బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/తిరుసభ

3. తిరుసభ

మనవిమాట

క్రీస్తు స్థాపించిన దైవరాజ్యాన్నే యిప్పడు తిరుసభ అంటున్నాం. ఉత్దానక్రీస్తు నేడు దానిలో ప్రత్యక్షమైయున్నాడు. అది యెల్లరికీ రక్షణ సాధనం. దైవశాస్త్ర రీత్యా తిరుసభకున్న ప్రాముఖ్యం అంతాయింతా కాదు.

ఈ గ్రంథంలో తిరుసభను గూర్చిన ముఖ్యాంశాలను సంగ్రహంగాను స్పష్టంగాను వివరించాం. ఈ గ్రంథపఠనం ద్వారా గృహస్థులు తిరుసభలో తమకున్న ప్రాముఖ్యాన్ని అర్థంచేసికొని ప్రబోధం చెందవచ్చు. ఇది రెండవ ముద్రణం.

పారిభాషిక పదాలు

  • Apostles =ప్రేషితులు
  • Apocalyptic =దార్శనిక
  • College of Bishops =పీఠాధిపతుల బృoదo, పరిషత్తు
  • Corporate personality =సామూహిక వ్యక్తి
  • Counter Reformation =ప్రతీసoస్కరణవాదం
  • Definition =ప్రకటనం
  • Infallibility =పొరపడని వరo
  • Laity =గృహస్థులు
  • Liturgy =దేవార్చనo, ఆరాధనo
  • Magisterium =బొధన సంఘం
  • Primacy =ప్రధానత్వo
  • Reformation =సoస్కరణవాదo
  • Remnant =శేషజనo
  • Revelation =శ్రుతి
  • Sacrament of Salvation =రక్షణసాధనo, వరప్రసాద సాధనo
  • Successor, Succession =వారసుడు, వారసo
  • Synod of Bishops =పీఠాదిపతుల సమాఖ్య
  • Zealots =ఆసక్తిపరులు

విషయసూచిక

1. దైవరాజ్యం 91
2. తిరుసభ స్థాపనం 100
3. దైవరాజ్యమూ తిరుసభా 113
4. తిరుసభ ఎల్లరికీ రక్షణసాధనం 116
5. తిరుసభ ప్రేషిత సేవ 120
6. తిరుసభకు ఉపమానాలు 123
7. తిరుసభ లక్షణాలు 137
8. తిరుసభలో గృహస్థలు 144
9. తిరుసభలో అధికారం సేవకొరకే 149
10. పీఠాధిపతులు 153
11. పోపుగారి ప్రధానత్వం 159
12. పొరపడని వరం 165
 - ప్రశ్నలు 171

1. దైవరాజ్యం

సువిశేషాల్లో "తిరుసభ" అనేమాట చాల అరుదుగా కన్పిస్తుంది. ఈ గ్రంథాల్లో తరచుగా కన్పించే మాట "దైవరాజ్యం”, “కాలం సమిూపించింది. దైవరాజ్యం చేరువలో వుంది" అనే పలుకులతోనే క్రీస్తు తన బోధ ప్రారంభించాడు- మార్కు 1,15. క్రీస్తు ప్రధానంగా బోధించింది ఈ దైవరాజ్యాన్ని గూర్చే మరి యిప్పడు లోకంలో వ్యాప్తిలో వున్న తిరుసభ ఎక్కడి నుండి వచ్చింది? అది క్రీస్తు స్వయంగా స్థాపించిందే. దైవరాజ్యాన్ని వ్యాప్తిలోకి తీసుకొని రావడానికే క్రీస్తుతిరుసభను స్థాపించాడు. అది దైవరాజ్యాన్ని ప్రత్యక్షం చేయడానికే వుంది. కనుక తిరుసభను అర్థం జేసికోవాలంటే మొదట దైవరాజ్యాన్ని బాగా అర్థం జేసికోవాలి. ఈ యధ్యాయంలో దైవరాజ్యాన్ని గూర్చి మూడంశాలు పరిశీలిద్దాం.

1. పూర్వవేదంలో దైవరాజ్యం

మనం మొదట గమనింపవలసిన అంశం ఇది. దైవ రాజ్యమనేది ఓ స్థలంకాదు, ఓ శక్తి. దేవుడు తన శక్తితో ప్రజలమిూద పరిపాలనం చేస్తాడు. కనుక అసలు దైవరాజ్యం అనడం కంటె "దేవుని పరిపాలనం"అనడం మెరుగు. పూర్వవేదంలో దైవరాజ్యం అనే భావం క్రమేణ పెంపజెందుతూ వచ్చింది. ఇక్కడ దైవరాజ్యాన్ని గూర్చి ఎన్మిదంశాలు గుర్తించాలి. 1. హీబ్రూ బైబుల్లో దైవరాజ్యం అనేమాట అంత ప్రచురంగా కన్పించదు. కాని "ప్రభువు రాజు" "ప్రభువు పరిపాలిస్తాడు" అనే మాటలు విరివిగా కన్పిస్తాయి. యూదుల దృష్టిలో దేవుడు ప్రధానంగా రాజు.

2. యూదులకు చుట్టుపట్ల వున్న కనానీయులు మొదలైన జాతులు కూడ వాళ్ళ దేవుళ్ళను రాజులనుగానే భావించారు. కాని ఈ యన్యజాతుల దేవుళ్లు ఏదో వాక దేశానికి రాజులు, ఐతే యిస్రాయేలీయులు కొల్చిన యావే ప్రభువు ఓ దేశానికి కాక, ఓ ప్రజకు రాజు.

3. నిర్గమన కాలంలో యావేయిస్రాయేలీయులకు కాపరిగాను నాయకుడుగాను వ్యవహరించడం ద్వారా తన రాజత్వాన్ని చాటుకొన్నాడు. ప్రభువే నాయకుడై ఆ ప్రజను ఎడారిగుండ నడిపించాడు. అతని శక్తి అనంతమైంది. అతనికి త్రోవా గమ్యమూ రెండూ తెలుసు. కనుక యిప్రాయేలు జనులు అతన్ని నమ్మి అతనివెంట పయనించారు.

4. యిప్రాయేలీయులు కనాను మండలంలో ప్రవేశించాక షుమారు రెండువందల యేండ్ల న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. ఈ నాయకులు రాజులుగా వ్యవహరింపలేదు. ప్రభువే యిప్రాయేలుకు రాజు. అతని పేరు విూదిగానే పండ్రెండు తెగల యిస్రాయేలీయులు ఒక్కప్రజగా ఐక్యమయ్యారు అని న్యాయాధిపతులు భావించారు. ప్రజలు గిద్యోను అనే న్యాయాధిపతిని రాజును చేయబోగా, అతడు నిరాకరించి ప్రభువే మనకు రాజు అని చెప్పాడు - న్యాయాధి 8,23. చివరి న్యాయాధిపతియైన సమూవేలు కాలంలో ప్రజలు ఇతర జాతులకు లాగే తమకుకూడ ఓ రాజు కావాలని కోరారు. కాని సమూవేలు ప్రభువే విూకు రాజు కనుక మరోరాజు అక్కరలేదు అన్నాడు - 1సమూ 8,4-6.

5. రాజుల కాలంలోగూడ ప్రభువే ప్రజలకు నిజమైన రాజు అనే భావం వుండేది. సౌలు దావీదు మొదలైన రాజులంతా కేవలం యావే ప్రతినిధులు అనే భావం వుండేది. పాలస్తీనా దేశానికి పొరుగు దేశాలైన ఈజిప్టు బాబిలోనియాల్లో జనులు రాజులను దేవుళ్ళనుగా ఎంచారు. రాజులు దేవుని అవతారాలనుకొన్నారు. కాని యూదులు మాత్రం తమ రాజులను ఎప్పడూ నరమాత్రులుగానే పరిగణించారు. వాళ్లకు నిజమైన రాజు యావే వొక్కడే చాల కీర్తనలు యావేను రాజునుగా వర్ణిస్తాయి.

6. యావే ఒక్కయిస్రాయేలీయులకు మాత్రమే కాక లోకంలోని జాతులన్నిటికి రాజు - యిర్మీ 10,7, 7. యావే ఒక్క నరజాతికి మాత్రమే కాక ఈ విశ్వానికంతటికీ రాజు, సృష్టికర్తయైన ప్రభువు జీవకోటికంతటికీ పాలకుడు. ఈ విశ్వమంతా అతని సాన్నిధ్యంతో నిండివుంది — యొష 6,3.

8. ప్రవక్తల కాలంలో యావే ప్రభువును గూర్చి రెండు భావాలు ప్రచారంలోకి వచ్చాయి. మొదటిది, అతని రాజ్యం అంత్యదినాల్లో బాగా వ్యాప్తిలోకి వస్తుంది. రెండవది, అతడు ప్రజల హృదయాల్లో పరిపాలనం జేస్తాడు.

క్రీస్తుపూర్వం 587లో బాబిలోనియా రాజులు యూదుల రాజ్యాన్ని నాశంజేసారు. ఇక యూదులకు ఇహలోక రాజ్యం లేదు. కనుక ప్రవక్తలు అంత్యదినాల్లో యావే యిప్రాయేలును రాజుగా ఏలుతాడు అని బోధించారు. ఇంకా, యిస్రాయేలు రాజులూ ప్రజలూ కూడ నిరంతరం సీనాయి నిబంధనాన్ని మిూరుతూ వచ్చారు. కనుక ప్రవక్తలు అంత్యదినాల్లో ప్రభువు యిస్రాయేలీయుల హృదయాలను మారుస్తాడని బోధించారు. కనుకనే యెహెజ్నేలు ప్రభువు జనులలోని రాతిగుండెను తీసివేసి దానికి బదులుగా మాంసపు గుండెను దయచేస్తాడని చెప్పాడు. అనగా అతడు అవిధేయులైన యిస్రాయేలీయులను విధేయులనుగా మారుస్తాడని భావం. వాళ్ల హృదయాల్లో తాను రాజ్యం చేస్తాడని అర్థం - 36, 26-27.

ప్రవక్తలు భవిష్యత్తులో రానున్న దైవరాజ్యానికి చాల వుపమానాలు వాడారు. ఆ రాజ్యం నూత్నసృష్టి, నూత్న నిర్గమనం. ప్రభువు గొర్రెల కాపరికాగా ప్రజలు అతడు మేపే మంద ఔతారు — యొష 39,11. యావే తన ప్రతినిధియైన మెస్సీయాను పంపి అంత్యకాలంలో దైవరాజ్యాన్ని స్థాపింపజేస్తాడు.

ఇంకా ప్రభువు అంత్యకాలంలో సియోను కొండమిూద సింహాసనాన్ని స్థాపించుకొని లోకంలోని జాతులనన్నిటినీ ఏలుతాడు. ఈ కొండమిూది నుండే అతడు ధర్మశాస్తాన్ని బోధిస్తాడు. దాన్ని నేర్చుకోవడానికి లోకంలోని సకలజాతి ప్రజలు యాత్రికులుగా సియోనుకి వస్తారు -

"ఆ ప్రజలు ఈలా పల్ముతారు
మనం ప్రభువు పర్వతానికి వెళ్లాం
యాకోబు దేవుని దేవళానికి పోదాం
అతడు తన మార్గాలను మనకు బోధిస్తాడు
మన మతని త్రోవలో నడుద్దాం
ధర్మశాస్త్రం సియోనునుండి వస్తుంది
ప్రభువు వాక్కయెరూషలేమునుండి బయల్దేరుతుంది" - యెష 2.2-3.

ఆ కాలంలో ఒక్క నరులకు మాత్రమే కాక ప్రాణికోటికంతటికీ, సృష్టికంతటికీ దేవునితో మళ్ళా రాజీకుదురుతుంది. పూర్వం ఏదెనులో వున్న శాంతి సమాధానాలు మల్లా నెలకొంటాయి. కనుక ఈ యంత్యకాలం దేవుడు చేసే గొప్పవిందులాంటిది - యోష 25,6=8.

యిప్రాయేలీయులు దేవుని నిబంధనను మిూరడంచే అశాంతి యేర్పడింది. అంత్యదినాల్లో దేవునికీ యిస్రాయేలీయులకీ మధ్య మల్లా శాంతి నెలకొంటుంది. ఆ కాలంలోని ప్రజలంతా తమతోతాము, ప్రకృతితో తాము, శాంతియుతంగా జీవిస్తారు. ప్రభువు కరుణతో ప్రజల పాపాలను మన్నిస్తాడు. కనుక శాశ్వత శాంతి నెలకొంటుంది. అటుతర్వాత ప్రజలు మళ్ళా దేవుని నిబంధనను మిూరరు. ఇవన్నీ అంత్యకాలంలో జరుగుతాయి. ఆ కాలం మెస్సీయా వచ్చేకాలం, దైవరాజ్యం పెంపజెందేకాలం.

2. పూర్వవేదాంత కాలంలో దైవరాజ్యం

పైన మనం చూచినవి పూర్వవేద భావాలు. కాని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం తర్వాత దైవరాజ్యాన్ని గూర్చిన యూదుల భావాలు క్రమేణ మారాయి. క్రీస్తు బోధించినపుడు ఈ మార్పు చెందిన భావాలే యూదుల్లో ఎక్కువగా ప్రచారంలో వుండేవి. కనుక మనం వీటినిగూర్చి కూడ తెలిసికోవాలి. మనం ఇక్కడచూచే భావాలు క్రీ.పూ.200 నుండి క్రీ.శ. 150వరకు ప్రచారంలోవున్నవి. ఇవి బైబులు భావాలు కావు, ఆనాటి యూదుల భావాలు మాత్రమే. ఇక్కడ మూడంశాలు పరిశీలిద్దాం .

1) రాజకీయవాదుల దైవరాజ్యం

యూదులు, యావే తన ప్రతినిధియైన మెస్సియాను రాజుగా పంపుతాడు అనుకొన్నారు. అతనిక్ "దావీదు కుమారుడు" అని బిరుదు. అతడు అన్యజాతుల పాలనంనుండి యిస్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరిస్తాడు. యూదుల దారిద్ర్యాన్ని కూడ తొలగిస్తాడు. అతని కాలంలో యూదులు దేవుణ్ణి పూర్ణహృదయంతో సేవిస్తారు. ధర్మశాస్తాన్ని పరిపూర్ణంగా పాటిస్తారు. జెకర్యా గీతం ఈ భావాన్నే సూచిస్తుంది. “అతడు మనలను ద్వేషించే శత్రువులనుండి మనలను కాపాడతాడు. జీవితకాలమంతా మనం నీతితోను పవిత్రతతోను దేవుణ్ణి సేవిస్తాం - లూకా 1,71-75. యూదుల్లో "ఆసక్తి వరులు" అనే ఉగ్రవాదుల వర్గంకూడ వుండేది. పాలస్తీనా దేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందాలని వీళ్ళ ప్రబల వాంఛ. ఆయుధాలతో శత్రువుల నెదుర్కోవాలని వీళ్ళ సంకల్పం. ఈ ధర్మయుద్ధంలో యావే వీళ్ళ తరపున పోరాడతాడని వీళ్ళ నమ్మకం. కనుక ఆ రోజుల్లో యూదులు దైవరాజ్యమనే భావాన్ని రాజకీయాలతో ముడిపెట్టారు. మెస్సియా విజయశీలుడుగాను మహిమాన్వితుడును గాను వచ్చి యావే తరపున శత్రువులతో పోరాడి విజయాన్ని సాధించి దైవరాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకొన్నారు. ఆరోజుల్లో అన్యజాతులన్నీ యిస్రాయేలీయులకు లొంగిపోతాయనీ లోకంలో న్యాయయుక్తమైన పరిపాలనం నెలకొంటుందనీ ఎంచారు. క్రీస్తు వచ్చినపుడు అతడు ఈ రాజకీయ భావాలను అంగీకరించలేదు. ఐనా నూతవేదంలో ఈ రాజకీయ భావాలు అక్కడక్కడా తగులుతాయి. జెబెదయి కుమారులిద్దరు దైవరాజ్యంలో ప్రముఖ పదవులు పొందాలని కోరారు - మార్కు 10,37. క్రీస్తు యెరూషలేము ప్రవేశించేపుడు ప్రజలు దావీదు రాజ్యం రావాలని అరచారు - 11,10. ఎమ్మావు శిష్యులు క్రీస్తు యిప్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరిస్తాడు అనుకొన్నారు - లూకా 24,21. ప్రజలు యేసుని రాజుని చేయాలని భావించారు - యోహా 6,15. ప్రభూ! నీవు యిప్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరించవా అని శిష్యులు ఉత్తాన క్రీస్తుని అడిగారు - అ, చ, 1,16.

ఈ యుగంలో దైవరాజ్యాన్ని గూర్చిన యూదుల భావాలు సంగ్రహంగా ఇవి. రాజైన మెస్సియా యిప్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు. అతడు యిస్రాయేలు శత్రువులతో ఫరోరయుద్ధం జరిపి వారిని ఓడించిన పిదపనే గాని ఈ రాజ్యస్థాపనం జరగదు. లోకంలోని జాతులన్నీ యిస్రాయేలు రాజ్యంలో చేరి దానికి లొంగి వుంటాయి. ఈ రాజ్యంలో శాంతీ సిరిసంపదలూ దైవభక్తి సమృద్ధిగా నెలకొంటాయి.

2) రబ్బయిలు కోరుకొన్న దైవరాజ్యం

యూదుల బోధకులైన రబ్బయిలు ఈలోకంలో ప్రజలు యావేకు సాక్షులుగా వండాలని కోరారు. యావేను ఆరాధించడం ద్వారాను, ధర్మశాస్రాన్ని పాటించడం ద్వారాను వాళ్ళు అతనికి సాక్షులుగా వుంటారు. ప్రజలు తమ పాపాలకు పశృత్తాపపడి ధర్మశాస్తాన్ని చక్కగా పాటిస్తే పరాయిపాలనం అంతరించి దైవరాజ్యం త్వరలోనే వస్తుందని రబ్బయిలు బోధించారు. కనుక వీళ్ళ భావాలప్రకారం, ప్రజల విశుద్ధవర్తనమే దైవరాజ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈసందర్భంలో లెవి అనేరబ్బయి ఈలా నుడివాడు. “యిస్రాయేలీయులు ఒక్కరోజు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటేచాలు వాళ్ళకు దాస్యవిముక్తి శీఘ్రమే లభిస్తుంది. దావీదుకుమారుడు కూడ వెంటనే వస్తాడు." రబ్బయిలు, అంత్యకాలంలో మెస్సియా వచ్చి దైవరాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పారు. దైవచిత్తానికి సమ్మతమైనప్పడుకాని దైవరాజ్యంరాదు అనికూడ బోధించారు.

3) దారునిక వాదుల దైవరాజ్యం

పైన మనం చూచిన రాజకీయవాదులూ రబ్బయిలూ దైవరాజ్యం ఈ భౌతిక లోకంలోనే, ఈయుగంలోనే వస్తుందనుకొన్నారు. కాని దారునిక వాదులు దైవరాజ్యం 95 ఈ భౌతిక లోకంలోగాక పూర్తిగా మార్పుచెందిన మరోలోకంలో వస్తుందని నమ్మారు. మెస్సీయా ఈ యుగంలోగాక మరోయుగంలో వస్తాడని నమ్మారు. వీళ్ళ భావాల ప్రకారం సూర్యచంద్రాది గ్రహాలు నశిస్తాయి. ఈలోకం అంతరిస్తుంది. నూతదివీ నూత్నభువీ ఏర్పడతాయి. ఆ యుగం మన చరిత్రకు సంబంధించింది కానేకాదు. అది క్రొత్తయుగం. క్రొత్త సృష్టి ఆ యుగంలోగాని దైవరాజ్యం నెలకొనదు. ఆ యుగంలో దేవునికీ దుష్టశక్తులకీ మధ్య ఫరోరయుద్ధం జరుగుతుంది. ఆ దుష్టశక్తులన్నీవోడిపోతాయి. ఈ ప్రస్తుత భౌతికలోకం అంతరిస్తుంది. న్యాయతీర్పు జరుగుతుంది. మృతులు ఉత్తానమౌతారు. అప్పడేగాని దైవరాజ్యంరాదు. యెషయా 24-27అధ్యాయాలు, దానియేలు 7వ అధ్యాయం ఈ భావాలను పేర్కొంటాయి.

క్రీస్తునాడు యూదుల్లో ఈ మూడు వర్గాలవారి భావాలు కలగాపులగంగా ప్రచారంలో వుండేవి. అప్పుడు అన్యజాతివాళ్ళయిన రోమియులు పాలస్తీనా దేశాన్ని పరిపాలిస్తుండేవాళ్లు కనుక ఆనాటి యూదులందరూ దాస్యవిముక్తిని కోరుకొన్నారు. మెస్సీయా శీవఘ్రమే విచ్చేసి రోమిూయులను జయించి యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడనుకొన్నారు. అతని ఆగమనం కొరకు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అంతటా అశాంతి నెలకొనివుంది. అలాంటి ఉద్రిక్తపరిస్థితుల్లో క్రీస్తువచ్చి దైవరాజ్యాన్నిగూర్చి బోధించడం మొదలెట్టాడు. ఈ దైవరాజ్యం కొరకే యూదులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. కనుక అతని బోధలను వాళ్ళు శ్రద్ధతో విన్నారు.

3. క్రీస్తు బోధించిన దైవరాజ్యం

క్రీస్తు బోధల్లోని ముఖ్యాంశం దైవరాజ్యమే. "కాలం పరిపూర్ణమైంది. దైవరాజ్యం సమిూపించింది. మి పాపాలకు పరివర్తనంచెంది సువార్తను విశ్వసించండి" అనే వాక్యాలతోనే అతడు తన బోధను ప్రారంభించాడు - మార్కు 1,15. అతని వుపదేశాలన్నీ ఏదో రూపంలో దైవరాజ్యానికి సంబంధించినవే. అంత్యకాలంలో దైవరాజ్యాన్ని గూర్చి బోధించడానికే తండ్రి అతన్ని పంపాడు.

క్రీనునాడు అంత్యకాలంలో దైవరాజ్యం వస్తుందని యూదులంతా నమ్ముతుండేవాళ్ళు దానికోసం గంపెడాశతో ఎదురుచూస్తుండేవాళ్లు, ఆ దైవరాజ్యం రానేవచ్చిందని క్రీస్తు బోధించడం మొదలెట్టాడు. కనుక బెల్లానికి ఈగల్లాగ జనమంతా అతనిచుట్టు మూగి అతని బోధలు శ్రద్ధగా విన్నారు.

కాని అంత్యకాలంలో రాబోయే దైవరాజ్యాన్ని గూర్చి ఆనాటి ప్రజలు తలంచిన తీరువేరు. ప్రజలు రాజకీయమైన దైవరాజ్యం కొరకు ఎదురుచూచారు. అనగా వాళ్లు కోరింది ప్రధానంగా రోమికాయుల పాలనం నుండి విముక్తి కాని క్రీస్తు కోరింది తండ్రి దయచేసే రక్షణం. అనగా ప్రజలందరికి పాప పరిహారం, శాంతి సంతోషాలు. నరులు తమ స్వీయ శక్తితోగాని, మోషే ధర్మశాస్తాన్ని పాటించడం వలనగాని ఈ రక్షణాన్ని సంపాదించలేరు. తండ్రి మాత్రమే దాన్ని దయచేయగలడు.

దైవరాజ్యాన్నిగూర్చి క్రీస్తు చేసిన బోధల్లో ఐదు ముఖ్యాంశాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. దైవరాజ్యం సమిూపించింది గనుక నరులు పరివర్తనం చెందాలి

తరతరాల నుండి యూదులు దైవరాజ్యం కొరకూ మెస్సియా రాకడ కొరకూ ఎదురుచూస్తూ వచ్చారు. ఆ పుణ్యకాలం రానే వచ్చింది - లూకా 10,23-24. ఈ రాజ్యంలో చేరాలంటే నరులకు రెండు గుణాలు వుండాలి. అవి పరివర్తనమూ, సువార్తను విశ్వసించడమూ - మార్కు 1,15.

ఈ పరివర్తనం హృదయగతమైంది. అనగా నరుల మనస్సులు పూర్తిగా మారాలి. వాళ్లు తమ పాప కార్యాలను వదలుకొని దేవుని వద్దకు తిరిగిరావాలి.

ఇంకా, వాళు క్రీస్తు బోధించే సువార్తను పూర్తిగా విశ్వసించాలి. ఇక్కడ పరివర్తనమూ విశ్వాసమూ కలసిపోతాయి. పరివర్తనం చెందినవాడు మాత్రమే క్రీస్తు రాకడతో దైవరాజ్యం ప్రారంభమైందని విశ్వసిస్తాడు. అలా విశ్వసించేవాడు తప్పకుండ పరివర్తనం చెందుతాడు. అతడు తన పాపాలను ఒప్పకొని దేవుని నుండి రక్షణాన్ని కోరతాడు. కనుక క్రీస్తు నరులకు ఈ రెండు గుణాలు అవసరమని చెప్పాడు. ఆనాటి పరిసయులకు పరివర్తనమూ లేదు విశ్వాసమూ లేదు. కనుకనే వాళ్ళ క్రీస్తు కొనివచ్చిన దైవరాజ్యాన్ని అంగీకరించలేదు. కాని పాపులూ సుంకరులూ మాత్రం క్రీస్తు బోధలను విశ్వసించి పశ్చాత్తాపపడి దైవరాజ్యంలో చేరారు.

2 రక్షణకాలం రానే వచ్చింది

దైవరాజ్యం రానే వచ్చింది. అది క్రీస్తు ద్వారా వచ్చింది. అసలు అతడే దైవరాజ్యం. తండ్రి ఈ క్రీస్తుద్వారా ప్రజలను రక్షిస్తాడు. కనుక క్రీస్తు రక్షణదాత. అతడు కొనివచ్చే రక్షణంతో నూత్నయుగం ప్రారంభమౌతుంది. కనుకనే అతడు నూత్నయుగంలో మనుష్యకునూరుడు మహిమాన్వితమైన సింహాసనంమీద ఆసీనుడౌతాడని చెప్పాడు-మత్త 19,28. క్రీస్తు అద్భుతాలు ఈ నూత్నయుగం, ఈ రక్షణకాలం ఆసన్నమైందని నిరూపిస్తాయి, మెస్సియా వచ్చినపుడు అద్భుతాలు జరుగుతాయని ప్రవక్తలు పూర్వమే చెప్పారు - యెష 35,5-6. రాబోయేవాడివి నీవేనా అని స్నాపక యోహాను శిష్యులు క్రీస్తుని అడిగారు. అనగా నూత్నయుగాన్ని ప్రారంభించేవాడివి నీవేనా అని వాళ్ళ భావం - మత్త 11,8. క్రీస్తు వాళ్లకు తన అద్భుతాలను గూర్చి చెప్పి రక్షణాన్ని ప్రసాదించే నూత్నయుగం వచ్చిందని తెలియజేసాడు.

క్రీస్తుతో నూత్నయుగం ప్రారంభమైందనడానికి కానావూరి వివాహం చక్కని తార్కాణం. ప్రభువు ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యూదుల భావాల ప్రకారం ద్రాక్షరసం నూత్న శకాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు జల ప్రళయానంతరం నోవా ద్రాక్షలు నాటి క్రొత్త శకాన్ని ప్రారంభించాడు - ఆది 9,20. కనుక కానావూరి అద్భుతంలోని ద్రాక్షరసం క్రొత్త శకానికీ, క్రొత్త జీవితానికీ చిహ్నంగా వుంటుంది. ఇంకా క్రీస్తు కొత్త ద్రాక్షరసపు తిత్తులనూ క్రొత్త బట్టలనూ పేర్కొన్నాడు - మత్త 9,16–17. ఇవికూడ రక్షణంతో కూడిన నూత్నయుగానికి చిహ్నాలే.

3. దైవ రాజ్యానికి ముఖ్యమైన గుర్తు దేవుని కరుణే

దైవ రాజ్యానికి ముఖ్యమైన గుర్తు దేవుని కరుణ. అతడు మెస్సియా ద్వారా ప్రజలమిూద దయజూపి వాళ్ల పాపాలను మన్నిస్తాడు. పరిసయులు దేవుడు పాపాత్ములను శిక్షిస్తాడని బోధించారు. దీనికి భిన్నంగా క్రీస్తు దేవుడు పాపులను మన్నించి వారికి రక్షణాన్ని దయచేస్తాడని ప్రకటించాడు. అతడు నేను పిలువవచ్చింది పాపులను గాని పుణ్యాత్ములను కాదన్నాడు. వైద్యుడు రోగులకొరకు అన్నాడు – మత్త 9,12-13. ఆ ప్రభువు మత్తయిని సుంకాల శాలనుండి పిలవడం, జక్కయ్య తప్పలను వ్యభిచారిణి పాపాలను మన్నించడం మొదలైన కరుణ కార్యాలన్నీ అతడు కొనివచ్చిన పాపపరిహారానికి చిహ్నాలే. క్రీస్తు చెప్పిన గొప్ప సామెతలు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణెం అనేవి — లూకా 15, ఇవికూడ దేవుడు పాపులపట్ల కరుణ జూపుతాడు అనడానికి నిదర్శనాలే. దేవుడే పాపులను వెదుకుకొంటూ వచ్చి వారిని రక్షిస్తాడని ఈ కథల భావం. ఈ విధంగా అంత్య కాలంలో దేవుడు పాపులపట్ల అపారమైన కరుణ జూపుతాడని క్రీస్తు తెలియజేసాడు.

4. దైవరాజ్యం తప్పక వ్యాప్తిజెందుతుంది

దైవరాజ్యవ్యాప్తి నరుల శక్తిపైగాక దేవుని శక్తిపై ఆధారపడి వుంటుంది. దేవుని బలానికి అడ్డలేదుకనుక ఆ రాజ్యం తప్పక వ్యాప్తి జెందుతుంది. కనుకనే క్రీస్తు "నీ రాజ్యం వచ్చునుగాక, నీచిత్తం పరలోక భూలోకాల్లోను నెరవేరును గాక" అని మనం తండ్రికి ప్రార్ధన చేయాలన్నాడు — మత్త 6,10, 6. అతడు బోధించిన సామెతలుకూడ దైవరాజ్యం తప్పక వ్యాప్తి చెందుతుందనే చెప్తాయి. ఆవగింజ చిన్నది. దానినుండి పెద్దచెట్టు పెరుగుతుంది. పులిసినపిండి పొంగి ఉబ్బతుంది. రైతు చల్లే విత్తనాలు నూరంతలుగా ఫలిస్తాయి - మత్త 13. సేద్యగాడు విత్తనాలు చల్లగా క్రమేణ పైరు ఎదిగి పంట పండుతుంది - మార్కు 8,26–9. ఇవన్నీ దైవరాజ్యవ్యాప్తిని సూచించేవే. దైవకృపవల్లనే దైవరాజ్యం వ్యాప్తిచెంది, విజయాన్ని సాధిస్తుంది.

5. రక్షణ వార్తవిని నరులు సంతోషించాలి

నిధిని కనుగొన్నవాడూ, విలువగల రత్నాన్నిసంపాదించినవాడూ సంతోషించారు. ఈ నిధీ రత్నమూ దైవరాజ్యాన్ని సూచిస్తాయి. వాటిని సంపాదించినవాళ్ళు సంతసిస్తారు - మత్త 13,44-46. క్రీస్తుకి త్రోవను సిద్ధంజేసిన స్నాప్రక యోహాను తల్లి కడుపులో వున్నపుడే మెస్సియా రాకడను గాంచి ఆనందంతో ఎగిరి గంతేసాడు - లూకా 1,44 అటుతర్వాత అతడు పెండ్లికుమారుని స్వరాన్నివిని సంతోషించాడు - యోహా 3,29. అనగా యోహాను క్రీస్తనీ క్రీస్తురాజ్యాన్నీ చూచి ఆనందించాడు. దైవరాజ్యం నూత్న శకాన్ని కొనివస్తుంది. దేవుని కరుణనీ పాపపరిహారాన్నీ తీసికొనివస్తుంది. దైవరాజ్యమంటే దైవపరిపాలనం ప్రారంభం కావడం. కనుక ఆ రాజ్యంలో చేరేవాళ్ళంతా సంతోషిస్తారు.

పైన దైవరాజ్యాన్ని గూర్చిన పూర్వవేదబోధలూ, పూర్వవేదాంత కాలంలోని యూదుల భావాలూ, క్రీస్తు బోధలు కూడ పరిశీలించాం, కడన ఒక్కప్రశ్న ఈ దైవరాజ్యం ఎప్పడు వస్తుంది? కొందరు ఆధునిక వేదపండితులు అది లోకాంతంలోగాని రాదన్నారు. మరికొందరు అది పూర్తిగా రానేవచ్చింది అన్నారు. కాని ఈ రెండు భావాలు సరైనవిగావు. పై ప్రశ్నకు తృప్తికరమైన జవాబు ఇది. దైవరాజ్యం క్రీస్తుతోనే పాక్షికంగా వచ్చింది. లోకాంతంలో పరిపూర్ణంగా వస్తుంది. తిరుసభ ఈ మధ్యకాలంలోవుంది. కనుక ఇప్పడు మనం ఇదివరకే కొంతవరకు వచ్చిన, లోకాంతంలో పరిపూర్ణంగా రానున్న దైవరాజ్యాన్ని చూస్తున్నాం. ఆ వచ్చిన దానికీ రానున్న దానికీ గూడ క్రీస్తేపునాది. అతడే దైవరాజ్యం.

క్రీస్తు మరణోత్థానలతోనే దైవరాజ్య స్థాపనం జరిగింది. అతని బోధలూ అద్భుతాలూ అతడు దయచేసిన పాపపరిహారమూ దాని స్థాపనాన్ని తెలియజేస్తాయి. కాని మానుష క్రీస్తులాగే దైవరాజ్యంకూడ ఈ లోకంలో గుప్తంగా, దైన్యంగా వుంటుంది. ప్రజలు దాన్ని అట్టేగుర్తించరు. ఉత్తానానంతరం క్రీస్తుకి గుర్తింపూ మహిమా వచ్చినట్లే లోకాంతంలోగాని దైవరాజ్యానికి మహిమరాదు. అప్పుడుగాని అది పరిపూర్ణ విజయాన్ని సాధించదు. క్రీస్తుని నమ్మేవాళ్ళంతా ఇప్పడే దైవరాజ్యంలో ప్రవేశిస్తారు. లోకాంతంలో ఆరాజ్యంలో పరిపూర్ణంగా సుఖిస్తారు. ఈలోక జీవితంలో శోధనలూ పాపమూ అడ్డువస్తుంటాయి. కనుక ఎవరూ ఇక్కడ పరిపూర్ణంగా దైవరాజ్యసభ్యులు కాలేరు. పరిపూర్ణత అనేది పరలోకంలోగాని సిద్ధించదు.

ప్రార్ధనా భావాలు

1. ఆదికాండం 27లో యాకోబు యేసావులకథ వస్తుంది. అక్కడ పెద్దకొడుకైన యేసావుకి రావలసిన తండ్రి దీవెనను చిన్నకొడుకైన యాకోబు దక్కించుకొన్నాడు. యూదసమాజం ఏసావుకీ, తిరుసభ యాకోబుకీ చిహ్నంగా వుంటాయి. యూదసమాజం దేవునికి ప్రథమ పుత్రుని లాంటిది. ఐనా క్రీస్తుని నిరాకరించడం వల్ల ఆ సమాజం తన దీవెనను పోగొట్టుకొంది. తిరుసభ ఆ దీవెనను సంపాదించుకొంది.
2. దైవరాజ్యమే తిరుసభ, కాని కొందరు తిరుసభలో చేరకుండానే దేవుని చేరుకోవచ్చునంటారు. మాకు క్రీస్తు చాలు. తిరుసభ అక్కరలేదు అంటారు. కాని ఇది పొరపాటు. మూడవ శతాబ్దంలో జీవించిన సిప్రియన్ భక్తుడు "తిరుసభను తల్లిగా స్వీకరించనివాడు దేవుణ్ణి తండ్రిగా స్వీకరించలేడు” అని వ్రాసాడు. నరులు తల్లిపట్ల చూపే ప్రేమాభిమానాలను మనం తిరుసభపట్ల చూపాలి.

2. తిరుసభ స్థాపనం

పూర్వాధ్యాయంలో దైవరాజ్యమంటే యేమిటో చూచాం. క్రీస్తు దైవరాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడు. ఈ దైవరాజ్య స్థాపనమే తిరుసభ స్థాపనకు దారితీసింది. క్రీస్తు కోరిక ప్రకారమే తిరుసభ పుట్టింది. అంతేగాని అతడు అనుకోని విధంగా అది ఆవిర్భవించలేదు. కాని అతడు తన జీవితకాలంలో, అనగా తన మరణోత్తానాలకు ముందే, ஒலி స్వయంగా తిరుసభను స్థాపించలేదు. అతని ఉత్తానానంతరం ఆత్మ దిగివచ్చాక కాని అది పుట్టలేదు. ఐనా క్రీస్తు జీవించి వుండగానే తన బోధలద్వారా నైతేనేమి, కొన్ని ప్రత్యేక క్రియలద్వారా నైతేనేమి, భవిష్యత్తులో తిరుసభ పడుతుందని సూచించాడు. అనగా తిరుసభ పుట్టాలని క్రీస్తు తన మరణానికి ముందే సంకల్పించుకొన్నాడు. అతని వుత్తానానంతరం అది రూపుతాల్చింది. పాపపరిహారాత్మకమైన అతని మరణమూ, వరప్రసాద సహితమైన అతని వుత్తానమూ తిరుసభకు పునాదులయ్యాయి. క్రీస్తు దైవరాజ్యాన్ని మాత్రమే ఉద్దేశించాడనీ, అతని వద్దేశానికి భిన్నంగా తర్వాత పౌలు తిరుసభను ఏర్పాటు చేశాడనీ, కొందరు ప్రోటస్టెంటు పండితులు వ్రాసారు. ఈ భావం తప్ప, క్రీస్తే తిరుసభ పుట్టుకను కోరాడు.

ఈ యధ్యాయంలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో క్రీస్తు వుత్తానానికి ముందటి తిరుసభను చూస్తాం. ఇక్కడ నాల్గంశాలున్నాయి. రెండో భాగంలో క్రీస్తు ఉత్థానం తర్వాతి తిరుసభను చూస్తాం. ఇక్కడ ఆరంశాలున్నాయి.

మొదటి భాగం

1. యూదులు క్రీస్తుని నిరాకరించడం

యూదులు క్రీస్తుని నిరాకరించినప్పటి నుండి అతడు తిరుసభ పుట్టుకకోసం కృషిచేస్తూ వచ్చాడు. అతడు గలిలయలో బోధిస్తుండగా యూదులు అతన్ని నిరాకరించడం మొదలెట్టారు. విశేషంగా అతడు రెండవసారి రొట్టెలనూ చేపలనూ పెంచి వేలకొలది ప్రజలకు ఆహారం పెట్టినపుడు ఈ నిరాకరణం ఎదురైంది. యోహా 6,60-69 ఈ సంగతిని తెలియజేస్తుంది. ఇక్కడ యూదులు క్రీస్తుని అనుసరించడం మానివేసారు - 6,66. ఇంకా, మత్తయి 16,13-16 కూడ ఈ విషయాన్ని పేర్కొంటుంది. ఇక్కడ క్రీస్తు నరులు తన్నెవరినిగా భావిస్తున్నారని పేత్రుని అడిగాడు. పేత్రు జవాబుని బట్టి ప్రజలు అతన్ని అద్భుతాలు చేసేవాడ్డిగానో లేక ఎవరో వొక ప్రవక్తనుగానో భావిస్తూ వచ్చారు. అంతేగాని అతన్ని మెస్సీయానుగా మాత్రం అంగీకరించడంలేదు.

యూదులు తన్నుమెస్సీయానుగా అంగీకరించడంలేదని రూఢిగా తెలిసాక క్రీస్తు తన మరణోత్తానాలను గూర్చి మాట్లాడ్డం మొదలెట్టాడు - మత్త 16,21. యెరూషలేములో సంభవింపబోయే క్రీస్తు మరణికోత్తానాల ద్వారాగాని తండ్రి సంకల్పించిన దైవరాజ్యం రాదు. అదే తిరుసభకూడ. అతడు యెషయా పేర్కొన్న బాధామయ సేవకుళ్లాగ అనేకుల కొరకు తన ప్రాణాలను ధారపోస్తాడు - 53. క్రీస్తు యెరూషలేములో చనిపోవడం దైవచిత్తం. మరణానంతరం తండ్రే అతనికి మహిమను దయచేస్తాడు.

యూదులు తన్ను నిరాకరించాక క్రీస్తు ఒంటరిగాడయ్యాడు. అనుచరులు లేని మెస్సీయా ఐపోయాడు. యూదులు తన్ను విడనాడారు. వారికి బదులుగా అతడు నూత్న సమాజాన్ని తయారుచేసికోవాలి. ప్రాత యిప్రాయేలుకి బదులుగా నూత్న యిప్రాయేలు ఉద్భవించాలి. ఈ నూత్న యిస్రాయేలే తర్వాత తిరుసభ ఔతుంది. తండ్రి ఆ ప్రాత సమాజాన్ని వదలివేసి ఈ క్రొత్త సమాజం ద్వారా తన రక్షణ కార్యాన్ని కొనసాగించుకొని పోతాడు. ఈ విధంగా తీరుసభ రక్షణ నిర్వాహక సమాజమౌతుంది. క్రీస్తు తన జీవిత కాలమంతా తిరుసభను ఏర్పాటుచేయాలనే ప్రయత్నంలోనే వున్నాడు, విశేషంగా అతడు పన్నెండుమంది శిష్యులను నియమించడం, పేత్రుకి ఆధిపత్యం దయచేయడం, సత్రసాదాన్ని స్థాపించడం అనే మూడు క్రియలు అతడు తిరుసభ పుట్టుకను ఆశించాడని రుజువు చేస్తాయి. కనుక ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

2. పన్నెండుమంది శిష్యుల నియామకం

"క్రీస్తు పర్వతమెక్కి తాను కోరుకొన్న వారిని పిలవగా వాళ్ళు అతని దగ్గరికి వచ్చారు. అతడు పన్నెండుమందిని ఎన్నుకొని వారికి ప్రేషితులు అని పేరు పెట్టాడు. తనతో వుండడానికి, సువార్తను బోధించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి క్రీస్తు వారిని నియమించాడు” - మార్కు 3,13-15.

ఈ వేదవాక్యాల్లో చాల భావాలున్నాయి. వాటిని విపులంగా పరిశీలిద్దాం.

1. క్రీస్తు కొండమిూదికి వెళ్ళి అక్కడ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ పిమ్మట శిష్యులను ఎన్నుకొన్నాడు - లూకా 6,12-13. వారి యెన్నిక అతడు చేపట్టిన ముఖ్యమైన కార్యాల్లో వొకటి. పూర్వం మోషే కొండమిదనే దేవుని నుండి ధర్మశాస్తాన్ని స్వీకరించాడు. క్రీస్తు కొండమిూదనే మారురూపం పొందాడు. కనుక బైబుల్లో కొండ దైవసాన్నిధ్యానికి గుర్తు. ఇక, క్రీస్తు రాత్రంతా ప్రార్థన చేయడం దైవచిత్తాన్నితెలిసికోవడానికి. ఇక్కడ క్రీస్తు శిష్యులు క్రీస్తుని ఎన్నుకోలేదు. క్రీస్తే శిష్యులను ఎన్నుకొన్నాడు - యోహా 15,16.

ఈ యెన్నిక క్రీస్తు గలిలయ బోధకు, అక్కడ ప్రజలు తన్ను తిరస్కరించడానికీ ముందే జరిగింది.

ప్రభువు ఎన్నుకొనిన పండ్రెండుమంది శిష్యులూ పండ్రెండు తెగల యిస్రాయేలీయులను సూచిస్తారు. వాళ్లు ప్రాత యిస్రాయేలీయుందరికి సంగ్రహరూపం. నూత్న యిప్రాయేలీయులకు నాంది. వీళ్ళ ద్వారానే తిరుసభ ప్రారంభమౌతుంది.

క్రీస్తుకి చాలమంది శిష్యులుండేవాళ్లు. అతడు వాళ్ళల్లో పండ్రెండు మందిని మాత్రమే ఎన్నుకొన్నాడు లేక 'నియమించాడు". పూర్వవేదంలో యాజకులను ఎన్నుకొన్నపుడు కూడ ఈ నియమించడం అన్న పదాన్నే వాడేవాళ్ళు, కనుక నూత్నవేద ప్రేషితులు పూర్వవేద యాజకుల్లాంటివాళ్లు అని భావం.

2. ఈ పండైండు మందిని పిల్వడంలో క్రీస్తు ఉద్దేశాలు రెండు. మొదటిది, వాళ్లు తనతో వండాలి. ప్రేషితులు క్రీస్తుతోవుండి అతని జీవిత విధానాన్ని నేర్చుకొంటారు. అతనితో ప్రయాణాలు చేస్తారు. అతని బోధలు వింటారు. అద్భుతాలు చూస్తారు. ఇతర శిష్యులు క్రీస్తుని విడనాడి వెళ్ళిపోయినా వీళ్ళమాత్రం అలా వెళ్ళిపోరు. కనుక వీళ్లు క్రీస్తుకి ముఖ్యమైనవాళ్ళు రెండవది, వాళ్లు క్రీస్తు సువార్తను గూర్చీ దైవరాజ్యాన్ని గూర్చీ ప్రజలకు బోధిస్తారు. క్రీస్తుతోనే దైవరాజ్యం వచ్చింది కనుక పిశాచాలను వెళ్ళగొట్టి వాటి రాజ్యాన్ని కూలద్రోస్తారు. ఒకవిధంగా వాళ్లు క్రీస్తు పనిని కొనసాగిస్తారు. అతడు పోయాక అతని స్థానాన్ని పొందుతారు.

నూత్నవేదంలో ప్రేషితులపేర్లు విన్పించే జాబితాలన్నిటిలోను పేత్రు పేరు మొదట, యూదా పేరు కడపట వస్తాయి.

3. పూర్వవేదంలో "షాలువా" అనే హీబ్రూపదం ఒకటుంది. (బహువచనం, షెలుహిం). ఈ పదానికి "ప్రతినిధి" అని అర్థం. రాజకీయ కార్యాల్లో వ్యాపారాల్లో మతబోధల్లో పై యధికారులు తమ ప్రతినిధులను క్రిందివారి దగ్గరకి పంపేవాళ్ళు వీళ్ళ తమ్మ పంపిన అధికారుల ఉద్దేశాలను ఆ ప్రజలకు తెలియజేసేవాళ్లు, తమ్ము పంపినవారి అధికారమంతా ఈ ప్రతినిధులకుకూడ వుండేది. ఈ దృష్టిలో పూర్వవేదంలోని ప్రవక్తలు దేవుని ప్రతినిధులు - షెలుహిం. క్రీస్తు ఈ పూర్వవేద ప్రతినిధులను మనసులో పెట్టుకొనే తన పండ్రెండుమంది శిష్యులను ప్రేషితులనుగా నియమించాడు. (తెలుగులో ప్రేషితుడు అంటే పంపబడినవాడు అని అర్థం. అపోస్తలుడు అనే గ్రీకు మాటకు సరైన తెలుగు పదం ఇది.) కనుకనే అతడు తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్ము పంపుతున్నాను అని వాకొన్నాడు - యోహా 20,21. అనగా వాళ్ళు తన దైవరాజ్య బోధను కొనసాగించేవాళ్ళని భావం.

ఈ పండ్రెండుమంది క్రీస్తు ఉత్థానానంతరం దైవరాజ్యబోధకులుగా పనిచేయడం మొదలెట్టారు. ఉత్తానక్రీస్తు విూరు వెళ్ళి సకల జాతిజనులకు నా శిష్యులనుగా చేయండి అని చెప్పాడు-మత్త 28,19-20. తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మ పంపుతున్నాను అన్నాడు - యోహా 20,21. వాళ్లు అతని ప్రతినిధులుగా, అతనికి సాక్షులుగా పితనుగూర్చి బోధిస్తారు.

4.ప్రేషితులకు ఉండవలసిన అర్హతలు మూడు. మొదటిది, వాళ్ళ ఉత్థానక్రీస్తును చూచినవాళ్ళయి వుండాలి-1కొ9,1. రెండవది, క్రీస్తే వాళ్ళను బోధచేయమని ఆజ్ఞాపించి వుండాలి-లూకా 24,47-48. ఉత్తానానికి పూర్వంకూడ క్రీస్తు కొందరిని వేదబోధకు పంపాడు, కాని అది ప్రేషిత లక్షణంకాదు- మత్త 10,5. మూడవది, ఇహలోకంలో వాళ్లు క్రీస్తుతో తిరిగిన వాళ్ళయివుండాలి- అ,చ,121. అనగా వాళ్లు చారిత్రక క్రీస్తునీ ఉత్థానక్రీస్తునీ ఎరిగినవాళ్లయి అతడు సాధించిన రక్షణ సంఘటనను అర్థం జేసికొన్న వాళ్లయి వుండాలి. పైన ప్రభువే శిష్యులను పిలచి వాళ్లను తన పనికొరకు నియమించాడని చెప్పాం. ఉత్తాన క్రీస్తు ఆత్మ వారివిూదకి దిగివచ్చి వాళ్లు రక్షణ సంఘటనను పరిపూర్ణంగా అర్థం జేసికొనేలా చేసింది. ఈ శక్తితోనే వాళ్ళ తర్వాత క్రీస్తుని గూర్చి బోధింప గలిగారు.

పూర్వవేద ప్రవక్తలకీ నూత్న వేద ప్రేషితులకీ దగ్గరి సంబంధం వుంది. ప్రవక్త మొదట దర్శనాల్లో దేవుణ్ణి చూస్తాడు. అతని సందేశాన్ని వింటాడు. తర్వాత ఆ సందేశాన్ని ప్రజలకు బోధిస్తాడు - యెష 6,1-9. ఈలాగే నూత్నవేద ప్రేషితులు కూడ మొదట ఉత్థాన క్రీస్తుని చూచి అతని సందేశాన్ని వింటారు. తర్వాత ఆ ప్రభువు వాళ్ళను వేదబోధకు పంపుతాడు. పేత్రు పౌలు మొదలైన ప్రేషితులంతా ఈలాంటివాళ్లే, నూత్నవేదంలో పేషిత శబ్దాన్ని కొన్నిచోట్ల విస్తృతార్థంలో వాడారు. పన్నెండుమందిలో చేరని వాళ్ళను గూడ ప్రేషితులని పిల్చారు. బర్నబా, యాకోబు మొదలైనవాళ్లు ఈలాంటివాళ్లు.

ప్రేషితుల పదవి విశిష్టమైంది. తొలి పన్నెండు మందేగాని ఇతరులు ఆ పదవికి అర్జులు కారు. కనుక యాకోబు మరణానంతరం అతని స్థానాన్ని ఇతరులెవరూ పొందలేదు - అ,చ.122. తొలి పన్నెండుమంది గతించడంతో ఆ పదవి కూడ గతించింది.

5. ఇంతవరకు మనం చూచిన అంశాల సారాంశం ఇది. కీస్తు గలిలయ బోధకుముందే పన్నెండుమంది అనుచరులను ఎన్నుకొన్నాడు. అతడు ప్రారంభించిన దైవరాజ్యబోధను కొనసాగించడం వాళ్ళ బాధ్యత, గలిలయ బోధకాలంలో యూదులు క్రీస్తుని నిరాకరించాక ఈ పన్నెండుమందికి నూత్న ప్రాముఖ్యం వచ్చింది. క్రీస్తు ప్రాతయిప్రాయేలీయులను విడనాడి నూత్నయిస్రాయేలీయులను ఎన్నుకొన్నాడు. ఆ నూత్న యిప్రాయేలు మొదట ఈ పండ్రెండుమందితోనే ప్రారంభమైంది. క్రీస్తు ఉత్తానానంతరం వీళ్ళు ఏకబృందంగా ఐక్యమయ్యారు. ఆత్మ వీళ్ళను ప్రబోధించింది. అటుపిమ్మట ఇతరులుకూడ ఉత్తానక్రీస్తుని విశ్వసించి వీళ్ళతో చేరిపోయారు. వీళ్ళంతా కలసి క్రీస్తు సమాజమయ్యారు. ఈ సమాజమే తిరుసభగా రూపొందింది. ఈలా క్రీస్తు సంకల్పం ప్రకారమే తిరుసభ పుట్టింది.

3. పేత్రుకి ఆధిపత్యం

తిరుసభకు మూలస్తంభాలుగా వుండడానికిగాను క్రీస్తు పండ్రెండుమందిని ఎన్నుకొన్నాడని చెప్పాం. వీరిలో మల్లా పేత్రుకి ప్రత్యేకస్థానం వుంది. క్రీస్తే అతనికి ప్రత్యేకమైన బాధ్యతను ఒప్పజెప్పాడు. పేత్రు అనే పునాదిమిూద తిరుసభ అనే భవనం నిలుస్తుంది. ఈ యంశాన్ని విపులంగా పరిశీలిద్దాం. పేత్రు ఆధిపత్యాన్ని సూచించే ప్రధాన వాక్యాలు మత్తయి 16,17-19లో వున్నాయి. ఈ యాలోకనంతో పాటు లూకా 22,31-34, యోహాను 21, 15-17 కూడ ముఖ్యమైనవే, కాని యిక్కడ మనం మొదటి ఆలోకనాన్ని చూస్తేచాలు. అది యిది.

"16,17. యోనా కుమారుడవైన సీమోనూ! నీవు ధన్యుడివి. నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకంలోని నా తండ్రేకాని, నీ సహజశక్తికాదు. 18. నీవు రాయివి (కేఫావి). ఈ రాతిమిూద నేను నా తిరుసభను నిర్మిస్తాను. మరణశక్తులు దాన్ని జయించలేవు. 19. నేను పరలోకరాజ్యపు తాళపుచెవులు నీకిస్తాను. భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో అది పరలోకంలోను బంధింపబడుతుంది. భూలోకంలో నీవు దేనిని విప్పతావో అది పరలోకంలోను విప్పబడుతుంది."

1. మొదట పేత్రు పేరును పరిశీలిద్దాం. అతని పేరు సీమోను. క్రీస్తు ఆ పేరుని కేఫాగా మార్చాడు - యెహా 1,42. క్రీస్తు మాట్లాడిన అరమాయిక్ భాషలో కేఫా అంటే రాయి. ఈ కేఫా పదాన్నే నూత్నవేద రచయితలు గ్రీకు భాషలో "పేతోస్"గా అనువదించారు. క్రీస్తు పేత్రుతో "నీ పేరు రాయి (కేఫా). నేను ఈరాతిమిూద నా తిరుసభను నిర్మిస్తాను" అని చెప్పాడు - 16,18. కనుక క్రీస్తు స్థాపించబోయే తిరుసభకు పేత్రు పునాదిరాయి. అనగా ముఖ్యనాయకుడు.

అరమాయిక్ భాషలో కేఫా అంటే రాయి అని చెప్పాం. కాని ఈ పదాన్ని ఆ భాషలో మనుష్యులు పేరుగా వాడేవాళ్లుకాదు. క్రీస్తే మొదటిసారిగా దాన్ని ఓ మనిషిపేరుగా వాడాడు. ఎందుకు? అతని దృష్టిలో ఆ పేరుతో పిలువబడే సీమోనుకి ప్రత్యేక ప్రాముఖ్యముంది. అతనికి తిరుసభలో ప్రత్యేకమైన పదవి లభిస్తుంది.

క్రీస్తు నిర్మింపబోయే తిరుసభ పూర్వవేద సమాజానికి బదులుగా వచ్చే నూత్న సమాజం. ఈ సమాజాన్ని క్రీస్తు ఓ భవనంలా కడతాడు. ఈ భవనానికి పేత్రు పునాదిరాయి ఔతాడు. దేవుడు అబ్రాహామనే పునాది రాతిమిూద ఈ లోకాన్ని నిర్మించాడనీ, పండ్రెండుమంది పితరులనే పునాది రాతిమిూద యిస్రాయేలు అనే భవనాన్ని నిర్మించాడనీ పూర్వవేద రబ్బయిలు వాకొన్నారు. ఈ పలుకుబళ్ళను ఆధారంగా జేసికొనే క్రీస్తు, పేత్రు నూత్న సమాజానికి మూలరాయి అని అన్నాడు.

పైగా పేత్రుకి శిష్యుల్లో అతి ప్రముఖస్థానం వుంది. పౌలుకూడా పేత్రు ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. ఆత్మ దిగివచ్చాక ప్రేషితులకు నాయకుడై వారి తరపున యెరూషలేములో మాట్లాడింది పేత్రు - అచ 2,14. అతడే క్రీస్తు పేరుమిదిగా కుంటివాణ్ణి నడిపించాడు-3,6-8. వ్యాధులు నయం చేసాడు - 5,15. క్రీస్తు పేత్రుని ప్రేషితులకు నాయకుణ్ణిగా నియమించబట్టే అతడు వాళ్ళకు అధిపతిగా వ్యవహరించాడు. 2. ఈ విషయాలన్నీ తెలిసికొన్నాక పై మత్తయి 16,17-19 వాక్యాలమిద వివరణ చూద్దాం. "యోహాను కుమారుడవైన సీమోను! నీవు ధన్యుడివి. నీకు ఈ విషయాన్నితెలియజేసింది పరలోకంలోని నా తండ్రేకాని, నీ సహజశక్తి కాదు" - 16,17. 16వ వాక్యంలో పేతురు, క్రీస్తు మెస్సీయా అనీ సజీవుడైన దేవుని కుమారుడనీ ప్రకటించాడు. ఈ సత్యాన్ని అతడు తన సహజ శక్తివలన గ్రహించలేదు. క్రీస్తు మెస్సీయా అని గ్రహించే వరాన్నిదేవుడే అతనికి దయచేసాడు. దేవుడు పేత్రుకి ఈ విశ్వాసాన్ని దయచేసి అతన్ని తిరుసభకు మూలస్తంభాన్ని చేసాడు.

"నీవు రాయిని (కేఫావి). ఈ రాతిమీద నేను నా తిరుసభను నిర్మిస్తాను" - 16,18. క్రీస్తు సీమోను పేరు పేత్రుగా మార్చాడని చెప్పాం. బైబుల్లో ఆయా వ్యక్తుల పేర్లు వాళ్లు చేసే పనిని సూచిస్తాయి. కొన్నిసార్లు దేవుడే నరులపేర్లు మారుస్తుంటాడు. ఆ నరులు ఆ విూదట ఓ ప్రత్యేకమైన కార్యాన్ని నిర్వహిస్తారు. ఉదాహరణకు, దేవుడు అబ్రాము పేరుని అబ్రాహాముగా మార్చాడు. అబ్రాము అంటే గొప్పవాడయిన తండ్రికి పుట్టినవాడని భావం. అబ్రాహామంటే చాల జాతులకు తండ్రి అని భావం, ఈలా పేరు మార్చాకనే అబ్రాహాము అనేక జాతులకు తండ్రి అయ్యాడు - ఆది 17,5. ఈ సంప్రదాయం ప్రకారం క్రీస్తు సీమోను పేరుని కేఫాగా మార్చాడు అంటే, అతనికి కొత్తపనినీ కొత్తబాధ్యతనీ ఆప్పజెప్పాడని భావం. ఇక్కడ క్రీస్తు సీమోనుకి ఆప్పజెప్పిన కొత్తపని అతడు నూత్న సమాజానికి అధిపతి కావడమే. ఈ నూత్న సమాజం తిరుసభే కనుక పేత్రు దానికి నాయకుడౌతాడు. ప్రబువు "ఈ రాతిమిూద నేను నా తిరుసభను నిర్మిస్తాను" అన్నాడు. అది నరమాత్రులు స్థాపించే సమాజం కాదు. క్రీస్తే దాన్ని నెలకొల్పాలి. క్రీస్తు దాన్ని ఇంకా నెలకొల్పలేదు. అతని వుత్ధానానంతరం ఆపని జరుగుతుంది.

"మరణ శక్తులు దాన్ని జయించలేవు" -16,18, (కొందరు నరకశక్తులు లేక పాతాళశక్తులు అని అనువదిస్తారు). మరణం ఈలోకానికి సంబంధించింది. కనుక ఈ లోకపు దుష్టశక్తులు పేత్రు అనే పునాదిమీద నిల్చిన తిరుసభ అనే భవనాన్ని నాశం చేయలేవు. అది యీ లోకంలో వున్నా ఇక్కడే క్రీస్తు ఉత్ధానశక్తిలో పాలు పంచుకొంటుంది. ఫలితార్థమేమిటంటే, తిరుసభ పునాది బలమైంది. ఏదుష్ట శక్తి దాన్ని కూలద్రోయలేదు. అది అజేయమైంది.

"నేను పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను” - 16,19. ఇక్కడ తాళపు చెవులంటే సంపూర్ణాధికారం అని భావం. యెషయా 2219–22లో ప్రభువు ఎల్యాకిమకి రాజప్రాసాదం తాళపుచెవులు ఇచ్చాడు. అనగా ఎల్యాకిము ఆ ప్రసాదానికి సంపూర్ణాధికారి అయ్యాడని భావం. అలాగే ఇక్కడ క్రీస్తు తిరుసభమిద సంపూర్ణాధికారాన్ని దయచేసాడని. అర్థం జేసికోవాలి. ఈలోకంలోని తిరుసభలో పేత్రు క్రీస్తు ప్రతినిధి. అతనికి మించిన అధికారి మరొకడు లేడు.

“భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో. విప్పతావో అది పరలోకంలోను బంధింపబడుతుంది, విప్పబడతుంది" - 16,19. బంధించడం, విప్పడం అనేవి రబ్బయి వాడే పారిభాషిక పదాలు. బంధించడం అంటే నిషేధించడం. విప్పడం అంటే అనుమతించడం, కనుక ఇక్కడ పేత్రు నిషేధించేది నిషేధింపబడుతుంది. అనుమతించేది అనుమతింపబడుతుంది అని అర్థం. కాని అతడు నిషేధించేదీ అనుమతించేదీ ఏమిటి? నరులు క్రీస్తు స్థాపించిన దైవరాజ్యంలో చేరాలంటే పాపపరిహారం అవసరం. కనుక ఇక్కడ ప్రభువు పేత్రుకి పాపాలను పరిహరించడానికీ పరిహరించక పోవడానికీ గూడ అధికారాన్ని దయచేసాడని భావం. ఈ సందర్భంలో మత్తయి 18, 18 యోహాను 20, 23 ఆలోకనాలు కూడ చూడదగ్గవి.

పేత్రు చేతిలో దైవరాజ్యపు తాళపుచెవులు వున్నాయి. అనగా అతడు తిరుసభలో పరిపూర్ణాధికారం కలవాడు. కనుక అతడు తిరుసభలో ఎవరి పాపాలనైనా మన్నించవచ్చు ఎవరి పాపాలనైనా మన్నించక పోవచ్చు. అది ఆయాపాపుల హృదయాల్లో పశ్చాత్తాపం వుందా లేదా అనేదాన్ని బట్టి వుంటుంది.

విూద మనం చూచిన భావాల సారాంశం ఇది. క్రీస్తు భవిష్యత్తులో క్రైస్తవ సమాజాన్ని స్థాపించగోరాడు. అది కొనసాగాలంటే దానికి ఓ అధికారి అంటూ వుండాలి. ఆ యధికారి పేత్రు. ఈ భవిష్యత్ సమాజం తీరుతెన్నులు క్రీస్తు అప్పడే సవివరంగా నిర్ణయించలేదు. భవిష్యత్తులో ఆత్మ వచ్చాక ఈ తీరుతెన్నులు రూపుతాలుస్తాయి. పేత్రు మాత్రం ఈ సమాజానికి తిరుగులేని అధిపతి. ఈ సమాజమే తిరుసభ, పేత్రు ఆధిపత్యం అతని అనుయాయులకు కూడ సంక్రమిస్తుంది. ఈ విషయాన్ని మిదట చూస్తాం.

4. దివ్యసత్ఫ్రసాద స్థాపనం

అంత్య భోజనమూ దివ్యసత్ర్పసాద స్థాపనమూ క్రీస్తు తిరుసభను నెలకొల్ప గోరాడని రుజువు చేస్తాయి. కనుక ఇక్కడ ఈ రెండంశాలను పరిశీలిద్దాం. మొదట అంత్య భోజనాన్ని చూద్దాం.

అంత్యభోజన వాక్యాలు మూడు సువిశేషాల్లోను వున్నాయి. ప్రస్తుతానికి మనం లూకా పౌలుల వాక్యాలను తిలకిస్తే చాలు.

"అపుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి, దాన్ని త్రుంచి శిష్యులను ఒసగుతూ ఇది విూ కొరకు అర్పింపబడనున్ననా శరీరము. దీన్నినా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. అలాగే అతడు భోజనానంతరం పాత్రను అందుకొని ఇది విూ కొరకు చిందబడనున్న నూత్న నిబంధనం యొక్క నారక్తం అన్నాడు - లూకా 22,19-20

“మిరు ఈ రొట్టెను తిన్నపుడెల్ల, ఈ ప్రాంతంనుండి త్రాగినపుడెల్ల, ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు - 1కొ 11,26.

1. విూది వాక్యాల్లో క్రీస్తు “ఇది నూత్న నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు. పూర్వవేదంలో నెత్తురు చిలకరించడం ద్వారానే సీనాయి నిబంధనం జరిగింది. అక్కడ మోషే కోడె నెత్తుటిని పీఠంమిూదా ప్రజల విూదా చిలకరించి “ఇది ప్రభువు విూతో చేసికొనిన నిబంధనం యొక్క రక్తం అన్నాడు - నిర్గ 24,8. ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొనే క్రీస్తు అంత్యభోజన సమయంలో "ఇది నూత్న నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు. అక్కడ బలిపశువు నెత్తురుద్వారా నిబంధనం జరిగితే ఇక్కడ క్రీస్తు సొంత నెత్తురుద్వారానే నిబంధనం జరిగింది. ఆ నిబంధనం ద్వారా యిస్రాయేలీయులు ప్రభువు సొంత ప్రజలు, పవిత్రజనులు, యాజకరూపమైన రాజ్యం అయ్యారు - నిర్గ 19,5-6. ఇక్కడ ఈ నిబంధనంద్వారా మనం క్రీస్తు ప్రజలం ఔతాం. ఆ పూర్వవేద ప్రజల లక్షణాలే నేడు మనకుకూడ సంక్రమిస్తాయి – 1పేత్రు 2,9.

ఈ సందర్భంలో క్రీస్తు "నూత్న నిబంధనం అనే మాటను పత్ర్యేకంగా వాడాడు. సీనాయి నిబంధనం ప్రాతది. యూదులు దాన్ని విూరుతూ వచ్చారు. కనుక ఆ నిబంధనంవల్ల ఇక ప్రయోజనంలేదు. కావుననే ప్రభువు కొత్త నిబంధనను నెలకొల్పవలసి వచ్చింది. పూర్వవేదంలో యిర్మీయా ప్రవక్త ఈ నూత్న నిబంధనను గూర్చి ముందుగానే తెలియజేసాడు31, 31-33. ఆ ప్రవచనాన్ని మనసులో పెట్టుకొనే క్రీస్తు తనది "నూత్న" నిబంధనం అని చెప్పాడు.

క్రీస్తు నెలకొల్పిన ఈ నూత్న నిబంధనంద్వారా నూత్న సమాజం, మెస్సీయా సమాజం ఏర్పడింది. అదే తిరుసభ, పాత నిబంధనం పాత ప్రజనూ కొత్త నిబంధనం కొత్త ప్రజనూ తయారుచేసాయి. క్రీస్తు పాస్క పండుగ సందర్భంలో అంత్యభోజనాన్ని ఆరగించాడు. యూదులు ఈ పాస్కపండుగను జరుపుకొనేపూడు సీనాయి నిబంధనాన్ని స్మరించుకొనేవాళ్ళు ఆ పాస్క పండుగ సందర్భంలోనే క్రీస్తు నూత్న నిబంధనను నెలకొల్పాడు. దీని భావమేమిటి? ఇక ఆ పాతనిబంధన చెల్లదు. దానికి మారుగా నూత్ననిబంధనం వచ్చింది. రక్షణ చరిత్రలో పాతశకంపోయి నూత్నశకం వచ్చింది. ఈ నూత్నశకమే తిరుసభ ఈలా క్రీస్తు అంత్యభోజనం ద్వారా తిరుసభ స్థాపనాన్ని సూచించాడు

2. ఇంతవరకు అంత్య భోజనాన్ని గూర్చి చూచాం. ఇక దివ్యసత్ప్రసదాన్ని పరిశీలిద్దాం. నూత్న నిబంధనంతో నూత్న ఆరాధనం కూడ ఏర్పడింది. పూర్వ నిబంధనం కలిగినప్పడు ప్రభువు యూదులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. అదియిది. ప్రజలు ఆ నిబంధనాన్నీ, ఆయీజిప్టు నిర్గమనాన్నీ తాము చేరుకొనే కనాను దేశంలో గూడ ఏటేట జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈలా జ్ఞప్తికి తెచ్చుకోవడానికే యూదులు పాలస్తీనా దేశంలో ఏటేట పాస్క పండుగ జరుపుకొన్నారు - నిర్గ 12,25-27. అదే వాళ్ళ ముఖ్యారాధన. ఇదే విధంగా క్రీస్తు కూడ తన నూత్న నిబంధన బలిని గూర్చి అనగా దివ్యసత్ప్రాసాదబలిని గూర్చి "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి" అని చెప్పాడు - లూకా 22, 19. ఇందుకోసమే మనం రోజురోజు పూజబలిని సమర్పించేది. ఈ పూజబలిలో మనం క్రీస్తు మరణాన్ని తండ్రికి జ్ఞాపకం చేస్తాం. తన కుమారుని మరణాన్ని జూచి తండ్రి నేడుకూడ మన పాపాలను మన్నిస్తాడు. ఈ జ్ఞాపకాన్ని మనం క్రీస్తు రెండవసారి తిరిగి వచ్చేదాకా గూడ కొనసాగించుకొనిపోవాలి - 1కొ11,26. నూత్న నిబంధన కాలంలో నూత్న ప్రజల ఆరాధనమే దివ్యసత్రసాదబలి. ఈ నూత్న ప్రజలే తిరుసభ, యూదుల ఆరాధనం పాస్మబలి. మన ఆరాధనం దివ్యసత్రసాద బలి.

ఈ దివ్యసత్రసాద ఆరాధనంలోస్త్రీ పురుషులు ఐక్యభావంతో, ఏక కుటుంబంగా పాల్గొంటారు. ఏక సమాజమౌతారు. ఈ కార్యం తిరుసభలో జరుగుతుంది. దైవ ప్రజలంతా సత్రసాద పీఠంచుటూ ప్రోగైనపుడు తిరుసభ పరిపూర్ణతను పొందుతుంది. కనుక "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి” అన్నప్రభువు వాక్యాన్నిస్మరించుకొని మనమంతా సంతోషంగా పూజబలికి హాజరు కావాలి. ఈలా హాజరు కావడం ద్వారా తిరుసభ ல்கி చెందుతుంది.

ప్రభువు తన మరణానికి ముందు ప్రేమాజ్ఞను ఇచ్చిపోయాడు. "నేను మిమ్మ ప్రేమించినట్లే మిూరూ ఒకరినొకరు ప్రేమించండి" అన్నాడు-యోహా 13,34-35. దివ్యసత్ర్పసాదబలిలో ఈ ప్రేమాజ్ఞ పరిపూర్ణంగా నెరవేరుతుంది. నూత్న నిబంధనకూ తిరుసభకూ ప్రధానమైంది ఈ ప్రేమాట్టే ఈవిధంగా అంత్యభోజనం ద్వారా, దివ్యసత్ర్పసాద స్థాపనం ద్వారా, క్రీస్తు తిరుసభను స్థాపించ దలచాడని అర్ధం జేసికోవాలి.

రెండవ బాగం

క్రీస్తు తిరుసభను స్థాపించాలని ఉద్దేశించాడు. దాని ఆదిమ సభ్యులైన ప్రేషితులనూ వారి నాయకుడైన పేత్రునీ ఎన్నుకొన్నాడు. తిరుసభ ఆరాధన కొరకు దివ్యసత్రసాదాన్ని స్థాపించాడు. ఐనా తిరుసభ అతని జీవితకాలంలో నెలకొనలేదు. క్రీస్తు ఉత్తానానంతరం, ఆత్మ దిగివచ్చాక అది పుట్టింది. ఈ విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా పరిశీలిద్దాం. అపోస్తుల చర్యలు అనే గ్రంథం నుండి తిరుసభ ఏలా పుట్టి ఏలా పెంపచెందిందో తెలిసికోవచ్చు. ఇక్కడ ఆ చరిత్రను చూద్దాం.

1. ఆత్మ దిగిరాకముందు ఉన్న పరిస్థితి = అ,చ,1

క్రీస్తు ఉత్థానమయ్యాక గూడ శిష్యులు అతడు ఎందుకు చనిపోయాడో, ఎందుకు ఉత్థానమయ్యాడో అర్థం జేసికోలేదు. అతడు యూదులకు రాజకీయ స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాడనే వాళ్ళ భావం. కనుకనే ప్రభువు మోక్షారోహణానికి ముందుకూడ వాళ్ళ నీవు యిస్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరించవా అని అడిగారు - అ, చ.1,6 క్రీస్తు ఉత్థానానంతరం వాళ్ళ యెరూషలేములో ఓ యింటి విూదిగదిలో కూడి ప్రార్ధనం చేసికొంటూండేవాళ్లు. దేవదూత చెప్పినట్లుగా ఉత్తానక్రీస్తు స్వర్గంనుండి మల్లా తిరిగి వస్తాడనుకొంటూండేవాళ్లు - 1,11. అప్పటికింకా రొట్టె విరవడం (దివ్యసత్రసాదం) అనేది లేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడ వాళ్లకు స్పష్టంగా తెలియదు.

2. ఆత్మ దిగివచ్చాక పరిస్థితి - 1. S.2-5

ఆత్మ దిగివచ్చాక శిష్యుల్లో పెద్దమార్పు వచ్చింది. అంతకు ముందు వాళ్లు క్రీస్తు మళ్ళా తిరిగిరావడంతో మెస్సీయాకాలం ప్రారంభమౌతుంది అనుకొన్నారు. కాని ఇప్పడాకాలం ఆత్మదిగిరావడంతో ప్రారంభమైందని గ్రహించారు. వాళ్ళ క్రీస్తు తిరిగివచ్చి యిస్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరిస్తాడు అనుకొంటూంటే ఇప్పడు తలవని తలంపుగా ఆత్మ దిగివచ్చింది. పూర్వవేదంలో "శేషజనం" అనే ప్రజలు వున్నారు. వీళ్ల మెస్సీయా కోసం ఎదురు చూస్తుండేవాళ్లు, ఇప్పడు ప్రేషితులే ఈ శేషజనమయ్యారు. యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా ఆత్మ వీరిమిూదికి దిగివచ్చి వీరిని తన శక్తితో నింపింది - యోవేలు 2,2832. అచ. 2,17-18.

ఆత్మ దిగిరాగానే శిష్యులకు క్రీస్తుని అన్యులకు బోధించాలనే తపన పుట్టింది. ఈబోధ మొదట యెరూషలేములోనే యిప్రాయేలీయులకే జేయాలి - 2,41. యూదులుకాని అన్యజాతివారికి గూడ క్రీస్తుని బోధించాలనే తలంపు శిష్యులకు అప్పటికింకా లేదు. యూదులు మాత్రమే క్రీస్తు శిష్యులు ఔతారని వాళ్ళ ఆలోచన.

రోజురోజుకి శిష్యుల &ဝ% పెరుగుతూ వచ్చింది. యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సమాజం ఆదర్శ వంతమైన జీవితం గడిపింది. ఆ సమాజంలో మూడంశాలు గమనించదగ్గవి. 1. శిష్యులు క్రీస్తుని గూర్చి బోధిస్తూ అతని పేరుమిూదుగా అద్భుతాలు చేసేవాళ్లు, దీనివల్ల యూదులు రోజురోజుకీ అధికాధికంగా క్రైస్తవ మతంలోచేరుతూ వచ్చారు 2. ఆదిమ సమాజంలోని సభ్యులు ఉమ్మడి జీవితం గడిపారు. 3. భక్తులంతా కలసి రొట్టెవిరచి క్రీస్తుని ఆరాధించారు. ఈ యారాధనం భక్తుల యిండ్లల్లోను యెరూషలేము " దేవాలయంలోను కూడ జరిగేది - 2,42-47.

8. ఆదిమ సమాజంలో తగాదాలు, సైఫను పాత్ర - అ.చ.6-7

అ,చ. 6వ అధ్యాయం ఆదిమ క్రైస్తవ సమాజంలోని తగాదాలను వర్ణిస్తుంది. యూదుల్లో పాలస్తీనా యూదులు, అన్యదేశాల్లో స్థిరపడిన యూదులు అవి రెండు తెగలవాళ్ళ ఉండేవాళ్ళ భోజన సమయంలో మొదటి తెగవాళ్లు బాగాతిని రెండవ తెగవాళ్ళకు తక్కువగా పెట్టారు. కనుక రెండవ తెగవాళ్లు జగడమాడారు. పేత్రు ఈ సమస్యను చక్కదిద్దడానికి ఏడురు పరిచారకులను నియమించాడు. అందరికి సరిసమానంగా భోజనం వడ్డించడం వీరిలో బాధ్యత. వీరిలో ప్రముఖుడు సైఫను. ఇతడు భోజన పరిచారకుడు మాత్రమే కాక గొప్ప వాక్యపరిచారకుడుకూడ.

