రుక్మిణీపరిణయము/తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము సూతుం డమ్మునిశ్రేష్ఠుల కెఱింగించినవిధంబున శుకుండు పరీక్షిన్న | 2 |
తే. | అవనినాయక యంత నయ్యలరుఁబోఁడి, తోడిచేడెలు బంగారుమేడలోన | 3 |
ఉ. | అచ్చెరువొంది హా బిసరుహాయతనేత్ర మనోభవార్తిచే | 4 |
క. | హరిణీలోచనలెల్లను, సరగునఁ బూఁదోఁట కరిగి చంచలవృత్తిన్ | 5 |
చ. | మునుకొని మేలిచెంగలువమొగ్గలు సంపెఁగబంతులుం గన | 6 |
మ. | అకటా నెచ్చెలులన్ మొఱంగి మకరాంకాభీలబాణావలీ | 7 |
ఉ. | పుత్తడివంటిమేను వలపుం బలుకాఁకలఁ గ్రాఁగ నీగతిన్ | |
| మెత్తురటమ్మ యీగడుసుమేలపుమాటలు విన్నవిన్ననై | 8 |
క. | నిద్దపుఁగెంజిగురాకులఁ, దద్దయు నిరసించునీపదంబులు నేఁ డో | 9 |
సీ. | కుజనులఁ జేరి చొక్కుచు సీధుపానంబు సేయుచండాలు రీచెనఁటితేంట్లు | |
తే. | లహహ యీరీతి భీతి యింతైనలేక, నగెడువారల నెఱుఁగక వగలు మిగులఁ | 10 |
ఉ. | కన్నియ నీకిటుల్ వగవఁ గారణ మేమి జగత్ప్రసిద్ధిగా | 11 |
తే. | శుభనిమిత్తంబు లెన్నైనఁ జూడఁబడుచు, నున్న వబ్జాక్షి సంశయం బుడిగి యిఁకను | 12 |
ఉ. | కన్నులపండువై ద్విరదగామిని యామని యొప్పె గొజ్జెఁగల్ | 13 |
తే. | తేఁటులను బాఱఁదోలి పూఁదేనెఁ గ్రోలి, లీలఁ జెలరేఁగి తీఁగెటుయ్యాల లూఁగి | 14 |
క. | వనకేలి సేయు టుచితము, వనరుహదళనేత్ర రమ్ము వైళంబని య | 15 |
ఉ. | గుత్తపుఁగంచెలల్ దొడిగి క్రొమ్ముఁడు లిమ్ముగ దిద్ది నిద్దపుం | 16 |
క. | పువుఁదోఁటలోన నపు డభి, నవకౌతూహలము వెలయ నరనాథతనూ | 17 |
తే. | బోటి యల్లవె తగ మగతేఁటిమేటి, పువ్వుమొగ్గలపై వ్రాలి పొదలుచున్న | 18 |
క. | పున్నాగముతోఁ బెనఁగుచు, నున్నది లతకూన చూడు ముగ్మలి యౌ నా | 19 |
చ. | కనుఁగొను మివ్వనస్థలిని గామిని మాధవసంగతంబునం | 20 |
చ. | పలుమఱుఁ జంచరీకతతిపై వితతంబుగ మొల్లక్రొవ్విరుల్ | 21 |
క. | తళతళ మెఱయుచు నవచల, దళపల్లవ మలరెఁ గాంచు తరుణీ యౌ నీ | 22 |
చ. | శ్రమకణముల్ హరించుచు విశాలతరవ్యజనంబు వీచుచం | 23 |
తే. | చానరో మేనఁ బూదేనె సోనవాన, చిలుకుచున్నది లేమావి చిత్తగింపు | 24 |
ఉ. | తోరపుమల్లెపూఁబొదలు దూఱి ముదంబునఁ గీరదంపతుల్ | 25 |
తే. | అనుచు సరసోక్తు లాడుచుఁ దనదుమదికి, హర్ష మొదవించుచున్న యయ్యనుఁగుఁజెలుల | 26 |
