రుక్మిణీపరిణయము/చతుర్థాశ్వాసము
చతుర్థాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము సూతుఁ డి ట్లఖిలమౌని, వరుల కెఱిఁగించినట్టు లావ్యాసపుత్రుఁ | 2 |
తే. | అవనివర మున్నె తొలునాఁడు హరిని బిలువ, నవనిపతిపుత్రి యనిచిన యగ్రజన్మ | 3 |
మ. | చని యవ్విప్రవరుండు గాంచె నెదురం జంబీరమందారచం | 4 |
సీ. | శుకభరద్వాజకౌశికవరద్విజసభాభవనమై నైమిశాటవివిధమునఁ | |
తే. | నలరుహిమజలమధుఝరీతలసితాభ్ర, పులిననలినాస్త్రకలనాప్రభూతఘర్మ | 5 |
తే. | పద్మినులఁ గూడి సంభోగపరవశమునఁ దనరుపున్నాగనికరసత్తమములందు | 6 |
సీ. | కరులు మేఘములు శీకరకదంబము వాన కీచకధ్వనులు భేకీరవములు | |
తే. | హరినఖరదారితోన్మదద్విరదకుంభ, గళితముక్తావళుల్ వడగండ్లగములు | 7 |
చ. | చనిచని ధారుణీవిబుధచంద్రుఁడు ముందర డెంద ముబ్బఁగాఁ | 8 |
ఉ. | ధీవరకోటి కెప్పుడు నదీనము చేరి ఘనుల్ వసించినన్ | 9 |
క. | వేలానిలదేలామల, జాలాఖిలసుమసమూహసౌరభలహరీ | 10 |
చ. | ఉదధిమహారవంబు లపు దుర్విసురాధిపుఁ డాలకించి తా | 11 |
చ. | తటవిటపిప్రసూనకలితభ్రమరారవముల్ సుగీతముల్ | 12 |
తే. | హరిహయునివజ్రధారకు వెఱచి యమిత, వాహినీనాథుఁ డంచు నవ్వారిరాశి | 13 |
క. | సందరమున నురు వలరె ము, కుందుని పెండ్లికిని బిలుచుకొఱ కరిగెడుభూ | 14 |
తే. | మీనవృశ్చికకర్కటమిథునమకర, హరివృషాదులు రాసులై యలర నుడుప | 15 |
ఉ. | వాలికమీలఁ జట్టుచు నవారితకౌతుకలీలఁ దేలుచో | 16 |
సీ. | బహుతరవాహినీపరివృతుఁ డయ్యును గడు నబ్బురముగ భంగంబు నొందె | |
| దవిలినమర్యాద దాఁటక యుండియుఁ బరిపరివిధముల భ్రమ వహించె | |
తే. | గటకటా దైవ మెటువంటిఘనులనైనఁ, గట్టిఁడితనంబుచే వెతఁ బెట్టుచుండు | 17 |
క. | ఇతఁడే కమలావాసుం, డితఁడే తథ్యము సరస్వతీశుఁడు నితఁడే | 18 |
క. | అని మది నెంచుచు భూసుర, తనయుఁడు వేవేగ నరుగుతఱి మార్గవశం | 19 |
సీ. | అభ్రాపగాహాటకాబ్జపరాగసంఛాదితాఖిలరత్నసానుతలము | |
తే. | ఘనమునీంద్రోత్తమాశ్రమసనరసాల, సాలకిసలయఫలరసాలోలబాల | 20 |
సీ. | ఘనులకెల్లను దావకం బగుధీరుండు ప్రతిదినకల్యాణభాసమానుఁ | |
తే. | యాధరాధీశుఁ డవనిసురాగ్రగణ్యుఁ, గాంచి కలరవరుతసూక్తిఁ గదియఁ బిలిచి | 21 |
మ. | ప్రకటైరావతపారిజాతతరురంభాశక్రహేమాహృతా | 22 |
సీ. | నానాప్రసూనలీనోన్మదాలీనతానమానములు గీతములు గాఁగ | |
తే. | గేరి నటియించుసరసమయూరికాక, దంబములు నర్తకులు గాఁగ డంబుమీఱి | 23 |
