బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/నూత్న తిరుసభ
4. నూత్న తిరుసభ
విషయ సూచిక
1.వాటికన్ సభ నూత్న తిరుసభను సిద్ధంజేసిన తీరు
2.మూడవ సహస్రాబ్దంలో తిరుసభ రూపం
3.తిరుసభ సభ్యులు ఎవరు?
4.మౌలిక సంఘాలు
5.నూత్న తిరుసభకు నూత్న పరిచర్యలు
- వాక్యబోధ ముఖ్యాంశం కావాలి
- . వేదబోధక తిరుసభ
- . ఆత్మ ప్రేరిత తిరుసభ
- . ప్రపంచంతో కలసిపోయే తిరుసభ
6. తిరుసభలో నూత్న దృక్పథాలు.
నూత్న తిరుసభ ప్రేషిత తిరుసభగా పుట్టింది. క్రీస్తు శిష్యులతో వుండి వారికి అద్భుతాలు చేసి చూపించాడు. బోధలు చేసాడు. ఉత్థానానంతరం వారికి దర్శనమిచ్చాడు. శిష్యులు అతడు జీవించివున్నాడనీ మృత్యువుని జయించాడనీ విశ్వసించారు. ఉత్దాన క్రీస్తు తానే సువార్తనని శిష్యులకు తెలియజేసాడు. శిష్యులను ఈ సువార్తను లోకం నలుమూలల ప్రకటించమని ఆదేశించాడు. ఆత్మ తమమీదికి దిగివచ్చి తమకు ప్రసాదించిన బలంతో శిష్యులు యేసే రక్షకుడని ఎల్లయెడల బోధించారు. చిన్న బృందమైన శిష్యులు పంపబడ్డ వాళ్ళుగా (పేషితులుగా) నలుమూలలకు వెళ్లారు. పంపబడిన వాళ్ళుగానే వాళ్ళు మొదటి తిరుసభ అయ్యారు. తిరుసభ ప్రధాన లక్షణం ప్రేషితత్వమే (పంపబడ్డం). తిరుసభ పరిపాలనం, కర్మకాండలు, సిద్ధాంతాలు బోధలు అన్నీ కూడ ప్రేషితత్వాన్ని ఆధారం జేసికొనే ఉద్భవించాయి. కాని క్రమేణ ప్రేషితత్వం మరుగుపడిపోయి ఇతరాంశాలు ప్రాముఖ్యాన్ని పొందాయి. ప్రేషితత్వం తిరుసభ పనుల్లో వొకటి, అంత ముఖ్యమైన పనికాదు అనే భావాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందువల్ల తిరుసభ స్వభావమే మారిపోయింది. విశేషంగా ఇండియా తిరుసభ ఇతర ప్రజలతో సంబంధాలు త్రేంచుకొని తనకు తానుగా వుండిపోయింది.
రెండవ వాటికను సభ నూత్న పెంతెకోస్టు లాంటిది. అది తిరుసభకు తన ప్రేషిత స్వభావాన్ని మళ్ళా జ్ఞప్తికి తెచ్చింది. మూడవ వేయి సంవత్సరాల్లో క్రైస్తవులందరు ప్రేషితులుగా పనిచేయాలని హెచ్చరించింది. వాళ్లు పిండిని పొంగజేసే పులుపిడి ద్రవ్యంలా వుండాలని చెప్పింది. నరులంతా క్రీస్తుచే ప్రభావితులై దైవకుటుంబంగా మారాలని వాకొంది.
ఇటీవలే యేసుక్రీస్తు జూబిలీ ఉత్సవం జరుపుకొని ప్రభువునుండి ప్రేరణ పొందాం. తొలినాటి క్రైస్తవులనులాగే ప్రభువు మనలనుకూడ లోకంలోనికివెళ్లి తన్ను గూర్చి ప్రకటించమని ఆదేశించాడు. ప్రేషితత్వమే నేటి తిరుసభ ప్రధాన లక్షణం అనుకోవాలి.
1. వాటికన్ సభ నూత్న తిరుసభను సిద్ధంజేసిన తీరు
ఉత్ధాన క్రీస్తు సాన్నిధ్యం తిరుసభలో వుందనీ, ఈ సాన్నిధ్యం వలన తిరుసభ తాను మారి లోకాన్ని గూడ మారుస్తుందనీ 23వ జాన్ పోపుగారు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని జనమంతా సోదర భావంతో, ప్రేమ భావంతో ఐక్యంగావాలి. ఈ యైక్యతను సాధించడానికి తిరుసభ సహాయపడుతుంది. ఈ శ్రీసభ లోకం బాగోగులను పట్టించుకొనేది. లోకాన్ని దేవుని చెంతకు చేర్చేది. లోకం సుఖదుఃఖాలు క్రైస్తవులవి కూడ. ప్రపంచానికి సంభవించే కష్టసుఖాలు వారికిగూడ సంభవించినట్లే వాళ్ళు క్రీస్తుతో ఐక్యమై, ఆత్మ దారి జూపుతూండగా, దైవరాజ్యంవైపు పయనిస్తారు. ఇతరులకు కూడ రక్షణ సందేశాన్ని ఎరిగిస్తారు. అందుకే క్రైస్తవులు ఎప్పుడూ ఇతర ప్రజలతో కలియగోరుతారు. ఇతరుల్లో కూడ క్రీస్తుని చూచి వారితో ఐక్యమై, వారిని తండ్రియైన దేవుని రాజ్యంలోనికి చేర్చగోరతారు. ఈ ప్రధాన భావంతో వాటికన్ సభ తిరుసభలో మార్పు తీసికొని వచ్చింది.
