భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/ఉద్దండరాయశతకము

పీఠిక

సుప్రసిద్ధుఁడు దిట్టకవినారాయణకవి కీశతకకర్త యగు రామచంద్రకవి కుమారుఁడు. ఈకవి సమగ్రజీవితము మహిషాసురమర్దనిశతకమునఁ జేర్చియున్నారము గాన నిందు దిఙ్మాత్రముగా నుదాహరించుచున్నారము. ఈ రామచంద్రకవికవిత నిర్దుష్టముగా నిరర్గళధారాశోభితమై మనోహరముగానుండును. ఇతని గ్రంథము లింతవఱకు మా కీక్రిందనుదాహరించినవి మాత్రము లభించియున్నవి. ఇంకను బ్రయత్నించినచోఁ గొన్ని గ్రంథములు లభింపవచ్చుననునాసగలదు. 1.మహిషాసురమర్దనిశతకము, 2. గొట్టుముక్కులరాజగోపాలశతకము, 3. ఉద్దండరాయశతకము, 4.రఘుతిలకశతకము, 5. వాసిరెడ్డివారిచరిత్రము, 6. హేలావతిదండకము, 7. చాటుపద్యములు.

రామచంద్రకవి చిరకాలము వాసిరెడ్డివారిసంస్థానమునందు వేంకటాద్రినాయఁడువారి కాస్థానకవియై యుభయభాషాపండితుఁ డని పేరుగాంచెను. ఇతనిచాటుపద్యములఁ బట్టి చూడఁ గాలక్రమమున నాకాలమునఁ బేరుపడియున్న వెలమసంస్థానము లన్నింటిని జేరి ధనార్థియై రాజాశ్రయముతోఁ గాలము గడిపినటుల ద్యోతకము కాగలదు.

ఉద్దండరాయశతకకర్తయగు దిట్టకవిరామచంద్రకవి యిప్పటికి నూరుసంవత్సరములక్రిందట నుండియుండును. ఇంతవఱ కీకవి గ్రంథములుగాని సుప్రసి ద్ధమగునామముగాని యాంధ్రలోకము ఎఱుంగకుంట పరితాపకరము.

రామచంద్రకవి నూజవీటిప్రభువుల సంస్థానములోనిదగు మద్దాలి కేఁగి యటఁ గలయుద్దండరాయస్వామినిగూర్చి యీశతకమును రచించెను. శతకమునందు భక్తిరసము ప్రధానస్థానము నొందియున్నది. శతకమంతయు జకారప్రాసముతోనున్న ప్రాసస్థానములలోఁ గవి వెదకికొనక క్రొత్తపదములను సందర్భశుద్ధిగా సమకూర్చి తనకవితాప్రాగల్భ్యము వెల్లడించియున్నాఁడు. ఈశతకమునందలి పద్యభావములుగూడ మనోహరభక్తజనహృదయాకర్షణముగానున్నవి. ఈకవి సాహిత్యమందేగాక యద్వైతమతసిధ్ధాంతములందుఁ గూడ జితశ్రముఁడని యీశతకమునందలి పద్యములు చెప్పుచున్నవి.

మా3కుఁ బూర్వతాళపత్రగ్రంథమును బట్టి వ్రాయఁబడిన వ్రాతప్రతి జీర్ణమయమైనది లభించినది. ఇంక నుపేక్షించిన నీప్రతిగూడ నదృశ్యమగునేమో యని ప్రత్యంతరసహాయము లేకున్నను ఎటులో శుద్ధప్రతి నొకవిధముగా సిద్ధపఱచి ముద్రణమునకు నొసంగఁగలిగితిమి. ద్వితీయముద్రణమున శతకమును సర్వవిధముల సంస్కరింపవలెనని యున్నది.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

5.2.25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

దిట్టకవి రామచంద్రకవికృత

ఉద్దండరాయశతకము

మ.

అజకాంతన్ భజియించి భాగవతులం బ్రార్థించి డెందంబునన్
గజవక్త్రుం బ్రణుతించి తొంటికవులం గైవారముల్ చేసి ప్రే
మ జొహా రటంచు సాగిలి యెదన్ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా.

1


మ.

త్రిజగత్పూజ్యము లైన నీపదము లర్థిగా సేవ గావింతు నిన్
భజియింతున్ నిరతంబు మ్రొక్కుదు మది భావించి కీర్తింతు సా
మజసంరక్షక విశ్వకారక హరీ మద్దాలి...

2


మ.

భుజముల్ ఫాల మురంబు చేతులు పదంబుల్ భూమి మోయంగ సా
గి జలూకాగతిచేఁ బ్రణామశతముల్ గీలింతు గైకొమ్ము ప్రే
మ జెలంగ౯ భవదీయదాసుఁడఁ జుమీ మద్దాలి...

3

మ.

ప్రజకాంతాహృదయేశ సన్మునిజనవ్రాతాత్మసంవేశ నీ
డజరాజధ్వజపోషితేంద్రజనిరూఢప్రాభవోపేత ధ
ర్మజరాజ్యప్రతిపాదనాత్మయుత శ్రీ మద్దాలి...

4


మ.

సజలాంభోధరతుల్య నైల్యకలనాచంచతనూధామ శౌ
ర్యజితామర్త్యవిరోధిభూమ విధిముఖ్యాదిత్యనక్షత్రసో
మ జటివ్రాతనుతైకనామ వహమాం మద్దాలి...

5


మ.

భజనీయైకమహాచిదంబర పదాంభస్సిక్తహేమాద్రి ధ
న్విజటాడంబర కాంచనాంబర సదావిశ్వంభరా గోపసా
మజయానాహృదయాబ్జబంభర నమో మద్దాలి...

6


మ.

అజగవ్యర్చిత మౌనిచర్చిత సమస్తాదిత్యసంప్రార్థితా
సుజనారాధిత తత్త్వబోధిత ముముక్షుస్తుత్యశోభా పులో
మజిదశ్మప్రభ యుగ్రసేనసులభా మద్దాలి...

7


మ.

ద్విజరాజాంబుజమిత్రనేత్ర సకలాధిష్ఠానహృత్పాత్ర వా
రిజసంభూతనిజాగ్రపుత్ర కరుణాబృందిష్ఠచారిత్ర వ్యో
మజటాజూట సదాత్మమిత్ర నృహరీ మద్దాలి...

8


మ.

రజనీవల్లభభానునేత్ర త్రిజగద్రాఘిష్ఠిచారిత్ర నీ

రజగేహైకకళత్ర భవ్యగుణపాత్రా నన్నికన్ నీచక
ర్మజడత్వంబులఁ బాపి ప్రోవఁగదె శ్రీమద్దాలి...

9


మ.

ద్విజరాజధ్వజ దివ్యవందిత సదాదేదీప్యమానాత్మ దే
వ జగన్నాథ ముకుంద మాధవ హరీ వందారుమందార న
మ్మఁ జనున్ నిన్ను దయామయాత్ముఁడవయా మద్దాలి...

10


మ.

గజరాడ్రక్షక నాకుఁ గన్పడవె నే గన్గొందు నీపాదపం
కజముల్ నీవదనారవిందమును నీకన్దమ్ములుం గామసో
మజయంతాదుల గేరుచక్కదనమున్ మద్దాలి...

11


మ.

రజతక్ష్మాధరగేహసాయక భవద్రాజత్ప్రభావంబు ల
క్కజముల్ ద్రౌపదియార్తిచే సరసిజాక్షా యన్న మాత్రానఁ బ్రే
మ జిగుళ్లొత్తఁగ మానము న్నిలిపితౌ మద్దాలి...

12


మ.

అజహత్ప్రాభవ తెల్పవే స్మృతి యవిద్యారూపపుంజీనువా
లు జొరం దృష్టికి సంతరంబిడదు తల్లోపంబు లేకున్న భీ
మజరాయుఃగ్రథనంబు జీవున కగున్ మద్దాలి...

13


మ.

విజయక్షేమదనీదయంగద జయావిర్భూతిసంసారప
క్షజపంకాంబుధు లింకిపోవుటకు నీసంసేవ పేరింటి గ్రీ

ష్మజగత్ప్రాణము కారణంబుగద శ్రీ మద్దాలి...

14


మ.

వ్రజమున్ దామస ముజ్జగించి నినుఁ జీరం దారి గల్పింపవే
రుజకాధారము పూతిగంధలహరీరూఢంబు జంత్రంపుబొ
మ్మజుమీదేహము దీని నమ్మఁదగునే మద్దాలి...

15


మ.

అజరుద్రాదులు నిన్నుఁ గొల్తు రమరుల్ ప్రార్థింతురే ప్రొద్దు నె
ల్లజగంబుల్ సృజియించుకర్తవు దయాలంకారచిత్తుండ వా
త్మజతుల్యంబుగ నన్ను బ్రోవుము కృపన్ మద్దాలి...

16


మ.

వృజినంబుల్ హరియించి నన్నెపుడు సంహృష్టాత్ముఁ గావించి నిన్
భజియింపన్ మతిబుట్టఁజేసి కృపచేఁ బాలింపవే చందమా
మ జిగిం జేకొని కల్వమొగ్గవలె శ్రీమద్దాలి...

17


మ.

త్యజియింతున్ భవబంధముల్ మనములో నర్చింతు నీపాదముల్
విజయం బందుదు మోక్షలక్ష్మివలనన్ వేమాఱు సంగ్రామక
ర్మ జరాసంధమదాపహారి నృహరీ మద్దాలి...

18


మ.

గజఘాటీముఖసంపదల్ సతములా కా వీశరీరంబు లే
నిజముల్ వ్యర్థములంచు రోసి మునుమున్నే యైహికాగమ్యకా
మ్యజిగీషన్ భజియించి కాంచవలె నిన్ మద్దాలి...

19

మ.

సృజియింపన్ సృజియించి మేలొసఁగ నిర్జింపం బ్రజామానసాం
బుజవాంఛల్ సఫలం బొనర్ప విఫలంబుం జేయనీవేని కా
మజగద్భారకమూలకర్తవు భళీ మద్దాలి...

20


మ.

సుజనత్వంబరిదేహిమత్తుఁడయి సంక్షోభింపఁగా నేల ని
త్యజుగుప్సాస్పద మాజవంజవసుఖం బాహా భవద్దివ్యనా
మజపం బేమర కాత్మ నిల్పవలె శ్రీమద్దాలి...

21


మ.

యజనామ్నాయతపోజపవ్రతము లత్యంతంబు వర్ధిల్ల భూ
ప్రజ కానంద మమందమై పరగి సంపత్పారిజాతంపుఁగొ
మ్మ జిగుర్పం గరుణించుకర్తవు గదా మద్దాలి...

22


మ.

గజ మేదేశికునొద్ద శిక్షఁ గనె సాకల్యంబుగాఁ గుబ్జ యే
ద్విజు నాచార్యుని గాఁగఁ జేకొనె భవద్దివ్యామృతప్రాయనా
మజపప్రాప్తికి సాత్వికంబె గురువౌ మద్దాలి...

23


మ.

అజనుఃశ్లాఘ్యసుఖంబు గైకొనెద భూయఃస్వాయదానందనం
దజనీసత్వగుణస్ఫురత్స్ఫటికరత్నంబందు మత్పూర్వక
ర్మజపారోచులలోఁ గొనంగదవె శ్రీమద్దాలి...

24


మ.

ధ్వజమై వాహనమై పతంగపతి గొల్వ న్ బిల్వరాసెజ్జయం

దు జరీపుట్టము గట్టి కొ ల్వొసఁగి తోడ్తో చెంగటం గల్మికొ
మ్మ జతై నిల్వ జగంబు లేలుదువు శ్రీమద్దాలి...

25


మ.

యజమానత్వ మొసంగి జ్ఞానశిఖియం దత్యంతమత్కిల్బిషం
బజరూపంబుగ వేల్వఁజేయవె త్వదీయాంఘ్రిద్వయీభక్తిసో
మజలం బాని పవిత్రమూర్తి నగుదున్ మద్దాలి...

26


మ.

వ్యజనచ్ఛత్రముఖోపచారకలన వ్యాపారులై భక్తి వి
శ్వజనుల్ గొల్తురు నిన్ సహేందిరుసురల్ స్వర్గంబునందున్ బులో
మజతో నింద్రునివోలె నుర్వురపయిన్ మద్దాలి...

27


మ.

ఇజగుంజెంది కుచేలుఁ డర్థియయి ని న్నీక్షింప నేతేరఁ ద
ద్ద్విజవర్యున్ ఫలితార్థు జేసితివి నిన్ దేహీ యనన్ నీశుభా
త్మజతుప్రాయముగాఁ గడంగు టరుదే మద్దాలి...

28


మ.

నిజమాయన్ విధి వే గలంపఁ గలఁడే యింద్రాత్మతన్ నీవు వే
సృజనల్ చేసితి వెల్లవత్సముల నిన్ శీలింపఁగా లేక బ్ర
హ్మ జితప్రాభవుఁడయ్యె మత్తుఁడగుచున్ మద్దాలి...

29


మ.

అజమీళుం డొకవిప్రదాసియెడ రత్యాసక్తుఁడై కాలమెం
త జనంగాఁ దుది మోక్షమిచ్చితివి యోనారాయణా యంచు నా

త్మజునిం జీరినదాన బ్రీతమతివై మద్దాలి...

30


మ.

విజనంబైనమహాటవిన్ శబరి యావిర్భూతసద్భక్తిచే
భుజియింపన్ ఫలమీయ దాని కిడవే పుణ్యంబు శ్రీరామనా
మజనాధీశ్వరరూపధేయమున మున్ మద్దాలి...

31


మ.

నిజదాసావనసాభిమానుఁడవయా నీ వాజిలో సోమద
త్తజుకే లూడిచి సాత్యకిన్ మనిపి తత్యంతంబు సోలింపు సొ
మ్మజనింపంబడియున్నవేళ కృపచే మద్దాలి...

32


మ.

భుజదర్పంబున ద్రౌణి సుప్తవధకై బూనంగ నీవెన్ని భూ
భుజు లట్లుండఁ దొలంగఁ దెచ్చితివి నిన్ బూజించువారౌట ధ
ర్మజభీమార్జునమద్రసూనులఁ గృపన్ మద్దాలి...

33


మ.

ఋజుతత్త్వం బరినిన్ హసించుఖలు నాభృత్యాత్ముగాఁ గూల్తువౌ
రజకుం డూడుట మల్లు లీల్గుట మదారంభంబుచే డాసి సా
మజముం ద్రుంగుట కంసమూలముగదా మద్దాలి...

34


మ.

కుజనుల్ నిన్ను భజింపలేక తమకోర్కుల్ వేరుగా గేరికే
రిజపుంబల్కులు బల్కుచుం జెడుదు రుర్విన్ నారకావాసభీ
మజలూకాహృతదేహుఁడై పరమునన్ మద్దాలి...

35

మ.

రజతస్వర్ణముఖాఖిలార్థకృతగర్వగ్రస్తులై మత్తులై
బొజుఁగుల్ నిన్ భజియింపలేక తనువుల్ బోవన్ దయం బాత్మఁ గ్ర
మ్మ జముం జేరుదు రెన్నిజన్మములకున్ మద్దాలి...

36


మ.

అజరాధీశ్వరుఁ డైననీకు పరిచర్యల్ సేయఁ బ్రాల్మాలినం
బిజుగొట్టెన్ దుది ముట్టఁ డజ్ఞునకుఁ దర్విజ్ఞానహీనంపురి
మ్మజెడన్ నిన్ భజియింతు రౌషధ మిఁకన్ మద్దాలి...

37


మ.

అజనాషాఢకమండలుల్ గమిచి ధర్మాయత్తులై గౌతమీ
త్రిజగత్కారముఖాఖిలర్షులు నినున్ బ్రేక్షింపఁగా లేరు ధ
ర్మజిఘాంసుల్ దరిముట్టు టెట్టులొ యిఁకన్ మద్దాలి...

38


మ.

కుజముల్ రాజసతామసంబులు త్వదంఘ్రల్ గూర్చు మన్మానసాం
బుజమేఱోలు; పునర్భవైలబిలతుగ్మోక్షంబు తద్వృక్షయు
గ్మజయత్వంబు వహించి సల్పఁగదె శ్రీమద్దాలి...

39


మ.

గుజుగుంట్లం గడతేర్పలేని వెడకోర్కుల్ గోరుటల్ వట్టిభే
షజముల్ వీట నశింప దజ్ఞత భవత్సంసేవ సిద్ధింపు జా
ల్మజనశ్రేణికతత్జ్ఞతామయమరున్ మద్దాలి...

40


మ.

అజరస్థాపితకల్పకంబ వయి కుయ్యాలింపవే యోయధో

క్షజ నిన్నే నెదనమ్మినాఁడ నిఁక మత్కాలుష్యముల్ బాఱఁజి
మ్మ జుగుప్సల్ బెడబాప కర్తవు జుమీ మద్దాలి...

41


మ.

గజవక్త్రుండు భుజంగమాధిపతి గంగాద్వీపినీభర్తనీ
రజసంజాతుఁడు భారతీసతియు నీప్రాంచత్కథల్ బ్రేమసా
మజటాగానముల భజింతు రెపుడున్ మద్దాలి...

42


మ.

యజురాదిశ్రుతులెల్ల నిన్ బొగడు నాహా యండ్రు నీకీర్తి క
య్యజుడున్ భారతి నీదుతారకము జిహ్వాగ్రంబులన్ మేనకా
త్మజయున్ శంభుఁడు దాల్చి పొంగుదురు శ్రీమద్దాలి...

43


మ.

విజితత్వంబున నొంద దీషణదవావిర్భూతి యోహో చతు
ర్భుజ తచ్ఛాంతికి తావకీనకరుణాపూరంపుఁబాలేటిచె
మ్మజుమీ నమ్మినవాక్షికాంబుద మిఁకన్ మద్దాలి...

44


మ.

గిజిగా డెట్టులొ యట్లజీవుఁడును దద్గేహంబె దేహంబు త
ద్విజ మాలోపల జ్యోతినుంచుకొని యుద్దీపించునట్లే యజి
హ్మజగజ్జ్యోతిని నిన్నుఁ గాంచవలె లో మద్దాలి...

45


మ.

గజగండస్థలివోలె నెమ్మన మశక్యంబైన దుర్వాంఛ పే
రిజిలం దూలెడు దీని మాన్ప భవదంఘ్రిస్వర్ద్రుమూలైకసీ

మజవాకృష్టికి నందనీయఁగదె శ్రీమద్దాలి...

46


మ.

 గజపుష్పాంచితదివ్యదామములతోఁ గల్యాణచేలంబుతో
భుజకీర్తుల్ మొదలైనసొమ్ముగమితోఁ బొల్పారునీలంపుబొ
మ్మజిగి౯ గన్పఁడవయ్య మ్రొక్కులిడెదన్ మద్దాలి...

47


మ.

స్వజనుంగా గరుణించి నీస్మృతులు కస్మన్మూఢచేతఃపశు
వ్రజముం జేసి యొసంగవే యిపుడు ప్రత్యక్షంబు తాపత్రయో
ష్మజెడన్ా త్వత్పదదర్శనాప్తి మనెదన్ మద్దాలి...

48


మ.

అజపుత్రాదిమునుల్ భవన్మహిమ మేకాంతంబుగాఁ గాన నో
టజముల్ జేరి జపించి కాన రతిదౌష్ట్యప్రక్రియాలబ్ధపా
ప్మజడీభూతుఁడ నేను గాంచఁగలనా? మద్దాలి...

49


మ.

అజరద్వీపినిగన్న పాదకమలం బాసించితిన్ జూపవే
రజనీనాయకసోదరీరమణ యోరాజీవపత్రాక్ష న
మ్మజుమీ దృశ్యము నశ్య మైహికమునన్ మద్దాలి...

50


మ.

అజకంఠస్తనమై పరోపకృతి సేయన్ లేని మద్దేహయ
ష్టి జనింపన్ ఫలమేమి దీనినిఁ గనిన్ సేవింపఁ గైకొమ్ము జ
న్మజుగుప్సం బెడబాసి సార్థకమగున్ మద్దాలి...

51

మ.

రజనింజోలె యవిద్య నెమ్మదికి నిద్రం గూర్చు విద్యాసమృ
ద్ధి జగచ్చక్షుఁడపోలె తెల్వినిడుఁ దద్విజ్ఞానహైన్యత్రియా
మజనంజేయవె తెల్విఁ గైకొనియెదన్ మద్దాలి...

52


మ.

విజిఘత్సుత్వము నద్దురాప్తిభవ ముద్వీతంబుగా నూతనాం
బుజసౌందర్యము లైననీదుపదముల్ బూజింతుఁ గారుణ్యభూ
మిజలాసారము నాపయిన్ గురియవే మద్దాలి...

53


మ.

అజ నీదర్శన మబ్బు టెప్పుడొ యనేహస్రోత మంతంత డొం
కి జరంగెన్ గనుపట్టు మిప్పుడయినన్ గీర్తించి మైనిండ భ
ర్మజలం బుబ్బి స్రవింప మ్రొక్కు లిడెదన్ మద్దాలి...

54


మ.

సుజనుంగాఁ గరుణించి నామదికి సంశుద్ధిం బ్రసాదించి లో
కజనన్యాశ్రయవత్సవత్సశకటాకారాసురద్వాదశా
త్మజ రక్షింపవె మోక్షదాతవయి శ్రీమద్దాలి...

55


మ.

ప్రజిహావల్లికి పాంథుఁ దోరసిలు ఠేవన్ గర్వికిన్ నీవుగా
వు జగత్పూర్ణుఁడ వయ్యు సాధుగుణభవ్యుం బ్రోతు వజ్ఞానధూ
మజగర్వాంధుఁడ నెట్లు బ్రోచెదవొ నన్ మద్దాలి...

56


మ.

అజశృంగీకితవార్కముష్టిఫలవాంఛాయోగ్యసంసారమౌ

ఢ్యజదుర్వాంఛలు మాన్పి యొక్కయెడ వేడ్కంబోలె నీదివ్యనా
మజపం బూనగ బుద్ధి నియ్యగదె శ్రీమద్దాలి...

57


మ.

గుజుగుం ట్లెంతయు దీర కైహికపుసంకోచంబు చేతం గజీ
బిజిగా చింతలె పుట్టసాగె నిఁక నిన్ బేర్కొంటకె ట్లిట్టిఛ
ద్మజుగుప్సం బెడబాపి సాదఁగదె శ్రీమద్దాలి...

58


మ.

గజబంధి న్యుపమానమై యిహ మసౌఖ్యప్రాప్తి నొందింపసా
గె జుగుప్సం బడఁజాల నింక భవదంఘ్రీద్వంద్వసేవానికా
మజగన్మోహనబుద్ధి నా కొసఁగవే శ్రీమద్దాలి...

59


మ.

భుజమధ్యంబున లచ్చి పార్శ్వయుగళిన్ భూమీళ లుప్పొంగ భ
క్తజనుల్ గొల్వఁగ నోలగం బమరునిన్ గన్గొందుఁ గన్నార సో
మజటాజూటసుతాత్మ కన్పడఁగదే మద్దాలి...

60


మ.

గజమె ట్లట్లుగ నేను కర్మఫలనక్రగ్రస్తతన్ బొంది యా
ధిజబాధం బడియున్నవాఁడఁ గరుణాధీనుండవై భావిజ
న్మజుగుప్సాతదవస్థఁ బాపఁగదె శ్రీమద్దాలి...

61


మ.

మృజము న్మున్నుగ శుద్ధి దేలిచెద సామీ యోమిఁకన్ నీమహా
భజనాగాంగఝరీరసం బొసఁగవే బల్మాఱు మత్కల్మషా

త్మజపత్ క్షాళన మాచరించుటకునై మద్దాలి...

62


మ.

భజమానత్వదుపాస్తిమగ్నమతినై భాసిలినట్లున్ సదా
భజనత్వం బొనఁగూర్పవయ్య సుమనోబంహిష్ఠ సద్భక్తివ
ర్మజధైర్యంబున ధిక్కరించెద యమున్ మద్దాలి...

63


మ.

విజితాయాసము గాఁగఁ బంచతయు నిర్వేధాప్తిగా జీవనం
బు జగద్వందితయుష్మదంఘ్రిభజనాపూర్ణంబుగా నిర్మలా
త్మజటివ్రాతనుతాత్మ నా కొసఁగవే మద్దాలి...

64


మ.

గిజిగిట్లాడెడిదీనతన్ బరులకై కేల్సాచుటేకాని నీ
కు జతై మ్రొక్కుదు దీనికి త్తిరిపెవుంగోరాటమున్ వేరి పా
మజిలాయించుట మాన్పు మ్రొక్కులిడెదన్ మద్దాలి...

65


మ.

విలసత్ క్షీరరసానుభూతివలె నీవిఖ్యాతి వర్ణింప నిం
పు జెలంగన్ దయచేసి నిల్పఁగదె నాబుద్ధిం జిదానందధా
మ జగత్సన్నుతనామ శాశ్వతతమా మద్దాలి...

66


మ.

భజనాభావుఁడ నౌట నక్షిగతుగా భావింతువేమో సమ
స్తజగద్భర్తవు నీకు ద్వేషి గలఁడా సర్వంబు నీసృష్టి యా
త్మజుఁగాఁ గైకొనకున్న దిక్కుగలదా మద్దాలి...

67

మ.

కుజనాఖ్యాకుఁడ నేను నీవు సదనుక్రోశప్రభావుండ విం
క జడత్వం బెడలించి నాకు నిధివై కన్పట్టి ప్రాకృష్టక
ర్మజనుంగాఁ గరుణింపకున్నఁ గలదా మద్దాలి...

68


మ.

అజఘన్యత్వదుపాస్తి నా కొసఁగవే యాత్మేశభూవహ్నివా
యుజలాకాశగుణాన్వితంబయిన యీయుచ్ఛిష్టదేహంబు క
ర్మజమే నిత్యము భక్తినిత్యధనమే మద్దాలి...

69


మ.

నిజ మొప్పారఁగ నాదుకందొవకు నానెయ్యంబు పేరింటనొ
ప్పుజకోరంబునకు మదీయహృదయంభోరాశికిన్ జందమా
మజుమీ నీపదపద్మదర్శన మిఁకన్ మద్దాలి...

70


మ.

భజనీయాత్మక నావిశుద్ధి వివరింపం బుద్ధి సన్నాసిరీ
తిజుమీ నిన్ను నెఱుంగఁదోఁచునెడఁ గీర్తింతున్ సదా వేడుజా
ల్మజనుండన్ ద్వదనుజ్ఞ యెట్టులొ యిఁకన్ మద్దాలి...

71


మ.

వ్రజముల్ గూడుక గోపగోపికల నిర్వాచ్యైకభక్తిన్ బలా
నుజ నీసేవ లొనర్చు భాగ్యమున కెన్నో నోఁచిరో జన్మజ
న్మజఘన్యత్వము బాసి భాసిలుటకై మద్దాలి...

72


మ.

కుజరూపంబుల నేమి నోచెనొకొ నీకుం గానలోనున్నయా

భుజపత్రద్రువు లారసాలతరు లాపున్నాగముల్ వీచియు
మ్మజనం జల్లనిసేవ సేయుటనై మద్దాలి...

73


మ.

ప్రజలె ట్లట్లుగ నీవు గోపికలు బెంపన్ సొంపు గైకొంటకే
భజనల్ జేసినపుణ్యమో గృహవనీప్రాంచజ్జపాకుందహే
మజయాజాతిలవంగలుంగములకున్ మద్దాలి...

74


మ.

వ్రజడింభఛ్ఛటఁ గూడి నీ వడవిత్రోవం బోవుచో దర్భగు
ల్భజముల్ నీపదపద్మముల్ తమపయిం బర్వం బవిత్రస్వనా
మజగత్సార్థము లౌట కేసుకృతమో మద్దాలి...

75


మ.

గజనిమ్మల్ సురపొన్నలుం బనసలుం గన్నేరులున్ మున్నుగాఁ
గుజముల్ గాన; సవల్లవీకభవదంఘ్రల్ దోహదాచారధ
ర్మజసంభావనఁ గాంచనోచుట హహా మద్దాలి...

76


మ.

రజనీచారుఁడు సీతఁ గొందు జన తద్రక్షఃపతిన్ దాఁకి వీఁ
క జటాయుఃఖగ మీల్గె నీకొఱకుఁ దత్కాయంబు సంగ్రామక
ర్మజితంబౌటకు నెంతపుణ్యఫలమో మద్దాలి...

77


మ.

నిజవిత్తంబులు సార్థకంబులుగ నిన్ సేవించి యర్పించి యిం
పు జనింపన్ జరియించుపుణ్యులకుఁ దత్పుణ్యంబు నీ రెత్తుని

మ్మ జిగుళ్లొత్తి ఫలించునట్టులుగదా మద్దాలి...

78


మ.

వ్రజముఖ్యుం డొకఁ డేకతంబ తనకు వాలాయమై నెమ్మనం
బు జెలంగం బొలిగద్దనెక్కినదొరా బోసేతురమ్మన్న యా
మజతై రాభుజియింపవత్తువఁట శ్రీమద్దాలి...

79


మ.

భజనాభావమతిన్ మదాంధులయి సంపన్మోహబుద్ధిం గిజా
గిజ నెన్నాళ్లును దన్నుకున్నఁ గలదే క్షేమంబు సంసారశ
ర్మజనశ్రేణుల కూర్ధ్వసిద్ధివలనన్ మద్దాలి...

80


మ.

అజరాస్థానవిలాసినీరతిసుఖవ్యాపాదనవ్య క్తవి
శ్వజిదాదుల్ భవదంఘ్రిభక్తివలె మోక్షశ్రీదముల్ గావు నో
మజనున్ నీపదసేవ సువ్రతముగా మద్దాలి...

81


మ.

యజనంబుల్ పదివేలు చేసిన యనిత్యైంద్రాశ్రయం బింతెకా
ని జనిన్ మాన్పెడులోక మబ్బదు తదున్మేషంబు నిన్ గొల్వ బ్
మఁ జిగుర్కొన్నయనంతరంబునఁగదా మద్దాలి...

82


మ.

ద్విజుఁడైనం బ్లవుఁడైనఁగాని నిను గీర్తింపం బ్రపుణ్యాత్ముఁ డౌ
కుజనత్వంబున మత్తుఁడై సిరులు పెక్కుల్గల్గి కౌసుంభరో
మజముల్ గట్టినపుణ్యమూర్తి యగునే మద్దాలి...

83

మ.

ఖజకాదండ మెఱుంగునే మృదులశాకస్థాయి యైయుండి వే
ల్లజతిక్త్తాదిరుచుల్ కుపూయకున కేలా కల్గు సద్బుద్ధి సౌ
మ్యజనుశ్రేణులపొందు నంత మనినన్ మద్దాలి...

84


మ.

భుజియింపన్ నవనీతమై యమృతమై పూదేనెయై నారికే
రజలంబై గుడమై రుచించు మృదుసారంబైన నీరామనా
మజపం బెంతటియోగ్యభోగ్యఫలమో మద్దాలి...

85


మ.

ఋజుబుద్ధిన్ నిను సంస్మరింపఁగలుగున్ శ్రీశైలకాశీనివా
స జగన్నాథ గయాప్రయాగసువిశేషంబుల్ మహాదానధ
ర్మజపాధ్వర్యతపోవ్రతైకఫలముల్ మద్దాలి...

86


మ.

త్రిజగద్భర్త యథేష్టసేవ్యుఁడు మనోధిష్ఠుం డగణ్యార్థదా
యి జితక్రోధుఁడు నీవలెం గలుగునే యింకొక్కనాథుండు క
ర్మజకాలుష్యము బాయ నిన్నె గొలుతున్ మద్దాలి...

87


మ.

అజునిం బొక్కిట గన్నవేలుపవు నీయం దాపదుద్ధారకా
ఖ్య జగద్గేయముగాఁ బ్రసిద్ధమగు నీకన్నం గృపాశాలి బ్రే
మ జెలంగం భరియించు టెట్లగును శ్రీమద్దాలి...

88


మ.

అజహద్దంభవిజృంభమాణవిపులాజాండంబుదీపైకరూ

పజతేజంబున వెల్లఁజేసెడు భవద్భావంబు వర్ణింప బఁ
ద్మజుఁడైనన్ భవుఁడైన నోపఁగలఁడా మద్దాలి...

89


మ.

భజనీయైకనిగాఢహుంకృతులు సంభావించి వందారువా
గ్మిజనశ్రేణికి విద్యలిత్తువు హయగ్రీవాకృతిన్ నీవు సా
మజచర్మాంబరపూజితాంఘ్రియుగళా మద్దాలి...

90


మ.

విజయున్ భీముని వెంటదోడ్కొని రణోర్విన్ భీముచేతన్ గిరి
వ్రజనాథుం బొలియించి చేసితివి నిర్వ్యాజార్థసంసిద్ధి ధ
ర్మజునింగూర్చిటు యుక్ష్యమాణునిగ శ్రీమద్దాలి...

91


మ.

అజరద్భావసుఖోదయాప్తి తనసొమ్మై నప్పుడే నిన్ను పం
చజనుం డెంచవలెన్ దదారభటి హ్రస్వంబైన యుద్దామభీ
మజరాభారము తోఁచనీయదు సుమీ మద్దాలి...

92


మ.

త్రిజగంబుల్ భరియించి ప్రోతు వెపుడున్ దేవావళుల్ మెచ్చ నం
డజనుఃకూర్మవరాహసింహవటుగాట్సంతానజిద్రామరా
మజినశ్రీకలికిస్వరూపములచే మద్దాలి...

93


మ.

త్యజియింతున్ జనినీకృపారసముచేతన్ భీతతం బాసి దీ
నజనాధారక నిన్ భజించునెడలన్ నాబుద్ధికిన్ యాతయా

మజమందత్వము నొందనియ్యకుము శ్రీమద్దాలి...

94


మ.

ధ్వజినీసంగ్రహ మెంత యున్న బహువిత్తం బున్న దివ్యాశుగ
వ్రజమున్నన్ దనవెంట రాదు యము నోర్వన్ రాదు నీదివ్యనా
మజపం బిచ్చినదాన సర్వసుఖమే మద్దాలి...

95


మ.

భుజగాధీశశయాన యానవిజితాంభోజాత శ్రీమద్దదా
గ్రజ మన్నామకతర్ణకంబలర నీకారుణ్యపుంబాల గు
మ్మజడిం దేల్పవె కామధేనువువలెన్ మద్దాలి...

96


మ.

ఇజుగుంగూర్చి శరీరయాత్రకయి భూభృత్తీరముల్ జేరి చా
ల జుగుప్సంబడి యుష్మదీయచరణాలాసంబునం జిత్తసా
మజ మిన్నాళ్లకు నేఁడు కట్టుబడె శ్రీమద్దాలి...

97


మ.

ప్రజనశ్రీ వహియించె మత్సుకృతసంపత్కామధేనూత్తమం
బు జనింపంబడు నీకృపార్భకము తనూలైకనిర్వాణధా
మజసౌఖ్యామృతసిద్ధి నాకుఁ గొదువా మద్దాలి...

98


మ.

రజముంబోలె విధూతమై యఘము బాఱన్ సన్మనుండై జనుం
డు జరాత్వం బరుదెంచి జీర్ణమతి తోడ్తోరాక మున్నే ప్రణా

మజపస్తోత్రములం భజింపవలె నిన్ మద్దాలి...

99


మ.

వజరాల్ దీరిచి పేరుగూర్చుగతి కైవారంపుపద్యంబు ల
క్కజమొప్ప సృజియింపనయ్యె నివిగోఁ గైకొమ్ము కారుణ్యధా
మ జొహారుల్ పచరించు వేలకొలఁదుల్ మద్దాలి...

100


మ.

స్రజమై యొప్ప వరింపు మత్కవిత యోసర్వేశ యోదైవత
ల్లజ సంభావన సేతు నీపదము లీలాభక్తిపేరింటికమ్మ
జవాదిం దులకించుపాద్యవిధిచే మద్దాలి...

101


మ.

ద్విజరాడ్వాహన నేను దిట్టకవిసూతిన్ గశ్యపర్షీంద్రగో
త్రజుఁడన్ నామము రామచంద్రుఁడు భవద్దాసుండ నాయందుఁ బ్రే
మ జిగుర్పన్ శతకంబు గైకొనుము శ్రీమద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

102


ఉద్దండరాయశతకము సంపూర్ణము.