పీఠిక
ఈశతకమును రచించినది దిట్టకవి రామచంద్రకవి. ఇతఁడు కాశ్యపసగోత్రుఁడు. రంగారాయచరిత్రము వ్రాసిన నారాయణకవికుమారుఁడు.
రఘుతిలకశతకము కందపద్యములలోఁ గడుమనోహరముగా వ్రాయఁబడినది. కవి నిరర్గళధారాశోభితుఁ డగుటచే భక్తిరసము గురియునటులఁ జక్కనిపోకడలతో శతకముఁ బూర్తి చేసియున్నాఁడు. ఒకపద్యమును జదివితి మేని శతకమంతయుఁ బూర్తిచేయనిది తోఁచనంత సరసముగా నీశతకము వ్రాయఁబడినది. ఇందలి పద్యములయందు శ్రీరాముని దివ్యలీలలు సజీవముగాఁ జిత్రితములై యుంటచే ముముక్షువుల కియ్యది ముఖ్యముగాఁ బఠనార్హముగా నున్నది.
ఈకవిజీవితము విపులముగా మహిషాసురమర్దనిశతకములో నుంటవలన నిచట నుదాహరింపక మానితిమి. రామాయణమునందలి ముఖ్యాంశములు శ్రీరామునిదయాశాంతాతిమానుషలీలల నుద్బోధించునంశము లొక్కటొక్కటి యొక్కొక్కపద్యమున మనోహరముగాఁ గూర్పఁబడియున్నందునం బద్యము లన్నియు భక్తులకు సంతోషకరములనుటకు సందియ మించుకేనియుఁ గలుగదు.
శతకమకుటము చక్కనిగమనికతో నుంటవలనను బద్యమును దదనుగుణముగా ధారాశోభితమై యుంటవలనను శతకవాఙ్మయమున కిది యొకవిశేష మని చెప్పనగును. ఈయమూల్యాముద్రితశతకము మేమె తొలుత ప్రచురింపఁగలుగుట మాయదృష్టము.
ఈశతకమాతృక మాకొసంగి గ్రంథముద్రణమునకు సానుభూతిఁ జూపిన శతకకర్తవంశీయులగు
మ-రా-రా-శ్రీ దిట్టకవి సుందరరామయ్యశర్మ పాకయాజిగారియెడఁ గృతజ్ఞులము.
,
దిట్టకవి రామచంద్రకవికృత
రఘుతిలకశతకము
క. |
శ్రీరామా యనినప్పుడు
కోరిక ఫలియించె మాకుఁ గోసలతనయా
దారక మార్తాండకులో i
ద్ధారక రఘుతిలక నిటలతటనటదలకా.
| 1
|
క. |
నానాఁటికి నానోటికి
తేనై చెఱకై యనంటితెఱఁగై వెఱఁగై
యానంద మొసఁగు నీయభి
ధానము...
| 2
|
క. |
నాతల్లి జానకీసతి
నాతండ్రివి నీవు మీకు నందనుఁడను న
న్నేతెఱఁగునఁ బ్రోచెదొ సం
త్రాతవు...
| 3
|
క. |
ఎల్ల జగంబులు కాదిమ
వల్లభుఁడవు పోషకుఁడవు వర్ణించెద ని
న్నుల్లము రంజిల్లఁ గుభృ
త్తల్లజ...
| 4
|
క. |
తీండ్రించు మొదటివెలుఁగని
యం డ్రార్యులు నిన్ను మినుకులట్టులఁ బలుకున్
గుండ్రాతి నాతిఁ జేసిన
తండ్రీ...
| 5
|
క. |
కలుషాజవంజవార్ణవ
ములు దాఁటఁగ నిఁక నుపాయములు దొరుకవు నీ
విల సన్నుతి దక్కఁగ నిను
దలఁతున్...
| 6
|
క. |
ధరణిం బురణింపఁగ నీ
కరణిం గరుణించుదొరలు గలరె? గుణమణీ
భరణీ దురితమహార్ణవ
తరణీ రఘు...
