మణి మాలికలు/సురేష్‌ బాబు రావి

సురేష్‌ బాబు రావి

ఫ్లాట్ నెం.205, శ్రీ శ్రీనివాస విహార్‌, రుక్మిణిపురి కాలనీ, డా|| ఎ.ఎస్‌.రావు నగర్‌, హైదారాబాద్‌-500 062. కలం పేరు: స్నేహితుడు వృత్తి: మెకానికల్‌ డిజైనర్‌ మొబైల్‌ నెం. 9959864000 ఈ-మెయిల్‌: ravisureshbabu@gmail.com వెబ్‌: www,facevbook.com/snehitudu.suresh

స్నేహాక్షర మాలికలు... 1.

 మాయదారి మనస్సు కదా
మనోమందిరాన్ని మయసభని చేసేసింది

2.

మదిని మీటిన కమ్మని జ్ఞాపకం
ఎదపై చేసెను వెన్నెల సంతకం

3.

మనిషిలో రాతి గుండె ఉండగా
రాతిలో దేవుడు మిధ్య కాదుగా

4.

ఎదురుగా ఉంది ముళ్ళబాటే అయినా
గమ్యమెంతసేపు...? అడుగులు ఉక్కు పాదాలవైతే

5.

కలలసేద్యం చేద్దామనుకుంటున్నా
నీ చిత్తరువుల విత్తనాలు పంపించవా?

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి

165 166

6.

 నా కలలలోగిలి లోకి తొంగిచూడు నేస్తం
అక్కడఉన్న నీ రూపాన్ని మాత్రం దొంగిలించకు

7.

ఎప్పుడూ జ్ఞాపకాల దుప్పటిలో పవళించటమేనా
వెన్నెలశిల్పమై ఎదురుగా ఉన్నా... భాషించవూ

8.

నాపెదవులు పృధ్విని తాకుతున్నాయి
నువ్వేసిన పాదముద్రలను సృశించటానికి

9.

నిదుర నదిలో
ఎదురుపడే కలల నావలన్నిటిలో నీవే

10.

మౌనం దుప్పట్లో నువ్వు దాచిన మాటల పరిమళం
నా మనసు పొరల్ని మీటుతుంది మృదు మధురంగా

11.

నా జ్ఞాపకాల పొత్తిళ్ళలో పవళించిన పసిపాప
అలసిపోయిన ఒత్తిళ్ళలో నీవో వెన్నెల రేఖ

12.

ఏకాంతం నా నేస్తం అయినప్పుడు
నన్నుకమ్ముకునే జ్ఞాపకం నానువ్వే

13.

మది కాంచే కలలన్నీ నిజాలై నను తడిమితే
ఆ స్పర్శతో మారనా నేనో నిశ్శబ్దపు శిలలా

14.

నా నిద్రలోన నిద్రపోని తలపుల ఘోష నువ్వు
నా కలమింకా రాయని భావాల భాష నీనవ్వు

15.

నాహృదయం బకాసురుని అంశ అనుకుంటా
రోజంతా నీతలపుల విందే కావాలంటా

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి 16.

 సడి చెయ్యవేమి నీ తలపులు
మది వడి చేరాక కూడ

17.

ఈ క్షణపు ఓటమే మరుక్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో

18.

నీ మేని చిరుచెమట చుక్క
నా నాలుకకి అమృతపు బిందువేగా

19.

మనిషికీ మనసుకీ మల్లయుద్ధమట
మనిషి తనువు కోసం మనసు తలపు కోసం

20.

జీవాత్మవే
ఏకాత్మవై నాలో ఇంకిపోతూ

21.

విశ్వకర్మ నే
వేవేల ప్రేమసౌధాలు తలపుల్లో నిర్మిస్తూ

22.

మధుర జ్ఞాపకాలు మనసును తాకుతున్నాయ్‌
మదిభాండగారంలో ఒడిసి పట్టాలని ఆశగాఉంది

23.

కాంతితీరాన ఆవిరవుతున్న తిమిరంలా
నీ మాటల ప్రవాహంలో కరిగిపోతుంది నా మౌనం

24.

నిన్నే ఊహగా నాలో వంపుకున్నా
నువ్వే శిల్పిగా నన్నేచెక్కుకున్నా..

25.

