రుక్మిణీపరిణయము/పంచమాశ్వాసము
పంచమాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము సూతుం డమ్మునిశ్రేష్ఠుల కెఱిఁగించినతెఱంగున శుకుండు పరీక్షి | 2 |
ఉత్సాహ. | ముదముతోడ నేకరాత్రమున విదర్భభూమికిన్ | 3 |
పంచచామరము. | మురారియానతిన్ మదిం బ్రమోద మూని యంతటన్ | 4 |
ఉ. | దిగ్గున లేచి విప్రకులధీమణికిం బ్రణమిల్లి జాళువా | 5 |
తే. | అలకళానిధిరాక కుత్పలము లాస, నొందుక్రియను మదీయనేత్రోత్సలంబు | 6 |
మ. | రమణన్ విప్రుఁడు శౌరిపట్టణము చేరం గల్గెనో లేక మా | 7 |
క. | ద్విజవర నీ వరిగినపని, గజిబిజియై చనెనొ నిన్నుఁ గన్గొని వికచాం | 8 |
క. | అని ఘన మగుచంచలబు, ద్ధిని నాపని విన్నదాఁకఁ దివిరెడుకన్యా | 9 |
సుగంధివృత్తము. | కామినీమణీమణిప్రకల్పితేందుశాలికా | 10 |
సీ. | తళుకుఁజెక్కులధగద్ధగలపై ముత్యాలచౌకట్లనిగనిగల్ చౌకలింపఁ | |
తే. | నుదుటఁ గస్తూరిరేఖసొం పొదవి పొదల, దివ్యమణిభూషణద్యుతుల్ దిశలఁ బర్వ | 11 |
క. | పున్నమచందురుఁ డనఁదగు, వెన్నుని నటఁ జూచి నీదువృత్తాంతం బా | 12 |
క. | నీసుగుణరూపయౌవన, భాసురసుకుమారతలకుఁ బలుమఱు మది ను | 13 |
తే. | కనకభూషణమణిగణధననవాంబ, రాదికము నా కొసంగి దా నపుడె కదలి | 14 |
క. | వనితా నీభాగ్యంశం, బున నిపు డాచెలువుఁ డబ్బె భోగీశ్వరుఁడున్ | 15 |
తే. | వానియాకార మారమావరకుమార, మారమాధవధవళాంశుమానితంబు | 16 |
సీ. | విరిదమ్మిఱేకులసిరి మించుకనుదోయి నిండుఁజందురుఁ దేరునెమ్మొగంబు | |
తే. | పటుకవాటంబుతో సాటిఁ బరఁగుఱొమ్ము, చిగురుటాకులసొంపెల్లఁ దెగడునడుగు | 17 |
ఉ. | చెప్పెడి దేమి యావిభునిచెల్వము గాంచినఁ గమ్మఁదేనియల్ | |
| ముప్పిరిగొన్నమోహపుసముద్రములోపల నీఁదుచుండి యా | 18 |
తే. | వేయిదెఱఁగుల నయ్యదువీరుచెలువు, పూని వినుతింప నేటికి వానిఁ బోలి | 19 |
తే. | అనిన విని యాత్మ నుప్పొంగి యవ్వరాంగి, పెన్నిధానంబుఁ గన్గొన్న పేదయట్లు | 20 |
మ. | ధరణీదేవకుమార నీమహిమ చిత్రం బెన్న నిద్ధాత్రి నె | 21 |
క. | కన్నియతలఁ పిది యెం తని, యెన్నక కారుణ్యదృష్టి నీక్షించి తగన్ | 22 |
క. | ఆరయ నీఋణ మింతయుఁ, దీరుపఁ గా నేర వసుమతీసురవంశో | 23 |
తే. | అని నమస్కార మొనరించె నంత రామ, కృష్ణు లేతెంచి రని విని కేవలప్ర | 24 |
చ. | నగరికిఁ దోడితెచ్చునెడ నవ్యకుతూహలహృత్పయోజలై | 25 |
చ. | కలికి యొకర్తు కన్గనను గస్తురి దిద్ది లలాటపట్టికం | 26 |
చ. | పొలఁతుక యోర్తు నవ్యమణిభూషణముల్ ధరియించుచుండి యా | 27 |
తే. | వీడి జీరాడుపెన్నెఱుల్ గూడఁబట్టి, తత్తఱంబున హరిఁ జూడఁ దరుణి యోర్తు | 28 |
ఉ. | కంచెల విప్పి యోర్తు తనగబ్బిచనుంగనపైని వాసనల్ | |