| 7
|
క. |
పాటించి నిన్నె కొలిచెద
హాటకగర్భాండకల్పనానూనమహా
నాటకవిశిఖవిపాటిత
తాటక...
| 8
|
క. |
శశిధరవిధిముఖులకుఁ బ్రా
యశముగ నీయశము పొగడనగునే? యుగప
ద్దశవిశిఖగళితదశగళ
దశగళ...
| 9
|
క. |
దండము భవదంఘ్రులకు న
జాండసహస్రాద్భుతప్రదాయకపటుదోః
ఖండీకృతభీమధను
ర్దండా...
| 10
|
క. |
గర్గాదివినుత బ్రోవవె
భర్గసమోదగ్రరూపభార్గవఘటిత
స్వర్గపథమథనవిలైస
న్మార్గణ...
| 11
|
క. |
ఈహ భవన్నుతియెడ నా
కాహవసమయప్రకల్పితానూనజగ
న్మోహనరూపహనూమ
ద్వాహన...
| 12
|
క. |
వర్ణింతు నీగుణంబు లు
దీర్ణమహాముక్తి కామధేనుసమూధః
పూర్ణపయఃపుషితాశ్రిత
తర్ణక...
| 13
|
క. |
కల్యాణమతివిగద కౌ
సల్యాసద్గర్భజలధిశశధర నీని
స్తుల్యచరిత్రము త్రిజగ
త్కల్యము...
| 14
|
క. |
అజ్ఞానలవము సోకని
ప్రజ్ఞావిభవంబు నాదుభావంబున కీ
వాజ్ఞాపింపవె పాలిత
తద్ జ్ఞా...
| 15
|
క. |
స్వామి యేమని పొగడుదు
నీమహిమ లనంతములు మనీషకుహితమై
కామించితి నీయడుగుం
దామర...
| 16
|
క. |
'రామా' యనువర్ణద్వయి
లో మఱిపాపములఁ దోలు లోనికి చొరకుం
డా 'మా' కవాటమగు శుభ
ధామా...
| 17
|
క. |
నీయంత ప్రభువు కలుగుట
కే యుపమల నోఁచిరో సుమీ జగతం ద్రే
తాయుగమర్త్యులు హితఫల
దాయక...
| 18
|
క. |
నాయయ్య నీవు జానకి
నాయమ సౌమిత్రి నాచినయ్య కుశలవుల్
మాయన్నలు నీవాడఁగ
దా యింక...
| 19
|
క. |
సంసారరిరంసాపరి
పాంసుజలము విఱచి మోక్షఫలసుధ దెలుపన్
హంసము తారకమంత్రో
త్తంసము...
| 20
|
క. |
పేర్చినకృపచే నను నీ
కూర్చిన సేవకులలోనఁ గొండొకనిగ నే
ర్పర్చవె నీకథ లీచెవిఁ
దార్చితి...
| 21
|
క. |
ఏనోము నోఁచినను నీ
మానితపాదాబ్జభజన మది నోఁచవలెన్
లేనియెడ విడునె కర్మవి
తానము...
| 22
|
క. |
ఆసించితి భవధర్చా
భాసురభాగ్యానుభవము భావంబున నేఁ
జేసినతప మెట్టిదొ నీ
దాసుఁడ...
| 23
|
క. |
పరులకు నేఁగా నిఁక న
న్నొరు లెవ్వరు గడనసేయ రోపికచే నీ
వరసి భరియింపవలె నా
దరణన్...
| 24
|
క. |
సరసిజభవునకు దుర్లభ
మరయఁ ద్రయీధర్మములకునైన నశక్యం
బిరవుగ నిను బొగడఁగ నా
తరమా...
| 25
|
క. |
వెలయ రసజ్ఞకు రుచిగాఁ
జెలఁగును నీనామభజనఁ జేసెద నోహో
నిలచి మెలంగవె యిఁక నా
తలఁపున...
| 26
|
క. |
ఏతపముననో నీని
ర్హేతుకసంజాయమానకృపవలననొ నీ
ఖ్యాతి మది గలిగె నోశివ
తాతీ రఘు...
| 27
|
క. |
ఓపరమపురుష శుభమయ
ప్రాపయి రక్షించు నీదుపదభజనాని
క్షేపము నామదిలోపలఁ
దాపితి...
| 28
|
క. |
అన్యునిగాఁ జూడకు నను
మాన్యుని గావించి బ్రోవుమా పరహితసౌ
జన్య మొనగూర్చి కరుణా
ధన్యా...
| 29
|
క. |
మునుపటితనువున నిను గొ
ల్వనిదోసముచే జనింపవలసె నిపుడు గొ
ల్చినవాఁడనైతి నీకృపఁ
దనుపుము...
| 30
|
క. |
మునుజేసిననేరము మ్రొ
క్కిన మఱతువు ధనము లర్థి కిడి మఱతువు న
న్నును నట్ల మఱువకుము నీ
తనయుఁడ...
| 31
|
క. |
వినయవివేకము లెఱుఁగని
మనుజాధము నన్నుఁ గరుణ మన్నింపవె యో
దనుజాంతక యోదశరథ
తనయా...
| 32
|
క. |
దండితదృప్యద్రిపువే
దండా దండధరు దరిమి దయచే నను నీ
దండకుఁ జేర్పవె ధృతకో
దండా...
| 33
|
క. |
జ్ఞానం బెఱుఁగనివాఁడను
మానవుఁడను మందమతిని మన్నింపవె నీ
వానిగఁ గొను కాంచనపరి
ధానా...
| 34
|
క. |
శరణాగతపరిరక్షణ
బిరుదాంకుఁడ వీవు నేను భీతాత్ముఁడ నన్
గరుణింపవేని కలదా
దరి యిఁక...
| 35
|
క. |
వేడుక దీనుల బ్రోచెడి
వాఁడవు నను దీనుఁ బ్రోవవా యిది తగవా
క్రీడాశతసుందసతీ
తాడన...
| 36
|
క. |
ఏరీ నీసరి వేలుపు
లీరేడుజగంబులకును హితమతిశ్రితులన్
నేరుపున మనుపు మహదవ
తారివి...
| 37
|
క. |
కందోయికి విందుగ నిను
గం దోయి మహానుభావ కనుపట్టవె నా
ముందర సుందరహాసపు
దందడి...
| 38
|
క. |
దురితాగతపరితాప
స్ఫురితాపగఁ బడినపాలసుల దరిజేర్పన్
దొర దొరకునె నీవలె నీ
ధరణిన్...
| 39
|
క. |
నరు నక్రూరుఁ గుచేలున్
హరివై పరికించినట్లె యాదుకొనవె నన్
నరు నక్రూరుఁ గుచేలున్
ద్వరగతి...
| 40
|
క. |
నేర్పున నొర్పున సిరు లొన
గూర్ప దరిజేర్ప నీవ గుణనిధివి యశం
బేర్పడ సుందరతాశత
దర్పక...
| 41
|
క. |
బంధురకరుణాపూరధు
రంధరుఁడని నమ్మినాఁడరా నాయెడలం
దంధనముచేయకు సుహృ
ద్బాంధవ...
| 42
|
క. |
నేమమున నిన్నె కొల్చితి
పామరుఁడను గరుణఁజేసి పాలింపవె యిం
కేమర నీయడుగుందెలి
తామర...
| 43
|
క. |
బంధురతరైహికాంధుగ
తాంధుం దరిజేర్పవే దయారసవల్లిం
బంధించి తిగిచి వేయకు
దంధన...
| 44
|
క. |
మెఱువు నురోహిత మిరుగడ
దొరసిన ఘనమనమహీజతో లక్ష్మణుతోఁ
బెరయునినుఁ జూచు టెపుడో
తఱి యిఁక...