ఉ. | అప్పుడు కొప్పు విప్పి జడలల్లి సితోత్పల ముంచి పేరెదం | 27 |
ఉ. | సారసగంధి యోర్తు విరసంబున గేదఁగిమీఁది తేఁటులం | 28 |
ఉ. | తొయ్యలి యోర్తు మల్లికలు ద్రుంపఁగ మారునితూపు లవ్విరుల్ | 29 |
తే. | సుందరి యొకర్తు మోమెత్తి చూడఁ జంప, కంబు పూచిన నది యాసుమంబు లేరు | 30 |
చ. | కిసలయపాణి యోర్తు మదిఁ గేరుచుఁ జొక్కపుఁగోఁగుఁ జూచి యిం | 31 |
తే. | సకియ యొకతె యశోకభూజంబుఁ బూని, తన్న నది పూచి క్రొన్ననల్ తత్పదాబ్జ | 32 |
క. | మధురోష్ఠి యొకతె పుక్కిటి, మధు వొసఁగిన నలరి పొగడ మధురసధారల్ | 33 |
చ. | నలినదళాక్షి యోర్తు నగినం గని క్రొన్నన లెత్తి పొన్న భా | 34 |
తే. | అంబుజానన యొకతె గానంబు సేయఁ, గడువికాసంబు నొంది ప్రేంకణపుఁదరువు | 35 |
క. | తరుణి యొకర్తు కవుంగిటఁ, దరుణిం గదియించి దోహదక్రియ దెలుపం | 36 |
తే. | మానిని యొకర్తు తిలకపుమ్రానిపైని, లీల మీఱ నపాంగమాలికలు నించి | 37 |
ఆ. | కేల నంటి యోర్తు లాలింపఁ బ్రస్ఫుటా, మోదరసవికాసమున రసాల | 38 |
తే. | రాజముఖి యోర్తు సిందువారంబుపైని, మేలినలితావి యూర్పుఁ దెమ్మెరలు నింప | 39 |
క. | మఱియుం గిసలయపాణులు, కర మొప్పఁగ నోళ్లు గట్టి గట్టిగ సుమనో | 40 |
రగడ. | చెలువ చెలువగు తేఁటిపాటలు చేరి చేరిక నాలకింపకు | |
| మేలమేల లతాంగి కడుదుమ్మెదలె మెదలెడుపొదలు దూఱెదు | 41 |
తే. | అనుచుఁ బసిగలననలెల్ల నపహరించి, మంచిసరములు గూర్చి ధరించి కొన్ని | 42 |
సీ. | స్థలజలజవ్రజంబులఁ బదంబులకును నవగంధఫలులచే నాసలకును | |
| మొగలిఱేకులచేతఁ దగ నఖంబులకును గురువిందగుత్తులఁ గుచములకును | |
తే. | బూని వనలక్ష్మి యాముద్దుపువ్వుఁబోండ్ల, యవయవములకు నోడి యత్యంతభక్తిఁ | 43 |
ఉ. | అంత వనంబు వెల్వడి సుధాంశుముఖుల్ జలకేలి సేయ న | 44 |
చ. | ప్రకటముఖభ్రమద్భ్రమరపంక్తులు నీలపుఱాలనేలనం | 45 |
క. | గుబ్బలబంటిజలంబుల, గొబ్బునఁ జొరఁజాఱి యాచకోరేక్షణ లా | 46 |
చ. | ఒకగజరాజగామిని మహోత్పలపత్రవిలీనబంభర | 47 |
చ. | కిసలయపాణి యోర్తు జలకేళి యొనర్పఁగఁ జన్నుదోయి సా | 48 |
చ. | లలన యొకర్తు దోయిట జలంబులు ముంచి యిదేమిబోటి యి | 49 |
క. | ప్రకటేందిందిరయుతమై, వికసించిన తెల్లదమ్మివిరిఁ గన్గొని యం | 50 |
ఉ. | అంబుదవేణి యోర్తు కలహంసములన్ బెదరించె శీతరు | 51 |
తే. | అతివ లందఱుఁ గమలోత్పలాదికములు, గోయుచుండిన నం దొకకోమలాంగి | 52 |
చ. | పదువు రొకర్తెఁ బట్టుకొని పద్మపరాగము మీఁదఁ జల్లుచుం | 53 |
తే. | కోకిలాలాప యోర్తు చీకాకు సేయఁ, బల్లవాధర యొకరామ పజ్జ నీఁగె | 54 |
చ. | నలినదళాక్షి యోర్తు బిసనాళము చిమ్మనఁగ్రోవి చేసి యి | 55 |
సీ. | కుచచక్రవాకముల్ కచచంచరీకముల్ ప్రపదకచ్ఛపములు బాహుబిసము | |
తే. | దనర సరసులు నుతిసేయఁ దగువిలాస, సరసులము మేము మాకు నీసరసి యెట్లు | 56 |
తే. | ఇట్లు జలకేలి యొనరించి యిందుముఖులు, సరసి వెల్వడి మెల్లనే దరికిఁ చేరి | 57 |
చ. | జిలుఁగుమణుంగుదువ్వలువ చెల్వుగఁ గట్టి పసిండిమేలుసొ | 58 |
క. | భోజతనూజం దోడ్కొని, రాజసమున వనికి నరిగి రాజీవాస్త్రుం | 59 |
సీ. | బలుకప్పురపుటనంటుల నంటఁ బ్రాఁకినపరువంపుద్రాక్షపందిరులదరుల | |
తే. | దళుకుగేదంగిఱేకులదళ్ళు గట్టి, కలువకెందమ్మివిరులమేల్క ట్లమర్చి | 60 |
తే. | కెందలిరుసెజ్జ రచియించి యందు నొక్క, మేలిలవలీదళంబుపై మృగమదమున | 61 |
సీ. | అలరుగొజ్జెఁగనీట నభిషేక మొనరించి చంపకజాలకాక్షతలు నించి | |
తే. | హారిమధురసఫలవిసరాదికోప, హార మిడి వీడె మర్పించి హల్లకంబు | 62 |
ఉ. | దండము నీకు భూరిభుజదండవిమండనమండితేక్షుకో | 63 |
ఉ. | అంబురుహాంబకాయ చలితామితమౌనికదంబకాయ హే | 64 |
సీ. | మిన్నంది యేప్రొద్దు మెలఁగుచుండెడితేరు తియ్యనై రస ముప్పతిల్లు విల్లు | |
తే. | నలరు జగదభిరామవిహారి వగుచు, మగల మగువల వలపించి మదిఁ గలంచి | 65 |
క. | యేరీ నీసరి సరసవి,హారీ శూర్పకమదప్రహారీ హారీ | 66 |
క. | పంకరుహాసన వాసవ, శంకరులును నీయమోఘసాయకములకున్ | 67 |
క. | తోరముగ నిను భజింపఁగ, నేరము నీరేజబాణ నీ విఁకఁ గరుణా | 68 |
చ. | పలుమఱు దెల్ప నేటికి నృపాలతనూభవ కంసవైరితోఁ | 69 |
తే. | శంబరేక్షణ యని విరోధంబు వలదు, విమలకమలాక్షి యీమహీరమణతనయ | 70 |
తే. | అనుచు నతనుని నుతిగొని యతనిసతిని, రతినిఁ బ్రతిదినసౌభాగ్యవతినిఁ బొగడి | 71 |
క. | అలివేణీ వలఱేనిం, గొలిచి కడువశునిఁ జేసికొంటిమి మదకో | 72 |
చ. | అదనునఁ దోఁటలోఁ గలలతాంతములెల్ల హరించి భక్తితో | 73 |
చ. | అని మనుజాధినాథతనయన్ వినయంబుగఁ బల్కి వేగదో | 74 |
క. | వరుణవధూటీకుచతట, పరిశోభిత మైనకెంపుఁబతకము దీప్తుల్ | 75 |
చ. | అనుపమవైఖరిం గువలయప్రియుఁడై తగురాజుఁ బట్టబ | 76 |
తే. | పాంథతతిమీఁద నలరాజు బలసి దండు, వెడలుచును మున్నె యెత్తింప విజయధాటి | 77 |
తే. | అరయఁ దమిఁజేరి రాజకాంతాళిఁ గరఁచు, శ్వేతరుగ్భావితునిరాక చిత్తవీథి | 78 |
ఉ. | తృష్ణ జెలంగ జక్కవలధీరత మింటఁ దలంకుచుండె న | 79 |
చ. | విరహుల గెల్వఁ బూని సరవిం బికషట్పదకోటి నంతరాం | 80 |
సీ. | మారుండు విరహిణీసారసాక్షుల నేయఁబూనినకెందమ్మిపు వ్వనంగ | |
తే. | సమయకింకరుఁ డుదయాద్రిజగతిపతికి, సరవిఁ బట్టినపగడంపుటరిగ యనఁగ | 1 |
తే. | అతులశోభావిభాసితం బేగుచు గగన, మహిఁ జిగిర్చినగుజ్జులేమావి యనఁగ | 2 |
తే. | సరసమై వసుగంధనిస్తంద్ర మగుచు, నురుతరంబుగ ఘనమార్గయుక్త మగుచుఁ | 83 |
క. | అంబరతలమున శశభ్ళ, ద్బింబము విలసిల్లె ధవళదీప్తుల నంతం | 84 |
సీ. | గగనగేహంబు ముక్తాచూర్ణమున నభశ్చరభామినుల్ వెల్లచఱచి రనఁగ | |
తే. | విరహిణుల రేఁచి పాంథుల వెతలఁ ద్రోచి, కోకముల నేఁచి తిమిరంబు గుహల డాఁచి | 85 |
చ. | శమనునిదుంతఁ బట్టుకొనె శక్రుఁడు దా వెలియేనుఁ గంచు వే | 86 |
చ. | తమము నితాంతశైవలము తారలు సారసితారవిందముల్ | 87 |
క. | అన్ని బిడపువెన్నెలఁ దమ, కన్నులఁ జె న్నమరఁ జూచి కన్నెలు నెలరా | 88 |
క. | మదిరాక్షులార రారే, మదిరాపానంబు చేసి మఱి యందఱమున్ | 89 |
క. | వాసవముఖసురనికరము, లాసన మొక్కించుకంత యానినమఱి తా | 90 |
ఉ. | కుందనపుంగలంతికలుఁ గోరలు నుంచి యొకర్తొకర్తకున్ | 91 |
చ. | గరిత యొకర్తు హేమచషకంబునఁ జందురునీడ చూచి హా | 92 |
క. | వలిదెమ్మెర మెల్లనె యొక, చెలిపయ్యెదకొంగు దొలఁగఁజేసిన నది రం | 93 |
చ. | కలికి యొకర్తు చంద్రికలు గాయ శశాంకునిఁ జూచి యోయి వె | 94 |
క. | చెలి యొకతె తనదుమదిరా, కలశంబులు గొనఁగ నీకుఁ గారణ మేమే | 95 |
సీ. | సఖులార కుమ్మరసారెతీరున భూమి తిరిగె నంచును గేలు ద్రిప్పె నొకతె | |
తే. | పెక్కుదెఱఁగుల నిటువలెఁ జొక్కుచుండి, రవుడు నృపపుత్రి విరహార్తి నలసి సొలసి | 96 |
చ. | అకట నిశాటపాంథనివహంబుల నేఁచుఖలుండ వౌట నిన్ | 97 |
తే. | కువలయాహ్లాదకరుఁడవై కొమరుమీఱు, రాజ వని నిన్ను ద్విజనికరంబు లెపుడు | 98 |
క. | సిరితోఁ బుట్టినమాత్రనె, సరసగుణం బేలఁ గల్గు చంద్రా నీ కా | 99 |
ఉ. | రాజ నటంచుఁ జక్రముల రాపులఁ బెట్టుచునుండి రేలు ని | |
