యెంకి పాటలు/పూల యుద్ధం
పూల యుద్ధం
నాయాస రగిలింప
సాయముగ యెంకి
పూల దన చెక్కిళ్ళు
మేలుకొలిపేను. . .
- * *
భాధ నా యెదనింప
సాదనగ యెంš
పెదవిజిగజిగ పూల
పదును పరిచేను. . .
- * *
విసిగించి నన్నొంప
వీలుగా యెంకి
పూలలో రాచకా
ర్యాలు సలిపేను. . .
- * *
కోపాల నాకోట
కూలువగ యెంకి
పూల రంగములోన
కాలు దువ్వేను.
68 యెంకి పాటలు