| 45
|
క. |
సరిగలరె శూరు లిఁక నీ
కరయంగాఁ బరశురామునంతటిజోదున్
దురమున వెఱపించితి వి
ద్ధరణిన్...
| 46
|
క. |
కరుణింపవలయు నే నీ
వరసుతుఁడను నెనరుగూర్పవలెఁ దండ్రివి నీ
వరయ ననుఁ గన్నతల్లియె
ధరణిజ...
| 47
|
క. |
నెఱ బ్రత్యక్షంబైనను
వెఱువకు మని పలికి కరుణ వెదజల్లి కరం
బిరిసిన దురితంబులు విడఁ
దఱుమవె...
| 48
|
క. |
తీఱదయా ధీర దయా
సారము వెదజల్లి నన్ను సాకకయున్నన్
వారక భవకలుషం బఘ
తారక...
| 49
|
క. |
ఆదుకొనవైతి విదివఱ
కాదిమదైవాగ్రయాయి యాలంకోర్వీ
యాదోధిమధ్యసేతూ
త్పాదన...
| 50
|
క. |
ఓయయ్య రాఁగదవె నా
చాయకు ఫలదానవిహితశబరీసద్యః
శ్రేయస్కర నిశ్రేయస
దాయక...
| 51
|
క. |
ఇప్పటికి నీదుహృదయం
బప్పా నాయెడలఁ గరుగదా యెంగద న
న్నెప్పుడు బ్రోఁచెదవో దయ
తప్పక...
| 52
|
క. |
నాయెడల నీకు దయరా
దాయెఁగదా పరమనియమతాపసనిచయ
శ్రేయోభూయోజయసం
ధాయక...
| 53
|
క. |
ఇంకన్ దయరాదా నీ
కింకరుదెస హితవిశేషకృతకోమల ని
శ్శంకానుక్రోశనిరా
తంకా...
| 54
|
క. |
కొఱగానిబుద్ధి నెఱిఁగీ
యెఱుఁగక నేజేయునట్టిహీనపుఁబనులన్
బెరిగినదురితలతల్ తెగఁ
దఱుఁగవె...
| 55
|
క. |
ఎన్నిదురాశలఁ బొరలినఁ
బున్నెము రానేర దాదిపురుషుని నిను బు
ద్ధి న్నిలిపినాఁడ విజయో
త్పన్నా...
| 56
|
క. |
తనలేమి యొరులకలిమికి
జనుఁడు వెతంగుడుచుఁ బూర్వజన్మంబునఁ జే
సినఫలమెంతో యంతియ
తనగతి...
| 57
|
క. |
ఖలమతులనైన సిరులన్
బొలుపొందిన పుణ్యులండ్రు పుణ్యులనైనన్
గలుగనిచోఁ జులుకనఁగాఁ
దలఁతురు...
| 58
|
క. |
స్నిగ్ధభవత్పదభజనా
దుగ్ధరసం బెఱుఁగనేరుతురె మోహఝరీ
దిగ్ధులు సంసారానల
దగ్ధులు...
| 59
|
క. |
ఉడుత యొకఁ డిసుము సేతువు
నిడినంతనఁ గరుణ జేసి యేలితివఁట యీ
యెడ నాయెడఁ గృపసేయుట
తడవా...
| 60
|
క. |
శరణన్న యంతమాత్రనె
పరికించి విభీషణునకు బహుతరవిభవ
స్థిరసుఖ మొసఁగినయఖిలో
త్తరుఁడవు...
| 61
|
క. |
పగఁజేసిన కాకాసురుఁ
దెగఁజూడక ప్రోచినట్టి దేవర వని నిన్
బొగడిన ననుబ్రోవమి యిది
తగునా...
| 62
|
క. |
ఖగము లొకరెండు బోరఁగఁ
దగవును బాలించి వానిదరిఁ జేర్చిననీ
యగణితకరుణాదృతి కే
తగనో...