తిరుసభ ప్రపంచమంతటాను, ఇండియాలో కూడ రెండవ వేయి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంలో క్రైస్తవులంతా గూడ భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యం విన్నారు. దివ్యసత్ర్వసాద బలిలో పాల్గొన్నారు. విశ్వాసులు క్రీస్తునుండి ప్రేరణం పొంది, ఆ ప్రభువు పంపగా వెళ్ళి అతని ప్రేమను లోకానికి తెలియజేయడానికి సిద్ధమయ్యారు. సువార్త సందేశంతో, దాని శక్తితో ప్రపంచాన్ని మార్చి వేయడం తిరుసభ పని. ఈలా మార్పు చెందిన ప్రపంచమే దైవరాజ్యం. లోక్షంలో శ్రీసభ పులిపిడి ద్రవ్యంలాంటిది. పులిపిడి ద్రవ్యం పిండిని పొంగజేస్తుంది. ఆలాగే తిరుసభ సువార్త సందేశంతో ప్రపంచం పొంగి నిర్మలమూ ఉదాత్తమూ అయ్యేలా చేస్తుంది. ఈ సభ సభ్యులందరూ వ్యక్తిగతంగా ప్రేషితులు కావాలి. అందరూ దేవుని ప్రేమ సందేశాన్ని లోకానికి ఎరిగించాలి.
2. మూడవ సహస్రాబ్దంలో శ్రీసభ రూపం
మూడవ వేయి సంవత్సరాలు వచ్చాయి. ఈ కాలంలో తిరుసభలో పెను మార్పులు రావాలి. 1. క్రైస్తవ సమాజం క్రీస్తుపై కేంద్రీకృతం కావాలి. మన ప్రజలు ఏవో విశ్వాస సత్యాలను నమ్మితేనే చాలదు. వారికి క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడాలి. విశేషంగా దివ్యస్రత్పసాద బలిలో ప్రభువును వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవాలి. 2. ఈ సమాజం ఆత్మచే నడిపించబడినదై వుండాలి. ఒకరినొకరు ప్రేమించడం, ఉన్నవాళ్ల లేనివాళ్ళతో పంచుకోవడం అనే లక్షణాలు కన్పించాలి. 3. ఈ సమాజం ప్రేషిత సేవకు పంపబడినది కావాలి. ఈ ప్రజలు ఇరుగుపొరుగు వారితో సంబంధం కలిగించుకోవాలి. వారికి క్రీస్తుని తెలియజేయాలి. వారి ధ్యేయం మతమార్పిడి కాదు. లోకంలోని అన్యాయాలనూ అక్రమాలనూ తొలగించడం. 4 క్యాతలిక్ సమాజం ఇతర ଔର୍ବ୍ବର୍ଟ సమాజాలతో కలసి పనిచేయాలి. జ్ఞానస్నానం ద్వారా పంపబడ్డం అనే లక్షణం ద్వారా క్రైస్తవులందరూ సోదరులే. 5. తిరుసభ ఇతర మతాలనూ వాటిల్లోని విలువలనూ అంగీకరించాలి. పవిత్రాత్మ ఇతర మతస్థుల హృదయాల్లోగూడ ప్రేరణం పుట్టిస్తూనే వుంటుంది. వాళ్ళకూడ దేవుణ్ణి చేరుకోవాలని కోరుకొంటూనే వుంటారు. 6. తిరుసభ మానవాభ్యుదయం కొరకు కృషిచేసేవాళ్ళందరితోను కలసి పనిచేయాలి. మనలాగే వాళ్ళకూడదైవరాజ్యాన్నిస్థాపిస్తున్నారు అనుకోవాలి. ఈ కార్యాలన్నీ సాధించడం సులభం కాదు. ఐనా దైవ బలంతో వాటిని కొంతవరకైనా సాధించవచ్చు.
3. తిరుసభ సభ్యులు ఎవరు?
ఇదివరకు మనం జ్ఞానస్నానం పొందినవాళ్ళు మాత్రమే తిరుసభ సభ్యులు e9óos”5 వాళ్ళం. కాని ఇప్పడు భావాలు మారాయి. దైవ రాజ్యాన్ని స్థాపించడం తిరుసభ బాధ్యత, ప్రేషిత సేవద్వారా ఈ కార్యాన్ని సాధిస్తాం. కాని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ సేవచేసి దైవ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారు. అందుచే మనకు తెలియకపోయినా చాల వర్గాల ప్రజలు తిరుసభకు చెందివుంటారు.
1. జ్ఞానస్నానం పొందినవాళ్ళ తిరుసభ సభ్యులు. వీళ్ళ క్రీస్తు మరజోత్థానాలను విశ్వసిస్తారు. ప్రత్యక్షంగా తిరుసభ సభ్యులూ దైవరాజ్యసభ్యులూ ఔతారు. వీళ్ళ క్రీస్తుకి అంకితమైన వాళ్ళ సువిశేష విలువలను స్వయంగా జీవించి ఇతరులకు కూడ బోధిస్తారు.
2ఇంకో వర్గంవారికి జ్ఞానస్నానం పొందాలనే కోరిక వుంటుంది కాని సాంఘిక, సాంస్కృతిక కారణాలవల్ల పొందలేరు. వీరికి క్రీస్తుపట్ల విశ్వాసం వుంటుంది. సంస్కారాలు మాత్రం లేవు. వీళ్ళు క్రీస్తుకి సాక్షులుగా వుంటారు. లోకానికి సువిశేష విలువలను తెలియజేసి దైవరాజ్యాన్ని నిర్మిస్తారు. ఈ ప్రజలుకూడ తిరుసభ సభ్యులే.
3. కొందరు వాళ్ల ప్రత్యేక మతంలోనే వుంటారు. కాని క్రీస్తునీ సువిశేష విలువలనూ అంగీకరిస్తారు. వాటిని తమ సొంత మత విలువలతో జోడిస్తారు. క్రీస్తుపట్ల భక్తిప్రపత్తులు చూపుతారు. సువిశేష విలువలను పాటిస్తూ దైవరాజ్యాన్ని స్థాపిస్తారు. ఈలాంటివాళ్ళకూడ తిరుసభ సభ్యులే.
4. ఇంకా కొందరు ఏ మతానికి చెందివుండరు. కాని క్రీస్తునీ సువిశేష విలువలనూ అంగీకరిస్తారు. కొంతమంది సంఘసేవకులు ఈలాంటివాళ్ళు వీళ్ళ దృష్టిలో క్రీస్తు సమాజంలోని అన్యాయాలనూ అవినీతిని తొలగించేవాడు. వీళ్ళు తిరుసభకు చెందివుండాలనుకోరు. దైవరాజ్య స్థాపనకు మాత్రం కృషి చేస్తారు. తమ జీవితంలో సువిశేష విలువలను పాటిస్తారు. దైవరాజ్యాన్ని నెలకొల్పేవాళ్ళు కనుక వీళ్ళకూడ తిరుసభ సభ్యులే.