సైఫను బోధవల్ల అతనికి శత్రువులు తయారయ్యారు. యెరూషలేము దేవాలయమూ ధర్మశాస్త్రమూ ప్రజలను రక్షించవనీ, క్రీస్తుమాత్రమే జనులను రక్షిస్తాడనీ, ఇతడు బోధించాడు. అందుచే యూదులు ఇతన్ని చంపజూచారు. ఇతడు యూదులకూ క్రీస్తు భక్తులకూ ఇక పొత్తుకుదరదని కూడ సూచించాడు. అంతవరకు శిష్యులుకూడ యూదవర్గంగానే చలామణి ఔతూవచ్చారు. ఇప్పడు క్రీస్తు భక్తులూ యూదులూ వేరువేరు వర్గాలనే భావం ఏర్పడింది.

యూదులు సైఫనుని రాళ్ళతోకొట్టి చంపారు. క్రీస్తు భక్తులను కూడ హింసించడం మొదలుపెట్టారు. అందుచే ఈ భక్తులు యెరూషలేమునుండి అన్య ప్రాంతాలకు వలసపోయారు. కాని వాళ్లు తాము పోయినకాడల్లా క్రీస్తుని గూర్చి బోధించడం మొదలుపెట్టారు. ఈ విధంగా క్రైస్తవమతం యూదయా సమరయాల్లో చాలా ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది - 8,1-2.

4. అన్యజాతి ప్రజలుకూడ క్రైస్తవులు కావడం - అచ.10–11

వేదహింసవల్ల పారిపోయిన క్రైస్తవులు ఫినీష్యా సైప్రను అంటియోకయాల్లో వేదప్రచారం చేసారు. అంటియోకయాలో గ్రీకుప్రజలు కూడ క్రీస్తుని విశ్వసించారు. కనుక అన్యజాతివాళ్లు కూడ క్రైస్తవ మతంలో చేరే సమయం వచ్చింది. అంతవరకు క్రైస్తవులంతా యూదులు మాత్రమే. అన్యజాతులను తిరుసభలోకి రాబట్టడానికి ప్రభువు సౌలుని ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు. అతని కథ 9వ అధ్యాయంలో వుంది.

పదవ అధ్యాయం కొర్నేలి అనే రోమను సైన్యాధిపతి కుటుంబ సమేతంగా క్రైస్తవ మతంలో చేరిన ఉదంతాన్ని వర్ణిస్తుంది. మొదటిసారిగా క్రీస్తు శిష్యుడైన అన్యజాతివాడు ఇతడే. ఇతడు కైసరయ నివాసి. అంతవరకు క్రైస్తవులైన యూదులు మోషే ధర్మశాస్తాన్ని గూడపాటిస్తూ వచ్చారు. కానియిప్పడ అన్యజాతివాళ్ల ఈధర్మశాస్తాన్నిపాటింపవలసిన

అవసరం లేకుండానే క్రైస్తవులయ్యారు. ఐనా కొందరు యూద క్రైస్తవులు మాత్రం అన్యజాతివాళ్ళు కూడ ధర్మశాస్తాన్ని పాటించాలని వాదిస్తుండేవాళ్ళు

5. అంటియోకయ క్రైస్తవులు

అంటియోకయలో యూదులు మాత్రమేకాక అన్యజాతివాళ్లయిన గ్రీకులు కూడ క్రీస్తుని విశ్వసించారు – 11,19-21. ఈ యన్యజాతివాళ్ల సమస్యను పరిశీలించడానికి యెరూషలేము సమాజం బర్నబాను అంటియొకయకు పంపింది. అతడు ఆత్మ ప్రేరణం వల్లనే వీళ్ళ క్రైస్తవమతంలో చేరారని ధ్రువపరచాడు. ఇతడు తార్పు నుండి సౌలుని అంటియొకయకు తీసుకొని వచ్చాడు. ఈ యిద్దరూ ఆ నగరంలో ఒకయేడు వేదబోధ చేసారు. తర్వాత ఇద్దరూ ఇతర ప్రాంతాల్లోని అన్యజాతి వాళ్లకు బోధచేయడానికి అంటియొకయ నుండి పయనమైపోయారు - 13,1-3,

అంటియొకయ భక్తులనే మొట్టమొదటిసారిగా "క్రైస్తవులు" అని పిల్చారు - అ,చ. 11,26. అంతవరకు యూదులు అన్యజాతివాళ్ళ అనే రెండు వర్గాల ప్రజలున్నారు. ఇప్పడు క్రైస్తవులనే మూడవ వర్గం ప్రజ ఏర్పడింది. ఈ మూడవ వర్గంలో యూదులూ అన్యజాతివాళూ కూడ సభ్యులు. దీనివల్ల యూదులు మాత్రమేకాక అన్యజాతివాళ్ళకూడ తిరుసభలో చేరతారనే అంశం స్పష్టమైంది. కాని ఈ విషయం యెరూషలేములో కాక అంటియోకయలో విశదమైంది. అప్పటినుండి తిరుసభ అన్ని జాతులకు చెందింది, విశ్వవ్యాప్తమైంది అనే భావం ప్రచారంలోకి వచ్చింది.

6. పౌలు పాత్ర

తిరుసభ విశ్వవ్యాప్తమైంది అనే భావాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చినవాడు పౌలు, యూదులు తన బోధను నిరాకరింపగా ఇతడు అన్యజాతులకు బోధ చేయడం మొదట పెట్టాడు - అ.చ.46-47. క్రీస్తుని గూర్చిన బోధ మొదట యెరూషలేములో ప్రారంభమైంది. తర్వాత యూదియా సమరయాల్లో జరిగింది. అటుతర్వాత భూదిగంతాల వరకు వ్యాపించింది - 1,8. ఈలా నేల నాల్లచెరుగుల వరకు క్రీస్తుని బోధించినవాడు పౌలే. నేడు మనం యూరప్ అని పిల్చే ప్రాంతంలో మొదట వేదబోధ చేసినవాడు ఇతడే.

యూదయా క్రైస్తవులు మొదట యూదులంతా క్రైస్తవ మతంలో చేరతారనీ, తమ జీవిత కాలంలోనే ప్రభువు రెండవసారి వేంచేసి వస్తాడనీ భావించారు. కాని ఈ రెండుకార్యాలు నెరవేరలేదు. కనుక పౌలు ఈ రెండు భావాలను గూర్చి లోతుగా ఆలోచించాడు. అతడు, క్రీస్తు తన జీవితకాలంలో రాడనీ, యూదులంతా క్రీస్తుని అంగీకరించరనీ గ్రహించాడు. యూదులూ అన్యజాతి ప్రజలూ కూడిందే తిరుసభ అని

అర్థం చేసికొన్నాడు. ఇంకా, తిరుసభే దైవరాజ్యానికి మార్గమని కూడ తెలిసికొన్నాడు. కనుక తిరుసభను నిరాకరించడమంటే దైవరాజ్యాన్ని నిరాకరించడమేనని నమ్మాడు. యూదులూ అన్యజాతివాళ్ళూ తిరుసభలో చేరిందాకా దైవరాజ్యం పరిపూర్ణంగా రాదని విశ్వసించాడు. యూదులు క్రీస్తుని నిరాకరించడంవల్లనే తాను అన్యజాతుల వద్దకు వెళ్ళగలిగానని కూడ అర్థంజేసికొన్నాడు. పౌలు పరిచర్యవల్ల క్రైస్తవమతం ఒక్క యూదసమాజానికీ యెరూషలేము దేవాలయానికీ మాత్రమే పరిమితమై వుండక విశ్వవ్యాప్తమైన మతంగా తయారైంది.
ఇంతవరకు మనం చూచిన చరిత్రసారాంశమిది. ఆత్మ దిగిరాకముందు శిష్యులకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు, వాళ్లు మోక్షారోహణం చేసిన క్రీస్తు రెండవసారి వేంచేసి వస్తాడన్న నమ్మకంతోనే వున్నారు. ఆత్మదిగివచ్చాక వాళ్లు మెస్సీయా కాలం వచ్చిందనీ తాము క్రీస్తునిగూర్చి బోధించాలనీ గ్రహించారు. ఆ మీదట ఆత్మే తిరుసభను నడిపిస్తూ వచ్చింది. శిష్యులు మొదట యూదులు మాత్రమే క్రైస్తవ మతంలో చేరతారనుకొన్నారు. క్రమేణ అన్యజాతివాళ్ళుకూడ ఆ మతంలో చేరడం చూచారు. అంటియోకయలో మొదటిసారిగా తిరుసభ అన్యజాతులకుకూడ చెందింది అనే భావం గుర్తింపులోకి వచ్చింది. తిరుసభను యూదుల పరిధిలోనుండి తప్పించి విశ్వవ్యాప్తం చేసినవాడు పౌలు.

ప్రార్ధనా భావాలు

1. దేవుడు నిద్రిస్తూన్న ఆదాము ప్రక్కనుండి ఏవను పుట్టించాడు - ఆది 2,21-22. అలాగే సిలువపై నిద్రిస్తూన్న రెండవ ఆదామైన క్రీస్తు ప్రక్కనుండి తిరుసభ పుట్టుకవచ్చింది. క్రీస్తే తిరుసభ స్థాపకుడు.
2. రెండవ శతాబ్దంలో జీవించిన వేదశాస్త్రి ఇరెనేయస్ అపోస్తుల వారసుల జాబితాను తయారుచేసాడు. రోముకి మొదటి పీఠాధిపతి పేత్రు. లీనస్, అనంక్లిటస్, క్లెమెంట్, ఎవరెస్టస్, అలెగ్జాండర్, సిస్టస్, టెలెస్ఫోరస్, హిగీనస్, పయస్, అనిసీటస్, సోటెర్, ఎలుతేరస్ అనేవాళ్లు క్రమంగా అతనికి వారసులయ్యారు. కనుక ఇప్పటి మన తిరుసభ పేత్రు మొదలైన ఆదిమ ప్రేషితులతో సంబంధం కలది. ఈ సంబంధం అన్ని క్రైస్తవ శాఖలకూ లేదు.

3. దైవరాజ్యమూ తిరుసభా

పూర్వాధ్యాయంలో ఆదిమ శిష్యబృందం ఆత్మవలన ప్రబోధితమై తిరుసభగా ఏర్పడిన తీరును చూచాం. కాని ఈ తిరుసభకీ మనం గ్రంథారంభంలోనే పేర్కొన్న దైవరాజ్యానికీ సంబంధం ఏమిటి? ప్రపంచానికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించేది

దైవరాజ్యంగాని తిరుసభకాదు. మరి తిరుసభ దేనికి? ఈ యధ్యాయంలో తిరుసభకీ దైవరాజ్యానికీగల సంబంధాన్ని తెలుసుకొందాం.
1. పూర్వ వేదశాస్తుల తిరుసభా దైవరాజ్యం ఒకటేనని చెప్పారు. చాలమంది పోపుగార్లుకూడ ఈ యభిప్రాయాన్నే వ్యక్తం చేసారు. కాని యిప్పడు రెండవ వాటికన్ సభా, ప్రస్తుత వేదశాస్తులూ ఈ యభిప్రాయాన్ని అంగీకరించరు. వీళ్ళ దృష్టిలో ఈ రెండిటికీ సామ్యమూ తేడా రెండూ వున్నాయి. తిరుసభ దైవరాజ్యం కొరకు వుంది. అది ఆ రాజ్యాన్ని ప్రజలకు తెలియజేస్తుంది, బోధిస్తుంది. తన సేవలద్వారా ఆ రాజ్యం ఈ లోకంలో నెలకొనేలా చేస్తుంది. తిరుసభ పూవైతే దైవరాజ్యం దానినుండి పుట్టిన ఫలం.
 వరాజ్యాన్ని క్రీస్తే నెలకొల్పాడు. తిరుసభ ఆత్మ ప్రేరణంతో ఇప్పడా దైవరాజ్యాన్ని ప్రజలకు ఎరుకపరుస్తుంది.
నూతవేద బోధల ప్రకారం తిరుసభ ఇప్పడు వున్నది. దైవరాజ్యం లోకాంతంలో వచ్చేది. తిరుసభ ఈ లోకంలో యాత్రచేసేది, తాత్కాలికమైంది. దైవరాజ్యం ఆ యాత్ర ముగిసాక శాశ్వతంగా నెలకొనేది. మొదటిదానిలో పాపలూ పుణ్యాత్ములూకూడ వుంటారు. రెండవదానిలో పుణ్యాత్ములు మాత్రమే వుంటారు.
తిరుసభా దైవరాజ్యమూ ఒకటికాదు. అవి రెండూ ఒకదానికొకటి విరోధులూ కావు. వాటి రెండిటికీ పరస్పర సంబంధం వుంది. తిరుసభ దైవరాజ్యాన్ని బోధించి అది త్వరలో రూపొందేలా చేస్తుంది.
“యో రాజ్యం వచ్చునుగాక” అన్నపుడు దైవరాజ్యం రావాలని కోరుకొంటాం. ఈ దైవరాజ్యమే నూత్నవేదంలో వివాహ విందుగా, భూమిలో దొరికిన నిధిగా, ఆణిముత్యంగా, పొంగినపిండిగా, ఆవచెట్టుగా వర్ణింపబడింది. తిరుసభ తర్వాత దైవరాజ్యం వస్తుంది. తిరుసభలో సిలువావుంది, వత్తానమూ వుంది. దైవరాజ్యంలో ఉత్తానమూ మహిమా మాత్రమే వుంటాయి.
 తిరుసభ తనకొరకు తాను లేదు. దైవరాజ్యాన్ని స్థాపించడం కొరకు వుంది. కనుక అది నిరంతరమూ దైవరాజ్యాన్ని బోధిస్తుంది. ఆ రాజ్యానికి పరిచర్యలు చేస్తుంది.
తిరుసభ దైవరాజ్యాన్ని సూచిస్తుంది. ప్రకటిస్తుంది. ఎరుకపరుస్తుంది. తన బోధ, సేవలు, కరుణకార్యాలు, ప్రేమ మొదలైనవాటిద్వారా దైవరాజ్యాన్ని వ్యాప్తిజేస్తుంది. దైవరాజ్యవ్యాప్తికి తిరుసభ సాధనం.
ఇప్పడు తిరుసభ నెలకొనివున్న తావులోనే దైవరాజ్యంకూడ ఎక్కవగా నెలకొనివుంది. కాని దైవరాజ్యం లోకాంతంలోగాని పరిపూర్ణంగాదు. ఐనా తిరుసభలేందే దైవరాజ్యం లేదు. ఇదే తిరుసభ గొప్పతనం.
 2. తిరుసభకంటె దైవరాజ్యం విస్తృతమైంది. తిరుసభ అంటే క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ సమాజం మాత్రమే. దైవరాజ్యమంటే

ఇతరమతాల్లో వున్నా క్రీస్తు వరప్రసాదం సోకిన సజ్జనుల బృందంకూడ ఇప్పడు ఇవిరెండూ లోకంలో నెలకొని వున్నాయి. తిరుసభ సంపూర్ణంగా దైవరాజ్యంలో ఇమిడి వుంది. కాని దైవరాజ్యం తిరుసభలో ఇమడదు. అవిరెండూ వేరువేరు సంస్థలు.
నరులంతా సువిశేష విలువల ప్రకారం జీవించాలి. ఈ విలువలు తిరుసభలో ఎక్కువగా వుంటాయి. కాని యివి అన్యమతాల్లోగూడ వుండవచ్చు. ఇవి వున్నచోటల్లా దైవరాజ్యం కూడ వుంటుంది.
మనం చేరవలసిన చివరి గమ్యం తిరుసభ కాదు, దైవరాజ్యం. తిరుసభ తన బోధలద్వారా సేవలద్వారా సాక్ష్యంద్వారా మనలను దైవరాజ్యంలోనికి చేరుస్తుంది. అసలు తిరుసభ మనలను దైవరాజ్యానికి సిద్ధం చేయడానికే వుంది.
3. లోకాంతంలో తిరుసభ ఏమౌతుంది? లోకాంతంలో దైవరాజ్యం వచ్చినపుడు తిరుసభ అంతంకాదు. తానూ ఆ దైవరాజ్యంలో లీనమైపోతుంది. నూత్నవేదం తిరుసభ అంతాన్ని ఓ వివాహంగా భావిస్తుంది. లోకాంతంలో క్రీస్తు తిరుసభ అనే వధువుని పరిణయమాడతాడు - 2కొ 11,2. అనగా తిరుసభ క్రీస్తుతోను అతని దైవరాజ్యంతోను ఐక్యమైపోతుందని భావం, దర్శనగ్రంథం తిరుసభను క్రీస్తుతోడి వివాహానికి సిద్ధమైన వధువునుగా వర్ణిస్తుంది - 19,7.212. ఈ వధువుకి పరలోకపు యెరూషలేమని పేరు. ఇదే పరిపూర్ణమైన తిరుసభ. ఇదే దైవరాజ్యంకూడ.
ఈ విధంగా ఇహలోక జీవితంలో తిరుసభ దైవరాజ్యానికి సాధనంగా వుంటుంది. పరలోక జీవితంలో తానూ ఆ రాజ్యంలో కలసిపోతుంది.

ప్రార్థనా భావాలు

1. బైబులు తిరుసభకు చాల వుపమానాలు వాడుతుంది. అది క్రీస్తు అనే కాపరి • మేపే మంద - యోహా 10,11. దేవుడు నాటిన ద్రాక్షతోట - మత్త 21,33– 43. దేవుడు నిర్మించిన భవనం - 1కొ 8,9. ఈ భవనంలోనే మనం వసిస్తాం. ఇంకా అది గొర్రెపిల్ల వధువు -దరు 19,7, 21,2. మనకందరికి తల్లి, ఈలాంటి తిరుసభపట్ల మనకెంతో భక్తి వుండాలి,
2. ఇప్పుడు మనం ఆరాధనకు దేవాలయానికి వెత్తాం. కాని తొలిరెండు శతాబ్దాల్లోను రాతిగుళ్ళు లేవు. క్రైస్తవులు కొందరు భక్తుల యిండ్లల్లోనే ప్రోగై ఆరాధన జరుపుకొనేవాళ్లు, ఆయిందే తొలినాటి దేవాలయాలూ తిరుసభలూ కూడాను. ఈ గృహ దేవాలయాల పద్ధతిని నేడు మల్లా పునరుద్ధరించాలి. క్రైస్తవులు ఆయా భక్తుల యిండ్లల్లో ప్రోగై ప్రార్థనలు జరుపుకొంటే క్రైస్తవ సమాజాలు బలపడతాయి. తిరుసభలో ఐక్యత పెరుగుతుంది. దైవసాన్నిధ్యం బలంగా నెలకొంటుంది.మౌలికసంఘాలు వృద్ధిలోకి వస్తాయి.

4. తిరుసభ ఎల్లరికీ రక్షణసాధనం

ముందటి అధ్యాయంలో తిరుసభ దైవరాజ్యానికీ సాధనంగా వుంటుందని చెప్పాం. రెండవ వాటికన్ సభ అది యెల్లరికీ రక్షణసాధనమని చెప్తుంది. ఈ యధ్యాయంలో అది యెల్లరికీ రక్షణ సాధనమం ఏలా ఔతుందో పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

అందరూ రక్షణం పొందాలనే దేవుని కోరిక -1తిమో 2,4. అతడు సమస్తాన్ని క్రీస్తుకి పోలికగానే సృజించాడు. కనుక అందరూ క్రీస్తుని చేరాలనే దేవుని కోరిక - కొలో 1,15-16. క్రీస్తు పట్టకముందే, యిప్రాయేలీయులు పుట్టకముందే, దేవుడు మానవ రక్షణాన్ని ప్రారంభించాడు. కనుక తిరుసభకు వెలుపలా, తిరుసభ పుట్టక ముందుకూడ రక్షణం వుంది. ఐనా ఈ రక్షణాన్ని గూర్చిన దివ్యశ్రుతి మాత్రం ఒకదేశంలో, ఒకకాలంలో, ఒకజాతితో ప్రారంభమైంది. అది యిస్రాయేలు జాతి. ఆ ప్రజనే దేవుడు తన దాన్నిగా యెన్నుకొన్నాడు. ఆ జాతిలోనే క్రీస్తు పుట్టాడు. దేవుడు అతన్ని రక్షణ కర్తనుగా నియమించాడు. ఆ క్రీస్తు రక్షణ సాధనంగా తిరుసభను ఏర్పాటు చేసాడు. ఐనా ప్రాచీనకాలంలోగాని ఆధునికకాలంలోగాని ఈ తిరుసభను గూర్చి కొద్దిమందికే తెలుసు. మరి అది యెల్లరికి రక్షణ సాధనం ఏలా ఔతుంది?

తిరుసభ అందరికి రక్షణ సాధనం అన్నాం. మొదట "రక్షణం" అంటే యేమిటో చూద్దాం. ఇక్కడమనం పేర్కొనే రక్షణం కేవలం పాపపరిహారం మాత్రమేకాదు. రక్షణమంటే ఇహపరాల్లోను శాంతి, ఆనందం, సౌభాగ్యం అనుభవించడం. ప్రభువు తానొచ్చింది జీవవిరాయడానికీ ఆజీవాన్ని సమృద్ధిగా ఈయడానికీ అన్నాడు - యోహా 10,10. కనుక ఇహపరాల్లోను క్రీస్తునుండి శాశ్వత జీవాన్ని పొందడమే రక్షణం.

ఇక తిరుసభ “రక్షణ సాధనం" అంటే యేమిటో చూద్దాం. తిరుసభ అందరికీ రక్షణ చిహ్నం లేక వరప్రసాదచిహ్నం ఔతుంది. అనగా అది అందరి రక్షణానికి గురుతుగాను సాధనంగానూ వుంటుంది. అంటే అందరు దానినుండే రక్షణం పొందుతారని భావం.

1. క్రీస్తే మొట్టమొదటి రక్షణసాధనం

దేవుడే క్రీస్తుని రక్షణ కర్తనుగా నియమించాడు. అతడు తండ్రికి ప్రతినిధి. తండ్రి ప్రేమకు గురుతు. క్రీస్తుని చూస్తే తండ్రిని చూచినట్లే. అనగా దేవుడు అతనిద్వారా మనకు దర్శనమిస్తాడు - యోహా 14,9. ఈ క్రీస్తు దేవుడూ నరుడూ కూడ. కనుక అతడు దేవునికీ నరునికీ మధ్య మధ్యవర్తి అయ్యాడు. తండ్రి అతనిద్వారా అన్నిటినీ తనతో రాజీ పరచుకొన్నాడు - కొలో 1,20. క్రీస్తు మొదటి రక్షణ సాధనం కావడం వల్లనే అతని నుండి దేవద్రవ్యానుమానాలు తిరుసభ మొదలైన ఇతర రక్షణ సాధనాలు పట్టాయి. నేడు మనం వీటిల్లో క్రీస్తుని కలసికొని అతడు అందించే రక్షణాన్ని పొందుతున్నాం.

2. తిరుసభ ఎల్లరికీ రక్షణ సాధనం

తిరుసభ ఎల్లరికీ రక్షణ సాధనం ఎందుకౌతుందంటే, దానిలో మనం ఉత్తాన క్రీస్తునీ అతని ఆత్మనూ కలసికొని రక్షణాన్ని స్వీకరిస్తాం. దానిలో క్రీస్తు సాన్నిధ్యం సంపూర్ణంగా వుంటుంది. ఆ సాన్నిధ్యం మనవిూద సోకి మనకు వరప్రసాదాన్ని దయచేస్తుంది. మనలను దైవ రాజ్యానికి సిద్ధం చేస్తుంది.

తిరుసభ నానా రక్షణ సాధనాల్లో ఒకటి మాత్రమే కాదు. ఏకైక రక్షణ సాధనం. ఎందుకంటే ఏకైక మధ్యవర్తియైన క్రీస్తు దానిద్వారా మాత్రమే రక్షణ కార్యాన్ని నిర్వహిస్తాడు - 1తిమొు 2,5. ఎల్లరూ దానినుండి వరప్రసాదాన్ని పొందవలసిందే. ఇతర మతాల్లో కూడ క్రీస్తునుండీ, అతని తిరుసభనుండీ వచ్చే వరప్రసాదమే రక్షణాన్నిస్తుంది.

తిరుసభ తాను క్రీస్తునుండి పొందిన రక్షణాన్నే ఇతరులకు అందిస్తుంది. కనుక అది పవిత్రంగా జీవిస్తూ క్రీస్తు వరప్రసాదాన్ని పరిపూర్ణంగా పొందుతుండాలి. అందుచే అది నిరంతరమూ తన పాపాలకు తాను పశ్చాత్తాప పడుతుండాలి. తన కల్మషాలను తాను అధికాధికంగా కడిగివేసుకొంటుండాలి. అప్పడేగాని క్రీస్తు ఆత్మ దానిలో బలంగా పనిచేయదు.

నరులంతా తన సొంత ప్రజలూ, పవిత్రాత్మ వసించే దేవాలయమూ, క్రీస్తు దేహమూ, కావాలనే తండ్రి కోరిక. క్రీస్తు నరులందరికీ శిరస్సు. నరులు అతని దేహం. ఆ శిరస్పూ దేహమూ రెండూ కలసి తన్ను ఆరాధించాలనే తండ్రి చిత్తం. తిరుసభ ఈ దైవచిత్తాన్ని నెరవేర్చడానికి వుంది. అందుకే అది అందరికీ రక్షణ సాధనమౌతుంది. ఎల్లరూ దాని ద్వారానే దైవరాజ్యంలో చేరాలి.

తిరుసభ ఈలోకంలో చిన్నమందే. ఐనా ఐక్యత ప్రేమ విశ్వాసాలనే పుణ్యాల ద్వారా అది నరజాతి కంతటికీ రక్షణ సాధనమౌతుంది. అది లోకానికి వెలుగూ, ఉప్పగా వుంటుంది - మత్త 5,13-14.

3. అన్యమతాల స్థానం

కాని తిరుసభ ఏకైక రక్షణ సాధనమైతే, అన్యమతాల స్థానం ఏమిటి? అవి నరులకు రక్షణ సాధనాలు కావా? రెండవ వాటికన్ సభ అన్యమతాల్లో కూడ పవిత్రత, న్యాయం, సత్యం, మంచితనం అనే విలువలున్నాయని రూఢిగా ప్రకటించింది. దేవుడు అందరి రక్షణాన్నీ కోరేవాడు కనుక అతని ఆత్మ ఒక్క తిరుసభలోనే కాక దానికి వెలుపల కూడ పనిజేస్తూ వచ్చింది.

క్రైస్తవేతరులకు కూడ రక్షణం వుంటుందని ఈ సభ స్పష్టంగా బోధించింది. ఈ బోధలో నాల్గంశాలున్నాయి. 1. నరులు పాపాంలో పడిపోయాక గూడ దేవుడు వారిని చేయి విడువడు. వారి రక్షణకు అవసరమైన వరప్రసాదాన్ని వారికి ఇస్తూనే వుంటాడు. 2. ఆ ప్రభువు మనకు తెలియని పద్ధతిలో క్రీస్తు మరణోత్తానాల ప్రతిఫలమైన రక్షణం అన్యమతథస్థుల విూదకూడ సోకేలా చేస్తాడు. క్రీస్తు అందరు సరుల కొరకు చనిపోయాడుకదా! కనుక మనకు తెలియని రీతిలో అతని మరణోత్తానాలు అందరిమిూద సోకుతాయి. 3. దేవుని రక్షణం దేవద్రవ్యానుమానాలకూ తిరుసభకూ మాత్రమే కట్టుపడి వుండదు. వీటి ప్రమేయం లేకుండా గూడ అది పనిచేయవచ్చు. క్రీస్తు రాకముందే, అతడు ఉత్తానం కాకముందే, పవిత్రాత్మలోకంలోని నరులమిూద తన ప్రభావాన్నిచూపుతూ వచ్చింది. 4 తమ అంతరాత్మ ప్రకారమూ దేవుని చిత్త ప్రకారమూ జీవించేవాళ్లు ఎవరైనా ఎక్కడైనా రక్షణాన్ని పొందుతారు. అంతరాత్మ నరుని హృదయంలోని పవిత్రదేవాలయం. దానిలో నరులకు దేవుని స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఆదేశం ప్రకారం జీవించేవాళ్లకు తప్పక రక్షణం లభిస్తుంది.

ఈ సూత్రాల ప్రకారం అన్యమతాల్లో కూడ సత్యమూ వరప్రసాదమూ వుంటాయి. కనుక అన్యమతాల నుండి కూడ రక్షణం లభిస్తుంది. అనగా తిరుసభకు వెలుపలకూడ రక్షణం వుంది. మరి అప్పడు తిరుసభ ఏకైక రక్షణ సాధనం అనడంలో భావం ఏమిటి?

రెండవ శతాబ్దంలో జీవించిన ఓరిజిన్ అనే వేదశాస్త్రి తిరుసభకు వెలుపల రక్షణం లేదు" అని చెప్పాడు. ఐదవ శతాబ్దంలో సిప్రియన్ భక్తుడు ఈ సూత్రాన్ని బాగా ప్రచారం చేసాడు. అతని దృష్టిలో తిరుసభ నోవా వోడలాంటిది. ఆ వోడను ఎక్కని వాల్లెవరూ రక్షణం పొందరు. శతాబ్దాల పొడుగునా తిరుసభకూడ ఈ సూత్రాన్ని తన బోధల్లో అధికార పూర్వకంగా పునరుద్దాటిస్తూ వచ్చింది.

ఇంతవరకు మనం చూచినదాన్నిబట్టి తిరుసభకు వెలుపలకూడ రక్షణం వుంటుందని ఒక సూత్రం చెప్తుంది. తిరుసభకు వెలుపల రక్షణం లేదని ఇంకో సూత్రం చెప్తుంది. ఈ రెండు సూత్రాలను సమన్వయపరచడం ఏలా?

ఇక్కడ రెండంశాలను గమనించాలి. 1. తిరుసభకు వెలుపల రక్షణం లేదు అంటే భావం ఇది క్రీస్తే "మిరు వెళ్లి అందరిని నా శిష్యులను చేయండి. వారికి నా పేరిట జ్ఞానస్నానం ఈయండి" అని ఆదేశించాడు - మత్త 28,19. దీన్నిబట్టి అందరూ తిరుసభలో చేరాలని విశదమౌతుంది. కనుక ఎవరైనా సరే తిరుసభను దేవుడే ఏర్పాటు చేసాడని తెలసికూడ దానిలో చేరకపోతే వారికి రక్షణంలేదు. కాని తెలియక తిరుసభలో చేరకపోతే వారికి రక్షణం వుండవచ్చు. 2. రక్షణం పొందాలంటే నరులు వస్తుతః తిరుసభలో చేరి వండనక్కరలేదు. హృదయంలోని కోరికద్వారా దానికి చెందివుంటే చాలు. ఈ కోరిక స్పష్టంగా వుండనక్కరలేదు. అస్పష్టంగా వున్నాచాలు. అనగా నరునికి తాను దైవచిత్తప్రకారం జీవించాలనే కోరిక వుంటే చాలు రక్షణం లభిస్తుంది. అందరికీ తిరుసభలో చేరే అవకాశం లేకపోవచ్చుకదా!

ఫలితార్థమేమిటంటే, తిరుసభ ఏకైక రక్షణ సాధనమని తెలిసికొన్నవాళ్లకి అది వొక్కటే రక్షణ సాధనం. వాళ్లకు అన్యమతాల ద్వారా రక్షణం లభించదు. కాని అలా తెలియనివాళ్ళకు అన్యమతాల ద్వారా గూడ రక్షణం లభిస్తుంది. ఐనా ఈ రక్షణం క్రీస్తునుండీ తిరుసభనుండీ వచ్చిందే.

ఇక్కడ "తెలిసికొన్నవాళ్ళకు" అంటే కేవలం బుద్ధిశక్తితో తెలిసికోవడం మాత్రమే కాదు. నరునికి తిరుసభను గూర్చి క్షుణ్ణంగా తెలిసికొనే అవకాశమూ వండాలి. దానిలో చేరే అవకాశమూ వుండాలి. మనదేశం, మన పూర్వుల మతం అనే దురభిమానాలు అడ్డురాకుండా వుండాలి. బంధుమిత్రులు మతం మార్పిడిని అంగీకరించాలి. ఈలాంటి అవకాశాలన్నీ వున్నవారికి తిరుసభ ఒక్కటే రక్షణ సాధనం ఔతుంది. ఇవిలేనివారికి ఇతర మతాలు కూడ రక్షణ సాధనాలు కావచ్చు. ఈలా అన్యమతాల ద్వారా రక్షణను పొందే సజ్జనులను నేటి వేదశాస్తులు "క్రైస్తవులనే పేరులేని క్రైస్తవులు" అని పేర్కొంటున్నారు, అనగా వీళ్లు వస్తుతః క్రైస్తవులు కాకపోయినా నిజజీవితంలో క్రైస్తవులుగా జీవించేవాళ్లు.

ఇప్పడు మనం "తిరుసభకు వెలుపల రక్షణం లేదు" అంటే ఈ తిరుసభను క్యాతలిక్ తిరుసభనుగా మాత్రమే అర్థం చేసికోగూడదు. క్రీస్తు మరణోత్థానాలు సోకినవారి బృందంగా అర్థం చేసికోవాలి. అప్పడు "తిరుసభ వెలుపల రక్షణం లేదు" అన్నా"తిరుసభ ఎల్లరికి రక్షణ సాధనం" అన్నా భావం ఒకటే ఔతుంది. క్రీస్తు మరణోత్తానాలు నరులందరిమిదా సోకుతాయి. కనుక ఈ విశాలార్థంలో అందరికీ రక్షణం లభించవచ్చు. అప్పడు క్రీస్తు మరణోత్తానాల ఫలితమైన రక్షణాన్ని బుద్ధిపూర్వకంగా నిరాకరించిన వాళ్లు మాత్రమే రక్షణను కోల్పోతారు.

తిరుసభ తన బోధద్వారా, సేవద్వారా, పవిత్రతద్వారా అందరికీ తన్నుతాను ఎరుకపరచుకోవాలి. అప్పడు అందరూ దానిలో చేరి పరిపూర్ణంగా రక్షణను పొందే అవకాశం లభిస్తుంది. తిరుసభ ఉత్సాహంతో సకలజాతి జనులకూ క్రీస్తుని బోధించాలి. ఈ యన్యజాతుల మతాల్లోని మంచి సూత్రాలను తానూ గ్రహించాలి. సత్యమంతా తిరుసభలోనే లేదు. ఇతర మతాల్లో కూడ వుంది. ఇంకా, తిరుసభ ప్రపంచంలోని నానా జాతుల్లోను వారి సంస్కృతుల్లోను వేరు బాతుకోవాలి. ఈ దేశ క్రైస్తవులు ఈ దేశ సంస్కృతిని ఆదరించాలి అనడానికి ఇది ముఖ్యకారణం. పైగా తిరుసభ అన్యమతాలతో సంప్రతింపులు ప్రారంభించి వాటిలోని సత్యాలను గ్రహించడానికి సిద్ధంగా వుండాలి. పెక్కు మతాలతో కూడిన మనదేశంలో ఈ సూత్రాల ప్రాముఖ్యం అంతాయింతా కాదు.

ప్రార్థనా భావాలు

1. ప్రాచీన వేదశాస్తులు తిరుసభను నోవా నిర్మించిన ఓడతో పోల్చారు - ఆది 8. ఆ వోడ నెక్కిన వాళ్ళంతా బ్రతికారు. తతిమ్మా వాళ్ళంతా జలప్రళయంవల్ల నాశమయ్యారు. అదే విధంగా తిరుసభలో చేరిన వాళ్ళకు రక్షణం వుంటుంది. తతిమ్మా వాళ్లు నాశమైపోతారు.

2. క్రీస్తు సేవకుడు - మార్కు 10,45. అతడు స్థాపించిన తిరుసభ కూడ సేవకురాలు కాని యజమానురాలు కాదు. తిరుసభలో అధికారమూ నాయకత్వమూ వున్నాయి. కాని ఇవి రెండూ సేవలు చేయడానికే గాని పెత్తనం చలాయించడానికి కాదు. బిషప్పలూ గురువులూ కన్యలూ ప్రధానంగా సేవలు చేయడానికే వున్నారు. తిరుసభలో అందరూ అందరికీ సేవలు చేయాలి. సేవక తిరుసభ ప్రజలను మెప్పిస్తుంది, ఆకర్షిస్తుంది. మదర్ తెరీసా లాంటి మాన్యులు ఈ రంగంలో మనకు ఆదర్శంగా వుంటారు.

5. తిరుసభ ప్రేషిత సేవ

క్రీస్తు ప్రధానంగా ప్రేషితుడు (పంపబడినవాడు). అతడు నెలకొల్పిన తిరుసభకూడ ప్రేషిత సమాజం. క్రీస్తు ప్రేషిత సేవను కొనసాగింపమని ఆత్మ నిరంతరమూ తిరుసభను ప్రేరేపిస్తూంటుంది. ఈ యధ్యాయంలో తిరుసభ ప్రేషితసేవను పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు చూద్దాం.

1. క్రీస్తే తిరుసభను పంపుతాడు

క్రీస్తు ప్రేషితసేవను రకరకాలుగా వర్ణించవచ్చు. అతడు దైవరాజ్యాన్ని నెలకొల్పేవాడు. నరులను దేవునితో రాజీపరచేవాడు. పేదలకు సువార్తను బోధించేవాడు. పాపులను శిక్షించడానికిగాక రక్షించడానికి వచ్చినవాడు. సేవలు చేయించుకోవడానికీ కాక చేయడానికి వచ్చినవాడు. తిరుసభకూడ క్రీస్తులాగే రకరకాల ప్రేషిత సేవలకు పూనుకొంటుంది. అది క్రీస్తుని నేడు మన మధ్యలో కొనసాగించేది. తండ్రి క్రీస్తుని దైవరాజ్యాన్ని బోధించడానికి పంపాడు. క్రీస్తు కూడా తన తరపున తాను తిరుసభను దైవరాజ్యబోధకు పంపుతాడు. కనుకనే అతడు శిష్యులతో విూరు లోకం నలుమూలలకు పోయి నరులందరికి సువిశేషాన్ని బోధించండి అని చెప్పాడు - మార్కు 16,15. మిరు పోయి ఎల్లరిని నా శిష్యులనుగా జేయండి. నా పేరిట వారికి జ్ఞానస్నానమీయండి అన్నాడు - మత్త 28,19. తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను అని పల్కాడు - యోహా 20,21. ఈ శిష్యులే ఆదిమ తిరుసభ.

ఇంకా, తండ్రి తనకిచ్చిన అధికారాన్ని క్రీస్తు తిరుసభకిచ్చాడు. కనుకనే అతడు శిష్యులతో మీ మాటలు వినేవాడు నా మాటలు వింటాడు. మీ పలుకులు విననివాడు నా పలుకులు వినడు అని పల్కాడు - లూకా 10,16. నేడు తిరుసభ ముఖ్యమైన పని క్రీస్తు ప్రేషిత సేవను కొనసాగించడమే.

క్రీస్తు ప్రేషిత కార్యాన్ని కొనసాగించే తిరుసభ అతని రక్షణాన్ని అందరికీ అందిస్తుంది. దైవరాజ్యాన్ని ఎల్లెడల నెలకొల్పుతుంది. సువార్త వెలుగును అంతట ప్రసరింపజేసి నరులందరిని, జాతులన్నిటిని, ఏకకుటుంబంగా ఐక్యంజేస్తుంది. ఆర్థిక సాంఘిక విషయాలతో గూడిన లౌకిక రంగాన్నిగూడ సువిశేష ప్రకాశంతో నింపి పునీతం జేస్తుంది.

