మణి మాలికలు/శ్రీనివాస్‌ ఆర్‌. వీ. ఎస్‌. ఎస్‌.

శ్రీనివాస్‌ ఆర్‌. వీ. ఎస్‌. ఎస్‌

D1/1 దూరదర్శన్‌ కాలనీ, శ్యామలా హిల్స్‌, భోపాల్‌ - 462013 (మధ్య ప్రదేశ్‌) కలం పేరు: శ్రీ బిరుదు: ఏకవాక్య కవితా విశారద వృత్తి: ఇంజినీర్‌ మొబైల్‌ నెంబర్‌: 919425012468 ఈ-మెయిల్‌:rvsssrinivas666@gmail.com వెబ్‌: www,srikavutalu.blogpost.in

శ్రీ అక్షర నక్షత్రాలు... 1.

 నీలోని శోకసాగరం పొంగింది
నాకంటిని ఉప్పెనలో ముంచేస్తూ

2

నాకోసం నింగి నుండి విచ్చేసావ్‌
పాపం! జాబిలిని ఒంటరిని చేసేసావట

3

మనసు పులకిస్తోంది.
నీ మౌనం నాతో భాషిస్తున్నందుకే

4

మూర్ఖుడు...దుఖం దాచుకోనేది కన్నీటి వరదలో
వివేకి...శోకాన్ని మూసేది చిరునవ్వుల ముసుగులో

5

చీకట్లో నిన్నుచూసాను
పున్నమనుకొని టపాసులు కాల్చడమాపేసాను

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

143 144

6

 నీవు నాచెంతనుంటే తెలియని తిథి
అందరూ చీకటిమయం అనుకొనే అమావాస్య

7.

నీ జ్ఞాపకాలు కదిలేవి కాదు
నీ రూపం చేరిగేది లేదు.

8.

మన పేర్లు ఇసుకలో వ్రాసినా
జ్ఞాపకాలు మాత్రం దాచుకున్నవి మదిలోనే

9.

చంద్రకాంతులు కనిపించడమే కాదు
వినిపిస్తాయి...నీ పాదాలనల్లుకొని!

10.

కలం పడితే కవితయ్యేవరకు ఆపకు
కత్తి ఎత్తితే సంహరించేదాకా ఆగకు

11.

అడుగులు చూసి వేయవూ?
పారిజాలకు కూడ ముళ్ళుంటాయి

12.

నీ ముక్కుకి ఎంత పొగరో?
అలక ముక్కెర అస్తమానూ సర్దుకుంటూ

13.

ప్రత్యూషం పారిపోయింది నిన్ను చూసి
తొందరగా ఎందుకు వచ్చానా? అనుకుంటూ

14.

నా కన్నులడుగుతున్నాయి నీ కళ్ళని
నాలాగే రాత్రంతా నిదురపోలేదా? అని

15.

అక్షరాల లోయల్లో వెదుకుతున్నా
పదాల పువ్వుల కోసం

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌ 16.

 మాట గుండెను భేదిస్తే
మౌనం మనసును కోసేస్తుంది

17.

నిన్ను చూసాకే అనుకున్నా
కంటికి తలుపులు ఎందుకని?

18.

సూర్యుడంటే కోపం తొందరగా వచ్చేసాడని
చంద్రుడంటే కోపం త్వరగా వెళ్లిపోయాడని

19.

నా కన్నీటికి అసూయ
నువ్వుండగా దరి చేరనీయవని

20.

కొత్త హీరొయిన్‌ ఇంట్లో దొరికాయి అగ్గిపెట్టెలు
అందులో ఉన్నాయి వేల జతల బట్టలు

21.

మొబైల్‌ జారిపడింది
ఇల్లంతా ముత్యాలే

22.

విరితేనెలకు...అధరసుధల్తో పోటీ
పొట్టేలు కొండతో డీకొన్నట్లే!

23.

గుడిలో దేవునికి చక్కరపొంగలి
మెట్లమీద బిచ్చగత్తెకు నేడు కూడ లేదు అంబలి

24.

అమాసలో నీరేడు రాలేదనా?
సిగమల్లెలు ఆకాశాన విసిరేసావ్‌

25.

సత్యభామ రియల్‌ ఎస్టేట్లో ప్రవేశం
తులసివనాల కొనుగోలుతో వ్యాపారం ప్రారంభం

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

145 146

26.

 కావాలని కళ్ళు మూసుకొనేదీ నువ్వే
తర్వాత నన్ను తుంటరనదీే నువ్వే

27.

నీ చెవిరింగులు ఎవరికీ ఇవ్వకు
నా గుసగుసలు బట్టబయలు చేయకు

28.

