బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/గురుపట్టం
2. గురుపట్టం
బైబులు భాష్యం -77
విషయసూచిక
1.అపోస్తలుల కాలంనాటి యాజకులు
2.క్రీస్తే స్వయంగా యాజకత్వాన్ని స్థాపించాడు
3.గురుపట్ట సంజ్ఞలు
4.గురుపట్ట ఫలితాలు
1. అపోస్తలుల కాలంనాటి యాజకులు
ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం
1. అపోస్తలుల కాలంలోనే త్రివిధ యాజకులు ఉండేవాళ్ళం
1. దివ్యసత్ర్పసాదాన్ని సిద్ధంచేయడానికి క్రీస్తు నుండి మొదట అనుమతి పొందినవాళ్ళు అపోస్తలులే. ప్రభువు తొలిసారిగా వాళ్లతో దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పాడు — లూకా 22, 19. క్రీస్తుకిమల్లె అతని శిష్యులైన అపోస్తలులకూ త్రివిధాధికారాలు వుండేవి. అవి ప్రజలను పరిపాలించడం, వారికి బోధ చేయడం, వారిని పవిత్రపరచడం.
అపోస్తలుడు అంటే యెవడు? అతడు క్రీస్తు ఎన్నుకొనిన పండ్రెండుమంది శిష్యుల్లో ఒకడు. లేదా, క్రీస్తు తన ఉత్థానంతరం స్వయంగా నియమించినవాడు కావచ్చు. పౌలు ఈలాంటివాడు. పండ్రెండుమంది శిష్యులు తమ స్థానాన్ని పూరించడానికి ఎన్నుకొన్నవాడు కావచ్చు. మత్తీయా ఈలాంటివాడు. అపోస్తలులచేత నియమింపబడిన తీతులాంటి శిష్యులుకూడ కావచ్చు. అపోస్తలుల మరణానంతరం వారి స్థానాన్ని పొందిన అనుయాయులు కూడ కావచ్చు. అపోస్తలులుకాని వారి అనుయాయులు కాని ఒక్క ప్రాంతపు తిరుసభకు చెందినవాళ్లుకాదు. వాళ్ళ నిరంతరం పర్యటిస్తూ, ఆయా ప్రాంతాల్లోని క్రైస్తవ సమాజాలన్నిటినీ పర్యవేక్షిస్తుండేవాళ్ళు.
ఈ యపోస్తలులతోపాటు వారి కాలంలోనే క్రైస్తవ సమాజంలో ఇంకా మూడురకాల అధికారులుకూడ వుండేవాళ్లు. వీళ్లే పెద్దలు, పర్యవేక్షకులు, పరిచారకులు. ఇక్కడ ఈ మూడు తెగలవాళ్లను గూర్చి పరిశీలిద్దాం. 1) పెద్దలు. ఆ కాలపు లౌకిక సమాజంలో నగరాధ్యక్షులను "పెద్దలు" అనేవాళ్లు. ఈ పేరునే క్రైస్తవ సమాజంలోని పెద్దలకుగూడ పెట్టారు. (గ్రీకు, ప్రెస్బితెరోయి). పౌలు అతని స్నేహితుడు బర్నబా చాల సమాజాలకు పెద్దలను నియమించారు - అచ 14,23. ఈ పెద్దలు ధర్మంగా వచ్చిన డబ్బును ఆయా అవసరాలకు వినియోగించేవాళ్లు - అచ 11,30. ఇంకా, వేదబోధ చేస్తుండేవాళ్లు, ఆరాధనలో ప్రధానపాత్రను నిర్వహించేవాళ్లు-1తిమో 5.17. ఈ పెద్దలే రెండవ శతాబ్దంలో నేటి మన గురువులుగా మారారు. ఈ విషయం తర్వాత స్పష్టమౌతుంది.
2) పర్యవేక్షకులు లేక అధ్యక్షులు. అపోస్తలుల నాటి క్రైస్తవ సమాజంలో పెద్దలతోపాటు అధ్యక్షులు లేక పర్యవేక్షకులు అనే అధికారులుకూడ వుండేవాళ్లు (గ్రీకు, ఎపిస్కోపోయి). వీళ్లకు ఆనాటి క్రైస్తవ సమాజంలో మంచి గుర్తింపు వుండేది -1తిమో 3,2. ఆ కాలపు నగరాల్లో అత్యున్నతాధికారులను "పర్యవేక్షకులు" అని పిల్చేవాళ్ళ ఈ క్రైస్తవ సమాజాల్లో అధ్యక్షులకుగూడా పెట్టారు. అపోస్తలులు మొదలైన క్రైస్తవాధికారులు వీరిమీద చేతులు చాచగా వీళ్లు పర్యవేక్షకులు అయ్యేవాళ్ళ-2తి 1,6. వాళ్లు నాటి క్రైస్తవ సమాజాలకు ప్రధాన బాధ్యతను వహించేవాళు-అ,చ, 20,28.
తొలిరోజుల్లో కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తిని పెద్దఅనీ పర్యవేక్షకుడనీ గూడ పిల్చేవాళ్ళు. కనుక ఈ పేర్లు కొన్నిమార్లు తారుమారవుతుండేవి-అచ 20,17.28. ఈ పర్యవేక్షకులే రెండవ శతాబ్దంలో నేటి మన బిషప్పులుగా మారిపోయారు. ఈ యంశం మిూదట స్పష్టమౌతుంది.
3) పరిచారకులు. పై రెండు వర్గాల వారితోపాటు పరిచారకులు అనబడేవాళ్ళకూడ వుండేవాళ్ళు (గ్రీకు, దియాకొనోయి). అపోస్తలులు తమకు సాయం చేయడానికి ఈ డీకన్లను నియమించారు-అ,చ,6,1-6. వీళ్ళ అన్నం వడ్డించడం మొదలైన భౌతిక కార్యాల్లోను, సువిశేష బోధ మొదలైన ఆధ్యాత్మిక కార్యాల్లోను సాయం చేస్తుండేవాళ్ళు.
2. త్రిముఖమైన పవిత్రాధికారం
పైన మనం పేర్కొన్న పెద్దలు పర్యవేక్షకులు పరిచారకులు అనే వాళ్లకు అపోస్తలులతోపాటు త్రివిధాధికారాలు వుండేవి. అవి వేదబోధ చేయడం. ప్రజలను పరిపాలించడం, ప్రజలను పవిత్రపరచడం. ఫిలిప్పు అనే పరిచారకుడు ఇతియోపీయునికి వేదబోధ చేసాడు– అచ 8,35. తిమోతి ఇతరులమిద చేతులు చాచి వాళ్ళను పెద్దలను చేసాడు-1తిమోతి 5,22.
3. అపోస్తలులు వారి అనుయాయులు తమ పవిత్రాధికారాన్ని ఇతరులకు అందించారు.
అపోస్తలులను మొదట క్రీస్తే ఎన్నుకొన్నాడు. ఈ యపోస్తలులు తమ అనుయాయులను తామే ఎన్నుకొన్నారు. ఈ యనుయాయులు మళ్ళా తమ అనుయాయులను ఎన్నుకొన్నారు. ఈవిధంగా యాజకత్వం అపోస్తలుల నుండి శిష్యులకూ, ఆ శిష్యులనుండి వారి శిష్యులకూ సంక్రమిస్తూ వచ్చింది.
ఉదాహరణకు పౌలు తిమోతిమిద చేతులుచాచి ప్రార్థన చేయగా అతడు పర్యవేక్షకుడు (అధ్యక్షుడు) అయ్యాడు-1తిమో 4,14 ; 2తిమో 1,6. పూర్వం మోషే యోషువా విూద హస్తనిక్షేపణం చేయగా మోషే ఆత్మ యోషువా మిూదికి దిగివచ్చింది - సంఖ్యా 27, 18-23. అలాగే ఇక్కడ పౌలు మరియు ఇతర పెద్దలనుండి పవిత్రాత్మ వరప్రసాదం తిమోతిమిూదికి దిగివచ్చాయి అనుకోవాలి.
పర్యవేక్షకుడైన తిమోతి తాను మరల ఇతరులమిద హస్తనిక్షేపణంచేసి వాళ్ళను పెద్దలను చేసాడు -1తిమొు 5,22. ఈలా పవిత్రాధికారం అపోస్తలుల నుండి శిష్యులకూ, వారి నుండి వారి శిష్యులకూ సాగిపోయింది.
4. రెండవ శతాబ్దానికల్లా 현 పర్యవేక్షకులు నేటి బిషప్పలుగా మారిపోయారు.
మొదటి శతాబ్దంలో పెద్దలకూ పర్యవేక్షకులకూ వున్న వ్యత్యాసమేమిటో మనకు స్పష్టంగా తెలియదు. కాని రెండవ శతాబ్దంలో పెద్దమార్పు జరిగింది. పర్యవేక్షకులు పెద్దలకు పై యధికారులయ్యారు.
రెండవ శతాబ్దంలో జీవించిన రోమాపురి క్లెమెంటు, అంటియోకయ ఇన్యాశివారు, ఇరెనేయస్, పొలికార్పు, హిప్పొలీటస్ మొదలైన వారి రచనల వలన మనకు ఈ వివరం తెలుస్తూంది.
పైన మనం పేర్కొన్న పర్యవేక్షకులు రెండవ శతాబ్దంలో బిషప్పలుగా మారిపోయారన్నాం. ఈ బిషప్పలు పూర్వంవలె క్రైస్తవ సమాజాలన్నిటిలోను పర్యటించి పనిచేయడం మానుకొని, ఒక్క ప్రాంతానికి అధికారులయ్యారు. ఉదాహరణకు ఇగ్నేష్యస్ సిరియాకు, పోలికార్పు స్మిర్నాకు, ఇరెనేయుస్ లియోనుకు అధికారులయ్యారు. ఈ బిషప్పల క్రింద కొందరు పెద్దలు బిషప్పలతో కూడి పనిచేసేవాళ్ళు ఈ బిషప్పలు అపోస్తలులకు ప్రత్యక్షమైన అనుయాయులు. ఈ యనుయాయిత్వం చాల ముఖ్యమైంది. ఈ బిషప్పలు ఇతర బిషప్పలనూ పెద్దలనూ అభిషేకించారు. పెద్దల హోదా పెరగలేదు. వాళ్ళ ఒక బృందంగా కూడి ఒక్క బిషప్ప అధికారం (පීoඨ పనిచేసారు. సంయుక్త పూజలో బిషప్పే ప్రధాన గురువు. పెద్దలు అతనితో కలసి పూజచేసారు. కాని ఈ పెద్దలు, రెండవ శతాబ్దంలోనే, బిషప్ప అనుమతితో, విచారణలోని మారుమూల గ్రామాల్లో కూడ వ్యక్తిగతంగా పూజ చేసేవాళ్లు.
కనుక రెండవ శతాబ్దం నుండి క్రీస్తు యాజకత్వం రెండు ప్రధాన శాఖలుగా చీలింది. ఒకవైపు పర్యవేక్షకులు లేక బిషప్పల బృందం వుండేది. వీళ్ళు పేత్రు స్థానంలో వుండేవాళ్ళు. మరొకవైపు పెద్దల బృందం వుండేది. బిషప్పులూ పెద్దలూకూడ బృందాలుగానే వ్యవహరించేవాళ్ళ వీళ్ళందరినీ ఐక్యపరచేవాడు క్రీస్తే. అందరూ అతని యాజకత్వంలోనే పాలుపొందారు. రోము బిషప్పు అందరికీ పెద్ద అయ్యాడు. అతడు క్రీస్తూనీ, పేత్రునీ ప్రత్యేకంగా సూచిస్తుండేవాడు. ఈరీతిగా ఇప్పటి పోపుగారు, బిషప్పలు, గురువులు అనే విభజనం రెండవ శతాబ్దం నాటికే వుంది.
2.క్రీస్తే స్వయంగా యాజకత్వాన్ని స్థాపించాడు
ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.
1. క్రీస్తే యాజకత్వ సంస్కారాన్ని స్థాపించాడు.
కొందరు ప్రోటస్టెంటుల భావించినట్లుగా గురుపట్టాన్ని తిరుసభ స్థాపించలేదు. క్రీస్తే దాన్ని స్థాపించాడు. పూర్వ వేదకాలంలోనే మలాకీ ప్రవక్త "తూర్పునుండి పడమర వరకు ప్రపంచంలోని ప్రజలందరూ నన్ను గౌరవిస్తారు. వాళ్ళు నాకు సాంబ్రణిపొగవేసి పవిత్రమైన బలి నర్పిస్తారు" అని వాకొన్నాడు–1,11. ఈ ప్రవక్త సూచించింది నూత్నవేదప క్రీస్తుబలినీ, క్రైస్తవ యాజకులనీ. ఇక, నూత్నవేదంలో క్రీస్తు స్వయంగా యాజకుడై తన్ను తానే బలిగా అర్పించుకొన్నాడు. అతడు కడపటి విందులో రొట్టెరసాలను తన శరీరరక్తాలుగా అర్పించి, శిష్యులుగూడ ఆ కార్యాన్ని కొనసాగించాలని ఆదేశించాడు. “మీరు దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి" అన్నాడు -1కొ 11,23–26; లూకా 22,19. అనగా అతని కల్వరిబలిని కొనసాగించేవాళ్ళూ దాన్ని ప్రజలమధ్య ప్రత్యక్షం చేసేవాళ్ళూ శిష్యులూ వారి అనుయాయులూను. “మీరు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి" అనే వాక్యం ద్వారానే క్రీస్తు గురుపట్టాన్ని స్థాపించాడు. మళ్ళా అతడు ఉత్తానానంతరం శిష్యులకు జ్ఞానస్నానాది సంస్కారాలను దయచేసే హక్కు నిచ్చాడు - మత్త 28,19-20. వారికి పవిత్రాత్మను దయచేసి ప్రజల పాపాలను మన్నించే హక్కునిచ్చాడు - యోహా 20,22-23. క్రీస్తు గురుపట్టాన్ని ఎప్పడు స్థాపించాడు అనే ప్రశ్నకు, పై కడపటి భోజన వాక్యాలను ఉత్థానానంతర వాక్యాలనూ కలిపి తీసికోవాలి. క్రీస్తు శిష్యులకు తర్ఫీదునిచ్చి వాళ్ళను గురుత్వానికి సిద్ధం చేసాడు. వాళ్ళు తన యాజకత్వాన్ని కొనసాగించాలని కోరాడు. వాళ్ళకు తన ఆత్మను ప్రసాదించాడు. లోకాంతం వరకు నేను విూతో వుంటానని మాట యిచ్చాడు-మత్త 28,20. అనగా క్రీస్తు అపోస్తలులతోను వాళ్ళ అనుయాయులతోను వుంటాడు. తండ్రి తన్ను పంపినట్లే తానూ వాళ్ళను పంపాడు - యోహా 20,21. తన తర్వాత వచ్చే ఆత్మ వాళ్ళకు సమస్తవిషయాలు బోధిస్తుంది-14,26. ఈ వాక్యాలన్నిటినిబట్టి రెండు విషయాలు అర్థం చేసికోవాలి. మొదటిది, క్రీస్తు అపోస్తలులనూ వాళ్ళ అనుయాయులనూ గురువులనుగా నియమించాడు. రెండవది, గురుత్వపు బాధ్యతలను నిర్వహించే శక్తిని గూడ వాళ్ళకు దయచేసాడు. వాళ్ళు పవిత్రాత్మనూ ఉత్తాన క్రీస్తు సాన్నిధ్యాన్నీ వరప్రసాదాన్నీస్వీకరించండం ద్వారా ఈ శక్తిని పొందారనుకోవాలి.