ఈ దృష్టితో చూస్తే తిరుసభ చాల విస్తృతమైంది. దైవరాజ్యం కొరకు కృషి చేసేవాళ్ళంతా తిరుసభ సభ్యులే. ఈ ప్రజలంతా క్రైస్తవారాధనలో పాల్గొనక పోవచ్చు. కాని కొన్ని పర్యాయాలు వీళ్ళ ఆరాధనాపద్ధతి వీళ్ళకుంటుంది. కాని తిరుసభ సభ్యులందరికీ క్రీస్తు అనే వ్యక్తిపట్ల నమ్మకం వుంటుంది. కేవలం సువిశేష విలువలను అంగీకరిస్తేనే చాలదు. వాటికి కారకుడైన క్రీస్తుని అంగీకరించాలి. అతన్నిబట్టి సువిశేష విలువలకు విలువ వచ్చింది. ప్రధానమైన తండ్రి సువిశేషం అతడే.
భారతదేశ పౌరులు ఎక్కువగా క్రైస్తవులుకారు. అట్లని మనం వేదబోధ మానుకోగూడదు. మన సువిశేష బోధ భిన్న వర్గాలమీద భిన్న ప్రభావం చూపుతుంది. ఎవరికి ఇష్టమైనంతవరకు వాళ్ళ సువిశేష విలువలను స్వీకరిస్తారు. ఈ విలువలను ఏపాటిగా స్వీకరించినా వారి హృదయంలో క్రీస్తు సాన్నిధ్యం కొంతవరకు నెలకొంటుంది. వాళ్ళు తిరుసభకు చెందకపోయినా దైవరాజ్యానికి చెందుతారు. కనుక మన తరపున మనం వేదబోధ చేయవలసిందే. వినేవాళ్ళ వింటారు. విననివాళ్ళు వినరు.
4. మూలిక సంఘూలు
ఇటీవల తిరుసభలో మౌలిక సంఘాలు అనే నూత్న సమాజాలు వెలిసాయి, ఇవి తిరుసభను పరిపష్టం చేయడానికి బాగా వుపయోగపడతాయి. అపోస్తలుల చర్యల ప్రకారం తొలినాటి యెరూషలేము సమాజం ఏకహృదయం కలిగివుండేది. ఆ సమాజంలో పేద ధనిక తారతమ్యాలు వుండేవికావు. ఉన్నవాళ్ళు, తమ సౌతుని లేనివాళ్ళతో, పంచుకొనేవాళ్ళ-2, 45. ఈ లక్షణాలు మౌలిక సంఘాల్లో కనిపించాలి. వీళ్ళ క్రీస్తుని బాగా అనుభవానికి తెచ్చుకొని మొదట విచారణలోని క్రైస్తవులకు ప్రేరణం పట్టించాలి. క్రైస్తవ సమాజం వట్టి సంస్థగాదు భక్తబృందం అనేలాగ వారిలో మార్పుతీసుకురావాలి. క్రైస్తవులందరూ సువిశేష విలువల ప్రకారం జీవించేలా చేయాలి. వారిలో క్రీస్తుపట్ల విశ్వాసం పెంచాలి. అటుపిమ్మట వీళ్ళ తమ చుట్లపట్ల వున్న క్రైస్తవేతరులతో కృషి చేయాలి. వారిలో దైవరాజ్య విలువలు ఇంతకుముందే నెలకొని వుంటాయి. ఇప్పడు ఆ విలువలను ఇంకా పెంచి దైవరాజ్యాన్ని సుస్థిరం చేయాలి. సువిశేష విలువలను ప్రచారం చేయాలి. నరులంతా శాంతి సంతోషాలతో జీవించడానికి దోహదం చేయాలి. క్రీస్తు కోరిన దైవరాజ్యం ఇదే. మౌలిక సంఘసభ్యులు ప్రధానంగా క్రీస్తుకి సాక్ష్యం పలికేవాళ్ళ కాని అన్యులతో కలిగే సంబంధవల్ల మన క్రైస్తవుల భక్తి విశ్వాసాలు సన్నగిల్లిపోకూడదు. విశేషంగా దివ్యసత్రసాద బలిపట్ల, క్రీస్తుపట్ల మన విశ్వాసం తగ్గిపోకూడదు. అన్యులకు మనం తెలియజేసేది ప్రధానంగా క్రీస్తుని, ఆ క్రీస్తుపట్ల విశ్వాసం లోపిస్తే అతన్ని ఇతరులకు ఏలా బోధిస్తాం?
5. నూత్న తిరుసభకు నూత్న పరిచర్యలు
నూత్న తిరుసభ ప్రధానంగా ప్రేషిత సేవకు అంకితం కావాలి. దానికి జరిగే పరిచర్యల్లోకూడ మార్పు రావాలి.
1. వాక్యబోధ ముఖ్యాంశం కావాలి
1. వాక్యబోధవల్లనే తిరుసభ పడుతుంది. కనుక దానిలో వాక్యబోధ ముఖ్యం కావాలి. మన గురువులు వాక్య బోధను ముమ్మరం చేయాలి. ప్రతి దైవకార్యంలోను వాక్యబోధ తప్పక జరగాలి.
2. దైవార్చన కార్యాలన్నీ దైవరాజ్యాన్ని సూచించేవిగా వుండాలి. క్రీస్తు మరణోత్తానాలతో దైవరాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యం రాజకీయ ప్రాబల్యం వలనకాక క్రీస్తు ప్రేమవలనా ఆత్మార్పణం వలనా ఏర్పడింది. దైవార్చనలో, విశేషంగా పూజలో, విశ్వాసులు ఈ దైవరాజ్యంలో భాగస్టులౌతారు. మనం ఏదో అప్ప తీర్చుకోవడానికికాక, దైవరాజ్యాన్ని స్థాపించడానికి పూజలో పాల్గొనాలి.