కన్నీళ్ళతో నింపాను కొలనంతా
వచ్చావ్‌... స్నానమాడి వెళ్లిపోయావ్‌

29.

మదనునికొక్కటే ధనువు
వేయి ధనువుల కొలువు నీతనువు

30.

పున్నమొస్తే తరగల కెంత సంబరమో !
తీరాన్నెక్కువ అల్లరి పెట్టొచ్చని

31.

నీవు దొరికాక ఆపేసాను
వేలుపుకై చేస్తున్న నా అన్వేషణని

32.

నీవు లేవని తెలుసేమో!
వెండికొడవళ్ళతో భయ
 పెడుతోందీ వెన్నె ల

33.

పూసే 'కొమ్మ'కే గోిటిగిచ్చుళ్ళు
కాసే చెట్టుకే రాళ్ళదెబ్బలు

34.

ఏ గిరుల మీద మనసు పడిందో !
నా సందేశం నీకింకా చేర్చలేదు మేఘం

35.

'నా తనువు'ను చూసుకున్నా సిగ్గే
అందులో 'నా' 'నువ్‌' ఉన్నావనేమో!

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌ 36.

 నీ ప్రేమగాలితో ఊపిరి పోసావా?
మదివేణువు నీ వేదం పలుకుతోంది

37.

మిన్నాగు తలపై జాజుల మాలలు
నీలి అంబరాన మెరిసే తారాపథాలు

38.

ప్రేమ తాకిడి... మంచుపువ్వు తాకినట్లు
వియోగపు అలికిడి... నిప్పుకణిక తగిలినట్లు

39.

పాదాల కింద ప్రేమరేణువులు జారుతున్నాయి
ముంచేందుకు వియోగతరంగాలు కోరలు చాస్తున్నాయి

40.

కరవవాలం పుష్పించిన కొమ్మనే నరుకుతుంది
కవికులం ఫలించని ప్రేమనే లిఖిస్తుంది

41.

రెప్ప మూయాలంటే నీకు చీకటుందని భయం
కన్ను తెరవాలంటే నువ్వు వెళ్ళిపోతావనే సంశయం

42.

సాగరానికి చెలియలికట్ట దాటడం కష్టమే
నీమదిని జయించడం నాకు అసాధ్యమే

43.

నీ అందానికి కొలబద్దా నా దాగ్గర లేదు
నా ప్రేమకి తులాభారం నువ్వు ఎప్పటికీ వేయలేవు

44.

ఆశల కెరటం నింగికెగసింది
జీవనతీరం తాకకుండానే పతనమైంది

45.

ప్రతీ స్వప్నం సత్యమే
మనసుకి మెలకువ వచ్చేదాకా

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

147 148

46.

 ప్రాణం నిలవదు నువ్వు కాదంటే
అవునన్నా పోతుందేమో...పట్టరాని సంతోషంతో

47.

ప్రేమకావ్యానికి అక్షరాభ్యాసం చేయించావు
ఎందుకో ముందుమాటతోనే ఆపేసావు

48.

ప్రేమ ఫలిస్తే పరవశంతో కన్ను మూత పడుతుంది
వలపు 'విష'మిస్తే ఆ దుఖంలో కన్ను మూసేస్తుంది

49.

తాంబూలంలో సున్నం ఎక్కువైతే నాలుక మంట
జీవితంలో వలపు ఎక్కువైతే బ్రతుకు పంట

50.

నిదరోతే కలలో కనిపిస్తావని ఆశ పడేవి కళ్ళు
కల కన(పడ)క మండేవి మదిలో విరహపు నెగళ్లు

51.

నీ చెలిమి దినదిన క్షయం
నా వలపు అహరహం అక్షయం

52.

ఆలయం కట్టాక విగ్రహ స్థాపన సాధారణం
దేవీప్రతిష్టతొ గుండె...గుడిగా మారటం అద్బుతం

53.

నువ్వు నవ్వితే మదిలో మంచుకుసుమం రాలినట్లు
అలిగితే మనసువెన్నపై కొరకంచుతో మెత్తగా తాకినట్లు

54.

అందాల జాబిల్లి మోముపై మచ్చలు
వెన్నెలమ్మ పెంచిందేమో వాడి గోళ్ళు

55.

ప్రేమఊసుల్ని బిడియంగా వింటాయి లోలాకులు
గుండెగడియారంలో వలపు డోలనాలు చేస్తూ

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌ 56.

 ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఎన్నటికీ తెలియదు
ఎందుకు ప్రేమిస్న్నానో నాకు ఎప్పటికి అర్ధమవదు

57.