2. తిరుసభ క్రీస్తు మూడు లక్షణాల్లో పాలుపొందుతుంది

క్రీస్తులాగే తిరుసభకూడ మూడు రంగాల్లో ప్రేషిత సేవ చేస్తుంది. అతడు రాజు, ప్రవక్త, యాజకుడు.

రాజుగా క్రీస్తు కాపరి, నాయకుడు. అతడు ప్రజలను నడిపించాడు. వారి మేలుకోరి వారికి సేవలు చేసాడు. క్రీస్తు కార్యాన్ని కొనసాగించే తిరుసభ కూడ ప్రజలకు నాయకత్వం వహించి వారికి పరిచర్యలు చేస్తుంది, విద్యవైద్యం ఆర్థిక సాంఘికాది అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన నానారంగాల్లో తిరుసభ అందించే సేవలు మనం రోజూ చూస్తూనే వున్నాం.

ప్రవక్తగా క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించాడు. తిరుసభకూడ నేడు ఈ బోధన సేవను కొనసాగిస్తుంది. పూజలో జరిగే సువిశేషబోధ, జ్ఞానోపదేశ సేవ, దైవశాస్త్రబోధ, మతగ్రంథ ప్రచురణం మొదలైన నానా రూపాల్లో నేడు బోధన సేవ కొనసాగుతూంది.

యాజకుడుగా క్రీస్తు సిలువపై ఆత్మార్పణం చేసికొని ప్రజలను పవిత్ర పరచాడు. తిరుసభ ముఖ్యంగా దేవ ద్రవ్యానుమానాలద్వారా ఈ పవిత్రీకరణాన్ని కొనసాగిస్తుంది. విశేషంగా క్రీస్తు సిలువబలిని మన మధ్య కొనసాగించడం ద్వారా ప్రజలను పునీతులను చేస్తుంది. క్రీస్తే మొదటి సువిశేష బోధకుడు. క్రీస్తు ఆజ్ఞద్వారా ఆ పరిచర్యను నేడు తిరుసభ కొనసాగిస్తుంది. ఈ సేవలో పైన పేర్కొన్న రాజత్వం ప్రవక్తృత్యం యాజకత్వం అనే మూడు గుణాలు ఇమిడేవన్నాయి. సువిశేష పరిచారం ద్వారా తిరుసభలోకానికి తెలియజేసే ముఖ్యాంశాలు ఇవి. తండ్రి క్రీస్తుద్వారా మనలను ప్రేమించాడు. క్రీస్తుద్వారా మనకు నిత్యజీవం దయచేసాడు. క్రీస్తు ద్వారా మనకు తండ్రి రక్షణమూ వరప్రసాదమూ కృపా లభిస్తాయి.

3 ఆధ్యాత్మిక లౌకిక రంగాల్లో తిరుసభ సేవలు :

తిరుసభ సేవ ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో వుంటుంది. అది ముఖ్యంగా నరులకు దైవరాజ్యాన్ని బోధించేది. ఐనా ఈ నరులు దేహాత్మలతో కూడినవాళ్ళ వారికి ఈలోక జీవితం కూడ ముఖ్యమే. కనుక తిరుసభ కేవలం ఆధ్యాత్మిక రంగాన్ని మాత్రమే పట్టించుకొని లౌకిక రంగాన్ని అనాదరం చేయదు. అందుకే అతి ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో పనిచేసినా, లౌకికరంగాన్ని కూడ విలువతో జూస్తుంది. జాతీయ అంతర్జాతీయ సంఘటనలు, కుటుంబజీవితం, శాంతి, సమాచార సాధనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మానవ హక్కులు మొదలైన నానారంగాల్లో కృషి చేస్తుంది.

ఇటీవల తిరుసభ పేదసాదలకు జరిగే అన్యాయాలను చక్కదిద్దడం అనే రంగంలో ఎక్కువ శ్రద్ధ చూపుతూంది. పేదల విమోచనం కొరకు ఎన్నో పథకాలను రూపొందిస్తుంది. ఇండియాలాంటి పేద దేశాల్లో సాంఘిక అన్యాయాలూ అసమానతలూ ఎన్నయనా వుంటాయి. మనదేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కొరకు తిరుసభ ఎనలేని సేవలు చేస్తుంది. ఈ సభ పరిచర్యల ద్వారా దళిత వర్గాల ప్రజలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు.

తిరుసభ అహింసా మార్గాన్ని వ్యక్తి స్వేచ్చను, మత స్వేచ్చను సమర్ధిస్తుంది.

ప్రార్ధనా భావాలు

1. తిరుసభలో మఠవాసినులైన కన్యలు ఓ ముఖ్యభాగం. ఐదవ శతాబ్దంలో జీవించిన సిప్రియన్ భక్తుడు వీరినిగూర్చి ఈలా నుడివాడు. "కన్యలు తిరుసభ అనే చెట్టు విూద పూచిన పూవుల్లాంటివాళ్లు, వరప్రసాదంతో అలంకృతమైనవాళ్ళు భగవంతునికి ప్రతిబింబాలుగాను ఆ ప్రభువు పావిత్ర్యానికి చిహ్నాలుగాను నిల్చేవాళ్లు, వీళ్లు క్రీస్తు మందలో అతి శ్రేష్టమైన భాగం. తల్లియైన తిరుసభ తన పత్రికలైన వీరినిజూచి ఆనందిస్తుంది". ఈ మఠకన్యలు తమ అంతస్తుకి తగినట్లుగా భక్తి శ్రద్ధలతో జీవించాలని ప్రార్థిద్దాం. 2. తిరుసభలో మఠవాసులుకూడ ఓ వర్గం. గురువుల వర్గంనుండీ సహోదరుల వర్గంనుండికూడ సభ్యులు ఈ మఠవాసుల్లో చేరతారు. వీళ్లు దారిద్ర్యం విరక్తత్వం విధేయత అనే వ్రతాలద్వారా దేవునికి పరిపూర్ణంగా నివేదితులౌతారు. సేవామార్గాన్ని చేపట్టి తిరుసభ అభివృద్ధి కొరకు నిరంతరం కృషిచేస్తారు. నిర్మలజీవితం గడుపుతూ తిరుసభ పావిత్ర్యానికి గురుతుగా వుంటారు. వీరి కృషివల్ల తిరుసభ ఇంకా అభివృద్ధిలోకి రావాలని ప్రార్థిద్దాం.

6. తిరుసభకు ఉపమానాలు

ఓ వైపునుండి చూస్తే తిరుసభ మానవ సమాజం. దానిలో అంతస్తులూ అధికారాలూ పరిపాలనమూ వున్నాయి. లోపాలూ పాపాలూ కూడ వున్నాయి. ఈ దృష్టితోజూస్తే అది మన కంటికి కన్పించేది, మనకు అర్థమయ్యేది. మన మానుష సంస్థల్లాంటిది. కాని మరోవైపునుంచి చూస్తే అది దేవుడు నెలకొల్పినన సమాజం. ఉత్థానక్రీస్తు ఆత్మ దానిలో వుండి దాన్ని నడిపిస్తూంటుంది. వరప్రసాదంవల్ల అది యేనాటికీ నాశమైపోదు. ఈ దృష్టితో జూస్తే అది మనకంటికి కన్పించేదీకాదు, మనకు అర్థమయ్యేదీకాదు. దైవశక్తితో నడచే దివ్యసంస్థ.

దైవసంస్థకూడ కనుకనే తిరుసభను దైవరహస్యం అన్నారు. దైవరహస్యం అంటే యేమిటి? ఏదైనా ఓ వేద సత్యం వుందనుకొందాం. అది మనంతట మనకు తెలియదు. బైబులుద్వారా తెలుస్తుంది. కాని బైబులుద్వారా తెలుసుకొన్నాకగూడ ఆ వేద సత్యం మనకు పూర్తిగా అర్థంకాదు. మన బుద్ధిశక్తి దాన్ని గ్రహించలేదు. దాన్ని మనం విశ్వాసంతో నమ్మవలసిందే. ఉదాహరణకు పరిశుద్ధతీత్ర్వం, క్రీస్తు మనుష్యావతారం దైవరహస్యాలు. తిరుసభకూడ ఈలాంటి దైవరహస్యమే. మనం దాని మానవస్వభావాన్నిగ్రహించగలమేకాని దివ్యస్వభావాన్ని గ్రహించలేం. దానిలోని దైవసాన్నిధ్యాన్ని ఆత్మశక్తినీ వరప్రసాదబలాన్నీ మనం పూర్తిగా అర్థంజేసికోలేం.

దేవుడు నరుడై జన్మించినపుడు ఆనాటి ప్రజలు అతని మానవత్వాన్ని గుర్తించారేకాని దైవత్వాన్ని గుర్తించలేదు. అలాగే నేడు మనం తిరుసభలోని మానవగుణాలను చూస్తామే కాని దైవగుణాలను చూడలేం. కనుక అది మనకు దైవరహస్యంగానే మిగిలిపోతుంది. మరి తిరుసభను అర్థంజేసికోవడం ఏలా?
బైబులూ ప్రాచీన వేదశాస్తులూకూడ తిరుసభలోని దైవరహస్యాన్ని తెలియజేయానికి కొన్ని వుపమానాలు వాడారు. వీటి సహాయంతో మనకు అర్థంకాని తిరుసభను కొంతవరకైనా అర్థంజేసికోవచ్చు. ఇవి నూరుదాకా వున్నాయి. వీటన్నిటినీ 

మనమిప్పుడు పరిశీలించి చూడలేం. వీటిల్లో ముఖ్యమైనవి ఏడెన్మిది వున్నాయి. వీటిల్లో * ప్రస్తుతానికి మూడింటిని మాత్రం పరిశీలిద్దాం. అవి దైవప్రజ, క్రీస్తుదేహం, పవిత్రాత్మకు ఆలయం అనేవి.

1. తిరుసభ దైవప్రజ

తిరుసభలోని ప్రజలందరు, అనగా పోపుగారు కార్డినళ్లు బిషప్ప్పులు గురువులు మఠవాసులు గృహస్తులు అందరు దైవప్రజలే దైవప్రజలైనంతవరకు వీళ్ళందరు సరిసమానులే. దేవుడే వీళ్ళందరిని కరుణతో ఎన్నుకొని తన ప్రజలనుగా జేసికొన్నాడు. దైవప్రజలంతా దేవునికి అంకితమైనవాళ్లు, ఆ ప్రభువుని స్తుతించి కీర్తించి సేవించడం, అతన్ని ఇతరులకు గూడ చూపించడం వారి బాధ్యత. పూర్వనూత్నవేదాలు కూడ ఈ దైవప్రజను గురించి సవిస్తరంగా పేర్కొంటాయి.

1. పూర్వవేదంతో దైవప్రజ

పూర్వవేదం దైవప్రజను గూర్చి ఐదంశాలు చెప్తుంది. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. సీనాయి నిబంధనం ద్వారా యూదులు దైవప్రజలయ్యారు. కనుక వాళ్ళ జీవితంలో ఈ నిబంధనం ముఖ్యాతిముఖ్యమైంది. ఈ నిబంధనం చేసికొన్నపుడు ప్రభువు యూదులకు చెప్పిన వాక్యాలివి. "మిూరు నా మాట విని నా నిబంధనను జాగ్రత్తగా పాటిస్తే సకల జాతుల్లోను మిూరే నావారు, నా సాంతప్రజలు ఔతారు. ఈ భూమండలమంత నాదే కదా! విూరే నాకు యాజకరూప రాజ్యం, మిరే నా పవిత్ర ప్రజ? - నిర్ణ 19,5-6.

యిస్రాయేలీయులు నిబంధనం ద్వారా ఏలా యావే ప్రజలయ్యారో ఈ వాక్యాలు తెలియజేస్తాయి. ఈ నిబంధన కాలంనుండి "మిూరు నా ప్రజలు, నేను మిూ దేవుణ్ణి" అనే పలుకుబడి ప్రచారంలోకి వచ్చింది. ప్రభువు యూదుల మంచితనాన్ని బట్టిగాని సంఖ్యనుబట్టిగాని వాళ్ళను తన వారినిగా ఎన్నుకోలేదు. కేవలం తన ప్రేమనుబట్టి మాత్రమే వారిని తన ప్రజనుగా జేసికొన్నాడు - ద్వితీ 7,7-8.

ప్రభువు తన సేవకుడైన మోషేద్వారా యూదులకు ధర్మశాస్తాన్ని దయచేసాడు. వాళ్లు ఆ ధర్మశాస్త్ర విధులను ఖండితంగా పాటించాలి. ఈలా పాటించడం నిబంధనంలో *, భాగం. ప్రభువు యిప్రాయేలు సమాజంలో వసిస్తాడు - నిర్ణ 29,45-46. వాళ్ళను కాచి కాపాడతాడు. ఈ దైవసాన్నిధ్యాన్నే యూదులు ఇమ్మానువేలు అని పిల్చారు. ఆ ప్రజలు దైవ మందసం చుటూ ప్రోగై ఈ యిమ్మానువేలు దేవుణ్ణి ఆరాధించారు. ఈ యారాధనలో వాళ్లు ఆ ప్రభువు తమ్ముఐగుప్త దాస్యంనుండి విడిపించుకొని వచ్చి సీనాయి కొండదగ్గర తమతో నిబంధనం చేసికొన్న వదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.

2. ప్రభువు యిప్రాయేలీయులను ఎన్నుకొంది వాళ్ల తన్నుస్తుతించి కీర్తించడానికి, అన్యప్రజలకుగూడ ఆ దేవుణ్ణి తెలియజేసి వాళ్ళనుగూడ ఆ ప్రభువు దగ్గరికి రాబట్టడానికి -యెష43,21. లోకంలోని జాతుల్లోయిస్రాయేలు ముఖ్యమైంది. దీనిద్వారా అన్యజాతులు యావే దగ్గరికి రావాలి. ప్రభువు మొదట యిస్రాయేలును రక్షిస్తాడు. దానిద్వారా అన్యజాతులను గూడ రక్షిస్తాడు. యెహెజ్కేలు ప్రవక్త చూచిన జలప్రవాహం దేవాలయం నుండి అన్ని దిశలకు పారుతుంది. అనగా ప్రభువు రక్షణం యూదులనుండి అన్నిజాతులకూ వ్యాపిస్తుందని భావం - 47.1-12. యూదులకు జాతిపితయైన అబ్రాహాము దీవెనలు అన్ని జాతులకూ లభిస్తాయి - ఆది 12.2-3. కనుక యిస్రాయేలు అన్యజాతులకు మధ్యవర్తి, దీపం, నిబంధనం ఔతుంది - యెష42,6. ఈ విధంగా యూదులు దేవుణ్ణి పూజించి అన్యులు కూడ అతన్ని పూజించేలా చేస్తారు. ఇందుకే దేవుడు వాళ్లను ఎన్నుకొంది.
3. దైవప్రజలకు గుర్తు ఏమిటి? మొదట వీళ్లు అబ్రాహాము ఈసాకు యాకోబులనే పితరుల వంశానికి చెందివుండాలి. అటుతర్వాత అబ్రాహాము కాలంనుండి ఆచరణలో వున్న సున్నతిని పొందివుండాలి. ఇంకా, ప్రభువు ధర్మశాస్తాన్ని పాటించాలి. విశేషంగా దానిలో పవిత్రతకు సంబంధించిన నియమాలనూ, అతిముఖ్యంగా విశ్రాంతిదిననియమాన్నీ పాటించాలి. ఈ బాహ్య లక్షణాలతో పాటు యావే ప్రభువుని ఏకైక హృదయంతో సేవించాలి. ఇది ఆంతరంగికమైన లక్షణం - నిర్గ20,1-3. ఈలాంటి వాళ్ళకు అబ్రాహాము దీవెనలు లభిస్తాయి. 

4. యిస్రాయేలీయులకు వ్యక్తీ ముఖ్యమే సమాజమూ ముఖ్యమే. సమాజం పాపపుణ్యాలు వ్యక్తినీ, వ్యక్తి పాపపుణ్యాలు సమాజాన్నీ ప్రభావితం చేస్తాయి. కనుక వాళ్ళంతా పరస్పర సంబంధం కలవాళ్లు, కావున ఏకంగా యిప్రాయేలు సమాజమూ ముఖ్యమే, వ్యస్తంగా ఆ సమాజంలోని ప్రతివ్యక్తీ ముఖ్యమే.

5. యూదులు దేవుడు చేసిన నిబంధనను మిూరారు. యావేను నిరాకరించారు. ప్రభువు వాళ్ళను రోసి మిూరు నా ప్రజలు కాదు నేను విూ దేవుణ్ణి కాదు అని పల్కాడు - హోషే 19. సీనాయి నిబంధనను రద్దుచేసాడు. కాని యూదులంతా యావేను నిరాకరించరు. "శేషజనం" అనే చిన్న వర్గం అతన్ని భక్తితో కొలుస్తుంటుంది - యెష 10,21-22. వీళ్లు "నూత్న యిస్రాయేలు" ఔతారు. ప్రవక్తల బోధల ప్రకారం ప్రభువు అంత్యకాలంలో యూదప్రజల హృదయాన్ని మారుస్తాడు. వాళ్ళతో నూత్న నిబంధనం చేసికొంటాడు - యిర్మీ 31, 31. అప్పడు మళ్లా యూదులు ప్రభువు ప్రజలౌతారు, అతడు వాళ్లు కొలిచే దేవుడౌతాడు. పూర్వవేదాంత కాలంలో భక్తులు ఈ నూత్న నిబంధన కొరకు ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణం క్రీస్తు ద్వారా ఫలిస్తుంది.

పైన మనం పేర్కొన్న ఐదంశాల సారాంశం ఇది.
1. దేవుడు కేవలం తన ప్రేమవల్లనే యిప్రాయేలును ఎన్నుకొన్నాడు.
2. దేవుడు వారిని ఎన్నుకొంది తన్నుపూజించే పవిత్ర ప్రజను తయారుచేయడానికే. యూదులు ప్రధానంగా యావేను పూజించే యాజకులు.
3. నిబంధనం ద్వారా యూదులు యావే ప్రజలయ్యారు. యిశ్రాయేలు ప్రభువును నిరాకరించినా అతడు వాళ్ళను నిరాకరించడు. అతడు అంత్యకాలంలో నూత్న నిబంధనం ద్వారా మళ్లి నూత్న ప్రజను తయారుచేస్తాడు.

2. నూత్న వేదంలో దైవప్రజ

ప్రవక్తలు అంత్యకాలంలో నూత్న నిబంధనం జరుగుతుందనీ నూత్నప్రజ పుడుతుందనీ తెలియజేసారు. పూర్వవేదం సూచించిన ఈ యంత్యకాలప్రజ క్రైస్తవ ప్రజలేనని చెప్తుంది నూత్నవేదం. పూర్వవేదం యూద ప్రజకు చెప్పిన లక్షణాలన్నీ నూత్నవేదం క్రైస్తవ ప్రజలకు గూడ వర్తింపజేస్తుంది. ఇక, పూర్వవేద ప్రజలుపోయి నూత్నవేద ప్రజలు ఏలా వచ్చారో పరిశీలిద్దాం. ఇక్కడ ఐదంశాలు చూద్దాం.

1. చారిత్రకంగా జరిగిన సంగతి యిది. పూర్వవేదప్రజ పోయి నూత్నవేద ప్రజ వచ్చిందని తొలినాటి యెరూషలేము క్రైస్తవులు క్రమేణ గుర్తించారు. వాళ్లు క్రమేణ తాము కొత్త యిస్రాయేలుమని అర్థం జేసికొన్నారు.

తొలుత యూదులు యూదక్రైస్తవులు కలసే వుండేవాళ్ళు యూద క్రైస్తవులు కూడ ధర్మశాస్త్రాతాన్ని పాటించారు, దేవాలయారాధనలో పాల్గొన్నారు. కాని వాళ్ళకు ఉత్తాన క్రీస్తుపట్ల విశ్వాసం వుంది. ఆ విశ్వాసమే వాళ్ళు తాము నిజమైన యిస్రాయేలుమని గుర్తించేలా చేసింది.

ఈ క్రైస్తవ సమాజం జ్ఞానస్నానాన్నిస్వీకరించి తమ యిండ్లల్లోనే ప్రార్ధన జరిపి దివ్యసత్ప్రసాద బలిని సమర్పించింది. పేత్రు నాయకత్వం క్రింద ఉమ్మడి జీవితం గడిపి క్రీస్తు నేర్పిన ప్రేమ సూత్రాన్ని పాటించింది. ఈ కార్యాలేవీ యూద సమాజంలో లేవు. వీటివల్లగూడ తొలినాటి, క్రైస్తవులు తాము వేరే సమాజమని గుర్తించారు. పూర్వవేదం పేర్కొన్న అంత్యకాలపు దైవప్రజ తామేనని గ్రహించారు. 126 సైఫను హింసతో యెరూషలేములోని క్రైస్తవ యూదులు చెల్లాచెదరై యితర ప్రాంతాలకు పారిపోయి అక్కడ అన్యజాతులకు గూడ క్రీస్తుని బోధించారు. విశేషంగా అంతియోకయ కేంద్రంలో చాలమంది గ్రీకు ప్రజల క్రైస్తవ సమాజంలో చేరారు - 1.చ. 11,20-21. దీనితో తొలినాటి క్రెస్తవ బృందానికి నూత్నజ్ఞానం కలిగింది. క్రొత్త యిస్రాయేలులో యూదులు మాత్రమే కాక అన్యజాతుల వాళ్ళకూడ వుంటారని అర్థమైంది. పూర్వవేద ప్రజలు యూదులు మాత్రమే. కాని నూత్న యిస్రాయేలు అన్ని జాతులతో కూడింది.

2. పూర్వవేద ప్రజ పోయి నూతవేద ప్రజ వచ్చింది అని చెప్పాం. ఈ నూతవేద ప్రజ పూర్వవేద ప్రజల పవిత్ర లక్షణాలను తనకూ అన్వయించుకొంది. 1పేత్రు 2,9- 10లో ఈ యన్వయం స్పష్టంగా కన్పిస్తుంది. "విూరు ఎన్నుకొనబడిన జాతి. రాచరికపు గురుకులము. పవిత్ర జనము. దేవుని సొంత ప్రజలు.”

సీనాయి నిబంధనలో యిస్రాయేలు ప్రజలకు వర్తించిన లక్షణాలే (నిర్ణ 19,5- 6). ఇక్కడ క్రెస్తవ ప్రజలకు కూడ వర్తిస్తాయని ఈ వాక్యాల భావం. ఈ పట్టున మనం నాలు లక్షణాలను పరిశీలిద్దాం.

1. క్రైస్తవులు "దేవుడు ఎన్నుకొనిన జాతి", ఇది పూర్వవేద యూదుల లక్షణం - నిర్గ 19,5. ఇప్పడు అదే లక్షణం క్రైస్తవులకూ వర్తిస్తుంది. 

2. వారు "రాచరికపు గురుకులం.” ఇది నిర్గమ కాండంలోని యాజక రూపమైన రాజ్యం అనేదానికి సమానం 19,6. పూర్వవేదప యూదుల దేవుణ్ణి పూజించే శ్రేష్టమైన యాజకులు, అలాగే క్రైస్తవులు కూడ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ఆ ప్రభువుని పూజించే శ్రేషులైన యాజకులౌతారు.

3. వారు "పవిత్రప్రజ". పూర్వవేద జనులు పవిత్ర ప్రజలు 19,6. వాళ్ళ పవిత్రుడైన దేవునికి అంకితులై అతన్ని కొల్చారు. కనుక పవిత్రప్రజలయ్యారు, సీనాయి నిబంధనం వాళ్ళను ఇతర జాతులనుండి వేరుచేసి ప్రభువుకి అంకితం చేసింది. దీనివల్ల వాళ్లు పవిత్ర ప్రజలయ్యారు. నూత్నవేదంలో మనం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు ప్రజలమై అతనికి అంకితమౌతాం. కనుక పవిత్ర ప్రజలమౌతాం. 

4 క్రైస్తవులు “దేవుని సొంత ప్రజలు." పూర్వవేద కాలంలో ఎన్నో జాతులు వుంటే దేవుడు యిస్రాయేలునే తన సొంత ప్రజగా ఎన్నుకొన్నాడు - 19,6. అలాగే నూత్నవేదంలో పలు జాతుల మధ్య మనం క్రీస్తుకి సొంత ప్రజలమౌతాం. మన జ్ఞానస్నానమే దీనికి కారణం.

ఈ యాలోకనాన్ని బట్టి తొలినాటి క్రైస్తవులు తామే అంత్యకాలపు దైవప్రజలమని అర్థం జేసికొన్నారు అనుకోవాలి. అంత్యకాలపు ప్రజలను గూర్చిన ప్రవచనాలు తమ విషయంలో నెరవేరాయని ఎంచారు అనుకోవాలి, 127 3. పూర్వ నూత్నవేదాల ప్రజలకు తేడా ప్రధానంగా ఒక్క అంశంలోనే వుంది. అది వుత్థాన క్రీస్తు ఆరాధనం. దేవుడు ఈ యంత్యకాలపు ప్రజను క్రీస్తు చిందించిన రక్తం ద్వారా సంపాదించుకొన్నాడు — అ.చ. 20,28. క్రీస్తు అనేకులకొరకు తన రకాన్ని చిందించాడు - మార్కు 14,24. ఈ యనేకులు యూదులూ అన్యజాతివాళ్లు కూడాను. వీళ్ళంతా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అతనిద్వారా తండ్రిని ఆరాధించే నూత్నప్రజ ఔతారు. కనుక క్రీస్తుద్వారా నూత్వవేద ప్రజ పూర్వవేద ప్రజకంటె భిన్నమైనదౌతుంది.

4. రెండవ వాటికన్ మహాసభ నూత్నవేద ప్రజల లక్షణాలను నాల్గిడింటిని పేర్కొంటుంది.

మొదటిది, నూత్నవేద ప్రజలంతా ఏకప్రజ. అనగా పోపుగారు బిషప్పలు గురువులు మఠవాసులు గృహస్తులూ అందరూ దైవప్రజలే. ఈ దృష్టితో జూస్తే వీళ్లల్లో తారతమ్యాలు లేవు. అంతా దైవప్రజ. అందరి విలువా సరిసమానమే. అందరూ దేవునికి అంకితమైన ఏకప్రజే.

రెండవది, ఈ ప్రజ నూతప్రజ. పూర్వవేదపు యూదులకు మారుగా వచ్చిన క్రొత్తప్రజ. క్రీస్తు సిలువబలి వీళ్ల ఆవిర్భావానికి కారణం. పూర్వ నూత్నవేద కాలాల్లో గూడ దేవుడు తలంచుకొంటే వ్యక్తులను వ్యక్తులనుగా రక్షించేవాడే. కాని అతడు పూర్వ నూత్నవేద ప్రజలనుగూడ సమాజాలనులాగే రక్షించాడు. ఇప్పుడు మనం క్రైస్తవ వ్యక్తులంగాము, క్రెస్తవ సమాజానిమి.

మూడవది, నూత్నవేద ప్రజలకు వ్యత్యాసం క్రీస్తు వల్లనే వచ్చింది. వాళ్ళు క్రీస్తు ఆత్మార్పణం వలన ఆవిర్భవించినవాళ్ళు. పూర్వవేద ప్రజలు దేవుని దాసులు. వీళ్ళు క్రీస్తుద్వారా దేవునికి దత్తపుత్రులు. మెస్సీయా ప్రజలు. వీళ్ల ద్వారా ఇప్పడు లోకంలోని జాతులన్నీ దీవెనలు పొందుతాయి.

నాల్గవది, నూత్నవేద ప్రజ యాత్రికప్రజ. పూర్వం యూదులు ఈజిప్టునుండి వాగ్ధత్త భూమికి యాత్ర చేసారు. ఇప్పడు మనం ఈ లోకంనుండి పరలోకానికి యాత్రచేస్తున్నాం. ఈ లోకంలో తిరుసభ పాప భూయిష్టంగా వుంటుంది. కనుక అది మాటిమాటికీ పశ్చాత్తాపపడి తన పాపమాలిన్యాన్ని కడిగివేసుకొంటూండాలి. తన తప్పిదాలకు నిరంతరమూ దేవునినుండి మన్నింపు పొందుతూండాలి. ఈ పశ్చాత్తాపం ద్వారా తన వినయాన్ని ప్రకటించుకొంటూండాలి.

5. ఇప్పడు ఎవరు, ఏ విధంగా తిరుసభకు చెందుతారు? ఇప్పడు క్యాతలిక్ క్రెస్తవులూ వున్నారు. ప్రోటస్టెంటు క్రెస్తవులూ వున్నారు. అన్యమతాలకు చెందిన క్రైస్తవేతరులూ వున్నారు. వీళ్ళంతా ఏవిధంగా తిరుసభకు చెందుతారు? ఈ మూడువర్గాల 128 ప్రజలకు తిరుసభతో వుండే సంబంధాన్ని గూర్చి రెండవ వాటికన్ సభ ఈలా తెలియజేస్తుంది.

క్యాతలిక్ ప్రజలు పూర్తిగా తిరుసభలో చేరినవాళ్ళ క్రీస్తు స్థాపించిన తిరుసభ, ఆదిమ క్రైస్తవ సమాజం, నేడు ఈ సభలోనే కొనసాగుతుంది.
ప్రోటస్టెంటు సమాజాల ప్రజలు తిరుసభతో కలసినవాళ్ళు క్రీస్తుపట్ల విశ్వాసం వల్లా జ్ఞానస్నాన దివ్యసత్రసాదాలవల్లా బైబులును అంగీకరించడంవల్లా వీళ్ళకు తిరుసభతో దగ్గరి సంబంధం వుంది. కనుక వీళ్ళు ఆ సభలో కలసిన వాళ్ళవుతారు. 

అన్యమతాల ప్రజలు తిరుసభతో సంబంధం వున్నవాళ్ళ వీళ్ళంతా దేవుణ్ణి కొల్చేవాళ్లే ఆ దేవుని పేరు విూదిగా తోడి నరుడ్డి అంగీకరించేవాళ్లే కనుక ఏదోరూపంలో వీళ్ళకుకూడ తిరుసభతో సంబంధం వుంటుంది.

2. తిరుసభ క్రీస్తు శరీరం

తిరుసభ దైవప్రజ అనడం ఎంత సబబో క్రీస్తు శరీరం అనడంకూడ అంత సబబు. ఈ భావం విశేషంగా పౌలు జాబుల్లో వస్తుంది. ఇక్కడ మూడంశాలు చూద్దాం

1. శరీరమూ, సామూహిక వ్యక్తీ

మనం మామూలుగా నరుల్లో යීකරෙකියාව ఆత్మా రెండూ వుంటాయని చెపాం. దేహాత్మలు కలసి నరుడు లేక వ్యక్తి ఔతాడు అంటాం. కాని హీబ్రూ ప్రజలు నరుడ్డి ఈలా విభజించలేదు. వాళ్ళకు నరుడు ఏకవస్తువు. ఈ యేకవస్తువునే వాళ్ళ శరీరం (బసార్) అనికాని లేక ప్రాణం (నఫేష్) అనికాని పిల్చారు. కనుక హీబ్రూ ప్రజల దృష్టిలో “శరీరం? అంటే మనం అనుకొనే నరుడు లేక వ్యక్తి కనుకనే యెషయా 52,10లో "సకల శరీరులు మన దేవుని రక్షణాన్ని చూస్తారు" అంటే, సకల జనులు దేవుని రక్షణాన్ని చూస్తారని అర్థం.

హీబ్రూ ప్రజల్లో ఇంకో భావంకూడ వుంది. వాళ్లకు సామూహిక వ్యక్తులు అనేవాళ్ళున్నారు. ఈ వ్యక్తి ఒక సమూహానికి నాయకుడు. అతడు ఆ సమూహాన్నంతటినీ సూచిస్తాడు. దాన్నంతటినీ తనలో ఇముడ్చుకొంటాడు. అతడు ఆ సమూహంలో వుంటాడు, ఆ సమూహంగూడ అతనిలో వుంటుంది. ఉదాహరణకు, ఆదాము ఓ సామూహిక వ్యక్తి అతడు నరజాతికి శిరస్సు లేక నాయకుడు. నరజాతి అంతా అతనిలో ఇమిడి వుంటుంది. అతడూ నరజాతిలో ఇమిడి వుంటాడు. యాకోబుకి యిస్రాయేలని మరోపేరు వుంది. ఈ యిప్రాయేలు కూడ ఓ సామూహిక వ్యక్తి యిప్రాయేలీయులంతా అతనిలో ఇమిడివున్నారు. అలాగే క్రీస్తుకూడ సామూహిక వ్యక్తి క్రైస్తవులంతా అతనిలో ఇమిడివున్నారు. ఈ రెండవ 

భాగాన్ని అర్ధం జేసికోవాలంటే మనం పైన పేర్కొన్న "శరీరం" "సామూహిక వ్యక్తి" అనే రెండు భావాలను జాగ్రత్తగా గమనించి వుండాలి.

తిరుసభక్రీస్తు శరీరం అని పౌలు తన జాబుల్లో 91సార్లు తెలిపాడు. ఉదాహరణకు "క్రీస్తు తన శరీరమైన తిరుసభకు శిరస్సు" - కొలో 1,18. పౌలు ఈ యంశాన్ని ఇన్నిసార్లు చెప్పాడు అంటే అతని భావం ఏమైయుండాలి? తిరుసభ అంటే క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ ప్రజలు. అనగా క్రైస్తవ సమాజం. ఇక క్రైస్తవ సమాజం క్రీస్తు శరీరం అంటే భావం ఏమిటి? హీబ్రూ ప్రజలు నరుణ్ణి లేక వ్యక్తిని శరీరం అనేవాళ్ళని చెప్పాం. కనుక క్రైస్తవ సమాజం క్రీస్తు శరీరం అంటే, క్రైస్తవులు క్రీస్తు అనే వ్యక్తి ఔతారని భావం.

కాని క్రైస్తవులు క్రీస్తనే వ్యక్తి ఏలా ఔతారు? హీబ్రూ ప్రజలకు "సామూహిక వ్యక్తి" అనే భావంకూడ వుందని చెప్పాం, ఓ సమూహమంతా తమ నాయకుల్లో ఇమిడివుంటుంది. అతనితో ఐక్యమై వుంటుంది అని చెప్పాం. ఈ భావం ప్రకారం క్రైస్తవులంతా తమ నాయకుడైన క్రీస్తుతో కలసి ఏకవ్యక్తి ఔతారు. ఇక, తిరుసభ అంటే ఈ క్రైస్తవులే. కనుక తిరుసభ లేక క్రైస్తవ సమాజం తమ నాయకుడైన ఉత్తాన క్రీస్తు రూపంలో లోకంలో కన్పిస్తూంటుంది. లేదా, ఉత్థాన క్రీస్తే తిరుసభ రూపంలో కన్పిస్తాడు. ఉత్థాన క్రీస్తే తిరుసభ, తిరుసభే ఉత్థాన క్రీస్తు.

పౌలు తిరుసభలో ఓ సభ్యుడు. పై తిరుసభే ఉత్థాన క్రీస్తు కనుక అతడు "నాకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే" అని చెప్పకొన్నాడు - ఫిలి 1,21. ‘ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అనికూడ చెప్పికొన్నాడు - గల 220. పౌలులాగే క్రీస్తుపట్ల భక్తితో జీవిస్తే నేడు మనం కూడ ఈలాగే చెప్పకోవచ్చు.

2. మూడు ಮಿಜ್ಞ భావాలు

తిరుసభ క్రీస్తు శరీరం అనడంలో పౌలు ఉద్దేశించిన భావం, క్రైస్తవులూ, ఉత్తానక్రీస్తూ కలసి ఏకవ్యక్తి ఔతారని.

తిరుసభ క్రీస్తు శరీరం అని చెప్పడంద్వారా పౌలు మూడు ప్రధాన భావాలను సూచించాడు. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.
1) క్రీస్తు తిరుసభ అతి సన్నిహితంగా ఐక్యమౌతారు. వాళ్లిద్దరు కలసి ఏక శరీరం (ఏకవ్యక్తి)ఔతారు. ఈ మైక్యతకు పౌలు వివాహం, జ్ఞానస్నానం, దివ్యసత్రసాదం అనే మూడు ఉదాహరణలు చెప్పాడు. స్త్రి పురుషులు లేక భార్యాభర్తలు లైంగికంగా కలసికొన్నపుడు ఏలా ఏక శరీరమౌతారో క్రీస్తు తిరుసభా కలసి అలా ఏక శరీరమౌతారు. నరుడు వేశ్యతో కలసినప్పుడు వాళ్లిద్దరు కలసి ఏకవ్యక్తి ఔతారు. అలాగే క్రీస్తు క్రైస్తవుడు కలసి ఏకవ్యక్తి ఔతారు - 1కొ 6,16-17.

క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడం వల్లకూడ అతడూ మనమూ కలసి ఏక శరీరమాతాం - రోమా 6,3-4.

క్రీస్తుని దివ్యసత్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడ అతడూ మనమూ కలసి ఏక శరీరమౌతాం - 1కొ 10,17. ఈ మూడు ఉదాహరణల్లోను ఐక్యత ప్రాముఖ్యం చెప్పబడింది.

2) తిరుసభలోని సభ్యులంతా క్రీస్తుతో కలసి ఏకశరీరం (ఏకవ్యక్తి) ఔతారు. ఈ శరీరానికి క్రీస్తే శిరస్సు తిరుసభ సభ్యులే అవయవాలు. దేహంలో ఒక్కో అవయవం ఒక్కో పనిచేసి శరీరాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే తిరుసభలోని ఒక్కో సభ్యుడూ ఒక్కొ పనిచేసి క్రీస్తు శరీరాభివృద్ధికి తోడ్పడాలి - 1కొ 12,12-13. ఇక్కడ అవయవాల ప్రాముఖ్యం చెప్పబడింది.

3) క్రీసూక్రైస్తవులూ కలసి ఏక శరీరం (ఏకవ్యక్తి) ఔతారు. ఈ దివ్యశరీరానికి క్రీస్తు శిరస్సు తిరుసభ సభ్యులు అవయవాలు - ఎఫే 1,22-23. ఇక్కడ "శిరస్సు" అంటే నాయకుడు. క్రీస్తుతో ఐక్యమైన తిరుసభను క్రీస్తు నాయకుడే నడిపిస్తాడని భావం. ఇక్కడ శిరస్సు ప్రాముఖ్యత చెప్పబడింది.