చ. | తనులతలు న్నితంబము లుదగ్రపయోధరముల్ ప్రవాళశో | |
| ఘనగజయానముల్ భ్రమరకంబులు సత్కలకంఠనాదముల్ | 24 |
తే. | వీనులకుఁ బండు వయ్యె నహీనమై న, వీనమధుపానపీనకులీనసూన | 25 |
తే. | నాగకదలీకదంబపున్నాగశల్య, రోహితర్క్షశివాదులఁ బ్రోచి మఱియు | 26 |
ఉ. | భిల్లసరోజలోచనలు పింఛపటంబులు గట్టి గట్టుపైఁ | 27 |
సీ. | నీలకంఠాకృతి నెఱిఁ బూని యానందతాండవం బాడుశిఖండితతులు | |
తే. | బరమహంసస్వరూపంబు సరవిఁ దాల్చి, బ్రహ్మపదబుద్ధిఁ జెలఁగుమరాళములును | 28 |
తే. | సదమలాహీనకటకుఁడు చంద్రధరుఁడు, నీలకంఠోల్లసితుఁడు మానితవృషాంకుఁ | 29 |
ఉ. | ఆవసుధాధరంబున విహారము చేయుచుఁ జూచె నొక్కచో | 30 |
ఉ. | కాంచి తదీయమూర్తిఁ గుతుకంబున డెందమునందు నిల్పి య | 31 |
చ. | జయజయ పార్వతీశ శివశంకర భూరిసమిద్భయంకరా | 32 |
దండకము. | శ్రీమద్గిరీశాయ ధీమత్ప్రకాశాయ, కాశాబ్దభేశాశంగాశ్వాధిపాకాశగంగా | |
| వాగ్భామినీహారనీహారహీరాభదేహప్రభాశాలినే, శూలినే, శంభవే, దంభవేదండ | 33 |
క. | పరమేశ నీస్వరూపము, సరసిజగర్భాదులకును సనకాదులకుం | 34 |
క. | జగములలో నీ వుందువు, జగములు నీయందు నుండు సర్వము నీమూ | 35 |
తే. | ఉరిడెపురు గెల్లవేళల బురదలోనె, పొరలుచుండియుఁ బంకంబుఁ బొందనట్లు | 36 |
చ. | కలల సమస్తస్తువులు గాంచినఁ దథ్యము గానికైవడిన్ | 37 |
ఉ. | జ్ఞానవిహీనమానవుఁడు శాస్త్రము లెన్ని యెఱింగినన్ మిముం | 38 |
తే. | జలఘటాదులయం దబ్జసారసాప్త, బింబములు పెక్కు లగుచుఁ గాన్పించుభంగి | 39 |
క. | కర్మములఁ దవిలి కొందఱు, నిర్మలపరసౌఖ్య మెఱుఁగనేరక యెపుడున్ | 40 |
తే. | అనుచుఁ దననేర్చుతెఱఁగున నభవుఁ గొల్చి, యచ్చోటు దొలంగి యరుగుచు నందునందు | 41 |
క. | ధరణీసురాగ్రగణ్యుఁడు, పరమానందమునఁ గాంచె బహుతరమణిగో | 42 |
ఉ. | కాంచి పురంబుఁ జేరి మణికల్పితశిల్పకచాతురీకళా | 43 |
సీ. | నీలజాలకజాలనిష్క్రాంతకౌశికఘనసారధూపవాసనలచేత | |
తే. | ద్వారతోరణకుముదకల్హారసార, సారసామోదములచేత ధీరవరుఁడు | 44 |
సీ. | మఖహోమనిఖిలాగమప్రణాదములచే భాసిల్లుభూసురావాసములును | |
| నవరత్నధనధాన్యవివిధవస్తువులచే బలితంబు లగువైశ్యభవనములును | |
తే. | సతతనర్తితనర్తకీజనసరత్న, కనకమంజీరఘంటికాధ్వనులచేత | 45 |
తే. | శంఖవరనీలకుందకచ్ఛపముకుంద, మకరపద్మమహాపద్మనికరములను | 46 |
తే. | కేల గిరి యెత్తువరబలశాలి యగుటఁ, జేసి పేరైనపర్వతశ్రేణుల్లెల్ల | 47 |
