యెంకి పాటలు/నటీనటులు
నటీనటులు
'ఎంకి' నాపేరితని
కేమిలేదట వీని
నెవరెరుగ రంటా!'
'నామకానామకుల నటనె నేడంతా'
'యుగయుగము ఒకరొకరి
తగిలినామట, చేయి
మిగిలినావుంటా!'
'పగలురేయటు సుంతపట్టపడకుండ'
'వాలి, కౌగిలి సుకము _
నేలినామట చూపు
కలిపినామంటా!'
'ఆకసముభూమియటు లంటుకోకుండ'
'ఒక్కపై సరసాల,
చొక్కినామట మింటి
కెక్కినామంటా!'
'బింబ ప్రతిబింబమటు వీడివిడకుండ!'
'ఇంతయెంకితొనటన
యెవ్వరోనట యీత
డెవ్వరోనట, యెంకి
రవ్వపాలంటా!'
'ప్రకృతి సుందరిజంట పరున కెటులంట!'