మణి మాలికలు/సుకన్య బీగుడెం

సుకన్య బీగుడెం

హౌస్‌.నెం: 19-1-586, దాూద్‌ బౌలి, మహారాజ్‌ గంజ్‌, కామాటిపుర, బహదూర్‌పుర, హైదారాబాదు - 500 064 కలం పేరు: సుకన్య వృతి: అకౌంటెంట్ మొబైల్‌ నెం: 9948187064 ఈ-మెయిల్‌: sukanya.baby71@gmail.com వె బ ్‌ : facebook.com/ooheoopirimanasepandiri

సుకన్య భావసుమాలు... 1)

 ఊహా తరంగాలకు అడ్డేముంది?
మనసే తీరం అయినప్పుడు !

2)

సుమాలమే
ముఖపుస్తక వనంలో భావాలు పంచుకొంటూ

3)

తారాజువ్వలమే
ప్రేమసామ్రాజ్యంలోకి దూసుకుపొతూ

4)

సుకుమారినే
మల్లెలతో తాకినా కందిపోతూ

5)

ఉడికించి ఊరించడం గోపాలునివంతు
భక్తిపరవశంలో మునగడం గోపికలవంతు

మణి మాలికలు జ సుకన్యా బీగుడెం

161 162

6)

 మనసును అంతలా గారాం చెయ్యకు
వలపులో చిలిపి సరాగాలు కావాలంటుంది

7)

మనసు లేడైతే వయసు ఉరకలేస్తుంది
కోరికలకు కళ్ళెమేస్తే ధనం పొదుపౌతుంది

8)

అక్షరం నాదే
భావావేశం నువ్వే

9)

నా గుండె బరువెక్కింది
తల్లికి పుట్టేది ఆడపిల్లనిని గర్భంలోనే సమాధి చేసేస్తే

10)

మౌనం నీ అంగీకారాన్ని తెల్పింది
నా మనసుని తేలిక పరుస్తూ

11)

నీ మౌనం
నిశిలో దాగిన వెన్నెలలా నా ప్రేమను దాచుకుంది

12)

పుష్పమైన వికసించని మొగ్గే
బిడ్డ యెంత యెదిగిన కన్నప్రేగు ప్రేమకు

13)

కాలాన్నిముద్దాడాలి అనిపిస్తుంది
నిన్ను పరిచయం చేసినందుకు

14)

కాలం గమనాన్ని తగ్గించవూ
మనం కలిసే సమయంలో

15)

ఏగాలం వేసావో కలానికి
చిత్రంగా చిక్కుతున్నాయి భావకవనాలన్నీ

మణి మాలికలు జ సుకన్యా బీగుడెం 16)

 మొట్టినా సమ్మతవుే
అందులో నీప్రేమే ఉందిగా నిండుగా

17)

నిజం చెబుతావా నిన్నొకటి అడుగుతున్నా
పెళ్లయ్యాక నామాటే వింటావు కదా!

18)

మనిషిలో మంచితనం
కాలంలో కాలి బూడిద అయ్యింది

19)

ప్రతి నిముషం గుర్తుకొస్తావు
నేను బ్రతికున్నందుకు సాక్షిగా

20)

మల్లెలు కురులలో చేరినప్పుడే
పరవశాల పరిమళములు మగువలకు

21)

అమ్మ ప్రేమామృతంతో
ప్రేమ జగతిలో సజీవులమే ఎప్పటికీ

22)

కౌగిలింతల స్వప్నాలు
కరిగిపోవు మనసుల పెనవేతల మధురిమలో

23)

ఎడబాటుకు చోటేలేదు
ముడిపడిన మమతానురాగాల మనసుల కలయికలో

24)

పెదవులకు సింగారం నీ చిరునవ్వులు
వీనులకు విందులు ఆ సవ్వడులు

25)

నా మనసు సరిగమలంటుంది
చెవిలో చేసిన నీగుసగుసలకు

మణి మాలికలు జ సుకన్యా బీగుడెం

163
164

26)

 అమాయకంగా సిగ్గుల మొగ్గ అంటావే?
ఓరకంట వలపు శరాలు గుచ్చి !

27)

అమ్మానాన్నల జ్ఞాపకాలు
మాటలకు అందనివి...అక్షరాల్లో ఒదగనివి

28)

కాలం జాడలేకుండా పోయింది
నీముద్దు మురిపాల మునిగాక

29)

అక్షరాల భావానికి ముద్దివ్వాలి
నీ మదిని తాకినందుకు

30)

నా మౌనాన్ని అర్ధం చేసుకోలేని నువ్వు
నా మాటలని ఎలా అర్ధం చేసుకోగలవు?

31)

పాత రోత్తెపోయింది
కొత్తకి కొమ్ములొచ్చాక

32)

నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి
మన జ్ఞాపకాల తుంపరలు తడుపుతాయి

33)

మనుసు ఉలితో పదిలంగా చెక్కా
మదికోవెలలో ఆరాధ్య దేవతవే అయ్యావు!

34)

మునివంటిని నొక్కి మౌనంగా భరించకు
ఆది శక్తివై దుష్టులను చెండాడు

35)

ప్రేమికుడవే...
ప్రేమ మకరందానికి తూనీగవై భ్రమణాలుచేస్తూ... >

మణి మాలికలు జ సుకన్యా బీగుడెం