3. మన కర్మకాండ నరులమధ్య సఖ్యసంబంధాలు పెంచాలి. పూర్వవేదంలోని బలులు ప్రజలకు దేవునితో సఖ్యతను పెంచాయి. అలాగే మన నూత్నవేద బలులు మనకు క్రీస్తుతో సఖ్యతను పెంచాలి. ఈ సఖ్యత ద్వారానే క్రైస్తవుల్లో పరస్పర సఖ్యత కూడ పెరగాలి. క్రీస్తు శరీరాన్ని భుజించే మనం ఒక్కరొట్టెగా, ఒక్కసమాజంగా ఐక్యం గావాలి - 1కొ 10,17. తోడి నరులతో ఐక్యం గాకుండా దేవునితో ఐక్యంగాలేం. తుదితీర్పు సామెత బోధించేది యిదే. కాని మనలో ఐక్యతను చెరచేది కులవ్యవస్థ. మన సమాజంలో కులం తెచ్చిపెట్టే అనర్గాలు అన్ని యిన్నీ కావు. మన గురువులూ మఠకన్యలే కులం పేరు మీదిగా మురాలవుతున్నారు. ఇక సామాన్యజనం కుల ప్రాబల్యంవలన మురాలు కట్టకుండా వుంటారా?
ఈ కుల విభజనను మనం పూర్తిగా వ్యతిరేకించాలి.
4. మనకు పరిపాలనా వ్యవస్థ వుంది. కాని మన బిషప్పలూ గురువులూ క్రైస్తవ సమాజాన్ని లౌకిక సమాజాన్నిలాగ పరిపాలించకూడదు. క్రైస్తవ సమాజాలను పోషించి పెంచడం మన పాలకుల ధ్యేయం కావాలి. ప్రేమతో క్రైస్తవ సమాజాలను పరిపాలించడం వలన మన ప్రజల్లో, సఖ్యసంబధాలు పెరుగుతాయి. మన అధికారానికి ఆధారం పవిత్రాత్మ ఈయాత్మ తిరుసభకే ఆత్మ. క్రైస్తవ అధికారులు ఆత్మశక్తితో బూగా తిరుసభను పరిపాలిస్తే మన ప్రజల్లో ప్రేమశకీ, పరస్పర సంబంధాలు పెరుగుతాయి. మన అధికారులు తమ పరిపాలనం ద్వారా తిరుసభను సజీవం, ఉత్సాహపూరితం చేయాలి దాన్ని ఓ మహాభవనాన్ని లాగ నిర్మించాలి.
5. మన ఆధ్యాత్మిక జీవితం పరివర్తనంతో కూడింది కావాలి. పవిత్రాత్మ ద్వారా జీవించేదే ఆధ్యాత్మిక జీవితం. కాని మనలోని స్వార్థం ఈ యాత్మకు అడ్డదగులుతుంది. స్వార్ధం వల్లనే మనం నానా పాపకార్యాలు చేస్తాం. పశ్చాత్తాపం ద్వారా ఈ స్వార్ణాన్ని అణచుకొంటాం. పరివర్తనంలేని పుణ్యకార్యాలు మనలను గర్విషులను చేస్తాయి. కనుక వినయం, పరివర్తనం మనకు ఎల్లప్పడు అవసరమే, ఎప్పటికప్పుడు పరివర్తనం చెందే వాడు ఇతరులపట్ల ప్రేమతో జీవిస్తాడు. క్రైస్తవ సమాజాన్ని పెంపులోకి తెస్తాడు.
2. వేదబోధక తిరుసభ
వాక్యాన్నిస్వీకరించిన క్రైస్తవ సమాజం వాక్యాన్నిబోధించాలి. ఒకసారి వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకొన్న విశ్వాసి వాక్యాన్ని ప్రకటించకుండా వుండలేడు. క్రీస్తుకి సాక్షి కాకుండా వుండలేడు. క్రైస్తవ సమాజం ఎప్పడు కూడ వేదబోధ చేసే సమాజం. వేదబోధ దాని ప్రధానమైన పని.
1. నూత్నవేదం పేర్కొనే క్రైస్తవ సమాజం ఎప్పడూ వేదబోధ చేస్తుంటుంది - అచ 8,4. కాని నేడు క్రైస్తవ సమాజానికి చెంది వుండడమంటే ఓ సాంఘిక సంక్షేమ
సంస్థకు చెంది వుండడమైంది. ఆర్థిక లాభాలు పొందడమైంది. ఈ దృక్పథం మారాలి. ప్రతి విచారణ ప్రతి క్రైస్తవ సమాజం మేము వేదబోధకు పంపబడిన వాళ్ళం అనుకోవాలి. అవి లోకంలో పులిపిడి ద్రవ్యంగా తయారు కావాలి.
2. లోకంలో బోలెడంత దుష్టత్వముంది. క్రీస్తునీ సువిశేష విలువలనూ స్వీకరించిన క్రైస్తవులు ఈ విలువలను ప్రచారంచేసి ఆ దుష్టత్వాన్ని ప్రతిఘటించాలి. క్రైస్తవ సమాజమంతా క్రీస్తుకి సాక్ష్యంగా వుండి లోకంలోని పాపపు వ్యవస్థను నిర్మూలించాలి. గురువులూ ఉపదేశులూ మొదలైనవాళ్ళు మాత్రమేకాక విచారణలోని సంఘాలన్నీకూడ ఏదో రూపంలో సువిశేషబోధ చేసేవిగా వుండాలి.
3. ఆత్మ ప్రేరిత తిరుసభ
రెండవ వాటికన్ సభ తర్వాత పవిత్రాత్మ ఉద్యమం తిరుసభలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది దైవకటాక్షం అనాలి. ఈ వుద్యమం ద్వారా పవిత్రాత్మ తిరుసభను నడిపిస్తుంది. క్రీస్తు రక్షణాన్ని లోకానికంతటికీ అందీయడం ఆత్మ పని. కనుక క్రీస్తు రక్షణం అందరికీ లభించేలా చూడ్డం ఈ వుద్యమంలో పనిజేసేవాళ్ళ బాధ్యత.
1. జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం పొందినవాళ్ళందరికీ ఆత్మ తన వరాలను దయ చేస్తుంది. వీటి ద్వారా మనం దైవరాజ్యాన్ని వ్యాప్తిచేస్తాం. కనుక ఒక్కొక్కరూ ఆత్మ తమకిచ్చిన వరాలను గుర్తించి వేదబోధకు ఉపక్రమించాలి. విశేషంగా గృహస్థుల వరాలకు విలువ నీయాలి. వీళ్ళ కూడ దైవరాజ్యాన్ని వృద్ధి చేస్తారు. దేవుని పిలుపు కూడ ఒక వరం. పెద్దలు ఈ వరాన్ని గుర్తుపట్టాలి.