| రేజవిపక్ష నిన్ జిలువఱేఁడు వడిం గబళించుగాఁక నీ | 100 |
తే. | తుహినకరశూలి నిను గురుద్రోహి వగుటఁ, దనమది నెఱింగియును లింగధారి ననుచు | 101 |
క. | హరికిన్ ముద్దుమరందివి, సిరికిం దమ్ముఁడవు విశాలశీతాంశుఁడవున్ | 102 |
క. | తామసిని గూడి యకటా, వేమఱుఁ బద్మినుల జాల వెతఁ బెట్టెదు నీ | 103 |
సీ. | జడభావమున రేలు కడువడిఁ దిరుగుచు నొకతఱి నంబరం బొల్లకుండి | |
తే. | వరుసతోఁ బున్నమకు నమవసకు నెల్ల, జగము లెఱుఁగంగ నెక్కుచు దిగుచునుండు | 104 |
మ. | మకరాంకుండు విజృంభమాణుఁ డగుఁ బ్రేమం గృష్ణపక్షంబునం | 105 |
శా. | నీవు న్నేమును గ్రీడ సేయుదుము పూన్కిం జాళువామేడపై | 106 |
క. | అని వనితామణి యిటు ల, వ్వనజారిం దూరి చేరి వైరము మీఱన్ | 107 |
క. | మరుఁడా విచలితసకలా, మరుఁడా గరుడాసనునికొమరుఁడా సుమతో | 108 |
క. | నేర మొకింతయు నెన్నక, కేరుచు వేమాఱు నూరకే తెరువరులన్ | 109 |
సీ. | పంకసంకరమునఁ బాటిల్లుటెక్కెంబు విషసముద్భవములై వెలయుతూపు | |
తే. | గలిగి యతనుఁడవై జగంబులకు నెందు, గానఁగారాక మెలఁగుతస్కరుఁడ వీవు | 110 |
క. | పృథివిఁ బరాశరకులని, ర్మథనునితనయుఁడవు నీవు మఱి గుణి వగుదే | 111 |
తే. | తండ్రిపగ మాన్చు టుచితంబు ధరణియందుఁ, దనయులకు నెల్ల నది యబద్ధంబు చేసి | 112 |
క. | మదమునఁ బొదలుచు నింతయు, నొదుఁగక బ్రహ్మాపరాధ మొనరించిననీ | 113 |
శా. | లోనం జుట్టమపోలె వర్తిలుచు నిన్ లోకాపకారానుసం | 114 |
తే. | విను మనోజాతసడ్డకుఁ డనుచుఁ దనకుఁ, గన్నుగాఁ జూచి తల నిడుకొన్నహరునిఁ | 115 |
ఆ. | మేనమామ యనుచు మానుము సఖ్యంబు, వరుసగాదు శ్వేతకరునితోడ | 116 |
తే. | అనుచుఁ దనుఁ జాల వెతఁ బెట్టునసమశరుని, నింద గావించి మఱియు నయ్యిందునదన | 117 |
చ. | జ్వలనునిచెల్మి చేసి కలుషంబునఁ జిల్వలనిఱేకోఱలం | 118 |
చ. | అజపదలీల గాంచి సకలాగమపద్ధతులన్ మెలంగుచుం | 119 |
ఆ. | పవనశశియు నీవుఁ గవగూడి రాజన, మొప్ప మిన్ను ముట్టి యూరకున్న | 120 |
చ. | అని వచియించి యామధుకరాలక జాలక మేను మీనకే | 121 |
క. | మార్తాండుఁడు పండ్రెండున్, మూర్తుల నేకీభవించి మునుకొని మింటన్ | 122 |
ఉ. | అద్దిర గంధవాహుఁడు దవానలకీలలు గ్రుమ్మరించుచుం | 123 |
తే. | పరభృతంబుల కారామగరిమ చూపి, శుకములకు సాంకసము వేసఱక యొసంగి | 124 |