భావమాలికలతో అలంకరిస్తున్నా నిన్ను
కనకానికి కరువు గానీ అక్షరాలకు కొదవ లేదుగా

58.

ఊహాచిత్రాలు గీస్తూనే ఉంటాను అసంఖ్యాకంగా
అస్పష్టమైన నీరూపం స్పష్టమయ్యే దాకా

59.

రెప్ప మూసిన క్షణం ఎదుట ఉన్నావనిపిస్తుంది
కన్ను తెరిచిన నిముషం వాస్తవం వెక్కిరిస్తుంటుంది

60.

నేను ప్రవరాఖ్యుడినే
మనసు మార్చుకుంది నిన్ను చూసాకనే

61.

నీతో గడిపిన తీయని క్షణాలివ్వు
వియోగపు యుగాలని నిర్దయగా చంపనివ్వు

62.

నీ వియోగం మద్గురమైన జ్ఞాపకాలను మెల్లగా మింగేస్తోంది
ఆకలిగొన్న అజగరం చిక్కిన లేడిని నిదానంగా కబళిస్తున్నట్లు

63.

నువ్వు భాషిస్తే నా చెవులకి వినబడుతుంది
శ్వాసిస్తే నీలోని నా మనసుకి ఊపిరందుతుంది

64.

రెండు మనస్సుల పెదవులు
ఇచ్చిపుచ్చుకుంటున్నాయి తీయగా మధువులు

65.

రాధామాధవం చూసిందేమో!
బృందావనం దగ్గర మరీ సిగ్గు పడుతోంది యమున

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

149 150

66.

 'ముత్యం' రాధమ్మ...'నీలం' క్రిష్ణయ్య
'రాధామాధవం' మాత్రం కంటికింపైన 'కెంపే'

67.

ప్రేమగా చూడకు
పెదవి మాట సైతం మరచిపోతోంది

68.

అపుడు సాగింది మనమధ్య ప్రణయప్రవాహం
ఇపుడు కదలన్మంటోంది ఘనీభవించిన జ్ఞాపకాలనదం

69.

నీకై వేచి చూసిన క్షణాలు
కాలం గడియారంలో కదలని యుగాలు

70.

మన జీవనగ్రంధం చాలా క్లిష్టమైనదే
గ్రాంథికం కంటే కష్టమైననిన్నర్ధం చేసు కోలేక

71.

నిశీధికి ధవళవర్ణం పూస్తుంది నీ మాటలవెన్నెల
కౌముదికే కవనం నేర్పిస్తుంది నీ సౌందర్యాలవెల్లువ

72.

సూదంటురాయల్లే మనసును లాగేస్తావు
చూపులకత్తులతో మెత్తగా కోసేస్తూ

73.

వేరు చేసే పనిలో 'వన'మాలి
పూలతోటలో నీవు నవ్వులు రువ్విపోయాక

74.

కళ్ళల్లో వెన్నెలపాతాలు నీ జతలో
నిప్పుల ఉప్పెనలు నీ వియోగంలో

75.

కళ్ళకెప్పుడూ కనబడేవి కల్లలే
రెప్పలమాటున దాగున్నవి సత్యాలే

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌ 76.

 నా రెండుకళ్ళకి వరమైన నీ సోయగం
ఇంద్రుని వేయికళ్ళకి సైతం దక్కని మహార్భాగ్యం

77.

కన్నుకీ కన్నుకీ గమ్మత్తైన పోటీ
నిన్నెవరు ముందు చూస్తారో...అని

78.

అన్నులమిన్న కన్నులు పన్నేవి వలపువలలు
కనుపాపలలో బంధిస్తూ... కదలనీయని పద్మవ్యూహాలు

79.

మధురక్షణం వద్దే ఆగిపోనీ కాలాన్ని
మరో చేదుజ్ఞాపకం తలుపు తట్టకుండ

80.

నిశిలో నిద్రిస్తోంది ప్రతి రేయి హాయిగా
మదిలో నీ జ్ఞాపకాలనెగళ్ళు అవిశ్రాంతంగా మండుతున్నా

81.

తారలన్నీ మిలమిలలతో వేస్తాయి శశాంకునికి 'వల'
చందమామ దాగేది వయ్యారి వెన్నెలమ్మ కొంగుకా'వల'

82.

నమ్ము'కొని' శిశిరంలో నీ కౌగిళ్ళనెగళ్ళని
విసిరేసాను ఉన్న అన్నిఉన్నికంబళ్ళని

83.

తీరంలా 'అల'జడితో నేను
సాగరకేంద్రంలా ప్రశాంతంగా నీవు

84.

నీ చింతన మానలేని బలహీనత నాది
నాచింతని దూరం చేయలేని అసహాయత నీది

85.