క్రీస్తు గురుత్వమనే సంస్కారాన్ని స్థాపించాడేగాని, దాన్ని ఏలా నిర్వహించాలో చెప్పలేదు. కనుక ఈ సంస్కారాన్ని నిర్వహించే పద్ధతిని, యూదుల సంప్రదాయాన్ననుసరించి అపోస్తలులే నియమించి వుంటారు. అపోస్తలుల కాలంలో అభ్యర్థులకు గురుత్వాన్ని ఇచ్చేపుడు వాళ్ళమీద చేతులు చాచి ప్రార్ధన చేసేవాళ్ళు. ఈ రెండు సంజ్ఞలూ నూతవేదంలో స్పష్టంగా కన్పిస్తాయి. తిమోతి యాజకత్వాన్ని పొందినపుడు పౌలూ ఇతర పెద్దలూ అతనిమిూద చేతులు చాచారు-2తిమో 1,6. ఇంకా, ఆ సందర్భంలో ప్రవక్తలు ప్రవచనాలు కూడ పల్మారు-1తిమో 4,14. ఈ "ప్రవచనాలు" ప్రార్థనలైయుంటాయి. మరో తావులో, పౌలు బర్నబాలు ప్రతి సమాజంలోను పెద్దలను నియమించి వారిమిూద చేతులు చాచారనీ, ఉపవాసపూర్వకంగా ప్రార్థనలు చేసారనీ చెప్పబడింది-అ,చ.14,23. కనుక అభ్యర్థిమీద చేతులుచాచి ప్రార్ధనంచేయడం గురుపట్టాభిషేకంలో జరిగే మతకర్మలు. వీటిని అపోస్తలులే నియమించి వుంటారు.
2. ఈ యాజకత్వ సంస్కారంలో మూడు అంతస్తులున్నాయి.
గురుత్వం ఒకటే ఐనా దానిలో మూడు అంతస్తులున్నాయి. అవి బిషపు, గురువు, పరిచారకుడు అనే పదవులు. ఈ మూడు అంతస్తులను గూర్చి వివరంగా తెలిసికొందాం.
1) బిషప్పు, బిషప్పు గురుత్వం పరిపూర్ణమైంది. గురువు గురుత్వం బిషప్పు గురుత్వం కంటె తక్కువ స్థాయిలోనిది. పరిచారకుని గురుత్వం ఇంకా తక్కువ స్థాయిలోనిది.
బిషప్పుకి పరిపూర్ణమైన యాజకత్వం వుంటుందని చెప్పాం. మొదట "పర్యవేక్షకులు" అనబడేవాళ్ళే రెండవ శతాబ్దంలో బిషప్పలుగా మారిపోయారని పూర్వాధ్యాయంలో వివరించాం. పితృపాదులు బిషప్ప యాజకత్వంలో మొదటి అంతస్తును పొందుతాడని చెప్పారు. పీఠాధిపతి పదవి నిజమైన సంస్కారమని కూడ వాకొన్నారు. ట్రెంటు మహాసభ ఈలా బోధించింది. బిషప్పు అభిషేకం పొందినపుడు ఆత్మ అతని మీదికి దిగివస్తుంది. అతని హృదయం మీద చెరగని ముద్రపడుతుంది. పవిత్రాత్మే అతన్ని తిరుసభకు పాలకుణ్ణిగా నియమిస్తుంది. అతడు గురువు కంటె అధికుడు. భద్రమైన అభ్యంగమూ, గురుపట్టమూ, ఇచ్చేది అతడే. గురువునకు లేని కొన్ని ఇతరాధికారాలు కూడ అతనికుంటాయి.
రెండవ వాటికన్ సభ ఈలా బోధించింది. "బిషప్పు అభిషేకం ద్వారా పవిత్రాత్మనూ అక్షయమైన ముద్రనూ పొందుతాడు. అతడు ప్రముఖంగాను, కంటికి కన్పించేరీతిలోను క్రీస్తు స్థానాన్ని స్వీకరిస్తాడు. క్రీస్తులాగే తానూ బోధకుడూ, కాపరీ, యాజకుడూ ఔతాడు. క్రీస్తుస్థానంలో వుండే పనిచేస్తాడు. తోడి బిషప్పులను అభిషేకించేది అతడే. ఈ వాక్యాలనుబట్టి పీఠాధిపతి స్థానం ఎంత ఘనమైందో ఊహించుకోవచ్చు.
2) గురువు. తొలిరోజుల్లోని పెద్దలే రెండవ శతాబ్దంలో గురువులుగా గుర్తింపు పొందారని చెప్పాం. గురుత్వాన్ని మొదటినుండి దేవద్రవ్యానుమానంగా గుర్తిస్తూ వచ్చారు.
రెండవ వాటికన్ మహాసభ గురుత్వాన్ని గూర్చి ఈలా బోధించింది. గురువులు అభిషేకం ద్వారా ప్రధాన యాజకుడైన క్రీస్తుకి అనురూపంగా గురుపట్టం పొంది బోధకులూ, కాపరులూ, ఆరాధనను నిర్వహించేవాళ్ళూ ఔతారు. వాళ్ళ తమ బిషప్పుతో కలసి ఒకే యూజకత్వంలో పాలుపొందుతారు. ఈ యాజకత్వంలో మాత్రం వేరువేరు అంతస్తులుంటాయి. గురువులు తాము పనిచేసే తావులో తమ బిషప్పుని ప్రత్యక్షంచేసికొంటారు. అతని బాధ్యతలనూ పనులనూ తమవిగా చేసికొంటారు. ఒక బిషప్ప క్రింద పనిచేసే గురువులంతా ఒకే అభిషేకమూ, ఒకే పనీ కలిగి వుండడంవల్ల ఒక్క బృందంగా ఏర్పడతారు. వాళ్లు తమ బిషప్పుకి తోడిపనివాళ్ళు బిషప్పుతో పాటు తామూ క్రీస్తుచే పంపబడినవాళ్ళు.
3) పరిచారకుడు. తొలిరోజుల్లో పరిచారకులు అపోస్తలులకూ పర్యవేక్షకులకూ సహాయం చేస్తుండేవాళ్ళు. అపోస్తలులు వీళ్ళమీద చేతులు చాచి వీళ్ళకు పరిచారక పట్టాన్ని ఇచ్చారని చదువుతున్నాం. అచ. 6:1-6. పౌలు సమాజాల్లో స్త్రీపరిచారికలు గూడా వుండేవాళ్ళ - రోమా 16,1-2. ఈ పరిచారకులు తొలిరోజుల్లో చేసిన పనులు రెండు. వేదబోధ చేయడం, సేవాకార్యాలు నిర్వహించడం, అపోస్తలులనాడు క్రైస్తవులు యెరూషలేములో కొన్నాళ్ళపాటు ఉమ్మడిజీవితం జీవించారు. ఈ క్రైస్తవులకు పరిచారకలు అన్నమూ మొదలైన భౌతిక వస్తువులను అందజేసేవాళ్లు. పేదాబిక్కీని పరామర్శించేవాళ్లు. పేదలకు సేవచేయడం పరిచారకుల బాధ్యతల్లో ముఖ్యమైంది. ఈనాడు కూడ వాళ్లు తిరుసభ పేదవారి పట్ల చూపించే ఆదరణకు సాక్ష్యంగా వుంటున్నారు. తిరుసభ చరిత్రలో పరిచారకులు క్రమేణ ప్రాముఖ్యాన్ని కోల్పోయారు. నేడు ల్యాటిన్ అమెరికాలో మాత్రమే వీళ్ళ ఎక్కువగా పనిచేస్తున్నారు. మనదేశంలో డీకన్ల అసలులేరు. రెండవ వాటికన్ సభ ప్రపంచమంతటా డీకన్ల అంతస్తును మళ్ళా పునరుద్ధరించాలని కోరింది.
3. బిషప్ప యాజకత్వం, గురువు యాజకత్వం
పరిచారకుని అంతస్తు మనకంత ముఖ్యంకాదు. కనుక ఇక్కడ బిషప్ పు యాజకత్వానికి గురువు యాజకత్వానికీ గల వ్యత్యాసాన్ని విపులంగా పరిశీలిద్
1) యాజకత్వం ఒక్కటే. అది క్రీస్తు యాజకత్వం, నరమాత్రులంతా ఈ క్రీస్తు యాజకత్వంలో పాలుపొందే యాజకులౌతారు. కాని బిషప్పు ఈ యాజకత్వాన్ని పరిపూర్ణంగా పొందుతాడు. అతనిది మొదటి అంతస్తు, గురువు అపరిపూర్ణంగా పొందుతాడు. అతినిది రెండవ అంతస్తు.
అభిషేకం ద్వారా బిషప్ప, యాజకుడు ప్రవక్త కాపరి అనే మూడు లక్షణాలను సంపూర్ణంగా పొందుతాడు. ఈ అభిషేకం ద్వారా అతన్ని బిషప్పు బృందంలోనికి ప్రవేశపెడతారు. అలా ప్రవేశపెట్టడం వలన అతడు బిషప్పు ఔతాడు. కనుక అతని అధికారం బృందాధికారంగాని వ్యక్తిగతమైందికాదు. ఈ బృందభావాన్ని సూచించడానికే బిషప్పని అభిషేకించేపుడు ఒక్కరు కాక ముగ్గురు బిషప్పులు అభిషేకిస్తారు. పైగా తిరుసభ బోధనక్రియలో బిషప్పులంతా గలసి పొరపడనివరం పొందుతారు. ఐనా ఏ బిషప్పుకి గూడా వ్యక్తిగతంగా ఈ వరం వుండదు.
బిషప్ప ప్రముఖంగా క్రీస్తు యాజకత్వాన్ని ఈలోకంలో ప్రత్యక్షం చేసేవాడు అతడు గొప్ప ఆరాధన కార్యకర్త స్థానిక తిరుసభకు ప్రధానాధికారి. క్రీస్తు స్థానంలో వుండేవాడు. బిషప్పులంతా కలసి అపోస్తలుల బృందానికి వారసులు. కనుక స్థానిక తిరుసభలో బిషప్పు అపోస్తలులకు ప్రతినిధి. కావుననే సిప్రియన్ భక్తుడు చెప్పినట్లు, బిషప్పు తిరుసభలో నెలకొని వుంటాడు, తిరుసభ బిషప్పులో నెలకొని వుంటుంది. బిషప్పు స్థానిక తిరుసభకు అధిపతిగా వున్నా విశ్వతిరుసభకు ప్రతినిధిగా వుంటాడు. మేత్రాసనం స్థానిక తిరుసభే ఐనా విశ్వతిరుసభను సూచిస్తుంది.
అభిషేకంలో బిషప్పు ప్రముఖంగా ఆత్మను పొందుతాడు. అప్పటినుండి అతనికి బిషప్పు పదవికి తగిన వరప్రసాదం లభిస్తూంటుంది. ఈ యభిషేక వరప్రసాదంద్వారా అతడు శిరస్సు ఔతాడు. కాని ఈ యభిషేక వరప్రసాదం గురువుని బిషప్పుకి సహాయుద్దీగా మాత్రమే చేస్తుంది.
2) ఇక గురువు బిషప్పుల బృందం యాజకత్వంలో పాలుపొంది గురుమోతాడు. గురువు తన్నభిషేకించే ఒక్క బిషప్పు యాజకత్వంలో గాక బిషప్పుల బృందం అంతటి యాజకత్వంలోను పాలుపొందుతాడు. అతినిది రెండవ అంతస్తు మాత్రమే. అతడు ప్రధానంగా బిషప్పకి సహాయుడు. అతని అధికారంక్రింద పనిచేసేవాడు. అతన్ని తన విచారణలో ప్రత్యక్షం చేసేవాడు. క్రీస్తు మూడు లక్షణాలను బిషప్ప పొందితే మళ్లా బిషప్పనుండి ఈ మూడు లక్షణాలను పొందేవాడు గురువు.
పీఠాధిపతి చుటూ యాజకబృందం వుంటుంది. గురువు అభిషేకం ద్వారా ఈ యాజక బృందంలోనికి ప్రవేశిస్తాడు. ఆ విూదట అతనికి ఈ బృందంతో విడివడని సంబంధం వుంటుంది. అందుకే గురువు అభిషేకం పొందేప్పడు బిషప్పతో పాటు తోడి గురువులుకూడ అతనిపై చేతులు చాస్తారు. అనగా పీఠాధిపతితోపాటు వాళ్ళూ అతన్ని అభిషేకిస్తారు. కనుక గురువు ఎప్పడుకూడ యాజకబృందానికి చెందినవాడుగానే పనిచేస్తాడు కాని వ్యక్తిగతంగా పనిచేయడు.
గురువు ప్రధానంగా మేత్రాసనానికి చెందినవాడు. ఈ మేత్రాసనం విశ్వశ్రీసభలో ఒక జీవకణం. దీనికి అధిపతి పీఠాధిపతి. కనుక పీఠాధిపతి ప్రతినిధిగానే గురువు క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాడు. కావున బిషప్పకి విధేయుడై యుండడం గురువు ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానాంశం. రెండవ శతాబ్దానికి చెందిన అంటియోకయ ఇన్యాసివారు ఇలావ్రాసారు. "వీణతో తంత్రులు ఐక్యమైయున్నట్లేగురువులు తమ బిషప్పతో ఐక్యమై యుండాలి. క్రీస్తు శరీరం ఒక్కటే. మనం పానంచేసే అతని దివ్యరక్తం ఒక్కటే. బలిపీఠం ఒక్కటే. తన గురుబృందతో ఐక్యమైయుండే బిషప్పకూడ ఒక్కడే"
గురువు సేవలు ప్రధానంగా స్థానిక తిరుసభలోని విచారణకు చెందుతాయి. అతడు తన విచారణలోని ప్రజలకు మధ్యవర్తిగా వుంటాడు. వారి తరపున, వారితో కలసి పూజబలి నర్పిస్తాడు.
4. యాజకత్వాన్ని గూర్చిన ప్రోటస్టెంటు నాయకుల భావాలు
ప్రోటస్టెంటు నాయకులు నరుల యాజకత్వాన్ని అంగీకరించరు. క్రీస్తు యాజకత్వం ఒక్కటే చాలని వీళ్ళవాదం, వీళ్ళ భావాల ప్రకారం, మనలను రక్షించేది విశ్వాసం కాని గురువు అర్పించే పూజబలి కాదు. బోధకుడు బోధచేసినపుడు మనం దైవవాక్యాన్ని విశ్వసిస్తే చాలు, అదే మనకు రక్షణం ఇస్తుంది. ఇక నరుని యాజకత్వంతో అవసరంలేదు. తిరుసభలో అధికారులు వుండవచ్చు. కాని గురువుల అధికారం అక్కర్లేదు. క్రైస్తవ సమాజాల్లో ఎవరైనా గురువులుగా వ్యవహరిస్తున్నారంటే వాళ్లకా పదవినిచ్చింది క్రైస్తవ సమాజమే కాని క్రీస్తకాదు. కనుక ఇవ్వాళ్ళ గురువుగావున్న వ్యక్తి రేపు కేవలం గృహస్టుడు కావచ్చు లూతరు, కాల్విన్, మొదలైన ప్రోటస్టెంటు నాయకులు గురుపట్టం దేవద్రవ్యానుమానం కానేకాదన్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం క్రీస్తు గురుపట్టాన్ని స్థాపించలేదు. క్యాతలిక్ సమాజమే దాన్ని ప్రవేశపెట్టింది. కనుక దాన్ని నిరాకరించాలి.
ఈ ప్రోటస్టెంటు వాదాలను ఖండించి మన తిరుసభ ఈలా బోధించింది. క్రైస్తవులందరూ జ్ఞానస్నానం ద్వారానే క్రీస్తు యాజకత్వంలో పాలు పొందుతారు. కాని ఇదికాక క్రైస్తవుల్లో కొందరికి సేవాత్మకమైన యాజకత్వం గూడ వుంటుంది. దీన్నేగురుపట్టం అంటాం. దీన్ని క్రీస్తు ఏడు దేవ ద్రవ్యానుమానాల్లో ఒకటిగా స్థాపించాడు.
సేవాత్మకమైన యాజకత్వం ఈలోకంలో క్రీస్తు కల్వరిబలిని కొనసాగించుకొని పోవడానికి ఉద్దేశింపబడింది. ఈ యాజకత్వం విశ్వాసులకు సేవచేయడానికిగాని వారిపై పెత్తనం చలాయించడానికి గాదు. తిరుసభలో విశ్వాసులున్నారు కనుకనే క్రీస్తు వారి సేవార్థమై యాజకత్వాన్ని గూడ నెలకొల్పాడు.
గురువుల యాజకత్వం విశ్వాసులు జ్ఞానస్నానం ద్వారా పొందే యాజకత్వాన్ని భంగపరుపదు. పైగా అది విశ్వాసులకు సేవలు చేయడానికే ఉద్దేశింపబడింది. ఈ యాజకత్వం ఉత్తాన క్రీస్తు యాజకత్వంలో ఓ పాలే కాని స్వతంత్రమైంది కాదు. కనుక అది క్రీస్తు యాజకత్వాన్ని గూడ భంగపరుపదు.
{{center3. గురుపట్ట సంజ్ఞలు
}}ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.
గురుపట్ట సంజ్ఞలు రెండు. అవి బిషప్పగారి హస్తనిక్షేపణం, ప్రార్ధనం, గురుపట్టాన్నిచ్చేది బిషప్పగారే.
1. బిషప్పగారి హస్తనిక్షేపణం
బిషప్పగారు గురుపట్టాన్ని పొందేవ్యక్తిపై చేతులు చాస్తారు. ఈ హస్తనిక్షేపణం భావం ఏమిటి?
తిమోతి పౌలునుండి యాజకత్వాన్ని పొందినపుడు పౌలు ఇతర పెద్దలు అతని విూద చేతులు చాచారు - 2 తిమో 1,6-7; 1తిమో 4,14. ఈ సంజ్ఞద్వారా తిమోతి పవిత్రాత్మను స్వీకరించాడు. అతడు దేవుని వరాన్ని ఆధ్యాత్మిక వరాన్ని పొందాడు. ఈవరం పవిత్రాత్మే తిమోతి కూడ తానెన్నుకొనిన అభ్యర్థులపై చేతులుచాచి వారిని యాజకులను చేసాడు -1తిమో 5,22 ఈలాగే అపోస్తలులు సైఫను మొదలైన వారిపై చేతులు చాచి వారిని డీకన్లను చేసారు - అ,చ. 6,6. పూర్వం మోషే యోషువామిూద చేతులు చాచి తన అధికారాన్నీ జ్ఞానాన్నీ యోషువాకు అందించాడు. దీనివల్ల యోషువా అతనికి ఉత్తరాధికారి యయ్యాడు - సంఖ్యా 27, 18–20, ద్వితీ 349.
ఈలాగే మోషే డెబ్బదిమంది పెద్దలను నియమించినపుడు వాళ్లమిద చేతులు చాచాడు. అప్పడు ప్రభువు తాను పూర్వం మోషేకిచ్చిన ఆత్మలో కొంత తీసికొని ఆ డెబ్బదిమంది పెద్దలకు ఇచ్చాడు-సంఖ్యా 11,25,
ఈ యాలోకనాలన్నిటినిబట్టి హస్తనిక్షేపణం ఆత్మను పొందడానికి గుర్తు అనుకోవాలి. కనుక బిషప్ప గురువు కాబోయే అభ్యర్థిపై చేతులు చాచినపుడు అతడు ఆత్మను పొందుతాడు.
బిషప్పతోపాటు ఇతర గురువులు కూడ అభ్యర్థిపై చేతులు చాస్తారు. కాని అభ్యర్థి ఈ గురువులనుండి ఆత్మను పొందడు. ఈ క్రియ గురువులంతా కలసి ఓ బృందంగా కూడి పనిచేస్తారనడానికి సూచనం.
2. బిషప్ప ప్రార్ధనం
బిషప్పగారు గురుపట్టం పొందే అభ్యర్థిపై కుడిచేయి చాచివుంచి ఈలా అర్ధిస్తారు. "సర్వశక్తిగల పితా! ఈ మిూ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదించండి. ఇతని హృదయంలో పవిత్రాత్మ శక్తిని నూతీకరించండి. దీనివలన ఇతడు విూనుండి ఆచార్యత్వంలో రెండవ అంతస్తును పొందునుగాక. నిగ్రహజీవితమును అలవర్చుకొని తన సత్ర్పవర్తనము వలన అందరికి ఆదర్శముగా నుండునుగాక" పై హస్తనిక్షేపణం ద్వారాను ఈ ప్రార్ధనంద్వారాను అభ్యర్థి గురువుగా మారిపోతాడు. ఈ రెండు సంజ్ఞల్లోను ఆత్మను పొందడమే ముఖ్యాంశం. ఈ యాత్మశక్తి వల్లనే గురుత్వం లభించేది.
3. గురుపట్ట సంస్కారాన్నిచ్చేది బిషప్పే
మామూలుగా గురుపట్టాన్నిచ్చేది బిషప్పగారే. కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు పాపగార్లు బిషప్పలు కాని మఠశ్రేషులకు కూడ గురుపట్టాన్నిచ్చే అధికారాన్ని ఒసగారు. కనుక అరుదుగా, ప్రత్యేకానుమతితో గురువులుకూడ గురుపట్టాన్నీయవచ్చు.