క. | మధుకరములరొదలకు మ, న్మథుకరములవలను వెడలుమార్గణములకున్ | 125 |
ఆ. | అనుచుఁ గళవళించునంగనఁ గనుఁగొని, యనుఁగుజెలులు విస్మయంబు నొంది | 126 |
ఉ. | క్రొన్నన పాన్పుపై నునిచి గొజ్జెఁగనీ ర్మెయిఁ జిల్కి సిబ్బెపుం | 127 |
తే. | శిశిరకృత్యంబు లొనరింపఁ జెలియమేన, నింకెఁ బన్నీరు చూత్కార మెసఁగఁ జంద | 128 |
ఉ. | అబ్బురపాటు నొంది చెలులందఱుఁ గ్రమ్మఱ శైత్యకృత్యముల్ | 129 |
క. | నరనాథతనూభవ యీ, సరణిం దరుణులును దాను జాగరదశచేఁ | 130 |
తే. | మరుఁడు పగఁ బూని ధారుణివరతనూజ, నేఁచుచున్నాఁడు వేగ రావే యటంచుఁ | 131 |
క. | కులటలు దాఱ ఖగంబులు, కలకలనాదములఁ గేరఁ గలువలఱేఁ డ | 132 |
చ. | తిమిర మణంగె జక్కవలు ధీరతఁ బొంగె విటీవిటాళికిం | 133 |
చ. | వెలుఁగులఱేఁడు తమ్మిచెలివేడుకకాఁడు తమంబుసూడు చు | 134 |
తే. | చక్రములు వేడ్క నుప్పొంగ సరసు లలర, నఖిలదిశలఁ దమోగుణం బణఁగఁజేసి | 135 |
తే. | అపుడు నృపశేఖరుఁడు సమయార్హవిధులు, దీర్చి సచివాప్తబంధుసుధీపురోహి | 136 |
క. | భేరీకాహళనిస్సా, ణారావము లొకట నింగి యదరఁగ మొరసెం | 137 |
చ. | ఘనసమరావనీవిజయకారణవారణఘోటకావలుల్ | 138 |
తే. | కదిసి యిరుగడ వందిమాగధులు పొగడ, పృథులకాహళశంఖముల్ పెల్లు మొరయ | 139 |
క. | అరుదులుగా మఱిమఱి తమ, బిరుదులు మెఱయించుకొనుచుఁ బృథివి చలింపన్ | 140 |
మ. | గజయూధంబులు భర్మనిర్మితశతాంగంబుల్ తురంగంబులున్ | 141 |
చ. | సకలవిధంబులన్ గణఁగి చైద్యున కేము విదర్భరాజక | 142 |
తే. | ఇవ్విధంబునఁ దేజంబు నివ్వటిల్ల, నరుగుదించినమేదినీవరులనెల్ల | 143 |
క. | ఆజనపతులకుఁ గనకపు, భాజనముల షడ్రసానుపానంబులుగా | 144 |
తే. | భాసురావాసములు విడిపట్టు లొసఁగి, భూసురాశీర్వచనరూఢిఁ బొదలి మంద | |
| హాసవికసితవదనాబ్జభాసమానుఁ, డగుచు నుప్పొంగెఁ గుండిననగరవిభుఁడు. | 145 |
తే. | అనుచు సూతుఁడు శౌనకుఁడాదియైన, మునుల కెఱిఁగించె నంచు వ్యాసునిసుతుండు | 146 |
శా. | గౌరీచిత్తసరోజభృంగభువనఖ్యాతాహృతానంగక | 147 |
క. | దర్వీకరహారసుప, ర్వోర్వీధరశర్వయుక్షాధిపగం | 148 |
మణిగణనికరము. | సురవరహరినుతసురుచిరచరణా, పురహరశివకరబుధజనశరణా | 149 |
మాలిని. | కరతలధృతశూలా ఖండితారాతిజాలా, పరిచితగిరిబాలా భాసురానందలీలా | 150 |
గద్య. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి | |