యెంకి పాటలు/రాకపోకలు
రాకపోకలు
ఏ లోకమోపోక ఎటకొ నా రాక
యితరు లెవ్వరికెరుక యెంకికేగాక!
చేలపాటున నేను
చెట్లచాటున తాను
పాట జగమును రేపు
పాటు యుగమును బాపు
ఏ లోకమో......
మోటనడుపుట నేను
తోటతడుపుట తాను
మనిసినే యని వగతు
మాకునైపోవలతు
ఏ లోకమో......
చేనులోనేనిదర
తాను వెలుగుచు యెదర
స్వప్నలోకముదించు
స్వర్గమును స్వారించు!!
ఏ లోకమో......