| కొంచక వ్రాయుచుండి యదుకుంజరుఁ గన్గొనఁ జేర షట్పదా | 29 |
ఉ. | బంగరుతమ్మిమొగ్గ లొకభామయురంబున నించి వేడ్క ను | 30 |
సీ. | మృగమదామోదముల్ జగతి నంతట నిండ గడగడ సైకపునడుము వడఁకఁ | |
తే. | జిలుఁగుచెంగావిపావడ చిందులాడ, నెమ్మొగంబున నవ్వువెన్నెలలు పర్వ | 31 |
ఉ. | గొల్లమెఱుఁగుఁబోండ్లు జిగిగుబ్బలఁ గ్రుమినఱొమ్ముకం దిఁకం | 32 |
తే. | బిత్తరి యొకర్తు దోయిట ముత్తియంపు, సేసఁబ్రా లిడి యావృషభాసురారి | 33 |
చ. | గొనకొని వీథివీథులను గుంపులు గూడి దరస్మితాంచితా | 34 |
సీ. | కలికిరో యీతఁడే కులుకుఁబ్రాయపుగొల్లకన్నెల నలపించువన్నెలాఁడు | |
తే. | మబల యీతఁడె బృందావనాంతరప్ర, చారభిల్లనితంబినీచారుదృక్చ | 35 |
క. | తగు నీచెలువుఁడు భీష్మక, జగదీశ్వరసుతకు భోజజనపతిసుతయుం | 36 |
తే. | అనుచుఁ బౌరాంగనలు చేరి యభినుతింప, నంత భీష్మకుఁ డాప్రలంబాంతకాబ్జ | 37 |
క. | క్షితిధరసుతఁ గొల్వఁగ సు, వ్రతయై తగురుక్మిణీకురంగాక్షి నలం | 38 |
క. | వారును ధరణీవరక, న్యారత్నముఁ జేరి నిశ్చలానందమునన్ | 39 |
ఉ. | కౌను చలింప నిద్దపుమొగంబునఁ జెమ్మట ముంపఁ గంకణ | 40 |
తే. | కస్తురియుఁ జందనంబును గలపి యొకతె, నలఁగువెట్టెను ధారుణీనాథసుతకుఁ | 41 |
తే. | జాళువాబిందియలను గొజ్జంగినీరు, నింతి జలకంబు లాడించి చంచలాక్షి | 42 |
తే. | అగరుధూపంబు లిడె నొక్కచిగురుఁబోణి, నెఱులవేనలి యిడె నొకనీలవేణి | 43 |
సీ. | నీలంపుగుంపుపై మేలిముత్తెము లున్నకరణి గొప్పున మొల్లవిరిసరంబు | |
తే. | బొందుపఱిచి సరత్నజాంబూనదాంఘ్రి, కటకకంకణకింకిణీకాంచికాంగ | 44 |
క. | నరనాథున కెఱిఁగించినఁ, బరితోషము నొంది యిపుడె బాలామణి నీ | 45 |
సీ. | లతకూన యోర్తు మొల్లముగఁ గ్రొన్ననలు నబ్జానన యోర్తు హిమాంబువులును | |
తే. | లెలమిఁ గొని రాఁగ దూర్యము ల్చెలఁగి మ్రోయ, భద్రగీతము లుడుగక పాడుకొనుచు | 46 |
క. | బాలారత్నము శివుని, ల్లాలిగృహంబునకు నరిగి యం దయ్యమకున్ | 47 |
తే. | గంధపుష్పాక్షతాంబరకనకభూష, ణోపహారఫలానేకధూపదీప | 48 |
సీ. | జయజయ జగదంబ సరసగుణాలంబ జయజయ శుభమూర్తి సారకీర్తి | |
తే. | జయ పదాంభోజ సంసక్తచంచరీక, నికరశంకాకరామరానీకనిటల | 49 |
శా. | అక్షీణప్రతిభావిభాసితబుధేంద్రానందసంధాయినీ | 50 |
చ. | కరతలకీరడింభవినిఖండితశుంభనిశుంభసంభృతాం | 51 |
చ. | నిరుపమభక్తియుక్తులను నిత్యముఁ జిత్తమునందు ముందు నీ | 52 |
క. | అమ్మా శంభునిమోహపుఁ, గొమ్మా బంగారుబొమ్మ కోర్కులు దయతో | 53 |
తే. | అనుచు నుతిచేసి విప్రకామినుల కపుడు, గంధమాల్యాభరణవస్త్రకంఠసూత్ర | 54 |
సీ. | జలదమధ్యంబున వెలువడి చెలువుల వఱలెడుక్రొక్కారుమెఱుఁ గనంగఁ | |