పై పౌలు వాక్యాల సారాంశమేమిటంటే ఉత్థానక్రీసూక్రైస్తవులూ ఒకేవ్యక్తి ఔతారు. కాని ఈ యైక్యతను ఏలా అర్థంజేసికోవాలి? ఇది భౌతికమైన ఐక్యత కాదు. ఉత్తానక్రీస్తూ మనమూ వేర్వేరు వ్యక్తులుగానే వుండిపోతాం. ఒకరితో ఒకరం భౌతికంగా కలసిపోం. కనుక ఇది ఆధ్యాత్మికమైన ఐక్యత, మనం జ్ఞానస్నాన విశ్వాసాల ద్వారా ప్రభువుతో ఐక్యమైనపుడు అతని వరప్రసాదం మనమిూద పనిచేస్తుంది. క్రీస్తు ఆత్మ మనలను ప్రభువతో జోడిస్తుంది. దీనివల్ల మనలోని జంతుప్రవృత్తి, పాపస్వభావం క్రమేణ అంతరిస్తాయి. క్రీస్తు స్వభావం అతని దివ్యగుణాలు మనలో నెలకొంటాయి. దీనిద్వారా ప్రాకృతిక మానవుడు క్రమేణ ఆధ్యాత్మిక మానవుడుగా మారిపోతాడు. బైబులు ఉపమానాలతో చెప్పాలంటే ఈ యైక్యత భార్యాభర్తల ఐక్యతలా వుంటుంది - ఎఫె 5,30-31. చెట్టు కొమ్మల ఐక్యతలా వుంటుంది గా యోహా 15,5. పునాదిరాయి దానిమిూద కట్టబడిన భవనం ఐక్యతలా వుంటుంది - 1షేత్రు 2,5. దేహంలోని శిరస్సు అవయవాల ఐక్యతలా పుంటుంది - 1కొరి 12,12.

3. ఏక శరీరమనే భావం ప్రాముఖ్యం

తిరుసభ క్రీస్తు శరీరమన్నాం. అనగా క్రీస్తూ మనమూ కలసి ఏకవ్యక్తిమౌతామని అర్థం అని చెప్పాం. ఇక ఈ భావం ప్రాముఖ్యమేమిటో, అది మనకు ఏలా ప్రేరణం పుట్టిస్తుందో తెలిసికొందాం.

ఉత్థాన క్రీస్తు కరుణతో మనలను తనతో ఐక్యం జేసికొంటాడు. అతడు తిరుసభ రూపంలో, అనగా మన మానవరూపంలో ఈ లోకంలో కన్పిస్తాడు. నరమాత్రులమైన మనం అతని దివ్యసత్రసాదంలో పాలుపొందుతాం. అంతేకాదు, అల్పప్రాణులమైన మనం దేవుణ్ణి ఈ లోకంలో ప్రత్యక్షం చేస్తాం. అతడే మనం, మనమే అతడు కదా! ఈలా క్రీస్తుని ఈ లోకంలో కన్పించేలా చేయడం మన అదృష్టం, మన భాగ్యం. 

కాని ఈ భాగ్యం మనకు గొప్ప బాధ్యతను గూడ తెచ్చిపెడుతుంది. మనం క్రీస్తుని లోకానికి చూపించాలి. కనుక మన ప్రవర్తనం యోగ్యంగా వుండాలి. మన తరపున మనం వళ్లు దగ్గర బెట్టుకొని నడవాలి. ఏలా?

క్రీస్తుతో ఏక వ్యక్తులమై మనం ప్రభువులాగే ఇతరులకు సేవలు చేయాలి. ఇతరులమీద పెత్తనం చెలాయించకూడదు. ఆ ప్రభువులాగే మనమూ సరళత్వమూ పేదరికమూ వినయవిధేయతలూ అలవర్చుకోవాలి. విశుద్ధంగా జీవించాలి. అతనిలాగే మనమూ నిరంతరమూ దైవరాజ్యాన్ని బోధించాలి. సంగ్రహంగా చెప్పాలంటే ఈ లోకంలో మనమూ క్రీస్తులాగే ప్రవర్తించాలి, ఆ ప్రభువు తలంపులు పలుకులు చేతలు మన తలపల్లో పలుకుల్లో చేతల్లో ప్రతిఫలించాలి. మనం నిరంతరమూ, అతనితో ఐక్యమై అతనిలా దివ్యజీవితం గడపాలి. “ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అన్నట్లుగా వుండాలి. కనుక మనం క్రీస్తు శరీరమై వుండడం ఓ భాగ్యమూ, ఓ బాధ్యతా కూడ. 

ఇంకా, తిరుసభ క్రీస్తు శరీరం గనుక ప్రభువు ఆ తిరుసభ అంతటా ప్రత్యక్షమై వుంటాడు. విశేషంగా తిరుసభ వాక్యబోధ చేసేపుడు, దేవద్రవ్యానుమానాలు ఇచ్చేపుడు, ఆరాధనం జరిపేపుడు ఉత్తాన క్రీస్తు సాన్నిధ్యం దానిలో బలంగా వుంటుంది.

క్రీస్తు తిరుసభకు శిరస్సు, లేక నాయకుడు. కనుక తిరుసభ వ్యక్తిగతంగాను సామూహికంగాను గూడ క్రీస్తమిూద ఆధారపడి వుండాలి. మనం స్వీయ శక్తితోగాక క్రీస్తు వరప్రసాద బలంతో పనిచేసేవాళ్లం. మనం పడిపోయినపుడల్లా ఆ ప్రభువు నెనరుతో మన పాపాలను మన్నించి మనలను మళ్లా పైకి లేపుతాడు.

క్రీస్తు శిరస్సు, మనం అవయవాలం. దేహంలోని అవయవాల్లో ఐక్యత వుంటుంది. అలాగే క్రీస్తులోకి ఐక్యమైన మనలోమనకు ఐక్యత వుండాలి. అనగా మనం సోదరప్రేమతోను . సహకార భావంతోను జీవించాలి. మనలో మనకు తగాదాలూ విభేదాలూ ముఠాలూ పనికిరావు. కులం వర్గం ఆడుమగ అనే భేదభావాలు ఉండకూడదు.

క్రీస్తు ఆత్మే మనలను ఆ ప్రభువుతోను పరస్పరమూను ఐక్యం చేస్తుంది. ఈ యాత్మ వరప్రసాదం వల్లనే మనం స్వార్ణాన్ని జయిస్తాం. పాపానికి దూరంగా వుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తాం. తోడివారిని అంగీకరిస్తాం. నమ్మకంతో ప్రభువు రెండవ రాకడ కొరకు వేచివుంటాం.

3. తిరుసభ ఆత్మకు ఆలయం

1. ఆత్మకు హీబ్రూ భాషలో "రువా" అనిపేరు. ఈ పదానికి గాలి, ఊపిరి, ప్రాణం అనే వివిధార్థాలున్నాయి. సృష్ణ్యాదిలో ఆత్మ ఆదిమ జలాలమీద పక్షిలా ఎగిరి ప్రాణికోటిని పుట్టించింది - ఆది 1.2. దేవుడు మట్టిముద్దలోనికి ఈ యాత్మను వూదగా అది జీవంగల ప్రాణి ఐంది. అతడే ఆదాము - ఆది 2,7. ఈ విధంగా ఆత్మ ప్రాణిసృష్టికి కర్త ఐంది.

ఈ యాత్మ నూత్న జీవానికీ నూత్న సృష్టికీ గూడ కర్త ప్రభువు బాబిలోనియా ప్రవాసంలో వున్న యూదులతో "నేను నా యాత్మను మీ విూదికి పంపి మీరు మళ్లా జీవించేలా చేస్తాను" అంటాడు - యెహె 37,14. అనగా ప్రవాసంలో చిక్కిచచ్చినవాళ్లలా వున్న యూదులకు ప్రభువు ఆత్మ నూత్నజీవాన్ని దయచేస్తుందని భావం. ఈ జీవం ఆ యాత్మడు పూర్వం ఆదాముకి దయచేసిన జీవంలాంటిది, కనుక ఇది నూత్నసృష్టి.

మెస్సీయా కాలం వచ్చినపుడు ప్రభువు నరులందరి మిూద తన ఆత్మను కుమ్మరిస్తాడని యోవేలు ప్రవక్తనుడివాడు - 2,28. ఒక్క మెస్సీయా కాలపు ప్రజలేకాక, మెస్సీయాకుగూడ ఈ యాత్మ లభిస్తుంది. ఆత్మడు మెస్సీయాకు సప్తవరాలు దయచేస్తాడు - యెష 11,2-5. ఆత్మశక్తితోనే అతడు పేదలకు సువార్తను బోధించి న్యాయాన్ని నెలకొల్పుతాడు - 61,1-2.

2. నూత్నవేదంలో యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సమాజమే మెస్సీయా ప్రజలు. మెస్సీయా వీళ్ళ నాయకుడు. కనుక ఆత్మ మొదట ఇతన్ని నడిపిస్తుంది. యెషయా చెప్పినట్లు ఆత్మ మెస్సీయా శిశువమిూదికి దిగివచ్చింది. ఆత్మశక్తి వల్లనే మరియ గర్భంతాల్చి మెస్సీయా శిశువునుకంది - లూకా 1,35, జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అతనిమిూదికి పావురంలా దిగివచ్చింది - 3,22. ఇది ఆదిమ జలాలమిూద ఎగిరిన ఆత్మే ఆత్మబలంతోనే క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించాడు, అద్భుతాలు చేసాడు. మరణానంతరం అతడు ఆత్మశక్తితోనే ఉత్తానమయ్యాడు - 1కొ 15,45.

ఉత్థానక్రీస్తు తన ఆత్మను పెంతెకోస్తు దినాన యెరూషలేములోని మెస్సీయా ప్రజలవిూదికి పంపాడు. ఆ యాత్మ వారివిూదికి గాలిలా నిప్పులా నాలుకల్లా దిగివచ్చింది - అ.చ.2.2-4. తర్వాత పేత్రు యెరూషలేములో బోధిస్తూ యోవేలు ప్రవచనం నెరవేరి ఆత్మ తమవిూదికి దిగివచ్చిందని నొక్కిచెప్పాడు - 2,16-18. పూర్వవేదం సూచించిన శేషజనమూ, మెస్సీయాజనమూ, అంత్యకాలపు జనమూ తామేననిగూడ విశదంచేసాడు.

ఈ సమాజాన్ని ఆత్మే సృజించింది. ఆత్మలోకాదిలో సృష్టి జరిగించింది. ఇప్పుడు ఈ మెస్సీయా సమాజాన్ని నెలకొల్పడం ద్వారా నూతసృష్టిని కావించింది. పూర్వం మెస్సీయాను మరియు గర్భంలో రూపొందించిన ఆత్మే ఇప్పడు ఈ మెస్సీయా సమాజాన్నిగూడ రూపొందించింది. జ్ఞానస్నానానంతరం క్రీస్తని దైవబోధకు పంపిన ఆత్మే ఇప్పడు యెరూషలేం సమాజాన్ని కూడ వేదబోధకు పంపుతుంది. జ్ఞానస్నానానంతరం ఆత్మ క్రీస్తుని చైతన్యవంతుణ్ణి చేసింది. ఇప్పడు పెంతెకోస్తు సంఘటనం తర్వాత ఆత్మ శిష్యులనుకూడ చైతన్యవంతులను చేసింది.

ఆత్మ తొలినాటి క్రైస్తవ సమాజాన్ని నడిపించినతీరు అపోస్తలుల చర్యలు అనే గ్రంథం సవిస్తరంగా వివరిస్తుంది. కనుకనే ఈ గ్రంథానికి "ఆత్మచర్యలు" అనికూడ పేరు.

3. ఇక ఆత్మ దేవాలయంలోలాగ తిరుసభలో నెలకొనివుండే తీరును పరిశీలిద్దాం. తిరుసభ దేవుడే నిర్మించిన దేవాలయం అనే భావం నూత్నవేదంలో వుంది. క్రీస్తు తన తిరుసభను పేత్రు అనే పునాది రాతిమీద ఓ మందిరంలా నిర్మిస్తానన్నాడు — మత్త 16, 18.

పూర్వవేదంలో యెరూషలేం దేవాలయం దైవసాన్నిధ్యానికి నిలయం. నా ఆలయం ప్రజలందరికి ప్రార్ధనాలయమౌతుంది అన్నాడు ప్రభువు - యెష 56,7. పూర్వవేద ప్రజకు ఓ దేవాలయమున్నట్లే నూత్న వేదప్రజకుగూడ ఓ దేవళం అవసరం. కాని నూత్నవేదంలో మెస్సీయా అతని ప్రజలూ కలసి ఈ దేవళమౌతారు. కనుక ఇక్కడ రాతిగుడికి బదులుగా ఉత్తానక్రీస్తూ అతన్ని ఆరాధించే క్రైస్తవ ప్రజ అనే దేవళం వచ్చింది. క్రైస్తవ భక్తసమాజమే దేవాలయమైంది.

క్రీస్తు విూరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి. నేనుదాన్ని మళ్ళా మూడురోజుల్లో లేపుతానన్నాడు. ఉత్థానక్రీస్తే ఈ దేవాయలం - యోహ 2,21. ఉత్తానక్రీస్తూ అతన్ని ఆరాధించే భక్తసమాజమూ కలసి ఓ మందిరమౌతుంది. నూత్నవేదంలో ఈ సమాజమే దైవసాన్నిధ్యానికి నియలం. ఈ మందిరం ఆత్మశక్తిద్వారా ఏర్పడుతుంది. కనుక ఈ దేవాలయం ఆత్మాలయంకూడ. నూతవేద ప్రజలంతా కలసి ఆత్మకు ఆలయం. ఉత్థానక్రీస్తు ఆత్మద్వారా ఈ దేవాలయంలో నెలకొనివుంటాడు. భక్తజనులను ప్రేరేపిస్తూంటాడు, కడన, క్రైస్తవ సమాజాన్ని దేవాలయంగా వర్ణించే పౌలు బోధలను రెండింటిని తిలకిద్దాం. మొదటిది 1కొ 3,16-17. "విూరు దేవుని ఆలయమనీ, దేవుని ఆత్మకు నివాసమనీ మియాకు తెలియదా? మిూరే దేవుని ఆలయం", ఇక్కడ పౌలు పేర్కొనే ఈ ఆలయం కొరింతులోని క్రైస్తవ సమాజం. ఆత్మ కొరింతు ప్రజల్లో వసిస్తూంది కనుక వాళ్లు దేవాలయమయ్యారు. కోరింతు క్రైస్తవుల లోపాలు వారికున్నాయి. ఐనా ఉత్థానక్రీస్తూ అతని ఆత్మా వారిలో నెలకొని వున్నారు. వారిని దేవాలయం చేసారు. పూర్వం దేవుని సాన్నిధ్యం యెరూషలేములోని రాతిగుడిలో వుండేది. ఇప్పడు ఆ సాన్నిధ్యం క్రైస్తవ సమాజంలో వుంటుంది. ఇక ఆ రాతిగుడితో పనిలేదు. ఇప్పడు ప్రజలే ఆధ్యాత్మిక దేవాలయం. కొరింతు క్రైస్తవ సమాజమే దేవాలయం గనుక, ఆ సమాజంలోని ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. వారిలో వుండేది పవిత్రమైన దైవసాన్నిధ్యం గనుక వాళ్ళ జీవితంగూడ పవిత్రంగా వుండాలి.


1 కొరింతీయులు 6,19 ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా కూడ దేవాలయమేనని చెప్పంది. కాని పౌలుకి ఈ వ్యక్తి అనేది ముఖ్యాంశం కాదు, సమాజంలోని ఆత్మసాన్నిధ్యమే వ్యక్తిలోకి వస్తుంది. అతని ప్రధాన భావం, సమాజమే దేవాలయమనేది. రాతిగుడికి బదులుగా సమాజ దేవాలయం వచ్చింది అనేది అతని నూత్నభావం. ఇక్కడ కొరింతులోని స్థానిక తిరుసభను పౌలు దేవాలయంగా వర్ణించాడు. ఈలాంటి స్థానిక తిరుసభలను అతడు చాల స్థాపించాడు. అవన్నీ దేనికది దేవాలయాలే.

ఇక, పౌలు ఒక్క స్థానిక తిరుసభనే కాక తిరుసభ నంతటినీ ఆత్మకు ఆలయంగా పేర్కొన్న వేదభాగం ఎఫెసీయులు 2,18–22. ఇక్కడ అతడు క్రైస్తవ సమాజాన్నంతటినీ ఓ దేవాలయంగా వర్ణించాడు. ఈ దేవాలయానికి ప్రవక్తలూ అపోస్తలులూ కలసి పునాది ఔతారు. క్రైస్తవ సభ్యులంతా దేవాలయ నిర్మాణంలో వాడిన శిలలు ఔతారు. ఈ శిలల్లో యూదక్రైస్తవులూ అన్యజాతి క్రైస్తవులూ కూడవున్నారు. క్రీస్తు ఈ దేవళానికి మూలరాయి. ఈ రాయి పునాదిలో కాక భవనం కప్పలో వుంటుంది. భవనాన్నంతటినీ కలిపి వుంచుతుంది. ఈ మందిరంలో దేవుడు తన ఆత్మద్వారా నెలకొని వుంటాడు. కనుకనే ఇది దేవాలయమైంది. ఆత్మే ఈ దేవాలయన్ని పదిలంగా కాపాడుతుంది. ఇక, పూర్వవేదంలో యూదులు ప్రధానంగా దేవుణ్ణిస్తుతించి కీర్తించడానికి వున్నారు - యెష48,21. అలాగే నూత్నవేద యిప్రాయేలైన క్రైస్తవులు కూడ క్రీస్తుద్వారా తండ్రిని స్తుతించడానికే వున్నారు. ఈ స్తుతి క్రైస్తవ సమాజంలో జరగాలి. ఈ సమాజం యూదులతోను అన్యజాతి వాళ్లతోను కూడిన భక్తబృందం. ఈ భక్తబృందంలో $(3%oסח జ్ఞానస్నానం దివ్యసత్ర్పసాదం అనేవాటిద్వారా ఈ స్తుతీ ఆరాధనా కొనసాగుతాయి. ఆత్మయందు క్రీస్తుద్వారా తండ్రికి ఈ యూరాధనం జరుగుతుంది. నేడు మనం రాతిగుడిని మాత్రమే దేవాలయంగా భావిస్తున్నాం.దివ్యసత్రసాదం దానిలో పదిలపరుస్తున్నాం. దాన్ని సుందరంగా కడుతున్నాం. కాని తొలినాటి క్రైస్తవులు రాతిగుడిని కాక క్రైస్తవ భక్త సమాజాన్నే దేవాలయంగా భావించారు. దైవసాన్నిధ్యాన్ని ప్రధానంగా ఆ సమాజంలోనే చూచారు. మనం మల్లా ఈ సామాజిక దేవాలయం అనే భావానికి రావాలి. ఆత్మద్వారా దైవసాన్నిధ్యం నెలకొని వుండేది ప్రధానంగా క్రైస్తవ సమాజంలోనేనని గుర్తించాలి. అప్పుడే సోదరప్రేమ పెరుగుతుంది. తోడివారిని విలువతోను ఆప్యాయంగాను చూస్తాం.

ప్రార్ధనా భావాలు

1. ఇరెనేయస్ భక్తుడు ఈలా వ్రాసాడు. "తిరుసభ వున్నచోట పవిత్రాత్మ వుంటుంది. e9ég వున్నచోట తిరుసభా, సకల వరప్రసాదాలూ వుంటాయి". కనుక మామూలుగా తిరుసభకు చెందకుండా ఆత్మను పొందలేం.
2. పవిత్రాత్మక్రైస్తవుల్లో ఒక్కొక్కనికి ఒక్కోవరం దయచేస్తుంది. ఈ వరాలతో క్రైస్తవులు తిరుసభకీ, లోకానికంతటికీ సేవలు చేయాలి. తిరుసభలోని అధికారులు విశ్వాసుల వరాలను అణచివేయకూడదు. తిరుసభక్షేమాభివృద్ధికి వాటిని వాడుకోవాలి - 1 తెస్స 5,19-21. ప్రతి క్రైస్తవుడు తన ప్రత్యేక వరాలతో తిరుసభ అభివృద్ధికి పాటుపడాలి.
3. రెండవ శతాబ్దానికి చెందిన గ్రీకు భక్తుడొకడు ఆనాటి సుప్రసిద్ధ వ్యక్తియైన డయెగ్నీటస్కి లేఖవ్రాస్తూ తిరుసభను గూర్చి ఈలా వాకొన్నాడు. "దేహంలో ఆత్మయేలాగో ఈ లోకంలో క్రైస్తవులు ఆలాగు. ఆత్మ దేహంలోని ప్రతి భాగంలోను వుంటుంది. అలాగే క్రైస్తవులు ప్రపంచంలోని భాగాలన్నిటిలోను వసిస్తున్నారు. ఆత్మ దేహంలోనే వసించినా అది దేహానికి సంబంధించినది కాదు. అలాగే క్రైస్తవులు ఈ లోకంలో వసించినా వాళ్లు ఈ లోకానికి చెందినవాళ్ళు కాదు. కంటికి కన్పించే దేహంలో నెలకొనివున్నా ఆత్మ తాను మాత్రం కంటికి కన్పించదు. అట్లే లోకంలోని క్రైస్తవులు కంటికి కన్పిస్తున్నావారి ఆరాధనం ఎవరికీ కన్పించదు. ఆత్మ దేహాన్ని సుఖభోగాలను అనుభవించనీయదు. కనుక శరీరం ఆత్మను హింసిస్తుంది. అదే విధంగా క్రైస్తవులు లోకాన్ని సుఖభోగాలు అనుభవించనీయరు. కనుక లోకం వారిని హింసిస్తుంది. శరీరం తన్నుద్వేషించినా ఆత్మ మాత్రం శరీరాన్ని ప్రేమిస్తుంది.అలాగే క్రైస్తవులు తమ్మ ద్వేషించే ఈ లోకపు ప్రజలను ప్రేమిస్తారు. ఆత్మ దేహంలో

బంధింపబడి వుంటుంది. ఐనా అది దేహంలోని అవయాలన్నిటినీ ఒక్కటిగా బంధిస్తుంది. అలాగే క్రైస్తవులు ఈ లోకంలో బంధింపబడి వున్నారు. ఐనా వాళ్ళు లోకాన్నంతటినీ బంధించి వుంచుతారు. నాశంలేని ఆత్మ నాశమయ్యే దేహంలో నెలకొని వుంటుంది. అలాగే క్రైస్తవులు నాశమయ్యే ఈలోక వస్తువులు మధ్య వసిస్తున్నా వారి ఆత్మలు మత్రం అవినాశమైన పరలోకం విూదనే దృష్టి నిల్పి వుంటాయి". ఈ రచయిత తిరుసభ స్వభావాన్ని చక్కగా వర్ణించాడు. మనంకూడ ఈ భక్తుడు చెప్పిన సూత్రాల ప్రకారం జీవించాలని ప్రభువుని వేడుకొందాం.

7. తిరుసభ లక్షణాలు

ఈ యధ్యాయంలో నిజమైన తిరుసభ లక్షణాలను నాల్డింటిని పరిశీలిద్దాం. ఈ లక్షణాలు కొంతవరకు ప్రొటస్టెంటు సమాజాల్లో కూడ కన్పించవచ్చు. కాని యివి పరిపూర్ణంగా క్యాతలిక్ తిరుసభలో మాత్రమే కన్పిస్తాయి. తిరుసభలో ఏకత, విశ్వవ్యాప్తత, పవిత్రత, పేషితులకు వారస సమాజంగా వుండడం అనే ముఖ్య లక్షణాలు నాల్గు కన్పిస్తాయి. విశ్వాస సంగ్రహంలో మనం ఈ లక్షణాల నుద్దేశించే “ఏక పవిత్ర, కతోలిక, అపోస్తలిక తిరుసభను విశ్వసించుచున్నాను" అని చెప్తాం.

1.ఏకత

తిరుసభతోపాటు లోకంలో ప్రొటస్టెంటు సమాజాలు కూడ వున్నాయి. మనకు వీటితో పొత్తులేదు. కనుక నేడు క్రీస్తు స్థాపించిన తిరుసభలో అనైక్యత, విభజనం వుందని చెప్పాలి. అటువైపు చాలమంది ప్రోటస్టెంటు క్రైస్తవులూ, ఇటువైపు చాలమంది క్యాతలిక్ క్రైస్తవులూ క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యంగావాలనే కోరుకొంటున్నారు. దీనికొరకు కృషి చేస్తున్నారు కూడ. కాని ఈ యైక్యత నేటివరకు సిద్ధించలేదు. క్రైస్తవుల్లోని ఈ అనైక్యత కారణంగా అన్యమతస్తులు క్రైస్తవమతాన్ని చిన్నచూపు చూస్తున్నారు. క్రీస్తకోరిన ఏక సమాజం ఏదీ అని అడుగుతున్నారు. కనుక ఈ యైక్యతను సాధించడం క్రైస్తవులందరి బాధ్యత.

నూత్నవేదం చాల తావుల్లో, క్రీస్తు స్థాపించిన తిరుసభలో ఐక్యత వుండాలని బోధిస్తుంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళల్లో లింగభేదం వర్గభేదం జాతిభేదం వండకూడదు. వాళ్ళంతా క్రీస్తునందు సరిసమానం, ఏకసమాజం కావాలి కా గల 3.2728. దేహంలోని అవయవాలన్నీ కలసి ఒక్క శరీరమౌతాయి. అలాగే క్రీస్తు అవయవాలమైన మనమంతా కలసి ఆ ప్రభువునందు ఒక్క తిరుసభ కావాలి - రోమా 12,4-5.

యోరూషలేము క్రైస్తవులంతా ఒకే మనసూ ఒకే హృదయమూ కలిగి ఏక సమాజంగా జీవించారు. అ,చ, 4,32. క్రీస్తు ఒకేమందా ఒకేకాపరీ" వండాలని కోరుకొన్నాడు - యోహా 10,16. తండ్రీ క్రీస్తూ ఏకమై యున్నట్లుగా శిష్యులు కూడ తమలోతాము ఏకమై యుండాలని క్రీస్తు అభిమతం - 17,21-23. క్రైస్తవులకు ఒకే ప్రభువు ఒకే విశ్వాసం ఒకే జ్ఞానస్నానం ఒకేతండ్రియైన దేవుడు ఒకేఆత్మ ఒకే సమాజం వుందికనుక వాళ్ళంతా ఏకమై యుండాలి - ఎఫె 45-6. ఈ వేద వాక్యాలన్నీ కూడ మనలో మనం ఐక్యమై యుండాలని, అనైక్యత దైవసమాజ లక్షణం కాదనీ బోధిస్తున్నాయి.

తిరుసభ ఐక్యత నరమాత్రులు సాధించేదికాదు. పవిత్రాత్మే దాన్ని క్రైస్తవులకు వరంగా ప్రసాదించాలి, ఆత్మ మనలో మనం ఐక్యమయ్యేలాను, మనమంతా కలసి క్రీస్తుతో ఐక్యమయ్యేలాను చేస్తుంది.

తిరుసభలో ముఖ్యమైన అంశాల్లో ఐక్యత వుంటేచాలు. అనగా దానిలో ఒకే విశ్వాసం, ఒకే దేవద్రవ్యానుమానాల సముదాయం, ఒకే ఆరాధన, అందరూ ఒకే అధికారానికి లోబడి వుండడం అనే గుణాలు వుండాలి. ఇక్కడ అధికారానికి లోబడి వుండడమంటే, స్థానికంగా బిషప్పలకీ, విశ్వవ్యాప్తంగా పోపుగారికీ లోబడివుండాలి. ఈ ముఖ్యగుణాలన్నీ క్యాతలిక్ తిరుసభలో వుంటాయి. కనుక దానిలో ఐక్యత వుంది. ప్రోటస్టెంటు సమాజాల్లో ముఖ్యంగా చివరి లక్షణం లోపిస్తుంది. వాళ్ళు పోపుగారి అధికారాన్ని అంగీకరించరు. ఈ యంశం క్రైస్తవ సమైక్యతకు పెద్ద ఆటంకంగా వుంది. కాని ఆత్మ ప్రేరణంవల్ల ఈ యాటంకం వెంటనే కాకపోయినా క్రమేణ తొలగిపోవచ్చు.

క్రైస్తవ సమాజంలో ఐక్యత అంటే అన్ని క్రైస్తవ సమాజాలు మూస పోసినట్లుగా ఒకేరీతిగా వుండాలని భావంకాదు. సమాజాలకూ సమాజాలకు అప్రధాన విషయాల్లో వ్యత్యాసం వుండవచ్చు. ప్రధాన విషయాల్లో మాత్రం ఐక్యత వండాలి. పౌలునాడే యూద క్రైస్తవుల తిరుసభలూ, గ్రీకు క్రైస్తవుల తిరుసభలూ భిన్నభిన్నంగా వుండేవి. నేడు కూడ ల్యాటిన్ క్రైస్తవుల తిరుసభకూ, గ్రీకు క్రైస్తవుల తిరుసభకూ సిరియా క్రైస్తవుల తిరుసభకూ వ్యత్యాసాలు వున్నాయి. ఈ తేడాలు విశేషంగా ఆరాధన విధానంలోను క్రమశిక్షణ విధానంలోను ఆధ్యాత్మిక సాధన విషయంలోను వేదశాస్తాంశాల విషయంలోను కన్పిస్తాయి.

క్రైస్తవ సమాజాలన్నీ ఒకే విధంగా వుంటే చూడ్డానికి విసుగుపడుతుంది. కనుక అప్రధాన విషయాల్లో భిన్నత్వం మంచిది. ఈ భిన్నత్వం వలన ఒక్కో క్రైస్తవ సమాజం ప్రత్యేకంగాను ఆకర్షణీయంగాను కన్పిస్తుంది. స్థానిక సంస్కృతులు కూడ తిరుసభలోకి రావచ్చు. అందుకే ప్రాచీనకాలంలోనే అగస్టీను భక్తుడు “భిన్నత్వం వలన తిరుసభలో శోభ హెచ్చింది” అని చెప్పాడు.

2. విశ్యవ్యాప్తత

విశ్వాస సంగ్రహంలో "కతోలిక తిరుసభను విశ్వసిస్తున్నాను” అంటాం. "కతోలికోస్" అనేది గ్రీకుమాట. ఈ పదానికి విశ్వమంతట వ్యాపించి వున్నది అని అర్థం. అన్ని తావుల్లోను వ్యాపించి వుండడమనేది తిరుసభ రెండవ లక్షణం.

బైబులు బోధలను పరికిస్తే, ప్రభువు అబ్రాహాం ద్వారా అన్ని జాతులు దీవెనలు పొందుతాయని ఆదికాండంలోనే ప్రమాణం చేసాడు - ఆది 12,3. ఉత్తాన క్రీస్తు మిూరు వెళ్ళి ప్రపంచమందంతటా, అందరు ప్రజలకూ సువార్తను బోధించండి అని చెప్పాడు మార్కు 16,15. ఇంకా అతడు మిూరు భూదిగంతాల వరకూ నాకు సాక్షులుగా వుంటారు — అనగా నన్ను గూర్చి బోధిస్తారు అని చెప్పాడు - అ, చ.1-8. తొలిరోజుల్లోనే పౌలు ఆనాటి యూరపు ఖండమంతటా వేదబోధచేసి సకలజాతి ప్రజలను విశ్వాసరంగంలో క్రీస్తుకి విధేయులనుగా జేసాడు - రోమా 1,5. ఈ విధంగా తిరుసభ తాను పుట్టినప్పటినుండి అన్ని జాతుల్లోను వేళ్ళపాతుకొంది.

విశ్వవ్యాప్తతలో మూడంశాలున్నాయి. 1. తిరుసభ అన్ని తావుల్లోను వ్యాపించి వుండాలి. 2. అన్ని కాలాల్లోను వ్యాపించి వుండాలి. 3. తిరుసభ అన్ని కాలాల్లోను అన్ని తావుల్లోను ఒకే విశ్వాసాన్ని సంపూర్ణంగా బోధించి వుండాలి.

ఈ లక్షణాలు క్యాతలిక్ తిరుసభకు చాలవరకు వర్తిస్తాయి. ప్రారంభంనుండే అది అన్ని తావుల్లోను, అన్ని శతాబ్దాల్లోను వ్యాపిస్తూ వచ్చింది. లోకంలోని నరులందరూ కాకపోయినా చాలమంది దానిలో చేరారు. ప్రారంభంనుండే అన్ని తావుల్లో కాకపోయినా అది చాలా తావుల్లో వ్యాప్తి చెందింది. తొలి శతాబ్దాలనుండి తిరుసభ ముఖ్యమైన బోధ ఒకే విధంగా వుంది. కాని ఆయా కాలాల్లోని సమస్యలను పరస్కరించుకొని తిరుసభ బోధల్లో నూత్న విషయాలు చేరుస్తూ వచ్చారు. కనుక ఆ బోధ కాలక్రమేణ పెరుగుతూ వచ్చింది.

8వ శతాబ్దంలో గ్రీకు క్రైస్తవులూ, 16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు క్రైస్తవులూ ఆదిమ తిరుసభనుండి చీలిపోయి క్రొత్త క్రైస్తవశాఖలను ఏర్పరచుకొన్నారు, ఈలా చీలిపోయిన శాఖలకు పై విశ్వవ్యాప్తత అనే లక్షణం అంతగా వర్తించదు. అవి కొన్ని కాలాల్లో కొన్ని తావుల్లో మాత్రమే ఉన్న శాఖలు.

విశ్యవ్యాప్తత అనేది ఉత్తానక్రీస్తు అతని ఆత్మా తిరుసభకు దయజేసిన వరం. ఆత్మ అన్ని కాలాల్లోని ప్రజలకు అన్ని తావుల్లోని ప్రజలకు క్రీస్తుని ప్రత్యక్షం చేస్తుంది. దీనివల్ల తిరుసభ అంతటా వ్యాపించింది, అన్ని జాతులవాళ్లు ఆ సభలోచేరి తమ ప్రత్యేక సంస్కృతినీ శక్తి సామర్థ్యాలనూ ఆ సభలోనికి తీసుకవచ్చారు. ఇందుచే తిరుసభ ఎంతో వృద్ధిలోకి వచ్చింది. స్థానిక తిరుసభలు విశ్వ తిరుసభను సుసంపన్నం చేసాయి. విశ్వ తిరుసభ స్థానిక తిరుసభల ప్రత్యేకతను గౌరవించింది. ఒక్క ఇండియానే తీసికొంటే, ఇక్కడ ఎన్నిరాష్ట్రాలు ఎన్ని భాషలు ఎన్ని సంస్కృతులు లేవు? ఇవన్నీ తిరుసభను సుసంపన్నం చేసాయి కదా! ఈలా ఎన్ని దేశాల్లో విశ్వతిరుసభ వ్యాపించిందో అన్ని దేశాల్లోను అది సుసంపన్న మౌతూనే వుంటుంది కదా! ఐనా వింతయేమిటంటే, విశ్వతిరుసభ ఎన్నిదేశాల్లో, ఎన్నికాలాల్లో వ్యాపించినా దాని విశ్వాసం ఒకేరీతిగా వుంటుంది. అది అందరు ప్రజలకు ఒకే రక్షణ సువార్తను బోధిస్తుంది.

3.పవిత్రత

తిరుసభ క్రీస్తకి గుర్తుగా వుండేది కనుక ఆ ప్రభువులాగే అదికూడ పవిత్రమైంది. ఎఫెసీయులు 5,25-27. తిరుసభను నిష్కళంకమైన క్రీస్తు వధువునుగా వర్ణిస్తుంది. 1కొరింతీయులు 3,16–17. దాన్నిదేవుని పవిత్రమందిరంగా వర్ణిస్తుంది. తిరుసభ సభ్యులు పునీతులు. వాళ్లు పునీత ప్రజ, పవిత్రయాజకులు 1 పేత్రు 2,9. పవిత్రాత్మే తిరుసభను పవిత్ర సమాజాన్నిగా తీర్చిదిద్దుతుంది.

1. బైబులు భావాల ప్రకారం దేవుడు పరమ పవిత్రుడు. అతని పవిత్రత ప్రధానంగా పాపానికీ పాపపు లోకానికీ దూరంగా వుండడంలో వుంటుంది. నరులమైన మనం క్రియలద్వారా పవిత్రులమౌతాం. కాని దేవుడు తన వనికిద్వారానే పవిత్రుడు.

దేవుడు తన పవిత్రతను పంచియిస్తేనే తప్ప ఏ ప్రాణి, ఏ వస్తువూ పవిత్రంకాదు. కనుక దేవునితో సంబంధం కలిగించుకోవడంద్వారా నరుడు పవిత్రుడౌతాడు.

బైబులు దేవునికి అంకితమైన నరులుగాని వస్తువులుకాని పవిత్రులౌతారని చెప్తుంది. ఈ యంకితం కావడంలో రెండంశాలున్నాయి. మొదటిది, పాపపు ప్రపంచంనుండి వేరుచేయబడ్డం. రెండవది, పవిత్రుడైన భగవంతుని సేవకు సమర్పింపబడ్డం. యాజకులు, ప్రవక్తలు, దేవాలయం, మందసం ఈలాంటివి.

పూర్వవేదంలో యిస్రాయేలు సమాజం ఇతరజాతుల నుండి వేరుచేయబడి, దేవుని సేవకు అంకితం కావింపబడింది. కనుక ఆ ప్రజ పవిత్రమైంది - నిర్గ 19,5-6. వాళ్ల పవిత్రుడైన దేవుళ్ళాగే పరిశుద్ధంగా వుండవలసినవాళ్లు.

నూత్నవేద ప్రజయైన తిరుసభకూడ పాపపు లోకంనుండి వేరుచేయబడి క్రీస్తు సేవకు అంకితమైంది. కనుక పవిత్రమైంది — 1షేత్రు 2,9. ఈ పవిత్రత ప్రజలు తమంతట తాము సాధించేది కాదు. దేవునినుండి పొందేది.ఎప్పడుకూడ దేవుని ఆత్మే మనలను పవిత్రులను చేస్తూంటుంది. తిరుసభ పవిత్రత మనం కంటితో చూచేదికాదు. విశ్వాసంతో నమ్మేది, తిరుసభలో ఓవైపు పాపాత్ములూ మరోవైపు పరమ పవిత్రులూ కూడ వున్నారు. పునీతులు వేదసాక్షులు కన్యలు స్తుతీయులు మఠస్థాపకులు మొదలైనవాళ్ళంతా తిరుసభ పావిత్ర్యాన్ని చాటిచెప్పేవాళూ


తిరుసభ అంతా కలసి పవిత్రమైంది. తిరుసభ సభ్యులమైన మనంకూడ వ్యక్తిగతంగా పవిత్రులం కావడానికి నిరంతరం కృషి చేయాలి. మనం పుణ్యకార్యాలు చేసినపుడల్లా ఆత్మ తన వరప్రసాదబలంతో మనలను పునీతులను చేస్తుంది. మన సత్కార్యాలద్వారా తిరుసభ పవిత్రత లోకంలో చీకటిలో దీపంలా ప్రకాశిస్తుంది. మదర్ తెరీసా ఈలాంటి మాన్యురాలు.

2. తిరుసభ పవిత్రమైందని చెప్పాం. ఐనా అది పాపాత్ములతో కూడిన తిరుసభ కనుక అది పాపాపూరితమైంది కూడ. మనం ఓవైపు పవిత్రంగా వుండాలని ప్రయత్నం చేసినా మరోవైపు పాపకార్యాలు చేస్తూనే వుంటాం. ఈలాగే తిరుసభ అంతాకూడ పాపకార్యాలు చేస్తూనే వుంటుంది. ఆ సభ నాయకుల్లో అధికార దాహమూ, సుఖభోగాలూ, ధనవాంఛా, లౌకిక విలువలూ, ఆత్మప్రబోధాన్ని పెడచెవిని పెట్టడం, క్రీస్తు బోధలను విస్మరించడం అనే నానాపాపాలు వున్నాయి. ఆత్మ ప్రేరణంతోపాటు పిశాచ ప్రేరణం కూడ తిరుసభలో ఎప్పడూ కన్పిస్తూనే వుంటుంది.

నూతవేదం తిరుసభ కళంకమైంది అని చెప్తుంది. వలలో చక్కిన చేపల్లో మంచివీ పాడువీకూడ వున్నాయి - మత్త 13,47-50. క్రైస్తవుల్లో ఎవరైనా మాకు పాపంలేదు అని చెస్తే వాళ్లు తమ్ముతామే మోసగించుకొన్నట్లవుతుంది - 1యోహా 1,8. మనమంతా చాలసార్లు పొరపాట్ల చేస్తాం - యాకో 3,2. ఈలాంటి వేదవాక్యాలన్నీ తిరుసభ పాపాన్ని నిరూపిస్తాయి. పాపాత్ములు ఆ సభలో ఎప్పడూ వుంటారు. వారి పాపాలు క్రీస్తు శరీరాన్ని కళంకితం చేస్తాయి. దాన్ని గాయపరుస్తాయి. అది కూలి పడిపోయేలా చేస్తాయి. దాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఈ మచ్చ దానికి దేవునినుండిరాదు. తన సభ్యులనుండే వస్తుంది.

తిరుసభ దోషి కనుక తన పాపాలకు తాను పశ్చాత్తాపపడాలి. తన తప్పిదాల కొరకు తపస్సుచేసి ప్రాయశ్చిత్తం చేసికొని దోషవిముక్తిని పొందాలి. ఆత్మనుండి నూత్నత్వాన్ని సంపాదించుకోవాలి.

తిరుసభ ఒకవైపు పాపాత్మురాలు, మరోవైపు పవిత్రురాలు. అందుకే విశ్వాససంగ్రహంలో "పవిత్ర తిరుసభను విశ్వసిస్తున్నాను" అంటాం. ఈ లోకంలో యాత్ర చేస్తూన్నంత కాలం అది ఓవైపు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటూనే వుండాలి.

మరోవైపు పావిత్ర్యంలో అభివృద్ధి చెందుతూనే వుండాలి. మోక్షాన్ని చేరుకొని మహిమను పొందినపడేగాని తిరుసభ పాపాన్ని పూర్తిగా విడనాడి సంపూర్ణమైన పావిత్ర్యాన్ని పొందలేదు. 

మన తరపున మనం తిరుసభ పవిత్రతనీ మాలిన్యాన్నీ కూడ గుర్తిస్తుండాలి. ఇంకా మనలోని వెల్లురునీ చీకటినీ కూడ నిరంతరం గమనిస్తూండాలి. రోజురోజుకీ ఆ చీకటిని తగ్గించుకొని వెల్లురుని పెంచుకొంటూండాలి.

4. ప్రేషితులకు వారస సమాజం

పేత్రు యోహాను మొదలైన తొలి పండ్రెండుమంది ప్రేషితులు నెలకొల్పిన తొలి క్రైస్తవ సమాజనికి వారసంగా వచ్చింది తిరుసభ తొలి పండ్రెండుమంది శిష్యులు స్థాపించిన తిరుసభ వారితో అంతరించలేదు. అది నేటి తిరుసభలో ఇంకా కొనసాగుతూనే వుంది. ప్రస్తుత తిరుసభ అనే గొలుసు ఆ తొలి తిరుసభ అనే కొక్మానికి అతుక్కొని వుంది. అందుకే విశ్వాస సంగ్రహంలో “అపోస్తోలిక తిరుసభను విశ్వసిస్తున్నాను" అంటాం. అనగా ఇప్పటి తిరుసభ తొలి పండ్రెండుమంది అపోస్తలులతో ప్రత్యక్ష సంబంధం కలది అని భావం. ఈ సభ ఎప్పడో, ఎక్కడో క్రొత్తగా వూడిపడలేదని అర్థం.

దైవరాజ్యాన్ని బోధించడానికి మొదట తండ్రి క్రీస్తుని పంపాడు. క్రీస్తు తన తరపున తాను శిష్యులను పంపుతూ తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను" అన్నాడు - యోహా 20,21. వాళ్ళను వెళ్లి సకల జాతులకు తన్ను గూర్చి బోధించమని చెప్పాడు. తాను లోకాంతం వరకు వాళ్ళతో వుంటానని హామిూ యిచ్చాడు - మత్త 28,19–20. వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యులూ ప్రశిష్యులూ వాళ్ళ స్థాపించిన తిరుసభను కొనసాగిస్తూ వచ్చారు. అదే నేటి మన తిరుసభ, క్రీస్తు ప్రారంభించగా అపోస్తలులు వ్యాప్తి చేసిన దైవరాజ్యమే నేడు తిరుసభగా కొనసాగుతూంది. తొలి మూడు గుణాలవలె ప్రేషితులకు వారసంగా వుండడమనే ఈ నాల్గవ గుణం కూడ తిరుసభకు ఆత్మనుండే లభించింది.

కాని ఏ ముఖ్య విషయంలో తిరుసభ అప్లోలులకు వారస సమాజంగా వుంటుంది? అపోస్తలులకు ప్రత్యేక భాగ్యాలున్నాయి. వాళ్లు క్రీస్తుతో కలసి జీవించారు. ఉత్తాన క్రీస్తుని చూచారు. అతని ఆజ్ఞవల్లనే దైవరాజ్యబోధకు పూనుకొన్నారు. ఈ కార్యాలన్నిటిద్వారా వాళ్ళు తిరుసభకు పునాదిలాంటి వాళ్ళయ్యారు. ఈలా పునాదిగా వుండడం అనే లక్షణం అపోస్తలులతోనే అంతరించింది. ఆ లక్షణం వాళ్ల అనుయాయులకు రాదు.

కాని అపోస్తలులు క్రీస్తు బోధనకు కొనసాగించవలసిన పూచీకలవాళ్ళు. ఈ పూచీ, దైవరాజ్యబోధ అనే పని, అపోస్తలులతోపాటు వారి అనుయాయులకు గూడ సంక్రమించింది. 142 అపోస్తలులు తమనాడు క్రీస్తునీ అతని మరణోత్తానాలనూ అతని సందేశాన్నీ నానాజాతులకు బోధించారు. అది వారి సువిశేషబోధ. నేడు తిరుసభకూడ ఈయపోస్తలుల బోధనే కొనసాగించాలి. అది ఈ కార్యాన్ని విశ్వసనీయంగా నెరవేర్చాలి. ఈ కార్యంలో కల్లీ వుండకూడదు. అనగా తిరుసభ లోక విలువలకు లొంగకుండా స్వచ్ఛమైన క్రీస్తు విలువలనే ప్రచారం చేయాలి.

సువిశేషబోధ సేవాకార్యం. ఈ సేవను తిరుసభ వొళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వహించాలి. తిరుసభ అధికార దాహానికి లొంగకుండా నిరంతరం సేవక తిరుసభగా మెలగాలి. దాని లక్షణం ఊడిగం చేయడంకాని దొరతనం కాదు. ఇంకా అవసరమైతే తొలి అపోస్తలులలాగే నేటి తిరుసభకూడ కొన్ని వేదహింసలు అనుభవించాలి.

తిరుసభ సభ్యులంతా తొలి పండ్రెండు మంది శిష్యులకు వారసులే. పవిత్రాత్మ మనలను ఆ తొలి నాయకులకు వారసలనుగా జేసి నేడు మనమూ వారి సేవను కొనసాగించేలా చేస్తుంది. కాని ఇది విస్తృతార్థంలో మాత్రమే.

ఖండితార్థంలో పీఠాధిపతుల బందం మాత్రమే తొలి పండ్రెండుమంది ప్రేషితులకు వారసులు. పోపుగారుకూడ ఈ బృందంలోకే వస్తారు. వీళ్లు మాత్రమే అపోస్తలుల పారంపర్యాన్నీ అధికారాన్నీ బోధనీ సేవనీ కొనసాగించేవాళ్లు, వీళ్ళే నేటి తిరుసభను నడిపించే నాయకులు.

ఇప్పటి బిషప్పలు ఏవొక్క ప్రత్యేక అపోస్తలునికి కాక ఉమ్మడిగా అపోస్తలులందరికీ కలిసి వారసులౌతారు. తొలి అపోస్తలులందరికీ విశ్వసనీయులైన వారసులుగా వుండడం బిషప్పల ప్రధానధర్మం. అనగా తొలి పండైండుమంది విశ్వాసమే బిషప్పలకీ వండాలి.

క్యాతలిక్ తిరుసభ అపోస్తలుల తిరుసభకు వారసంగా వచ్చింది అని చెప్పాం. రెండవ శతాబ్దంలోనే ఇరనేయస్ అనే వేదశాస్త్రి అపోస్తలుల తర్వాత రోమాపురికి బిషపులుగా పనిజేసినవాళ్ళ జాబితాను తయారుచేసాడు. వీళ్ళనే ఇప్పుడు మనం పోపుగార్లు అంటున్నాం. ఈ పోపుగార్లు అపోస్తలుల తర్వాత అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చారు. వాళ్ళ నడిపించేదే నేటి మన తిరుసభ.

8వ శతాబ్దంలో ఏర్పడిన గ్రీకు క్రైస్తవశాఖల్లో కాని, 16వ శతాబ్దంలో ఏర్పడిన ప్రొటస్టెంటు శాఖల్లోకాని ఈలా తొలి అపోస్తలులతో సంబంధం కలిగివుండడం అనే • లక్షణంలేదు, ఇది క్యాతలిక్ తిరుసభకు ప్రత్యేకం.

ప్రార్థనా భావాలు

1.క్రీస్తు అంగీని కుట్ల లేకుండ ఏకవస్త్రంగా నేసారు. సైనికులు అతని వస్తాలను నాల్లు భాగాలుగా విభజించి తమలోతాము పంచుకొనేపడు ఆ యంగీని చించలేదు. అదృష్టపు చీట్లు వేయగా అది సైనికుల్లో ఒకరికి వచ్చింది. యోహా 19,23-24. ప్రాచీన వేదశాస్తులు ఈ కుట్టలేని అంగీని తిరుసభతో పోల్చారు. క్రీస్తు ధరించిన అంగీలాగే తిరుసభ కూడ ఐక్యతా భావం కలది. దానిలో శాఖలు ముఠాలు విభేదాలు వుండకూడదు.
2.చాలమంది క్రైస్తవులకు తిరుసభనుండి తీసికోవడం మాత్రమే తెలుసు. వీరి దృష్టిలో తిరుసభ పెద్ద సాంఘిక సంక్షేమ సంస్థ. దీన్ని ఆసరాగా బెట్టుకొని పొట్టబోసికోవచ్చు, వుద్యోగాలు సంపాదించుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు అని వీళ్ళ భావన. వీళ్ళ వట్టి స్వార్థపరులు. మంచి క్రైస్తవుడు తిరుసభనుండి తీసికొనేపుడు తీసికొన్నా ఇచ్చేపుడు ఇస్తాడు. అతడు తిరుసభ వ్యాప్తికి తోడ్పడతాడు. దానికి సేవలు చేస్తాడు. దాన్ని తల్లిగా భావించి దానిపట్ల అభిమానంతో మెలగుతాడు.
3.మన తిరుసభ విదేశాల ధనసహాయంమిూద అతిగా ఆధారపడుతూంది. ఏకారణంచేతనైనాసరే ఈ ధనసహాయం ఆగిపోతే తిరుసభ కుప్పకూలిపోతుంది. కనుక ఈలా ఆధారపడ్డం చెడ్డపద్ధతి. మన సామాన్యావసరాలకు మనదేశంలోని క్రైస్తవులే ధనసహాయం చేసికోవాలి. మనకాళ్ళమిూద మనం నిలబడాలి. అప్పడే తిరుసభ ఈ దేశంలో వేళ్ళబాతుకొని అభివృద్ధి చెందేది.

8. తిరుసభలో గృహస్తులు

ఇంతవరకు తిరసభ ఆంతరంగిక స్వభావాన్ని పరిశీలించి చూచాం. ఇకవిూడట తిరుసభలోని వివిధ వర్గాల ప్రజలను గూర్చి విచారించాలి. తిరుసభ క్రీస్తు శరీరమని ముందే చెప్పాం - 1కొరి 12,27. ఈ శరీరంలో వివిధ అవయవాలున్నాయి. అన్ని అవయవాలు దేహం శ్రేయస్సు కొరకే పనిచేస్తాయి. ఈ అవయవాలే వివిధవర్గాలప్రజలు. వీరిని గూర్చి మనం క్షుణ్ణంగా తెలిసికోవాలి.

తిరుసభ దైవప్రజలతో కూడింది. ఈ ప్రజలంతా క్రీస్తుచే రక్షించబడినవాళ్లు, అతన్ని విశ్వసించేవాళ్ళు అతనిచే దైవరాజ్య బోధకు పంపబడినవాళ్ళు ఈ దృష్టితోజూస్తే ఈ ప్రజలంతా సరిసమానులే. గురువులూ గృహస్థలూ అందరికీ ఒక్కటే విలువ. క్రైస్తవులంతా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లే ఈ జ్ఞానస్నానం ద్వారానే మనం తిరుసభలో చేరతాం. జ్ఞానస్నానం ద్వారా అందరమూ క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాం - 1పేత్రు 2,9-10. జ్ఞానస్నానం పొందిన వాళ్లందరికీ జ్ఞానస్నాన యాజకత్వం వుంటుంది. ఈ జ్ఞానస్నాన యాజకత్వం ద్వారా మనమందరమూ సరిసమానులమౌతాం. కనుకనే అగస్టీను భక్తుడు ఆనాటి ప్రజలనుద్దేశించి "మితోపాటు నేనూ క్రైస్తవుట్టే ఐనా మిూ కొరకు నేను పీఠాధిపతిని" అని చెప్పాడు. ఓ వ్యక్తి గురువో బిషప్పో ఐనపడు క్రైస్తవుడు కాకుండా వుండడు. జ్ఞానస్నానం ద్వారా అతడు తోడి క్రైస్తవులకు సరిసమానుడౌతాడు. కాని యాజకత్వం ద్వారా తోడి క్రైస్తవులకు అధికుడౌతాడు. ఐనా తిరుసభ గురువులదీ బిషప్పలదీ పోపుగారిదీ మాత్రమే కాదు. క్రైస్తవులందరిదీకూడ. తిరుసభ సభ్యులందరికీ ఓ సామన్య బాధ్యత వుంది. అది దైవరాజ్య వ్యాప్తి. ఈ బాధ్యత ద్వారా తిరుసభలోని సభ్యులంతా సరిసమానులే ఔతారు. మనందరికీ ఒకే ప్రభువు, ఒకే జ్ఞానస్నానం, ఒకే విశ్వాసం వున్నాయి - ఎఫె 4,5. క్రీస్తులోనికి ఐక్యమైన ప్రజల్లో జాతి లింగ వర్గభేదాలు లేవు - గల 3,28.


తిరుసభలోని ప్రజలందరూ విలువలో సరిసమానులైనా వారిలో వివిధ అంతస్తులున్నాయి. మొదటి అంతస్తు గృహస్తులది. కనుక మొదట వారిని గూర్చి విచారిద్దాం.

1. చారిత్రకంగా గృహస్తుల పాత్ర

గృహస్థులు తిరుసభకు చెందినవాళ్లు మాత్రమే కాదు. వాళ్లకూడ తిరుసభే. గృహస్తులంటే ఎవరు? తిరుసభలో గురువులూ మఠసభలకు చెందినవాళూ వున్నారు. ఈ రెండు వర్గలకు చెందని వాళ్ళంతా గృహస్టులే.

క్రైస్తవ సమాజంలో గృహస్కల పాత్ర శతాబ్దాల పొడుగున క్రమేణ దిగజారిపోయింది. ఆ వైనాన్ని క్లుప్తంగా తెలిసికొందాం.

తొలి రెండు శతాబ్దాల్లో తిరుసభలో యాజకులు సామాన్య క్రైస్తవులు అని రెండు వర్గాల ప్రజలు మాత్రమే వుండేవాళ్ళు ఈ వ్యభయ వర్గాలకు విలువలో తేడాలేదు. వీళ్ళ చేసే పనుల్లో మాత్రం వ్యత్యాసముండేది.

మూడవ శతాబ్దానికల్లా సన్యాసులనే మరో వర్గం వచ్చింది. వీళ్ళు నేడు మఠసభలకు చెందినవారితో సమానం. సన్యాసులు లోకం కొరకుగాక దేవునికొరకు జీవించేవాళ్లు లోక వ్యామోహాలను వదలుకొన్నవాళ్లు కనుక వీళ్ల జనావాసాలకు దూరంగా, ఏకాంతంగా వసించేవాళ్లు.వీళ్ళ పాలు లోకవస్తువులు కాదు, ప్రభువే. కనుక వీళ్లు దేవుని మీదనే ఆధారపడి జీవించేవాళ్లు, గురువులు విశేషంగా దేవద్రవ్యానుమానాల సేవకూ, పూజబలిని అర్పించడానికీ, ఉద్దేశింపబడినవాళ్లు, ఈ సేవకుగాను వీళ్లకు గురుపట్టం అవసరమైంది. ఇక గృహస్తులు లోకంలో జీవిస్తూ లోక వ్యవహారాలను పట్టించుకొంటూ తమ రక్షణ కార్యాన్ని తాము చూచుకొనేవాళ్లు, కనుక వీళ్లను లౌకికులు అన్నారు.

క్రమేణ పై గురువులూ సన్యాసులూ కలసిపోయి ఏక వర్గమయ్యారు. గృహస్టులు ఏకవర్గమయ్యారు. కనుక తొమ్మిదవ శతాబ్దం నుండి రెండు వర్గాల ప్రజలు వుండేవాళ్లు, గురువర్గం మతవిషయాలు చూచుకొనేది. గృహస్థ వర్గం లౌకిక విషయాలు పట్టించుకొనేది కాలక్రమేణ గురువర్గంలోనివాళ్లు విద్యావంతులుగా చలామణి అయ్యారు. వాళ్లు వేద శాస్త్రాలూ లౌకికశాస్త్రాలూ కూడ బోధించేవాళ్లు, గృహస్థ వర్గంలోనివాళ్లు అవిద్యావంతులుగా చలామణి అయ్యారు. వాళ్ళ కేవలం లోకజీవనం గడిపేవాళ్లు, 12వ శతాబ్దానికల్లా గృహస్థల్లో అవిద్య ఇంకా పెరిగింది. వాళ్ళ విలువకూడ తగ్గింది. చదువు లేకపోవడమే దీనికి కారణం.

12వ శతాబ్దంలో వర్ధిల్లిన గ్రేష్యన్ అనే తిరుసభ న్యాయశాస్త్రవేత్త “దేవుణ్ణి తమ పాలుగా ఎన్నుకొని దైవరాజ్యంకొరకు జీవించేవాళ్లు గురువులు. వీళ్లు ఇతరులకు నీతినీ ధర్మాన్నీ బోధిస్తారు. లోకాన్ని తమ పాలుగా ఎన్నుకొని లోకవ్యవహారాల్లో జీవించేవాళ్ళ లౌకికులు. వీళ్ళ పాపాన్ని విడనాడితే రక్షణను పొందవచచ్చు” అని వ్రాసాడు.

గురువులు దైవకార్యాల్లో నిమగ్నులౌవుంటారు. కనుక వీళ్ళను "ఆధ్యాత్మిక వర్గం" అన్నారు. గృహస్తులు ఇహలోక కార్యాల్లో నిమగ్నులై వుంటారు కనుక, వాళ్ళను "లౌకిక వర్గం" అన్నారు. క్రమేణ గురుజీవితం మాత్రమే ఆదర్శవంతమైంది, అది మాత్రమే క్రీస్తుని అనుసరించేది అనే భావం ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మచారులుగావుండి గురుజీవితం గడపడానికి శక్తి లేనివాళ్ళు దానికంటి తక్కువస్థాయికి చెందిన గృహస్థ జీవితం గడపవచ్చు అనే అభిప్రాయంకూడ వ్యాప్తిలోకి వచ్చింది. కనుక ఆదర్శవంతమైంది గురుజీవితం, దాన్ని అందుకోలేనివాళ్లు గృహస్థలుగా వండిపోతారు, వీళ్ళస్థాయి తక్కువది. గురుజీవితం బలవంతుల కొరకు, బలహీనులకు సంసారజీవితం. సంసారులు లోక వ్యవహారాల్లో వుండేవాళ్లు కనుక వాళ్ళకు మతపరమైన పవిత్రకార్యాలతో సంబంధంలేదు. 12వ శతాబ్దంలో వ్యాప్తిలోవున్న భావాలు ఇవి.

ఇక, గురుజీవితం గొప్పది గృహస్టుల జీవితం తక్కువది అనేభావాన్ని 16వ శతాబ్దంలో లూతరు సవాలుచేసాడు. అప్పటికి తిరుసభతో గురువర్గం ప్రాముఖ్యం బాగా ప్రబలిపోయింది. గృహస్థల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయింది. కాని లూతరు తీవ్రవాదాన్ని అవలంబించి తిరుసభలో అసలు గురువర్గమే వుండకూడదన్నాడు. గురుపట్టమనే ప్రత్యేక దేవద్రవ్యానుమానమే లేదన్నాడు. తిరుసభ సభ్యులంతా గృహస్థులే అన్నాడు. లూతరు వర్గంవాళ్లు సంస్కరణ వాదులయ్యారు.

ఈ తీవ్రవాదాన్ని ఖండించడానికి క్యాతలిక్ సమాజం నుండి ప్రతిసంస్కరణ వాదులు ముందుకి వచ్చారు. వీళ్లు గృహస్టుల పాత్రను మరీ తగ్గించారు. వీళ్ళకు జ్ఞానస్నాన యాజకత్వంగూడ లేదన్నారు. గురువులుపొందే గురుపట్ట దేవద్రవ్యానుమానం స్థాయిని మరీ హెచ్చించారు.

రానురాను తిరుసభలో గృహస్థల స్థానం పూర్తిగా దిగజారిపోయింది. గృహస్థలు కేవలం లౌకికులు కనుక వాళ్ళకు దైవరాజ్యాన్ని బోధించి దాన్ని వ్యాప్తిచేసే బాధ్యత లేదనుకొన్నారు. సంసారులు గురువులనుండి ఆత్మరక్షణకు అవసరమైన సహాయాలూ వరప్రసాదాలూ పొందితేచాలు అనుకొన్నారు. ఈ విధంగా గృహస్తుల పాత్ర పూర్తిగా దిగజారిపోయింది. ఈ పరిస్థితే ఇంచుమించు రెండవ వాటికన్ సభవరకు కొనసాగుతూ వచ్చింది.

2. రెండవ వాటికన్ సభ బోధలు

రెండవ వాటికన్ సభ సాధించిన ముఖ్యకార్యాల్లో ఒకటి, గృహస్తుల స్థానాన్ని పునరుద్ధరించడం. తొలి శతాబ్దాల్లో గృహస్థలకున్నప్రాముఖ్యాన్ని ఈ సభ మళ్లా వెలుగులోకి తెచ్చింది. సంగ్రహంగా ఈసభ బోధలు ఇవి. గృహస్థలు జ్ఞానస్నానంద్వారా క్రీస్తు దేహమైన దైవప్రజలౌతారు. పరిపూర్ణంగా తిరుసభ సభ్యులౌతారు. వాళ్ళ పద్ధతిలోవాళ్లు క్రీస్తు యాజకత్వంలోను రాజత్వంలోను ప్రవక్తృత్వంలోను పాలుపొందుతారు. వాళ్ళకు చేతనైనట్లు వాళ్లు దైవరాజ్యబోధకూ దాని వ్యాప్తికీ పూనుకొంటారు. గురువులు ఆధ్యాత్మిక రంగంలో కృషిచేస్తూ దైవరాజ్యాన్ని వ్యాప్తిచేస్తారు. పులిపిడి పదార్థం పిండిని పొంగజేస్తుంది. అలాగే గృహస్థలు లౌకికరంగంలో పలిపిడి పదార్థంలా పనిచేస్తూ ప్రాపంచిక విషయాలను పునీతం చేస్తారు.

గృహస్తులకుకూడ ప్రేషిత సేవచేసి దైవరాజ్యాన్ని వ్యాప్తిచేసే హక్కువుంది. ఈ హక్కువాళ్ళకు తిరుసభలోని అధికారులైన గురువులు బిషప్పలు మొదలైన వాళ్ళనుండిరాదు. జ్ఞానస్నానంనుండే వస్తుంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా వీళు యాజకులౌతారు. గురువులది దేవద్రవ్యానుమాన సేవకొరకు ఉద్దేశింపబడిన ప్రత్యేక యాజకత్వం. గృహస్టులది జ్ఞానస్నానంవల్ల එබීරඹී సామాన్యయాజకత్వం, ఆ యాజకత్వం ఈ యాజకత్వాన్ని అణచివేయకూడదు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా వీళ్లుకూడ ఆ ప్రభువు యాజకత్వంలోను, ప్రవక్తృత్వంలోను, రాజత్వంలోను పాలుపొందుతారు. గురువులకంటే భిన్నమైన పద్ధతిలో వీళ్లుకూడ ఈ మూడు రంగాల్లో సేవలు చేస్తారు.

1. గృహస్టులు యాజకులుగా వ్యవహరిస్తూ గురువులతోపాటు తాముకూడ పూజబలిని సమర్పిస్తారు. వాళ్లు తమ కుటుంబజీవితాన్నీ లోకంలో తాముచేసే కృషినీ తమ కష్టసుఖాలనూ గురువు సమర్పించే క్రీస్తు బలితో చేర్చి పరలోక పితకు అర్పిస్తారు. దీనిద్వారా వీళ్ళ లౌకిక జీవితం పవిత్రమాతుంది. దేవునికి మహిమ చేకూరుతుంది.

2. గృహస్తులు ప్రవక్తలుగా వ్యవహరిస్తారు. అనగా దైవరాజ్యాన్ని బోధిస్తారు. వీళ్లు మొదట తమ ఆదర్శవంతమైన జీవితంద్వారానే దైవరాజ్యాన్ని బోధించాలి. అటుతర్వాత వాక్యబోధకూడ చేస్తారు. కానీ వీళ్లు ప్రధానంగా తమకుటుంబం, వృత్తి, లౌకికరంగం మొదలైన వాటిద్వారానే క్రీస్తుని బోధించాలి. ఈ బోధను సంతృప్తికరంగా నిర్వహించడానికి వీళ్ళకు దైవశాస్తాంశాల్లో తర్ఫీదు అవసరం. ఇంకా విజ్ఞానవరం ఆత్మానుగ్రహం మొదలైనవికూడ అవసరం.

3. గృహసులు రాజులుగా, అనగా నాయకులుగా వ్యవహరిస్తారు. వీళ్ళ నాయకత్వం ప్రధానంగా లౌకికరంగంలో వుంటుంది. వివిధ వృత్తులు ఆర్థిక సాంఘిక రంగాలు సంస్కృతి అభివృద్ధి కార్యక్రమాలు జాతీయాంతార్టీతీయ సంఘటనలు శాస్త్రరంగం సమాచార సాధనాలు మొదలైన నానా లౌకిక కార్యాల్లో వీళ్లు నాయకత్వం నెరపాలి. ఈ లౌకిక రంగాన్ని దైవసాన్నిధ్యంతో నింపి అది క్రీస్తువల్ల ప్రభావితమయ్యేలా చేయాలి. ఈలా గృహస్థలు కూడ దైవరాజ్యాన్ని వ్యాప్తిచేయాలి. న్యాయం, శాంతి, ప్రేమ, సత్యం, పవిత్రత, వరప్రసాదం మొదలైన దివ్యగుణాలతో గూడిన దైవరాజ్యాన్ని వాళ్ళ కూడ వ్యాప్తి చేయాలి.

ఈలా వాటికన్ సభ గృహస్తుల అంతస్తును పూర్తిగా పునరుద్ధరించింది. ఈ సభ జరిగి నలభై యేండ్లయినా దీని బోధలు మన దేశంలో నేటికీ ప్రచారం కాలేదు. అందువల్ల మనదేశంలో ఇప్పడు కూడ గృహస్తులు ముందుకు వచ్చి తమ బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహించలేకపోతున్నారు. వీళ్ళకు ఎంతో తర్ఫీదు అవసరం. మన గురువులు గృహసులకు తోడి పనివాళ్ళనుగా వాడుకోవాలి. గృహసులు కూడ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గృహస్థల ప్రేషిత సేవ అనే రంగంలో మనం సాధించింది చాల తక్కువ. ఇంకా ఎంతో కృషి జరగాలి.

ప్రార్ధనా భావాలు

1.తిరుసభ అంటే యెవరు? మామూలుగా మనం పోపుగారు బిషప్పలు గురువులు మొదలైన అధికార వర్గమే తిరుసభ అనుకొంటాం, అనధికార వర్గమైన గృహస్థలు తిరుసభలో ముఖ్యమైన సభ్యులుకారు అనుకొంటాం. ఇది పొరపాటు. అధికారవర్గమూ అనధికారవర్గమూ అందరూ తిరుసభే, అందరూ పరిపూర్ణంగా ఆ సభ సభ్యులే. అందరూ క్రీస్తులోనికి జ్ఞానస్నానంపొంది అతని మూడు లక్షణాల్లో పాలు పొందినవాళ్లే పై వుభయవర్గాల వాళ్లు చేసే పనుల్లో తేడా వుండవచ్చు. g వాళ్ళ విలువమాత్రం సరిసమానమే. . 2.ప్రస్తుతం ఇండియాలోని తిరుసభ విదేశ తిరుసభలా వుంది. మన గుళూ బళల్లా శిల్పమూ సంగీతమూ ఆరాధనా ఆచార వ్యవహారాలూ మొదలైనవి పాశ్చాత్య నమూనాల్లో వున్నాయి, అసలు మన తిరుసభలో పాశ్చాత్య సంస్కృతే గాని భారతీయసంస్కృతి కానరాదు. కనుక హిందువులు మన క్రైస్తవమతం, మన తిరుసభ పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయ్యాయని అంటుంటారు. మనది పరాయి మతమని వెక్కిరిస్తారు. దీనిలో కొంత సత్యం లేకపోలేదు. మనం క్రీస్తుని నమ్మినా వేషభాషల్లో సంస్కృతిలో భారతీయులంగానే వండాలి. మనం భారతీయ క్రైస్తవులం అని మర్చిపోకూడదు. మనం ఈ దేశ సంస్కృతిని ఎంతత్వరగా స్వీకరిస్తే හoéර කිහරඩ්ධි.

9. తిరుసభలో అధికారం సేవకొరకే పూర్వాధ్యాయంలో క్రీస్తు దేహమైన తిరుసభలోని సభ్యులందరికీ ఒకేవిలువ వుంటుందని చెప్పాం. కాని ఈ సభ్యులకు భిన్నమైన పరిచర్యలున్నాయి. ఒక్కోవర్గంవాళ్లు ఒక్కోసేవ చేస్తారు. జ్ఞానస్నానంద్వారా అందరు సరిసమానమైనా తాముచేసే సేవనుబట్టి తిరుసభ సభ్యుల్లో వ్యత్యాసాలున్నాయి. ఈ యధ్యాయంలో తిరుసభలో అధికారమంటే యేమిటో తెలిసికొందాం. తిరుసభలోని గురుపదవి ఏలా మూడంతస్తుల అధికారంగా చలామణిలోకి వచ్చిందో గూడ పరిశీలిద్దాం. .

1. తిరుసభలో అధికారులు ఆత్మే తిరుసభను నెలకొల్పింది. కనుక అది దైవ నిర్మితమైన సమాజం. ఐనా తిరుసభ మానవ నిర్మితమైన సమాజంకూడ. దాని సభ్యులు మానవ మాత్రులు. ఇక,

149 మానవ సమాజాలకు నాయకులు ఉండాలి, లేకపోతే అవి కొనసాగవు. తిరుసభ కూడ మానవసమాజం గనుక దానికి గూడ మానవనాయకులుండాలి. ఈ నాయకులే గురుత్వమనే దేవద్రవ్యానుమానాన్ని పొందిన గురువులు.

ఈ నాయకులకు తిరుసభను నడిపించే వరాన్ని దేవుని ఆత్మే దయచేస్తుంది. ఇది ప్రత్యేక వరం. ఈ వరం కలవాళ్ళ తిరుసభను దేవుని మార్గాల్లో నడిపిస్తారు. దానిలోని కార్యకలాపాలను క్రమబద్ధం చేస్తారు. దానిలోని ప్రజలు ఆత్మ తమకు దయచేసిన వరాలను సద్వినియోగం చేసికొనేలా చేస్తారు. గురుపట్టం ద్వారా గురువులు తిరుసభకు నాయకులౌతారు. ఈ గురుపట్టం అధికారయుతమైంది. ఐనా సేవాత్మకమైంది.
తిరుసభలోని అధికారానికి కొన్ని లక్షణాలున్నాయి. అది ఆత్మ ప్రేరితమైంది. దేవుని ఆత్మే కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిని గురుజీవితానికి ఆహ్వానిస్తుంది. వీళ్ళు తర్వాత ఆ సభలో అధికారం నాయకత్వం చేపడతారు. దేవుడు ఆహ్వానించందే ఎవరూ తమంతట తాము గురువులు కాలేరు. ఇంకా, ఈ పవిత్ర సమాజంలో నాయకత్వం శాశ్వతమైంది. గురువైన వ్యక్తి శాశ్వతంగా గురువుగానే వుంటాడు. గురుత్వం అతనిమిూద శాశ్వతమైన ముద్రను వేస్తుంది. అతడు క్రీస్తు స్థానంలో వుండి తిరుభలో పనిచేస్తాడు. పైపెచ్చు ఈ దివ్య సమాజంలో నాయకత్వం బహిరంగమైంది. గురువు గురుపట్టం ద్వారా అధికారాన్ని బహిరంగంగానే పొందుతాడు. తర్వాత ఆ యధికారాన్ని బహిరంగంగానే నిర్వహిస్తాడు.
తిరుసభలో అధికారులు లేక నాయకులు లేక గురువులు క్రీస్తు స్థానంలో వుండేవాళ్లు, క్రీస్తులాగే మంద కొరకు ప్రాణాలు అర్పించేవాళ్లు, గురువు తన కొరకు తాను కాక క్రీస్తు మంద కొరకు వున్నవాడు. గురువు ప్రధాన బాధ్యత దైవరాజ్యాన్ని గూర్చి ప్రజలకు బోధించి దాన్ని వ్యాప్తి చేయడం. ఆ రాజ్యానికి సాక్షిగా వుండడం. అతడు ఈ లోకంలో క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తాడు. పూజబలి ద్వారా క్రీస్తుని విశ్వాసులకు ప్రత్యక్షం చేస్తాడు. ఈ గురుపదవిలో పీఠాధిపతి, గురువు, పరిచారకుడు (డీకన్) అని మూడు అంతస్తులున్నాయి. మన దేశంలోగాని, ల్యాటిన్ తిరుసభలోగాని జీవితాంతం డీకన్లుగా వుండేవాళ్లు ఎవరూ లేరు. గ్రీకు తిరుసభలో వున్నారు. ఇక, దైవశాస్త్ర రీత్యా గురుపదవి భావమేమిటో చూద్దాం.

2. అధికారం సేవ కొరకే

తిరుసభలో అధికారాన్ని లేక నాయకత్వాన్ని సేవ అంటారు. ఈ నాయకత్వానికి "నూతవేదం వాడిని గ్రీకుమాట "డియాకోనియా". ఈ మాటకు మొదట అన్నం వడ్డించడం అని అర్థం, అన్నం వడ్డించడం అనే మూలార్థం నుంచి సేవచేయడం అనే భావం క్రమేణ వ్యాప్తిలోకి వచ్చింది. కనుక తిరుసభలో అధికారమంటే సేవ.

క్రీస్తు తిరుసభలోని నాయకులు సేవకులుగా వ్యవహరించాలని కోరాడు. వాళ్లు ప్రజలకు సేవలు చేయడానికే జీవించాలని ఆజ్ఞాపించాడు. ఈ సేవాభావం లోకంలోని నాయకుల్లో లేదు. వాళ్ల పెత్తనం చలాయిస్తారు - మార్కు 10,42-45. సేవకులంగా మెలగడం మనకు కష్టం. కనుక క్రీస్తే స్వయంగా శిష్యుల కాళ్ల కడిగి మనకు ఓ ఆదర్శాన్ని చూపించాడు. మామూలుగా శిష్యులు గురువు కాళ్లు కడగాలి. కాని గురువే శిష్యుల కాళ్లు కడిగి తాను సేవకుణ్ణని రుజువు చేసికొన్నాడు - యోహా 13,5. నేను మిమధ్య సేవకుణ్ణిగా వున్నానని చెప్పకొన్నాడు — లూకా 22,27.

కనుక తిరుసభలో నాయకులు అధికారులు ఐన గురువులు ఏనాడూ యజమానులుగాను పెత్తనం చలాయించే వాళ్లుగాను మెలగకూడదు. అది లోకంలో, రాజకీయాల్లో చెల్లుతుందిగాని క్రీస్తు సమాజంలో చెల్లదు. గురుత్వం పదవి, గౌరవం, పలుకుబడి, పెత్తనం, స్వార్ధలాభం మొదలైనవాటికొరకు ఉద్దేశింపబడింది కాదు. భక్తితో వినయంతో క్రీస్తు మందకు సేవలు చేయడం కొరకు ఉద్దేశింపబడింది.

గురువు గురుపట్టాభిషేక సాంగ్యంలో బిషప్ప "క్రీస్తు సేవలు చేయడానికేగాని జేయించుకోవడానికి రాలేదు. అతడు తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించడానికి వచ్చాడు. నీవు ఎల్లప్పడు ఆ మంచి కాపరిని ఆదర్శంగా పెట్టుకో? అని నూత్న గురువును హెచ్చరిస్తారు. “దేవుని దాసులకు దాసుడు” అని పోపుగారికి బిరుదం. తిరుసభలోని అధికారులు దేవుడు తమకు ఒప్పగించిన మందమిూద పెత్తనం చలాయించకూడదని చెప్మంది మొదటి పేత్రు జాబు 5,1-3.

తిరుసభలోని అధికారులనూ ప్రజలనూ గూర్చి చెప్పేపుడు నూత్నవేదం వాడే ఉపమానాలు కాపరి-మంద, భర్త-భార్య అనేవి. మంచి కాపరి తన మందకొరకు ప్రాణాలు అర్పిస్తాడు - యోహా 10,11. క్రీస్తు తిరుసభ అనే వధువు పాపమాలిన్యాన్ని తొలగించడానికి సిలువమిూద ప్రాణాలు అర్పించాడు - ఎఫె 5,25-27, గురువులు తిరుసభలో క్రీస్తుస్థానంలో వుండేవాళ్లు. కనుక వాళ్లు క్రీస్తులాగే మందకు సేవలు చేయాలి. ఆ మందకొరకు తమ ప్రాణాలను గూడ అర్పించాలి. ఇదే మొదట మనం పేర్కొన్న డియాకోనియా లేక సేవ అన్న మాటకు అర్థం. కనుక మందను తన స్వార్గానికి వాడుకొనేవాడు దుష్ట గురువు, అతడు గురువు పదవికి అర్హుడు కాడు.

3. గురుత్వంలో మూడంతస్తులు

ఇక గురుపదవి చరిత్రను పరిశీలిద్దాం. గురుత్వంలో పీఠాధిపతి, గురువు, పరిచారకుడు అని మూడంతస్తులున్నాయి. క్రీస్తు మొదట గురుత్వాన్ని స్థాపించినపుడు ఈ మూడంతస్తులులేవు. అవి క్రమేణ పరిణామం చెందాయి. కాని ఈ పరిణామం క్రీస్తు కోరికను అనుసరించే జరిగింది.

1. క్రీస్తు గురుత్వంలోని మూడు మెట్లను స్వయంగా స్థాపించలేదు. అతడు అపోస్తలులనే గురువులుగా నియమించాడు. 2.క్రీస్తు అభిమతం ప్రకారమే ఈ గురుత్వం క్రమేణ మూడు మెట్లుగా పరిణామం చెందింది. అతడు అపోస్తలులతో పాటు 72 శిష్యులను గూడ ఎన్నుకొన్నాడు. దివ్యసత్ర్పసాదాన్నిగూడ స్థాపించాడు. కనుక గురుత్వం ఏక శాఖగా కాక భిన్న శాఖలుగా వుండాలని అతని కోరికై వుండవచ్చు. 3.క్రీస్తు ఉత్థానానంతరం అతడు స్థాపించిన గురుత్వం మూడు శాఖలుగా పరిణామం చెందింది. ఆనాటి తిరుసభ అవసరాలను బట్టి ఈ పరిణామం అవసరమైంది. పైగా తిరుసభలో నెలకొనివున్న ఆత్మ ప్రేరణం ద్వారానే ఈ పరిణామం జరిగింది. మనకు తెలిసినంతవరకు ఈ పరిణామం వివరాలివి.
అపోస్తలులతోపాటు కొందరు పెద్దలుకూడ యెరూషలేములో సమావేశమై ఆనాటి తిరుసభలో నిర్ణయాలు చేసారు - అచ.15,22. తిమోతి తీతు జాబుల్లో తొలినాటి తిరుసభ అధికారుల్లో పర్యవేక్షకులు (ఎపిస్కోపోయి)పెద్దలు (ప్రెస్బితెరోయి)పరిచారకులు (డియాకొనోయి) అని మూడు వర్గాలవాళ్లు కన్పిస్తారు. పర్యవేక్షకులు పెద్దలు సరిసమానమైన అధికారాన్ని నిర్వహించినట్లు కూడ తెలుస్తుంది. అనగా వారి పదవులు సరిసమానమైనవి. వీళ్లుగాక ఇంకా ప్రవక్తలు బోధకులు అనే వాళ్లుకూడ తిరుసభలో వుండేవాళ్లు.
క్రీ.శ.95లో క్లెమెంటు అనే తిరుసభ అధికారి తాను వ్రాసిన జాబులో పర్యవేక్షకులు పెద్దలు అపోస్తలులకు వారసులు అని చెప్పాడు. అనగా అప్పటి తిరుసభలొని వివిధాధికారుల్లో ఈ వుభవయ వర్గాలవాళ్ళు ముఖ్యులు అనుకోవాలి.
క్రీ.శ.110 ప్రాంతంలో అంటియోకయ బిషప్పయిన ఇగేష్యస్గారు చాల జాబులు వ్రాసారు. ఈ జాబులు పైన మనం పేర్కొన్న పర్యవేక్షకులను తిరుసభలోకెల్ల ఉన్నతాధికారులుగా వర్ణిస్తాయి. అనగా అప్పటికల్లా పర్యవేక్షకులు అనబడేవాళ్లు పీఠాధిపతులు అయ్యారు. పెద్దలు అనబడేవాళ్లు వాళ్లక్రింద పనిచేసే గురువులయ్యారు. పరిచారకులు అనబడేవాళ్లు మూడవ అంతస్తులో వున్నారు. ఇగ్నేప్యస్ గారు'ఒక్క దివ్యసత్ర్పసాదం, ఒక్క పాత్రం, ఒక్క బలిపీఠం, పెద్దల బృందంతోను పరిచారక బృందంతోను కూడిన పీఠాధిపతి" అని వ్రాసారు. కనుక ఆనాడు ఒక్కోపీఠాధిపతి ఆధీనంలో ఓ గురు బృందమూ ఓ పరిచారక బృందమూ పనిచేస్తూ వుండివుండాలి. ఈ రీతిగా "ఇప్పటి పీఠాధిపతులు గురువులు పరిచారకులు అనే మూడంతస్తుల క్రమం రెండవ శతాబ్దం ప్రారంభంలో ఏర్పడింది. 

రెండవ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన ఇరెనేయస్ అనే వేదశాస్త్రి వ్రాతల ప్రకారం తిరుసభ అధికారుల్లో పీఠాధిపతి ముఖ్యమైనవాడు. ఇతడే అపోస్తలులు స్థాపించిన తిరుసభకు వారసుడుగా వుండేవాడు. ఇతని ద్వారానే ఆయా క్రైస్తవ సమాజాలు తొలి అపోస్తలులు స్థాపించిన ఆదిమ తిరుసభతో సంబంధం కలిగివుండేవి. ఈ వేదశాస్త్రి రోము పీఠాన్ని పరిపాలించిన పీఠాధిపతుల జాబితాను కూడ తయారుచేసి వాళ్ళు తొలి పండ్రెండుమంది అపోస్తలుల తర్వాత కొనసాగుతూ వచ్చినవాళ్ళని చెప్పాడు. ఈలా పీఠాధిపతుల స్థానం క్రమేణ ప్రాముఖ్యంలోకి వచ్చింది.

ప్రార్ధనా భావాలు

1. తిరుసభలో మూడు భాగాలున్నాయి. ఈ లోకంలో వున్నది యుద్ధ తిరుసభ. ఇది పిశాచంతో పోరాడేది. మోక్షంలో వున్నది విజయ తిరుసభ. ఉత్తరించే స్థలంలో వున్నది బాధామయ తిరుసభ. ఈ మూడు భాగాలకు పరస్పర సంబంధం వుంది. మోక్షంలోని భక్తులు తమ ప్రార్థనల ద్వారా ఈలోకంలో పోరాడే మనకు సాయం చేస్తుంటారు. మోషే యీస్రాయేలీయులు కొరకు ప్రార్ధన చేసాడు. సైఫను తన్ను హింసించేవారి కొరకు జపించాడు. తుఫానులో చిక్కిన పౌలు ఓడలోని తోడి ప్రయాణికుల కొరకు మనవిచేసాడు. కాని ఈ భక్తులంతా మోక్షానికి వెళ్లాక తమ ప్రార్థనను మానివేయరు కదా! కనుక మోక్షంలోని వాళ్ళమన కొరకు జపిస్తారు. మన తరపున మనం నమ్మకంతో వారి ప్రార్థనా సహాయాన్ని అడుగుకోవాలి.

2. మోక్షంలోని అర్యశిష్ణులను పూజించడం వలన ఈ లోకంలోని తిరుసభకు మూడు లాభాలు కలుగుతాయి. ఆ భక్తులు తమ పుణ్యజీవితం ద్వారా మనకు ఓ మంచి ఆదర్శాన్ని చూపిస్తారు. ఈ భూమిమిూద వున్న మనకు మోక్షంలోని పునీతులతో సహవాసం లభిస్తుంది. వాళ్లు తమ ప్రార్థనల ద్వారా మనకు సహాయం చేస్తారు.

10. పీఠాధిపతులు

గృహస్తులూ గురువుల తర్వాత పీఠాధిపతులను గూర్చి చెప్పాలి.

మొదటి వాటికన్ సభ పోపుగారి పదవిని గూర్చి సవిస్తరంగా బోధించిందిగాని పీఠాధిపతులను గూర్చి ఏమి చెప్పలేదు. రెండవ వాటికన్ సభ బిషప్పుల అధికారాన్ని గూర్చి సవిస్తరంగా బోధించింది. ఈ సభ ముఖ్యబోధల్లో బిషప్పుల అధికారంకూడ ఒకటి. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం. 

1. పీఠాధిపతులు క్రీస్తు అధికారంలో పాలుపొందుతారు

పీఠాధిపతుల పదవి తిరుసభలో అతిప్రాచీనమైనది. వీరిద్వారానే తిరుసభలో అపోస్తలులతోడి సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఇరెనేయస్ వేదశాస్త్రి చెప్పినట్లుగా "తొలి ప్రేషితులు స్వయంగా నియమించిన వారసుల ద్వారాను వారి వారసులద్వారాను తిరుసభలో ఆ మొదటి ప్రేషితుల సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.”

బిషప్పులు తొలి ప్రేషితులతో నేరుగా సంబంధం కలవాళ్లు, వీళ్లు ఆ ప్రేషితుల బోధనే కొనసాగించి ప్రజలను దైవరాజ్యంలోనికి చేర్చారు. అపోస్తలుల చర్యలు 20,28, తీతు 1,6-9 వీళ్ళ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. తిరుసభ నాల్లులక్షణాల్లో వొకటి, తొలి ప్రేషితులతో సంబంధం కలిగివుండడం, వారికి వారస సమాజమై వుండడం. ఈ కార్యం బిషప్పల ద్వారానే నెరవేరుతుంది.

మేత్రాణులనుగూర్చి రెండవ వాటికన్ సభ ఈలా బోధించింది, క్రైస్తవ సమాజంలో బిషప్పులు క్రీస్తు స్తానంలో వుంటారు. క్రీస్తు పేరుమిదిగా కార్యాలు నిర్వహిస్తారు. నేడు క్రీస్తు బిషప్పులద్వారాను వారి అనుచరులైన గురువులద్వారాను తన వుద్యమాన్ని కొనసాగించుకొనిపోతాడు. క్రీస్తు ప్రతినిధులుగా, రాయబారులుగా మేత్రాణులు ఆయా స్థానిక తిరుసభలను పరిపాలిస్తుంటారు. వీరిద్వారానే క్రీస్తు ఆయా తిరుసభల్లోని క్రైస్తవుల్లో ప్రత్యక్ష

మౌతూంటాడు.

మంచి కాపరియైన క్రీస్తు స్థానంలో వుండే ఈ పీఠాధిపతులపట్ల విశ్వాసులు ప్రేమభావంతో మెలగాలి. తిరుసభ క్రీస్తుకీ, క్రీస్తు తండ్రికీ అంటిపెట్టుకొని వున్నట్లే విశ్వాసులు కూడ తమ పీఠాధిపతికి అంటిబెట్టుకొని వుండాలి. అతన్ని తండ్రినిలాగ గౌరవించాలి

పీఠాధిపతులు క్రీస్తు స్థానంలో వుండి విశ్వాసులకు అతన్ని ప్రత్యక్షం చేసేవాళ్లు గనుక, క్రీస్తు మూడు లక్షణాలైన ప్రవక్తృత్వం, యాజకత్వం, రాజత్వం వారికికూడ సమృద్ధిగా లభిస్తాయి. ఈ లక్షణాలద్వారానే వాళ్ళ క్రీస్తు అధికారంలో పాలుపొందుతారు.

1. బిషప్పు ప్రవక్త, సువిశేషబోధ పీఠాధిపతి ముఖ్యకార్యాల్లో వొకటి. బిషప్పకి అభిషేకం జరిగేప్పడు నూత్నవేదాన్ని అతని తలమిూద పెడతారు. అతడు ప్రధానంగా దైవరాజ్య బోధకుడని దీని భావం. తొలిపేషితులు పవిత్రాత్మ దిగివచ్చినపుడు వాక్యక్తిని పొందింది ఈ బోధకొరకే - అచ 2,4.

బిషప్పుల బృందం తమకు శిరస్సుయిన పోపుగారితో కలసి బోధించిన వేదసత్యాలకు పొరపాటుపడని వరం వుంటుంది. బిషప్పల బోధలు నైతిక విశ్వాసరంగాలకు పరిమితమై వుంటాయి. వాళ్ళు క్రీస్తు పేరుమిదుగా బోధిస్తారు. కనుక విశ్వాసులు ఈ బోధలను పూర్ణహృదయంతో స్వీకరించాలి.

2. బిషప్పు యాజకుడు. తన మేత్రాసనంలో అతడు ప్రధాన యాజకుడు. అభిషేకంద్వారా అతనికి పరిపూర్ణమైన యాజకత్వం లభిస్తుంది. దీనిద్వారా అతడు ప్రజలకు క్రీస్తు రక్షణభాగ్యాలను పంచిపెట్టే గృహనిర్వాహకుడు ఔతాడు. మేత్రాసనంలో దైవార్చనను క్రమబద్ధం చేసేదీ, వ్యాప్తి చేసేదీ అతడే.

దివ్యబలి ఆరాధనలో అధ్యక్షుడు అతడే.ఆయా విచారణల్లో గురువుల పూజబలులు అర్పించేపుడు అతని ప్రతినిధులుగానే అర్పిస్తారు. అవసరమైనప్పడు బిషప్పు ఒక గురువుకి పూజబలిని అర్పించడానికీ అనుమతిని నిరాకరించవచ్చు.
బిషప్పు ముఖ్యంగా ప్రధాన యాజకుడు. మేత్రాసనంలోని విచారణలు స్థానిక తిరుసభను సూచిస్తాయి. మేత్రాసనం విశ్వవ్యాప్తమైన తిరుసభను సూచిస్తుంది. కనుక పీఠాధిపతి తన మేత్రాసనానికంతటికీ, ఒకవిధంగా విశ్వ తిరుసభకీ కూడ పూచీపడతాడు. 

మామూలుగా భద్రమైన అభ్యంగనాన్ని ఇచ్చేది పీఠాధిపతే. గురువులకు పాపసంకీర్తన దేవద్రవ్యానుమానాన్ని జరిపించే అధికారాన్ని ఇచ్చేది అతడే గురువుని తన మేత్రాసనానికి చెందినవాడ్డిగా చేసేదికూడ అతడే

అతడు తన మేత్రాసనంలోని మందకొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి. ఆదివారాల్లోను అప్పుపండగల్లోను వారి శ్రేయస్సు కొరకు పూజబలి నర్పించాలి. అతడు పవిత్రంగాను వినయంగాను సరళంగాను సోదరప్రేమతోను జీవిస్తూ, తన మందకు ఆదర్శంగా వండాలి.

3. బిషప్పు నాయకుడు. పీఠాధిపతి తన మేత్రాసనానికి ప్రధానకాపరి, లేక నాయకుడు. అపోస్తలులకు వారసుడు కనుక బిషప్పు తన మేత్రాసనంలో అన్ని అధికారాలు పొందుతాడు. అతడు కేవలం పాపగారికి ప్రతినిధిగాకాక, క్రీస్తు ప్రతినిధిగానే తన మేత్రాసనాన్ని పరిపాలిస్తాడు.

కాని మేత్రాసనంలో అతని అధికారం పెత్తనం చలాయించే రూపంలో వుండకూడదు. అతడు కాపరిగా, తండ్రిగా, సేవకుడుగా ప్రజలకు పరిచర్యలు చేయాలి. అంతేగాని సేవలు చేయించుకొనేవాడు కాకూడదు.

తిరుసభలో అధికారం సేవకొరకు ఉద్దేశింపబడిందని చెప్పాం. బిషప్పు అధికారంగూడ ఈ సేవకొరకేవుంది. సేవకుడూ మంచికాపరీఐన క్రీస్తే పీఠాధిపతికి ఆదర్శం.

2. పీఠాధిపతుల బృందం

ప్రపంచంలోని బిషప్పులంతా కలసి ఒక్క బృందం ఔతారు. ఈ బృందానికి శిరస్సు లేక నాయకుడు పోపుగారు. ఈ పోపుగారు కూడ బిషప్పుల్లో ఒకరే. ఆ విషయం తర్వాత వస్తుంది. తొలిరోజుల్లో పేత్రూ శిష్యులూ కలసి ఒక్క ప్రేషిత సంఘమయ్యారు. అలాగే పేత్రు వారసుడూ రోమాపురి బిషప్పూ ఐన పోపుగారూ, ఇతర బిషప్పలూ కలసి ఒక్క సంఘమౌతారు. ఆ ప్రేషిత సంఘమూ ఈ పీఠాధిపతుల సంఘమూ కూడ క్రీస్తు ఆజ్ఞవల్లనే ఏర్పడ్డాయి.

ఈ బిషప్పుల బృందానికి తిరుసభమిూద సమగ్రమైన అధికారం వుంటుంది. ఈ సంఘానికి శిరస్సు లేక అధిపతి పోపుగారు. సభ్యులు బిషప్పులు. అభిషేకంద్వారానే బిషప్పుకి ఈ సభ్యత్వం వస్తుంది. ఈ బృందమంతా కలసే తొలి అపోస్తలులకు వారసులు. వీళ్ళద్వారానే అపోస్తలుల సంప్రదాయం తిరుసభలో కొనసాగుతుంది. ఈ బిషప్పుల సంఘమంతా కలసి విశ్వవ్యాప్తమైన తిరుసభను పరిపాలిస్తుంది. తిరుసభలో ఈ సంఘానిదే పై యధికారం, అనగా ఈ సంఘానికి మించిన అధికారం మరెవరికీ లేదు.

పీఠాధిపతిని అభిషేకించడానికి ఒక్క బిషప్ప చాలరు, ముగ్గురుకావాలి. ఈ క్రియు బిషప్పు ఎప్పడూ ఏక వ్యక్తిగాగాక, ఒక బృందానికి చెందినవాడగా పరిగణింపబడతాడని సూచిస్తుంది.

బిషప్పుల పరిషత్తు (పాపగారు బిషప్పులు కలసి) ఏకగ్రీవంగా బోధించిన వేదసత్యాలు తిరుగులేని మోతాయి. వాటికి పొరపాటు పడని వరం వుంటుంది. పరిశుద్ధాత్మే ఈ పరిషత్తును నడిపిస్తుంది, ప్రబోధిస్తుంది. కనుక తిరుసభ సభ్యులు ఈ వేద సత్యాలను సంపూర్ణంగా అంగీకరించాలి.

మామూలుగా ఈలాంటి వేదసత్యాలను బిషప్పుల పరిషత్తు ఎక్యుమెనికల్ సభల్లో వెల్లడి చేస్తుంది. ఈ సభలు పోపుగారితోను అందరు బిషప్పులతోను కూడి వుంటాయి. ఐనా అందరు బిషప్పలూ ఈ సభలకు వ్యక్తిగతంగా హాజరు కానక్కరలేదు. వారు తమతమ తావుల్లో వుండే తమ సమ్మతిని వెల్లడి చేయవచ్చు. రెండవ వాటికన్ మహాసభ ఈలాంటి ఎక్యుమెనికల్ కౌన్సిల్

వాటికన్ మహాసభ తర్వాత "బిషప్పుల సమాఖ్య" అనేది కూడ వచ్చింది. దీనిలో అందరు బిషప్పుల తరపున కొందరు బిషప్పులు మాత్రమే పాల్గొంటారు. వీళ్లు పోపుగారి నాయకత్వం క్రింద సమావేశమై తిరుసభలోని ఆయా సమస్యలను గూర్చి చర్చిస్తారు. తమ బోధలనూ సూచనలనూ పరిష్కారాలనూ తిరుసభ కంతటికీ అందిస్తారు. ఈ సమాఖ్య ద్వారా బిషప్పులు విశ్వవ్యాప్తమైన తిరుసభ బాగోగులకు పూచీపడతారు. పోపుగారితో తమకున్న సంబంధాన్ని కూడ బలపర్చుకొంటారు. బిషప్పుల సమాఖ్య ఎప్పడూ పోపుగారి ప్రమేయం లేకుండా పనిచేయదు. శిరస్సు లేకుండా వట్టి అవయవాలు పనిచేయవుకదా!

పీఠాధిపతి వ్యక్తిగతంగా తన మేత్రాసనాన్ని పరిపాలిస్తాడు. ఇతర మేత్రాసనాల మిూదగాని, విశ్వ తిరుసభమిూదగాని అతనికి అధికారం వుండదు. కాని అతడు ఎప్పడూ బిషప్పుల పరిషత్తుకు చెందినవాడే కనుక, విశ్వతిరుసభ అవసరాలపట్ల గూడ శ్రద్ధ జూపిస్తాడు. మేత్రాణులు మామూలుగా తిరుసభలోని విశ్వాసం క్రమశిక్షణ భక్తి మొదలైన కార్యాలను పట్టించుకొంటారు. ఒక స్థానిక తిరుసభ అవసరాల్లోగాని హింసల్లోగాని వుంటే దానికి సాయం జేస్తారు. వేద బోధలో శ్రద్ధ జూపుతారు. ఎవరి స్థానిక తిరుసభను వాళ్ళ వృద్ధిలోకి తీసుకవస్తారు. దీని వలన విశ్వతిరుసభ అభివృద్ధి చెందుతుంది. బిషప్పు వ్యక్తిగతంగా తన మేత్రాసనానికే బాధ్యుడు ఐనా, బిషప్పుల పరిషత్తుకు చెందినవాడుగా విశ్వ తిరుసభకు కూడ బాధ్యుడు ఔతాడు.

3. స్థానిక తిరుసభ లేక మేత్రాసనం

మేత్రాసనానికే స్థానిక తిరుసభ అనిపేరు. బిషప్పు ఎప్పుడుకూడ తన మేత్రాసనాన్ని విశ్వతిరుసభలో బాగంగా గణించాలి. అది విశ్వతిరుసభతో సంబంధం లేని ముక్క అనుకోగూడదు. తన మేత్రాసనం దానంతట అదే నిలుస్తుంది అనుకోగూడదు. అతడు తన మేత్రాసనంలో ఏక, పవిత్ర, విశ్వవ్యాప్త ప్రేషిత తిరుసభను ప్రత్యక్షం చేయాలి. స్థానిక తిరుసభలో విశ్వతిరుసభ ఇమిడే వుంటుంది. చాలా స్థానిక తిరుసభలు చేరేకదా విశ్వతిరుసభ అయ్యేది? కనుక అతడు స్థానిక తిరుసభను అభివృద్ధి చేస్తూ దానిద్వారా పరోక్షంగా విశ్వతిరుసభను అభివృద్ధి చేయాలి.

విశ్వతిరుసభలో లాగే స్థానిక తిరుసభలోని ప్రజలనందరినీ ఐక్యంజేసేది పవిత్రాత్మే ఈయాత్మ మేత్రాసనంలోని సభ్యులందరికీ ఎవరికిచ్చే వరాలను వారికిస్తుంది. బిషప్ప ఈ వరాలను సద్వినియోగం జేసికొని స్థానిక తిరుసభను అభివృద్ధిలోకి తీసుకరావాలి. స్థానిక తిరుసభలోని బలానికీ ఐక్యతకూ కంటికి కన్పించని చిహ్నంగా వుండేది పవిత్రాత్మ అదే గుణాలకు కంటికి కన్పించే చిహ్నంగా వుండేవాడు బిషప్ప, కనుక మేత్రాసనం బాగోగులు చాలవరకు అతని మిూద ఆధారపడివుంటాయి.

బిషప్పు తన గురువుల బృందంతో కలసి పనిచేయాలి. వారిని ప్రోత్సహించాలి. వారి సహకారం లేందే మేత్రాసనం వృద్ధిలోకి రాదు. అతనికీ తోడి గురువులకీ వుండే సంబంధం, పెద్దన్నకీ తమ్ముళ్ళకీ వుండే సంబంధం లాంటిది. ఎప్పడుకూడ బిషప్పులకీ గురువులకీ మధ్య ఐకమత్యం సహకారం అవసరం. బిషప్పు గురువులతోపాటు గృహస్తులను కూడ ప్రోత్సహించాలి. వాళ్ళ వరాలను గూడ గుర్తించి వాళ్ళ సేవలను గూడ వినియోగించుకోవాలి. వాళ్ళచేత కూడ దైవరాజ్య వ్యాప్తి చేయించాలి. అప్పడే స్థానిక తిరుసభ వృద్ధి చెందేది. తిరుసభలో 99 పాళ్లు గృహస్తులే కదా!

మొత్తంమిూద బిషప్పు ఈ కాలపు అవసరాలనూ, ఈ కాలపు గురుతులనూ గ్రహించిన నాయకుడై యుండాలి.

4. పీఠాధిపతి పరిపూర్ణమైన గురుపట్టం

అభిషేకం ద్వారా పీఠాధిపతికి పరిపూర్ణమైన గురుపట్ట దేవద్రవ్యానుమానం లభిస్తుంది. గురువుకి పరిపూర్ణమైన గురుపట్టంలేదు. అతనికి దానితో రెండవస్థానం మాత్రమే లభిస్తుంది. పరిచారకుడికి మూడవ స్థానం లభిస్తుంది. కాని బిషప్పుకి మొదటి స్థానం లభిస్తుంది.

బిషప్పు అభిషేకం పొందేపుడు తోడి బిషప్పులు అతని మిూద చేతులు చాచి ఆత్మను ఆవాహనం చేస్తారు. ఈ సాంగ్యం ద్వారా అతడు పీఠాధిపతి ఔతాడు. క్రీస్తు ప్రతినిధియై ఆ ప్రభువు మూడు లక్షణాలను స్వీకరిస్తాడు. గురువు పీఠాధిపతి నుండి గురుపట్టం పొందుతాడు. అతడు పీఠాధిపతి యాజకత్వం ద్వారా క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాడు.

ప్రార్ధనా భావాలు

1. భాసిల్ భక్తుడు తిరుసభలోని పీఠాధిపతులను గూర్చి చెప్తూ ఈలా వ్రాసాడు. "పొట్టేళ్ళుకు ముందుగా నడుస్తూ గొర్రెలను నడిపించుకొని పోతాయి. అలాగే తిరుసభ అధికారులు కూడ క్రైస్తవ ప్రజలకు ముందుగా నడుస్తూ వాళ్ళను నడిపించుకొని పోతారు. ఆ ప్రజలచే ఆధ్యాత్మిక బోధలనే మేతను తినిపిస్తారు. ఆత్మ జలాలనే నీటిని త్రాగిస్తారు", నేటి తిరుసభకు కూడ ఈలాంటి అధికారులూ బోధకులూ లభిస్తే ఎంత బాగుంటుంది!

2. క్లెమెంటు భక్తుడు ఆదిమ క్రైస్తవ సమాజంలోని బిషప్పులను గూర్చి ఈలా చెప్పాడు. "తిరుసభలోని అధికారులు లౌకిక అధికారుల్లాగ పరిపాలనం చేయకూడదు. వాళ్లు సేవకులై మందకు ఉపచారాలు చేయాలి, ప్రజలకు తండ్రులై ఆదరభావాన్ని ప్రదర్శించాలి. వైద్యులై ప్రజలను సందర్శించాలి. కాపరులై ప్రజలను కాపాడాలి. సంగ్రహంగా చెప్పాలంటే అధికారులు నిరంతరం ప్రజల క్షేమం కొరకు కృషిచేయాలి" నేటి తిరుసభకు కూడ ఈలాంటి బిషప్పులు లభించాలని ప్రార్థిద్దాం.

11. పోపుగారి ప్రధానత్వం

పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా బిషప్పలంతా కలసి అపోస్తలులకు వారసులు. కాని ఈ యపోస్తలులకు పేత్రు పెద్ద రోము బిషప్పగారయిన పోపుగారు ఈ పేత్రుకి వారసుడు. కనుక బిషప్పలందరిలోను ఆయన ప్రథముడు, ప్రముఖుడు, ప్రధానుడు, ఈ యధ్యాయంలో పోపుగారి ప్రధానత్వాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

1. బైబులు బోధలు

గ్రీకు పదమైన "పాపాస్" ల్యాటినులో "పాపా" ఐ ఇంగ్లీషులో "పోప్"గా మారింది. ఈ శబ్దానికి తండ్రి, నాన్నఅని అర్థం. ఈ పదాన్ని మొదట బిషప్పలకూ మఠాధిపతులకు గూడ వాడేవాళ్లు. 6వ శతాబ్దం తర్వాత ఇది రోమాపురి బిషప్పకి మాత్రమే పరిమితమైంది, పోపుగారికి చాల బిరుదాలున్నాయి. వీటిల్లో "పేత్రుకి వారసుడు” అనేది ముఖ్యమైంది. దీన్నిబట్టే ఆయన విశ్వ తిరుసభకు అధికారి అయ్యాడు. బిషప్పల బృందానికి శిరస్సు అయ్యాడు.

కాని పోపుగారి ప్రధానత్వం అంటే ఏమిటి? పోపుగారు తిరుసభలోని బిషప్పులుకీ విశ్వాసులకీ అందరికీ అధిపతి. తిరుసభ అంతటిమీధ ఆయనకు సర్వోన్నతమైన అధికారం వుంది. ఆయన పేత్రుకి వారసుడు. పేత్రు రోమాపురి మేత్రాసనానికి బిషప్పు. పేత్రుని అపోస్తలులకు పెద్దనుగా నియమించిన ప్రభువు నుండే పోపుగారికి ప్రధానత్వం కూడ వచ్చింది. పోపుగారి ప్రధానత్వాన్ని మొదటి వాటికన్ సభ అధికార పూర్వకంగా ప్రకటనం చేసింది. రెండవ వాటికన్ సభ దృఢపరచింది. కనుక నేడు మనమందరం దీన్ని తిరుగులేని విశ్వాస సత్యంగా అంగీకరించాలి.
పోపుగారి ప్రధానత్వం పేత్రునుండి సంక్రమించింది. ఈ పేత్రు ప్రాచీనాధారాల ప్రకారం రోములోనే వేదసాక్షిగా మరణించాడు. ఇక్కడ మనం మొదట నూత్నవేదం నుండి పేత్రు అపోస్తలులందరికీ పెద్ద అనే సత్యాన్ని నిరూపించాలి. తర్వాత పేత్రుకి వారసుడూ రోమాపురి బిషప్పూ ఐన పోపుగారికి ఈ పెద్దరికం సంక్రమించిందని చారిత్రకంగా రుజువు చేయాలి. ఈ రెండంశాలు క్రమంగా చూద్దాం.

1. పేత్రు ప్రధానత్వం

నూత్నవేదం అపోస్తలుల జాబితాలను పేర్కొనేపడల్లా పేత్రు పేరే మొదట వస్తుంది - మార్కు 3,16-19, ఇతర ప్రేషితుల తరపున అతడు మాటలాడుతూంటాడు - మత్త 16,16. ఉత్థాన క్రీస్తు శిష్యులందరిలోను మొదట పేత్రుకే దర్శనమిచ్చాడు - 1కొరి 15,5. నూత్నవేదంలో మూడు ప్రధాన సందర్భాలు పేత్రు పండ్రెండుమంది శిష్యుల్లో ప్రధానుడని రుజువు చేస్తాయి. మొదటిది, మత్తయి 16,13-19. ఇక్కడ క్రీస్తు సీమోను నామాన్ని కేఫాగా(రాయి) మార్చాడు. తాను నిర్మింపబోయే తిరుసభకు అతన్ని పునాది రాతిని చేసాడు. ఇంకా అతినికి పరలోక రాజ్యపు తాళపుచెవులు(పూర్తి అధికారం) ఇచ్చాడు. వేటినైనా బంధించడానికీ విప్పడానికీ అధికారమిచ్చాడు(సర్వాధికారం) అనగా క్రీస్తు గృహానికి క్రీస్తే యజమానుడు కాగా, పేత్రు ఆ యజమానునికి ప్రతినిధి ఔతాడని భావం. వీటన్నిటిని బట్టి పేత్రు అపోస్తలులలో ప్రధానుడని అర్థం చేసికోవాలి.

రెండవది, లూకా 22,31-32. ఇక్కడ పిశాచం క్రీస్తు మరణ సందర్భంలో అపోస్తలులందరినీ శోధించింది. పేత్రుతో పాటు అందరూ పడిపోయారు. కాని క్రీస్తు ప్రార్థనా బలంవల్ల పడిపోయిన పేత్రు మళ్లాలేస్తాడు. అలా లేచాక అతడు తన సోదరులను బలపరుస్తాడు. ఇక్కడ "సోదరులు" అంటే క్రీస్తుని విశ్వసించే ఇతర అపోస్తలులంతా, వీళ్లందరినీ బలపరచే పేత్రు వీళ్లకు నాయకుడు ఔతాడు కదా! పేత్రు బలహీనుడైనా ప్రభువు అతనికి ఈ నాయకత్వాన్ని దయచేసాడు.
మూడవది, యోహాను 21,15-17. ఇక్కడ క్రీస్తు మూడు పర్యాయాలు తన మందను కాయమని పేత్రుకి చెప్పాడు. అనగా అతన్ని ఖండితంగా తన మందకు నాయకుణ్ణి చేసాడు. క్రీస్తే తన మందకు మంచి కాపరి - 10,10. పూర్వవేద ప్రజలకు యావే కాపరి. అనగా నాయకుడు. ఐనా న్యాయాధిపతులూ రాజులూ నాయకులూ కూడ ప్రజలకు కాపరులే. వీళ్లు యావే అధికారంలో పాలుపొంది యిస్రాయేలు ప్రజలకు నాయకులు అయ్యారు. అలాగే ప్రధాన కాపరియైన క్రీస్తుకూడ పేత్రుకి తన నాయకత్వంలో పాలు పంచియిచ్చాడు. అతడు క్రీస్తనే ప్రధాన కాపరి క్రింద పనిచేసే ఉపకాపరి. ఇంకా ప్రభువు, ఒకే మంద, ఒకే కాపరి అన్నాడు — 10,16. ఈ వొకే కాపరి మొదట పేత్రే. ఈ వొకే కాపరిద్వారా క్రీస్తు మందకు ఐక్యత సిద్ధించింది.
పై మూడు వేదభాగాలు పేత్రు శిష్యుల్లో ప్రధానుడనీ, క్రీస్తు అతనికి ప్రత్యేకాధికారం ఒప్పజెప్పాడనీ రుజువుచేస్తాయి. పేత్రు గొప్పతనం వల్ల అతనికి ప్రత్యేకాధికారం రాలేదు. క్రీస్తు కరుణవల్ల వచ్చింది. క్రీస్తు మెస్సీయా, అతడు పేత్రుని మెస్సీయా సమాజానికి శిరస్సునిగా నాయకుణ్ణిగా నియమించిపోయాడు.
అపోస్తలుల కార్యాలు తొలి 8 అధ్యాయాలు పేత్రు తొలినాటి క్రైస్తవ సమాజంలో ఏలా నాయకత్వం వహించిందీ వివరిస్తాయి. మత్తీయాను పండ్రెండవ అపోస్తలుద్దీగా ఎన్నుకోవడంలో, ఆత్మ దిగివచ్చాక యెరూషలేములో ఉపన్యసించడంలో, కుంటివాణ్ణి స్వస్థపరచాక దేవళంలో మాట్లాడటంలో పేత్రు నాయకత్వం వహించాడు. ఈ పేత్రు ప్రధానత్వం తర్వాత పోపుగారికి లభించింది. 

2. పేత్రు స్థానంలో పోపుగారు

ఇంతవరకు శిష్యుల్లో పేత్రు ప్రధానుడని రుజువు చేసాం. ఇక, ఈ ప్రధానత్వం పోపుగారికి ఏలా సంక్రమించిందో పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఆధారం చరిత్రే.
 
క్యాతలిక్ తిరుసభ నమ్మకం ప్రకారం రోము బిషప్పయిన పోపుగారు పేత్రుకి వారసుడు. రోము బిషప్పే పేత్రుకి ఎందుకు వారసుడు కావాలి? ఇతర బిషప్పలు ఎందుకు కాకూడదు? పేత్రు రోము పీరానికి అధిపతిగా వుండి అక్కడే వేదసాక్షిగా చనిపోయాడు కనుక, కాని పేత్రు రోము పీఠానికి అధిపతి అని మనకెలా తెలుసు?

అపోస్తలుల చర్యలు 12, 17 పేత్రు యెరూషలేము నుండి "వేరొక చోటికి" వెళ్లాడు అని చెప్తుంది. ఈ వేరొకచోటు రోమే ఐయండాలి, ఎందుకంటే, మొదటి పేత్రు జాబు 5,13. "బాబిలోనియాలోని తిరుసభ మిమ్ము అడిగినట్లు చెప్తుంది” అని నుడువుతుంది. ఈ "బాబిలోనియా" రోమే. ఈ రోముకి పీఠాధిపతియైన పేత్రు వ్రాసిన జాబే యిది.

తొలి రెండు శతాబ్దాల్లోని వేదసాక్షులూ భక్తులూ పేత్రు రోము పీఠాధిపతి అని రూఢిగా చెప్తున్నారు. అంటియోకయా బిషప్పయిన ఇన్యాసివారు రోమిూయులకు వ్రాసిన జాబులో “అపోస్తలులయిన పేత్రు పౌలుల్లాగ నేను మియాకు ఉపదేశం చేయలేను" అని వ్రాసాడు. పేత్రు రోముకి బిషప్పని ఇగ్నేప్యస్కి తెలుసు. కోరింతులో వసించిన డయొనీష్యస్ అనే భక్తుడు పేత్రుపౌలులు రోములో వేదబోధచేసి అక్కడే వేదసాక్షులుగా మరణించారని నుడివాడు. ఇరెనేయస్ వేదశాస్త్రి వ్రాతల ప్రకారం పేత్రు పౌలులు రోములోని తిరుసభను స్థాపించారు. రోములోని ఇప్పటి పేత్రు పెద్దగుడి అడుగున పేత్రు సమాధి కూడ వుంది. ఈలాంటి ఆధారాలనుబట్టి పేత్రు రోముకి బిషప్పగావుండి అక్కడే ప్రాణాలు విడిచాడని అర్థం జేసికోవాలి. ఈ సత్యాన్ని క్యాతలిక్, ప్రొటస్టెంటు క్రైస్తవులు కూడ అంగీకరిస్తారు.

కాని పేత్రు యెరూషలేమునుండి రోముకి ఎందుకువెళ్లాడు? మనకు రూఢిగా తెలియదు. బైబులు ఏమిూ చెప్పదు. ఆ రోజుల్లో రోము ప్రపంచంలో ముఖ్యమైన నగరం. మొదట అక్కడ క్రైస్తవ బోధ జరిగితే తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడ ప్రాకుతుంది. కనుక పవిత్రాత్మే పేత్రుని ప్రేరేపించి రోముకి తీసికొనిపోయి వుండవచ్చు. అతనితో క్రైస్తవ కేంద్రం యెరూషలేమునుండి రోముకి మారింది. పేత్రు అపోస్తలులకు పెద్ద కనుక సహజంగానే రోముకి బిషప్పయ్యాడు. పేత్రు తర్వాత రోముకి బిషప్పలైనవాళ్లు సహజంగానే అతనికి వారసులయ్యారు. వీళ్లే పోపుగార్లు. పేత్రు అపోస్తలులలో ప్రధానుడు కనుక ఆ ప్రధానత్వం అతని వారసులకు కూడ లభించింది. కనుక రోమాపురి బిషప్పలు

(పోపుగార్లు) తిరుసభ అంతటివిూద అధికారం నెరపుతూ వచ్చారు. తొలి శతాబ్దాల్లోనే విశ్వతిరుసభలోని మేత్రాసనాలన్నీ రోము అధికారాన్ని గుర్తించాయి. ఈమేత్రాసనాల్లో తగాదాలు కాని సందేహాలు కాని వచ్చినప్పడు రోము బిషప్ప జోక్యం జేసికొని వాటిని పరిష్కరించేవాడు. ఉదాహరణకు కొరింతుసభలో గొడవలు రాగా రోముకి బిషప్పయిన క్లెమెంటు జోక్యం జేసికొని వాటిని చక్కదిద్దాడు. అంటియోకయ బిషప్పయిన ఇగ్నేప్యస్ రోమను క్రైస్తవులకు జాబు వ్రాస్తూ “రోము ప్రేమతో అధ్యక్షతను వహిస్తుంది" అని వాకొన్నాడు. ఇరెనేయస్ వేదశాస్త్రి "రోమపీఠాన్ని పేత్రు పౌలులు స్థాపించారు కనుక దానికి ఓ ప్రత్యేకత వుంది. అపోస్తలుల సంప్రదాయం దానిలోనే కొనసాగుతుంది. కనుక తిరుసభలోని మేత్రాసనాలన్నీ రోముని ఆదర్శంగా పెట్టుకోవాలి” అని వ్రాసాడు. సిప్రియన్ రోము బిషప్ప పేత్రుస్థానాన్ని పొంది అతని సింహాసనాన్ని ఎక్కుతాడని చెప్పాడు. రోముతో ఐక్యమైయున్నంత వరకే ఇతర తిరుసభలకు విలువ వుంటుదని ఒస్టేటస్ వాకొన్నాడు. పేత్రు ఎక్కడున్నాడో అక్కడే తిరుసభ కూడ వుంటుంది అని ఆంబ్రోసు నుడివాడు. ఈ యాధారాలనుబట్టి రోము బిషప్పల ప్రాధాన్యాన్ని అర్థం చేసికోవచ్చు పేత్రు స్థానాన్ని పొందడం వల్లనే వాళ్ళకు ఈ ప్రాముఖ్యం వచ్చింది. ప్రాచీన కాలంలో ఒక్కరోము పీఠం తప్ప మరేపీఠంగూడ తనకీ ప్రాముఖ్యం ఉన్నట్లుగా చెప్పకోలేదు.

నాల్గవ శతాబ్దంనుండి ఆయా మేత్రాసనాల్లోని బిషప్పలు చిక్కులు వచ్చినపుడల్లా రోము సహాయాన్ని అర్థించేవాళ్లు. తిరుసభనుండి విడిపోయిన పతితులు మళ్లా దానిలోనికి వచ్చినపుడు ముందుగా రోము అనుమతిని పొందేవాళ్ళు రోము జ్ఞానస్నాన విధానమే ఇతర మేత్రాసనాలుకూడ అనుసరించాయి. వేదగ్రంథాలసంఖ్యను నిర్ణయించింది రోము పీఠమే. తొలి శతాబ్దాల్లోని పతితులతో తీవ్రంగా పోరాడింది రోమే. వీటన్నిటిని బట్టి రోము పీఠాధిపతుల అధికారము అర్థంజేసికోవచ్చు.

2. మొదటి వాటికన్ సభ ప్రకటనం



1870లో మొదటి వాటికన్ మహానభ పోపుగారి ప్రధానత్వాన్ని అధికారపూర్వకంగా ప్రకటించింది, సంగ్రహంగా ఈ సభ ప్రకటనం ఇది. పోపుగారికి తిరుసభ అంతటి మీద సంపూర్ణమూ సర్వోన్నతమూ ఐన అధికారం వుంది. ఈ యధికారం విశ్వాసానికీ నైతికాంశాలకూ మాత్రమేగాక తిరుసభ క్రమశిక్షణకూ పరిపాలనకూగూడ వర్తిస్తుంది. ప్రతి మేత్రాసనంలోను బిషప్పలమిూదా విశ్వాసులమిూదా పోపుగారికి సంపూర్ణాధికారం వుంటుంది.

ఈసభ ఉద్దేశం ప్రకారం పోపుగారి అధికారం పేత్రునుండీ, పేత్రు అధికారం క్రీస్తునుండీ వస్తాయి. పోపుగారు బిషప్పల్లో ప్రథముడు మాత్రమేకాదు. ప్రధానుడు కూడ. ఆయనకు తిరుసభ సభ్యులందరి విూద సంపూర్ణాధికారం వుంది. ఆ అధికారం బిషప్పలమిూద ఆధారపడదు. అది ఆయనకు క్రీస్తు నుండి లభిస్తుంది. అతడు తిరుసభలో క్రీస్తు ప్రతినిధి. క్రీస్తు తిరుసభలో అతని ద్వారా బోధిస్తాడు. ఆజ్ఞాపిస్తాడు. పోపుగారి ప్రధానత్వం ఇప్పడు మనమంతా విశ్వసింపవలసిన వేదసత్యం.

రెండవ వాటికన్ సభపై మొదటి వాటికన్సభ ప్రకటనాన్ని దృఢపరచింది. దానికి కొన్ని వివరణలు మాత్రం చేర్చింది. లేకపోతే పైప్రకటనం వలన పోపుగారు నిరంకుశాధికారి, అహంకారి అనే అపార్థాలు స్ఫురిస్తాయి. ఆ వివరణలు ఇవి 1. పోపుగారి అధికారం పెత్తనం చలాయించడానికిగాక సేవలు చేయడానికి ఉద్దేశింపబడింది. అతడు దేవుని దాసులకు దాసుడు. 2. తిరుసభ అంటే విశ్వతిరుసభ మాత్రమేకాక స్థానిక తిరుసభలు కూడ ఈ స్థానిక తిరుసభల్లో కృషిచేసేదీ అధికారం నెరపేదీ పోపుగారుకాదు, బిషప్పలు. 3. పోపుగారు తిరుసభకు శిరస్సు కాదు. అతడు తిరుసభకంతటికీ ప్రధానాధికారి. శిరస్సు మాత్రం క్రీస్తే 4 బిషప్పల అధికారం పోపుగారినుండి రాదు. వారి అభిషేకం నుండే వస్తుంది. 5. పోపుగారూ బిషప్పల బృందమూ కలసి తిరుసభను పరిపాలిస్తారు.

రెండవ వాటికన్సభ ముగిసాకగూడ వేదశాస్తులు పోపుగారి ప్రధానత్వాన్ని గూర్చి చర్చను కొనసాగిస్తూనే వున్నారు. ఎందుకంటె, క్రైస్తవ సమైక్యతకు ఈ ప్రధానత్వం పెద్ద ఆటంకం. ప్రాటస్టెంటు సమాజాలు తిరుసభ అంతటివిూద పోపుగారికి సంపూర్ణాధికారం వుందని అంగీకరించవు. పోపుగారి పదవి తిరుసభకు ఐక్యతను చేకూర్చడానికి ఉద్దేశింపబడింది. కాని ఈ పదవే తిరుసభ అనైక్యతకు ప్రధాన కారణం కావడం విడూరం.

తిరుసభకు ఓ ప్రధానాధికారివుండడం బైబులు బోధలకు విరుద్ధంకాదు. ప్రధానాధికారి లేకపోతే ఏ సమాజమూ నిలువదు. తిరుసభకూడ నిలువదు. నాల్గవ శతాబ్దంలోనే జెరోముగారు చెప్పినట్ల, తిరుసభలో ఒకే ప్రధానాధికారీ అతనిద్వారా ఐక్యతవుండకపోతే ఎందరు గురువులున్నారో అన్ని క్రైస్తవ శాఖలు బయలుదేరుతాయి. కనుక ఓ ప్రధానాధికారి ఉండాలనే భావాన్ని చాల క్రైస్తవ సంస్థలు అంగీకరిస్తాయి.

కాని ఆ యధికారి అధికారం ఏ పద్ధతిలో వండాలనేదే సమస్య క్యాతలిక్ తిరుసభ ఈ యధికారం సేవకొరకే గాని పెత్తనం చేయడం కొరకు కాదని చెప్తుంది. పోపుగారి అధికారం ప్రేమతో గూడిన సేవ, అతడు దేవుని దాసులకు దాసుడు అనిచెప్తుంది. కాని చారిత్రంగాజూస్తే శతాబ్దాల పొడుగునా పోపుగార్లు బిషప్పలు మొదలైన

అధికార్లందరూ ఈ పద్ధతిలో పోలేదు. తిరుసభలో విపరీతమైన లోకాడంబరత్వం కన్పిస్తుంది. తిరుసభ అధికారుల్లో పదవీ వ్యామోహం, సంపదలపట్ల ప్రీతి, ఆడంబర ప్రియత్వం, అధికార గర్వం, లౌకిక విలువలపట్ల మోజు మొదలైన దురుణాలు కొట్టవచ్చినట్లుగా కన్పిస్తాయి. చాలమంది ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. ఈ పద్ధతి తిరుసభకు ఎంతమాత్రం తగదు.
క్రైస్తవ శాఖలన్నీఐక్యంగావాలంటే పోపుగారి ప్రధానత్వం వుండవచ్చు. కాని ఆ ప్రధానత్వం నిజంగా సేవారూపంలో కన్పించాలి. అధికార రూపంలో చూపట్టకూడదు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి నిజమైన సేవకుడుగా మెలిగే పోపుగారినీ పీఠాధిపతులనూ లోకం అంగీకరిస్తుంది.

3. క్రైస్తవ సమైక్యత


 
రెండవ వాటికన్ సభకు పూర్వం నుండే క్యాతలిక్ తిరుసభ సమైక్యత కొరకు కృషిచేస్తూంది. ఐతే ఈ సభ ఈ కార్యాన్ని మరింత విస్తృతం చేసింది. లూతరెన్సు, అంగ్లికన్సు, ఆర్తోడోక్స్ క్రిష్టియన్సు మొదలైన క్రైస్తవ సమాజాలన్నీసమైక్యత కోరుతున్నాయి. ఎంతో కృషికూడ చేస్తున్నాయి. కొన్ని అంశాల్లో క్యాతలిక్ సమాజానికి ఈ యితర సమాజాలకి ఏకాభిప్రాయం కుదిరింది. కొన్ని ముఖ్యాంశాల్లో ఇంకా కుదరలేదు. మొత్తంమిద ఆత్మశక్తివల్ల క్రైస్తవ శాఖలన్నీ పూర్తిగా కాకపోయినా చాలవరకు కలసిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి ఇంకా కొంతకాలంపట్టవచ్చు. కాని ఈ సమైక్యత మాత్రం చాలవరకు సిద్ధించి తీరుతుంది. క్యాతలిక్ తిరుసభ మాత్రం పైన మనం పేర్కొన్న సేవామార్గంలో పోవాలి. చీలిపోయిన క్రెస్తవ శాఖలన్నిటినీ ఆకర్షించేది ప్రత్యేకంగా ఈ సేవాగుణమే.

ప్రార్ధనా భావాలు



1. తిరుసభలోని విశ్వాసులు ఈలోకంలో యాత్రికుల్లా జీవించాలి. ఈ భూమిమిూద మనకు స్థిరమైన పట్టణం ఏమిలేదు. మన మందరమూ రాబోయే మోక్షపట్టణం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14 డయెగ్నీటస్ లేఖ చెప్పినట్లుగా, క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తున్నా ఇది తమలోకం కాదో అన్నట్లుగా జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నావారు పరలోక పౌరులుగా వుండాలి, వారికి తాము వసించే ప్రతిదేశం కూడ ప్రవాసదేశం కావాలి.

2 అర్ల్ పట్టణపు సిసేరియస్ అనే వేదశాస్త్రి తిరుసభ ఇహపరాలు రెండింటిలోను వసిస్తుందని చెపూ ఈలా వ్రాసాడు. “మనకు ఇహం పరం అనే రెండు పట్టణాలున్నాయి. మంచి క్రైస్తవుడు ఈలోక పట్టణంలో యాత్ర చేస్తున్నా పరలోక పట్టణానికి చెందినవాడుగా వుండాలి. ఈ భూలోక పట్టణం శ్రమలతోను వేదనతోను కూడింది. పరలోక పట్టణం విశ్రాంతితోను ఆనందంతోను కూడింది. ఇక్కడి పట్టణంలో పాపకార్యాలు చేసేవాళ్లు అక్కడి పట్టణాన్ని చేరలేరు. ఈ లోకాన్ని ప్రేమించేవాళ్లు ఆ లోకాన్ని పొందలేరు. ఎవరూ మోసపోవద్దు.క్రైస్తవులకు నిజమైన పట్టణం అక్కడనేగాని యిక్కడలేదు. ఇక్కడ ఆనందాన్ని అనుభవింప గోరేవాడికి అది పరలోకంలో లభింపదు. మన సొంత దేశం, మన యెరూషలేం, పరలోకంలో వుంది. అక్కడసన్మనస్కులు మనకు సహవాసులు. పితరులు ప్రవక్తలు ప్రేషితులు వేదసాక్షులు మనకు తల్లిదండ్రులు. మనం ఈ లోకంలో వసిస్తున్నపుడే ఆ లోకం కొరకు తపించిపోవాలి. మనకంటె ముందుగా పితరులు ప్రవక్తలు ప్రేషితులు వేదసాక్షులు కన్యలు స్తుతీయులు ఇక్కడినుండి అక్కడికి తరలివెళ్ళారు. వాళ్ళు అక్కడినుండి ఆశతో ప్రేమతో మనకొరకు ఎదురుచూస్తుంటారు. ఆ భక్తులు తమ ప్రార్థనలతోను కోరికలతోను నిరంతరం మనలను ఆ లోకంవైపు ఆకర్షిస్తూంటారు. ఈ లోకాన్నీ పిశాచాన్నీ జయించి మనంకూడ వాళ్ళ వసించే దివ్యలోకాన్ని చేరుకోవాలి?

12.పొరపడని వరం



ఆయా విషయాలను గూర్చి మాట్లాడేపుడూ, వ్రాసేపడూ మనం అజ్ఞానంవల్ల
ఎన్నో పొరపాట్ల చేస్తాం. కాని వేదసత్యాలను గూర్చి ప్రకటనం చేసేపుడు పోపుగారు ఈలా పొరపాటు చేయరు. ఆయన తిరుసభకు వెల్లడిచేసే వేదసత్యాల్లో తప్పలు వుండవు. ఆత్మే పొరపాట్లనుండి పోపుగారిని కాపాడుతుంది. కనుక వేద విషయాలను వెల్లడిచేసేపుడు పోపుగారికి పొరపడని వరం వుంటుందని నమ్ముతున్నాం.
క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించమని తిరుసభను ఆజ్ఞాపించాడు. అలా బోధించేపుడుఏ పొరపాటూ చేయకుండా వేదసత్యాలను నిర్దుష్టంగా వెల్లడిచేసే వరాన్నిగూడ అతడు తిరుసభకిచ్చాడు. ఆత్మ ద్వారా ఈ వరం దానికి లభిస్తుంది. కనుక విశ్వతిరుసభకు పొరపాటు చేయని వరం మొదటినుండి వుంది. పోపుగారి వరం ఈ విశ్వ తిరుసభ వరాల్లో ఓ భాగమే కాని ఇతరం కాదు. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. బైబులు బోధలు



దేవుడు సంపూర్ణ సత్యం. మనం అతన్ని నమ్మవచ్చు - 1మోహా 5,20, అతని కుమారుడైన క్రీస్తు కూడ సత్యమే - యోహా 14,6. సత్యమూర్తియైన దేవుడు సత్యస్వరూపుడైన తనకుమారుని ద్వారా తిరుసభకు పొరపాటు చేయని వరం దయచేసాడు. కనుక ఈ వరాన్ని మనం నమ్మవచ్చు.
 
క్రీస్తు ఓవైపు తిరుసభను దైవరాజ్యాన్ని బోధించమని ఆజ్ఞాపించాడు. మిూరు వెళ్ళి సకలజాతులకు బోధించండి అని చెప్పాడు - మత్త28,19-20. కనుక వేదసత్యాలను బోధించడం తిరుసభ బాధ్యత. మరోవైపు అతడు తిరుసభవిూదికి ఆత్మను పంపుతానని వాగ్దానం చేసాడు. ఆయాత్మడు స్వయంగా సత్యస్వరూపుడు శిష్యులను సర్వసత్యంలోనికి నడిపించేవాడు - యోహా 16,18, ఈయాత్మశక్తి ద్వారా శిష్యులు సత్యంలో నిలుస్తారు. అనగా అన్ని పొరపాట్లనుండీ దోషాలనుండీ ఆత్మ తిరుసభను కాపాడుతుంది. ఈ వరం తిరుసభ ప్రధానాధికారియైన పోపుగారికికూడ లభిస్తుంది.

ప్రభువు పేత్రుతో నీవు పడిపోయి మల్లా లేచాక నీ సోదరులను బలపరుస్తావు అని చెప్పాడు — లూకా 22, 32. కనుక పేత్రు విశ్వాస సత్యాల్లో కూడ తిరుసభను బలపరుస్తాడు. పేత్రుకున్న ఈ వరం అతని అనుయాయులైన పోపుగారికి కూడ లభిస్తుంది.

పౌలుకూడ తిరుసభ సత్యానికి నిలయమని చెప్పాడు - 1తిమో 3,15. కనుక తిరుసభకాని దాని నాయకుడైన పోపుగారు కాని వేదసత్యాల్లో పొరపాట్ల చేయరు.

2. పొరపాటు చేయని వరం ఎవరికుంటుంది?



పొరపాటు చేయని వరం మొదట పవిత్రాత్మకే వుంటుంది. ఆయాత్మ సత్యస్వరూపి - 14,17. ఈ యాత్మనుండి ఈ వరం తిరుసభకూ దాని అధికారులకూ లభిస్తుంది. క్రీస్తు తిరుసభకు ఆత్మసహాయాన్ని అనుగ్రహించాడు కదా!
ఆత్మసాన్నిధ్యం కలది కనుక తిరుసభ పొరపాటు చేయదు. ఈ తిరుసభ దేవుని నుండి వేదసత్యాలు వింటుంది. ఆ సత్యాలనే నరులకు బోధిస్తుంది. అలా బోధించేపుడు తప్పలు లేకుండా బోధించే శక్తిని ప్రభువే దానికి దయచేసాడు. తిరుసభ అధికారులైన పోపుగారు బిషప్పలు విశ్వాసులు అందరికి కలసి, అనగా తిరుసభ మొత్తానికి కలసి పొరపాటు పడని వరం వుంటుంది. తిరుసభ సభ్యులంతా కలసి క్రీస్తుదేహం, పవిత్రప్రజ, యాజక రూపమైన రాజ్యం - 1షేత్రు 2,9. ఈ ప్రజలందరిని పవిత్రాత్మ అభిషేకిస్తుంది. ఈ యభిషేకం వాళ్లు వేదవాక్యాన్ని విని అర్థంజేసికొని విశ్వసించడానికే - 1యోహా

2,20-27. కనుక తిరుసభ సభ్యులంతా కలసి విశ్వాసరంగంలో పొరపాటు పడ్డం అసంభవం. ఆ బృందంలో విశ్వాస దీపం ఎప్పడూ వెలుగుతూనే వుంటుంది.

తిరుసభ సభ్యులంతా కలసి ఓ వేద సత్యాన్ని అంగీకరించినపుడు ఏనాడూ పొరపాటు చేయని దేవుని వరంలోనే వాళ్లు పాలుపొందుతారు. ఆత్మకూడ సత్యాన్ని చేపట్టడంలో వాళ్ళకు సహాయం చేస్తుంది.

ఇక, పోపుగారితో కూడిన బిషప్పల బృందం తిరుసభకు ప్రధానాధికారి. తిరుసభలో అధికార పూర్వకంగా బోధించేది ఈ బ్నందమే. కనుక పై పొరపాటు చేయని వరం ప్రధానంగా ఈ బృందానికి లభిస్తుంది. ఈ బృందం శిరస్సు లేక నాయకుడు పోపుగారు. కనుక ఈ వరం ప్రధానంగా ఆయనకు లభిస్తుంది.

తిరుసభలోని అధికార బృందం రెండు విధాలుగా బోధించవచ్చు. 1. బిషప్పలంతా పోపుగారితో కలసి (ఒకచోట చేరికాని, చేరకుండా గాని) వేద సత్యాలను బోధించవచ్చు. ఈ బోధ పొరపడని తిరుసభ వరం క్రిందికి వస్తుంది. విశ్వాసులందరూ దీన్ని మనఃపూర్వకంగా అంగీకరించాలి. 2. పోపుగారు విశ్వాసులందరికీ కాపరిగాను బోధకుడుగాను సంపూర్ణాధికారంతో బోధించినపుడు ఆ బోధ కూడ పొరపాటు పడని తిరుసభ వరం క్రిందకే వస్తుంది. కనుక దీన్నికూడ విశ్వాసులు మనఃపూర్వకంగా అంగీకరించాలి.

దేవుడే తిరుసభ రక్షణానికి కొన్నివేదసత్యాలను తెలియజేసాడు. బైబులు ద్వారాను పారంపర్య బోధద్వారాను ఈ వేదసత్యాలు మనకు తెలుస్తున్నాయి. మనం త్రాగేనీళ్లు విషపూరితం కాకూడదు. అలాగే తిరుసభ విశ్వసించే వేదసత్యాలు కూడ విషపూరితం కాకూడదు. వాటిని విషపూరితం కాకుండా వుంచేవాడు, అనగా వాటిని పొరపాట్ల నుండి కాపాడేవాడు దేవుడే ఈవిధంగా పొరపాటు చేయని వరంద్వారా దేవుడు తిరుసభ సత్యాలను పదిలపరుస్తుంటాడు.

మొదటి వాటికన్ మహాసభ పోపుగారు వేదసత్యాలను బోధించేపడు పొరపడరని అధికార పూర్వకంగా ప్రకటించింది. ఈ యంశాన్ని మనమందరమూ విశ్వసించాలి. ఆ ప్రకటనం సంగ్రహంగా యిది.

1. పోపుగారు క్రైస్తవులందరికీ కాపరిగాను బోధకుడుగాను వ్యవహరిస్తూ సంపూర్ణాధికారంతో తిరుసభకంతటికీ విశ్వాసాంశాలను గాని నైతికాంశాలను గాని బోధించినపుడు అవి పొరపడని వరం క్రిందికి వస్తాయి. 2. ఆ వేదసత్యాలు ఇక మార్పు లేనేవిగా వుంటాయి. 3. పూర్వం పేత్రుకి పొరపాటు చేయని వరాన్నిచ్చిన క్రీస్తే పోపుగారికికూడ ఈ వరాన్నిస్తాడు. ఈ వరాన్ని క్రీస్తు తిరుసభ అంతటికీ ఇచ్చాడు.

కనుక తిరుసభ విశ్వాస నైతికాంశాలను అధికారపూర్వకంగా ప్రకటించవచ్చు 4, ఈ ప్రకటనలు విశ్వాసులు అంగీకరించినందువల్ల కాక, పోపుగారు ప్రకటించినందువల్లనే, వాటంతట అవే, మార్పులేనివిగా వుంటాయి.

ప్తె వేద వాక్యాలకు కొంచెం వివరణం అవసరం. 1. పోపుగారు సంపూర్ణాధికారంతో ప్రకటించిన అంశాలు మాత్రమే పొరపాటు పడని వరం క్రిందికి వస్తాయి. ఏవిబడితే అవికావు. విశ్వాస నైతికాంశాలను గూర్చి మాత్రమే పోపుగారు అధికారపూర్వకంగా బోధిస్తారు. ఈ యంశాలకు ఆధారం బైబులూ పారంపర్య బోధా రెండూను, ఆయన లౌకికాంశాలను బోధించడు. పోపుగారి బోధ తిరుసభ ప్రధానాధికారి బోధ, తిరుసభకు నడిపించేది ఆత్మ కనుక పోపుగారి బోధలు ఆత్మ బోధలు, అందుచే వాటిల్లో తప్పలుండవు. 2. ఆ వేదసత్యాలను ఇక ఎవరూ మార్చడానికి వీల్లేదు. అనగా భావికాలంలో మరో పోపుగారు ఆ సత్యాలను మల్లా వేరే మాటలతో చెప్పవచ్చు. వివరించి చెప్పవచ్చు. కాని ఆ సత్యాలనే మార్చివేయడానికి వీల్లేదు. వాటిని నిరాకరించడానికి వీల్లేదు. 3. పొరపాటు చేయని వరాన్ని క్రీస్తు మొదట పేత్రుకిచ్చాడు. ఇప్పడు అతని అనుయాయియైన పోపుగారికి ఇచ్చాడు. పోపుగారు తన సొంత తెలివితేటలతో ఈ వేదసత్యాలను ప్రకటించడంలేదు. 4. పోపుగారి ప్రకటనలను అంగీకరించడమనేది విశ్వాసుల మంచితనం విూదకాని వారి సహకారం విూదగాని ఆధారపడదు. పోపుగారి అధికారాన్నిబట్టే, అవి ఆత్మ తెలియజేసే సత్యాలు కాబట్టే, వాటిని మనం అంగీకరించాలి.

ఓ ఉదాహరణం చూద్దాం. దేవమాత దేహాత్మలతో మోక్షానికి కొనిపోబడింది అని పన్నెండవ భక్తినాథ పోపుగారు సంపూర్ణాధికారంతో తిరుసభ అంతటికీ 1950లో ప్రకటనం చేసారు. ఇప్పడు దీన్ని మనమందరమూ పొరపాటులేని వేదసత్యంగా విశ్వసిస్తున్నాం. ఆగస్టు 15న దేవమాత మోక్షారోపణ ఉత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈలాంటి విశ్వాస ప్రకటనలు చేసేపుడు పోపుగారు ఎంతో జాగ్రత్త వహిస్తారు. బైబులనీ పారంపర్య బోధనీ పరిశీలిస్తారు. ప్రాచీన వేదశాస్తుల బోధలను తిలకిస్తారు. తోడి బిషప్పలను సంప్రతిస్తారు. ప్రస్తుత వేదశాస్తులను సలహా అడుగుతారు. శతాబ్దాల పొడుగునా వస్తున్న విశ్వాసుల నమ్మకాన్ని పరిశీలిస్తారు. ఇతర క్రైస్తవ సమాజాల అభిప్రాయాలను వీంటారు. ఆత్మ ప్రబోధాన్ని ఆలిస్తారు. ఇన్ని విధాలుగా జాగ్రత్త వహించిన పిమ్మటగాని పోపుగారు ఏదైనా వేదసత్యాన్ని గూర్చి ప్రకటనం జేయరు, అంతేగాని ఆయన ఈ విషయాన్ని గూర్చి తన కిష్టమొచ్చినట్లుగా మాట్లాడరు.

3. పొరపాటు చేయని వరం ఏయే అంశాలకు వర్తిస్తుంది?

పోపుగారి వరం లౌకికాంశాలకు వర్తించదు. వాటిని గూర్చి ఆయన అధికారపూర్వకంగా ప్రకటనలు చేయడు. పొరపడనివరం విశ్వాసరంగానికీ నైతికరంగానికీ మాత్రమే వర్తిస్తుంది. మనకు దేవునితో సంబంధం కలిగించే ప్రధాన రంగాలు ఇవే. నేరుగా మన రక్షణకు సంబంధించినవి కనుక పోపుగారు ఈ యంశాలను గూర్చి మాత్రమే మాట్లాడతారు.

ఈ యంశాలు మామూలుగా బైబుల్లోను పారంపర్య బోధలోను తగులుతాయి. కనుక పోపుగారు బైబులు పారంపర్య బోధలను గూర్చి, వాటితో సంబంధమున్న ఇతరాంశాలనుగూర్చి మాత్రమే అధికారపూర్వకంగా ప్రకటనలు చేస్తారు. వీటిని మనం మనఃపూర్వకంగా అంగీకరించాలి.
 
పోపుగారు విశ్వాస నైతికాంశాలను గూర్చి అధికారపూర్వకంగా ప్రకటనలు చేసినపుడు బిషప్పల బృందానికి శిరస్పుగానే మాటలాడతారు. ఈ బిషప్పల బ్నందం తిరుసభకంతటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక ఆయన తిరుసభ తరపుననే తిరుసభకు బోధచేస్తారు. ఒకవైపు ఆయ క్రీస్తుకి ప్రతినిధి. క్రీస్తు ప్రతినిధిగా ఆయన క్రీస్తు సమాజానికి బోధ చేస్తారు. మరోవైపున ఆయన తిరుసభకు ప్రతనిధి. తిరుసభ ప్రతినిధిగా ఆయన తిరుసభ విశ్వాసాన్నే ప్రకటిస్తారు. పోపుగారి బోధవేదసత్యం మాత్రమేకాదు. విశ్వాసప్రకటనం గూడ.

ఒకమారు పోపుగారు ప్రకటనం చేసిన వేదసత్యం ఇక యేనాటికీ మారదు. అనగా ఆ యంశంలోని సత్యం శాశ్వతంగా నిలుస్తుంది. కాని భావితరాలవాళ్ళ ఆ వేదసత్యాన్ని భిన్నపదాలతో భిన్నరీతుల్లో ప్రకటించవచ్చు మొదటిసారి చెప్పిన దానికంటె ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు. ఆయా కాలాల అవసరాలను బట్టి ఈ మార్పు అవసరమౌతుంది. కనుక వేదసత్యం మారదు. ఆ సత్యాన్ని చెప్పే తీరు మారవచ్చు

4. సమైక్యతరీత్యా సమస్యలు


 
సమైక్యరీత్యా చూస్తే ప్రొటస్టెంటు క్రైస్తవులు పోపుగారికి పొరపడని వరంవుందని అంగీకరింపరు. ఈ వరంద్వారా పోపుగారికి బైబులును మించిన అధికారం లభిస్తుందని వాళ్ళకు భయం. లూతరు భావాల ప్రకారం, పోపుగారు ఎక్యుమెనికల్ సభలు కూడ పొరపాట్లు చేయవచ్చు. కాని ప్రొటస్టెంట్ల తిరుసభకు మాత్రం ఈ వరం వుందని నమ్ముతారు.

ఐనా పోపుగారికి పవిత్రగ్రంధానికిమించిన అధికారం ఏమీలేదు. ఆయన అధికారపూర్వకంగా ప్రకటనం చేసేది బైబులు సేవకొరకే, బైబులుబోధలు స్పష్టంగాను నిర్దుష్టంగా ప్రలజకు తెలియజేయడం కొరకే. కనుక పోపుగారి బోధలను మనం సేవగా గ్రహించాలేకాని అధికార శాసనాలుగా అర్థం చేసికోగూడదు.

కొన్ని మతాల్లో ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో కూడ ఎవరికీ స్పష్టంగా తెలియదు. కనుక ఏక మతానికి చెందినవాళ్ళే నమ్మకాల విషయంలో ఒకరితో ఒకరు పోట్లాడుకొంటారు. కాని క్యాతలిక్ మతంలో ఈ చిక్కులేదు. మనం విశ్వసించవలసిన విషయాలను పోపుగారు, క్యాతలిక బోధన సంఘంవారు స్పష్టంగా బోధిస్తారు. దీనివలన మనకు అపార్థాలూ సందేహాలూ తొలగిపోతాయి. కనుక విశ్వాసులు ఈ బోధను ఓ సేవగా భావించాలి.

ఈ యధ్యాయాంతంలో ఈ చిన్న విషయాన్ని గూడ గ్రహించాలి. పోపుగారు ఎప్పడూ అధికార పూర్వకంగానే బోధించరు. అనధికారంగా గూడ బోధిస్తారు. అసలు ఈలాంటి బోధలే ఎక్కువ. ఈ బోధలను గూడ మనం వినయ విధేయతలతో స్వీకరించాలి. పోపుగారు తిరుసభ బోధన సంఘంలో ప్రధానుడు. ఆయన బిషప్పలూ కలసి ఈ బోధన సంఘమౌతుంది. ఈ సంఘాధిపతిగానే పోపుగారు మనకు బోధిస్తారు. క్రైస్తవులకు విశ్వాస సత్యాలను బోధించే అధికారం ప్రధానంగా పోపుగారికే వుంది. ఆయన బోధల్లో ఎప్పడూ పవిత్రాత్మ సాన్నిధ్యం వుంటుంది. ఆత్మ ప్రధానంగా ఆయన ద్వారా క్రైస్తవులతో మాట్లాడుతుంది. కనుక పోపుగారి బోధలను ఏమంచి క్రైస్తవుడూ పెడచెవినిబెట్టడు.

మేత్రాసనంలో పోపుగారికి బదులుగా బిషప్పుగారు మనకు బోధచేస్తారు. ఆయన మేత్రాసనంలో ప్రధాన యాజకుడు, క్రీస్తు ప్రతినిధి అని చెప్పాం. కనుక బిషప్పుగారి బోధలను కూడ మనం వినయవిధేయతలతో, విశ్వాసంతో అంగీకరించాలి.

ఓ వేదసత్యాన్ని గూర్చికాని, నైతికాంశాన్ని గూర్చికాని మనకు సందేహం కలిగినప్పడు, వెంటనే ఆయంశాన్ని గూర్చి మన కిష్టమొచ్చినట్లుగా విమర్శించి ఖండించకూడదు. తెలిసిన వాళ్ళనుండి దాని భావాన్నీ పూర్వాపరాలనూ లోతుపాతులనూ గ్రహించే ప్రయత్నం చేయాలి. అది మన బుద్ధికి మించిన వేదసత్యమైతే వినయంతో దానికి తలవంచాలి. అది మనకు కష్టాన్నో నష్టాన్నో తెచ్చిపెట్టే నైతికాంశమైతే, స్వార్థాన్ని విడనాడి దానికి కట్టుపడివుండాలి. మంచి క్రైస్తవులకు నియమాలు ఇవి.

ప్రార్థనా భావాలు

1.రెండవ శతాబ్దంలో జీవించిన ఓరిజన్ పండితుడు ఓ వుపమానం చెప్పాడు. మనలోని ఆత్మ కదిలిస్తేనేగాని మన దేహానికి చైతన్యం పుట్టదు. అలాగే క్రీస్తు కదిలిస్తేనేగాని అతని దేహమైన తిరుసభకు చైతన్యం కలగదు. ఆ ప్రభువు తిరుసభలోని నరులందరికీ, ఒక్కొక్కరికిగూడ, చైతన్యం కలిగించేవాడు. కనుక మన శిరస్సయిన క్రీస్తు మనకు ప్రబోధం కలిగించాలని వేడుకొందాం.

2.మరియమాత తిరుసభకు పోలికగా, ఆదర్శంగా వుంటుంది. మరియలాగే తిరుసభకూడ ఈ లోకంలో పవిత్రంగా జీవించాలి. దేవుని చిత్తానికి బదురాలు కావాలి. ఆమెలాగే తిరుసభ కూడ పరలోకంలో మహిమను పొందాలి. తిరుసభను పవిత్రంగా జీవించేలా చేయమని మరియమాతను ప్రార్థిద్దాం.

ప్రశ్నలు

అధ్యాయం - 1

1.దైవరాజ్యాన్ని గూర్చిన పూర్వవేద బోధలూ, క్రీస్తు నాటి రాజకీయవాదుల బోధలూ తెలియజేయండి.

2.దైవరాజ్యాన్ని గూర్చిన క్రీస్తు బోధలను వివరించండి.

అధ్యాయం - 2

1.క్రీస్తు పండ్రెండుమంది శిష్యులను నియమించడంవల్ల కాని లేక పేత్రుకి ఆధిపత్యం దయచేయడంవల్ల కాని అతనికి తిరుసభను స్థాపించాలనే కోరిక వుందని రుజువు చేయండి.

2.దివ్యసత్రసాదాన్ని స్థాపించడంద్వారా క్రీస్తుకి తిరుసభను నెలకొల్పాలనే కోరిక వుందని నిరూపించండి.

3.అపోస్తలుల చర్యలు అనే గ్రంథంనుండి తిరుసభ యేలా పుట్టి పెంపుజెందిందో తెలియజేయండి.

అధ్యాయం - 3

1.దైవరాజ్యానికీ తిరుసభకీ తేడా యేమిటి?

అధ్యాయం - 4

1.తిరుసభ ఎల్లరికీ ఎందుకు రక్షణ సాధనమౌతుంది?
2 "తిరుసభకు వెలుపలకూడ రక్షణం వుంటుంది" ఎందుకు? ఏలా? వివరించండి.

అధ్యాయం - 5

1.తిరుసభ క్రీస్తు ప్రేషిత సేవను ఎందుకు కొనసాగిస్తుంది? ఏలా కొనసాగిస్తూంది?

అధ్యాయం - 6

1.పూర్వనూత్న వేదాలు పేర్కొనే దైవప్రజల వివరాలను తెలియజేయండి.
2.తిరుసభ క్రీస్తు శరీరం అంటే అర్థం ఏమిటి? ఈ భావం మనకేలా ప్రేరణం పుట్టిస్తుంది?
3.తిరుసభ ఆత్మకు ఏలా ఆలయమౌతుందో వివరించండి.

అధ్యాయం - 7

1.తిరుసభ ఏకత అంటే యేమిటి?
2.తిరుసభ విశ్వవ్యాప్తత అంటే యేమిటి?
3.తిరుసభ పవిత్రత అంటే యేమిటి?
4.తిరుసభ అపోస్తలుల వారస సమాజం అంటే యేమిటి?

అధ్యాయం - 8

1.చారిత్రకంగా గృహస్థుల స్థానాన్ని తెలియజేయండి. వారిని గూర్చిన వాటికన్ బోధలను వివరించండి.

అధ్యాయం - 9

1."తిరుసభలో అధికారం సేవ కొరకే" - వివరించండి.
2.గురుపదవిలోని మూడు అంతస్తులు క్రమేణ పరిణామం పొందిన తీరును వివరించండి.

అధ్యాయం - 10

1.పీఠాధిపతులు క్రీస్తు అధికారంలో ఏలా పాలుపొందుతారు? పీఠాధిపతుల బృందం ప్రాముఖ్యాన్ని తెలియజేయండి.

అధ్యాయం - 11

1. బైబులు బోధలనుండి పోపుగారి ప్రధానత్వాన్ని ఏలా నిరూపిస్తాం?

2.చరిత్ర నుండి ఏలా నిరూపిస్తాం?

అధ్యాయం - 12

1.బైబులు బోధలనుండి తిరుసభకీ పోపుగారికీ పొరపడని వరం వుందని నిరూపించండి.

2.పోపుగారి పొరపడని వరాన్ని గూర్చిన మొదటి వాటికన్ సభ ప్రకటనను వివరించండి.