క. | బంధురగతి నిచ్చోటున, గంధర్వావళుల నీనఁగాఁ బోలుఁ జుమీ | 48 |
తే. | కమలజావాస మెప్పుడు గలిగియుండు, విబుధలోకంబు నిబిడమై వెలయుచుండు | 49 |
క. | అని తలఁచుచుఁ జని భూసుర, తనయుఁడు వేడుకలు మీఱ దైత్యారినికే | 50 |
చ. | విని హరి నీలవర్ణుఁ డరవిందభవాన్వయుఁ దోడితెం డటం | 51 |
తే. | శౌరిఁ గన్గొనుభాగ్యంబు సంభవించె, నంచు నెంతయు సంతసం బాత్మ నలర | 52 |
సీ. | క్షీరవారాశివీచిక లంచు మది నెంచు హీరసోపానంబు లెక్కుచోటఁ | |
తే. | నహికులేంద్రఫణాగ్రంబు లంచు నెంచు, నబ్జరాగకవాటంబు లలరుచోట | 53 |
సీ. | పగడంపుగుండ్రగంబములు బాజుల నిల్పి పన్నినముత్యాలపందిరులును | |
తే. | నబ్జరాగశిలావలికాంచలప్ర, లంబనవనవరత్నకదంబరుచిర | 54 |
చ. | కలకలనాదము ల్సెలఁగఁ గంసవిరోధికథాప్రబంధముల్ | 55 |
తే. | పఱపుగలవట్టివేళ్ళచప్పరము లొరసి, మేటిపన్నీటివాఁగులు మించి మంచి | 56 |
సీ. | అభినవపద్మరాగాశ్మకవాటముల్ చారుహరిన్మణిద్వారములును | |
తే. | సాంద్రముక్తాఫలామలచ్ఛాదనములు, పృథులజాంబూననాబద్ధభిత్తికలును | 57 |
చ. | అపరిమితప్రసూననిఖిలాగరుజాపకసౌరభంబులుం | 58 |
సీ. | సైకపుజరబాజుచందువా నొదవిన మేలిముత్యాలజాలీలు వ్రేల | |
,ే. | బరిమళద్రవ్యములు నించి వరుస నిడిన, చంద్రకాంతపుగిండులు జానుమీఱ | 59 |
తే. | కొలఁది మీఱినచిత్రలీలలఁ జెలంగి, యనుపమం బగునిద్దపుటఱ్ఱలోనఁ | 60 |
సీ. | కనకకంకణఝణత్కారం బలర నొక్కమదహంసయాన చామరము విసర | |
తే. | గంబుకంఠి యొకర్తు గానంబు సేయ, భామ యొక్కతె బలుదమ్మపడిగఁ బూనఁ | 61 |
తే. | తరుణు లిరువురు భోజసుతాస్వరూప, లిఖితనవచిత్రఫలకముల్ వేడ్కఁ బూని | 62 |
సీ. | విరిసరుల్ సుట్టి వావిరి నొయారము మీఱ నొరగ వైచినసికయొఱపు చూప | |
తే. | గొప్పముత్యాలచౌకట్లు కొమరుదేట, బవరిగడ్డంపుజిగితోడఁ దవిలి మెఱయ | 63 |
సీ. | జయజయ కమలాక్ష సకలలోకాధ్యక్ష జయజయ నవనీతచౌర్యధుర్య | |
తే. | జయ నిరంతరవల్లవీజనకుచాగ్ర, రచితరుచితరపరిమళప్రచురగంధ | 64 |
తే. | అనుచుఁ గైవార మొనరించి యవ్విరించి, కులశిరోమణి విలసితజలదవర్ణు | 65 |
క. | ఆవిప్రోత్తముఁ గన్గొని, గోవిందుఁడు భర్మడోల గొబ్బున డిగి సం | 66 |
తే. | సురలు దనుఁబూజ యొనరించుకరణి నతనిఁ, బూజ గావించి కుశలంబు పొసఁగ నడిగి | 67 |
చ. | వినయవివేకము ల్వెలయ విప్రకుమారునిఁ జూచి వెన్నుఁ డి | 68 |
క. | అనవుడు హరిఁ గనుఁగొని యో, దినకరనిభ విను విదర్భదేశంబునఁ గుం | 69 |