నిన్నటిదాకా గతమనిపించిన
శిశిరంనేడెందుకో వర్తమానమై భయపెడుతూ

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

151 152

86.

 నాకు దాగ్గరౌతోంది మృత్యువు.
నీవు దూరమøతున్న క్షణాలలో

87.

ఇద్దరం ప్రేమిస్తున్నాం
నువ్వు నన్ను... నేను నీసంతోషాన్ని

88.

నీసిగ్గుల్లో మందారాలు నాకిష్టం
బాగా తెలుసు నీ బొటనవేలు గీసే అర్ధచంద్రికలకర్ధం

89.

వేయికళ్ళు లేవని చింతిస్తున్నా
రిెంటిలోనే ప్రేమంతా నింపుకొని నీకోసం ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా

90.

తుమ్మెదా రెక్కలపై సుమాలగుంపు వాలే వింతైన దృశ్యం
మల్లెలు నీ కొప్పెక్కినప్పుడు మాత్రమే కనబడే సోయగం

91.

శిశిరాన్ని చీల్చేస్తూ వసంతం
నిరీక్షణానేత్రాలకి నీ సందర్శనం

92.

వసంతుడు ఋతువంతా బిజీనే
ప్రతీ 'కొమ్మ' కొప్పులో రంగురంగుల పూలు ముడుస్తూ

93.

కలల నిండ నీ తలపుల పరిమళాలు
కన్ను విప్పితే...తలగడ తడిసిన గుర్తులు

94.

విలపించవు సుమాలు
'కొమ్మ' నుంచి తెంచినా...'కొమ్మ' కొప్పులో అమరితే

95.

మరుమల్లె మరీ మూతి తిప్పుతోంది
తన సోయగాన్ని నీతో పోల్చలేదని

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌ 96.

 ఊరించే మరీచికలే
అరచేతిలో నీవు చూపే స్వర్గాలు

97.

రాజకీయ చ(చద)తురంగం
ఎవరికి పావులౌతున్నామో తెలియకుండా సామాన్యుడు

98.

ఊహల పల్లకిలో ఊరిస్తూ నీవు
తలపుల సందిట్లో మైమరుస్తూ నేను

99.

పరిమళాల పండుగే
నీ జ్ఞాపకాలు కూడ విరులైపోతే

100. నేను రోజూ కొలుస్తున్నా
మన మధ్య దూరాన్ని ఎన్నో కాంతి సంవత్సరాలలో

101. పూలకి దారంతోనే ఏకసూత్ర బంధనం
జ్ఞాపకాలు మదిని వేధించే కంటకనందానం

102. నీ(నా) కలలకి యవనికలా
మూసిన కనురెప్పల చీకటి

103. కన్నీళ్లు కూడ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి
జ్ఞాపకాలు గుండెల్లో గునపాల్లా దిగబడుతుంటే

104. జాణతనం అంటే నీదే...
కొంటెసైగలు నువ్వు చేస్తూ...నిందలు నాపై మోపుతూ

105. గరళం కూడ మధురమే
అది నీ వియోగప్రసాదమైతే

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

153 </poem>106. మన... మధురాలన్నీఒక్కొక్కటిగా మరణం వియోగ గరళాన్ని అయిష్టంగానే త్రాగుతూ

107. నీ నవ్వులీయవూ పెదవిపై పేరుకున్న విషాదానికి పైపూతగా

108. రాత్రిబడిలో చంద్రుడే మేష్టారు చుక్కల చక్కదనాన్ని కళ్ళజోడు సందు నుండి చూసేస్తూ

109. అందాన్నే హరివిల్లుగా చేస్తూ నీవు అనుక్షణం లక్ష్యమైపోతున్న సంబరంలో నేను

110. కన్నుల్లో నీరూపం చేసే నృత్యాలు చీకటి యవనికపై సిరివెన్నెల లాస్యాలు

111. రెప్పల చాటున దాగిన నీరూపం వెన్నెల్లో సైతం తళుకులీనే తారాదీపం

112. నీవు ప్రాణప్రదమన్నది నేనైనా... నాలో ప్రాణదీపమై అఖండకాంతులు వెదజల్లేది మాత్రం నీవే

113. నేనూ నిన్ను ప్రేమించడం మొదలెట్టేసా నన్ను ప్రేమలో మిం(ముం)చావని తెలిసాక

114. గగనకుసుమమే జాబిల్లి అందంలో...అందనితనంలో అచ్చం నీలా

115. జ్ఞాపకవనాలను పెంచుతున్నా... బాధిస్తున్నా...నాటి నీడలోనే మం(ఉం)డిపోతూ </poem>

154

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