| 63
|
క. |
బాఁపఁడు గొట్టినశునకము
వాపోవుచు మొఱలు బెట్ట వాత్సల్యముచేఁ
బాపితివి నివిరి మానస
తాపము...
| 64
|
క. |
వాలంపగములతాకునఁ
దూలి సముద్రుండు వేఁడఁ దోడనె వానిన్
లాలించితి వహహా నీ
తాలిమి...
| 65
|
క. |
బవరమునఁ బడినకోఁతులఁ
బవనజుచే మందులొసఁగి బ్రతికించిన మే
టివి యల్పమె నీకరుణా
ద్రవిణము...
| 66
|
క. |
తప మొకశూద్రుఁడు చేసిన
నెపమున విప్రసుతుఁ డీల్గ నెఱి జీవితుఁ గాఁ
గృపఁజేసితి వతులశుభ
స్థపదా...
| 67
|
క. |
నీటన్ ఱా ల్దేలుట విపి
నాటులు భటులౌట గలుగునా భువి మున్నే
నాట గొదువా మఱి నీ
ధాటికి...
| 68
|
క. |
నిరతిన్ నీకృపగల్గినఁ
దిరమగునికిమాత్రమైన దృఢవృద్ధి కిలన్
గుఱినీపుషితోటజవట
తరుతతి...
| 69
|
క. |
కలుములు లేములు జనులకుఁ
గలలోపలివార్తలట్ల కపటంబగు నిం
దలఁచుట చెడనిపదార్థము
తలకొన...
| 70
|
క. |
అమితంబగుసంసార
భ్రమనొందక నిన్ను నమ్మి భావించినయీ
క్రమముననె పునర్జనిసి
ద్ధముగద...
| 71
|
క. |
కరుణింపవయ్య న న్నో
సరసిజభవశంకరాది సకలనిలింపో
త్కరపరమహారసుమహా
తరళా...
| 72
|
క. |
మీనమవై సోమకు నం
భోనిధి బోర్లించి వేదములు నలువకు నిం
పూన నొసంగినసుగుణని
ధానివి...
| 73
|
క. |
కూర్మతచే గిరిజలనిధి
యూర్మికలం దేల్చి యమృతమొసఁగి సురారిం
గూర్మిం బ్రోచినసూనృత
ధర్మివి...
| 74
|
క. |
వారాహరూపమున నమ
రారిహిరణ్యాక్షుఁ దునిమి యవనినిషాణో
ద్ధారతఁ జేసినజగదా
ధారక...
| 75
|
క. |
నరసింహమూర్తి గైకొని
పరుషాత్ము హిరణ్యకశిపుఁ బ్రహ్లాదునకై
పరిమార్చితివి భవాంబుధి
తరణివి...
| 76
|
క. |
వామనుఁడ వగుచుఁ ద్రొక్కితి
మోమోటములేక బలిని మూఁడడుగు లిలన్
గామించి మనిపితివి సు
త్రామున్...
| 77
|
క. |
అతులపరశ్వథధారన్
గృతవీర్యతనూజుఁ దునిమి కృతయుగమున నొ
ప్పితివి భృగూద్వహ రామో
ద్ధతిచే...
| 78
|
క. |
కలన భృగురామువిలు గొను
టెలమిన్ మీరెండు మహిమ లేకంబగుటన్
గళ కళలోఁ గలిపికొనన్
దలఁచుట...
| 79
|
క. |
ద్వాపరమున సుజనులకుం
బ్రాపై యదుకులమునందు బలరాముఁడవై
దీపించితి వమితాఖిల
తాపస...
| 80
|
క. |
ఉద్దవిడి బయటిపల్లెల
ముద్దియలం గుట్టు చెఱిపి పొలతిండిగమిన్
సద్దడఁతు వింక బుద్ధతఁ
దద్దయు...
| 81
|
క. |
వారింతువు మ్లేచ్ఛుల నిఁక
ధీరతచేఁ దామ్రపర్ణితీరంబున నీ
వారయఁ గలి కల్కి తనూ
దారత...