2. ఈ వరాల ద్వారా తిరుసభ తన ప్రేషిత సేవను కొనసాగించుకొని పోతుంది. కనుక ఈ వరాలను ఓ క్రమ పద్ధతిలో సంఘటితం చేయాలి. ఇక్కడ రెండంశాలు ముఖ్యం. మొదటిది విచారణలోని వివిధ సేవా సమాజాలను క్రమబద్ధం చేయాలి. ఈ సమాజాల సభ్యులు ఆయా రంగాల్లో జరిగే దుష్టకార్యాలను ప్రతిఘటింపగలిగి వుండాలి. ప్రజలచే సత్కార్యాలు చేయించగలిగి వుండాలి. అవసరమైతే తగిన వరాలుగల వ్యక్తులతో నూత్న సేవా సమాజాలను స్థాపించాలి. వీళ్ళ నూతన సేవలు ప్రారంభిస్తారు. రెండవది, మఠ సమాజాలు. ఇవి ఆత్మ తిరుసభకిచ్చే వరాలు. తిరుసభ ప్రేషిత సేవకు ఉపయోగపడి తేనే నూత్నమఠసభల పట్టుకను అంగీకరించాలి. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించిన పిదపనే నూత్న మఠసభలను స్థాపించాలి. మఠసభలు ఒక దానితో ఒకటి పోటికి దిగకూడదు. సభ్యులు అధికంగా గల మఠసభలు నూత్న కార్యాలను చేపట్టడానికి వెనుకాడకూడదు. 3. క్రైస్తవులు క్రైస్తవేతరుల్లో కూడ ఆత్మ పనిచేస్తుంటుందని గ్రహించాలి. ఆత్మ వరాలను క్రైస్తవులు మాత్రమే గుత్తకు తీసుకోలేదు. అన్యమతాలనూ ఆ మతాల్లోని వక్తలనూ కూడ ఆత్మడు తన పనికి వినియోగించుకొంటూంటాడు. వాళ్ళు కూడ దేవుని రక్షణాన్ని ప్రజలకు అందిస్తుంటారు. ప్రజల శ్రేయస్సు కొరకు పనిజేసేవాళ్ళ హృదయాల్లో, లోకకళ్యాణంకొరకు ప్రాణాలర్పించేవాళ్ళ మనస్సుల్లో ఆత్మడు తప్పక వుంటాడు. మనం ఈలాంటి వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళతో కలసి పనిచేయడానికి పూనుకోవాలి. మంచి అంతా మనమే చేయనక్కరలేదు.
4. మన జీవితానికీ పనికీ గూడ దైవానుభూతి ముఖ్యం. కాని నేటి క్రైస్తవుల్లో ఈ దివ్యానుభూతి చాల తక్కువగా కన్పిస్తుంది. ఈ యనుభూతి లోపించినపుడు మనం čśróo, స్నేహితులు, బంధువులు, పలుకుబడి మొదలైన వాటిపై ఆధారపడతాం, కాని వీటితో దైవరాజ్యాన్ని స్థాపించలేం. ఆత్మ వీటి ద్వారా పని చేయదు. భారతదేశ క్రైస్తవులు ఆత్మనూ ఆ యాత్మబోధించే క్రీస్తునీ గాఢంగా అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పడుగాని మనం సువిశేష సేవలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనలేం. దైవానుభూతి మనం ప్రప్రథమంగా సాధించవలసిన కార్యం.
4. ప్రపంచంతో కలసిపోయే తిరుసభ
క్రీస్తులాగే తిరుసభకూడ ఈ లోకంతో కలసిపోవాలి. క్రీస్తు సిలువమీద చేతులు చాచి ప్రపంచాన్నంతటినీ ఆలింగనం చేసికొన్నాడు. దాన్నితండ్రికి అర్పించాడు. శ్రీసభకూడ ఈలాగే చేయాలి.
1. క్రీస్తు తన పరిచర్య ప్రారంభించక ముందు యోహాను నుండి జ్ఞానస్నానం పొందాడు. ఈ క్రియద్వారా అతడు పాపపు లోకానికి చెందినవాడయ్యాడు. మన పాపాలలో పాలు పంచుకొన్నాడు -2 కొరి 5,21. దీని ద్వారా అతడు లోకం పాపాలను పరిహరించే గొర్రెపిల్ల కాగలిగాడు - యోహా 1,29. క్రీస్తు సాన్నిధ్యం కలిగిన తిరుసభకూడ ఈలాగే చేయాలి. అనగా అది లోకంలోని నరులందరితోను సఖ్యసంబంధాలు పెంచుకోవాలి. లోకంలోని నరుల సమస్యలు దాని సమస్యలు కావాలి. అది తన లాభాన్ని తాను చూచుకోకూడదు. ప్రపంచ ప్రజల లాభాన్ని లెక్కలోకి తీసికోవాలి. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి దాని రక్షణం కొరకు తనకు ప్రీతిపాత్రుడైన ఏకైక కుమారుడ్డిసిలువ మరణానికి అప్పగించాడు- యోహా 3, 16. లోకం ఒకవైపు పాపంతో నిండి వుంటుంది. ఈ లోకానికి మనం దూరంగా వుండాలి. కాని క్రీస్తు రక్షణం కూడ ఈ లోకంమీద సోకుతూంటుంది. ఈ లోకానికి మనం దగ్గర కావాలి. అందుకే భక్తులంతా లోకంతో కలిసి పోయారు. లోకోద్ధరణకు కృషి చేసారు. 2. తిరుసభ లోకంలో పులిపిడి ద్రవ్యంగా వుండాలి. క్రీస్తే ఈ వుపమానాన్ని చెప్పాడు - మత్త 13, 33. పులిపిడి ద్రవ్యం చిన్నదే. కాని అది పిండి అంతా పొంగేలా చేస్తుంది. లోపలినుండి దాన్నినెమ్మదిగా మార్చివేసి అది రొట్టెగా మారడానికి సిద్ధమయ్యేలా చేస్తుంది. తిరుసభఏదో రహస్య సమాజంలాగ ఈ పని చేయదు. ప్రేమతో, తనకున్నది ఇతరులతో పంచుకోవడం ద్వారా, ఈ కార్యాన్ని సాధిస్తుంది. ఆత్మే తిరుసభ ద్వారా లోకంలో ఈ మార్పు తెస్తుంది. తిరుసభకు ఏనాడు సంఖ్యాబలం వుండదు. అది చాల చిన్నది. లోకం పెద్దది. భారత దే్శం క్రైస్తవ సమాజం ఎప్పడూ చిన్నదిగానే వుంటుంది. కాని ఈ చిన్న సమాజమే ఈ పెద్ద దేశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ కార్యం ఆత్మద్వారా జరుగుతుంది. కనుక క్రైస్తవ సంఘం ఎప్పడూ లోకం వైపు దృష్టిత్రిప్పి వుంచాలి. ఎప్పడూ లోకంతో కలసి పనిజేస్తుండాలి.
