ఎంకికళ

ఇంక నను పిలిచేర? యింత తలిచేర?
యెంకికేగాకి నాకిట వూరా _ పేరా?
నెమిలె ననుగని యరుగు
నేలచూపుల దిరుగు
యెంకిదరి శ్రీనించు
యెన్నొ లయల నటించు
ఇంక. . . . .
నాగోవె నన్ను నా
నాగతుల నలయించు
యెంకి కడ యిల్లాలు
యెంకి చెయ్యానాలు
ఇంక. . . . .
నే నాటు పూలంటె
నేనంటితే అంటు__
యెంకితొ సరాగాలు
ఏక సనుమానాలు
ఇంక. . . . .
ఏది నే పాడినా
ఎంకి పాటెయనేరు
ఏ పదములోనైన
ఎంకి కళనె కనేరు
ఇంక. . . . .