తే. | పుడమిఱేఁడులమానసాంబుజవనములు, గలఁపఁ బఱతెంచువలఱేనిగంధకరి య | 55 |
సీ. | తాటంకరుచులు నిద్దపుఁజెక్కులను బర్వఁ జికురముల్ మొగమునఁ జిందులాడ | |
తే. | నధరబింబారుణప్రభ లమలరదన, కుందతతులకు రాగంబుఁ గూర్ప రుచిర | 56 |
చ. | సురటి యొకర్తు వీవ నొకసుందరి యాకుమణుంగు లియ్య బం | 57 |
తే. | శంబరారాతి కుసుమకదంబకములు, దమయురంబులు గాఁడంగఁ దవిలి యేయ | 58 |
క. | బళిరా ఘనధమ్మిల్లం, బళిరా చెలిరదనపఙ్క్తి యభినవముక్తా | 59 |
ఉ. | ఖంబు గదే కవున్ శ్రుతిసుఖంబు గదే సుడి షట్పదీమయూ | 60 |
క. | తరుణీమణిచన్గవకున్, బురు డొనరుప నించుకై నఁ బోలునె సుమమం | 61 |
సీ. | విరళమై తనుఁ దానె వీడి పాఱకయున్న ధరఁ గళాహీనతఁ బరగకున్న | |
తే. | ఘనశశికుముదకిసలయకమలముకుళ, భంగరంభాకలమగర్భపఙ్క్తి సాటి | 62 |
సీ. | అరవిందశరకుందదరబృందముల మాఱు మదనితీముఖనేత్రరదగళములు | |
తే. | లహహ యిక్కన్యకామణి యఖిలభువన, మోహనాకారరేఖాసమున్నతముగఁ | 63 |
తే. | అనుచు నృపులెల్ల విభ్రాంతి యలరఁ జూచు, చుండి రయ్యెడ భోజభూమండలేంద్ర | 64 |
సీ. | సజలనీరదనిభశ్యామదేహమువాని హరినీలముల నేలుకురులవానిఁ | |
| మినుకులీనెడుమంచిమెఱుఁగుఁజెక్కులవాని నగవుదేఱెడిముద్దుమొగమువానిఁ | |
తే. | దలిరుటాకులఁ బోలుపాదములవాని, సిరుల కిర వగుకాంచనాంబరమువాని | 65 |
ఉ. | సంతస మంది యీనృపతిచంద్రునితోడ జయంతుఁడు న్నిశా | 66 |
ఉ. | అద్దిర రాకుమారుమొగ మందము పున్నమచందమామతో | 67 |
క. | నునుమేనుడాలు తొలుకరి, పెనుమబ్బులఁ దఱుమఁజాలుబింబము పగడం | 68 |
తే. | తమ్మిఱేకుఁలఁ దెగడునేత్రములవాఁడు, ఇమ్ముమీఱు వెడందయురమ్మువాఁడు | 69 |
ఉ. | ఈరుచిరాస్యుఁ డీసరసుఁ దీవిభుఁ దీనవమోహనాంగుఁ డీ | 70 |
క. | అని వనజదళాయతలో, చన దనడెందమున మిగులసంతోషరసాం | 71 |
క. | అంబుజనయనుఁడు నపు డా, బింబాధర చెలువుఁ జూచి ప్రేమ దలిర్పన్ | 72 |
తే. | మహికి లంఘించి రాజకుమారిఁ దెచ్చి, రథముమీఁదట నిడుకొని ప్రధనవిజయుఁ | 73 |
ఉ. | అత్తరి మాగధాదులు మురారిజయంబు సహింపలేక యు | 74 |
మ. | భటవాహేభశతాంగఘట్టనల భూభాగంబు గంపింపఁ ద | |
| క్కట నంభోరుహబాంధవుం బొదివి లోకం బంతట న్నిండుఁజీఁ | 75 |
క. | దురదుర దురమున కేపు గ, దురఁ దురగేభములతో నెదు రెదు రరుల నం | 76 |
క. | దేవా వీక్షింపుము రిపు, భూవరసైన్యములు గదసి పొరిఁబొరి శితబా | 77 |
ఉ. | నావుడు శౌరి నెమ్మొగమునం జిఱునవ్వు దలిర్పఁ బల్కె నో | 78 |
సీ. | చెలియ నీకుచకుంభములదండ నుండినఁ గరిఘటాదృతభీతి నెరయు టెట్లు | |
తే. | కావున నితాంత మగుచును దావకాభి, నవకృపాలోకనం బింత దవిలెనేని | 79 |
తే. | అనుచు వచియించి యెంతయు నాగ్రహించి, రథము మరలించి యాహవప్రౌఢి మించి | 80 |