-3. తిరుసభ లోకంతో సంప్రతింపులు జరపాలి. లోకంలో ఇన్ని మతాలు, భావాలు, దృక్పథాలు వున్నాయి. మన భారతదేశంలోనే ఎన్ని మతాలు లేవు? కాని వీటన్నిటిలోను కొన్ని ఐక్యతా భావాలు వుంటాయి. వీటిని ఆధారంగా జేసికొని తిరుసభ అన్యమతాలతో సంప్రదింపులు, సంభాషణలు జరపాలి. మొదట మతాల్లోని ఏ భావాలు నరులందరూ ఐక్యం గావడానికి దోహదం చేస్తాయో వాటిని గ్రహించాలి. మతాల్లో మనుష్యులను విభజించే భావాలుకూడ వుంటాయి. వాటి విషయం తర్వాత పరిశీలించవచ్చు. మన సంప్రదింపుల ద్వారా ఇతర మతాల్లో ఏలాంటి మార్పు వస్తుందో మనకు తెలియదు. మన తరపున మనం నరులను ఐక్యంజేసి వారిలో సఖ్యసంబంధాలు పెంపొందించాలి. ఇదే దైవరాజ్యం. సంప్రదింపులూ సంభాషణలూ పలు వర్గాల ప్రజలతో జరపాలి. ఇతర క్రైస్తవ సంఘాలతో, అన్యమతాలతోగూడ సంభాషణలు జరపాలి. ఇవి విశ్వాస పరిధిలో, భావాల పరిధిలో, జీవిత పరిధిలో, క్రియల పరిధిలో నానా రూపాల్లో వుంటాయి. పవిత్రాత్మ ప్రేరణంవల్ల నరుల హృదయాలు క్రమేణ మారతాయి.
4. తిరుసభ పేదలను ఆదుకోవాలి. నరుని స్వార్థం, పాపం లోకాన్ని నాశం చేస్తాయి. ధనవంతులు బలవంతులు బడుగు వర్గాల వారిని అణగదొక్కారు. కొద్దిమంది సుఖాలకు నోచుకుంటే అధిక సంఖ్యాకులు కష్టాలపాలయ్యారు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినపుడు తాను పేదల కొరకు వచ్చానని చెప్పకొన్నాడు. పీడితులకు విమోచనాన్నీ హితవత్సరాన్నీ తీసుకొని రావడానికి వచ్చానని పల్మాడు - లూకా 4,18-19. క్రీస్తులాగే తిరుసభకూడ పేదలకు సహాయం చేయాలి.మనం ప్రతి విచారణలోను పేదరికాన్ని పరపీడనాన్ని గుర్తించాలి. ప్రజల పేదరికాన్ని తొలగించడానికి విశ్వప్రయత్నాలు చేయాలి.
ఇక్కడ వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ అన్యులు అనే భేదభావం వుండకూడదు. దారిద్ర్యం అందరినీ బాధిస్తుంది. కనుక నరులందరినీ ఆదుకోవడం మన ధర్మం.
తిరుసభలో మార్పు రావాలి. ఈ మార్పు అన్నివర్గాల ప్రజల్లోను కన్పించాలి. మన పీఠాధిపతులూ, గురువులూ మఠసభల సభ్యులు మారాలి. గృహస్తులు మారాలి. మన విచారణల్లో విద్యా సంస్థల్లో, ఆస్పత్రుల్లో సాంఘిక సేవాసంస్థల్లో పెద్దమార్పు రావాలి. మన జీవితంలో ఆలోచనల్లో క్రియల్లో మార్పు రావాలి. దేవుని ఆత్మ ప్రాతపద్ధతులను తొలగించి కాలానుగుణమైన క్రొత్త పద్ధతులను తీసికొని వస్తుంది. ఈ క్రొత్తను మనం అంగీకరించాలి.
మన దినచర్య ఎలా వుండాలి? అందరూ రోజూ కాసేపు వేదవాక్యాన్నిచదువుకొని ప్రార్ధనం చేసికోవాలి. వాక్యం మనకు దైవచిత్తాన్నీ దేవుని కోర్కెలనూ తెలియజేస్తుంది. మన జీవితాన్నిదేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి. ప్రార్ధనంవల్ల దైవరాజ్యాన్ని పొందుతాం. మనలోని స్వార్గాన్ని అణచుకొని దేవునికి ప్రీతి కలిగించే పనులు చేయడానికి పూనుకొంటూం.
పశ్చాత్తాపం, పరివర్తనం మనకు ఎప్పడు అవసరమే. మనం దేవునివైపు పయనించాలి. కాని లోకవస్తువుల వైపు వెళూంటాం. పరివర్తనం ద్వారా మన గమ్యాన్ని మార్చుకొని దేవుని చెంతకు చేరతాం. మన పొరపాట్లను చక్కదిద్దుకొని సత్యమార్గంలో నడుస్తాం.
ఉత్తములైనవారికి ఆత్మపరిశీలనం కూడా వుండాలి. హృదయానికున్న కపటం మరి దేనికీలేదు. అది మంచిని చేసే నెపంతో చెడ్డను చేస్తుంది. కనుక మన పనులు నిజంగా దేవునికి ప్రీతి కలిగిస్తున్నాయా, తోడివారికి మేలు చేస్తున్నాయా అని పరిశీలించి చూచుకోవాలి. ఈ యాత్మ పరిశీలనతో ఎప్పటికప్పుడు మనలను మనం సంస్కరించు కోవాలి.