తే. | అతనిపుత్రిక రుక్మిణి యనఁగఁ బరఁగు, కన్యకామణి గల దయ్యగణ్యపుణ్య | 70 |
క. | మునివల్లభ దుర్లభమై, తనరెడుభవదీయచరణతామరసయుగం | 71 |
ఉ. | కన్నియ కీక్రియం బలుకఁగాఁ దగ దంచుఁ దలంచెదేనియున్ | 72 |
చ. | నిరతము తావకాంఘ్రియుగనీరజభక్తిఁ జెలంగునన్ను నో | 73 |
క. | ఉడుగనియాసలఁ దము నె,య్యెడ నమ్మినసాధుజనుల నేఁచెడుఖలులన్ | 74 |
తే. | తడయఁ బనిలేదు వేవేగఁ దరలి వచ్చి, కలన శిశుపాలమాగధాదుల జయించి | 75 |
తే. | రాజశుద్ధాంతసౌధాంతరమున మెలఁగు, నిన్ను నేక్రియఁ దేవచ్చు నిఖిలబాంధ | 76 |
క. | కులదేవియాత్ర యొనరిచి, వలనుగఁ బురి వెడలి శివునివనితకు మ్రొక్కం | 77 |
తే. | అట్లు శివవల్లభకు మ్రొక్క నరుగుతఱిని, సరగఁ బఱతెంచికొనిపొమ్ము కరుణఁ జేసి | 78 |
మ. | అని నీచెంగట విన్నవింపు మని యయ్యబ్జాస్య పుత్తెంచె నో | 79 |
క. | ఆకాంతాజనరత్నము, నీకుఁ దగుం దగుదు నీవు నృపకన్యకకున్ | 80 |
క. | ఓచక్రధర నిజంబుగ, భూచక్రమునందుఁ గల్గుపొలఁతులు తులగా | 81 |
క. | వన్నెలనెల వన్నెలఁతుక, వెన్నెలదొర కళ యనన్ భువిన్ విలసిల్లున్ | 82 |
క. | కుందము లాదంతము లర, విందము లాపదము లుదధివిలసద్వీచీ | 83 |
సీ. | భృంగముల్ సింగముల్ తుంగగంగాసరిద్భంగముల్ మత్తచక్రాంగములును | |
తే. | దుల యగునె దానికచమధ్యనళిసుయాన, గళరదననేత్రముఖహాసలలితవచన | |
తే. | అబ్జబింబోపమానంబు లగుచు లోచ, నాధరంబులు వదనంబు నలరుఁ జెలికి | 85 |
సీ. | విశ్వంభరాకృతి వెసఁ బూనె జఘనంబు హరివిలాసస్ఫూర్తి నలరెఁ గౌను | |
తే. | సరసిజాక్షికి సకలాంగసౌష్ఠవంబు, ప్రణుతి యొనరింప నీరీతిఁ బరఁగునపుడు | 6 |
క. | హరిణీనిభమణివిరచిత, హరిణీప్రభనయనవిజితహరిణీసభ యా | 87 |
సీ. | అరుణాధరోష్ఠి యయ్యబలాశిరోమణి చంద్రబింబాస్య యాజలజగంధి | |
తే. | రుచిరకేతుప్రకాశ యారుక్మవర్ణ, గావున నుద్రగ్రశుభసుఖకారణ మగు | 88 |
తే. | నదము పొక్కిలి మృదుకోకనదము పదము, దరము కంఠంబు నలినసుందరము కరము | 89 |
ఉ. | డంబుగదే పిఱుందు పగడంబుగదే జిగిమోవి చంద్రఖం | 90 |
సీ. | కనకాంగిముద్దుమొగంబు పద్మము సేయుఁ గలకంఠిగళము శంఖంబు సేయుఁ | |
తే. | నామధేయంబు రుక్ష్మిణి నాఁగఁ బరఁగుఁ, గావున నధీశ వేనోళ్లు గల్గినట్టి | 91 |
క. | బింబోష్ఠికురులు హరినీ, లంబుల మదపుష్పలిట్కులంబుల ఘనజా | 92 |
మ. | జలజాతావళి నేఁచుదుష్కృతముచేఁ జాలం గళాహీనుఁడై | |