ఉ. | అప్పుడు రామసాత్యకిగదాదియదూత్తము లెత్తి యార్చుచున్ | 81 |
చ. | మరలక దంతవక్త్రుఁడును మాగధసాల్వవిదూరకాదులున్ | 82 |
శా. | భేరీకాహళభాంకృతుల్ సుభటగంభీరార్భటుల్ సంతత | 83 |
సీ. | తురగముల్ తురగముల్ కరులును గరులును బ్రాసికుల్ ప్రాసికుల్ భటులు భటులు | |
తే. | గదల మోఁదుచుఁ దూఁపులు గుదులు గాఁగ, గుప్పుచును ఖడ్గముల నఱకుచును వాఁడి | 84 |
లయగ్రాహి. | కూలెడురథంబులును వ్రాలెడుగజంబులును దూలెడుహయంబులును వ్రీలెడుసిడంబుల్ | 85 |
శా. | తాలాంకుండు హలంబుఁ ద్రిప్పి మగధాధ్యక్షు న్వడి న్మోఁద ని | 86 |
తే. | విలుగుణధ్వని చేసి నిప్పులు వెడల్చు, వాఁడితూఁపులు పదుమూఁడు వానిపైనిఁ | 87 |
క. | హరిసోదరుఁడును సాల్వుని, యరదము పొడిపొడి యొనర్చె నైదమ్ముల న | 88 |
చ. | కరిఁ బురికొల్పి సాళ్వమహికాంతుఁడు రాఁ గృతవర్మ యడ్డమై | 89 |
క. | గొదగొని శిశుపాలుం డొక, గద గొని యదరంట నార్చి గదునేసిన న | 90 |
క. | కంఠీరవంబు మిగుల న, కుంఠితగతిం గరిని బట్టుకొనుక్రియ విజయో | 91 |
ఉ. | బంటుతనంబు మించి పశుపాలకులెల్ల నృపాలురై కడుం | 92 |
తే. | వానితోనె విదూరకమానవేంద్రుఁ, డనికి మొన చేసి తరలెఁ గల్పావసాన | 93 |
తే. | ఓరి గోపాల నీ వొకపేరు గల్గు, శూరుఁడవు బలె ధారుణీశుల నెదుర్పఁ | 94 |
ఉ. | గొల్ల మెఱుంగుఁబోండ్ల నునుగుబ్బలపోటులు గావు కేర నీ | 95 |
సీ. | భువనంబులం దెందుఁ దవిలి వసించిన నీఁగి శైలముక్రింద డాఁగియున్న | |
తే. | నుఱక యొకమ్రానిలోపల నిఱికి యున్నఁ, గలికితనమునఁ బలుమాఱు మెలఁగుచున్న | 96 |
చ. | అని యదలించి నూఱునిశితాంబకముల్ హరిమేన నించి రా | 97 |
క. | ఈరీతి నేయఁ గనుఁగొని, సీరియు శౌరియును గొదమసింగము లన న | 98 |
మ. | బలభద్రుండు రథంబు డిగ్గి విలయప్రద్యోతమానానలో | 99 |
తే. | అట్లు తఱిమిన నిలుపలే కఖిలనృపులు, చైద్యుఁ దోడ్కొని దమతమసదనములకు | 100 |
చ. | ఇటు లెదిరించి తూఁపుగము లేయఁ దొడంగిన జూచి వెన్నుఁ డా | 101 |
ఉ. | అంతట శంఖ మూఁది తమి నగ్రజసోదరబంధుయుక్తుఁ డై | |
| సంతస మూని క్రమ్ముకొని సైన్యములెల్లను గొల్వ రుక్మిణీ | 102 |
సీ. | పౌరులు చేరి శోభన లీలఁ గన్గొని యానందవార్ధి నోలాడుకొంచు | |
తే. | నపుడు కృష్ణుఁడు నిజమందిరాంతరమున, కరిగి తనతల్లిదండ్రుల కఖిలబంధు | 103 |
తే. | వినయగతి మ్రొక్కి వారిదీవనలు గాంచి, యంత విధ్యుక్తసరణి నయ్యవనినాథ | 104 |
ఉ. | చెంగట రత్నపుత్రికలుఁ జిత్రవిలాసములు వెలుంగ సా | 105 |
తే. | ప్రోడచేడెలు గొంద ఱంభోజనయను, భోజకన్యకనుం గూర్పఁ బూని యపుడు | 106 |
క. | పదమా నీ వీక్రియ మృదు, పద మానక ప్రాణవిభునిసజ్జకు నిపుడే | 107 |