గురువును అభిషేకించడానికి ఒక్క బిషప్ప చాలు కాని బిషప్పని అభిషేకించడానికి మాత్రం ముగ్గురు బిషప్పలు కావాలి. వారిలో వొకరు ప్రధానాభిషేకకుడుగావున్నా ఆ ముగ్గురు కలసే నూత్న బిషప్పను అభిషేకిస్తారు. నాల్గవ శతాబ్దంనుండి ఈ నియమం అమలులో వుంది.
{{center4. గురుపట్ట ఫలితాలు
}}ఈ యధ్యాయంలో నాల్గంశాలను పరిశీలిద్దాం. గురుపట్ట ఫలితాలు మూడు. అవి అక్షయమైన ముద్ర, త్రివిధాధికారం, వరప్రసాదం. ఈ మూడంశాలను క్రమంగా విలోకిద్దాం.
1. అక్షయమైన ముద్ర
గురుపట్టంద్వారా గురువు అక్షయమైన ముద్రను పొందుతాడు. ఈ ముద్ర ఏనాటికి చెరగిపోదు. కనుకనే ఒకసారి గురుపట్టాన్ని పొందినవాళ్ళు ఆ దేవద్రవ్యానుమానాన్ని మళ్లా పొందడానికి వీల్లేదు. ఎందుకంటే అది శాశ్వతంగా వుండిపోతుంది.
ఈ ముద్రద్వారా గురువు క్రీస్తుని పోలినవాడవుతాడు. క్రీస్తురూపం అతనిలో నెలకొంటుంది. క్రీస్తు యాజకుడు, బోధకుడు, కాపరి. అనగా ప్రజలను పవిత్రపరచేవాడు, వారికి బోధ చేసేవాడు, వారిని పాలించేవాడు. ఈ త్రివిధ క్రీస్తు లక్షణాలు పై ముద్రద్వారా గురువుకికూడ సంక్రమిస్తాయి.
అసలు గురువులో మూడు ముద్రలుంటాయి. మొదట జ్ఞానస్నానంద్వారా అతనికి ఓ ముద్ర వస్తుంది. దీనిద్వారా అతడు ఇతర క్రైస్తవుల్లాగే తానూ క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు బలిని అర్పించడానికి యోగ్యుడౌతాడు. ఇతర దేవద్రవ్యానుమానాలను పొందడానికిగూడ అర్హుడౌతాడు.
తర్వాత అతనికి భద్రమైన అభ్యంగనంద్వారా రెండవ ముద్రవస్తుంది. దీనిద్వారా అతడు ఇతర క్రైస్తవుల్లాగే తానూ క్రీస్తుకి సాక్ష్యం పలికేవాడవుతాడు. క్రీస్తుకోసం వేదసాక్షిగా మరణించేవాడుకూడ అవుతాడు.
కడన అతనికి గురుపట్టపుముద్ర వస్తుంది. దీనిద్వారా అతడు క్రీస్తు మధ్యవర్తిత్వంలో పాలు పొందుతాడు. ఆ క్రీస్తులాగే యాజకుడు, ప్రవక్త, కాపరి అనే త్రివిధాధికారాలను పొందుతాడు. క్రీస్తు గురుత్వంలో పాలుపొంది తానూ "అపరక్రిస్తు” గా మారిపోతాడు.
క్రీస్తు నిరంతరం తన్నుతాను తండ్రికి అర్పించుకొంటాడు. తనతోపాటు నరజాతి నంతటినీ తండ్రికి అర్పిస్తుంటాడు. ఇక గురువు, భూమిమిూద ఈ క్రీస్తు అర్పణాన్ని కొనసాగిస్తుంటాడు. తాను క్రీస్తు చేతిలో సాధనమాత్రుడుగా వుండి ప్రజలను క్రీస్తు పాస్క పరమ రహస్యంలోనికి ప్రవేశపెడుతుంటాడు. దివ్యసత్ర్పసాదబలి నర్పించడం ద్వారా అతడీకార్యాన్ని ప్రముఖంగా సాధిస్తాడు. 2. త్రివిధాధికారాలు
ఇక గురువు మూడధికారాలను పరిశీలిద్దా.
1) ప్రజలను పవిత్రపరచే అధికారం.
క్రీస్తు యాజకుడు. గురువు క్రీస్తు యాజకత్వంలో పాలుపొంది అతనితో ఐక్యమై దివ్యసత్రసాదబలి నర్పిస్తాడు. ఈ బలిద్వారా అతడు ప్రజలను పవిత్రపరుస్తాడు. ఇంకా జ్ఞానస్నానం పాపోచ్చారణం భద్రమైన అభ్యంగనం మొదలైన సంస్కారాలద్వారాగూడ వాళ్ళను పవిత్రపరుస్తాడు. కాని క్రైస్తవ ప్రజలు గురువుతోపాటు సత్రసాదబలి నర్పించడం ద్వారా ప్రేమలో ఎక్కువగా పెంపజెందుతారు.
గురువు భగవంతునికీ నరునికీ మధ్య నిలచి దేవుణ్ణి నరుని చెంతకు తీసికొనివస్తాడు. నరుజ్జీ, ఈ లోకాన్నంతటిని దేవుని చెంతకు తీసికొనిపోతాడు. ఈలా అతడు తన మధ్యవర్తిత్వంద్వారా మానవులను పునీతులను చేస్తాడు.
ఇంకా గురువు రోజూ ఓ 45 నిమిషాలపాటు డివైన్ ఆఫిస్ అనే ప్రార్ధనం జపిస్తాడు. ఈ ప్రార్థన స్తుతిబలి. అది అతడర్పించే దివ్యసత్రసాద బలితో కలసిపోతుంది. ఈ ప్రార్థనను అతడు తిరుసభ పేరుమ్మిదిగాను, ప్రపంచంలోని ప్రజలందరి పేరుమిదిగాను జపిస్తాడు. ఈ స్తుతిబలి క్రీస్తు మోక్షప్రార్ధనంతో ఐక్యమై (హెబ్రే 7,25) ప్రజలను పవిత్రపరుస్తుంది. ఈ విధంగా అతని ఆరాధనజీవితం, విశేషంగా పూజర్పణం క్రైస్తవులను పునీతం చేస్తుంది.
2) ప్రజలకు బోధచేసే అధికారం.
క్రీస్తు మహాప్రవక్త గురువు అతని ప్రవక్తృత్వంలో పాలుపొంది బోధకుడౌతాడు. క్రీస్తు పాస్క పరమరహస్యమైన దివ్యసత్రసాదబలినిగాని, ఇతర దేవద్రవ్యానుమానాలను కాని, అసలు దైవసంబంధమైన విషయాలు వేటినైనగాని అర్థంచేసికోవాలంటే వాక్యబోధ, జ్ఞానోపదేశం అనవసరం. వాక్యబోధ మలనకాని తిరుసభను నిర్మించలేం. కనుక గురువులు విూరు ప్రపంచమంతట తిరిగి సువార్తను బోధించండి అన్న ప్రభువు పలుకుల ప్రకారం నిరంతరం వాక్యబోధ చేస్తూండాలి. నరులు క్రీస్తు బోధనువినివిశ్వసించందే వారికి రక్షణంలేదు-మార్కు 16,15-16. వాక్యబోధ వలనగాని క్రైస్తవ సమాజాలు ఏర్పడవు. వినడం వలనకాని విశ్వాసం కలుగదు. బోధకులు క్రీస్తునిగూర్చి బోధిస్తేనేగాని ప్రజలు వినడమనేది జరగదు - రోమా 10,17. అందుచేత వాక్యబోధచేయడం గురువు ప్రధాన బాధ్యతల్లో వొకటి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని బోధించడం యాజకుని బాధ్యత - మలాకీ 2,7. దివ్యసత్ర్పసాదమేగాదు వాక్యంగూడ క్రైస్తవులకు భోజనమే. కనుక మొదట వాక్యాన్ని భుజించి తర్వాత దివ్య సత్రసాదాన్ని భుజించడం యుక్తం. అందుకే పూజలో ప్రసంగానికి ప్రముఖమైన స్థానముంది.