భారతదేశ తిరుసభ "నా చిన్ని బొజ్ఞకు శ్రీరామరక్ష" అన్నట్లుగా ప్రవర్తించగూడదు. మైనారిటీ వర్గానిమైన మనం ఎప్పడూ మన హక్కులను మనం కాపాడుకొనే ప్రయత్నంలోనే వుండకూడదు. మన చుటూ వున్న అన్య మతస్తులనుగూడ పట్టించుకొంటూండాలి. წლపర్యాయాలు అల్ప సంఖ్యాకులమైన మనకున్న సదుపాయాలు అధిక సంఖ్యాకులైన అన్యమతాలవారికి లేవు. విద్యావైద్య సాంఘిక సంక్షేమ రంగాల్లో మనకే ఎక్కువ సౌకర్యాలు వున్నాయి. ఈ దేశంలో మనకంటె నిరుపేదలూ నికృష్ణ దశలో వున్నవాళ్ళు చాలమంది వున్నారు. వీరికి సహాయం చేయడం మన బాధ్యత.
6. తిరుసభలో నూత్న దృక్పథాలు
తొలి రోజుల్లోని తిరుసభ ఒక పద్ధతిలో వుండేది. కాలక్రమేణ దానిలో చాల మార్పులు వచ్చాయి. చారిత్రక, సాంఘిక కారణాలు ఈ మార్పులకు కారణం. కాని ఈ మార్పుల్లో కొన్ని తిరుసభను అపమార్గం పట్టించాయి. అది లోకానికి నిజంగా ఉపయోగపడాలంటే ఈ యనిష్ట ధోరణులను సవరించుకొని ఆదిమ క్రైస్తవ సమాజం పద్ధతికి రావాలి.
1. ఆదిమ తిరుసభ సువిశేష బోధకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చింది. అది ఆనాటి ప్రజలకు క్రీస్తు బోధలనూ మార్గాన్నీ వివరించింది. చాలమంది క్రీస్తు వలన ఆకర్షితులై అతన్ని అనుసరించారు. కాని మధ్యయుగాల్లో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడము ముఖ్యాంశమైంది. క్రైస్తవుల సంఖ్యలు పెరిగాయి. కాని భక్తివిశ్వాసాలు లేనివాళ్ళు కూడ స్వార్ధప్రయోజనాల కొరకు క్రైస్తవ మతంలో చేరారు. మంది యొక్కువయితే మజ్జగ పల్చనయింది. రెండవ వాటికన్ సమావేశం క్రీస్తుని బోధించడం తిరుసభ ప్రధాన పూచీ అని నొక్కిచెప్పింది. నేడు మనం శుద్ధమైన క్రైస్తవులంగా జీవించి క్రీస్తుని ప్రకటించాలి. మతవ్యాప్తి మన ప్రధానాశయం కాదు.
2. తొలినాటి క్రైస్తవులు పరస్పర సంబంధంగల భక్తసమాజంగా జీవించారు. ఆ సమాజంలో సోదరప్రేమ బలంగా వుండేది. ఆ ప్రేమకు ముగ్గులై ఆనాడు చాలమంది ఆ సమాజంలో చేరారు. కాలక్రమేణ తిరుసభ తానొక ప్రేమ సమాజానున్న సంగతిని మరచిపోయి ఓ సంస్థగా మారిపోయింది. సోదరప్రేమకు బదులుగా వ్యక్తిగతమైన ప్రాతినిధ్యం ముఖ్యమనుకొన్నారు. వాటికన్ సమావేశం మళ్ళీ ఈ సోదర ప్రేమను పునరుద్ధరింప గోరింది. ఇప్పడు తిరుసభ లోకమంతటితోను సఖ్యసంబంధాలు పెంచుకోవాలి. అందరిపట్ల ప్రేమతో మెలగాలి.
3. తొలినాటి క్రైస్తవులు క్రీస్తుని గాఢంగా అనుభవానికి తెచ్చుకొన్నవాళ్ళ ఆ యనుభూతినే వాళ్ళు ఆనాటి ప్రజలకు కూడ అందించారు. కనుకనే యోహాను "మేము కన్నులారచూచి, చెవులారవిని, చేతులార తాకిన జీవవాక్కును మీకు తెలియజేస్తున్నాం" అన్నాడు 1యో 1,1. మధ్యయుగాల్లో ఈ దైవానుభూతి నశించింది. తిరుసభ కొన్ని మతసత్యాలను ప్రోగుజేసికొంది. వాటిని జ్ఞానోపదేశ గ్రంథాలుగా, దైవశాస్త్ర సంగ్రహాలుగా తయారుచేసి ప్రజలకు బోధించసాగింది. వాటికన్ సమావేశం, క్రైస్తవులు క్రీస్తుని గూర్చిన తమ వ్యక్తిగత అనుభవాన్ని లోకానికి తెలియజేయాలని సూచించింది. కనుక నేడు మనం
ప్రజలకు తెలియచేయవలసింది పుస్తకాల్లోని మత సిద్దాంతాలనుగాదు, మన దైవానుభూతుల్ని ప్రభువుపట్ల వ్యక్తిగతమైన భక్తి లేనివాళ్ళు అతన్ని ఎలా బోధించ గలుగుతారు?
4. తొలిరోజుల్లో తిరుసభ స్థానిక తిరుసభ ఎక్కడి క్రైస్తవులు అక్కడే ప్రోగయ్యేవాళ్ళ ఒకరినొకరు పరామర్శించేవాళ్ళు అంగీకరించేవాళ్ళ ఎక్కడి సమస్యలు అక్కడే చర్చించుకొనేవాళ్ళు పరిష్కరించుకోగలిగిన వాటిని పరిష్కరించుకొనేవాళ్ళు ఆరోజుల్లో అన్నీ స్థానిక తిరుసభలు, కాని మధ్యయుగాల్లో క్రైస్తవ సమాజం ఏక తిరుసభ, విశ్వశ్రీసభ అయింది. కేంద్రం నుండి నియమాలు జారీచేయడం మొదలుపెట్టారు. అధికారాలు, పరిపాలనలు, నియమావళి పెచ్చుపెరిగాయి. ఫలితంగా స్థానిక తిరుసభలు చచ్చిపోయాయి. ఆత్మ దయచేసే వ్యక్తిగత వరాలు అడుగంటాయి. వాటికన్ సమావేశం మళ్ళా స్థానిక తిరుసభలను ఉద్ధరించింది. స్థానిక క్రైస్తవులు ప్రత్యేక సమాజాలుగా ఏర్పడి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి చూచుకోవాలని చెప్పింది. ఇప్పడు ఏ మేత్రాసనానికి ఆ మేత్రాసనం, ఏ విచారణకు ఆ విచారణ తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి.
