లోకోక్తి ముక్తావళి/సామెతలు-నా

1894 నల్లేరుమీద బండిపారినట్లు

I895 ననాబంత దరిద్రుడు పులిఅంత సాధువు

1896 నయం నష్టకారి భయం భాగ్యకారి

1897 నయానా భయానా

1898 నల్లపూసకు తెల్లపూసాలేదు తెల్లపూసకు నల్లపూసా లేదు

1899 నవగ్రహాలూ వక్రించియున్నవి

1900 నవాయత్ పొట్టా తమలపాకులకట్ట తడువుతూవుండాలి

1901 నవిలేవానికన్న మింగేవాడు ఘనుడు

1902 నవ్వుతూ కోసినముక్కు యేడ్చినారాదు

1903 నవ్వజెప్పేవాడు చెడజెప్పను యేడవజెప్పేవాడు బ్రతికజెప్పును

1904 నవ్వుతూచేస్తే యేడుస్తూ అనుభవింపవలెను

1905 నవ్విన నాపచేనే పండుతుంది

1906 నవ్వుతూ తిట్టితివో నరకాన బడితివో

1907 జవ్వు నాల్గువిధాల నష్టకారి

1908 నవ్వే ఆడదాన్ని యేడిచే మగవాణ్ణి నమ్మరాదు

నా

1909 నాం బడా దర్శన్ ఖోటా

1910 నాకూబెబ్బేబా అంటే నాకుబెబ్బే నీకుబెబ్బే అబ్బకు బెబ్బే అన్నాడట

1911 నాకాయుష్యం నాకారోగ్యం మీకురుణం మాకుధనం 1912 నాకు పరీక్షా నా రాగిచెంబుకు పరీక్షా

1913 నాకూ నాపిల్లకూ నూరేండ్లాయుస్సు నాపెనిమిటికి లోకంతోపాటు

1914 నాకు సిగ్గూలేదు నీకు యెగ్గూలేదు

1915 నాకుసిగ్గూలేదు రేపువచ్చే అమావాస్యకుయెగ్గూలేదు

1916 నాకోడీ కుంపటీ లేకపోతే యెలా తెల్లవారుగుంది

1917 నాకు సొగసెందుకు బాగుంటేచాలు

1918 నాగవల్లి తీర్చినట్లు

1919 నావవల్లి నిష్టూరం

1920 నాగుబాము చిన్నదనద్దు పాలివాడు సన్నమనవద్ధు

1921 నాచెయ్యి నొస్తున్నది నీచేతో మొత్తుకోమన్నాడట

1922 నాచేతిమాత్ర వైకుంఠయాత్ర

1923 నాజూకు నక్కలుదేకితే నెరిసినగడ్డం కుక్కలు పీకినవి

1924 నాటకములు బూటకములు బోటితనములు నీటులు

1925 నాడుకట్టాలేదు, నేదుచించాలేదు

1926 నాడు నిలబడలేదు, నేడు కూలబడలేదు

1927 నాడులెంచెవారేగాని గోడు చూచేవారు లేరు

1928 నాధుడు లేని రాజ్యం నానాదారులైనది

1929 నానాటికి తీసికట్టు నాగంభొట్లు

1930 నాప్రతివ్రతాధర్మం నా మొదటి భర్తకు తెలుసు

1931 నానెత్తురు నానోట కొట్టు తాడు

1932 నాపప్పు కలిసినంత నేనే తింటాను

1933 నాపాదమెగతి అన్నట్లు 1934 నాభాగ్యం దేవర చిత్తం

1935 వాభిలో బలంకంటె, నవాబుతో జబాబిస్తాను

1936 నాముందర బానెడు గంజా!

1937 నాడువుంటే నవాబు సాహెబు అన్నంటే అమీరుసాహెబు బీదపడితే పకీరుసాహేబు, చస్తే పీరుసాహేబు

1938 నాడు వ్రాసినవాడు నేదు చెరిపి మళ్ళ వ్రాస్తాడు

1939 నాముందర నీవేమి బ్రతక గలవు

1940 నాయింటికి నేనే పెద్దను పిల్లికి పెట్టరా పంగనామం

1941 నారిగాడు, నారడు, నారాయుడు, నారాయ్య, నారయ్య, నారాయణయ్య, నారాయణరావు, నారాయణరావు పంతులు, నారాయణరావు పంతులుగారు

1942 నారుపోశినవాడు నీరుపొయ్యడా

1943 నాలికతీపు లోనవిషం

1944 నాలికా నాలికా వీపుకు దెబ్బలు తేకే

1945 నావేలు పుచ్చుకోని నాకన్నె పొడిచినావా

1946 నాసిరి కన్నా నా అక్కసిరి, నాఅక్కసిరికన్నా నాసిరి ఘనం

1947 వాళ్ళల్లో కల్లా చిన్ననాడే మేలు

ని

1948 నిండు కుండ తొణకదు

1949 నిజమాడితే నిష్టూరం

1950 నిత్యము చచ్చేవారికి యేడ్చేవారెవరు