| 82
|
క. |
కొంచక మోహినివై మఱి
వంచించితి వసురవరుల వడి సురలకునై
నించితి వమృతము సుగుణో
దంచిత...
| 83
|
క. |
త్రిపురములు గూల్చునప్పుడు
త్రిపురారికిఁ గొండవింట దివ్యాస్త్రమవై
నిపుణత నెఱపితివి పరం
తపుఁడవు...
| 84
|
క. |
అమరాసురయుధ్ధ మహిన్
గొమరున జీవాతుఁ డెసము గ్రోలితివి మహో
త్తమగతి వైకుంఠంబునఁ
దమకక...
| 85
|
క. |
నిపుణత నీవేగద జగ
దపకారుల సగరసుతుల నందఱఁ బొలియన్
శపియించిన కపిలుం డను
తపసివి...
| 86
|
క. |
భారతపంచమవేదమ
హారచనన్ నీతిమార్గ మలవరచినయా
పారాశర్యుఁడ వీవెక
దా రహి...
| 87
|
క. |
ఇప్పటికి నేను జేసిన
తప్పులకు మితంబు లేదు తాలిమిచే నా
తప్పులు సహియింపుము దయ
తప్పక...
| 88
|
క. |
నాకోర్కి నెవఁడు తీర్చును
నీకొమరుఁడ నైతి నింక నెనరుంచవలెన్
శ్రీకరరవివంశాబ్ధిసు
ధాకర...
| 89
|
క. |
ఆసించితి నీకరుణకు
దోసిలి యొగ్గితి భవాబ్ధి తొలఁగితి వెతలన్
బాసితి కుశలుఁడనైతిన్
దాసున్...
| 90
|
క. |
జాల్ముఁడ నిన్నుఁ దలంపన్
బ్రాల్మాలితి నిన్న నేఁడు బలికెద నిఁకఁ ద
ప్పు ల్మఱచి కరుణ సేయుము
తాల్మిన్...
| 91
|
క. |
ఇల దశరథతనయుఁడవై
యెలమిం బదకొండువేలయేం డ్లుండుటయున్
మెలఁగుచు భక్తులఁ బ్రోవన్
దలఁచుట రఘు...
| 92
|
క. |
రామా రవివంశాంబుధి
సోమా సుగుణైకధామ శుభకరనామా
శ్రీమహితవిభవజితసు
త్రామా...
| 94
|
క. |
రాజీవబాంధవాయుత
తేజోనిక్షేప యప్రతీపసురూపా
రాజితకారుణ్యసము
ద్భ్రాజిత...
| 95
|
క. |
విశ్వామిత్రమఘాహిత
విశ్వపలాశాశితూల విశ్రుతపటలీ
శశ్వద్ధూనన నవపృష
దశ్వా...
| 96
|
క. |
ఆసారసత్కృపామృత
కాసార! గుణాంతరంగకమనీయగుణ
వ్యాసంగవిమతజనసం
త్రాసద...
| 97
|
క. |
గహనాటసైన్యసేవిత
గుహనామకిరాతవినుత గుణధూర్వహనా
కుహనాసురవంశవనీ
దహనా...
| 97
|
క. |
ప్రాచేతసకవికవితా
వ్యాచిక్రింసాభిరామ హర్షితహృదయా
యాచకకాంక్షాఫలసం
ధారణ...
| 98
|
క. |
మా మవ తవ దాసోహం
కామితఫలద ప్రభావకరుణాసింధో
త్వామేన నహి శరణ్యం
ధామగ...
| 99
|
క. |
శ్రీమద్భూమశుభప్రద
నామన్ త్వా మంతరేణ నహి శరణం మే
మా ముద్ధర భద్రాచల
ధామా...
| 100
|
క. |
ప్రాచుర్యసమధికమనీ
షాచణ దిట్టకవిరామచంద్రునిశతకం
బాచరణ సేయనగు భ
ద్రాచలరఘుతిలక నిటలతటనటదలకా.
| 101
|