లోకోక్తి ముక్తావళి/సామెతలు-ని

1934 నాభాగ్యం దేవర చిత్తం

1935 వాభిలో బలంకంటె, నవాబుతో జబాబిస్తాను

1936 నాముందర బానెడు గంజా!

1937 నాడువుంటే నవాబు సాహెబు అన్నంటే అమీరుసాహెబు బీదపడితే పకీరుసాహేబు, చస్తే పీరుసాహేబు

1938 నాడు వ్రాసినవాడు నేదు చెరిపి మళ్ళ వ్రాస్తాడు

1939 నాముందర నీవేమి బ్రతక గలవు

1940 నాయింటికి నేనే పెద్దను పిల్లికి పెట్టరా పంగనామం

1941 నారిగాడు, నారడు, నారాయుడు, నారాయ్య, నారయ్య, నారాయణయ్య, నారాయణరావు, నారాయణరావు పంతులు, నారాయణరావు పంతులుగారు

1942 నారుపోశినవాడు నీరుపొయ్యడా

1943 నాలికతీపు లోనవిషం

1944 నాలికా నాలికా వీపుకు దెబ్బలు తేకే

1945 నావేలు పుచ్చుకోని నాకన్నె పొడిచినావా

1946 నాసిరి కన్నా నా అక్కసిరి, నాఅక్కసిరికన్నా నాసిరి ఘనం

1947 వాళ్ళల్లో కల్లా చిన్ననాడే మేలు

ని

1948 నిండు కుండ తొణకదు

1949 నిజమాడితే నిష్టూరం

1950 నిత్యము చచ్చేవారికి యేడ్చేవారెవరు 1951 నిద్రపోయేవాణ్ణి లేపవచ్చునుగాని మేలుకున్నవా ణ్ణేవరు లేపుతారు

1952 నిద్రపోయినవాడి కాళ్ళకు మ్రొక్కినట్లు

1953 నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచియెరుగదు

1954 నిన్న కుప్పా యివ్వాళ ఆళ్లు

1955 నిన్నవున్నవారు నేడు లేరు

1956 నిప్పుకు చెదలంటునా

1957 నిప్పుకు నీళ్ళకూ వుండే స్నేహం

1958 నిప్పుకు నీళ్ళంటుకొనునా

1959 నిప్పుకొట్టితే నీళ్లవునుగాని నీళ్ళుకొట్టితే రెండగునా

I960 నిప్పునకాలదు నీళ్ళను తడవదు

1961 నిప్పుముట్టనిది చెయ్యికాలదు

1962 నిప్పులబుర్రకు నీళ్ళబుర్ర

1963 నిప్పులు వళ్ళోకట్టుకున్నట్లు

1964 నిమ్మకు నీరెత్తినట్లు

1965 నిర్భాగ్యునికి నిద్ర అభాగ్యునికి ఆకలి

1966 నిలకడలేనిమాట నీళ్ళమూట

1967 నిలునీడ పట్టుకొమ్మాలేదు

1968 నిలుచుంటానికి జాగాదొరికితే కూర్చుంటానికి అప్పుడే దొరుకుతుంది

1969 నివురుకప్పిన నిప్పు

1970 నిశ్చితార్ధమునాడు నీలగవలసినది నాగవల్లిదాకావుండడం నాఅదృష్టమే కదా 1971 నిష్ఠ నీళ్ళపాలు మంత్రం మాలతిపాలు

నీ

1972 నీ అరచెతికి పండ్లువస్తే చూస్తాము

1973 నీకురానిది నాకు యింపుగానిది పాడు

1974 నీకూనాకూకాదు రోలెత్తి తలంబ్రాలుపొయ్యి

1975 నీకురానిది నేను విననిది పాడు

1976 నీకు వొకదణ్ణము నీబువ్వకు వొక దణ్ణము

1977 నీతికాని మాట రాతివేటు

1978 నీతిలేనివాడు కోతికంటె పాడు

'1979 నీనొసటనే ప్రొద్ధుపొడిచినదా

1980 నీకెక్కడ సంశయమో నాకక్కడ సందేహము

1981 నీపెండ్లాం ముండమోస్తే నీకెవరన్నం వండిపెడతారు

1982 నీపెండ్లి పాడైనట్లెవున్నది నాపెండ్లికి తాంబూలానికిరా

1983 నీపేరంటమే అక్కరలేదంటే కరకంచు చీరకట్టుకొని వస్తానన్నదిట

1984 నీబర్రె నెవరుకాస్తారు చూతామంటే నాతిత్తిలో డబ్బే కాస్తుందన్నాడట

1985 నీముష్టి లేకపోతే మానెగాని నీకుక్కను కట్తివెయ్యి

1986 నీయెడమచెయ్యి తియ్యి నాపుర్రచెయ్యి పెట్టుతాను

1987 నీరు నీటివంకనే పారుతుంది

1988 నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

1989 నీలి నీళ్ళకుపోతే బావి లోతుకుపోయిందట