నన్ను నేను కోల్పోతూ ఉన్నా
నాలో నువ్వు ఇంకిపోవాలని

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి

167 168

26.

 అలకల్లో ఆవిరైన మాటలకి
ఊపిరిలూదే మంత్రం 'మౌనం'

27.

మౌనం దుప్పట్లో మాటలు దాచేసా
కనురెప్పల సవ్వడితో నీమనసే వింటున్నా

28.

నాలో నీ ఉద్భవాన్ని అవలోకిస్తున్నా
నీలో నే ప్రభవించాలని ఆరాటపడుతున్న

29.

నిన్నలో కలిసిపోయిన నేను
నీజ్ఞాపకాల్లో రేపటికీ పదిలమేగా

30.

నిలకడగా ఉండదు నీ నీడైనా నీతో
నీ ప్రతి ఉనికిలోనూ తోడుగా నేను

31.

నీతలపులని తాగేస్తున్నఅక్షరాలు
ఒలికిపోతున్నాయి చరిత్ర పుటల్లోకి

32.

ఈ లోకం
బతుకున్న శవాల రంగుల రాట్నం

33.

అప్పుడప్పుడూ అంతే
నవ్వులు ఏడిపిస్తాయి ఏడ్పులు నవ్విస్తాయి

34.

నిదురన్నది నను చేరనంటున్నది
రెప్పవాల్చితే నీరూపు కరు గుతుందని

35.

నా అద్దంలో నీ రూపం
మరి నన్ను నేనెక్కడ చూడాలి?

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి 36.

 నాలో నేను మోడువారిపోయా
నీలో చిగురించానేమో చూడు

37.

ఆ క్షణం వారు చిన్న పిల్లలే
తమని తాము మరచిపోయే క్షణాలు కావాలంతే

38.

నాక్కొంచం వెన్నెల కావాలి
నువ్వోసారి ఇటు తొంగిచూడు

39.

నా జీవితకాలాన్ని అద్దెగా చెల్లిస్తా
కాస్త నీ హృదయంలో చోటియ్యవూ

40.

నడకే రాదనుకున్నా నా మనసుకి
పరుగే పెడుతుందేమిలా నీ మనసుకై

41.

మలిక్షణం ఎప్పుడూ కొత్త కాల పరిచయమే
కొత్త క్షణమెప్పుడూ ఆశను నిలిపే జీవమే

42.

కావ్యం రాయడానికి ఆలోచనలు కావాలా?
కాలపు జ్ఞాపకాల సమీరాలు చాలవూ

43.

నిన్నేగా నిన్ను చూశా
నేటికల్లా నా జీవితమయ్యావే!

44.

ఎప్పుడూ భ్రమల్లోకేనా ప్రయాణం
దాటిచూడు తెలుస్తుంది జీవితం

45.

లెక్కల పుస్తకం కాదుగా జీవితం
లాభనష్టాల బేరీజుతో సహాయం చెయ్యటానికి

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి

169 170

46.

 నాకు నేనే బహుమతినయ్యా
నువ్వునాలోకి ఇంకిపోయాక

47.

నిన్నలోనే ఒదిగిపోతావెందుకు?
నేడుకూడ నీదేలే రా ముందుకు

48.

అక్షరం చిన్నబోతుంది
ఆదర్శం అంతా తనలోనేనా అని

49.

నా నిన్నలో నుండి నువ్వు జారిపోరాదూ
నేడు నీ జ్ఞాపకాల పుట లేకుండేది

50.

రెప్పమాటునే తారాడుతానంటే ఎలా
లోకానికీ పరిచయమవ్వు ఒకసారి

51.

విజేతల హస్తాలతో రాసిన చరిత్రలో
పరాజితుల వాదనలకు వేదనలకు చోటెక్కడ?

52.

క్షణం విలువెప్పుడూ క్షణమే
నిన్ను కలిసిన తొలిక్షణం విలువ మాత్రం నాజీవితం

53.

కాలపురుషుడు ఎంత నిర్దయుడు
క్షణానికో క్షణాన్ని చంపేస్తూ

54.

కాలాన్ని అభిషేకిస్తున్నా
ప్రతి క్షణమూ చెలి ఊసుని తోడుగా తెమ్మని

55.

నీ నిశ్శబ్దం నను తాకిన క్షణమే
నా శబ్దం ఆవిరయ్యింది... నిను చదవానికి

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి