దిట్టకవి రామచంద్రకవికృత
గొట్టుముక్కల రాజగోపాలశతకము
శా. |
శ్రీభద్రస్థితు లాశ్రితావళుల కక్షీణానుకంపన్ సదా
లాభప్రాప్తులుగా నొనర్చు నజులీలామోహనాకారమా
యాభీరున్ నినుగూర్చి మ్రొక్కుదు ననల్పాకల్పతల్పాయిత
క్ష్మాభృత్పన్నగ గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా.
| 1
|
శా. |
హేలాసమ్మిళితత్రిమూర్తిరుచియౌ హేరంబుఁ బ్రార్థించుచున్
గాళీదాసమయూరమాఘముఖులం గైవారముల్ చేసి నిన్
వాలాయంబుగఁ బూజసేతుఁ గవనవ్యాపారవిస్తారవా
గ్జాలాబ్జంబుల గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా.
| 2
|
శా. |
చక్రీ చక్రిశయాన; యాననజితాంచత్పూర్ణతారాపతీ
నక్రగ్రస్తగజేంద్రరక్షణమతీ! నానాప్రపంచాకృతీ
|
|
|
శక్రాశ్మద్యుతిసాగరైకవసతీ సన్మౌనిహృత్పుండరీ
కక్రీడాగతి గొట్టు...
| 3
|
శా. |
అకలంకాశ్రితసౌఖ్యదాయక సమస్తాజాండభాండాధినా
యక! యంభోజదళాయతాంబక! విమూఢావేద్యమాయావిడం
బక! సాధువ్రజతాపకృత్ప్రబలదృప్యద్దైత్యకాండైకత
క్షక సద్రక్షక గొట్టు...
| 4
|
మ. |
వరనాభీజనితాదిశిల్పక! ప్రభావప్రాభవానల్పకా!
తరితానంతమనోవికల్పక! యశోదానందకృత్కల్పకా
స్థిరసంకల్పక! వేదజల్పక! మహాశేషాహిరాట్తల్పకా
కరుణాకల్పక గొట్టు...
| 5
|
మ. |
పరమాభీరక! భవ్యభారక! మహాబ్రహ్మాండభాండస్థలో
దరనిస్తారక! విశ్వకారక! యశోదాదారకా! వేదభూ
ధరసంచారక! సద్విచారక! సముద్యద్భక్తమందారకా
కరుణాధారక గొట్టు...
| 6
|
మ. |
అజరుద్రాదులు ని న్నెఱుంగుటకు నింతైనన్ సమర్థింపలే
రు జగత్పూర్ణుఁడ వన్నిరూపములు నీరూపంబులైయుండు నిన్
భజనం బ్రీణితు సేయ నావశమె నాభాగ్యంబు నీ చిత్త మో
గజరాడ్రక్షక గొట్టు...
| 7
|
మ. |
అసమప్రౌఢి సితాసితద్యుతుల నెయ్యంబారగా రామకృ
|
|
|
ష్ణసమాఖ్యాయుతులై జనించి యదువంశస్వాములౌ మిమ్ముఁ బ
ద్యసమృద్ధిగా భజియింతు దంభహరిరూపారంభ సంపుష్టరా
క్షసనాథార్భక గొట్టు...
| 8
|
మ. |
సురలానందము నొంద నందునకుఁ జక్షుఃప్రీతిగా; గోపమం
దిరసీమన్ పసికందువై వెలయు మీదివ్యామృతాకారవి
స్ఫురణన్ గన్గొన నేమి నోఁచిరొ మహాశూద్రీమణుల్ చింతలే
క రమానాయక గొట్టు...
| 9
|
శా. |
సారోద్ధారపునూనె లంటి, పునుగుం జవ్వాది మైనూన్చి ప
న్నీ రాపై జలకం బొనర్చి కృప నెంతో గోపికల్ మిమ్ముఁ గ
న్నారం గాంచుట కెంతభాగ్యమొకొ నందాభీరమాయాసరా
కారభ్రామిక గొట్టు...
| 10
|
మ. |
అమరన్ మి మ్మొకపుత్త్రమాత్రులని నెయ్యంబార నూహించి చి
త్రముగాఁ బుత్రమహోత్సవంబులు యశోదానందు లానందభా
వముతోఁ జేయుట జన్మజన్మకృతసేవానిష్ఠులౌటంగదా
కమలాకాముక గొట్టు...
| 11
|
మ. |
జగదీశానులు రామకృష్ణులు చికీర్షాభవ్యులంచుం బ్రియం
బుగ వాక్రుచ్చుచు మీకు నామకరణంబుల్ సేయు తన్నందభా
|
|
|
గ్యగురుత్వంబు భజింపశక్యమె కరాగ్రాంచద్ధనుశ్శంఖచ
క్రగదానందక గొట్టు...
| 12
|
శా. |
సారప్రౌఢిమ పూతనాస్తనగుళుచ్ఛంబుల్ వడిం బీల్చి; త
ద్ఘోరాకారము రూపుమాపినసమగ్రున్ నిన్ను సేవింతు; వి
స్ఫారత్తారకనామవర్ణఫలకభ్రాజిష్ణు జిహ్వాగ్రవ
ద్గౌరీత్ర్యంబక గొట్టు...
| 13
|
శా. |
హంసల్ జోడుగఁ గూడియాడుగతి నందాగారసీమన్ వ్రజో
త్తంసుల్ మెచ్చఁగ వాసుదేవయుగళత్వవ్యక్తిఁ జిట్టాడుమీ
సంసద్బాల్యవిలాసముల్ గనుట కుత్సాహించెదన్ జూపవే
కంసధ్వంసక గొట్టు...
| 14
|
మ. |
నిరతిన్ మించిన కాకపక్షములతో నిండారు వేనవ్వుతో
వరజాంబూనదచంద్రహారములతో వర్ధిష్ణులై నందగో
పురవీథిం జెఱలాడుమీచిఱుతరూపుల్ చూపరావే; సుదా
కరుణావార్షిక గొట్టు...
| 15
|
మ. |
అలర సువ్రత మెంత జేసిరొ వసంతారామసీమన్ జిగు
ళ్లలలిన్ మేసెడు బాలకోకిలలయట్లుంబల్కు మీతొక్కుబ
ల్కులు చెన్నారఁగ వీనులన్ వినుటకుం గోపాంగనారత్నముల్
ఖలదుర్ధర్షక గొట్టు...
| 16
|
శా. |
భావంబందు మిమున్ స్వవర్ణికులుగాఁ బాటించి గోపాంగనల్
ఠీవిన్ బొత్తుల నారగించుచు సమష్టిన్ సేవగావించుత
త్కైవల్యంబు నుతింపశక్యమె సుహృత్సంరక్షణారంభ దీ
క్షావిస్తారక గొట్టు...
| 17
|
శా. |
భాగైమించిన పాలువెన్నపెరుగుల్ పైమీఁగడల్ గోపక
న్యాగారంబులు సొచ్చి మెక్కుచును శౌర్యప్రౌఢిఁ గ్రీడించు మీ
నైగారంబు నుతింప నాకు వశమౌనా దూయమానాభ్రగ
ర్వాగుర్వంఘ్రిక గొట్టు...
| 18
|
శా. |
ఏమీ యీనవనీతచౌర్యమని త ల్లెంతే విమర్శింప న
మ్మా! మన్నింపుమటంచు చూపవె విముక్తాస్యుండవై లోజగత్
స్తోమం బెల్లఁ దనూఘనాఘనతటిద్రూపీ భవత్కాంచన
క్షౌమోద్దామక గొట్టు...
| 19
|
శా. |
చాలన్ నీపయి చోరవార్త విని యిచ్చన్ నీపదాంభోజముల్
ఱోలంగట్టెను దల్లి యండ్రు తలిదండ్రుల్ నీకునుం గల్గియుం
డ్రా? లీలామయ చిత్స్వరూపివట క్రీడానాట్యరంగస్థల
త్కాళీయాహిక గొట్టు...
| 20
|
శా. |
ప్రీతిన్ మద్దు లులూఖలానియతి నుర్విం గూల్చి తద్యక్షసం
|
|
|
జాతద్వంద్వవిముక్తిఁ జేసితివి నీసామర్థ్య మార్తావన
ఖ్యాతిస్ఫీతము చక్రభానుపరిధూతామర్త్యవిద్వేషిసం
ఘాతధ్వాంతక గొట్టు...
| 21
|
మ. |
గరిమం గోవులు గోపబాలకులు చొక్కంబౌ బలంబౌ సిరుల్
బురణింపన్ వనికేఁగుచో దొరతనంబున్ దప్పదాయెన్ నిజం
బరయన్ గొల్లఁడవైననాఁడును హిరణ్యాక్షుక్షయార్థైకసూ
కరతాభూమిక గొట్టుముక్కల...
| 22
|
శా. |
ధీరప్రౌఢి భజింతు నాయెదుట నెంతేమాధురీసాధురీ
తీరావంబగు పిల్లగ్రోలు ముకుముత్తెంబౌ దలం బింఛ మిం
పారన్ గన్పడవయ్య సాధుజనతాపాగ్నిచ్ఛటాటోపకృ
త్కారుణ్యోదక గొట్టు...
| 23
|
మ. |
మురళీనాదవినోదమాధురికి సమ్మూర్ఛావిధిం జొక్కుచున్
గరమొప్పారెడు ధేనుకోటియెడ నీకారుణ్యపూరం బభం
గురతన్ మించునితాంతకుంతలమిళద్గోపాదధూళీసము
త్కరపిష్టాతక గొట్టు...
| 24
|
శా. |
కుంజాగారములందు గోపవనితల్ గోపాలకుల్ విూరలున్
బుంజంబై వసియించి చల్దికబళంబుల్ ప్రేమ నన్యోన్యహ
|
|
|
స్తాంజల్యంతరభుక్తి గైకొనుట లయ్యా వేడ్క కౌనౌ శర
త్కంజాతాంబక గొట్టు...
| 25
|
మ. |
పవితుల్యంబగు పాదసంహతి తృణావర్తున్ బకున్ వత్సదా
నవునిన్ ఘోటకధేనుకాదిఖలులన్ మర్దించి నందాదివ
ల్లవులం బ్రీతుల సేయు నీగుణకథల్ వర్ణింతు హైరణ్యరాం
కవదివ్యాంశుక గొట్టు...
| 26
|
మ. |
అమరన్ లేఁగల బ్రహ్మ వంచనము సేయన్ వాని నన్నింటి నం
దముగాఁ గల్పనసేసి నీవు నలువన్ వంచించి తం డ్రాదిదై
వము నీవేకద యీశ్వరీత్రితయిలో వక్షస్స్థలాలానభా
క్కమలాధేనుక గొట్టు...
| 27
|
మ. |
తిరమై గోగణ మొక్కనాఁడు వనవీథిన్ మేఁత లాడంగ భీ
కరదావాగ్నులు జుట్టుకున్న సుధ వేడ్కం గ్రోలుచందాన బం
ధురదావాగ్నులు గ్రోలి గోవులను తద్గోపాలురన్ బ్రోచితౌ
గరుడారోహక గొట్టు...
| 28
|
శా. |
నాకౌకస్సమమైన విప్రతతి నానాయాగముల్ సేయ నీ
వాకొన్నట్లుగఁ జేసి తత్సతులు మృష్టాన్నం బొసంగన్ శుభో
|
|
|
త్సేకం బెల్ల నొసంగినాఁడవఁట నీచిత్తం బమూల్యంబు లో
కైకత్రాణక గొట్టు...
| 29
|
మ. |
మమతం గోపకు లింద్రయాగ మొనరింపన్ వారి వారించి శై
లమవై పూజలుగాంచి గోగణము నెల్లన్ బ్రోవవా! ఱాలవ
ర్షము రాకుండ నగేంద్ర మెత్తి సురలార్వన్ భక్తసంరక్షణ
క్రమసంచారక గొట్టు...
| 30
|
మ. |
క్రమ మొప్పారఁగ గోపకన్యకలు వస్త్రంబుల్ విసర్జించి య
య్యమునన్ నీరములాడ ముచ్చిలి తదీయక్షామముల్ గొంచు భూ
జముపైఁ బ్రాఁకితివండ్రు గోగణపరీక్షాప్రక్రియాజాగరూ
కమహావాంశిక గొట్టు...
| 31
|
మ. |
నిబిడాపీతమరందుతుందిలమిళిందీగీతరీతిన్ నెరా
సొబఁగౌ నీమురళీరవామృతము లెచ్చో విన్నగోపీస్తన
స్తబకంబుల్ పులకింపుచుండు శిఖపింఛాలాంఛితాళిప్రభా
కబరీభారక గొట్టు...
| 32
|
శా. |
ఎంచన్ శక్యమె నీవిమర్శ పసి నెందే మేఁత లాశించుచోఁ
బంచాస్యంబులకైనఁగాని తలఁ జూపన్ రామి గావింతువౌ
ప్రాంచద్గోనిచయాభివర్తనగతిప్రౌఢిన్ స్వనద్ఘంటికా
కాంచీదామక గొట్టు...
| 33
|
శా. |
ఉత్కంఠన్ వ్రజసుందరుల్ మనములోనూహించ వాంఛల్ సదా
సత్కారించుచుఁ దృప్తి సేతువట యెంచన్ శక్యమే! నీసము
ద్యత్కారుణ్యము బాణదైత్యబహుబాహాఖండనోద్దండరం
గత్కాండీవక గొట్టు...
| 34
|
మ. |
వలపుల్ నిల్పగలేము నీవు గృప మద్వర్యుండవౌమంచు లీ
లలు గల్పించెడిగోపకామినుల నెల్లం గౌఁగిటం జేర్చి యి
చ్చలు బూరింతువు క్రీడసల్పి; రతికాంక్షాలోల గోపాంగనా
కలితస్నేహక గొట్టు...
| 35
|
మ. |
అమరుల్ తాపసు లాగమాంతనిబిడేహన్ గానలేనట్టినిన్
రమణుల్ గాంచుట కెట్లు నోఁచిరొ మహారణ్యంబు శోధించి సం
భ్రమ మొప్పన్ వినుతిక్రియాముఖరరుద్రాదిత్యగంధర్వయ
క్షమహారాజిక గొట్టు...
| 36
|
శా. |
శ్రీ రంజిల్లఁగ నీవు నీపిఱుఁద నారీరత్న మారీతి వి
స్తారన్నీలసువర్ణమాల్యవిధి రాసక్రీడ లాడించు మీ
తారుణ్యంబు మదిన్ భజింతు వ్రజకాంతానేత్ర నీలోత్పల
గ్లౌరూపాత్మక గొట్టు...
| 37
|
శా. |
ఆవిర్భూతధృతిన్ సుదర్శనసమాఖ్యాహీంద్ర మేతెంచి నం
దావాసంబునఁ జొచ్చి నందుని మహౌద్ధత్యంబుచే మ్రింగ నెం
|
|
|
తోవేగంబున దాని జంపి కృప నందుం బ్రోవవా మందర
గ్రావోద్ధారక గొట్టు...
| 38
|
మ. |
అమరం గంసనియుక్తఘోటకముఖేంద్రారాతిజాతిన్ సువి
క్రమ మొప్పార వధించి పుచ్చు టిది నీకర్తవ్యభారంపుఁజం
దమెకా! దుర్జనఖండనార్ధపరిలుంఠత్పూతనాపూర్వరం
గమహానాటక గొట్టు...
| 39
|
మ. |
తనకున్ మోక్షసుఖంబు నిచ్చుటకు నుద్దామస్థితిన్ దోడితె
మ్మని పంపించినమాడ్కి నీకడకు నొయ్యన్ గ్రూరుఁడైయుండి స
జ్జను నక్రూరుని బంపె కంసుఁడు సదాసంచారయోగ్యత్రయీ
ఘనశృంగాటక గొట్టు...
| 40
|
మ. |
ధ్రువభక్తిన్ నిను దోడుకొంచుఁజని యక్రూరుండు కాళిందియం
దవగాహం బొనరించి తజ్జలమునం దమ్మేటిమీలీల లు
త్సవ మొప్పారఁగఁ గాంచె ఫాలఫలకాబ్జాతభ్రమచ్చంచరీ
కవినీలాలక గొట్టు...
| 41
|
శా. |
దభ్రాపేతగుణైకతత్త్వమగు నుద్యద్దివ్యతేజంబె యీ
విభ్రాజిష్ణులు రామకృష్ణులన వైవిధ్యంబునన్ బోల్చుమీ
సౌభ్రాత్రంబు భజింతు నెమ్మది సుధాసంధానసంతృప్తలే
ఖభ్రూసంసక గొట్టు...
| 42
|
మ. |
తమకం బొప్ప తిరస్కరించురజకుం దండించి; మేలైనవ
స్త్రములెల్ల ధరియించినావు మధురాద్వారంబునన్ నీవెకా
సముఁడౌ సాంబనిమిత్తహస్తినగరీసర్వంసహోత్పాటనో
గ్రమహాహాలిక గొట్టు...
| 43
|
మ. |
జిగిరంజిల్లు సువర్ణభూషణము లిచ్చెన్ బాయకుం డింపుసొం
పుగఁ బూదండ లొసంగె నర్మిలి సుదాముం డుజ్జ్వలద్గంధచ
ర్చఁ గడుంగూరిచెఁ గుబ్జ మీకుఁ బరమార్థజ్ఞానసంపత్తిచే
ఖగరాడ్ఘోటక గొట్టు...
| 44
|
మ. |
నరసింహాకృతి దానవద్విపకళానాశంబు గావించు నీ
బిరుదస్ఫూర్తికి లక్ష్య మాకువలయాపీడాదులే? ముష్టికా
సురచాణూరకఠోరదుర్భరశిరస్స్థూణాశ్మనిర్ఘాతభీ
కరసంగ్రాహక గొట్టు...
| 45
|
శా. |
దృగ్లోభత్వ మొనర్చె నీమృదులమూర్తిస్ఫూసంపత్తి ని
త్యగ్గానిన్ హరియించె నీగుణకథాతత్త్వంబు; నీమాధురీ
వాగ్లీలల్ వినసొంపులయ్యె మధురావాసప్రజాశ్రేణికిన్
కగ్లాదంబక గొట్టు...
| 46
|
మ. |
అనుమానింపక మేనమామయని మోహంబింతయున్ లేక తా
మునుమున్ ముష్టికముఖ్యమల్లపతనంబుల్ విన్నవాఁడౌట యీ
|
|
|
సున గర్జిల్లెడి సాధుసజ్జనజిఘాంసుం గంసు నిర్జింపవా
కనకక్షామక గొట్టు...
| 47
|
శా. |
తాళంబుల్ ధరియించి నారదుఁడు గీతంబుల్ పఠించెన్ శతో
ద్వేలప్రౌఢిమ నాడి రచ్చర లుద్యోవీథిన్ బ్రవర్షంబులై
రాలెం బువ్వులు కంసహింసనసుఖస్రంబందురాధామృగా
క్షాలీలాదిక గొట్టు...
| 48
|
శా. |
కారాగారమునందు నున్న జనవర్గంబుం గటాక్షించి వి
స్ఫారత్ప్రౌఢిమ నుగ్రసేనునకు రాజ్యప్రాప్తి గావించి దో
స్సార శ్రీమధుర న్వసించితివి చంచచ్చంద్రికాకారశృం
గారస్మేరక, గొట్టు...
| 49
|
మ. |
అమరుల్ మౌనివరుల్ సమస్తనృపతుల్ హర్షింప సంభారక
త్వముచే యాదవసింహులై మధురలో వర్ధిష్టులై నిత్యసం
భ్రమముల్ గాంచుమిమున్ భజింతు మదిలో బ్రహ్మదిగీర్వాణలో
కమహాపూర్విక గొట్టు...
| 50
|
మ. |
పరమామోదధురీణబుద్ధి వసుదేవప్రార్థనం జేసి స
ద్గురుఁడౌ గర్గమహామునీశ్వరుఁడు కోర్కుల్ నిండి దైవార సు
స్థిరతన్ మిమ్ము పవిత్రవంతులుగఁ జేసెజ్ దానసద్యశ్శుభం
కర విజ్ఞానిక గొట్టు...
| 51
|
మ. |
ప్రవణన్ సర్వజగద్గురుత్వకలనన్ బాటిల్లు మీకున్ మహో
|
|
|
త్సవ మొప్పారఁగ విద్యలెల్ల గరపెన్ సాందీపుఁ డాచార్యధ
ర్మవిశేషంబున నెంతవింత గిరిశబ్రహ్మాదిదైవప్రతీ
క్ష్యవిరాడ్రూపక గొట్టు...
| 52
|
మ. |
అణుమాత్రంబున దక్షిణార్థమని నిన్ బ్రార్థింపఁ దత్సూను మా
రణమైపోయినవానిఁ దెచ్చి గురు నారాధించునీకార్యనై
పుణి వర్ణింపఁగ నీప్రసిద్ధికి నెఱాపొందౌర వందారుర
క్షణతాత్పర్యక గొట్టు...
| 53
|
శా. |
భావంబందు విరోధవహ్ని దహియింపన్ వచ్చి పల్మాఱు రో
షావేశంబునఁ దారసించిన జరాసంధున్ బరాభూతనా
నావైదగ్ధ్యుని జేసినావు వ్రజకాంతానిత్యకారుణ్యలే
ఖావాత్సల్యక గొట్టు...
| 54
|
మ. |
గుణహీనుండయి తారసించుయవనుం గొంపోయి యున్మీలితే
క్షణుఁడౌ నమ్ముచికుందుచేత నతనిం జంపించి తద్భూవర
ప్రణతుల్ గైకొని ప్రీతినొందిన నినున్ బ్రార్థింతు సన్మౌనిర
క్షణదాక్షిణ్యక గొట్టు...
| 55
|
శా. |
నీపాండిత్యము లెక్కసేయ తరమే నిర్మించినావౌ మహా
కూపారంబున ద్వారకాపురము కోర్కుల్మీఱఁ దత్సంస్మృతిం
|
|
|
బాపౌఘంబు తొలంగుటెంత సకలబ్రహ్మాండనిర్మాణదీ
క్షాపౌరస్త్యక గొట్టు...
| 56
|
మ. |
సరసీజాసనునాజ్ఞ నాత్మతనయున్ సౌదామినీవిగ్రహున్
వరకన్యామణి నిచ్చె రైవతుఁ డనర్వాచీనజన్ రేవతిన్
నిరతిన్ శీరికి నిత్యనామభజనానిత్యోపకారప్రియం
కరవైమానిక గొట్టు...
| 57
|
మ. |
కృపణున్ జైద్యుని దోలి తద్విహితు రుక్మిం జాల భంగించి శౌ
ర్యపటుత్వంబునఁ దెచ్చి రాక్షసవివాహస్ఫూర్తిచే రుక్మిణిన్
విపులప్రేమ వరించినాఁడవు శుభాప్తిన్ గోపికాచిత్తనై
కపరాస్కంధిక గొట్టు...
| 58
|
మ. |
అరయన్ శ్రీసతులౌట రుక్మిణియు సత్యాజాంబవత్యర్కజా
తరుణుల్ లక్ష్మణయున్ సుదంతయు సుభద్రామిత్రవిందల్ శుభ
స్థిరతన్ నీసతు లైరి ఘోషనిలయక్షీరాజ్యధారాదిత
స్కరతాధూర్తక గొట్టు...
| 59
|
మ. |
త్రిజగద్బాధకు నుగ్రదైత్యు నరకుం దీవ్రాజిరంగంబులో
ధ్వజినీయుక్తము గాఁగఁ ద్రుళ్లడఁచి తద్బంధీకృతానేకభూ
భుజకన్యామణులన్ వరించితివి సంపూర్ణానురక్తిన్ గదా
గ్రజ దైత్యాంతక గొట్టు...
| 60
|
మ. |
పదియార్వేవురుగోపకన్యకలునున్ భార్యాష్టకంబున్ శుభా
భ్యుదయం బొప్పగఁ బుత్రపౌత్రనిచయంబున్ గల్గు త త్తత్ప్రియ
ప్రదసంసారివి నిత్యభక్తినిరతవ్యాసాంబరీషాదిభ
క్తదయాకారక గొట్టు...
| 61
|
మ. |
అనయంబున్ నిను పారిజాతకుసుమం బర్థింప మేలంచుఁ జ
య్యన నింద్రాదుల గెల్చి తెచ్చితివి సత్యావాంఛితార్థంబు నం
దనమందారము వల్లవీనిచయచేతఃపంజరాంతర్మిళ
ద్ఘనకేశీశుక గొట్టు...
| 62
|
మ. |
ప్రసభప్రౌఢి ప్రసేను జంపెనని సత్రాజిత్తు నీయందు నిం
ద సమర్థించినఁ దచ్ఛమంతకనిమిత్తం బేగి యుగ్రాజిలో
వెస భల్లూకపతిం జయించి మణి నీవే యిచ్చితౌ భక్తము
ఖ్యసమాసాధ్యక గొట్టు...
| 63
|
మ. |
సముదంచద్గతి నీవు పాండుసుతపక్షంబైన కారుణ్యసం
భ్రమ మేపారఁగ హస్తినాపురముఁ జేరంబోవు నెయ్యంపుఁజం
దమువర్ణింపఁ దరంబె! సామజపరిత్రాణార్థచక్రప్రశి
క్షమహావక్రక గొట్టి...
| 64
|
మ. |
ఖచరాధీశ్వరుఁ దోలి ఖాండవవనగ్రాసంబు గాండీవిచే
శుచికిన్ దచ్ఛుచిచేత గాండివధనుస్తూణీరముల్ క్రీడికిన్
|
|
|
బ్రచురంబొప్ప నొసంగఁజేసిన నినున్ బ్రార్థింతు సంభోరుహా
క్షచిదానందక గొట్టు...
| 65
|
మ. |
అనిలో బాణుని శోణిపట్టణమునం దబ్జాక్షుఁ డీశుం జ
యించెనటం డ్రాతఁడె నీవు నీవె యతఁ డక్షీణైకసువ్యక్తు లొ
య్యన మీలోపల హెచ్చుతగ్గులనికద్దా! సాధుసత్కార్యద
క్ష నృహర్యక్షక గొట్టు...
| 66
|
మ. |
త్రిజగత్కంటకు బాణదైత్యు ననిలోఁ దీవ్రంబుగాఁ దాఁకి త
ద్భుజముల్ ద్రెంచి యుషాసమేతు ననిరుద్ధుం దెచ్చి యెప్పారునిన్
భజియింతున్ బదపద్మసంజనితశుంభద్వాహినీదిగ్ధభ
ర్గజటావాటిక గొట్టు...
| 67
|
మ. |
సరటాకారము మౌనిశాపకలనన్ సంప్రాప్తమైనం బరం
పరిశోషిల్లుచు నిన్ భజింప నృగునిం బాలింపవా! కూపగ
హ్వరముం బాపి కృతార్థు జేసి భళిరే! యార్తార్తపీడానిరా
కరణవ్యాపక గొట్టు...
| 68
|
మ. |
ఎవరైనన్ మిము నిందజేసిన జయం బెట్లొందుఁ దా! రాజనం
చు వెసన్ మిమ్ము హసించి రుక్మియు మిమున్ సోల్లుంఠనం బాడి య
ద్వివిదుండున్ నశియింపరే హలధరోద్వృత్తిన్ సురారాతి శు
ష్కవనీపావక గొట్టు...
| 69
|
మ. |
యమునం దా వసియించుబోటి కీల వ్రయ్యల్ చేసి రప్పింపఁడే
రమణన్ రాముఁడు లాంగలాగ్రమున మీరాజత్ప్రభావంబు ల
య్యమరశ్రేణులకైన నెన్న వశమౌనా! సంగరాభంగశా
ర్ఙ్గమహాకార్ముక గొట్టు...
| 70
|
మ. |
నిమిషార్ధంబున సూతు నైమిశమునన్ నిర్జించినన్ శౌనకా
దిమునుల్ వేగ హలాయుధుం డతని నెంతేజీవితుం జేసె లో
కము లెన్నన్ నిబిడానురాగమున రంగద్రుక్మిణీదత్తహృ
త్కమలారాత్రిక గొట్టు...
| 71
|
మ. |
కురురాజన్యుఁడు భీతినొంద హల మక్షుద్రంబుగన్ సాచి త
త్పురియొడ్డేర్పడ గడ్డయెత్తె బలభద్రుం డండ్రు; మీశౌర్యవై
ఖరి మీకే తగుగాక యొడ్లకగునా కౌంతేయ సద్భోగభా
గ్యరమాస్థాపక గొట్టు...
| 72
|
మ. |
అరిభావంబుననైనఁగాని నిను నిత్యం బాత్మఁ జింతించినన్
బరమానందపదంబు సంభవిలు కార్పణ్యంబుచేఁ బౌండ్రకుం
డరియై నిన్నె భజించి ముక్తిఁగనె దేహాంతంబునన్ గాలపు
ష్కరముగ్మేచక గొట్టు...
| 73
|
మ. |
గరిమన్ నిన్ను బరీక్ష సేయ భవదాగారంబులన్ జేరి ని
|
|
|
ర్జరమౌనీంద్రుఁడు మోసపోయెను భవద్రాఘిష్ఠమాయాసము
త్కరపాథోనిధియందుఁ గూలి దరిజెందన్ లేక సాధుప్రియం
కరసంకల్పక గొట్టు...
| 74
|
శా. |
రంగద్ధర్మజరాజసూయమఖసంరక్షాప్తికై భీముచే
తం గర్వాంధు జరాసుతుం గెడపి తద్రవ్యంబు సాధించి ప్రీ
తిం గౌంతేయుల దన్పినాఁడవు భళీ దివ్యాంగవల్లీమిళ
ద్గాంగేయాంశుక గొట్టు...
| 75
|
మ. |
పటిమన్ ధర్మజుచేతఁ బూజఁగొనునిన్ భర్జించి చైద్యుండు దు
ర్ఘటముల్ బల్కిన తచ్ఛిరంబు సభవారల్ మెచ్చ చక్రాహతిన్
ఘటికామాత్రములోన ద్రుంచితివి నక్రగ్రస్తఖిన్నేభసం
కటనిర్మోచక గొట్టు...
| 76
|
మ. |
అమృతాంధఃపథగామి సౌంభకపురస్థాభీలసాల్వాదులన్
సమదాటోపుల ద్రుంపవే సుజనతాసంరక్షణార్థంబు చ
క్రము సారించి సురావనార్థబహుధాకర్తవ్యదైతేయసం
ఘమృగాభేటక గొట్టు...
| 77
|
మ. |
చెలువొప్పారఁగ నీకుఁ జేరెఁ డటుకుల్ చిక్రోడభక్తిక్రియా
కలనన్ దెచ్చి కుచేలుఁ డర్పణ మొసంగన్ వాని కీ నేర్చితౌ
|
|
|
పొలుపొందన్ గృపచే సమస్తవిభవంబుల్ దేవకీగర్భశం
ఖలసన్మౌక్తిక గొట్టు...
| 78
|
మ. |
స్ఫుటసద్భక్తియుతాత్ముఁ డైనబహుళాశ్వున్ నిత్యసత్యవ్రతో
ద్భటు రాజర్షిని గాంచి పూజగొని తద్భావఁబునన్ నీవు ప
ర్యటనంబందితివౌర సన్మునిమనీషారామ విస్ఫూర్తిసం
ఘటనాచైత్రిక గొట్టు...
| 79
|
మ. |
అకలంకస్థితి తల్లి వేఁడిన వరం బాలించి పాతాళలో
కకృతావాసుల తన్మృతార్భకుల వేడ్కన్ దెచ్చు సద్యఃకృపా
ర్థికులన్ మిమ్ము భజింతు పార్థశుభకృద్గీతారహస్యప్రసం
గకళాబోధక గొట్టు...
| 80
|
మ. |
కుహనామౌనిత వచ్చి యాదవులగైకోకన్ సుభద్రన్ మహా
మహుఁడై చేకొనిపోవునర్జునుని సన్మానించు నీ సౌహృదం
బహహా! యెన్నఁదరంబె హంసడిభకాన్యోన్యఘ్నతాహేతువి
గ్రహసృణ్మాయిక గొట్టు...
| 81
|
మ. |
అబలాగర్భము గావబూని గాయన్ లేమికిన్ రోసి బా
డబు డెగ్గాడిన మాన్పి తత్సుతులజాడల్ జూపి సత్కీర్తినొం
దబడెన్ పార్థుఁడు నీసహాయపటిమన్ దైత్యఘ్నతోదృష్టవి
క్లబబృందారక గొట్టు...
| 82
|
మ. |
కపివంశాగ్రణి యైనవాయుజునితో గర్వించి గాండీవి మో
సపడన్ గ్రీడికి బాగొసంగ హనుమన్ సాధించి పార్థధ్వజా
ధిపుఁ గావించితి వక్షయచ్ఛదసమృద్ధి ద్రౌపదీమానభం
గపరిత్రాణక గొట్టు...
| 83
|
మ. |
దవమున్ బోలె మహర్షిభిక్షయని రాఁ దచ్ఛాంతికై ద్రవ్యమున్
లవమాత్రార్పితశాకపారణమువల్లన్ సేయవా తృప్తి! మే
ల్గవయం బ్రాణులకెల్ల భండనకళాఖండీభవద్దంతవ
క్రవిదూరాదిక గొట్టు...
| 84
|
మ. |
కురురాజన్యుఁడు వాసవాత్మజుఁడు కోర్కుల్ మీఱఁగా నిన్ను సం
గరసాహాయ్యము వేఁడ రాజునకు వేడ్కన్ సేనలంబంపి నీ
వరయన్ సారథివైతి వర్జునున కత్యంతాప్తిచేఁ గోటిభా
స్కరతేజస్విక గొట్టు...
| 85
|
మ. |
అమరం గౌరవకోటికెల్ల పటుశౌర్యప్రౌఢిమన్ విశ్వరూ
పము జూపించుచు విందు సూతజుఁ డొనర్పన్ భోక్తవై రాయబా
రము వాటించిన నిన్ భజింతు హితసంసారార్థలీలాధృతాం
గమృషాలౌకిక గొట్టు...
| 86
|
మ. |
అసమప్రౌఢిమ సైంధవుం గెడప దీక్షాయత్తుఁ డైనట్టియిం
|
|
|
ద్రసుతుం బ్రీణితు సేయఁ దజ్జయనిమిత్తవ్యాప్తికై యవ్విభా
వసునిం గప్పితి వెంతవింత! భజనాపారీణతద్జ్ఞాపవ
ర్గసుఖప్రాపక గొట్టు...
| 87
|
మ. |
అమరం గర్ణుని నాగపాశమును ద్రౌణ్యాభీలదివ్యాస్త్రమున్
సముదంచద్ధృతరాష్ట్రజృంభణము గాంధారీవిచారాగ్నియున్
గ్రమయత్నంబుల మాన్పి పాండవుల వేడ్కంబ్రోచినా వౌర భ
క్తమనోరంజక గొట్టు...
| 88
|
మ. |
విలసద్భవ్యభవత్తనూభవులకు విద్యాగురుల్ మూఁడుకో
టులపై నెన్బదివేలమంది యట తోడ్తో వారికిన్ సంఖ్యసం
ధిలగాఁ బుత్త్రకు లెన్నియర్బుదములో నీకగ్రపుత్రీభవ
త్కలహంసాశ్వక గొట్టు...
| 89
|
మ. |
ఉరుశౌర్యాఢ్యుఁడు రుక్మిణీసతికిఁ బ్రద్యుమ్నుండు నమ్మేటికిన్
వరపుత్రుం డనిరుద్ధుఁ డాఘనున కావజ్రాభిధానాంకుఁ డీ
సరణిన్ వంశసమృద్ధి గల్గిన మహాసంసారి వౌరౌర సా
గరజామాతృక గొట్టు...
| 90
|
శా. |
నీజాగ్రత్స్స్థితి సాధురక్షణకళానిత్యంబు నీలీల నా
నాజంతువ్రజజన్మపోషణలయానందంబు నీమాయ భా
షాజాన్యాదిదురాసదంబు యదువంశక్షీరవారాశిరా
కాజైవాతృక గొట్టు...
| 91
|
శా. |
ఆభీలాసురవంచితుం డయినబ్రహ్మన్ వేదవిద్యాపున
ర్లాభామోదితుఁ జేయునీకు ఝషలీలామూర్తికిన్ దీనర
క్షాభారంబు వహించు టెంతపని; హస్తన్యస్తగోవర్ధన
క్ష్మాభృత్కందుక గొట్టు...
| 92
|
మ. |
రుచిరప్రేమ గుచేలు నుద్ధవుని నక్రూరున్ బరీక్షిత్తు న
మ్ముచికుందుం గరుణించినట్లు పరమాత్మున్ గాంచనాంచన్మహా
నిచయున్ నిన్ను భజింతు నెమ్మదిని లక్ష్మీనిత్యభోగానురా
గచిరంభావుక గొట్టు...
| 93
|
మ. |
అలబృందావనవీథి ధేనువుల నెయ్యంబారఁ బాలించువే
ళల నీ వందొకగోవు గన్పడిన వెళ్లందోలితో నేను న
ట్టుల నజ్ఞానిని నన్ను బ్రోవు మిఁకఁ దోడ్తో భక్తరక్షాసమా
కలితారంభక గొట్టు...
| 94
|
శా. |
తోరంబైన మదీయభాగ్య మది యెంతో కాని మజ్జిహ్వకున్
సారస్యంబుగఁ గ్రోలఁగాఁగలిగె యుష్మన్నామచింతాసుధా
పూరం బాప్తతచేఁ బ్రథాననగరద్భూలోకవైకుంఠశృం
గారద్వారక గొట్టు...
| 95
|
శా. |
సంప్రీతిన్ నిను సంస్మరించెదను మత్స్వాంతంబులో నిల్వవే!
సుప్రజ్ఞానిధు లైనభక్తులమదిన్ సొంపొప్పఁగా నీవు ని
|
|
|
త్యాప్రామాణ్యవిధిన్ వసింతువని యం డ్రంగీకృతాచత్పిశం
గప్రావారక గొట్టు...
| 96
|
శా. |
నీసౌందర్యగుణంబు లెంతు మదిలో నిన్నే నుతింతున్ నెఱా
నీసంకీర్తన లాచరింతునను నీనిత్యానుకంపాసుధా
కాసారంబునఁ దేల్పు మింక కమలాగండస్థలీపత్రరే
ఖాసంలేఖక గొట్టు...
| 97
|
శా. |
వాలాయంబుగ నిన్నె కొల్తు నినుఁ గైవారంబు గావింతు నీ
లీలల్ వర్ణన సేతు నీదుకథ లాలింతున్ భవత్సత్కృపా
ప్రాలేయప్లుతుఁ జేయవే నను రమారామామణీపాదలా
క్షాలిప్తాంబక గొట్టు...
| 98
|
మ. |
నవనీతాత్ముఁడ వీవు నే గృపణుఁడ నన్నేల నశ్రద్ధ సే
య విచారింపకుఁ బ్రేమ నిల్పుము కరం బర్థింతుఁ గైకొమ్ము మ
త్కవితారామము శౌనకాదిమునిబృందస్వాంతమాకందవృ
క్షవిరాజత్పిక గొట్టు...
| 99
|
శా. |
శ్రీమన్మూర్తివి నీవు నిన్ దలఁతు నీచే సంపదల్ గాంతు నీ
కైమోడ్పుల్ పచరింతు నీవలన మోక్షవ్రాప్తి సాధింతు నీ
కామోదంబుగఁ గూర్తు నామనసు నీయందేసుమీ సత్యరే
ఖామాహాత్మ్యక గొట్టు...
| 100
|
శా. |
శ్రీమత్కాశ్యపగోత్రదిట్టకవివంశీయాఢ్యుఁడన్ రామచం
ద్రామాత్యాంకుఁడ నీకథల్ శతకపద్యారూఢి వాక్రుచ్చితిన్
స్వామీ యీశతకంబు గైకొనుము నీసామర్థ్య మత్యంతమౌ
గా మత్పోషక గొట్టు...
| 101
|
మ. |
పరగం గ్రిందటిజన్మజన్మముల నిన్ బ్రార్థింపలేనైతి ని
న్నరరూపంబునఁ గొల్వగంటి నిటతో నా కబ్బె సన్ముక్తి సు
స్థిరమై యర్జునసాహసార్థభగవద్గీతారహస్యప్రియం
కరవాచాలక గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా.
| 102
|
గొట్టుముక్కల రాజగోపాలశతకము
సంపూర్ణము