బోధకులు ప్రధానంగా బిషప్పలు. పాపుగారును బిషప్పలును కలసి బోధక తిరుసభ ఔతారు. గురువులు దానిలో భాగంగాదు. ఐనా బిషప్ప గురువుని అభిషేకించినపడే తన బోధనాధికారంలో అతనికి పాలు ఇస్తాడు. కనుక గురువకూడ ప్రముఖంగా బోధకుడే.
గురువు క్రైస్తవులకూ క్రైస్తవేతరులకూ గూడ బోధించవచ్చు. అతడు అందరినీ పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి రమ్మని ఆహ్వానించాలి.
అతడు దైవవాక్యాన్ని సమకాలిక సమస్యలకు అన్వయించి చూపిస్తూండాలి. కేవలం లౌకికాంశాల్లాగ కన్పించే విషయాలకుకూడ భగవంతునితో సంబంధం వుంటుంది. గురువు తనబోధలో ఈ సంబంధాన్ని స్పష్టంగా చూపించగలిగి వుండాలి. అప్పుడేగాని అతడు ఈ భౌతిక ప్రపంచాన్ని దేవుని కర్పించడు. ఇక, ఇతరులకు బోధించకముందు గురువు వేదవాక్కునూ క్రైస్తవ సత్యాలనూ గంటల తరబడి మననం చేసికొనివుండాలి.
3) ప్రజలను పరిపాలించే అధికారం
క్రీస్తు పాలకుడు, కాపరి. అతని పాలనాధికారంలో పాలు పొంది గురువు కూడ మందను నడిపించేవాడవుతాడు. ఈ యధికారాన్ని అతడు క్రీస్తు నుండి బిషప్పుద్వారా పొందుతాడు.
క్రైస్తవ సమాజాలను నిర్మించడం గురువుపని. అతడు తిమోతిలాగే “సహనంతో కూడిన బోధతో ప్రజలను ఒప్పిస్తూ, ఖండిసూ, ప్రోత్సహిస్తుండాలి" - 2తిమో 4,2. పేత్రు చెప్పినట్లుగా "గురువు అనిష్టంతోగాక దేవుని చిత్తం అనుకొని ఇష్టపూర్తిగా మందను మేపాలి. దుర్గాభఆపేక్షతో గాక మనఃపూర్వకంగా దానిని కాయాలి. తన ఆధీనమందున్న వారిపై అధికారం చలాయించక మందకు మాదిరిగా వుండాలి." అలా చేస్తే ప్రధానకాపరి ప్రత్యక్షమైనపుడు గురువు మహిమాన్వితమైన కిరీటాన్ని పొందుతాడు - 1పేత్రు 5,2-4.
గురువులు ప్రతివానిని దేవుడు వానికి నిర్ణయించిన మార్గంలో నడిపింప గలిగివుండాలి. ప్రజలకు సోదరప్రేమ, సువిశేష బోధల ప్రకారం జీవించడం, ఇతరులకు సేవచేయడం మొదలైన క్రైస్తవ విలువలను నేర్చాలి. గురువు విశేషంగా పేదలనూ రోగులనూ చనిపోయేవాళ్ళనూ యువజనులనూ మఠవాసులనూ పరామర్శిస్తుండాలి. ప్రాత క్రైస్తవులను అశ్రద్ధ చేయకుండా నూత్న క్రైస్తవులను ఎక్కువ శ్రద్ధతో పట్టించుకోవాలి.
సమాజాన్ని నిర్మించే ప్రధాన సాధనం దివ్య సత్రసాదబలి. కనుక అతడు ఈ బలినియోగ్యంగా అర్పించి తన ఆధీనంలో వున్న స్థానిక క్రైస్తవ సమాజాన్ని పెంపులోనికి తీసికొని వస్తుండాలి.
3. వరప్రసాద ప్రాప్తి
గురుపట్టం ద్వారా గురువు పవిత్రాత్మను పొందుతాడు. ఈ యాత్మ సకల వరాలకీ సర్వపాబ్రిత్యానికీ మూలం. కనుక ఈ యాత్మద్వారా గురువుకి అపారమైన పావిత్ర్యం లభిస్తుంది, ప్రతి అభిషేకంలోను నరుడు ఆత్మను పొందుతాడు. కనుక యాజకత్వంలోని మూడంతస్తులకూ, అనగా బిషప్పకీ గురువుకీ డీకనుకీ, ఆత్మ సమృద్ధిగా లభిస్తుంది.
1) గురుపట్టంద్వారా గురువుకి ప్రత్యేకమైన వరప్రసాదం లభిస్తుంది. దీని వలన అతడు క్రీస్తుని పోలినవాడవుతాడు. అపర క్రీస్తుగా మారతాడు. క్రీస్తు నిరంతరం ప్రేమతో తన్ను తాను తండ్రికి అర్పించుకొంటూంటాడు. అతడు పూర్వవేదయాజకుల్లాగ ఏదో బలిపశువునర్పింపడు, తన్ను తానే తండ్రికి అర్పించుకొంటాడు. గురుపట్టం ద్వారా క్రీస్తుకి పోలికగా వుండే గురువులో కూడ ఈ ప్రేమా సమర్పణమూ కన్పించాలి. అతనిలో నిస్వార్ధమూ వినయవిధేయతలూ చూపట్టాలి. తన లాభం తాను చూచుకోక దేవునికీ ప్రజలకూ సేవలు చేయాలి. ఈ శక్తి అతని ప్రభువునుండే లభిస్తుంది.
పూజబలిలో అతనికి తన్ను తానర్పించుకొనే శక్తి దేవుణ్ణి ఆరాధించే శక్తి వస్తుంది. పాపోచ్చారణంలో పాపులపట్ల దయజూపే శక్తి వస్తుంది. అలాగే ఇతర దేవద్రవ్యానుమానాల్లో కూడ.
బోధచేసినపుడు క్రీస్తు ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది. అతనిచే ప్రజలకు ఉపయోగపడే అంశాలు చెప్పిస్తుంది. అతడు మొదట తాను వాక్యాన్ని ధ్యానం చేసికొని అటుపిమ్మట తాను మననం చేసికొన్న వాక్యాన్ని ఇతరులకు వివరించేలా చేస్తుంది.
తాను మందను నడిపించేపుడు క్రీస్తు ప్రేమా వినయమూ అతనికి ఆదర్శంగా వుంటాయి. కావున అతడు మందపై అధికారం చెలాయింపక దానికి మాదిరిగా వుండగల్లుతాడు -1పేత్రు 5:3. దానికి సేవలు చేయగల్లుతాడు - లూకా 22,26, విశేషంగా, ఇతరులకు బోధించిన పిదప తాను భ్రష్టుడు కాకుండావుండేలా జాగ్రత్తపడ గల్లుతాడు - 1కొ 9:27. ప్రధానయాజకుని అనుంగుతల్లియైన మరియమాత తన కుమారుని సేవకులైన గురువులను విశేషాదరంతో కాపాడుతుంది.
