మణి మాలికలు/శ్రీ వెంకటేష్‌ గ్రంథి

శ్రీ వెంకటేష్‌ గ్రంథి డోర్‌ నెం.: 70-1జు-2, లేక్‌ వ్యూ కాలని, రమణయ్య పేట, సర్పవరం జంక్షన్‌, కాకినాడ 533001 వృత్తి: సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ మొబైల్‌ నెం: 099597 60365 ఈ-మెయిల్‌: venkatesh.nikith@gmail.com

శ్రీ మనసులో...

1)

 నువ్వు మిన్నువి,నేను మన్నుని
అసాధ్యమని తెలిసినా ఆలింగనంకై ఎదురుచూస్తూ

2)

నువ్వు రోజావే
నీ మాటల్లో ముల్లులుగా మార్చుకుని

3)

రాజకీయాల్లో షరా మాములే
కలవాల్సినప్పుడు పొత్తు పెట్టుకుని, కలహాలోస్తే జుత్తుజుత్తు పట్టుకోవడం

4)

నా విలువ సున్నానే
నువ్వు నాతో ఒకటయ్యేంతవరకు

5)

ఆవేశంలో తీసుకునే నిర్ణయం ప్రాణంతీసే ఆల్కహల్‌ వంటిది,
ఆలోచించి తీసుకునే నిర్ణయం ప్రాణంపోసే ఆక్సిజన్‌ వంటిది

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి

155 156

6)

 నేను మళ్ళీ పుట్టా నీ ప్రేమలో కొత్తగా
కాని ఈ జన్మకి ఆయువు ఎన్ని రోజులో?

7)

వయసు వేగాన్ని పెంచుతూ
నడక వేగాన్ని తగ్గిస్తూ కాలం ఆడే ఆట

8)

నీలో కలిగే అణువంత భయం
నువ్వు అధిరోహించబోయే ఎత్తుకు అవరోధం

9)

నటిమీద రేపు బాగుంటుందనే ఆశ
నిన్నటి మీద నేడు బాగుందనే సంతృప్తి

10)

టెక్నాలజీ...
విజ్ఞానాన్ని,విభేధాల్ని రెండూ పెంచుతూ

11)

కాలమనే బడిలో
జీవితం జీతం అడగని గురువు

12)

నమ్మకాన్ని హతమార్చింది
విషం వేసుకున్న అబద్ధమనే వేషం

13)

మనిషికి ఉండొచ్చు గర్వం
చెడగొట్టనంత వరకు మనగౌరవం

14)

ముఖస్థుతి కరువయ్యిందట
ముభావంగా ఉన్నాడు

15)

ఆకలి ఖరీదు
ఈకలికాలాన చుక్కలలో

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి 16)

 వ్యర్ధంలో కూడ
అర్ధం ఉంటుంది వెతికే మనసుంటే

17)

నా ఊహాసుందరి
నా ఊహల్లో మాత్రమే సుందరి

18)

నా ఎదకి ఎక్స్‌పైరీ డేట్
నువ్వు ప్రేమకి పేకప్‌ చెప్పినప్పుడే

19)

రోగులమే అందరం ,
రంగులలో బ్రతికేస్తున్నామంతే

20)

గుండెవేగం రెట్టింపయ్యింది
తన గొంతులో నాపేరు పలుకగానే

21)

ఆరు పలకల దేహం
తినకపోవడం వల్ల కాదు తినడానికి లేకపోవడం వల్ల

22)

పట్నం చీర కట్టింది
పల్లె ఆ చీర కట్టుకు సిగ్గు పడింది

23)

నాగుండెచెక్కపై చెక్కా నీపేరు
నామనసును మేకులా మార్చి ప్రేమను సమ్మెటలా చేసి

24)

ప్రకృతి స్వయంపాకానికి పూనుకున్న వేళ
పుట్టుకొచ్చిన సహజసిద్ధ అమృతానివి నువ్వు

25)

అడవిలో లేడి పిల్ల
అడవి బయట ఆడపిల్ల

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి

157 158

26)

 పోలికేలేని కవలలు
కష్టం , సుఖం

27)

దరిద్రం దాండోరా వేస్తే
దాహానికి దానిమ్మజ్యూసు కూడ దొరకదు, దారుణంగా

28)

చెప్పే మాటలు అర్ధమవ్వాలి
చేసే పనిలో అర్ధముండాలి

29)

నన్నుపాలిస్తున్నావుగా
నా మనసును ఆక్రమించి, నా నుంచి విభజించి..