5. ఆదిమ క్రైస్తవులు నేరుగా క్రీస్తుని ప్రకటించారు. ప్రజలు క్రీస్తుని విశ్వసించి అతని అనుచరులయ్యారు. ఈ యనుచర బృందమే దైవరాజ్యం. మధ్యయుగాల్లో క్రీస్తునిగాక క్రైస్తవమత సత్యాలను బోధించారు. ప్రజలు తిరుసభలో చేరడమే ముఖ్యమన్నారు. విశ్వాసముంటేచాలు మోక్షానికి వెళ్తామన్నారు. క్రైస్తవులు లోకానికి దూరమయ్యారు. వాటికన్సభ మళ్ళాదైవరాజ్య స్థాపనం ముఖ్యమని చెప్పింది. లోకంలోని ప్రజల కష్టసుఖాలు, ఆశా నిరాశలు తిరుసభ తనసొంతం చేసికోవాలని చెప్పింది. కనుక ఇప్పడు ప్రపంచంలోని ప్రజల బాగోగులను పట్టించుకోవడం మన ముఖ్యధర్మం కావాలి.
6. ఆదిమ క్రైస్తవుల్లో ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావంలేదు. విశ్వాసులంతా సరిసమానం అనుకొన్నారు. కాని మధ్యయుగాల్లో యాజకవర్గం ప్రాబల్యం పెరిగింది. బిషప్పలు గురువులు, మఠసభల సభ్యులు ఎక్కువ, గృహస్తులు తక్కువ అనే భావం ప్రచారంలోకి వచ్చింది. యాజకులు వరప్రసాదాలు అందిస్తే గృహస్థలు స్వీకరిస్తారు. వాళ్ళు నాయకులు, సామాన్య ప్రజల నడిపింపబడేవాళ్ళు వీళ్ళచేసే పనేమీలేదు. జడపదార్థాల్లాగ ఊరకుంటారు అనుకొన్నారు. కాని వాటికన్ సభ ఈ భావాన్ని పూర్తిగా మార్చివేసింది.తిరుసభ సభ్యులంతా ఏకసమాజం. వారివిలువ సరిసమానం, వారుచేసే పనుల్లో మాత్రం తేడావుంటుంది అని చెప్పింది. గృహస్తులకు ఆదిమ సమాజంలోవున్న ఘనతను పునరుద్ధరించింది. నేడు తిరుసభ సభ్యులంతా కలసి కృషి చేయాలి. 7.తొలినాటి తిరుసభలో అందరు క్రీస్తుని ప్రకటించారు. లోకం క్రీస్త విలువలను గ్రహించేలా చేసారు. కాని మధ్యయుగాల్లో సువిశేషబోధ గురువులపని అనుకొన్నారు. గృహస్తులు పూర్తిగా లౌకిక విషయాల్లో పడిపోయారు. వాటికన్ సభ సువిశేషబోధ అందరిపని అని, ఎవరి పద్ధతిలో వాళ్ళు క్రీస్తుని ప్రనకటించాలనీ చెప్పింది. ఇంకా ఇండియాలాంటి మిషనరీ దేశాల్లో ప్రజలు తీసుకోవడమే ముఖ్యమనీ, ఈయడం తమ పూచీకాదనీ భావిస్తున్నారు. వీళ్ళ మేము తిరుసభ నీడలో వుంటాం. అది పెద్ద సాంఘిక సంక్షేమసంస్థ. మేము దాని సాయంతో వృద్ధిలోకి వస్తాం. దానికి మాత్రం సాయం చేయం అనుకొంటారు. తీసుకోవడమేగాని, ఈయడం మాపనికాదు అన్నట్లుగా ఆలోచిస్తుంటారు. కాని ఇవి తప్పడు భావాలు. తిరుసభ మనకు ఈయగలిగినప్పడు తీసుకోవచ్చు. దాని సాయంతో వృద్ధిలోకి రావచ్చు. కాని మనతరపున మనంకూడ తిరుసభకు ఈయాలి. మన సేవలు దానికి అవసరం, గురువులతోకూడ గృహస్తులు కూడ వాక్యసేవకు పూనుకోవాలి. తిరుసభ చేయూతతో పైకి వచ్చినవాళ్ళంతా తమకంటె క్రింది దశలో వున్నవాళ్ళకు సహాయం చేయాలి. క్రీస్తు ప్రేమకూ కరుణకూ సాక్ష్యంగా వుండాలి.
ఈ మూడవ వేయి సంవత్సరాల కాలంలో పవిత్రాత్మ తిరుసభను ఆధునిక ప్రపంచంలోకి పంపుతూంది. పోయిన రెండువేల యేండ్లల్లో తిరుసభ సాధించిన విజయాలూ పుణ్యకార్యాలూ చాలావున్నాయి. కాని మనం ఇంకా ముందుకుపోయి ఇంకా పవిత్రకార్యాలూ ఎన్నో సాధించాలి. మనకు రెండువేల సంవత్సరాల అనుభవముంది. పూర్వులు చూపిన బాటలున్నాయి. వాటిల్లో నడపవచ్చు. కాని మనం ఇప్పడు క్రొత్తదారులు కూడ త్రోక్కాలి. ఆత్మశక్తితో, ఉత్సాహంతో లోకానికి సేవలు చేయాలి. ఇది తండ్రి ప్రేమించిన లోకం. క్రీస్తు ప్రవేశించిన లోకం. మన చేయూతను కోరే లోకం. ఆత్మ సహాయంతో, ప్రేరణతో మనం ఆధునిక ప్రపంచానికి చేయవలసిన సేవలు చాలా వున్నాయి. మన తరపున మనం ఈ పరిచర్యలను అందించడానికి సిద్ధంగా వండాలి.