2) కాని వరప్రసాదాలన్నీ గురువుమీూద యాంత్రికంగా పనిచేయవు. అతడు వాటితో సహకరించాలి. వాటిని జాగ్రత్తగా వినీయోగించుకోవాలి. గురువులు ప్రధానంగా తమ సేవద్వారానే పవిత్రులు కావాలి. అనగా ప్రజలను పవిత్రపరచడం, వారికి బోధచేయడం, వారిని నడిపించడం అనే త్రివిధ సేవద్వారా వాళ్లు పుణ్యాత్ములు కావాలి. కాని వాళ్లు రేయింబవళ్లు ఏవేవో సేవాకార్యాల్లో మునిగిపోయి వ్యక్తిగతమైన ప్రార్ధనం ఆత్మనిగ్రహం మొదలైన వాటిని అశ్రద్ధ చేయకూడదు.
రెండవ వాటికన్ సభ ప్రకారం, గురువులు విశేషంగా వినయవిధేయతలు, బ్రహ్మచర్యం, నిస్సంగత్వం, ఈ లోకపు విలువలపట్ల వివేకం, ఈ ప్రపంచంపట్ల మమకారం లేకుండా వుండడం, దారిద్ర్యం మొదలైన సదుణాలు కలిగివుండాలి.
3) గురువు ఆధ్యాత్మిక జీవితం ఏలా వుండాలి? అతడు తన్ను తాను దానం చేసికొనేవాడై యుండాలి. నిరంతరం ఒకవైపు దేవునికీ ఒకవైపు ప్రజలకూ తన్నుతాను అర్పించుకొంటూండాలి.
ఆరాధనపరుడై యుండాలి. క్రీస్తుతో ఐక్యమై పూజబలిని అర్పిస్తుండాలి. ప్రార్ధనద్వారా రోజురోజుకి తనలోని స్వార్ణాన్ని తొలగించుకొంటూండాలి. తాను නි”ඝරයී దైవవాక్కుని తాను ముందుగా మననం చేసికొంటూండాలి.
నిరంతరం ప్రజలదగ్గరికి పంపబడినవాడై యుండాలి. తండ్రినన్ను పంపినట్లే నేను మిమ్మ పంపుతున్నాను అన్న క్రీస్తవాక్యం అతనికి అక్షరాల వర్తిస్తుంది.
తోడి గురువులపట్ల సోదరభావమూ బిషప్పపట్ల పితృభావమూ కలిగి వుండాలి. అతని మనుగడ తిరుసభతో ముడిపడివుండాలి.
సంగ్రహంగా చెప్పాలంటే, అతని ఆధ్యాత్మిక జీవితం మధ్యవర్తికి చెందిందై వండాలి. అతడుఎల్లపుడు దేవునికీ నరునికీమధ్య మధ్యవర్తిగా మెలిగేవాడు. కనుక అతనికి గాఢమైన దైవానుభూతి వుండాలి. తన సోదరులైన తోడి ప్రజల కష్టసుఖాల్లో సులువుగా పాలుపంచుకొనే గుణం వుండాలి.
కల్వరిబలియైన పూజబలి నర్పించడం ద్వారా అతడు ప్రధానంగా మధ్యవర్తి ఔతాడు. కనుక ఏ గురువు విలువైన సరే అతడర్పించే పూజబలినిబట్టే కొలవాలి.
4. గురువు బాధ్యతలు
"నేను ప్రవితుజ్జయిన దేవుణ్ణి, నాలాగే విూరూ పవిత్రులుగా వుండండి" అన్నప్రభువు ఆజ్ఞ ప్రధానంగా గురువుకి వర్తిస్తుంది. అతడు దేవునికి సన్నిహితుడుగా జీవిస్తూపవిత్రంగా మెలగాలి. ఈ పవిత్రతను సాధించందే గురువు రాజు, ప్రవక్త కాపరి అనే తన మూడు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేడు. గురువు గురుపట్టం పొందేపుడు బిషప్పగారు అతని హస్తాలకు క్రిస్మాతైలంతో అభిషేకంచేస్తారు. అప్పటినుండి అతడు ప్రభువు అభిషిక్తుడుగా చలామణి ఔతాడు. కనుక అతని జీవితంగూడ ఈ యభిషేకానికి తగినట్లుగానే వుండాలి.
గురువు తన స్వార్థం కొరకు తాను జీవించగూడదు. ఇతరుల కొరకు జీవించాలి. అతడు క్ర్హిస్తావ సమాజం కొరకు ఉన్నవాడు. కనుక అతని క్రియలు వ్యక్తిగత లాభానికిగాక క్రైస్తవ సమాజ శ్రేయస్సుకు తోడ్పడేవిగా వుండాలి. ఈ ధ్యేయాన్ని విస్మరించిన గురువు తన ఉన్నత స్థానం నుండి పడిపోయాడనుకోవాలి. లాటిన్ శ్రీసభ గురువు వివాహాన్ని నిషేదిస్తుంది ఎందుకు? వివాహం చెడ్డదనిగాదు. అతడు అవివివాహితుడై వుంటే ఒక్క కుటుంబానికి బదులుగ అనేక కుటుంబాలను పరామర్శిస్తాడు అనే తలంపుతో, అతడు వందలకొలది, వేలకొలది దేవుని బిడ్డలను సాకాలన్న ఉద్దేశంతో కనుక గురువు ఇతరులకు నేనేపాటి సేవచేస్తున్నానా అని నిరంతరం తన్నుతాను ప్రశ్నించుకొంటూండాలి.
మనదేశంలో అన్ని మతాలవాళ్ళూ క్యాతలిక్ గురువుని గౌరవంతో చూస్తారు. ప్రజలు అతన్ని దేవునికీ నరునికీ మధ్య నిలిచే మధ్యవర్తినిగా గుర్తిస్తారు. అతడు తన ప్రార్థనాబలంతో దేవుని వరాలు తీసికొని రాగలడనీ, అతడు దీవించే దీవెన ఫలించి తీరుతుందనీ నమ్ముతారు. అతడు దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకొన్న భక్తుడనీ, దేవుని గ్రంథమైన బైబులును పఠించి దాని భావాన్ని వివరింపగలడనీ ఎంచుతారు. ప్రపంచ వ్యామోహాలను విసర్జించి పరమపవిత్రంగా జీవించే ఋషి అని భావిస్తారు. కోపతాపాలను రాగద్వేషాలను విడనాడి సేవ, దయ, సానుభూతి మొదలైన మార్ణవ గుణాలతో లోకకళ్యాణం కొరకు జీవించే పుణ్యపురుషుడని ఎంచుతారు. గురువు ఈ వన్నతాశయాలకు అనుగుణంగా జీవించాలి. అంతేగాని వెర్రిమొర్రిపనులకు పాల్పడి ప్రజలకు తనమిూదవున్న సదభిప్రాయం వమ్మయిపోయేలా చేసికోగూడదు. ఐనా నేడు కొందరు గురువులు తమ అంతస్తుకు తగినట్లుగా జీవించలేక తలవంపులు తెచ్చుకొంటున్నారు. ఇది సజ్జనులందరికీ మనస్తాపం కలిగిస్తుంది.