యెంకి పాటలు/పౌరుషము
పౌరుషము .
ఏ వూరొ నే బోవ ఎంకె దొరయింట--
నా వేసమున యెంకి నటియించు నంట !
చెట్టు లత నాలాగు--
చిత్తగించుట సాగు--
ఒక తీగె తలపాగ
ఒకతె సిగ దిగలాగ ! ఏ వూరొ. . . . . .
ఆవులను నావలెను
అదిలించుకోవలెను--
గలగలలు విలుబొమల
తెలిసి కలబడఆలు! ఏ వూరొ. . . . . .
పసిబాలు ననుఇబోలి
కసరు విసరులనేలు--
పాలగని కోపాల
బాల పకపకలాడ ! ఏ వూరొ. . . . . .
యీ వింత యూ లోన
అనంత నే గన్న
నేరమంతా నాదె
పౌరుషము నా విూదే! ఏ వూరొ. . . . . .
యెంకిపాటలు 69