మణి మాలికలు/విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
విశ్వనాథ్ గౌడ్ ఈడిగ అగవేలి పోస్ట్, కృష్ణగిరి మండల్ కర్నూల్ జిల్లా - 518225 వృత్తి: ఎకౌంటెంట్ మొబైల్ నెం. 9885761467 ఈ-మెయిల్:edigaviswanath@gmail.com
విశ్వనాదాలు...
1.
నేను తమకాలతో గమకాలు పాడుతున్నా
నువ్వు శృంగార వీణ మీటుతుంటే
2.
కనురెప్పలు మూసి నీధ్యానం
కనుల ముందు సాక్షాత్కరిస్తావేమోనని
3.
నా కనుల ముందు నీ రూపం
ప్రేమ తపస్సు ఫలించి నీ సాక్షాత్కారం
4.
చితిమంట వెలుగుతుంది నాగుండెల్లో
చిరుబురులాడుతూ చిరాకుగా నీవెళ్ళిపోతే
5.
దొంగల్లే దూరావుగా
దొరసాని మూసిన కనురెప్పల దొంతరలోకి
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
175 176
6.
నా ఎదురుచూపులను పంపించా
నువ్వెక్కడెనా ఎదురవుతావేమొ వెతకమని
7.
ప్రతినిత్యం ప్రేమాభిషేకమే
నాగుండె గుడిలో కోలువైన దేవతకి
8.
రైలుకూత నాగుండెలో
నువ్వొసున్నావని తెలియజేస్తూ
9.
విరహాగ్ని చల్లబడింది
నీమనసు మంచుకొండలో
10.
విక్రమార్కుడినయ్యా
నీ జ్ఞాపకాల శవాన్ని మోస్తూ
11.
వేటగాడినే
నీచూపులను వెంటాడుతూ
12.
చిత్రకారుడినే
ఊహల్లో నీ రూపు చిత్రిస్తూ
13.
సతమతమవుతూ సంస్కతి
నాగరికం పేరుతో నాశనం అవుతుంటే
14.
నీకోసం సంస్కతం నేర్చుకుంటున్నా
దేవతలు ఆభాషే మాట్లడతారటగా
15.
మా పల్లె పాడుబడింది
పట్నం పద్ధతులకు పట్టంకడుతూ
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ 16.
గర్భం నుండే మొదలు ఆడపిల్లకు
చావు, బ్రతుకుల సుదీర్ఘ… పోరాటం
17.
ప్రతిరోజు వసంతమే వాలుజడకి
రోజుకోరకం పువ్వు విరబూస్తుంది
18.
నామనసుకు ప్రేమతో కూడికలే వచ్చు
ద్వేషంతో తీసివేతలు ఇంకా నేర్చుకోలేదు
19.
చోద్యం చూస్తావే...
కుదుటగా ఉన్న మనసుని కుదిపేసి
20.
చీకది విజయగర్వం
తారకలను, వెన్నెలను వెలుగులోకి తెచ్చానని
21.
మౌనరాగం ఆలపిస్తున్నా
నీ మది వీణలో సరిగమలు పలికించడం తెలియక
22.
మౌనం రాజ్యమేలుతోంది
అలసిన ప్రపంచాన్నిచీకటి నిద్రాపుచ్చాక
23.
సంద్రాపు అలదీ నీది ఒకేరీతి
చెంత చేరినట్లే చేరి వెనక్కెళ్ళిపోతారు
24.
కన్నీళ్ళు కారిపోతున్నాయి
కంటికుండకి చిల్లు ఎవరు పెట్టారో
25.
నింగి...నేలతో కరచాలనం
వానచినుకుల చేయి అందిస్తూ
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
177 178
26.
మనసు ప్రమేయం లేకుండా మనిషి ప్రయాణం
మానవత్వపు శిఖరం నుండి మృగత్వపు అగాధంలోకి
27.
నాట్య మయూరివే
నాపై కోపం వచ్చినప్పుడల్లా చిందేస్తూ
28.
రాయి, రాయి దగ్గరైతే అగ్ని
నువ్వు, నేను దూరమైతే విరహాగ్ని
29.
భూమి విశాలమైనదే
నాది, నీదంటు కంచెలు వేస్తారంతే
30.
జాతరేదో జరుపుకుంటోది నామది
నీ జ్ఞాపకాలన్నీ పోగేసుకుని
31.
మదిమూత తీయవూ
ప్రేమరసం నింపాలి
32.
వెన్నెల మైదానమైం ది
మన రాసక్రీడలకు
33.
తీరం కనపడదే
నీజ్ఞాపకాల నావలో ఎంత పయనించినా.
34.
జడివానవే నువ్వు
ఎడతెరిపి లేకుండా నీతలపులు కురిపిస్తూ
35.
నా గుండె వేగంగా కొట్టుకుంటోంది
నువ్వేమైనా మది తలుపు తట్టావా?
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ 36.
ఆటలో మేటినే నన్ను ఓడి నిన్ను గెలిచానుగా
37.
సూరీడు తాంబూలం వేసుకుంటాడా? అంత ఎర్రగా పండిపోయాడు
38.
మనం వేసిన అడుగు అడుగును అడుగు...
అడుగడుగుకో అర్థం చెబుతాయి ఏడడుగులంటే ఏంటో
39.
పూలన్ని పోటీపడి పరిమళిస్తున్నాయి...
నీ సిగలో నిలిచే అదృష్టం ముందెవరికి దక్కుతుందంటూ
40.
నామనసు గోడ రంగు వెలిసింది...
నీప్రేమని పూసి వర్ణశోభితం చేస్తావా?
41.
కొండకోనలకు ప్రతిద్వనించడం నేర్పిస్తున్నా
నీ పేరుతో మొదలుపెట్టి
42.
విత్తు విప్లవాల బాటపట్టింది
భూమిలో పాతేస్తే పొరలు చీల్చుకుని మరీ బయటకువస్తూ
43.
గతాన్ని జ్ఞాపకాల గునపంతో తవ్వుతున్నా
నీ గుర్తుల గుప్తనిధాులేమైనా దొరుకుతాయేమోనని
44.
వాడిన వలపుతీగ చిగురు తొడిగింది
నువ్వు ప్రేమధారలతో నామనసును తడుపుతుంటే
45.
రాత్రంతా మొహానికి అబద్దపు నవ్వుల రంగేసుకున్నా
తెల్లారగానే జీవితనాటకం మళ్ళీ నవ్వుతూ మొదలుపెట్టాలని
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
179 180
46.
నీకంటే నీఊహలే నయం
నానుండి ఎన్నటికి విడిపోవు
47.
తారలు చీకటింటికి తొరణాలు కడుతున్నవి
ఆకాశానికి పండుగొచ్చిందని నిండుపున్నమి రాకతో
48.
నిజంగా వికటకవివే నువ్వు
ఇరకాటంలో కూడ వెటకారం జోడించి సమస్యను సాధిస్తావు
49.
పిడుగుల దాటికి మబ్బులకు గాయాలయ్యాయి
చూడుశ్వేతరుధిరాన్ని ఎలా కారుస్తున్నాయో
50.
వడ్రంగిపిట్టలా మనసును తొలుస్తున్నా
నీజ్ఞాపకాలలో గూడు కట్టుకోవాలని
51.
దిగాలు పడ్డది ఒంటరితనం
నిరంతరం నువ్వు నా జ్ఞాపకాలతో సహజీవనం చేస్తుంటే
52.
మనసు నావ విరహపు కొండను ఢుకొంది
ప్రణయ జీవుల్నివిషాద సంద్రంలో ముంచేస్తూ!
53.
దొంగ పోలీస్ ఆాడుతున్నాం...
కళ్ళకు కనపడకుండా నువ్వు, కలల్లో వెదుకుతూ నేను
54.
కర్ణుడు పారబోసిన నెయ్యి రథాన్నికుంగదీస్తే
నేను పారేసుకున్న మనసు బ్రతుకును కుంగదీసింది
55.
తానెళ్ళిన దారిలో అంవేషణ
జ్ఞాపకాల గుర్తుల కోసం
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ 36.
నాలో నేను మోడువారిపోయా
నీలో చిగురించానేమో చూడు
37.
ఆ క్షణం వారు చిన్న పిల్లలే
తమని తాము మరచిపోయే క్షణాలు కావాలంతే
38.
నాక్కొంచం వెన్నెల కావాలి
నువ్వోసారి ఇటు తొంగిచూడు
39.
నా జీవితకాలాన్ని అద్దెగా చెల్లిస్తా
కాస్త నీ హృదయంలో చోటియ్యవూ
40.
నడకే రాదనుకున్నా నా మనసుకి
పరుగే పెడుతుందేమిలా నీ మనసుకై
41.
మలిక్షణం ఎప్పుడూ కొత్త కాల పరిచయమే
కొత్త క్షణమెప్పుడూ ఆశను నిలిపే జీవమే
42.
కావ్యం రాయడానికి ఆలోచనలు కావాలా?
కాలపు జ్ఞాపకాల సమీరాలు చాలవూ
43.
నిన్నేగా నిన్ను చూశా
నేటికల్లా నా జీవితమయ్యావే!
44.