| న్నెలఱేఁ డాచెలీవక్త్రమై వెలసి పూన్కిం దానినేత్రాంబుజం | 93 |
క. | గణుతింపఁగ మధుపానపు, గుణ మెక్కుచు దిగుచు నుండు కుసుమాస్త్రునిసిం | 94 |
మ. | క్షయరుక్పీడితుఁడున్ గళంకియు ఘనస్వర్భానుదంష్ట్రాక్షత | 95 |
చ. | కమలదళాక్షినాస ననగంధఫలిన్ విరియించుమించుట | 96 |
సీ. | జలజాక్షిపెదవితో సాటి నొందకయేమొ నెఱిబింబఫలము మాధురినిఁ బాసెఁ | |
తే. | విమలమాధుర్యయుక్తమై విలువ దెగక, దృఢశిలాప్రాయమును గాక దివ్యగంధ | 97 |
క. | పలువిరుస మొల్లమొగ్గల, బలువరుసల గెల్వఁజాలుఁ బైదలిలేన | 98 |
తే. | చెలువకంధరక్రముకంబుఁ బలువిధముల, వ్రక్కలుగఁ జేయుదక్షిణావర్తశంఖ | 99 |
క. | రతిమనసిజకేళీవన, సతతవిరాజితరసాలశాఖాయుగ మ | 100 |
సీ. | చంద్రయోగమునకుఁ జాలఁ దల్లడమంది కవ వీడి పాఱుజక్కవలు తులయె | |
తే. | నన్నెగాఁ జంద్రహిమజలవజ్రహార, భద్రగంధివహోద్ధతిఁ బరఁగుచుండి | 101 |
చ. | వెలయఁగ నాభికాబిలము వెల్వడి సిబ్బెపుగబ్బిగుబ్బలన్ | |
| గలవలియూర్పుఁదెమ్మెరలు గైకొనులీల బిలేశయంబనం | 102 |
చ. | అనుపమనీలలాలితనిజాలకజాలకజిల్గుఁగౌనుతో | 103 |
క. | వళు లలరు మత్తదంతా, వళకుంభస్తనయుగళికి వనధితరంగా | 104 |
తే. | తరుణియూరుద్వయంబుతోఁ గరికరములు, వాద మొనరింపఁజాలక వంగిపోయె | 105 |
తే. | కమలపత్రాక్షశంఖచక్రములు నీకుఁ, గరములం దుండుగాని యాతరుణి కెపుడు | 106 |
శా. | ఆకాంతామణి యాబుధద్విరదకుంభాంచన్మహోరోజ యా | 107 |
చ. | అనుటయు శౌరి సంతసిలి యౌ నవనీసురవర్య తథ్య మీ | 108 |
ఉ. | కన్నియరూపవైభనము కన్నులఁ గట్టినయట్ల యుండు వి | 109 |
సీ. | ఆతటిల్లతదేహ మభినవలీలలఁ గదిసి యుండనిఘనాభ్యుదయ మేల | |
తే. | బాల నేవేళ నెద నిడి పరమహర్ష, జలధి నోలాడకుండెడుసకలరాజ్య | 110 |
క. | అని పల్కి యాక్షణంబునఁ, దనుజకులారాతి దా విదర్భావనికిం | |
| జన నుద్యోగం బొనరిచి, తనపంపున సూతుఁ డైనదారకుఁ డెలమిన్. | 111 |
తే. | సైన్యసుగ్రీవమేఘపుష్పకసలాహ, కంబులను ఘోటకంబులఁ గట్టి గరుడ | 112 |
క. | ద్విజరాజవంశచంద్రుఁడు, ద్విజకులచంద్రున కనర్ఘదివ్యాభరణ | 113 |
క. | అని మునిజనులకు సూతుఁడు, వినిపించినరీతిఁ బ్రీతి వెలయఁ బరీక్షి | 114 |
మ. | శరదిందూపమదేహనిర్జితవిపక్షవ్యూహకైలాసభూ | 115 |
క. | శారదనీరదనారద, పారదఘనసారహారపాటీరసుధా | 116 |
మాలిని. | జలనిధివరతూణా సత్యవాక్యప్రమాణా | 117 |
గద్య. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి | |