మణి మాలికలు/స్వర్ణలతా నాయుడు సోమిశెట్టి
హౌస్.నెం: 71, సెక్టర్ 61, D బ్లాక్, నోయిడా, ఉత్తరప్రదేశ్ - 201305 కలంపేరు : శ్రీస్వర్ణ మొబైల్: 09958960068 ఈ-మెయిల్: chittifbd@gmail.com
శ్రీ స్వర్ణ మాలికలు... 1.
నా కలలకి దీర్ఘాయుష్షు పోసివెళ్ళావు
నీ జ్ణాపకాలతో చెలిమి చేయమని
2.
గడ్డిపరకల కౌగిట్లోతుషారకన్య
విడదీయడానికొచ్చిన భానుడు...అసూయతో
3.
అవని పులకరిస్తోంది
మేఘుడు పంపిన నీిశాలువాని కప్పుకుని
4.
నిలువెల్లా నీ ప్రేమలో తడుస్తున్నా
నీ తలపుల తేనెజలపాతాలలో మునిగిపోతున్నా
5.
మేఘం పులకిస్తే స్వాతిచినుకులు
మనసు తడిస్తే వలపుచివుర్లు
మణి మాలికలు జ స్వణలతా నాయుడు
171 172
6.
రెప్పల తాళపత్రంపై లిఖించు
నీ అధరలేఖినితో మనప్రణయకావ్యాన్ని
7.
అబద్దాలతో నిజాల చెలిమి
నేటి ఆధునిక సమాజంలో
8.
నిలువెల్లా నీప్రేమలో తడుస్తున్నా
నీ వలపుగంధాలలో మైమరిచిపోతున్నా
9.
నువ్వు ప్రేమగా పిలిచి చూడు
శతకోిటిస్వరాలతో పలికిస్తా నా మానసవీణను
10.
శిశిరంలోనూ వసంతమే
నీ సహచర్యంలో
11.
నా గుండె కోమాలోకి వెళ్ళింది
నీ మధురమైన మాటలు వినీవినీ
12.
గుండెలో గుజ్జెనగూళ్ళు కడుతున్నా
మన వలపులని పండించుకోడానికి
13.
గుండెలో గుచ్ఛుకున్న చూపుల బాణం
శ్రీకారం చుట్టింది జీవన ప్రణయానికి
14.
మధుర జ్ణాపకాలు మనసును తాకుతున్నాయ్
మౌనపు సుమాలు పుప్పొడిని రాలుస్తున్నాయి
15.
ఎదలో మోహనరాగాలు
అధరాలపై మౌనలేఖలు
మణి మాలికలు జ స్వర్ణలతా నాయుడు 16.
మువ్వలఅల్లరి ఎక్కువైంది
అచ్ఛు నీలాగే కొంటెకబుర్లే చెప్తున్నాయి
17.
పాలరాతి శిల్పానికి అసూయ
నీ నునుపు తనకులేదని
18.
కరిగే వెన్నెల శిల్పాన్నే
నీ కొంటె చూపులకి
19.
జ్ఞాపకాల పుస్తకం తెరిచి చూసా
నవ్వింది కొంటెగా ...నీ అల్లరిపుట
20.
మధురబాషిణేనే
చిలుకలకు ముద్దుగా పలుకులు నేర్పుతూ
21.
నా శ్వాసకి సిగ్గేస్తోంది
నీ ఊపిరిలో కలిసాక
22.
నీ కంటిపాపనన్నావ్
'పాప'లచుట్టు తిరుగుతావేెం?
23.
కలంతో సేద్యం చేస్తున్నా
కవనం బాగా పండించాలని!
24.
నవనీతం శిలగా మారింది
కరిగి మైనపుముద్దలా ఎప్పుడవుతుందో
25.
నిత్యం స్వప్నాల కౌగిళ్ళతో సహజీవనం
నేడు వీడ్కోలు...నీ రాకవల్ల
మణి మాలికలు జ స్వర్ణలతా నాయుడు
173 174
26.
మాటలు రాని మూగదాన్నంటావు
మౌనంగా మంచుకత్తితో కోస్తావు
27.
మంచు వెన్నెల్లో తడిసిన కలువలు
తమకంతో శశాంకునిపై విసిరే మన్మధబాణాలు
28.
కాలం వెలివేసింది నీ కలల్ని
నిర్దాక్షిణ్యంగా నా ప్రేమను కాలరాసావని
29.
అర్ధభాగం ఇచ్చానన్నావ్
అన్నిట్లోనూ నీదే పై చేయంటావ్
30.
సరసాలసంద్రం చిన్నబోయింది
మమతల అలలు కినుక వహించాయని
31.
నీవు నవ్విన ప్రతిసారీ
నవరత్నాల నవ్యకాంతుల పులకింతలు
32.
నా గుండెకు స్వాంతన
నీ వలపుగంధాలతో లేపనంపూస్తే
33.
నీ బుంగమూతి విరుపులు
నామదిలో కోహినూర్ వజ్రాలమెరుపులే
34.
కన్నుల మాటున దాగిన కోరికలు
ఎదను ఆశ్రయించాయి హత్తుకుంటావేమోనని ఆశగా
35.
నీస్వరానికి సంపెంగలు
నీ నడకకి నాగమల్లియలు దాసోహమే
మణి మాలికలు జ స్వర్ణలతా నాయుడు