ఎప్పుడూ భ్రమల్లోకేనా ప్రయాణం
దాటిచూడు తెలుస్తుంది జీవితం
45.
లెక్కల పుస్తకం కాదుగా జీవితం.
నిద్రలోను మెలకువగానే నేను
కలలో నీతో కబుర్లుచెప్తూ!
57.
కనీసం ఈ ఒక్కరోజైనా ప్రేమించవూ
ఈ రోజు ప్రేమికులదినం అంటగా!
58.
శిలనై ఉన్నాను నేను
సమ్మెటతో కొట్టకు పగిలిపోతా...ఉలితో చెక్కు శిల్పానౌతా
59.
పూలు వాడినా వీడదులే దారం
నువ్వు వీడినా వదలదులే నీజ్ఞాపకం
60.
నా మనసు పుస్తకం అందంగా అచ్చయింది
నీ ముఖచిత్రం నా ఎదపై ముద్రించాక
61.
రామాయణంలో సీత ఒక్కతే అగ్నిప్రవేశం నాడు
ఇంటింటా వంటింటి అగ్నికాహుతయ్యే సాద్వీమణులెందరో నేడు
62.
డొంకతిరుగుడు ఎందుకు?
కల్లోకి కాకుండ ఎదురుగా రావచ్చుగా..!
63.
అరకొర చదువుల బ్రహ్మయ్యా
మాబ్రతుకులపై నీ పిచ్చిరాత ఏ ఒక్కరికి అర్థంకాదేమయ్యా?
64.
కాలానికి ఎందుకింత కక్ష
కనీసం నిన్నుకల్లో అయిన ఉండనీయకుండ తెలవారుతుంది
65.
నీ విరహం వేడి
నిప్పులనే తలపిస్తోందిగా మరి!
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
మణి మాలికలు జ సురేష్ బాబు రావి 181 182
66.
కాలం బందీ అయ్యింది
మన బిగికౌగిళ్ళలో చిక్కుకుని ముందుకు, వెనక్కు వెళ్ళలేక
67.
చేతులు చాపి హత్తుకుాంవా
పిడికెడు గుండెలో నా జీవితాన్ని నింపుకు నీముందుంచుతా
68.
కళ్ళలో వత్తులు వెలిగించుకు చూస్తున్నా
కన్నీటి చమురు ఆవిరవకముందే వచ్చెయ్
69.
జలపాతాలే నీ కురులు
తలనుండి మెడ మీదుగా జాలువారి నడుంపై పడుతూ
70.
నేనెప్పుడూ విఫలమే...
నీ ఊసుల వలయాన్ని దాటడంలో..!
71.
మనసుపై రాసిన పుస్తకాలు చదువలేని పామరుడినే
అయితేనేం నీ మనసును చదవడంలో పండితుడినే
72.
నాకళ్ళు కలల ఖజానాలే
దానికి కోశాధికారిణివి నువ్వైనప్పుడు
73.
ఎంత తిక్కశంకరుడివిరా ఈశా....పరమేశా...
లోకం కోసం గరళాన్ని దిగమింగావు
74.
నీ పెదవులు ముద్దాడినందుకేనేమో
మురళీ గానానికి ఈమాదుర్యం
75.
నీ మనసుకెంత మోమాటం...
ప్రేమించిన మాటైనా చెప్పలేనంతగా..!
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ 76.
నన్ను తాకిన గాలేటి ఇంత వెచ్చగుంది
నిన్ను గాని తాకి రాలేదు కదా
77.
కళ్ళ తీరాన్ని తాకుతూ కలల అలలు
మనస్సంద్రం ఉప్పొంగిన భావాలతో ఎగిరెగిరి పడుతుంటే
78.
పగలే వెన్నెల కాయడమంటే ఇదే
నువ్వు నా ముందు సాక్షాత్కరించావుగా
79.
మతి తప్పిన మనసు
గతి తప్పిన కలలతో
80.
కలలు కరుస్తున్నాయి
నువ్వేమెనౖ ఉసిగొల్పావా?
81.
నీ జ్ఞాపకాలు కమ్మేసాయి మనసంతా
తనువంతా ఆనందపు జడివాన కురిపిస్తూ
82.
రెండు సుడులున్నాయి!
ఒక్క పెళ్ళైనా కావట్లేదింకా ఏంటో
83.
షరామామూలే!
నేను కవ్వించడం, నువ్వు కన్నెర్రజేయడం.
84.
నాగుండె కల్లోలకడలే
నీజ్ఞాపకాల కెరటాలు నిత్యం హోరెత్తుతుంటే!
85.
సాగుతూనే ఉంటుంది కాలం
కాలంతీరిన వారిని సాగనంపుతూ
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
183 86.