సీ. | ప్రియునియొద్దకు నీవె బిరబిర నరుగక కెలన నొక్కెడ నిల్వవలయుఁ జుమ్ము | |
తే. | సరసుఁ డతనునికేలికి సంభ్రమించి, బిగియఁ గౌఁగిటఁ గదియించి చిగురుమోవి | 108 |
చ. | అని చెలు లుగ్గడింప దరహాసము మోమున నంకురింప గ | 109 |
క. | పడకింటిలోని కరిగిన, పడఁతుకఁ గన్గొని నరాధిపతిమేను గగు | |
| ర్పొడువ నెపు డెప్పు డంచును, గడు నువ్విళులూరుచుండెఁ గామిను లంతన్. | 110 |
ఆ. | వెలఁదిచేతివిడెము విభునకు నిప్పించి, విభునిచేతివిడెము వెలఁది కొసఁగఁ | 111 |
సీ. | కొమ్మపొక్కిటిపొన్నక్రొన్ననపై నిల్చి గురుతరోరోజమంజరులు ముసరి | |
తే. | చికురమధుకరకులములచెలిమిఁ గాంచి, యభినవానందలీలల నలరి యపుడు | 112 |
తే. | తరుణి హిమభానుమండలదర్శనమున, సగము వికసించుచున్నట్టితొగలకరణి | 113 |
శా. | ఆదామోదరభోజకన్య లటు లన్యోన్యాననాలోకనా | 114 |
ఉ. | అత్తఱి రాజకన్యకయొయారముఁ గన్గొని శౌరి యెంతయుం | 115 |
చ. | పలుచనితేనియల్ చిలుకఁ బల్కవె చిక్కలకొల్కి లేఁతవె | 116 |
సీ. | లలన నీవలుదగుబ్బలపై నిలువఁగోరి తమ్మిమొగ్గలు నిరంతరము నొసఁగి | |
తే. | వంచనము లేక యిష్టదైవంబు నిట్లు, పూజ గావించినాఁడ నీపొందుఁ గోరి | 117 |
క. | అని సరసోక్తులచే న, వ్వనితామణిఁ గరఁగఁజేసి వనజాస్త్రుఁడు గు | 118 |
సీ, | ముంగురుల్ దువ్వి కనుంగని ముద్దాడి తళుకులేఁజెక్కుటద్దముల నొక్కి | |
తే. | మఱియుఁ బంచాస్త్రశాస్త్రసమ్మతుల నతుల, గతుల రతులఁ బెనంగి యాకంజముఖిని | 119 |
సీ. | వితతదంతక్షతావృతసుధాధరయును మానితనిశ్వాసమారుతయును | |
తే. | గళదహీనమృగీమదకర్దమయును, సదమలానందపరవశసంహననయు | 120 |
ఉ. | అంత రతాంతవేళ దనుజాంతకుఁ డాచెలి నంకపీఠికన్ | 121 |
తే. | సురఁటి విసరుచుఁ బల్మఱు సుదతితోడ, సరససల్లాపముఁ బ్రొద్దు జరప నిట్లు | 122 |
క. | పిదపన్ రుక్మిణి మొదలగు, మదవారణయాన లష్టమహిషులునున్ సొం | 123 |
తే. | దుష్టజనుల వధించుచు శిష్టజనుల, కభిమతార్థంబు లొనఁగూర్చి యాదరమునఁ | 124 |
క. | ముదమున నీహరిసత్కథఁ, జదివిన వ్రాసినను విన్న జనులకు సతతా | 125 |
క. | అని సూతుఁడు మునిజనులకు, వినిపించినరీతి శుకుఁడు వేడ్కఁ బరీక్షి | 126 |
క. | ఈకృష్ణకథ ముదంబున, నీకరుణ నొనర్చినాఁడ నిఖిలేశ్వర నీ | 127 |
ఉ. | ఆరయ శాలివాహనశకాబ్దముల ద్రిగుణాంగచంద్రులం | |
| త్కైరవమిత్రతారకముగా భువిఁ జెల్వనుఁగాత శంకరా. | 128 |
క. | తరుణారుణాంబుజోపమ, చరణాభయహరణసతతసంభృతహరిణా | 129 |
ఉ. | భాసురమందహాసపరిపాలితదాసజగజ్జనావనా | 130 |
మాలినీ. | కలుషఘనసమీరా కామగర్వాపహారా, వివితగుణసారా వేదమార్గప్రచారా | 131 |
గద్య. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌం | |
- ↑ పా. మెలంగవలెఁ జుమ్మ పసిఁడిబొమ్మ