొండికెక్కినదాన్ని మొగుడెమిచేయును రచ్చకక్కిన దాన్ని రాజేమిచేయును
2832 మొండిచేతితోటి మొత్తుకున్నట్లు
2833 మొండి ముక్కున ముక్కెర వున్నట్లు
2834 మొండివాడు రాజుకన్నా బలవంతుడు
2835 మొక్కబోయిన దేవర ఎదురుగా వచ్చినట్లు
2836 మొక్కబోయిన దేవళము విరిగి మీద పడ్డట్లు
2837 మొక్కుబడే లేదంటే ఒక్క దాసరికైనా పెట్టుమన్నట్లు
2838 మొక్కేవారికి వేరవనా మొట్టేవారికి వెరవనా
2839 మొగము మాడ్పులది మగనికి చేటు యీడ్చు కాళ్ళది యింటికిచేటు
2840 మొగుడి తలమీద మిరియాలు నూరినట్లు
2841 మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడికోడలు వెక్కిరించి నందుకు విచారం
2842 మొగుడు కొట్టితే ముక్కు చీమెడే పోతుంది