లోకోక్తి ముక్తావళి/సామెతలు-నీ

1971 నిష్ఠ నీళ్ళపాలు మంత్రం మాలతిపాలు

నీ

1972 నీ అరచెతికి పండ్లువస్తే చూస్తాము

1973 నీకురానిది నాకు యింపుగానిది పాడు

1974 నీకూనాకూకాదు రోలెత్తి తలంబ్రాలుపొయ్యి

1975 నీకురానిది నేను విననిది పాడు

1976 నీకు వొకదణ్ణము నీబువ్వకు వొక దణ్ణము

1977 నీతికాని మాట రాతివేటు

1978 నీతిలేనివాడు కోతికంటె పాడు

'1979 నీనొసటనే ప్రొద్ధుపొడిచినదా

1980 నీకెక్కడ సంశయమో నాకక్కడ సందేహము

1981 నీపెండ్లాం ముండమోస్తే నీకెవరన్నం వండిపెడతారు

1982 నీపెండ్లి పాడైనట్లెవున్నది నాపెండ్లికి తాంబూలానికిరా

1983 నీపేరంటమే అక్కరలేదంటే కరకంచు చీరకట్టుకొని వస్తానన్నదిట

1984 నీబర్రె నెవరుకాస్తారు చూతామంటే నాతిత్తిలో డబ్బే కాస్తుందన్నాడట

1985 నీముష్టి లేకపోతే మానెగాని నీకుక్కను కట్తివెయ్యి

1986 నీయెడమచెయ్యి తియ్యి నాపుర్రచెయ్యి పెట్టుతాను

1987 నీరు నీటివంకనే పారుతుంది

1988 నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

1989 నీలి నీళ్ళకుపోతే బావి లోతుకుపోయిందట 1990 నీవుకాకపోతే నీఅబ్బ మరివొకడు

1991 నీవు చచ్చిన రోజులేదు నేను యేడ్వనిరోజూలేదు

1992 నీవుచస్తే లోకమెల్లా యెముకలా

1993 నీవు తలచినప్పుడు బిడ్డను కనాలనా?

1994 నీవు పెట్టకపొతే పెట్టేయిల్లు చూపించు

1995 నీవు నొకందుకు పోస్తే నేను మరివక్కంద్కు తాగుతున్నా

1996 నీసాకులు చట్టుబండలుగాను నాలుగు బేకులు బేకు

1997 నీళ్లకంఠాయి విద్మహే, కొలుకురాయ ధీమహే, తన్నో గుడ్లూరు ప్రచోదయాత్

ను

1998 నువ్వులకు తగిన నూనె

1999 నుంటినిబొడిచి శెలగే అనేవాడు

2000 నుయ్యి తియ్యబోతే దయ్యం బయలు వెళ్లింది

2001 నువ్వుకు నూరు రోగాలు

2002 నువ్వులూ నూనె ఒకటి, గానుగవాడు వెరు

2003 నీళ్ళమీద వ్రాసినమాట

నూ

2004 నూటికిబెట్టి కోటికి గొరిగించేవాదు

2005 నూటికి నూలిపోగు, కోటికి గోవుతోక

2006 నూతికప్పకు సముద్రం చేరువా?

2007 నూనె పోగొట్టుకున్నవాడూ ఏడ్చినవాడు బొండాపకాయ పోగొట్టుకున్నవాడు పొర్లి పొర్లి యేడ్చినాడు