కళ్ళ పొలిమేర దాటని కలలు
ఎక్కడ పుట్టాయో అక్కడే సమాధవుతూ
87.
ఆమె... ఒక పాలకడలి
తన జీవితాన్నిమథించి అమృతమిం ప్రేమ పంచుతుంది.
88.
ఓర్చుకోవడం ఏ గురువు వద్ద నేర్చుకుందో
గుండెల్లో అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా చలించదు స్త్రీ
89.
వలపన్నుతోంది నిద్ర
కళ్ళలో సంచరించే కలలను పట్టుకోవాలని
90.
ఎంత దోపిడి...కష్టం చేతులదైతే
అలసిపోయి సుఖనిద్రను అనుభవించేదేమో కళ్ళు
91.
నీతో జీవించాలనే నా ఆశల కెరటం
నువ్వు చేరువయిన రోజు తాకుతుందది ఆనందాలతీరం
92.
నీ జ్ఞాపకాలు 'చల్లకుండ'
నా గుండె తడారినప్పుడల్లా ఆశల నీరు పోస్తూ
93.
పెత్తనమంతా నీదే
నామనసునెపుడో నీ దాసిగా చేశా
94.
ఇద్దరిదీ ఏకగ్రీవ ఎన్నికే
పగటి నియోజకవర్గంలో సూరీడు రాత్రి నియోజకవర్గంలో చంద్రుడు!
95.
జ్వలిస్తూ మది గుండంలోని జ్ఞాపకాల కణకణాలు
కలకలం రేపుతూ బూడిదవుతున్నఆశల ఆనవాళ్ళు
184
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ 96.
అసంపూర్ణమే నాజీవితం
నువ్వు తోడులేని ఏ జన్మైనా
97.
నీఊహలెంత తుంటరివి
నామనసుని అల్లరిపెడుతూ తుళ్ళిపడేలా చేస్తున్నాయి
98.
దిష్టితీయాలి నా కళ్ళకు
నిన్ను రెప్పలమాటున దాచినా కూడా చూసేస్తున్నాయి కలలు
99.
ఆకలేసిన నా మది
నెమరేస్తూ నీ జ్ఞాపకాలు
100. నాదేహం... రెండు ముక్కల కలయిక
నువ్వోసగం... నేనో సగంగా
101. సంగమించిన మన మది నదులు
ప్రేమ సంద్రంలో లీనమయ్యేందుకు ఉరకలెత్తుతూ
102. యుగాలు క్షణాల్లా పరిగెడుతున్నాయి
నీతో సాగే నాజీవితకాలంలో
103. అఖండజ్యోతిలా వెలిగిపోతూ కాలం
క్షణాలు ఆజ్యంలా కరుగుతుంటే
104. మది భావాలను మస్తిష్కంతో మథించా
దొరికింది అక్షయపాత్ర నిండ కవితామృతం
105. నాది రో చుక్కలతో పక్కే
నా చక్కదానాల చుక్క పక్కనుంటే
మణి మాలికలు జ విశ్వనాథ్ గౌడ్ ఈడిగ
185 <poem>106. రెండిళ్ళపూజారి.... సూరీడు
ఉదయం తూరుపింట్లో ....సాయంత్రం పడమరింట్లో
107. దాగుడుమూతలు ఆడుతున్న సూర్యచంద్రులు
ఒకరికొకరు యుగాలుగా పట్టుబడకుంఫడా
108. వెతుకుతూనే ఉంటాయి నా కళ్ళు
ఇలలోనో, కలలోనో నువ్వు పట్టుబడేవరకు
109. మగజాతికిది తీరని అన్యాయమే
కవులు, కవయిత్రులు అందరూ...మగువల గురించే వర్ణిస్తుంటే
110. భారంగా నా కనులు
నిద్ర కరువై కాదు సుమా... నీతలపులు కరువయే
111. పచ్చనోటుపై బాపూజీ బోసినవ్వుల తెల్ల'ధనం'
నల్లధనంగా మిగిలిపోతున్నానని తెలియదు పాపం
112. మాసానికోసారి ఉప్పొంగే వెన్నెల సంద్రం
భూమి తీరాన్ని వెలుగులతో తడుపుతూ
113. జీవనది కాలం
ప్రవహిస్తుంటుంది సమయం
114. కళ్ళు మాయాదర్పణాలు
తనను తప్ప అందరిని చూపెడతాయి
115. ఆయుధ సరఫరా చేస్తున్న వసంతుడు
మన్మథుడి వింటికి పూబాణాలను అందిస్తూ
మణిమాలికలు: విశ్వనాద్ గౌడ్ ఈడిగ </poem>