30)

శారీరకదెబ్బతో కన్నీటి అనుబంధం కొన్నాళ్ళే
మానసికదెబ్బతో వీి చుట్టరికం బ్రతికున్నన్నాళ్ళు

31)

చుక్కలడిగింది నాచెలి
తన చెక్కిల్లపై మెరుపులుగా అద్దడానికట

32)

ప్రేమించింది నీ గతాన్ని కాదు
నీ జతలో నా భవిష్యత్తుని

33)

నీ రాకతో వేల కోట్ల విద్యుత్కాంతులు
నీ పోకతో ఒక్క క్రొవొత్తిరాల్చిన కన్నీటిచుక్కలు

34)

అదృష్టం అవకాశవాది
కృషి ఆత్మీయవాది.

35)

నీ అదరామృతాన్ని అపహరించా
నాలో మరణించిన సరసుడికి సంజీవని కావాలి మరి

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి 36)

 నా కలం కదలికకి ప్రేరణ నువ్వు
నా కాలం కదులటకి కారణం నువ్వు

37)

ఏవో మాయలు తెలుసు మా అమ్మకి
నాకే తెలియని నా ఆకలిని పసిగడుతుంది

38)

నేను స్నేహమనే విత్తునే వేసా నీమదిలో
నువ్విప్పుడు ప్రేమనే మహవృక్షంలో నాకు నీడనిస్తున్నావు

39)

మనిద్దరి మాటలే సమాంతరాలు
మనసులకు లేవు అంతరాలు

40)

నా ప్రేమ
నేను నీకిచ్చిన మొదటి బహుమతి

41)

ఎగసే కెరటం లాంటిది వయసు
తీరం చేరేకొద్దీ వేగం తగ్గుతూ

42)

విచిత్రం
నడవలేని గడియారంలో, పరుగులెత్తే కాలం

43)

తన పొడిపొడి మాటలు
నా చెంపలకు తడి స్పర్శను పరిచయం చేసాయ్‌

44)

నీ అలక మామిడి పులుపు,
నీ కులుకు చెరుకుగడ తీపి

45)

చలి తాకిడికి చర్మం చల్లబడితే
చెలి తాకిడి తగిలి వెచ్చబడింది

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి

159 160

46)

 నే నిద్రపోతే నీకెవరు కాపలా అనుకున్నా
నేనిక్కడ భద్రమే అంటూ కలవై వచ్చావుగా

47)

నాసిగ్గు రూపం లేని ముగ్గైతే
నీపై నాఇష్టం ఆకాశమంత రంగవల్లి

48)

ప్రేమ ముడుపు తెచ్చా
నీ హృదయపు హుండి తలుపు తెరువవా జారవిడుస్తా

49)

నాబుడిబుడి అడుగులు
బహుకాలానికి పలకరించిన అమ్మ ఆనందభాష్పాలు

50)

చూస్తావా నీిపై అక్షరం
ఇదిగో నా గుండె సంద్రంపై నీ నామం

51)

నా ప్రేమకు కొలబద్దా?
అయితే గగనపు చుట్టుకొలతను కొలువుటలో పెట్టు శ్రద్ధ....

52)

మొదట మరుపవ్వవా
తరువాత జ్ఞాపకమవుదువుగాని

53)

అమ్మా... నీ దెబ్బల వల్లనే
నా వీపును నేను అందుకోగలిగాను

54)

మనసు విరిగింది
ప్రతి ముక్కలోను నీ నవ్వులే

55)

నీ ఇష్టం అంతరంగిక ప్రశంస
నీ కొపం బహిరంగ విమర్శ

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి